🪔శ్రీ లక్ష్మీ కుబేర పూజ🪔
🚩🦚🚩
వేదకాలంలో నైమిశారణ్యంలోని మహర్షులంతా ఒకసారి వ్రతాల గురించి పూజల గురించి,వాటి వల్ల కలిగే ఫలితాలను గురించి చర్చించారు.
వున్నారు.
ఆ సమయంలో త్రిలోక సంచారియైన నారదుడు కూడా
అక్కడికి వచ్చాడు.
" రాబోయే కలియుగంలో ధనం వుంటేనే పూజలు
వ్రతాలు చేయబడతాయి.
ఆ ధనం పొందాలంటే చేయవలసిన పూజ దీపావళి రోజున చేయవలసిన పూజ
లక్ష్మీ కుబేర పూజ. " అని వివరించాడు.
అప్పుడు, ఆ పూజ మహిమలు చెప్పవలసినదని
మునులు అడిగారు.
నారదుడు పూజామహిమలు
విశదపరిచాడు.
ఉత్తరదిక్కు కు అధిపతి అయిన కుబేరుడు సర్వసంపదలను అనుగ్రహిస్తాడు.
కుబేరుడు లక్ష్మీ దేవిని పూజించి శంఖు నిధి, పద్మనిధి
మొదలైన నవ నిధులను
వరంగా పొందాడు. అందువలన కలియుగం లో పవిత్రమైన దీపావళి రోజున శ్రీ లక్ష్మీ కుబేర పూజ చేసినందున సర్వసంపదలు
పొంది సుఖజీవనం లభిస్తుంది." అని చెప్పి, శ్రీ లక్ష్మి కుబేర పూజ నియమాలు , పూజా వివరాలు విధివిధానంగా
తెలిపాడు.
ఇప్పుడు ఆ పూజా విధానం తెలుసుకుందాం..
ఆశ్వీయుజ మాసంలో
అమావాస్య రోజున యీ పూజ చేయడం విశిష్టమైనది.
దీపావళి నాడే కాకుండా
శుక్రవారంనాడు, పౌర్ణమిరోజున యీ పూజ
చేయవచ్చును. ఈ పూజ చేయడానికి ముందుగా
వినాయకుని,
లక్ష్మీ దేవిని పూజించాలి.
తనవద్ద నున్న సిరిసంపదలను
భక్తులకు ,తనను ఆశ్రయించినవారికీ వరాలుగా యిచ్చే
వరాన్ని కుబేరునికి యిచ్చినది
మహాలక్ష్మీ . అందువలన
మహాలక్ష్మిని పూజించిన పిదపనే
కుబేరుని పూజించాలి.
లక్ష్మిదేవిని దీప రూపంలోగాని
పటంలో గాని, కలశంలోకి
గాని ఆవాహనం చేయాలి.
శ్రీ సూక్త పారాయణంతో
ధూప దీపము వంటి పదహారు ఉపచారాలను
చేసి పూజించాలి.
కలశపూజకి అనంతరం
నవగ్రహాలను పూజించి,
మహాలక్ష్మి ని పూజించాలి.
పిదప ఉత్తర దిశగా కుబేరుని
పటం గాని , దర్భలకట్టకి గాని
కుబేరుని ఆహ్వానించి
కుబేరుని ధ్యాన శ్లోకం పఠించి
పూజ ఆరంభించాలి.
రావణుని వద్ద తన సంపదలని కోల్పోయి, తిరిగి పొందడానికి పరమశివుని
గురించి తపస్సు చేసిన కుబేరునికి పరమశివుడు
దర్శనమిచ్చి, నవనిధులను
ఉత్తర దిశకి ఆధిపత్యాన్ని
వరంగా యిచ్చాడు.
సిరిసంపదలు చంచలమైనవని రావణుని వలన తెలుసుకొనినందువలన
పరమశివుని అనుగ్రహము
వలన తాను పొందిన సిరులు
సదా కోల్పోకుండా వుండడానికి ,మరింత అభివృద్ధి కావడానికి మహాలక్ష్మి ని
ప్రార్ధించాడు కుబేరుడు.
కుబేరునికి ప్రత్యక్షమైన
మహాలక్ష్మి , "నన్ను యధావిధిగా పూజించిన
పిదప నిన్ను పూజించిన
భక్తులకు అనంత సంపదలను అనుగ్రహించగల
శక్తి గలవాడవు కాగలవని
వరం యిచ్చింది.
కుబేరుని పూజించడానికి
ముందు మహాలక్ష్మి ని పూజించాలి.
సహస్రదళ తామరపుష్ప వాసినీ, దేవీ.. శరత్కాలములోని కోటి చంద్రుల ప్రకాశము కలిగినటువంటి దేవీ ..
అమ్మా! మహా లక్ష్మీ..
రత్నాభరణాలతో అలంకరించుకొని , బంగారు
వస్త్రాలు ధరించి, మందహాసంతో, భక్తులను
కటాక్షించే దేవీ నిన్ను
ధ్యానిస్తూ వున్నాను.
కుబేరుని ధ్యానం ..
నరులుమోసే ఉన్నత విమాన
ఆశీనుడు, మరకత వర్ణం వంటి దేహ కాంతి, నవనిధులకు అధిపతి,
పరమశివుని మిత్రుడైన,
విశిష్టమైన గద హస్తమున
ధరించినవాడు, బంగారు
కిరీటధారి అయి ఆభరణాలు
ధరించినవాడు. పెద్ద ఉదరము కలిగినవాడు
సిరిసంపదలు అనుగ్రహించే
వాడు అయిన కుబేరుని
ధ్యానిస్తూ వున్నాను.
యీ ధ్యాన మంత్రాన్ని పఠించి
పూజ చేసిన తరువాత
క్రింద వున్న కుబేర మంత్రాన్ని
108 సార్లు జపించి వందనాలు సమర్పించాలి.
కుబేర మంత్రము..
ఓం యక్షాయ కుబేరాయ
వైశ్రవణాయ! ధనధాన్యాధిపతియే
ధనధాన్య స్మృతిమ్ మే
దేహి దాబయ స్వాహా..
తరువాత కుబేరునికి 108
నామాలతో పుష్పార్చన చేసి
తీపి పిండి వంటలు నివేదన
చేయాలి. శ్రధ్ధాభక్తులతో
కుబేరుని అర్చించి అనుగ్రహం
పొందాలి.
🚩 శేషశ్రీ. 🚩
🪔🦋దీపావళీ విశేషాలు - 8 🦋🪔
దీపావళి దినాన అన్నపూర్ణాదేవి దర్శనం
🚩🪔🚩
శ్రీకాశీ విశ్వనాధుని ఆలయానికి సమీపమున
వున్నది అన్నపూర్ణాదేవి
ఆలయం. దీనిని "తులసీ మానస మందిర్" అంటారు.
ఇక్కడ ఉమాదేవి అన్నపూర్ణాదేవి గా అనుగ్రహిస్తున్పది.
ఆకలితో వున్న జీవులకి
ఆన్నం అనుగ్రహిస్తున్నందున
అన్నపూర్ణ అని పిలువబడుతున్నది.
మహారాష్ట్ర పేష్వాల కాలంలో
పూనాకి చెందిన సర్దార్
చంద్రచూడుని కుటుంబం వారి ఆధ్వర్యంలో అన్నపూర్ణాదేవి ఆలయం నిర్మించబడినది. ఈ ఆలయం
లోపల భాగం అంతా పాలరాతి తో నిర్మించబడినది. గర్భగుడి కి
ఎదురుగా 12 స్ధంభాల తో పెద్ద సభామండపం వున్నది. అక్కడనుండే అన్నపూర్ణాదేవి
ని దర్శించవచ్చును.
తూర్పు ముఖంగా 2 అడుగుల ఎత్తుగల నల్లటి శిలా విగ్రహ రూపంగా అనుగ్రహం కటాక్షిస్తున్న అన్నపూర్ణాదేవి
ఎడమచేతిలో అన్న పాయసపాత్ర, కుడి చేతిలో గరిటెతో
దర్శనమిస్తున్నది. ఈ అన్నపూర్ణాదేవి ని దర్శనం చేసుకుంటేనే కాశీ యాత్ర
సంపూర్ణమైనట్టు ఐహీకం.
శ్రీ అన్నపూర్ణాదేవి విగ్రహం పూర్తిగా కవచం ధరించి వుంటుంది. మణిమకుటం, నవరత్నాభరణాలు ,
పుష్పాలంకారం తో అన్నపూర్ణాదేవి అతిసౌందర్యం తో
ప్రకాశిస్తూ దర్శనం యిస్తుంది.
దేవి సన్నిధి తెరతో మూసి వున్నందున, భిక్షద్వారం, ధర్మద్వారం, ద్వారా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి