ఓం నమః శివాయ:
*శ్రీ మహాలక్ష్మిదేవి అష్టోత్తర శతనామావళిః / శ్రీమహాలక్ష్మి దేవి సహస్రనామం*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
ఋగ్వేదంలో అక్కడక్కడ లక్ష్మి, శ్రీ అనే పదాలు కనిపిస్తాయి.కాని ఋగ్వేదంలో ఎక్కడా సంపదకు సంబందించిన విశేషమైన దేవతగాని, దేవికాని కనిపించదు.సంపదలకు ఇంద్రుడు, అశ్వినీ కుమారులు, మొదలగు దేవతలను యాచించేవారు.ఋగ్వేదంలో అక్కడక్కడా స్తీ దేవతలు కనిపిస్తారు.
యజుర్వేదకాలం నాటికి శ్రీ మరియు లక్ష్మి పరమ పురుషుని పత్నులుగా వెలుగులోకి వచ్చారు.అధర్వణవేదం కాలం మొదట్లో శ్రీ పదాన్ని సంపతి, ఐశ్వర్యం అనే అర్ధాన్ని స్ఫురిస్తాయి.ఈ కాలంలో శ్రీ కి లక్షికి అంతగా బేధం ఉన్నట్లు కనిపించదు.కాని లక్ష్మిని పొందడానికి బలి ఇవ్వడం అన్నది ఈకాలంలోనే మొదలైంది.మొహంజెదారోలో లభించిన ఒక నాణెంపై దేవి సమక్షంలో ఒక మేకపోతు ఉన్నట్లు కనిపిస్తుంది. అధర్వణ వేదకాలానికి యిద్దరు లక్ష్ములు వెలిసారు.ఒక లక్ష్మి మంచిది.మరొకటి పాపి. ఒకటి ఆర్యుల శ్రీదేవి.పాపిలక్ష్మి అనార్యుల దేవి.అవే లక్ష్మి, అలక్ష్మి.
పురాణకాలం నాటికి లక్ష్మి, విగ్రహారాధన పూర్తిగా ప్రచారం లోనికి వచ్చింది కాని, యజ్ఞయాగాదుల పట్లప్రజల విశ్వాసం తగ్గుతూ వచ్చింది.పురాణకాలం నాటికి లక్ష్మికి చక్కటి రూపకల్పన జరిగి పోయింది.పూజా విధానం కూడా వెలుగులోకి వచ్చింది.బ్రహ్మ పురాణంలో వర్ణించబడిన లక్ష్మి మరియు దరిద్ర దేవతల మధ్య జరిగిన కధనం చాల చక్కగా ఉంటుంది.దాని సంగ్రహమే లక్ష్మీ దేవే రుక్మిణి, సీతగా వివిధ కాలాలలో అవతరించిందిగా వర్ణించబడినది.
లింగ పురాణంలో కూడా లక్ష్మీ దేవి సముద్రం నుంచే ఉద్భవిస్తుంది.
పురణకాలం నాటికి లక్ష్మికి, యక్షిణిలతో సంబంధం పూర్తిగా విడిపోయింది.గుడ్లగూబ లక్ష్మీవాహనంగా గుర్తించబడింది.విష్ణుపత్ని
అయిన కారణంగా గరుడపక్షి కూడా లక్ష్మికి వాహనమే.
గుడ్లగూబ లక్ష్మికి వాహనంగా ఎలా మారిందో ఒక కధ వర్ణించబడినది.పూర్వకాలంలో ఒక వృద్ధదంపతులు ఉండేవారు.వారికి కటికదరిద్రులు.ఉన్నది ఒక్కటే గుడ్డ.ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు ఆగుడ్డతో బయటకు వెళ్ళాలి.ఒకనాడు అలా యాచనకు వెళ్ళిన ఆబ్రాహ్మణుడు ఏమీ దొరకని కారణంతో చావాలని అనుకుంటాడు.అలా తన బాధలను తలచుకొని ఒక చెట్టు క్రింద కూర్చొని విలపిస్తాడు. అదంతా ఆచెట్టుపైనున్న గుడ్లగూబ వింటుంది.ఆవేద బ్రాహ్మణుడి ఓదార్చి తన కష్టాలను తీరుస్తానని చెప్పి ఇంటికి వెళ్ళమంటుంది.
దీపావళి రోజున, ప్రతియేడు లాగానే లక్ష్మి నగరంలో ప్రవేశిస్తుంది.ఏ గడపలో కాలు పెట్టిన గుడ్లగూబ కూతవిని అపశకునంగా వెనక్కు వెళ్తుంది.చివరకు ఈ బ్రాహ్మణుడి ఇంట్లో కాలు మొపబోతుంది.గుడ్లగూబ కూయదు.దాంతో లక్ష్మీ దేవి ఆబ్రాహ్మణుడి ఇంట్లో ప్రవేశిస్తుంది. తాను వెళ్ళదలచుకొన్న ఇంట్లోకి వెళ్ళనీయకుండా అవరోధం కలిగించిన గుడ్లగూబను తన వాహనంగా చేసుకుంటుంది.
భారతీయ నాగరికత విదేశాలలో ప్రవేశించాక విదేశాలలో కూడా ఏదో ఒక రూపంలో లక్ష్మి కొలవబడుతుంది.
బాలి ద్వీపంలో హిండోనేషియా రాజులు లక్ష్మి రాణిరూపంలో ఉండేటట్లు భావించేవారు.జావాలో పురాతనమైన బంగారు ఆభరణాలపై శ్రీ అని వారిభాషలో వ్రాయబడినది.కాంబోడియాలో విష్ణువుతో పాటు పలు లక్ష్మీ దేవి విగ్రహాలు చెక్కబడ్డాయి.
మనకు ద్రవ్యానికి లక్ష్మి దేవత అయినట్లు, జూనో-మోనెటా స్త్రీ దేవత, రోమన్ లకు ద్రవ్యదేవత.అందుకు సాక్ష్యం అక్కడ దొరికిన నాణాలపై ఒక వైపు ద్రవ్యదేవత రెండవవైపు ద్రవ్యవిలువ ముద్రించేవారు.ఈనాడు మనం ఆగ్లపదంగా ఉచ్చరించే మనీ మోనెటా నుండే వచ్చింది.
లక్ష్మీ దేవి గురించి వివిధ గాథలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె 'నిత్యానపాయిని'
(ఎన్నడూ విడివడనిది), లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.
సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువునుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్ళి చేశాడు. కనుక లక్ష్మిని 'భార్గవి' అని కూడా అంటారు.
తరువాత ఒకమారు దూర్వాసుని శాపకారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగాచేసె చిలకడం ప్రారంభించారు.
ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మిదేవి అవతరించింది. పాలసముద్రలో నుండి జనించింది కనుక ఆమె 'సముద్రరాజ తనయ' అయ్యింది. ఆమెతో బాటే జన్మించిన
చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాధి దేవత ఐయిన ఈ దేవిని
శ్రీమహావిష్ణువు పత్నిగా స్వీకరిచాడు.
విష్ణువు శక్తికి, మాయకు కారణం ఆయనకు లక్ష్మి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష
్మిగా చెప్పబడింది.
ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు.
విష్ణువు అవతారాలతోబాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది. రామావతారంలో సీత గా, కృష్ణావతారంలో రుక్మిణి గా, కలియుగంలో
వెంకటేశ్వర స్వామికి తోడు అలమేలు మంగగా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది.
చాలా మంది దేవతలకు వలెనే లక్ష్మికి ఎన్నో పేర్లు, అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. అధికంగా లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని - లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి (అన్నమయ్య సంబోధన), నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.
అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది.
లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.
వాఙ్మయాధారాలలో ఋగ్వేదం పదవ మండలంలోని శ్రీసూక్తం సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన మాత (ప్రజానాం భవసి మాత.)
యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మీ అనే ఇరువురు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహిత లలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది.
లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించే విధానాన్ని మత్స్య పురాణంలో ఇలా చెప్పారు - "దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమలు కలిగి సర్వాభరణములు ధరించి ఉండవలెను. ముఖం గుండ్రంగా ఉండాలి. దివ్యాంబరమాలా కంకణధారియై యండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలు ఉంచాలి. పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగాడుచున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి.
అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ-చక్ర-గదా-పద్మ-ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై యుండును. స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృత పాత్ర, బిల్వ ఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను సూచించును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. వరాహమిహిరుని బృహత్సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి కాని లక్ష్మీదేవి ఆకృతిగురించి చెప్పలేదు. కారణం తెలియడంలేదు.
లక్ష్మీ దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
🕉🌞🌏🌙🌟🚩
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*శ్రీ మహాలక్ష్మీకవచం*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*అస్య శ్రీమహాలక్ష్మీ కవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ చందః మహాలక్ష్మీ దేవతా మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః |*
*ఇంద్ర ఉవాచ ।*
*సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమం |*
*ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే || 1 ||*
*మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసతః |*
*చతుర్దశసు లోకేషు రహస్యం బ్రహ్మణోదితం || 2 ||*
*శిరో మే విష్ణుపత్నీ చ లలాటమమృతోద్భవా |*
*చక్షుషీ సువిశాలాక్షీ శ్రవణే సాగరామ్బుజా || 3 ||*
*ఘ్రాణం పాతు వరారోహా జిహ్వామామ్నాయరూపిణీ |*
*ముఖం పాతు మహాలక్ష్మీః కణ్ఠం వైకుంఠ వాసినీ || 4 ||*
*స్కందౌ మే జానకీ పాతు భుజౌ భార్గవనందినీ |*
*బాహూ ద్వౌ ద్రవిణీ పాతు కరౌ హరివరాఙ్గనా || 5 ||*
*వక్షః పాతు చ శ్రీదేవీ హృదయం హరిసున్దరీ |*
*కుక్షిం చ వైష్ణవీ పాతు నాభిం భువనమాతృకా || 6 ||*
*కటిం చ పాతు వారాహీ సక్థినీ దేవదేవతా |*
*ఊరూ నారాయణీ పాతు జానునీ చంద్రసోదరీ || 7 ||*
*ఇన్దిరా పాతు జంఘే మే పాదౌ భక్తనమస్కృతా |*
*నఖాన్ తేజస్వినీ పాతు సర్వాఙ్గం కరూణామయీ || 8 ||*
*బ్రహ్మణా లోకరక్షార్థం నిర్మితం కవచం శ్రియః |*
*యే పఠన్తి మహాత్మానస్తే చ ధన్యా జగత్త్రయే || 9 ||*
*కవచేనావృతాఙ్గనాం జనానాం జయదా సదా |*
*మాతేవ సర్వసుఖదా భవ త్వమమరేశ్వరీ || 10 ||*
*భూయః సిద్
ధిమవాప్నోతి పూర్వోక్తం బ్రహ్మణా స్వయం |*
*లక్ష్మీర్హరిప్రియా పద్మా ఏతన్నామత్రయం స్మరన్ || 11 ||*
*నామత్రయమిదం జప్త్వా స యాతి పరమాం శ్రియం |*
*యః పఠేత్స చ ధర్మాత్మా సర్వాన్కామానవాప్నుయాత్ || 12 ||*
*ఇతి శ్రీ మహాలక్ష్మీ కవచం సంపూర్ణం.*
🕉🌞🌎🌙🌟🚩
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)
🕉🌞🌏🌙🌟🚩
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
నామ్నాం సాష్టసహస్రంచ బ్రూహి గార్గ్య మహామతే |
మహాలక్ష్మ్యా మహాదేవ్యా భుక్తిముక్త్యర్థసిద్ధయే ‖ 1 ‖
గార్గ్య ఉవాచ
సనత్కుమారమాసీనం ద్వాదశాదిత్యసన్నిభమ్ |
అపృచ్ఛన్యోగినో భక్త్యా యోగినామర్థసిద్ధయే ‖ 2 ‖
సర్వలౌకికకర్మభ్యో విముక్తానాం హితాయ వై |
భుక్తిముక్తిప్రదం జప్యమనుబ్రూహి దయానిధే ‖ 3 ‖
సనత్కుమార భగవన్సర్వజ్ఞోఽసి విశేషతః |
ఆస్తిక్యసిద్ధయే నౄణాం క్షిప్రధర్మార్థసాధనమ్ ‖ 4 ‖
ఖిద్యంతి మానవాస్సర్వే ధనాభావేన కేవలమ్ |
సిద్ధ్యంతి ధనినోఽన్యస్య నైవ ధర్మార్థకామనాః ‖ 5 ‖
దారిద్ర్యధ్వంసినీ నామ కేన విద్యా ప్రకీర్తితా |
కేన వా బ్రహ్మవిద్యాఽపి కేన మృత్యువినాశినీ ‖ 6 ‖
సర్వాసాం సారభూతైకా విద్యానాం కేన కీర్తితా |
ప్రత్యక్షసిద్ధిదా బ్రహ్మన్ తామాచక్ష్వ దయానిధే ‖ 7 ‖
సనత్కుమార ఉవాచ
సాధు పృష్టం మహాభాగాస్సర్వలోకహితైషిణః |
మహతామేష ధర్మశ్చ నాన్యేషామితి మే మతిః ‖ 8 ‖
బ్రహ్మవిష్ణుమహాదేవమహేంద్రాదిమహాత్మభిః |
సంప్రోక్తం కథయామ్యద్య లక్ష్మీనామసహస్రకమ్ ‖ 9 ‖
యస్యోచ్చారణమాత్రేణ దారిద్ర్యాన్ముచ్యతే నరః |
కిం పునస్తజ్జపాజ్జాపీ సర్వేష్టార్థానవాప్నుయాత్ ‖ 10 ‖
అస్య శ్రీలక్ష్మీదివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య ఆనందకర్దమచిక్లీతేందిరాసుతాదయో మహాత్మానో మహర్షయః అనుష్టుప్ఛందః విష్ణుమాయా శక్తిః మహాలక్ష్మీః పరాదేవతా శ్రీమహాలక్ష్మీప్రసాదద్వారా సర్వేష్టార్థసిద్ధ్యర్థే జపే వినియోగః |
ధ్యానమ్
పద్మనాభప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీమ్ |
పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మామహర్నిశమ్ ‖ 1 ‖
పూర్ణేందువదనాం దివ్యరత్నాభరణభూషితామ్ |
వరదాభయహస్తాఢ్యాం ధ్యాయేచ్చంద్రసహోదరీమ్ ‖ 2 ‖
ఇచ్ఛారూపాం భగవతస్సచ్చిదానందరూపిణీమ్ |
సర్వజ్ఞాం సర్వజననీం విష్ణువక్షస్స్థలాలయామ్ |
దయాలుమనిశం ధ్యాయేత్సుఖసిద్ధిస్వరూపిణీమ్ ‖ 3 ‖
స్తోత్రమ్
నిత్యాగతానంతనిత్యా నందినీ జనరంజనీ |
నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశస్వరూపిణీ ‖ 1 ‖
మహాలక్ష్మీర్మహాకాలీ మహాకన్యా సరస్వతీ |
భోగవైభవసంధాత
్రీ భక్తానుగ్రహకారిణీ ‖ 2 ‖
ఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ |
హృల్లేఖా పరమా శక్తిర్మాతృకాబీజరూపిణీ ‖ 3 ‖
నిత్యానందా నిత్యబోధా నాదినీ జనమోదినీ |
సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణీ ‖ 4 ‖
త్రిపురా భైరవీ విద్యా హంసా వాగీశ్వరీ శివా |
వాగ్దేవీ చ మహారాత్రిః కాలరాత్రిస్త్రిలోచనా ‖ 5 ‖
భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమా |
కాళీ కరాళవక్త్రాంతా కామాక్షీ కామదా శుభా ‖ 6 ‖
చండికా చండరూపేశా చాముండా చక్రధారిణీ |
త్రైలోక్యజయినీ దేవీ త్రైలోక్యవిజయోత్తమా ‖ 7 ‖
సిద్ధలక్ష్మీః క్రియాలక్ష్మీర్మోక్షలక్ష్మీః ప్రసాదినీ |
ఉమా భగవతీ దుర్గా చాంద్రీ దాక్షాయణీ శివా ‖ 8 ‖
ప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా |
పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యాప్రదాయినీ ‖ 9 ‖
అరూపా బహురూపా చ విరూపా విశ్వరూపిణీ |
పంచభూతాత్మికా వాణీ పంచభూతాత్మికా పరా ‖ 10 ‖
కాళీ మా పంచికా వాగ్మీ హవిఃప్రత్యధిదేవతా |
దేవమాతా సురేశానా దేవగర్భాఽంబికా ధృతిః ‖ 11 ‖
సంఖ్యా జాతిః క్రియాశక్తిః ప్రకృతిర్మోహినీ మహీ |
యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా విభావరీ ‖ 12 ‖
జ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్రఫలప్రదా |
దారిద్ర్యధ్వంసినీ దేవీ హృదయగ్రంథిభేదినీ ‖ 13 ‖
సహస్రాదిత్యసంకాశా చంద్రికా చంద్రరూపిణీ |
గాయత్రీ సోమసంభూతిస్సావిత్రీ ప్రణవాత్మికా ‖ 14 ‖
శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవనమస్కృతా |
సేవ్యదుర్గా కుబేరాక్షీ కరవీరనివాసినీ ‖ 15 ‖
జయా చ విజయా చైవ జయంతీ చాఽపరాజితా |
కుబ్జికా కాలికా శాస్త్రీ వీణాపుస్తకధారిణీ ‖ 16 ‖
సర్వజ్ఞశక్తిశ్శ్రీశక్తిర్బ్రహ్మవిష్ణుశివాత్మికా |
ఇడాపింగలికామధ్యమృణాలీతంతురూపిణీ ‖ 17 ‖
యజ్ఞేశానీ ప్రథా దీక్షా దక్షిణా సర్వమోహినీ |
అష్టాంగయోగినీ దేవీ నిర్బీజధ్యానగోచరా ‖ 18 ‖
సర్వతీర్థస్థితా శుద్ధా సర్వపర్వతవాసినీ |
వేదశాస్త్రప్రభా దేవీ షడంగాదిపదక్రమా ‖ 19 ‖
శివా ధాత్రీ శుభానందా యజ్ఞకర్మస్వరూపిణీ |
వ్రతినీ మేనకా దేవీ బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ ‖ 20 ‖
ఏకాక్షరపరా తారా భవబంధవినాశినీ |
విశ్వంభరా ధరాధారా నిరాధారాఽధికస్వరా ‖ 21 ‖
రాకా కుహూరమావాస్యా పూర్ణిమాఽనుమతిర్ద్యుతిః |
సినీవాలీ శివాఽవశ్యా వైశ్వదేవీ పిశంగిలా ‖ 22 ‖
పిప్పలా చ విశాలాక్షీ రక్షోఘ్నీ వృష్టికారిణీ |
దుష్టవిద్రావిణీ దేవీ సర్వోపద్రవనాశినీ ‖ 23 ‖
శారదా శరసంధానా సర్వశస్త్రస్వరూపిణీ |
యుద్ధమధ్యస్థితా దేవీ సర్వభూతప్రభంజనీ ‖ 24 ‖
అయుద్ధా యుద్ధరూపా చ శాంతా శాంతిస్వరూపిణీ |
గంగా సరస్వతీవేణీయమునానర్మదాపగా ‖ 25 ‖
సముద్రవసనావాసా బ్రహ్మాండశ్రోణిమేఖలా |
పంచవక్త్రా దశభుజా శుద్ధస్ఫటికసన్నిభా ‖ 26 ‖
రక్తా కృష్ణా సితా పీతా సర్వవర్ణా నిరీశ్వరీ |
కాళికా చక్రికా దేవీ సత్యా తు వటుకాస్థితా ‖ 27 ‖
తరుణీ వారుణీ నారీ జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ |
విశ్వంభరాధరా కర్త్రీ గళార్గళవిభంజనీ ‖ 28 ‖
సంధ్యారాత్రిర్దివాజ్యోత్స్నా కలాకాష్ఠా నిమేషికా |
ఉర్వీ కాత్యాయనీ శుభ్రా సంసారార్ణవతారిణీ ‖ 29 ‖
కపిలా కీలికాఽశోకా మల్లికానవమల్లికా | [ మల్లికానవమాలికా ]
దేవికా నందికా శాంతా భంజికా భయభంజికా ‖ 30 ‖
కౌశికీ వైదికీ దేవీ సౌరీ రూపాధికాఽతిభా |
దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవా ‖ 31 ‖
శ్రీస్సౌమ్యలక్షణాఽతీతదుర్గా సూత్రప్రబోధికా |
శ్రద్ధా మేధా కృతిః ప్రజ్ఞా ధారణా కాంతిరేవ చ ‖ 32 ‖
శ్రుతిః స్మృతిర్ధృతిర్ధన్యా భూతిరిష్టిర్మనీషిణీ |
విరక్తిర్వ్యాపినీ మాయా సర్వమాయాప్రభంజనీ ‖ 33 ‖
మాహేంద్రీ మంత్రిణీ సింహీ చేంద్రజాలస్వరూపిణీ |
అవస్థాత్రయనిర్ముక్తా గుణత్రయవివర్జితా ‖ 34 ‖
ఈషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా |
యోగిధ్యానాంతగమ్యా చ యోగధ్యానపరాయణా ‖ 35 ‖
త్రయీశిఖా విశేషజ్ఞా వేదాంతజ్ఞానరూపిణీ |
భారతీ కమలా భాషా పద్మా పద్మవతీ కృతిః ‖ 36 ‖
గౌతమీ గోమతీ గౌరీ ఈశానా హంసవాహినీ |
నారాయణీ ప్రభాధారా జాహ్నవీ శంకరాత్మజా ‖ 37 ‖
చిత్రఘంటా సునందా శ్రీర్మానవీ మనుసంభవా |
స్తంభినీ క్షోభిణీ మారీ భ్రామిణీ శత్రుమారిణీ ‖ 38 ‖
మోహినీ ద్వేషిణీ వీరా అఘోరా రుద్రరూపిణీ |
రుద్రైకాదశినీ పుణ్యా కల్యాణీ లాభకారిణీ ‖ 39 ‖
దేవదుర్గా మహాదుర్గా స్వప్నదుర్గాఽష్టభైరవీ |
సూర్యచంద్రాగ్నిరూపా చ గ్రహనక్షత్రరూపిణీ ‖ 40 ‖
బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా |
దశవాయుజయాకారా కళాషోడశసంయుతా ‖ 41 ‖
కాశ్యపీ కమలాదేవీ నాదచక్రనివాసినీ |
మృడాధారా స్థిరా గుహ్యా దేవికా చక్రరూపిణీ ‖ 42 ‖
అవిద్యా శార్వరీ భుంజా జంభాసురనిబర్హిణీ |
శ్రీకాయా శ్రీకలా శుభ్రా కర్మనిర్మూలకారిణీ ‖ 43 ‖
ఆదిలక్ష్మీర్గుణాధారా పంచబ్రహ్మాత్మికా పరా |
శ్రుతిర్బ్రహ్మముఖావాసా సర్వసంపత్తిరూపిణీ ‖ 44 ‖
మృతసంజీవనీ మైత్రీ కామినీ కామవర్జితా |
నిర్వాణమార్గదా దేవీ హంసినీ కాశికా క్షమా ‖ 45 ‖
సపర్యా గుణినీ భిన్నా నిర్గుణా ఖండితాశుభా |
స్వామినీ వేదినీ శక్యా శాంబరీ చక్రధారిణీ ‖ 46 ‖
దండినీ ముండినీ వ్యాఘ్రీ శిఖినీ సోమసంహతిః |
చింతామణిశ్చిదానందా పంచబాణప్రబోధినీ ‖ 47 ‖
బాణశ్రేణిస్సహస్రాక్షీ సహస్రభుజపాదుకా |
సంధ్యావలిస్త్రిసంధ్యాఖ్యా బ్రహ్మాండమణిభూషణా ‖ 48 ‖
వాసవీ
వారుణీసేనా కుళికా మంత్రరంజనీ |
జితప్రాణస్వరూపా చ కాంతా కామ్యవరప్రదా ‖ 49 ‖
మంత్రబ్రాహ్మణవిద్యార్థా నాదరూపా హవిష్మతీ |
ఆథర్వణిః శ్రుతిః శూన్యా కల్పనావర్జితా సతీ ‖ 50 ‖
సత్తాజాతిః ప్రమాఽమేయాఽప్రమితిః ప్రాణదా గతిః |
అవర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరీ ‖ 51 ‖
త్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాఽక్షరా |
హిరణ్యవర్ణా హరిణీ సర్వోపద్రవనాశినీ ‖ 52 ‖
కైవల్యపదవీరేఖా సూర్యమండలసంస్థితా |
సోమమండలమధ్యస్థా వహ్నిమండలసంస్థితా ‖ 53 ‖
వాయుమండలమధ్యస్థా వ్యోమమండలసంస్థితా |
చక్రికా చక్రమధ్యస్థా చక్రమార్గప్రవర్తినీ ‖ 54 ‖
కోకిలాకులచక్రేశా పక్షతిః పంక్తిపావనీ |
సర్వసిద్ధాంతమార్గస్థా షడ్వర్ణావరవర్జితా ‖ 55 ‖
శరరుద్రహరా హంత్రీ సర్వసంహారకారిణీ |
పురుషా పౌరుషీ తుష్టిస్సర్వతంత్రప్రసూతికా ‖ 56 ‖
అర్ధనారీశ్వరీ దేవీ సర్వవిద్యాప్రదాయినీ |
భార్గవీ యాజుషీవిద్యా సర్వోపనిషదాస్థితా ‖ 57 ‖ [ భుజుషీవిద్యా ]
వ్యోమకేశాఖిలప్రాణా పంచకోశవిలక్షణా |
పంచకోశాత్మికా ప్రత్యక్పంచబ్రహ్మాత్మికా శివా ‖ 58 ‖
జగజ్జరాజనిత్రీ చ పంచకర్మప్రసూతికా |
వాగ్దేవ్యాభరణాకారా సర్వకామ్యస్థితాస్థితిః ‖ 59 ‖
అష్టాదశచతుష్షష్ఠిపీఠికా విద్యయా యుతా |
కాళికాకర్షణశ్యామా యక్షిణీ కిన్నరేశ్వరీ ‖ 60 ‖
కేతకీ మల్లికాఽశోకా వారాహీ ధరణీ ధ్రువా |
నారసింహీ మహోగ్రాస్యా భక్తానామార్తినాశినీ ‖ 61 ‖
అంతర్బలా స్థిరా లక్ష్మీర్జరామరణనాశినీ |
శ్రీరంజితా మహాకాయా సోమసూర్యాగ్నిలోచనా ‖ 62 ‖
అదితిర్దేవమాతా చ అష్టపుత్రాఽష్టయోగినీ |
అష్టప్రకృతిరష్టాష్టవిభ్రాజద్వికృతాకృతిః ‖ 63 ‖
దుర్భిక్షధ్వంసినీ దేవీ సీతా సత్యా చ రుక్మిణీ |
ఖ్యాతిజా భార్గవీ దేవీ దేవయోనిస్తపస్వినీ ‖ 64 ‖
శాకంభరీ మహాశోణా గరుడోపరిసంస్థితా |
సింహగా వ్యాఘ్రగా దేవీ వాయుగా చ మహాద్రిగా ‖ 65 ‖
అకారాదిక్షకారాంతా సర్వవిద్యాధిదేవతా |
మంత్రవ్యాఖ్యాననిపుణా జ్యోతిశ్శాస్త్రైకలోచనా ‖ 66 ‖
ఇడాపింగళికామధ్యాసుషుమ్నా గ్రంథిభేదినీ |
కాలచక్రాశ్రయోపేతా కాలచక్రస్వరూపిణీ ‖ 67 ‖
వైశారదీ మతిశ్శ్రేష్ఠా వరిష్ఠా సర్వదీపికా |
వైనాయకీ వరారోహా శ్రోణివేలా బహిర్వలిః ‖ 68 ‖
జంభినీ జృంభిణీ జంభకారిణీ గణకారికా |
శరణీ చక్రికాఽనంతా సర్వవ్యాధిచికిత్సకీ ‖ 69 ‖
దేవకీ దేవసంకాశా వారిధిః కరుణాకరా |
శర్వరీ సర్వసంపన్నా సర్వపాపప్రభంజనీ ‖ 70 ‖
ఏకమాత్రా ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథాఽపరా |
అర్ధమాత్రా పరా సూక్ష్మా సూక్ష్మార్థాఽర్థపరాఽపరా ‖ 71 ‖
ఏకవీరా విశేషాఖ్యా షష్ఠీదేవీ మనస్వినీ |
నైష్కర్మ్యా నిష్కలాలోకా జ్ఞానకర్మాధికా గుణా ‖ 72 ‖
సబంధ్వానందసందోహా వ్యోమాకారాఽనిరూపితా |
గద్యపద్యాత్మికా వాణీ సర్వాలంకారసంయుతా ‖ 73 ‖
సాధుబంధపదన్యాసా సర్వౌకో ఘటికావలిః |
షట్కర్మా కర్కశాకారా సర్వకర్మవివర్జితా ‖ 74 ‖
ఆదిత్యవర్ణా చాపర్ణా కామినీ వరరూపిణీ |
బ్రహ్మాణీ బ్రహ్మసంతానా వేదవాగీశ్వరీ శివా ‖ 75 ‖
పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతా |
సద్యోవేదవతీ సర్వా హంసీ విద్యాధిదేవతా ‖ 76 ‖
విశ్వేశ్వరీ జగద్ధాత్రీ విశ్వనిర్మాణకారిణీ |
వైదికీ వేదరూపా చ కాలికా కాలరూపిణీ ‖ 77 ‖
నారాయణీ మహాదేవీ సర్వతత్త్వప్రవర్తినీ |
హిరణ్యవర్ణరూపా చ హిరణ్యపదసంభవా ‖ 78 ‖
కైవల్యపదవీ పుణ్యా కైవల్యజ్ఞానలక్షితా |
బ్రహ్మసంపత్తిరూపా చ బ్రహ్మసంపత్తికారిణీ ‖ 79 ‖
వారుణీ వారుణారాధ్యా సర్వకర్మప్రవర్తినీ |
ఏకాక్షరపరాఽఽయుక్తా సర్వదారిద్ర్యభంజినీ ‖ 80 ‖
పాశాంకుశాన్వితా దివ్యా వీణావ్యాఖ్యాక్షసూత్రభృత్ |
ఏకమూర్తిస్త్రయీమూర్తిర్మధుకైటభభంజినీ ‖ 81 ‖
సాంఖ్యా సాంఖ్యవతీ జ్వాలా జ్వలంతీ కామరూపిణీ |
జాగ్రతీ సర్వసంపత్తిస్సుషుప్తా స్వేష్టదాయినీ ‖ 82 ‖
కపాలినీ మహాదంష్ట్రా భ్రుకుటీ కుటిలాననా |
సర్వావాసా సువాసా చ బృహత్యష్టిశ్చ శక్వరీ ‖ 83 ‖
ఛందోగణప్రతిష్ఠా చ కల్మాషీ కరుణాత్మికా |
చక్షుష్మతీ మహాఘోషా ఖడ్గచర్మధరాఽశనిః ‖ 84 ‖
శిల్పవైచిత్ర్యవిద్యోతా సర్వతోభద్రవాసినీ |
అచింత్యలక్షణాకారా సూత్రభాష్యనిబంధనా ‖ 85 ‖
సర్వవేదార్థసంపత్తిస్సర్వశాస్త్రార్థమాతృకా |
అకారాదిక్షకారాంతసర్వవర్ణకృతస్థలా ‖ 86 ‖
సర్వలక్ష్మీస్సదానందా సారవిద్యా సదాశివా |
సర్వజ్ఞా సర్వశక్తిశ్చ ఖేచరీరూపగోచ్ఛ్రితా ‖ 87 ‖
అణిమాదిగుణోపేతా పరా కాష్ఠా పరా గతిః |
హంసయుక్తవిమానస్థా హంసారూఢా శశిప్రభా ‖ 88 ‖
భవానీ వాసనాశక్తిరాకృతిస్థాఖిలాఽఖిలా |
తంత్రహేతుర్విచిత్రాంగీ వ్యోమగంగావినోదినీ ‖ 89 ‖
వర్షా చ వార్షికా చైవ ఋగ్యజుస్సామరూపిణీ |
మహానదీనదీపుణ్యాఽగణ్యపుణ్యగుణక్రియా ‖ 90 ‖
సమాధిగతలభ్యార్థా శ్రోతవ్యా స్వప్రియా ఘృణా |
నామాక్షరపరా దేవీ ఉపసర్గనఖాంచితా ‖ 91 ‖
నిపాతోరుద్వయీజంఘా మాతృకా మంత్రరూపిణీ |
ఆసీనా చ శయానా చ తిష్ఠంతీ ధావనాధికా ‖ 92 ‖
లక్ష్యలక్షణయోగాఢ్యా తాద్రూప్యగణనాకృతిః |
సైకరూపా నైకరూపా సేందురూపా తదాకృతిః ‖ 93 ‖
సమాసతద్ధితాకారా విభక్తివచనాత్మికా |
స్వాహాకారా స్వధాకారా శ్రీపత్యర్ధాంగనందినీ ‖ 94 ‖
గంభీరా గహనా గుహ్యా యోనిలింగార్ధధారిణీ |
శేషవాసుకిసంసేవ్యా చపలా వరవర్ణినీ ‖ 95 ‖
కారుణ్యాకారసంపత్
తిః కీలకృన్మంత్రకీలికా |
శక్తిబీజాత్మికా సర్వమంత్రేష్టాక్షయకామనా ‖ 96 ‖
ఆగ్నేయీ పార్థివా ఆప్యా వాయవ్యా వ్యోమకేతనా |
సత్యజ్ఞానాత్మికాఽఽనందా బ్రాహ్మీ బ్రహ్మ సనాతనీ ‖ 97 ‖
అవిద్యావాసనా మాయాప్రకృతిస్సర్వమోహినీ |
శక్తిర్ధారణశక్తిశ్చ చిదచిచ్ఛక్తియోగినీ ‖ 98 ‖
వక్త్రారుణా మహామాయా మరీచిర్మదమర్దినీ |
విరాట్ స్వాహా స్వధా శుద్ధా నీరూపాస్తిస్సుభక్తిగా ‖ 99 ‖
నిరూపితాద్వయీవిద్యా నిత్యానిత్యస్వరూపిణీ |
వైరాజమార్గసంచారా సర్వసత్పథదర్శినీ ‖ 100 ‖
జాలంధరీ మృడానీ చ భవానీ భవభంజనీ |
త్రైకాలికజ్ఞానతంతుస్త్రికాలజ్ఞానదాయినీ ‖ 101 ‖
నాదాతీతా స్మృతిః ప్రజ్ఞా ధాత్రీరూపా త్రిపుష్కరా |
పరాజితావిధానజ్ఞా విశేషితగుణాత్మికా ‖ 102 ‖
హిరణ్యకేశినీ హేమబ్రహ్మసూత్రవిచక్షణా |
అసంఖ్యేయపరార్ధాంతస్వరవ్యంజనవైఖరీ ‖ 103 ‖
మధుజిహ్వా మధుమతీ మధుమాసోదయా మధుః |
మాధవీ చ మహాభాగా మేఘగంభీరనిస్వనా ‖ 104 ‖
బ్రహ్మవిష్ణుమహేశాదిజ్ఞాతవ్యార్థవిశేషగా |
నాభౌ వహ్నిశిఖాకారా లలాటే చంద్రసన్నిభా ‖ 105 ‖
భ్రూమధ్యే భాస్కరాకారా సర్వతారాకృతిర్హృది |
కృత్తికాదిభరణ్యంతనక్షత్రేష్ట్యార్చితోదయా ‖ 106 ‖
గ్రహవిద్యాత్మికా జ్యోతిర్జ్యోతిర్విన్మతిజీవికా |
బ్రహ్మాండగర్భిణీ బాలా సప్తావరణదేవతా ‖ 107 ‖
🕉🌞🌏🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి