*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
```
‘ఈ ప్రపంచంలో గొప్ప సుఖం పొందగలిగేది ఎవరు?’అని భీష్ముణ్ని ధర్మరాజు ప్రశ్నిస్తాడు.
‘నిందాస్తుతులను సరిసమానంగా భావించడం, నిర్వికారంగా ఉండటమే సుఖమయ జీవితానికి మొదటి సోపానం’ అని బదులిచ్చాడు భీష్ముడు.
జీవితంలో సుఖసంతోషాలే కాదు... కష్టాలను కూడా సహనంతో భరించడం నేర్చుకోవాలి. కష్టాలు, బాధలు మనిషి జీవితంలో అలజడి సృష్టిస్తుంటాయి. నిజమే..
కానీ, అవి మనిషి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి పరోక్షంగా తోడ్పడతాయి.
కష్టాలను భగవంతుడి దీవెనలుగా, వరాలుగా స్వీకరించాలంటారు సద్గురువులు.
ఒకసారి మహాభక్తురాలైన కుంతీదేవిని పలకరించడానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. ‘అత్తా, నీకేం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను’ అన్నాడు శ్రీకృష్ణుడు.
అప్పుడు కుంతీదేవి ‘కృష్ణా, నాకెప్పుడూ కష్టాలు, దుఃఖాలు ఉండేటట్లు అనుగ్రహించు’అంది.
శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి ‘అత్తా, ఏమిటి నీ విపరీతమైన కోరిక?’ అన్నాడు.
దానికి కుంతీదేవి‘నాయనా!మేము కష్టాలలో ఉన్నప్పుడే కదా నీవు పరుగులు తీస్తూ మా వద్దకు వచ్చావు... నీ దర్శనాన్ని కలిగించే కష్టాలే కావాలి!’ అంది.✍️```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి