180623g1804. 200623-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*కైలాసం కావాలా?*
*వైకుంఠం కావాలా?*
➖➖➖✍️
*ఓసారి భక్తతుకారామ్ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ, స్మరణ చేస్తూ వెళ్తున్నాడు.*
*అపుడు ఒకడు ఎదురు వచ్చాడు. “నువ్వు ఈ నామాన్ని ఇలా స్మరిస్తున్నావ్ కదా? ఏమి కోరుకుంటున్నావ్. నీకు కైలాసం కావాలా? వైకుంఠం కావాలా? స్వర్గం కావాలా?” అని తుకారాంని అడిగేడు.*
*“ఆ ప్రశ్నకి తుకారాం అంటాడు- “అయ్యా! నాకు కైలాసం, వైకుంఠం అంటే అర్థం కాదు. ఇక స్వర్గమంటారా? ఈ నామస్మరణ చేస్తున్నపుడు నేను అనుభవించేదే, అనుభవిస్తున్నదే ‘స్వర్గం’ అని బదులిస్తాడు. *
*భగవన్నామం హృదయంలో నినదిస్తే, నినాదాలు చేస్తే అదే స్వర్గం.*
*నామస్మరణ మనసు పడే ఆరాటాన్ని, ఆందోళనని, అశాంతిని అణచివేస్తుంది.*
*ఓ ఇనుప ముక్కను ఓ రాయిమీద రాస్తూ రాస్తూ పోతే వేడి పుడుతుంది.*
*భగవన్నామం అనే ఇనుప ముక్కతో, రాయిలాంటి మనసుని అటు ఇటు అనంతంగా, అఖండంగా రాస్తూ పోతే, 'భక్తి’ అనే వేడి పుడుతుంది.*
*పుట్టిన భక్తి అనే వేడి, పరమాత్మునికి ఉండే వెన్నలాంటి హృదయాన్ని కరిగిస్తుంది, కదిలిస్తుంది.*
*నారదుని ఉపదేశ కారణంగా రత్నాకరుడు రామనామాన్ని స్మరించిన కారణంగా శ్లోకదాతగా మారాడే.*
*వాల్మీకి మహర్షియై రామాయణ మహాకావ్యానికి సృష్టికర్తయ్యాడు.*
*అయితే నామస్మరణ, దైవచింతన అని రెండు ఉన్నాయి.*
*నామాన్ని జపించటం నామస్మరణ. ఆ నామం చేసిన లీలలను మహిమలను, మననం చేసుకోవటమే చింతన.*
*కృష్ణా కృష్ణా అని జపించటం స్మరణ. ఆ కృష్ణుడే ఎపుడో చేసిన లీలను మహిమలను మనం ఇపుడు మననం చేసుకోవటం చింతన.*
*నామాన్ని మనోభావంగా ఉచ్చరించాలి. పెదవులనుండి కాక హృదయంలోంచి ఉచ్ఛరించాలి.*
*ఆర్తితో ఉచ్ఛరించాలి.*
*అనుభవిస్తూ ఉచ్ఛరించాలి.*
*అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉచ్ఛరించాలి.*
*మనసనే సరస్సులో నామం ఓ తామరపూవు.*
*తామరపూవులోని మకరందాన్ని త్రాగడానికి భక్తులు ఐహిక భావనలు వదిలి తుమ్మెదలవలె పరుగుతీయాలి.*
*హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే భగవంతుడు మన పూజ గది ముందు దాసుడిగా వేచి ఉంటాడు...నిజమే కదా... *✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి