* ఆయుర్వేద ఔషధాలు సేకరించే విధానము -
ఆయుర్వేదం ఔషధాలను ఒక ప్రత్యేక మయిన పరిస్థితులు , ఒక నిర్దిష్టమైన సమయం లొ మాత్రమే ఔషదులని గ్రహించాలి. అటువంటి ఔషధాలు మాత్రమే పరిపూర్ణం గా పనిచేస్తాయి.
ఔషధాలు ఎంత శక్తివంతం గా పనిచేస్తాయి అనేది ఆ ఔషధి ఉన్నటువంటి నేల కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి ఔషధాలను జాగ్రత్తగా తీసుకుని వచ్చి వాడినప్పుడే శరీరం పైన వాటి ప్రభావాన్ని బలం గా చూపిస్తాయి.
* ఔషధాలు సేకరించు స్థలం -
ఋతువులు సరిగా ఏర్పడుతూ ఉండాలి. వెన్నెల, నీరు , గాలి కాలానుసారం గా ఉండాలి. అట్టి స్థలం లొ ప్రదిక్షణం గా ప్రవహించుచున్న నీరు కలిగి ఉండి దర్భ మొదలయిన మొక్కలచే వ్యాపించి అట్టి మన్ను నల్లగా కానీ బంగారు రంగులొ కలిగి ఉన్నది అయ్యి సువాసనలుతో కుడుకొని ఉన్నది అయి ఉండాలి. అచ్చట గండ్ర ఇసుక, చౌడు, గులక రాళ్లు , గోతులు, పుట్టలు మొదలయినవి ఉండకుడదు. మరియు అచ్చటి భూమి రాజవీధి , స్మశానం, ఇండ్లు, రచ్చబండ, ఉద్యానవనం వీటి సమీపం లొ ఉండకుడదు. నాగలిచే దున్నబడక వృక్షములను ఆవరించి ఉండవలెను.
పురుగులు కలదియు, సర్వ కాలంబులు నీరుచే వ్యాప్థమైపొయి , పూర్వం చెప్పిన గుణములు లేనిది అయ్యి, పిశాచములు కలిగి ఉన్న భూమిలో పుట్టిన ఔషధాలు పనికి రావు .
విస్తారంగా స్థూల వృక్షాలు, గసువు, పైరు మొదలగు వానిచే ఉండి గట్టిగా ఉండి, బరువు కలిగి అనేక పాషానాలతో ఉండి శ్యామల వర్ణం కలిగి, నల్లని వర్ణం కలిగిన భూమి లొ చాలా అదిక గుణం కలిగిన ఔషధాలు ఉండును.
భూమి యెక్క గుణం ఏ విదంగా ఉండునో ఆ ఔషధీ గూడా అదే విదంగా ఉండును.
* భూమి గుణాలు -
పృథ్వి, ఉదక గుణములు కలిగిన భూమి యందు పుట్టిన ఔషధాలు విరేచానకారులు అవును. ఆకాశ గుణం కలిగిన భూమి యందు పుట్టిన ఔషధాలు వమన కారిణి గా ఉంటాయి. పంచ భూతముల లక్షణాలు కలిగిన భూమి లొ పుట్టిన ఔషధాలు వమన కారిణులు , విరేచన కారిణులు అవును.
* ఔషధాలు సేకరించే విదానం -
ఔషధాలను సేకరించాలి అనుకున్న వైద్యుడు పూర్వపు రోజున ఉపవాసం ఉండి పవిత్రుడి గా ఉండి దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, బ్రహ్మ్మను, దక్షప్రజపతిని , అశ్విని దేవతలను పూజించి నాలుగు దిశలలో బలి ని సమర్పించి ఆ ఔషధిని ఆశ్రయించి ఉండు సమస్త దేవతలను గూర్చి " ఓ దేవతలారా నన్ను నిరపరాధుని చేసి మీరు ఆశ్రయించి ఉండు ఈ ఔషధిని విడిచి పొండు సర్వ ప్రాణ కోటికి జీవ పదార్ధంబైన ఈ ఔషధిని నేను గ్రహించేదను. మరియు ఓ దేవతలారా నేను ఈ ఔషధిని లోభం కొసం గ్రహించడం లేదు . ప్రధానం గా బ్రాహ్మ్మన రక్షణార్ధం అని ప్రార్ధించి నానా వర్ణములు గల దారాలతో ఆ ఔషధానికి రక్షాబంధనం చేసి పిమ్మట గృహమునకు పోవలెను.
మరునాడు తను రక్షాబంధనం కట్టిన ఔషధి దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా పరిశీలించ వలెను. తాను కట్టిన రక్షాబంధం పూర్వం వలె ఉండి అక్కడ మరేటువంటి వికారములు లేకుండుట చూచి బ్రహ్మ్మనుల చేత స్వస్తివాచకం చెప్పించుకొనుచూ అక్కడికి వచ్చి సూర్యుడు ఉదయించి నడినెత్తికి రాగా "ఖనన మంత్రం " ప్రకారం ఆ ఔషధి యెక్క తూర్పు వైపు బారిన వేరును అయినా ఉత్తరం వైపు బారిన వేరును అయినా తవ్వవలెను.
* ఖనన మంత్రం -
ఔషధి కొసం తవ్వేప్పుడు ఖనన మంత్రం ఖచ్చితం గా పటించాలి .
" బ్రహ్మ, విష్ణు వుని యే హస్తం చే తవ్వేధరో అట్టి అయిదు వేళ్ళు గల చేతితో నిన్ను తవ్వేదను". ఇదియే ఖనన మంత్రం. దీని చేత ముందు చెప్పిన ప్రకారం తవ్వాలి.
* గ్రహణ మంత్రం -
" మంగళ కరం అగు ఔషధి నీకు నమస్కారం .మీకు శుభం ఔషదులార . బలవంతం లగుదురు కాక .ఒక్కోనియందు వీర్యం కలగ చేయుడు .మీకు ప్రార్దిన్చేదను అని మంత్రం చెప్పి ఔషధిని పట్టుకోవలెను.
* ఔషధిని పుచ్చుకునే ముందు మంత్రం -
ఔషధి శ్రేష్టమ మంగళం విగ్నములను మిక్కిలి దహించుము . మిక్కిలి నశింప చేయుము . మిక్కిలి చీల్చుము. నీకు నమస్కారము. అని ఈ మంత్రం చెప్పి ఔషధిని లొపలికి పుచ్చుకోవలెను.
* వ్యర్ధ ఔషధాలు -
పురుగు కుట్టినది. నీటిలో మునిగినది. మేకలు తినినది. పిశాచముల చేత వికారం పొందింది. ఎల్లప్పుడు నీడనే ఉన్నది. నీటిచేత తడియక ఎండినది . చెట్ల సందుల ఎందు ఉండినది. నడిచే దారిలో ఉన్నది. పది మందికి తెలిసినది సారం లేనిది గాని ఔషధములు వాడ రాదు. ఒకవేళ వాడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే చంద్రగ్రహణ సమయం లొ , మరియొక రాత్రులలో గానీ మూలికలు గ్రహింప కూడదు .
* ములికలు గ్రహింప వలసిన కాలం -
వర్ష ఋతువు నందు కొమ్మలు, వసంత ఋతువు నందు చిగురుటాకులు, శిశిర ఋతువు నందు , గ్రీష్మ ఋతువు నందు పండుటాకులను , మొలకెత్తు ఆకులను, మూలములను గ్రహించాలి.
మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.