*ధార్మికగీత - 78*
*శ్లో:- మాతా సమం నాస్తి శరీర పోషణం ౹*
*భార్యా సమం నాస్తి శరీర తోషణం ౹*
*చింతా సమం నాస్తి శరీర శోషణం ౹*
*విద్యా సమం నాస్తి శరీర భూషణమ్ ౹౹*
పోషణయందు తల్లికిని
భూతలిలో సరియుండ రెవ్వరున్
తోషణనిచ్చు భార్యకును
తూగగ లేరిల నెవ్వరేనియున్
శోషణజేయుటం గలదె
జూడగ జింతకు సాటి యెచ్చటన్ ?
భూషణ మేది లేదు తగు
భూతి నొసంగెడీ విద్యకున్నిలన్ .
✍️ గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి