15, నవంబర్ 2020, ఆదివారం

మీకు తెలుసా

 మీకు తెలుసా !


 గోవు సూర్యుడి పుత్రిక, శని  సూర్యుడి పుత్రుడు. అంటే గోవుకు శని సోదరుడు. గోవు మనకు అమ్మ కనుక శని మనకు మేనమామ అన్నమాట..

కనుక  శని దోషం ఉన్నవారు, శని గ్రహ పీడితులు భయపడనవసరం లేదు, పెద్దపెద్ద హోమాలు జపాలు చేయనవసరం లేదు. 


అమ్మా, శనిమామను మమ్ములను వదిలిపెట్టి వెళ్ళమని, మాకు మేలు కలిగేలా వ్యవహరించమని చెప్పు అంటూ  గోమాతను ప్రార్థిస్తే చాలు...సోదరుడి వలన మీకు మేలు కలిగేలా ఆమే చూచుకుంటుంది.


కృతజ్ఞతగా గోవును పెంచుతున్న ఒక పేద రైతుకు గోపోషణ నిమిత్తమై కనీసం ఒక సంవత్సరం పాటు మాసవారీగా గ్రాసాన్ని సమర్పించండి...అవకాశం ఉంటే జీవితాంతం గ్రాసాన్ని సమర్పించండి.


ఇంకా అవకాశం ఉంటే స్వయంగా గోవును పెంచుకోండి.. గోమాత కొలువై ఉన్న ఇంటి సభ్యులందరికీ శని మాత్రమే కాదు, అన్ని గ్రహదోషాలు తొలగిపోతాయి.

కామెంట్‌లు లేవు: