15, నవంబర్ 2020, ఆదివారం

చెప్పుడు మాటలు

 👂👅 *చెప్పుడు మాటలు* 👄 👅👂 

**************************

👉 వియ్యంకుడి చెప్పుడు మాటలు విని మహామంత్రి తిమ్మరసు కళ్ళు పీకించాడు

 శ్రీ కృష్ణ దేవరాయలు.


👉 తన సొంత ఖర్చులు కోసం టోపీ లు కుట్టుకునే  ఔరంగజేబు చెప్పుడు మాటలు విని అధికారం కోసం కన్న తల్లి తండ్రులని బంధించాడు.


👉 తల్లి గర్భం లో చనిపోబోయే బిందుసారుడి ని తన ఉపాయం తో బతికిస్తే... చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణక్యుడి మరణానికి కారణం అయ్యాడు.


👉 చెప్పుడు మాటలు విని కురు సామ్రాజ్యం పై పగ పెంచు కున్నాడు శకుని. 

అదే శకుని చెప్పుడు మాటలు విని విజ్ఞత కోల్పోయాడు ధ్రుతరాష్టుడు.

దాంతో పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు కౌరవులు.


👉 చెప్పుడు మాటలు విని రావణ బ్రహ్మ అంతటి

 మాహా జ్ఞానే సీతమ్మ తల్లి ని అపహరించి రాముడి తో యుద్ధానికి దిగి రాక్షసుడు అయ్యాడు.

 కడకు మరణించాడు.


👉 చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయిన వారు కొందరు. 


👉 చెప్పుడు మాటలు విని పచ్చని సంసారాలను నాశనం చేసుకున్నవారు మరికొందరు. 


👉 చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారు,

ఆర్థికంగా చితికి పోయిన వారు ఎందరో ఉన్నారు.


👉 శకుని చెప్పుడు మాటలు వినటం వలన హస్తినాపుర మహా సామ్రాజ్యమే సర్వనాశనం అయింది. 

ఇక మనమెంత..?


👉 మనతో  ఉంటూ చెప్పుడు మాటలు చెప్పే శకుని లాంటి వాళ్ళతో అప్రమత్తం గా లేకపోతే ...

ఎంతటివారికైనా అపజయం కలుగుతుంది అని చరిత్ర మరియూ పురాణాలు చెప్తున్న నగ్న సత్యం.i


👉 ఒకరి గురించి నీకు చెబుతున్నాడు అంటే ... నీ గురించి మరొకరికి చెప్పడా ?

అది ఆలోచించడం మన విజ్ఞత.


జాగ్రత్త మిత్రమా....

కామెంట్‌లు లేవు: