20, జూన్ 2023, మంగళవారం

గాడిదలదే తప్పంతా..

 సింహం అడవి దారినుండి వెళ్తుంది 

అనుకోకుండా నక్క కనిపించింది 

సింహం పరిగెత్తి నక్కని పట్టుకుంది


ఆకలితో ఉన్న సింహం నక్కతో ఇలా అన్నది. 

నిన్ను చూస్తే జాలేస్తుంది నీకు ఒక అవకాశం ఇస్తున్నాను 


ఏదన్నా జంతువుని తీసుకొని వస్తావా  లేకపోతే నిన్ను తింటాను అన్నది. 


మహాప్రభో అదే మహాభాగ్యం 

ఇప్పుడే వెళ్లి దేనినైనా తీసుకొని వస్తాను అని బయలుదేరింది


నక్క వెతగ్గా ఒక గాడిద కనబడింది. 

సింహం నిన్ను తన వారసుడిగా నిన్ను ఈ అడవికి రాజును చేస్తానన్నది, నాతో రా! అన్నది. నక్క


గాడిదను చూడగానే దాడి చేసి దాని చెవులు కొరికేసింది సింహం

గాడిద పారిపోతూ నక్కతో కోపంగా: 

ఇంత మోసం చేస్తావా అన్నది.


పిచ్చిదానా! కిరీటం పెట్టడానికి చెవులడ్డమని కోరికిందంతే ఏం సందేహించకు అని నచ్చ చెప్పి మళ్ళీ తీసుకొచ్చింది. 


ఈసారి దాడిలో దాని తోక దొరికితే కొరికి తెంపేసింది. మళ్ళీ పారిపోతూ కోపంతో బాధతో వెంట వస్తున్న నక్కతో: 

మళ్ళీ మోసం చేశావు కదూ! అంది గాడిద


నక్క ఛీ! ఛీ! అదేంలేదు. నీన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తోక అడ్డమని కొరికేసిందంతే! అన్నది.


సరే అని మళ్ళీ వచ్చిన గాడిదని సింహం చంపేసి నక్కతో: దీని చర్మం వలిచి మెదడు, గుండె, లివరు ఊపిరితిత్తులు తీసుకురమ్మన్నది.


నక్క మెదడు తాను తినేసి 

మిగిలినవి పట్టుకొచ్చింది. అవి చూసి సింహం: 

వీటిలో మెదడేది?  అని అడిగింది.


నక్క: ప్రభూ! దీనికి మెదడే లేదు. 

ఉండి ఉంటే మీరు దాడి చేస్తున్నా మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేది కాదు కదా!  అన్నది.


నిజమే! అన్నది సింహం.


సందేశం: 


మోసం చేసిన నక్క లాంటి అవినీతి నాయకులది గొప్పతనం కాదు

పదే పదే వాళ్ళ మాటలు నమ్మి 

డబ్బు కొరకు 

మద్యం కొరకు ఓట్లసే గాడిదలదే తప్పంతా..

కామెంట్‌లు లేవు: