సృష్టి ధర్మం- అధర్మం
నీవు చూసే ఈ జగత్తు మొత్తం ప్రతి దానికి దానికి సంబందించిన ధర్మం కలిగి ఉంటుంది. అలానే మానవులకు కూడా మానవ ధర్మం ఉంటుంది. ప్రపంచం మొత్తం వాటి వాటి ధర్మాలకు లోబడి ఉంటేనే ఈ సృష్టి సమంజసంగా జరుగుతుంది. ఈ విషయాన్నీ సోదాహరణంగా చూద్దాం.పంచభూతాల గూర్చి మనకు తెలుసు. అగ్ని ఒక భూతము. అగ్నికి కొన్ని ధర్మాలు వున్నాయి అవి 1) వేడిని కలిగించటం. 2) ఊర్ధ్వ దిశగా వెళ్ళటం 3) నీరు తగిలినప్పుడు చల్లారటం. ఈ ధర్మాలు (లక్షణాలు) అగ్నికి కలిగి వున్నాయి కాబట్టి మనం అగ్నివిషయం గూర్చిన జ్ఞానాన్ని పొంద గలుగుతున్నాము. అదే నిన్న ఈ ధర్మాలు ఉండి రేపు ఇంకొక ధర్మాన్ని చూపెడితే మనం అగ్నికి గూర్చిన జ్ణానాన్ని పొందలేము. కాబట్టి ఈ జగత్తులో ప్రతిదీ దానికి సంబందించిన ధర్మాన్ని కలిగి ఆ ధర్మానికి లోబడి మాత్రమే ఉంటుంది. అదే ప్రక్రుతి ధర్మం. అగ్నికి వున్నా ఈ ధర్మాలను తెలుసుకున్న మానవుడు పొయ్యి తయారు చేసే రప్పుడు అగ్నిని ఉత్పత్తి చేసే కట్టెలను పొయ్యిలో పెట్టి పొయ్యి మీద వంట పాత్రను ఉంచి అగ్ని వేడిని తీసుకొని వంట చేయగలిగాడు. ఇప్పుడు స్టావ్వు కూడా బర్నర్ క్రింద ఉంటే పైన వంట పాత్ర పెట్టి వంట చేస్తున్నాము.
అగ్నికి వ్యతిరేకం చల్లదనం. అంటే చల్లదనం క్రిందికి వ్యాపిస్తుంది, వెచ్చదనం క్రిందినుంచి పైకి వ్యాపిస్తుంది. ఈ ధర్మాన్ని అనుసరించి మన ఫ్రెడ్జిలో డీప్ ఫ్రిడ్జె ఫై భాగాన అమర్చి క్రింద చల్ల పరచ వలసిన పదార్ధాల అరలను అమర్చుతారు.
ఇక నీరు నీటికి కూడా దానికి సంబందించిన ప్రత్యేక ధర్మాలు వున్నాయి అవి 1) ద్రవరూపంలో ఉండటం. 2)వాతావరణ ఉస్టునోగ్రత కలిగి ఉండటం. 3) ఎల్లప్పుడు ఫై నుండి క్రిందికి అంటే వాలుకు ప్రవహించటం. 4) అధికంగా వేడి చేస్తే ద్రవ వాయు స్థితికి మారటం.
ఇదే విధంగా మిగిలిన ఇతర భూతాలకు కూడా వాటి వాటి ప్రత్యేక ధర్మాలు కలిగి వున్నాయి.
ఇకపోతే ఈ జగత్తుని మనం రెండు రకాలుగా విభజించవచ్చు అవి 1) జీవులు, 2) నిర్జీవులు. ఇంకా జీవులను మరల రెండు రకాలగా విభజించ వచ్చు అవి 1) వృక్షయాలు, జంతువులు. మరల ఈ జంతువులను వాటి వాటి నివాస స్థలాలు, జీవన విధానం ప్రకారం అనేక విధాలుగా విభజించ వచ్చు. ఉదా. భూమి మీద జీవనం గడిపే వాటిని భూచరాలు అని, గాలిలో, భూమిపై వుండే వాటిని పక్షులు అని అలాగే నీటిలో వుండే వాటిని జలచరాలు అని. ఇంకా శాకాహారులు, మాంసాహారులు ఇలా అనేక విధాలుగా జంతు కోతిని విభజించ వచ్చు. అంతే కాక వాటి పరిణామాన్ని బట్టి, వాటి సంతానోత్పత్తిని పట్టి ఇలా చాలా రకాలుగా జంతువులను విభజించ వచ్చు. జంతువులకు సంబందించిన ఈ జ్ఞానాన్ని తెలిపే శాస్త్రాన్ని జంతు శాస్త్రం అని అంటారని మనకు తెలుసు.
ఇక పొతే జంతువులలో కాకుండా వృక్షజాలాల్లో కుండా అనేక విభాగాలు వున్నాయి. ఇలా వృక్షలకు సంబందించిన జ్ఞానాన్ని తెలియచేసే శాస్త్రాన్ని వృక్ష శాస్త్రంగా పేర్కొంటున్నారు. ఇళ్ల జీవులు అనేక విధాలుగా వుంటూ వాటి వాటి ధర్మాలను అవి పాటిస్తున్నాయి.
వృక్షాలు భూమిమీద ఉండి వాటి వ్రేళ్ళతో భూమిలోనికి చొచ్చుకొని శాఖలు భూమిమీద చాలా ఎత్తుకు పోయే కదలకుండా ఒకే చోట వుంటూ వాటి జీవనం గడుపు తాయి. అవి భూమిలోని ఖనిజ జలాన్ని గ్రహించి సూర్య రశ్మితో ఆహారాన్ని తయారు చేసుకొని జీవిస్తుంటాయి.
జంతువులూ సామాన్యంగా భూమి మీద చేరుస్తు వాటి ఆహారాన్ని తీసుకొని జీవిస్తూవుంటాయి.
నిర్జీవులు అంటే రాళ్లు రప్పలు, కొండలు నదినదాలు ఇవ్వన్నీ వాటి వాటి స్వరూపాలు కలిగి స్థిరంగా ఉంటాయి.
ఇలా వీటి స్థితిలో అవి వుంటూ ఈ సృష్టిలో వాటి వాటి ఉనికికి తగ్గ విధంగా నడుచుకోవటాన్ని సృష్టి ధర్మం అంటారు. ఇలా సృష్టి ధర్మం ఈ భూమి మీది వేల సంవత్సరాలనుండి నడుస్తున్నది.
మానవుడు. ఈ సృష్టిలో మిగిలిన వాటికన్నా భిన్నంగా వున్నది మానవుడు ఒక్కడే. మానవుడు తన మేధాసంపతితో ఈ సృష్టి రహస్యాలను కనుగొనటానికి ప్రయతనం చేసాడు. ఇంకా చేసునేవున్నాడు. మీకిలిన జీవకోటి మొత్తం తమ తమ ఆహార సముపార్జన మాత్రమే ప్రధాన లక్ష్యంగా జీవిస్తూ ఉంటే మానవుడు మాత్రం తాను ఆహారాన్ని సంపాదించుకోటంతో పాటు నివాసాలు ఇంకా అనేక వసతులను తానూ సృష్టించుకొని వాటితో సుఖపడుతున్నాడు. ఈ సుఖాలకు అలవాటు పది ప్రక్రుతి మీద తన ఆధిపత్యాన్ని చూపుతూ ప్రక్రుతి ధర్మాలను ఉల్లంగిస్తూ ఈ సృష్టికి కీడు తలపెడుతున్నాడు.
ఉదా. తన నిర్మాణము శాఖాహార విధానానికి అనుకూలంగా వున్నా తన తెలివితేటలతో ఈ భమిమీద వున్న ఇతర జంతువులను సంహరించి వాటి వినాశనానికి పాల్పడి ప్రక్రుతి సమతుల్యత పాడు కావటానికి కారణం అవుతున్నాడు.
చెనా లాంటి దేశంలో మనుషులు దొరికిన ప్రతి జీవిని భుజిస్తూ వాటి వల్ల అనేక వ్యాధులను సంక్రమించుకుంటున్నాడు. ప్రస్తుతం కరోనా అని ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి కూడా మానవ తప్పిదమే.
సృష్టి ధర్మాన్ని అనుసరించి మానవుడు మసలుకోవాలి. కాదని సృష్టి ధర్మాన్ని అతిక్రమిస్తే తానూ తనతోటి ప్రపంచం. యావతు సృష్టి వినాశకానికి కారణభూతుడు అవుతాడు.
తస్మాత్ జాగ్రత్త.
ఓం తత్సత్
సర్వ్యే జన సుఖినోభవంతు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి