*వస్తున్నాయి పూరీ జగన్నాథుడి రథ చక్రాలు....!!*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿ఇది అత్యంత ప్రాచీనమైన రతయాత్రల్లో ఒకటి. ఇది ఎప్పుడు ప్రారంభమయిందో ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు.
🌸 వేల సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండో రోజున పూరీ జగన్నాథుడి రతయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
🌿ఈ ఏడాది కూడా రతయాత్రకు సమయం ఆసన్నమైంది. మంగళవారం (జూన్ 20)న ఈరోజు ఈ యాత్ర జరగనుంది. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఈ యాత్రలో పాల్గొంటుంటారు.
🌸 లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇప్పటికే భక్తులతో పూరీ జగన్నాథుడి ఆలయం కిటకిటలాడుతోంది.
మరింత కోలాహాలంగా ఉండనుంది.
🌿మంగళవారం జన్నాథుడితోపాటు బలరాములు, సుభద్రలను కూడా వేర్వేరు రథాలపై ఊరిగిస్తారు. అయితే ప్రపంచంలో ఏ ఆలయంలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరిగింపుకు ఉపయోగిస్తారు.
🌸కానీ పూరీలో అలకాదు. సాక్షాత్తు గర్భగుడిలో ఉండే స్వామిఅమ్మవార్లనే బయటకు తీసుకొచ్చి ఊరేగిస్తారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి గర్భగుడిలో ప్రతిష్టిస్తారు.
🌿అలాగే ఈ రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను ఆలయ నిర్వాహకులు తయారు చేస్తారు. వీటి తయారీని అక్షయతృతీయ రోజున మొదలు పెడుతారు.
🌸ఇక్కడ రథాలకు పేర్లు కూడా ఉంటాయి. జగన్నాథుడి ఊరేగింపు కోసం చేసే రథాన్ని గరుడధ్వజం అని.. బలభద్రుని కోసం చేసే రథాన్ని తాళధ్వజం అని.. సుభద్ర కోసం చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు. ఇప్పటికే ఈ ఏడాది రథయాత్ర కోసం ఆలయ నిర్వాహకులు రథాలను సిద్ధం చేశారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి