🙏శివానందలహారీ🙏
స్తవై ర్ర్భహ్మాదీనాం జయజయవచోభి ర్నియమినాం
గణానాం కేళీభి ర్మదకలమహోక్షస్య కకుది
స్థితం నీలగ్రీవం త్రినయన ముమాశ్లిష్టవపుష0
కదా ?త్వా0 పశ్యేయం కరధృతమృగం ఖండపరశుమ్
బ్రహ్మాది దేవతల్ పారవశ్యము తోడ
భక్తితో స్తోత్రంబులు పల్కుచుండ
నుత్తముల్ ఋషులంత యుచ్చైస్వరంబుతో
జయ జయ ధ్వానముల్ సల్పుచుండ
ప్రమథ గణంబులు పారవశ్యము తోడ
పలువిధి యాడుచూ పాడు చుండ
వృషభంబు పై నెక్కి వేడుక చూచుచూ
సంతోష యుతుడైన శంకరుడిని
నిగమవేద్యుని రుద్రుని నీలకంఠు
ఖండపరశుని మృగధరున్ కామదహను
భవు నుమాశ్లిష్టు శర్వుని భవవినాశు
యెపుడు దర్శింతునో కదా ! యెఱుగ నైతి 25 #
కదా వాత్వా౦దృష్ట్వా గిరిశ !తవ భవ్యా౦ఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్
సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజ గంధాన్ పరిమళా
నలభ్యాం బ్రహ్మాద్యైర్ముద మనుభవిష్యామి హృదయే
తరుణేందు భూష ! నీ దర్శనం బొందియు
పరవశంబగు మది ప్రస్తుతించి
భవ్యమౌ నీ దివ్య పాదద్వయంబును
పదిలమై కరముల బట్టుకొనియు
నక్షియుగళ శీర్ష వక్షంబు పైనిడి
నత్యంత భక్తితో నద్దుకొనియు
నాలింగనముజేసి యాఘ్రాణ మొనరించి
పద్మ సౌగంధికా పరిమళమును
బ్రహ్మ మొదలగు సురగణ ప్రభృతులకును
లభ్యముంగాని సంతోష లక్షణములు
నిండు డెందాన నెపుడు నింపు కొందు ?
భక్తపాలన ! శంకరా ! భవవిదూర ! 26 #
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి