14, సెప్టెంబర్ 2020, సోమవారం

BHAGWAD GITA* *in one sentence*_

*BHAGWAD GITA*
                _*in one sentence*_
                   _*per chapter...*_


*Chapter 1*

_Wrong thinking is the only problem in life_

*Chapter 2*

_Right knowledge is the ultimate solution to all our problems_

*Chapter 3*

_Selflessness is the only way to progress & prosperity_

*Chapter 4*

_Every act can be an act of prayer_

*Chapter 5*

_Renounce the ego of individuality & rejoice in the bliss of infinity_

*Chapter 6*

_Connect to the Higher consciousness daily_

*Chapter 7*

_Live what you learn_

*Chapter 8*

_Never give up on yourself_

*Chapter 9*

 _Value your blessings_

*Chapter 10*

_See divinity all around_

*Chapter 11*

_Have enough surrender to see the Truth as it is_

*Chapter 12*

_Absorb your mind in the Higher_

*Chapter 13*

_Detach from Maya & attach to Divine_

*Chapter 14*

_Live a lifestyle that matches your vision_

*Chapter 15*

_Give priority to Divinity_

*Chapter 16*

_Being good is a reward in itself_

*Chapter 17*

_Choosing the right over the pleasant is a sign of power_

*Chapter 18*

_Let Go, Lets move to union with God_

పిండం అంటూ నీళ్లలో వేసే అన్నం ముద్ద

#పిండం అంటూ నీళ్లలో వేసే అన్నం ముద్ద
*మరొక పేదవాడికి కడుపు నింపుతుంది కదా..?"*
"శెభాష్.. నిజమే" అనిపిస్తోంది కదూ..?? మరి ఆ అభిప్రాయం నిజమా? అంటే, ఆ భావన 100శాతం తప్పు .!

మరి ఎందుకో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిమీదుంది. అందుకే ఎందుకో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

#పిండం : ఇవి పలు రకాలు.. కర్మకాండలకు , రకరకాల పిండాలు పెట్టడం హిందూ సంస్కృతిలో ఉంది.. కొందరు మాత్రమే పాటిస్తున్నారు.. కొందరు రాను రాను విసర్జించి ఉంటారు. కొందరు తొలినాళ్ళ నుంచి పాటించి ఉండక పోవచ్చు.

ఈ ప్రశ్న కు సమాధానం చూసే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
విశ్వంలో మనిషి ఒక్కడు మాత్రమే ఉన్నాడా?? ప్రాణంతో ఉన్న ఇతర జాతులేమీ లేవా? మరి సైన్సు ఏమి చెబుతోందో తెలుసా..!??

8.7 మిలియన్ల జీవరాశులు భూమిమీద జీవిస్తున్నాయని సైన్స్ పత్రిక చెబుతోంది. ఇంకా కూడా ఎక్కువే ఉండవచ్చు, ఖచ్చితంగా లక్షల సంఖ్యల్లోనే ఉంటాయి. అందరి కన్నా మేథస్సున్న మానవుడు మూఢాచారాలు నమ్మొచ్చా? అనే వాదం ఉన్నవారికి, మరి ఆయా ఇతర జీవులు ఎలా జీవిస్తాయో అన్న అనుమానం ఎందుకు కలుగట్లేదో అర్ధం కాని ప్రశ్న!?

మన కడుపుకి మనం తింటే చాలా..??
ఒక గిరి గీసుకుని అందులో మఠం వేసుకు కూర్చుని, ఎదుటి వారిమీద దుమ్మెత్తి పోయటం చాలా సులభమే..! కానీ గతించిన మంచోళ్ళు అలా చేయలేదు..పూర్వీకులు అన్నింటి గురించీ పట్టించుకున్నారు.
అన్ని ప్రాణుల అవసరాలనీ ఏదో ఒక రూపంలో తీర్చాలన్న నీతి ని ప్రభోదించారు..
అందులో భాగమే ఈ #పిండ_ప్రదానం అనే క్రతువు.

ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారం..
శాస్త్రంలో మంత్ర విధానంగా ఇలాచెప్పారు.

*"ఇదం పిండం గృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం"*
(గద్దలు, కాకులు, జలచరాలు రూపంలో పితృదేవతలకు ఆహారం అందించాలి)

1. కాలం చేసిన వారి పేరుతో, వారిని గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతో (ఆత్మ శాంతి కోసం) ఊరి జనం మొత్తాన్ని పిలిచి స్థోమతకు తగ్గట్టు అన్నదానం చేస్తారు. ఇది బ్రాహ్మణ , బ్రాహ్మణేతరులకు కూడా అన్నదానం జరుగుతుంది. కాబట్టి మనుష్య జాతికి భోజనం పెట్టారు ఆ కుటుంబం వాళ్ళూ.

2. #వాయస_పిండం/ వికిర పిండం
(కాకి పిండం) : "కాకులు దూరని కారడవి అంటారు." ఈ ఉపమానం ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అంటే కాకి ఎక్కువగా కనిపించే పక్షి జాతి కి చెందిన జీవి. ఆ పక్షిజాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్ధం.

నువ్వులు, అన్నం, నెయ్యి మాత్రమే కలిపిన ముద్ద పెడతారు. అంటే ఇక్కడ కాకి తినే పదార్ధాలనే ఉపయోగిస్తారనేది గ్రహించాలి. నెయ్యి వాసనకు త్వరగా వస్తాయి కాకులు.

3. నీటిలో వదిలే పిండం: నీటిలో కలిపే పిండాలలో మినుములు జలచరాలకు మంచిది కాదని గారెలు కలుపరు. అలాగే పిండాలతో పాటు కలిసి వచ్చిన దర్భను జాగ్రత్తగా ఏరి, నీటిలో కడిగి, నది ఒడ్డున వేస్తారు. నీటిలో వేస్తే జలచరాలు పొరపాటున దానిని చప్పరిస్తే నోరు చీరుకుపోయే ప్రమాదముందని అలాచేస్తారు.

ఇంతలోతుగా ప్రతీదీ ఆలోచించి శ్రద్ధతో చేస్తేనే అది ఫలవంతం అవుతుందని, ఏ మాత్రం అజాగ్రత్త పరాకు ప్రదర్శించకూడదని, *"శ్రద్ధయా కురుతే శ్రార్ధం"* శ్రద్ధతో చేసినది మాత్రమే శ్రార్ధం అవుతుందని పదే పదే గట్టిగా చెప్తారు.

పురోహితులని పిలిచి యధావిధిగా ఈ ఆబ్దీకాదులు జరిపించే వారికి ఈవిషయాలు చాలా వరకు తెలుసు. కానీ మన హేతువాద సోదరులకి హేతుబద్ధంగా చెప్పాలనేదే ఈ ప్రయత్నం.!

4. ఇక గోవుకు పెట్టే పిండం: సరే మనిషికి పెట్టరు, పక్షియైన కాకికి పెట్టరు . జలచరాలైన చేపలకి పెట్టరు , అదే రీతిలో జంతువైన ఆవుకి పెట్టరు . అది కూడా ఆవుకి బలిష్టమైన ఆహారం మాత్రమే పెడతారు అనేది తెలుసుకోవాల్సిన విషయం.

ఈ మధ్య గో సేవ అంటూ గోవుల్ని ఆదుకుంటున్నాం అని చెబుతున్నవారు, పిండాన్ని గోవులకి పెట్టనీయటం లేదనే విమర్శ కూడా ఉంది. అది చాలా తప్పు. అపోహ కూడా.! ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రదానంలోని గుణం.

ఇక పెడవాదులు వేసే మరో ప్రశ్న. జంతువంటే గోవు మాత్రమేనా? ఇంకేం లేవా..? కుక్కకో, పిల్లికో పెట్టొచ్చు కదా? కాకికే పెట్టాలా పిచ్చుకకో పిట్టకో పెట్టొచ్చు కదా..?
కావాలని.. అడగాలని అడిగే ప్రశ్నలకీ కూడా సమాధానాలు ఉంటాయ్. !!

ఆవు ఎన్నో ఔషధ గుణాలున్న మేలు జాతి పశువని గుర్తించారు మన పూర్వీకులు. అంతే కాదు ప్రతి ఇంటిలో కుక్క ఉన్నా, లేకున్నా ఆవు మాత్రం ఉండేది. అందుకే ఆ కాలం వారు సుభిక్షంగా ఉన్నారు అనడంలో సందేహం లేదు. అన్నీ ఇళ్ళల్లో ఆవులు ఉంటాయి కాబట్టి, వాటికి కూడా భోజనం పెట్టడమే ముఖ్యోద్దేశ్యం.

కాకికే కాదు గ్రద్దకూ పెట్టొచ్చని మంత్రం చెబుతోంది....ఇందులో కూడ మరొక గొప్ప మర్మం ఉంది కూడా. ఎక్కడైతే కాకులు, లేదా గ్రద్దలు తిరుగు తుంటాయో.. అక్కడ విష జంతువులైన పాముల వంటి జీవులు సంచరించక పోవడం కూడా గమనించాలి.

ఇక ..
ఆవులకు పెట్టె పిండాలలో పాలు పాల పదార్ధాలైనవి (నెయ్యి వంటీవి) కలవవు. అలాగే చేపలకి పెట్టే పిండంలో మినుములు ఉండవు.... కాకులకి అంటే వాయసాలకి పెట్టే పిండంలో నెయ్యి, నువ్వులు ఉంటాయి. అవి బలమైన ఆహారం వాటికి. అలా ప్రతిదీ ఆచి తూచి ప్రయోగాత్మకంగా విజయం సాధించి మాత్రమే చేశారు.

కానీ అంతటీ గొప్ప సంస్కారవంతమైన గొప్ప ఆచారాన్ని కొనసాగించడానికి ఏదో ఒక పద్దతి వాడాలి కనుక. అలా ఆదేశించారు. అందుకే ఇంతకాలం ఆ ఆచారాలు కొనసాగుతున్నాయ్. ఈ రోజు ఏ చట్టం చేసినా వెంటనే తుంగలో తొక్కేస్తున్నారు..
ఆ దుస్థితి ఎందుకు దాపురించిందో మన హేతువాద మేథావులు చెప్పాల్సిందే..!
కొన్ని మంచి విషయాలు పాటించడానికి "భక్తి" అని చెప్పేరు. కొన్ని విషయాలను "ముక్తి" అని చెప్పారు.. అంతే..!

మనం ఏ కళ్ళతో చూడాలో అవే కళ్ళు పెట్టుకు చూడాలి. దృష్టి లోపం లేనోడు చత్వారం కళ్ళజోడు వాడితే నొప్పి ఖాయం.
అలాగే హేతుబద్దంగా ఉన్న వాటిని జనవిజ్ఞానులు ఎందుకు చెప్పటం లేదో అర్ధం కావడం లేదు.

వారు కేవలం వారికి తెలిసి గిరి గీసుకుని అదే ప్రపంచం అనే అపోహలో కొట్టుమిట్టాడుతున్నారో లేక కేవలం హిందువుల సంస్కృతి సంప్రదాయాల మీద జరుగుతున్న దాడులో అర్ధం కాకుండా వుంది.

మరి దొంగ బాబాల తప్పులను ఎత్తి చూపే జన మేథావులకి .. హైందవంలో మంచి కూడా ఉందన్న విజ్ఞానాన్ని ఎందుకు బోధించడం లేదో వెయ్యిడాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది..!

హిందూ సనాతన సంప్రదాయాలను గౌరవించండి - పాటించండి..

సర్వేజనా సుఖినోభవంతు...

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

బతుకమ్మ పండుగను

హైద‌రాబాద్ : ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్ 16 నుండి 24వ‌ తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. బతుకమ్మ పండుగ జరుపుకునే తేదీలపై ప్రముఖ సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులతో కూడిన ‘తెలంగాణ విద్వత్సభ’తో కవిత స‌మావేశ‌మై చర్చించారు‌. అధిక ఈశ్వీయుజ మాసం కారణంగా శ్రీ శార్వరి నామ సంవత్సరం లో వచ్చే బతుకమ్మ పండుగ తేదీలపై ఉన్న అస్పష్టతలను తొలగించేందుకు గాను పండుగ తేదీల‌పై చ‌ర్చించారు. ఈ సంవత్సరం అధిక మాసం రావడం వల్ల పండుగ తేదీలపై కొంత సందేహాలు ఉన్నాయన్నారు. ఈ నేప‌థ్యంలో ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలో పండితుంతా చర్చించి ఈ సంవత్సరం పండగ తేదీలను శాస్త్ర ప్రకారం నిర్ణయించారని తెలిపారు. ప్రతి సంవత్సరంలాగ బాధ్రపద మాసంలో కాకుండా, అశ్వయుజ మాసంలో( అక్టోబర్) 16 వ తేదీన బతుకమ్మను ప్రారంభించి, తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించాలన్నారు.
తెలంగాణ జాగృతి అనేక‌ సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందున, చాలా మంది బతుకమ్మ తేదీల గురించి తనను సంప్రదిస్తున్న‌ట్లుగా కవిత తెలిపారు. దీంతో ‘తెలంగాణ విద్వత్సభ’ సలహా తీసుకున్న‌ట్లు చెప్పారు. ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని, శాస్త్ర ప్రకారం ఇందులో ఎలాంటి తప్పు లేదని వేద పండితులు తెలిపారన్నారు. పండితులు, సిద్ధాంతుల సూచనల ప్రకారం అక్టోబర్ 16 న బతుకమ్మను ప్రారంభించాలని తెలంగాణ ఆడపడుచులను ఆమె ఈ సంద‌ర్భంగా కోరారు. ‘తెలంగాణ విద్వత్సభ’ రాష్ట్ర అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన శర్మ, ఇతర పండితులు, మాజీ ఎంపీ కవితను కలిసిన‌వారిలో ఉన్నారు.

బ్రాహ్మణ పూజారులపై మమతా బెనర్జీ వరాల జల్లు

*బ్రాహ్మణ పూజారులపై మమతా బెనర్జీ వరాల జల్లు*
   పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బ్రాహ్మణ పూజారులపై వరాల జల్లు కురిపించారు. పూజారులకు నెలకు రూ. 1000 అలవెన్స్, 8 వేల మందికిపైగా పేద సనాతన బ్రాహ్మణ పూజారులకు ఉచిత ఇళ్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమత ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.



ఇంతకుముందు తాము సనాతన బ్రాహ్మణులకు అకాడమీ స్థాపించేందుకు కోలాఘాట్‌ వద్ద భూమిని అందించినట్టు మమత గుర్తు చేశారు. బ్రాహ్మణ శాఖలో చాలామంది ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని పేర్కొన్నారు. కాబట్టి వారికి నెలకు రూ. 1000 ఇవ్వడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ఉచితంగా ఇళ్లు కట్టి ఇస్తామని మమత హామీ ఇచ్చారు.



హిందీ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మమత ప్రభుత్వం అన్ని భాషలను గౌరవిస్తామన్నారు. ఇక్కడ భాషాపరమైన భేదాలేవీ లేవని సీఎం స్పష్టం చేశారు. ‘‘మేం అన్ని భాషలను గౌరవిస్తాం. కొత్తగా హిందీ అకాడమీని ప్రారంభించాలని నిర్ణయించాం. అలాగే, దళిత సాహిత్య అకాడమీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’’ అని మమత పేర్కొన్నారు.

సొరంగం మార్గం









పుట్టినరోజు పాట




ప్రదోషాలు - ప్రదక్షిణలు

ప్రదోషకాలాలు ఐదు రకాలు.
1. నిత్య ప్రదోషం.
2. పక్ష ప్రదోషం
3. మాస ప్రదోషం
4. మహా ప్రదోషం
5.ప్రళయ ప్రదోషం.

🌄నిత్య ప్రదోషం:
నిత్యం సూర్యాస్తమయానికి ముందు ఒకటిన్నర గంటలముందు నుండి(సుమారు
సాయంత్రం 4..30. గం. నుండి) నక్షత్రాలు ఉదయించేదాకా వుండే సాయంకాల సమయాన్ని
నిత్య ప్రదోషంగా పిలుస్తారు.

🍁పక్ష ప్రదోషం:
శుక్లపక్ష త్రయోదశి రోజున వచ్చే ప్రదోషం పక్ష ప్రదోషం.

🎄మాస ప్రదోషం:
బహుళ పక్ష త్రయోదశినాడు వచ్చే
ప్రదోషాన్ని మాస ప్రదోషం అంటారు.

🔱మహా ప్రదోషం:
పరమశివుడు విషం సేవించి , లోకాలను రక్షించిన
(ప్రదోషం)కాలం ఒక శనివారంనాడు అయినందున , శనివారము నాడు వచ్చే ప్రదోషాన్ని ' మహా ప్రదోషం అంటారు.

🔱ప్రళయ ప్రదోషం:
ప్రళయకాలంలో 
జీవరాశులు అన్ని
పరమశివుని లో ఐక్యమవుతాయి.
ప్రపంచం అంతమయ్యే కాలమే "ప్రళయ ప్రదోషం'
అని పిలవబడుతున్నది.


🏞️సోమసూక్త ప్రదక్షిణం:

శివాలయాలలో ప్రదోష సమయంలో చేసే ప్రదక్షిణం విశిష్టమైనది.
ప్రదోషం నాడు చేసే ప్రదక్షిణాన్ని ' సోమ సూక్త ప్రదక్షిణం' అని అంటారు.

సోమసూక్త ప్రదక్షిణం చేసేవిధానం .. మొదట ఆలయంలోని నందికి వందనం చేసి,
ప్రణవ రూపమైన నందీశ్వరుని కొమ్ముల మధ్యనుండి పరమేశ్వరుని దర్శించాలి .
నిత్యం చేసే ప్రదక్షిణ మారుగా , అప్రదక్షిణం మార్గాన
చండికేశ్వరుని సన్నిధి దాకా వెళ్ళి వెనక్కి తిరిగిరావాలి. అభిషేకతీర్ధం వచ్చే మార్గాన్ని దాటి వెళ్ళ కూడదు, అలాగే తిరిగి నంది దాకా రావాలి.
యీ విధంగా మూడు సార్లు చేయాలి. దీనినే
సోమ సూక్త ప్రదక్షిణం అంటారు.

సాగరమధనం జరిగి హాలాహల విషం వెలుపలికి
వచ్చినప్పుడు దేవదానవులంతా
భయంతో అందరూ కైలాసం వైపుకి పరిగెత్తారు. ఆ సమయంలో కాలకూటవిషం వారికి ఎదురుగా అప్రదక్షిణంగా వచ్చి భయపెట్టినది. వారు వచ్చిన దోవనే తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ
కూడా వారికి ఎదురుగా
ఆ విషమే ఎదురువచ్చి వారిని బాధించినది.
యీ విధంగా ఎడమ నుండి కుడికి ,కుడివైపు నుండి ఎడమవైపు కి
తిరిగిన విధానమే 'సోమసూక్త ప్రదక్షిణం' గా ఆచారంగా మారింది.

ప్రదోషకాల సమయాన పై విధంగా అప్రదక్షిణం చేసి భగవంతుని దర్శించి పూజిస్తే, ఋణబాధలు, శారీరక రుగ్మతలు,అకాల
మరణం,పేదరికం,
పాప దోషాలు తొలగి సుఖ శాంతులు లభిస్తాయి. ముక్తి లభిస్తుంది.

ప్రదోషకాల సమయంలో ఆలయాలలో రద్దీ ఎక్కువగా వుంటుంది.
అయినా,
 సోమసూక్త ప్రదక్షిణాన్ని
నిదానంగా ఎటువంటి
హడావుడి లేకుండా, ప్రశాంతంగా ఆచరించాలి.

🚩🚩శేషశ్రీ

ఇంట్లో నే చికిత్స








A noble doctor




Art




విశికపట్టణం బీచిలో




శ్రీఅచ్యుతాష్టకం



1) నమో భగవతే అచ్యుతాయ
   పాండవమధ్యమమార్గనిర్దేశకాయ
   అశేషపాపదుఃఖసంహరణాయ
   నారదాదిమునీంద్రవందితపదాబ్జాయ ||

2) నమో భగవతే అచ్యుతాయ
   నిర్గుణనిరంజననిర్వికల్పాయ
   రాధికాహృదయకమలనివాసాయ
   భక్తాభీష్టఫలప్రదనీలమేఘాయ ||



3) నమో భగవతే అచ్యుతాయ
   గోపప్రౌఢలాలితబాలగోపాలాయ
   కస్తూరితిలకాంచితఫాలదేశాయ
   నీలలోహితకమలాసనసంస్తుతాయ ||

4) నమో భగవతే అచ్యుతాయ
   యశోదానందప్రియనందనాయ
   మయూరపింఛవంశీధరాయ
   మహేంద్రగర్వాపహారకరారవిందాయ ||






5) నమో భగవతే అచ్యుతాయ
   హలముసలాయుధధరానుజాయ
   అవ్యయానందప్రదదివ్యశరీరాయ
   నామామృతాస్వాదననాదబ్రహ్మాయ ||

6) నమో భగవతే అచ్యుతాయ
   ధర్మోద్ధరణదీక్షాకంకణబద్ధాయ
   శుభమంగళపరంపరాప్రదాయకాయ
   క్షీరదధినవనీతఘృతచోరాయ ||






7) నమో భగవతే అచ్యుతాయ
   గోవర్ధనోద్ధరగోపీజనసంరక్షకాయ 
   గోపబాలకసహఖేలనమానసాయ
   గంధర్వయక్షకిన్నరసేవితాయ ||

8) నమో భగవతే అచ్యుతాయ
   సూర్యచంద్రాగ్నిప్రభాభాసురాయ
   అసంఖ్యాకభక్తజనపూజితాయ
   వనమాలాధరమదనగోపాలాయ ||

      సర్వం శ్రీఅచ్యుతదివ్యచరణారవిందార్పణమస్తు

ఐశ్వర్య_ప్రదాత_శివుడు


#సంభవామి_యుగే_యుగే

      ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు.

శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసంకు చేరుకుంటాడు.

శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు.

కుబేరుడు వచ్చి.. మహాదేవా.. మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు.

శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు.

వస్తూనే... 'అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి.

 పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి..
'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా, శివుడు 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళూ' అన్నాడు పరమశివుడు.

హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది.

ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని బయలుదేరాడు. తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు.

 ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు.. గణపతికి వడ్డించారు.

 కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు.

సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు.

ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.వంటవారికి ఆహారం వండటం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం చూస్తూండగానే ఖాళీ అయిపోయింది.

విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు.

కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

శివా.. శంకరా.. నేవే దిక్కు.. ధానం కి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు.

అప్పుడు శివుడు "కుబేరా! నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పేడు బియ్యం తీసుకుని అహకారం విడిచి, చేసిన తప్పుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు" అన్నాడు.

కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు.

ఆ గుప్పేడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.

మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం.

కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహంకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా.

నీతీ: పెట్టేది కొంచెమైనా అహంతో కాకుండా ప్రేమతో భక్తితో పెట్టడం వల్ల అంతా మంచి జరుగుతుంది.

అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.
 https://www.facebook.com/sambhavami2498/

అందరం భక్తితో " అరుణాచల శివ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

*స్ఫూర్తిదాయకమైన సందేశం*



"ఈ పూట మీరేమీ రాయలేదు కనుక నాకేం పనిలేదు. ఏదైనా
కథ చెప్తారా" అన్నాడు మనోడు.

"కథ కాదు గానీ నిజంగా జరిగిన చిన్న సంఘటన చెప్తా విను"

"చెప్పండి సార్" అంటూ టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. నేను ఏం చెప్పినా రికార్డు చేసుకోవడం మనోడికి అలవాటు.

"మొన్నామధ్య మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను... నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ దంపతులు చాలా హడావుడిగా వున్నారు."

"ఏంటి ఏదో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఏంటి విశేషం" అడిగాను.

"మా అమ్మాయి సుధ తెల్సుగా సుధ. దానికి మంచి ఉద్యోగం వచ్చింది. ఇవాళ అది మొదటి నెల జీతం అందుకునే రోజు.
అందుకని.. దిష్టి తీయడం.. స్వీట్ తినిపించడం.. "అంటూ చాలా ఉద్వేగంగా, ఉత్సాహంగా చెప్తుండగానే సుధ వచ్చింది. వరండాలో చీకట్లో వున్న మేము సుధకి కనిపించము. లోపలికి వెళ్ళిపోయింది.

సుధ లోపలికి వెళ్ళగానే నా స్నేహితుడి ముఖంలోకి చూశాను. వెలిగి పోతోంది.

క్షణం తర్వాత లోపల్నించి మాటలు వినబడుతున్నాయి.
" తొలి జీతం కదా. నాన్న గారికి ఇవ్వమ్మా"

"ఇవ్వను" తెగేసి చెప్పినట్టు సుధ గొంతు వినబడింది.

అప్రయత్నంగా మా ఫ్రెండ్ ముఖం వంక చూశాను. ఫ్యూజ్ పోయిన బల్బ్ లా మాడిపోయి వుంది. నేను అక్కడ వుండడం సబబు కాదనిపించి లేవబోయాను. నా చెయ్యి పట్టుకుని కూర్చోమన్నట్టు లాగాడు. వాడి చెయ్యి సన్నగా వణుకుతోంది.

" తప్పే.. అలా అనకూడదు.. నీ సంతోషం చూడాలని నువ్వు
ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు నాన్నగారు.వెళ్ళు.. వెళ్ళి జీతం ఇచ్చిరా పో"

"ఏంటమ్మా.. ఒకసారి చెప్తే అర్ధం కాదా.. నేను ఇవ్వను.
ఆ టేబుల్ మీద పెడతా.. వచ్చి తీసుకోమను."

ఈ సంభాషణ వింటున్న మా వాడు తలొంచుకుని కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్ళు నిలిచాయేమో చీకట్లో నాకు కనబడలేదు. చెంప ఛెళ్ళుమన్న శబ్దం.

"అమ్మా"

"ఛీ..ప్రేమ లేదు కనీసం విశ్వాసం కూడా లేదే నీకు" ఏడుపు దాచుకో లేకపోతోంది తల్లి.

" అమ్మా.. ఎంతసేపూ.. నీ వైపునుండి ఆలోచించడమేనా.. నేనెందుకు ఇవ్వనంటున్నానో అడగవా…"

"చెప్పేడు .."

"అమ్మా.. చిన్నప్పట్నించీ నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచాడు.. చిన్నప్పటి ఐస్ క్రీమ్ దగ్గర్నించి ఇవాళ పొద్దున్న
ఆఫీస్ కి వెళ్ళడానికి ఆటో ఖర్చుల దాకా అన్నీ నాన్నే ఇచ్చేవాడు. అలా ఇచ్చిన ప్రతిసారీ నాన్న చేయి పైన నా చేయి కిందా వుండేది. అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అని జీతం నాన్నకిస్తే నాన్న చేయి కిందా నా చేయి పైనా వుంటుందమ్మా.. అది నాకిష్టం లేదు. నాన్న చేయి ఎప్పుడూ పైనే వుండాలమ్మా. అందుకే ఇవ్వనంటున్నానమ్మా" అంటూ భోరుమని ఏడ్చింది సుధ.

అది విన్న మా ఫ్రెండ్ భావోద్వేగంతో " అమ్మా సుధా.. నా తల్లీ " అని పెద్దగా ఏడుస్తూ లోపలికి పరిగెత్తాడు.

అని చెప్పి మనోడి వంక చూశాను. కళ్ళనిండా నీళ్ళు. తుడుచుకోవడంతో కూడా మరిచి పోయి చూస్తున్నాడు.

"దీని వల్ల నీకేం అర్ధం అయింది. మనకన్నా వయసులో పెద్ద వారికి మన చేయి పైన వుండేలా ఇవ్వకూడదు. దోసిలిలో పట్టుకుని వారిని తీసుకోమనాలి. అంతేకాదు దేవుడికి పువ్వులు, పత్రి లాంటివి వేసేటప్పుడు మనం ఇస్తున్నట్లు కాకుండా అరచేతిలో పెట్టుకుని సమర్పించాలి. అది మన సంస్కృతి. మన సంప్రదాయం. "

" సార్.. మీరు చెప్పినది టైప్ చేసి ఇస్తా.. ఇప్పుడే పోస్ట్ చేయండి సార్.. "అంటూ సిస్టం వైపు పరిగెత్తాడు మనోడు.

భక్తుడు ,భగవంతునితో

 భక్తుడు ,భగవంతునితో ఇలాఅంటున్నాడు
దయచూపమని ప్రార్థిస్తున్నాడు.

మనలోభేదములేమియున్ గలుగ వీ మాయాస్వభావంబు నెంతనివర్ణింతును,
లోకసంగతుల,సత్యంబున్ విచారింపనేరని మోహంబెసగంగజేసి,
అయథార్థంబున్ బ్రబోధించు
జంత,నిరోధింపవెదీని త్రుళ్ళడచిశాస్తా!వాసుదేవప్రభూ‌!

జీవునకు దేవునకుమధ్య మాయచేరి సత్యాన్ని
గుర్తింపనీయదు.భగవంతునిఅనుగ్రహంవలననే
మాయనుదాటి ఆపరమాత్మనుచేరాలి.
పరమాణుస్ధితి ,
పర్వతాకృతి దగన్ భాసించుచైతన్య,
మబ్బురమున్ గూర్చుచు
విశ్వమంతటను, సంపూర్ణంబుగా నిండియుండురహస్యంబు
సహస్రనామములుచాటున్,
వేదవేద్యంబు, తత్పరతత్వానుభవం
బొసంగు సులభోపాయంబు దామోదరా‌!

విశ్వమంతావిష్ణువే ,అనురహస్యమునుబోధించు
నవి ఆసహస్రనామములు.
 భక్తుడు ,భగవంతునితో ఇలాఅంటున్నాడు
దయచూపమని ప్రార్థిస్తున్నాడు.

మనలోభేదములేమియున్ గలుగ వీ మాయాస్వభావంబు నెంతనివర్ణింతును,
లోకసంగతుల,సత్యంబున్ విచారింపనేరని మోహంబెసగంగజేసి,
అయథార్థంబున్ బ్రబోధించు
జంత,నిరోధింపవెదీని త్రుళ్ళడచిశాస్తా!వాసుదేవప్రభూ‌!

జీవునకు దేవునకుమధ్య మాయచేరి సత్యాన్ని
గుర్తింపనీయదు.భగవంతునిఅనుగ్రహంవలననే
మాయనుదాటి ఆపరమాత్మనుచేరాలి.

Three prayers in temple




*భర్తృహరి నీతిశతకము*



*కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా*
*న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।*
*వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే*
*క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥*

భావార్థం:

వాక్కు అనగా విద్య. ఆ వాక్కు యొక్క ప్రాముఖ్యాన్ని, దాని విలువని ప్రస్ఫుటముగా తెలియజెప్పే భర్తృహరి నీతిశతకములోని చక్కటి సుభాషితము.

భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు పురుషుని అలంకరింపవు.

చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశించునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాల కేశాలంకరణల పురుషునికి నిజమైన అలంకరణలు కాజాలవు.

వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన అలంకార ప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాదిభూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడియున్నట్టి వాక్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము.

పద్యభారతీసంతతికి ప్రణామాలు.


శ్రీ సీతారామ కల్యాణం అనే గ్రంథంలో 218, 219 పద్యములు.
      స హత్వా రాక్షసాన్ సర్వాన్
      యజ్ఞఘ్నాన్ రఘునందనః।
      ఋషిభిః పూజిత స్తత్ర
      యథేంద్రో విజయే పురా॥-1.30.23
          ........................
      కృతార్థోఽస్మి మహాబాహో
      కృతం గురువచ స్త్వయా।
      సిద్ధాశ్రమ మిదం సత్యం
      కృతం రామ మహాయశః॥-1.30.25
అని విరచించిన వాల్మీకి మహర్షికి ప్రణామాలు.
       యజ్ఞం ఫలవంతంగా సమాప్త మయ్యేందుకు రఘురాముడు దైత్యులను సంహరించగా, దేవలోకంలో దేవతలు ఇంద్రుని ఏ విధంగా స్తుతిస్తారో ఆవిధంగా సిద్ధాశ్రమంలోని మునులు రాముని స్తుతించినారు. పరమానందమును పొందిన విశ్వామిత్ర మహర్షి “ఓ దశరథరామా! తండ్రిమాటను శిరసావహించి నాయజ్ఞమును చక్కగా రక్షించి విజయసిద్ధితో ప్రకాశిస్తూ ఉన్నావు. నా ఆశ్రమమునకు కృతార్థత సిద్ధించింది. ఇప్పుడు శాంతిధామంగా శ్రీమంతంగా ఉన్న ఈ సిద్ధాశ్రమం ఇక నామసార్థకతను కూడా పొందగలదు అని రాముని ప్రస్తుతించినాడు.
           ఈ విషయాన్ని ఈ పద్యములలో తెలియజేస్తూ ఉన్నాను.

*సవము* సమాప్తం బగుటకు
భువి దైత్యుల గూల్చె రామభూవిభు డతనిన్
గవులై పొగడిరి మౌనులు
దివి నింద్రు నుతించునట్టి దివిజుల మాడ్కిన్.{218}

రామున్ బల్కె మునీంద్రు డిట్లు “క్రతువున్ రక్షించినావయ్య! సం
క్షేమం బబ్బగఁ దండ్రిమాట వినుచున్ జెల్వొందినావయ్య! శ్రీ
ధామంబయ్యె మదాశ్రమంబును కృతార్థత్వంబుతో, నింక సు
శ్రీమంతంబుగ నామసార్థకత నీ సిద్ధాశ్రమం బొప్పెడిన్”.{219}
           రచన:-కోట రాజశేఖర్, కోవూరు, నెల్లూరు.
పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

   ఆవుపెరుగు మిక్కిలి జిడ్డుగా ఉండును. శ్లేష్మాన్ని కలుగచేయును . రక్తం చెడగొట్టును . గ్రామాల యందు పాడిపంటలు విశేషముగా ఉన్నను మనుష్యులు రోగాలబారిన పడుటకు ముఖ్యకారణం పెరుగు తీసుకొను విషయంలో నియమాలు పాటించకపోవడమే ప్రధాన కారణం. రాత్రి యందు పెరుగు ఉపయోగించుట మంచిది కాదు.

          పెరుగు ప్రీతికరమైన పదార్థం కావడం మూలాన పిల్లలు , పెద్దలు మితిమీరి సేవించెదరు. అందువలన రక్తం చెడి రక్తపిత్త రోగం , విసర్పి కలుగును. విసర్పి అనగా శరీరం నందు రక్తం చెడి మాంసం , చర్మములతో కలిసి సర్పం పాకే విధముగా తొందరగా శరీరం అంతా గుడ్లగుడ్లగా ఉండును. ఇది తరచుగా చిన్నపిల్లలకు వచ్చును. కుష్టు , పాండురోగం , పచ్చకామెర్లు మొదలగు వ్యాధులు వచ్చును. పెరుగు వేడిచేయును . అదే దానికి కొంచం నీరు కలిపి మజ్జిగలా చేసుకుని తాగితే చలువచేయును . అందుకే వేసవికాలం నందు పెరుగు తీసుకోరాదు . శీతాకాలం , వర్షాకాలం నందు పెరుగు పగలు తీసుకోవచ్చు .

              మూత్రం బొట్లుబొట్లుగా పడు వ్యాధి నందు , రొంప, చలిజ్వరం , నోటికి రుచి లేకపోవటం , శరీరం కృశించి ఉండు రోగములు కలిగి ఉండువారు పెరుగు వాడటం మంచిది . పెరుగు శుక్రాన్ని పెంచును.

  పెరుగు తీసుకొనువారు పాటించవలసిన నియమాలు -

 * పెరుగుతో కోడిమాంసాన్ని భుజించరాదు .

 * పెరుగుతో నిమ్మపండు భుజించరాదు .

 * పెరుగుతో అరటిపండు భుజించరాదు .

 * పెరుగు వేడివేడి అన్నంతో పాటు తినరాదు.

 * పెరుగు రాత్రి పూట భుజించరాదు .శరీరంలో కఫం వృద్ధిచెందును. మరియు జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.

    పగలు పెరుగు భుజించువారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవలెను.

 * తేనె - పెరుగు = మంచి రుచి కలుగును.

 * ఉసిరిక పచ్చడి - పెరుగు = శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను పోగొట్టును .

 * నెయ్యి - చక్కెర - పెరుగు = వాతాన్ని తగ్గించును , ఆహారాన్ని జీర్ణం చేయును .

 * చక్కెర - పెరుగు = దప్పిక, తాపాన్ని హరించును .

 * పెసరపప్పు - పెరుగు = రక్తంలోని వాతాన్ని హరించును .

  మజ్జిగ ఉపయోగాలు -

 
    పెరుగునకు నాలుగోవ భాగం నీరు కలిపి బాగుగా మజ్జిగ తయారుచేయవలెను. దానిలో వెన్న తీయరాదు. ఇటువంటి మజ్జిగని ఉదయం , మధ్యాహ్న భోజనంలో ఉపయోగించుచున్న ఏ వ్యాధితోను బాధపడరు. బాగుగా చిక్కగా ఉండి వెన్నతీయని మజ్జిగ పుష్టిని కలుగచేయును . కఫాన్ని కలిగించును. శ్రమను , దప్పికను పొగొట్టును. బాగుగా చిలికి వెన్నతీసిన మజ్జిగ తేలికగా జీర్ణం అగును.

          శరీరంలో వాతం పెరిగినపుడు మజ్జిగలో శొంటి, సైన్ధవలవణం లేదా ఉప్పు కలిపి లొపలికి తీసికొనవలెను. శరీరంలో పైత్యం పెరిగినపుడు మజ్జిగతో పంచదార కలిపి వాడవలెను. శరీరంలో కఫం ఎక్కువైనప్పుడు శొంటి, పిప్పిళ్లు , మిరియాల చూర్ణం కలిపి మజ్జిగతో కలిపి తాగవలెను .

                మన శరీరంలో జఠరాగ్ని మందగించి ఆకలి లేనపుడు మరియు వాత వ్యాధుల్లో మజ్జిగ అమృతంగా పనిచేయును . విషం , వాంతులు , నోటి నుండి నీరు కారుట, విషమజ్వరం , పాండువు , రక్తవిరేచనాలు , మేథస్సు, మొలలు , భగన్దరం , అతిసారం , ప్లీహానికి సంబంధించిన వ్యాధులు , ఉదరరోగం , బొల్లి , కుష్టు , క్రిములను మొదలయిన వాటిని మజ్జిగ సేవించుట వలన పోగొట్టుకోవచ్చు.

          మజ్జిగ భూమిపైన పోసిన అక్కడ ఉన్న గడ్డిపోచలు , పచ్చిక వంటివి మాడిపోయి మరలా మొలవవు. ఇదే సూత్రం మొలలు వ్యాధికి సంక్రమించును. మొలల వ్యాధిలో మొలకలు ఊడిపోవుటకు మజ్జిగ సేవనం తప్పనిసరి . మజ్జిగ తాగుట వలన వాత, శ్లేష్మములచే ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయి రక్తప్రసరణ సాఫీగా జరుగును. దీనివలన శరీరపుష్టి పెరుగును . మజ్జిగ తాగుట వలన 80 రకాల వాతరోగాలు నయం అగును.

  మజ్జిగలోని రకాలు -

  * పెరుగును కవ్వముతో చిలికి అందు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ.

 * పెరుగును చక్కగా కవ్వముతో చిలికి అందు వెన్నను సగం మాత్రమే తీసివేసిన మజ్జిగ .

 * పెరుగును చక్కగా కవ్వముతో చిలికి వెన్నను ఎంతమాత్రం తీయకుండా ఉంచిన మజ్జిగ.

     కఫం ఎక్కువ ఉన్నప్పుడు , అగ్ని మందగించినప్పుడు మిక్కిలి బలహీనంగా ఉన్నప్పుడు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ వాడవలెను.

      పైత్యం ఎక్కువ అయ్యి , అగ్నిమాంద్యం ఉన్నప్పుడు బలం మధ్యమంగా ఉన్నప్పుడు సగం వెన్న తీసిన మజ్జిగను వాడాలి.

     వాతం ఎక్కువుగా ఉన్నప్పుడు వెన్న అసలు తీయని మజ్జిగని వాడవలెను.


  వెన్న ఉపయోగాలు -

   
         ఆవు వెన్న బలం కలిగించును. జఠరాగ్ని పెంచును. వాతం మరియు పిత్తాన్ని పోగొట్టును రక్తదోషాలను, క్షయరోగం, మొలలు , దగ్గు పోగొట్టును . చిన్నపిల్లలకు అమృతం వలే పనిచేయును . బక్కచిక్కి ఉన్నచిన్నపిల్లలకు ఉదయాన్నే తేనె , ఆవు వెన్న , పంచదార కలిపి తినిపించిన బలం కలుగును. క్షయరోగులు బాగా చిక్కి శల్యం అయినపుడు ఈ ప్రయోగం చాలా బాగా పనిచేయును .

          గేదె పెరుగు బలకరం . మిక్కిలి చమురు కలిగి ఉండును. వాతం , శ్లేష్మం కలుగచేయును . మధురంగా ఉండును. పచ్చిపాలు తీసిన వెన్న సేవించిన కండ్లకు మంచిది . ఎల్లప్పుడూ అప్పటికప్పుడు తీసిన వెన్న మంచిది . నిలువ వెన్న చాలా రోగములను తెచ్చిపెట్టును. కావున విడిచిపెట్టవలెను.

   
   గమనిక -

           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు .

                 కాళహస్తి వేంకటేశ్వరరావు

             అనువంశిక ఆయుర్వేద వైద్యులు

                         9885030034

అభిషేక మహిమలు



గరుడపురాణంలో అనేక ద్రవ్యాలతో చేసి పూజిస్తే ఏయే ఫలాలు పొందవచ్చో చెప్పబడినది.....!!
రెండుపాళ్ళు కస్తూరి, నాలుగు పాళ్ళు చందనం,మూడుపాళ్ళు కుంకుమ కలిపి శివలింగాన్ని చేసి పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.
వాసన గల పుష్పాలతో లింగం తయారుచేసి పూజిస్తే భూమినీ,రాజ్యాన్ని పొందవచ్చు.
స్వచ్ఛమైన ప్రదేశంలో కపిల గోవుల పేడతో శివలింగం చేసి పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. దీనిని గోశకలింగం అంటారు.
నాలుకా లింగం అనగా ఇసుకతో లింగం చేసి పూజిస్తే విద్యాధరత్వం తదుపరి శివసాయుజ్యం కలుగుతుంది.
యవగోదూమశాలిజలింగం అనగా జొన్నలు,గోధుమలు,బియ్యం కలిపి పిండి పట్టించి ఆ పిండితో లింగాన్ని చేసి పూజిస్తే పుత్రలాభం కలుగుతుంది,ధనం వర్ధిల్లుతుంది.
సీతాఖండలింగం- పటిక బెల్లం తో లింగం చేసి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది.
తిలపిష్టలింగం- నువ్వులను రుబ్బి ముద్దతో లింగం చేసి పూజిస్తే కోరికలు నెరవేరుతాయి.
భస్మలింగం- భస్మలింగ పూజ సర్వ ఫలప్రదం.
గుడలింగం- బెల్లముతో కాని,చక్కెరతో కాని చేసి పూజిస్తే సుఖాలన్ని కలుగుతాయి.
వంశాంకురలింగం- వెదురు చిగుళ్ళతో లింగం చేసి పూజిస్తే వంశం నిలుస్తుంది.
పిష్ఠలింగం- పిండిలింగం విద్యాప్రదం.
దధిదుగ్ధలింగం-పెరుగులో నీళ్ళు వత్తి లింగం చేసి పూజిస్తే సంపద,సుఖం వస్తాయి.
ధాన్యలింగం-ధాన్యప్రదం.
ధాత్రీలింగం-ఉసిరికాయలతో లింగం చేసి పూజిస్తే మక్తిప్రదం.
ఫలలింగం-ఫలప్రదం.
నవనీత(వెన్న)లింగం-కీర్తి,సౌభాగ్యకరం.
దూర్వాకుండజ(గరిక)లింగం-అపమృత్యునివారకం.
కర్పూరలింగం- ముక్తిప్రదం.
అయస్కాంతలింగం-అయస్కంతాన్ని లింగాకారంగా చేసి పూజిస్తే సిద్ధిని కలిగిస్తుంది.
మౌకికలింగం-ముత్యాల భస్మంతో చేసిన లింగం సౌభాగ్యాన్నిస్తుంది.
సువర్ణలింగం-బంగారు లింగం మహాముక్తిప్రదం.
రజతలింగం- వెండిలింగం సంపత్కరం.
పిత్తలలింగం- కాంస్యలింగం(ఇత్తడి,కంచు లింగాలు)ముక్తినిస్తాయి.
త్రపులింగం- ఆయసలింగం,
సీసలింగం(తగరం,తుత్తం,ఇనుము) శతృనాశకాలు.
అష్టధాతులింగం- సర్వసిద్ధిప్రదం.
అష్టలోహలింగం- కుష్ఠు వ్యాధిహరం.
వైఢూర్యలింగం- శతృగర్వ నివారకం.
స్ఫటికలింగం-సర్వకామప్రదం.
పాదరసలింగం- మహైశ్వర్యప్రదం.
రాగి,సీసం,శంఖం,ఇనుము,గాజు మన్నగువాటితో తయారు చేసిన లింగాలు కలియుగంలో వాడరాదు.
లింగపూజ పార్వతీపరమేశ్వరుల పూజ

బ్రహ్మరాత

_*👌*మన నుదిటిపై బ్రహ్మ రాసిన బ్రహ్మరాతను మార్చగల శక్తి ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే అది ఎలా పనిచేస్తుంది. దాని విధివిధానాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దామా..*_👌

       _**రామాపురం అనే ఊరిలో రామశర్మ అనే ఒక మంచి సమర్థుడైన గురువు గారు తన ఆశ్రమంలో శిష్యులకు శిక్షణనిస్తూ వుండేవారు. ఆయన సకల శాస్త్రాలు, విద్యలు తెలిసిన వారు. ఆయన భార్య కూడా పేరుకు తగినట్లు సాక్షాత్తూ అన్నపూర్ణా దేవియే. ఆమె తమ ఆశ్రమంలోని శిష్యులను తన కన్నబిడ్డల్లా ప్రేమగా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదు అనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా, ఒక నాడు ఆ గురు దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ బాలుడు వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు.*_

    _**ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోక పోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా శిక్షణ ముగిసిందని అతడిని తిరిగి రామశర్మ దగ్గరకు పంపించారు. ఇదిలా వుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభ మయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటే కూర్చుని ఎవరు పుడతారా అని ఆలోచించుకొంటూ ఉండగా, లోపలి నుండి చంటి బిడ్డల ఏడుపులు వినిపించాయి.*_

       _**గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. నిజానికి మామూలు మనుషులకు అతను కనిపించి వుండేవాడే కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతను ఎవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ '' అని అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరా అని వినమ్రపూరితంగా అడిగాడు.*_

      _**బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియ జెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకుని ఇలా చెప్పాడు.. నాయనా.. వీరు పూర్వజన్మలో చేసిన పాప కర్మల వల్ల ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవిత కాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు.*_

     _**సాక్షాత్తూ దైవసమానులైన తన గురు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువు దగ్గరకు వెళ్ళి గురూజీ బ్రహ్మ దేవుడు రాసిన తలరాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యమో కాదో అనేది నాకు తెలియదు వేరే పెద్ద పెద్ద జ్ణానులకు తెలిసుండవచ్చు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించ సాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా.. అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య, అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది.*_

       _**ఒక రోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది తీర్థయాత్రలు చేసి వస్తానంటూ బయలుదేరి, పెద్ద పెద్ద జ్ణానులను కలవడానికి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు. వారందరిని వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా అని, దానికి వారికి తెలిసినదేదో వసంతుడికి చెప్పారు. చివరికి ఒక గురువు గారి వద్ద కర్మ సిధ్ధాంతాన్ని అభ్యసించి అది మన తలరాతను మార్చ గలదని ప్రయోగ పూర్వకంగా తెలుసుకొన్నాడు. ఇక వెనుదిరిగి వచ్చాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలని ఆశ్రమానికి వచ్చాడు. అప్పటికే అక్కడి పరిస్థితులు తారుమారయ్యాయి. గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు.*_

       _**తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా.. అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ.. నువ్వు బాధపడకు. ఇప్పటి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా.. ఇక నుండి నువ్వు ఎలా చెపితే అలానే చేస్తాను'' అన్నాడు శంకరుడు.*_

       _**ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంతకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఆ ఆవుని అమ్మేసాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలు దేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురంటూ తిని ఆకలి తీర్చుకున్నారు.*_

       _**తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా అన్నం వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా.. ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయి పోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు. దానికి వసంతుడు తమ్ముడూ.. నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు.*_

      _**ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి బ్రహ్మయే రాత్రికి రాత్రి తనే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలు దేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.*_

        _**వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా.. నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకు పోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ.. ఊరుకోమ్మా.. ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు.*_

       _**ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా.. ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అంతే అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళి పోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తుండగా ఒక మహాపురుషుడు లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తను రాసిన తల రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు.*_

       _**అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, వారి తలరాతలను మార్చి గురు దంపతుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు భగవంతుడు. అదే విషయాన్ని నిరూపించాడు వసంతుడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చ గలిగేది ఒక్క గురువే. కాబట్టి మిత్రులారా ! మీరు కూడా ఒక సద్గురువును ఆశ్రయించి గురు బోధనల ద్వారా మీ తలరాతను మార్చుకో గలరని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.*_👌

_*🤘*సర్వే జనా సుఖినోభవంతు**_🤘

       _*👌*ధర్మో రక్షతి రక్షతః **_👌

#హిందువులు అల్పసంఖ్యాకులే !


---సామవేదం షణ్ముఖశర్మ

భారతదేశంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కానీ మరో కోణంలో అల్ప సంఖ్యాకులు. మనం మైనారిటీ అనుకుంటున్న వారే అధికసంఖ్యాకులనడం సత్యదూరం కాదు. ఒక్కసారి పరిశీలిస్తే ఈ వాస్తవాన్ని అంగీకరించుతాం. హిందువులు పేరుకి ఎక్కువ సంఖ్యలో ఉన్నా, అందులో కొందరు కేటాయింపుల కోసం హిందువులుగా చెలామణి అవుతూ, ఇతరుల మతాల్లోకి మారిన వారు.

మరికొందరు - ఇందులో ఉన్నా ఈ మతం పట్ల శ్రద్ధ, హిందువులుగా జీవించాలనే ఆసక్తి, ఈ మతాన్ని కాపాడుకోవాలనే భక్తి ఏ మాత్రం లేనివారు. ఏదో పండక్కో, పబ్బానికో, పురుటికో, చావుకో కాసింత హిందూ పద్దతి అవలంబిస్తారు. మొక్కులు తీర్చుకోడానికి గుళ్ళోకి వెళతారు. అంతేకానీ హైందవ ధర్మానికీ, ఆలయాలకీ ప్రమాదం వాటిల్లుతున్నా స్పందించరు. నాయకులు వివక్ష చూపిస్తున్నా చలించరు. పైగా ‘ఏ మతమైతే ఏం పోయింది?’ అని ఉదాసీనంగా ఉంటారు.
ఇంకొందరు - నాస్తికులై హిందూ గ్రంథాలను, దైవాలను, సంప్రదాయాలను, ఆలయాలను దుయ్యపడుతుంటారు. పుస్తకాలు రాస్తుంటారు.

ఇలా హిందువుల్లో మూడు రకాల వారిని మినహాయిస్తే - శ్రద్ధగా ధర్మాన్ని అవలంబిస్తున్నవారు అల్ప సంఖ్యాకులే. నిజమైన హిందువులు వీరే. దీనికి వ్యతిరేకంగా-ఇతర మతాల్లో వారు నూటికి నూరు పాళ్ళు ఒకే రకంగా ఉంటారు. కుటుంబా లన్నీ తమ మతాన్ని మించిన మతం లేదనే తీవ్ర అభినివేశంలో ఉంటారు. తమ మత గ్రంథాలపై, శ్రద్ధా కేంద్రాలపై, అలవాట్లపై వ్యతిరేకంగా మాట్లాడరు. ఇతర మతాలను అణచివేయడంలో, దూషించడంలో వెనుకాడనంత ఉగ్రాభిమానం కూడా ఉంటుంది. పిల్లా, పెద్దా, ఆడా, మగా ఖచ్చితంగా మత పద్దతులు అధ్యయనం చేస్తారు, అవలంబిస్తారు. తమ మత నాయకుడు అవినీతిపరుడైనా, హింసా స్వభావి అయినా కిమ్మనరు. పైగా ఒకే తాటిపై నిలబడి అతడిని విజయుడ్ని చేస్తారు. తమ మతాల పేరున తీవ్రవాదం ఉగ్రవాదాలతో ఉత్పాతాలు సృష్టిస్తున్న సంస్థల్ని కూడా పల్లెత్తు మాట అనరు.

ఇలా అన్య మతాలు రెండూ చక్కని అనుష్ఠాన నిష్ఠతో ఉంటారు. వారిలో రెండో రకం లేదు. అందుకే వాళ్ళు సంఖ్యలోనూ, అనుష్ఠానంలోనూ, దృఢంగా ఉంటారు. వాళ్ళిద్దరి అభిలాష, తమ మతం ఈ దేశాన్ని ఏలాలి. వాళ్ళ లక్ష్యం హిందూమతం అణచివేయబడాలి. వీరి తపన ఆ దిశగా కృషి చేయడమే. వీరిలో ఉన్న ఈ ఏకతాటి లక్షణాన్ని గమనించిన హిందూ(పుట్టుకతో) నాయకులు కూడా వీళ్ళని మురిపిస్తూ, మెప్పిస్తూ, బుజ్జగిస్తూ, జాతి సంపద పంచిపెడుతుంటారు. వాళ్ళ పండుగల్లో వెళ్ళి వాళ్ళ వేషాలు వేసుకొని విందులారగిస్తుంటారు. కానీ ఆ మతాలకి చెందిన ఒక్క నాయకుడు కూడా హిందూ పండగల్లో కనపడరు. వీలైతే ఆంక్షలు పెట్టేలా గొడవలు చేస్తారు. ఈ హిందూ నాయకులకు తెలుసు. నాలుగు రకాల హిందువుల్లో మళ్ళీ ‘మా కులం వాడే రావాలి - కావాలి’ అనే గోల చేసే నలభై రకాలున్నారని. వీరు ఏనాడూ హిందువులను సంఘటిత పరచలేరని.

భారతదేశంలో నిన్న కాక మొన్న జరిగిన తాజా ఎన్నికల ఫలంగా పేట్రేగిపోయిన కొందరు దౌర్జన్యంగా ఆకుపచ్చ జండాలతో దాడులు చేసి ‘పాకిస్తాన్‍కీ జై .....’ అంటూ బిగ్గరగా నినాదాలు చేసినా - ఏ రక్షణ వ్యవస్థా, ఏ నాయకమ్మన్యుడూ నోరెత్తలేదు. చర్య తీసుకోలేదు. దేశ భద్రతకి, వ్యవస్థకీ పెనుప్రమాదం పొంచి ఉందని తెలిసినా స్పందన లేదు. మతం మారడం లేదనే అక్కసుతో ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఒక దేవీ మందిర ఉత్సవ సమయంలో ఆలయంలో చొరబడి ప్రసాదంలో విషం కలిపి అనేకమంది అమాయకుల మరణానికి కారకులయ్యారు.

ఇటువంటివి హిందూ మనుగడకి మాత్రమే కాదు, దేశ క్షేమానికీ, శాంతి సామరస్యాలకు ప్రమాదకరమైన పరిస్థితి. అల్పసంఖ్యాకులైన హిందువులు ఏం చేయగలరు? అన్ని మతాలవారితో సహా అందరం హాయిగా ఉండాలి - అని కోరుకునే స్వభావం సహజంగా కలిగిన హిందువులు బలంగా ఉండకపోతే, ఈ దేశంలో ఉనికి కూడా అసాధ్యమౌతుంది. ఇప్పుడు, వేల ఏళ్ళ క్రితం ఉన్న పరాయి పాలనకు భిన్నంగా ఏమీ లేదు. కేరళ, పశ్చిమబెంగాల్‍, కాశ్మీర్‍, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హిందువులు మనుగడ సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‍, మధ్యప్రదేశ్‍, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో నేటికీ కొన్ని ప్రాంతాలలో (అన్యుల ప్రాధాన్యం ఉన్నవి) . హిందువులు అనుక్షణం అభద్రతతో, భయాందోళన ల్లోనే బిక్కు బిక్కుమంటున్నారు.

కొందరు మేధావులు గణాంక వివరాలతో సహా వాస్తవాల్ని చెబుతుంటే అవి ఫేస్‍బుక్కుల్లో, వాట్సాప్‍లలో, యూ ట్యూబ్‍లలో లైకింగ్‍లు, షేరింగ్‍లతో సరిపోతున్నాయి. సరియైన ప్రతిచర్య లేదు. ప్రధాన మాధ్యమాలన్నీ వాస్తవాల్ని కప్పిపెడుతున్నాయి. తమ కుల నాయకులకు భజనలు చేస్తూ, పల్లకీలు మోయడంతోనే కాలక్షేపం చేస్తున్నాయి. గతచరిత్రలో భారతీయతపై, హిందూధర్మంపై జరిగిన అన్యుల దాడులు, దౌర్జన్యాలు గానీ, నేడు జరుగుతున్న కిరాతకాలు గానీ నేడు హిందూ యువతకి తెలియవు. వారు ‘నోటా’వర్గంలో ఉంటారు. బాధ్యతతో దేశ ధర్మాలను కాపాడుకునే ప్రయత్నం చేయరు.

ఈ నేపథ్యంలో ఈ దేశాన్నీ, ధర్మాన్నీ పరిరక్షించమని పరమేశ్వరుని ప్రార్థించడం కన్నా ఏమి చేయగలం! స్పందన లేని స్వార్ధజాతిని మేల్కొల్పమని వేడుకోవడం కన్నా ఏమి సాధించగలం!
[ ఋషిపీఠం పత్రిక సౌజన్యంతో ]

ఆహారం

🕉️🕉️జై గురుదేవ్🕉️🕉️
  🌹ఓం సాయి రాం🌹

మన శరీరం లోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో... మలినంగా బయటికి  వెళ్లిపోవాలి, లేకపోతే  జబ్బులు.

మన శరీరం లోకి వెల్లిన నీరు 4 గంటల్లో…  బయటికి వెళ్లిపోవాలి, లేకపోతే  జబ్బులు.

మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా… బయటికి వెళ్లిపోవాలి లేకపోతే మనం రోగ గ్రస్థులం అవుతాం.

మరి మనలోకి చేరిన కోపం, అసూయ, ద్వేషం, మోసం... ఇలాంటివన్నీ సంవత్సరాలుగా మనలోనే ఉంటే... ఏమౌతుందో తెలుసా...  మనం నిత్య రోగగ్రస్తులుగా అవుతాం.

కమాశ్చ, క్రోధశ్చ,లోబశ్చ దేహే తిష్ఠంతి తస్కరా:
 జ్ఞాన రత్నప హారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త

(కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అనే ఆరుగురు శత్రువులు ఈ జ్ఞానమనే రత్నమును అపహరించడం కోసం నీ దేహమనే తిష్ట వేసి ఉన్నారు. జాగరూకుడవై ఉండు.)

అందుకే ఋషులు అంటారు... "మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్న మూర్ఖులం... నిజానికి మనం రోజూ కొద్దీ కొద్దీగా మరణిస్తున్నాం.  మనకు వయసు పెరిగితే... ఆయుష్షు తగ్గినట్టా? పెరిగినట్టా?... మనం ప్రతి రోజూ... నెగెటివ్ ఎనర్జీ లతో కొద్ది కొద్దిగా మరణిస్తున్నామన్న చేదు నిజాన్ని త్వరగా గ్రహించాలి.

మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని...  మన జీవితాల్ని మృతప్రాయం చేస్తున్న కోపాన్ని, ఒత్తిడిని, ద్వేషాన్ని, బద్ధకాన్ని, అనారోగ్యాన్ని…  ప్రతి రోజూ ధ్యానం, యోగ చెయ్యడం  ద్వారా ప్రాణ శక్తిని ఎక్కువగా పొంది నెగెటివ్ ఎనర్జీ దూరం చెయ్యాలి.  మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణ శక్తిని చేర్చే ఏకైక మార్గం  ధ్యానం, యోగాయే...

అందుకే భారతీయ ఋషులు ధ్యానం, యోగ మార్గాన్నే అనుసరించారు.

రోజూ ధ్యానం, యోగ  చెయ్యండి... ఆరోగ్యంగా  జీవించండి.

శ్రీ బాల త్రిపుర సుందరి దేవి

*🌼🌿త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మ వారి దేవాలయం, ప్రకాశం జిల్లా🌼🌿*

త్రిపురాంతకం బాల త్రిపుర సుందరీ దేవి, పార్వతీ సహిత త్రిపురాంతకేశ్వరుల నివాస భూమి త్రిపురాంతకం. స్వామి వారు కొండ ఎగువన ఉంటారు. అమ్మ వారు కొండ దిగువ భాగాన ఉండి భక్తులను కటాక్షిస్తారు…అమ్మ వారు చిదగ్ని గుండం నుండి ఆవిర్భవించారు.జపమాల పుస్తకాన్ని ధరించి శ్వేతకమలాన్ని అధిష్టించి అమ్మవారు చిన్న రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించినంతనే దేవీ ఉపాసన సిద్ధి లభిస్తుంది. ప్రశాంతతకు మారుపేరుగా, ప్రకృతి అందాలకు నెలవుగా మారిన ఈ పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతుంది…


శివుడు కొలువు దీరిన అతి పురాతన ప్రదేశం ఈ త్రిపురాంతకం. శ్రీశైలం కంటే అతి పురాతనమైన మహా శైవ ధామం. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇచ్చట నడయాడాడు. అందుకే త్రిపురాంతకం శ్రీశైలానికి ప్రధాన ద్వారం అయింది.అమ్మ వారి గర్భాలయం, పంచముఖ స్వయంభుజాల లింగం,మేరు చక్రం మధ్యగల జలలింగం పై, అభిషేకం చేయబడ్డ జలం భూ చక్రపీఠము గుండా క్రిందకు జారి పాతాళచక్రము మధ్య రాసాలింగం పై పడటం ఒక అద్భుత దృశ్యం ఇది చూసి తీరాలి.


స్వామి వారు శ్రీ చక్ర ఆకార నిర్మిత ఆలయంలో దర్శనమిస్తారు. పుణ్య క్షేత్ర అభివృద్ధికి చోళ,రాష్ట్ర కూట,విజయనగర సామ్రాజ్య దీశులు విశిష్ట కృషి చేశారు. గర్భాలయానికి ఆగ్నేయదిశలో నాగారేశ్వరస్వామి, దక్షిణ భాగంలో అపరాధేశ్వరస్వామి ఉన్నారు. కాశీ, ఉజ్జయిని తరువాత అమ్మవారికి ఇష్టమైన కదంబ వృక్షాలు ఉన్న ఆలయం. ఈ కదంబ వృక్షాలు కాశీలో తప్ప మరెక్కడా కనపడవు.

నైరుతి దిశలో ఆగస్త్యమహార్షి చే నిర్మించబడిన ఒక బిల మార్గం ఉంది. ఈ బిలము గుండా మునులు, తాపసులు, కాశీ,రామేశ్వరం, శ్రీశైలంకు ప్రయాణించే వారని ప్రతీతి.కానీ అది ప్రస్తుతం రాళ్లతో, విరిగిపోయిన దూలములతొ మూసుకుపోయి ఉంది. ఆలయానికి చుట్టూ కోటికి పైగా శివలింగాలు, శతాధిక జలాశయాలు ఉన్నాయని పూర్వీకులు చెబుతారు…
ప్రతి పౌర్ణమి రాత్రి కొన్ని వందల మంది భక్తులు ఇక్కడ నిద్ర చేసి వేకువజామునే అమ్మవారిని దర్శించుకొని అమ్మ వారి కృప కి పాత్రులవుతారు

*ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి*

శ్రీ బాల త్రిపురసుందరి దేవి దేవాలయం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం లో ఉంది.ప్రకాశం జిల్లా మార్కాపురానికి 40 కి. మీ. ఒంగోలు కి 93 కి.మీ కర్నూలు – గుంటూరు రహదారిలోని ఉన్న వినుకొండకు 35 కి. మీ.యర్రగొండపాలెంకు 19 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడికి ముఖ్యమైన ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సు సదుపాయం కలదు..

*మన వివాహ బంధం*



       _**అసలు పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం, ఇష్టం-అయిష్టం గురించి కాదు. కాబోయే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరిలో ఒకరు ఐక్యమైపోయి తమని తాము ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం. ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి చదువుకున్న భర్త, భార్య రావాలనుకకోవడం కన్నా తమ మనసులను చదవగలిగిన భర్త, భార్య రావడం అనేది వారి అదృష్టం.*_

       _*అలాంటి అందమైన మనసున్న వారిని పొందాలని కోరుకోవాలి గాని, బయటకు కనిపించే పైపై అందాలను చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులను మాత్రమే చూసి ఇల్లు కొనుక్కొన్నట్లు ఉంటుంది. అందుకే పెద్దలు అన్నారు "అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు" చూడాలని. అంటే బలమైన పునాదులు, గట్టి గోడలు, నునుపైన పూతలు ఉన్నాయా లేదా అని చూడాలి.. అంటే వారి వంశ పుట్టుపూర్వోత్తరాలు చూడాలి..*_

        _**భార్య భర్తల బంధం ఏంత బలంగా ఉండాలంటే, భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. అలాగే భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. అంతేకాదు భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి తప్ప అయోమయం కాకూడదు.*_
         
       _**ఒకరి మనసులోని భావాలను మరొకరు చెప్పకుండానే అర్థం చేసుకొనేలా ఉండాలి. అంటే ఒకరి మనసులోని ప్రేమను గాని బాధని గాని కళ్లలో చూసి, నోటితో చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు కదా.. అలా అర్థం చేసుకొనే భార్య భర్తలు దొరికితే అడుక్కు తినేవారు కూడా ఆనందంగా హాయిగా జీవిస్తారు..*_

        _**భార్య భర్తల బంధం ఒక మధురానుభూతిగా మిగిలి పోవాలి. అంటే ప్రతి భర్త తన భార్యను తన తల్లికి ప్రతి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను తన మొదటి బిడ్డగా పరిగణిస్తే అంతకు మించిన మధురమైన బంధం మరొకటి లేదు కదా..*_

       _**సంసారం అంటే భార్య భర్తలు కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ ఒకరికి ఒకరు వెన్నంటి ఉంటూ, తోడూ నీడగా ఒకరిని ఒకరు వీడకుండా ఉండడం..*_

      _**ఏది ఏమైనా, భార్యాభర్తల మధ్య సంబంధం శాశ్వతంగా ఉండిపోవాలి. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. కానీ చివరి వరకు భార్యకి భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. ఇది ప్రతి భార్య భర్తలు గుర్తుంచుకోవాలి..*_
         
        _**నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం నీకు లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు. అలాగే నీవెన్ని గొప్ప చదువులు చదివినా, ఏంత గొప్ప ఉద్యోగం చేస్తూ ఏంతో గొప్పగా సంపాదించినా భర్త అండదండలు లేకపోతే ఆ భార్య జీవితం నిరర్ధకమే..*_

      _**ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడెమో కానీ, భార్యను బాగా అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. అలాగే ఒక మంచి భార్య తన భర్త మనసెరిగి భర్త మదనపడకుండా, మనస్థాపానికి లోనుకాకుండా చూసుకొంటుంది.. తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే కదా..*_

       _*అలాకాకుండా ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తూ, మిడిసిపాటుతో అహంకారి అయిన భార్య దొరికితే అంబానీ లాంటి వారు కూడా సన్యాసంలో కలవాల్సిందే. అలాగే దురలవాట్లకు బానిసైన వ్యసనపరుడైన భర్త దొరికితే ఆ భార్య జీవితం నరకప్రాయం అయినట్లే..*_

        _**ఒక మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉండాలనుకొంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తానే రాణిగా ఉంటుంది.*_
       
         _**తమ కుటుంబంలో తమ మధ్య ఎన్ని కీచులాటలున్నా సమాజంలో తన భర్త పరువును నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. అలాగే అందరిముందు భార్యను చులకనగా చూడకుండా తన భార్యను అందరి ముందు గౌరవించవలసిన ధర్మం భర్తకు ఉండాలి.*_

       _**భార్య భర్తల బంధం ఎలా ఉండాలంటే "గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండేలాంటి గట్టి బంధమై ఉండాలి." అలాంటి బంధం దొరకడం ఒక గొప్ప వరం..*_

       _**భార్య భర్తల స్మృతులు ఎలా ఉండాలంటే "నీ సంతోషం నేను కాకపోయినా, నా చిరునవ్వు మాత్రం నువ్వే అయ్యుండాలి, నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే అయ్యుండాలి " అనే విధంగా ఉండాలి..*_

      _**భార్య భర్తలు ఇరువురు ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకరి పనులలో ఒకరు సహాయం చేసుకుంటూ సేవ చేయడం అంటే ఒకరి కింద ఒకరు బానిసగా బ్రతుకుతున్నామని కాదు ఇక్కడ అర్థం, ఒకరి బంధాన్ని మరొకరు గౌరవిస్తున్నామని అర్థం..*_
           
       _*నిజానికి భార్య భర్తల బంధం అన్నది ఒక అందమైన పుస్తకం లాంటిది. జీవితంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఆ పుస్తకంలోని అచ్చు తప్పుల వంటివి. అచ్చు తప్పులున్నాయని మంచి పుస్తకాన్ని పారెయ్యలేము కదా.. అలాగే చిన్న చిన్న పొరపాట్లు జరిగినంత మాత్రాన బంధాలను తెంచుకోకుండా, మరొకసారి అలాంటి పొరపాటు జరుగకుండా చూసుకొనే వారి బంధం శాశ్వతంగా నిలిచిపోతుంది..*_

        _**నీ భార్య గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగం చేస్తూ గొప్పగా సంపాదించేదిగా ఉండక్కర్లేదు. జీవిత పాఠాలను చదివి ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగి, నీ వంశాభివృద్ధి కోసం నీకు ఇద్దరు ప్రతినిధులను అందించే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క!..*_

       _**అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ నీ జన్మకు అర్థం లేదు. మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి మసులుకొనేదే "మాంగల్య బంధం" అంటే..*_

        _**అటువంటి బంధాలు తెగిపోకుండా శాశ్వతంగా ఉండాలి అంటే, ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. ఒకవేళ మనం తప్పు చేస్తే క్షమించమని ఎదుటి వారిని క్షమాపణ అడగాలి. ఒకరిపైన ఒకరికి ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానులు ఉండాలి. ముఖ్యంగా ప్రేమ అనేది చాలా విలువైనది. అందుకే "మన బ్రాహ్మణ వివాహం"అనే గుడిలో ప్రేమ అనే విగ్రహాన్ని పెట్టుకుని పూజించుకొన్నపుడే వివాహబంధం రాణిస్తుంది..*_

 **ఈ సృష్టిలో భగవంతుడు తీర్చిదిద్దిన సుందరమైన అతి గొప్ప కళాఖండం మన "మన బ్రాహ్మణ కుటుంబం". ఆ కుటుంబం వ్యవస్థను అర్థం చేసుకొని అవగాహనతో జీవించుదాం శుభమస్తు* 🙏

*ధార్మికగీత - 20*


                       
                                      *****
             *శ్లో:- బాల స్తావత్ క్రీడా సక్తః ౹*
                    *తరుణ స్తావత్ తరుణీ సక్తః ౹*
                    *వృద్ధ స్తావత్ చింతా సక్తః ౹*
                    *పరమే బ్రహ్మణి కో౽పి న సక్తః ౹౹*
                                        *****
*భా:- బాలలు మనసారా,తృప్తిగా కడుపునిండా రుచికరమైన ఆహారము, రకరకాల తిను బండారాలు ఆరగిస్తూ, అంబరాన్నంటిన సంబరాలు, కేరింతలు, ఆట పాటలలో మునిగి తేలుతుంటారు. బాదరబందీ లేని జీవనశైలి వారిది. ఉరకలు వేసే వయసు, ఉద్వేగంతో ఊగి పోయే మనసుతో ఉరుకులు, పరుగులు తీసే యువకులు చదువు సంధ్యల పట్ల శ్రద్ధాసక్తులు చూపించక, నిరంతరం మన్మధ సామ్రాజ్యభావనాకాశతరంగాలలో, మధురోహలలో ఓలలాడుతూ యువతుల పట్ల ఆకర్షితులై తిరుగు తుంటారు.ఇల్లు-వాకిలి,బరువులు-బాధ్యత వారికేమీ పట్టవు. వయోవృద్ధులు పుత్రపౌత్రాదుల విద్యా, ఉపాధి, వివాహ, కుటుంబ సంక్షేమ రంగాలలో వెన్నాడుతున్న ఎడతెగని సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా దిగులు పడుతుంటారు. పోనీ పూనుకొని చేయగల జవసత్వాలు ఉన్నాయా! లేవు. అయినా అనవసరంగా తాపత్రయం పడుతుంటారు. ఇక సృష్టిస్థితిలయ కర్త, సర్వ శుభ మంగళ సంపత్ ప్రదాత, సర్వాంతర్యామి, మోక్షదాత అయిన భగవంతునిపై ఇసుమంత ఆసక్తి కనబరచే వారే లోకంలో కరువై పోయినారు గదా౹ బాల్య,కౌమార,యౌవన,వృద్ధాప్య దశలలో స్మరణకు రాని దేవుడు అవసానకాలంలో ఆకస్మికంగా ఎలా స్మరణకు రాగలడు? ఆది నుండి అలవడితేనే, అంత్య కాలాన అక్కరకు వస్తుందని సారాంశము.*
                                   *****
                    *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

హిందువులు మాత్రమే

* తమిళనాడులోని హిందూ మత వ్యవహారాల శాఖ (హెచ్‌ఆర్ & సిఇ) కింద ఉన్న దేవాలయాలు *
 అధికారుల నుండి అధికారుల వరకు అందరూ హిందువులు మాత్రమే ఉండాలి.
 ప్రమాణ స్వీకారం చేయని కమిషనర్‌తో సహా హిందూ మత వ్యవహారాల శాఖ నుండి అధికారులందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు
 * న్యాయవాది ఎస్. శ్రీధరన్ * చెన్నై హైకోర్టులో దాఖలు చేశారు.
 ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్., అసిస్టెంట్ కమిషనర్ల వరకు ఉన్న అధికారులను ప్రమాణ స్వీకారం నుండి మినహాయించాలని వాదించారు.
 ప్రభుత్వ అభ్యర్థనను చెన్నై హైకోర్టు తిరస్కరించింది.
 హిందూ మత వ్యవహారాల శాఖ తమిళనాడు అంతటా * 44,121 దేవాలయాలను నిర్వహిస్తుంది.
 హిందూ ఛారిటబుల్ ట్రస్ట్ యాక్ట్, 1961 లోని రూల్ 2 లో పేర్కొన్నట్లు
 హిందూ మతానికి విధేయత ప్రతిజ్ఞ
 రుజువు రూపంలో, రూల్ 3 ప్రకారం, దేవాలయాలలో పనిచేసే వారందరూ హిందువులేనని ప్రమాణం చేయాలి.
 సాక్షుల ఉనికిని నిర్ధారించండి
 HR & CE చట్టంలోని సెక్షన్ 10 ను ఉదహరిస్తూ,
 మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్.,
 గౌరవనీయ న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, కృష్ణన్ రామసామి
 * మార్చి 3, 2020 * పాలించబడింది. దీని ప్రకారం, ఈ పదవిలో నియమించబడిన ప్రతి వ్యక్తి, కమిషనర్, అదనపు కమిషనర్లు, అసోసియేట్ కమిషనర్లు మరియు అసిస్టెంట్ కమిషనర్లతో సహా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు
 * వారు పుట్టుకతోనే హిందువులు మరియు వారు హిందూ మతాన్ని అనుసరిస్తూనే ఉన్నారు *
 సాక్షుల సమక్షంలో అఫిడవిట్‌లో సంతకం చేయాలి.
 అలా చేయడంలో విఫలమైతే వారు తొలగించబడతారు.
 ఆర్డర్ రసీదు చేసిన ఎనిమిది వారాల్లోపు అమలు చేయాలి.
 మద్రాస్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా,
 హిందూ మత వ్యవహారాల శాఖ ఉద్యోగులందరూ
 పుట్టుకతోనే వారు హిందువులేనని, వారు ఇప్పటికీ హిందూ మతాన్ని అనుసరిస్తున్నారని
 ప్రమాణం చేయడానికి.
 ఇందులో హిందూయేతరులు
 ప్రత్యామ్నాయ మత అధికారులు ప్రమాణం చేయలేరని హిందువులందరి దృష్టికి తీసుకురావాలి. ఈ సందేశాన్ని అన్ని వాట్సాప్, ఫేస్బుక్ మరియు మా హిందూ బంధువుల యొక్క అన్ని సోషల్ మీడియా గ్రూపులలో పంచుకోండి. సీఎం ఎరోడ్

*భాగవతామృతం*



1-124-శా.శార్దూల విక్రీడితము

ఆనందాశ్రులు గన్నులన్ వెడల రోమాంచంబుతోఁ దత్పద
ధ్యానారూఢుఁడ నైన నా తలఁపులో నద్దేవుఁడుం దోఁచె నే
నానందాబ్ధిగతుండనై యెఱుఁగలేనైతిన్ ననున్నీశ్వరున్
నానాశోకహమైన యత్తనువు గానన్ లేక యట్లంతటన్
ఆనందాశ్రులు = ఆనందబాష్పములు; కన్నులన్ = కళ్లవెంట; వెడల = కారగ; రోమాంచంబు = వెంట్రుకల గగుర్పాటు; తోన్ = తో; తత్ = వాని; పద = పాదముల; ధ్యాన = ధ్యానములో; ఆరూఢుఁడన్ = మునిగినవాడను; ఐన = అయిన; నా = నా; తలఁపు = భావము; లోన్ = లో; ఆ = ఆ; దేవుఁడున్ = దేవుడు; తోఁచెన్ = తోచెను; నేన్ = నేను; ఆనంద = సంతోష; అబ్ధి = సాగరములో; గతుండన్ = మునిగినవాడను; ఐ = అయి; ఎఱుఁగ = తేలిసికొన; లేనైతిన్ = లేకపోతిని; ననున్ = నన్నూ; ఈశ్వరున్ = ఈశ్వరుని; నానా = సమస్త; శోక = శోకములను; అహము = పోగొట్టునది; ఐన = అయినట్టి; ఆ = ఆ; తనువున్ = రూపమును; కానన్ = చూడ / కనుగొన; లేక = లేక; అట్లు = ఆవిధముగ; అంతటన్ = అప్పుడు.
నా కళ్ళల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరమంతా పులకించింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది.
1-125-వ.వచనము
లేచి నిలుచుండి క్రమ్మఱ నద్దేవుని దివ్యాకారంబుఁ జూడ నిచ్ఛించుచు హృదయంబున నిలుపుకొని యాతురుండునుంబోలె జూచియుం గానలేక నిర్మనుష్యం బైన వనంబునం జరియించుచున్న నన్ను నుద్దేశించి వాగగోచరుం డైన హరి గంభీర మధురంబులైన వచనంబుల శోకం బుపశమింపం జేయు చందంబున నిట్లనియె.
లేచి = లేచి; నిలుచుండి = నిలబడి; క్రమ్మఱన్ = మరల; ఆ = ఆ; దేవుని = దేవుని యొక్క; దివ్య = దివ్యమైన; ఆకారంబున్ = ఆకారమును; చూడన్ = చూచుటను; ఇచ్ఛించుచున్ = కోరుతూ; హృదయంబున = హృదయములో; నిలుపుకొని = నిలుపుకొని; ఆతురుండునున్ = ఆతురతతో యున్నవాడు; పోలెన్ = వలె; చూచియున్ = వెతికి చూచి కూడ; కాన = కనుగొన; లేక = లేక; నిర్మనుష్యంబు = మనుష్య సంచారము లేనిది; ఐన = అయినట్టి; వనంబునన్ = అరణ్యములో; చరియించుచున్న = తిరుగుతున్న; నన్నున్ = నన్ను; ఉద్దేశించి = ఉద్దేశించి; వాక్ = వాక్కువలన {వాగగోచరుడు - వాక్కు వలన తెలియరానివాడు}; అగోచరుండు = తెలుప సాధ్యం కాని వాడు; ఐన = అయినట్టి; హరి = హరి; గంభీర = గంభీరమైనవియును; మధురంబులు = మధురమైనవియును; ఐన = అయినట్టి; వచనంబులన్ = మాటలతో; శోకంబున్ = విచారమును; ఉపశమింపన్ = ఉపశమించునట్లు; చేయు = చేయు; చందంబునన్ = విధముగ; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.
నేను విచారంతో లేచి నిల్చున్నాను. మళ్లీ ఆ దేవదేవుని దివ్యస్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరుగసాగాను. కాని నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలుగలేదు. అంతలో మాటలలో వివరించ సాధ్యం కాని వాడు అయిన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి.
1-126-ఉ.ఉత్పలమాల

ఏల కుమారశోషిలఁగ? నీ జననంబున నన్నుఁ గానఁగాఁ
జాలవు నీవు కామముఖషట్కము నిర్దళితంబు సేసి ని
ర్మూలితకర్ములైన మునిముఖ్యులు గాని కుయోగిఁ గానఁగాఁ
జాలఁడు నీదు కోర్కి కొనసాఁగుటకై నిజమూర్తిఁ జూపితిన్.
ఏల = ఎందుకు; కుమార = కుమారా; శోషిలఁగన్ = అయాసపడుట; ఈ = ప్రస్తుత; జననంబునన్ = జన్మలో; నన్నున్ = నన్ను; కానఁగాఁన్ = దర్శించ; చాలవు = లేవు / సరిపడవు; నీవు = నీవు; కామ = కామము {కామముఖషట్కము - అరిషడ్వర్గములు -శత్రువులు 6 - కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహములు)}; ముఖ = మొదలగు; షట్కమున్ = ఆరుగురు; నిర్దళితంబున్ = ఖండితముగ; చేసి = చేసి; నిర్మూలిత = నిర్మూలింపబడిన; కర్ములు = కర్మములుగలవారు; ఐన = అయినట్టి; ముని = మునులలో; ముఖ్యులు = ముఖ్యమైనవారు; కాని = కాని; కుయోగి = చెడ్డవాడైన యోగి; కానఁగాన్ = దర్శించను; చాలఁడు = సరిపోడు, చేయలేడు; నీదు = నీ యొక్క; కోర్కి = తపన / ఇచ్చ; కొనసాఁగుట = కొనసాగుట; కై = కై; నిజ = నాయొక్క; మూర్తిన్ = ఆకారమును; చూపితిన్ = చూపించితిని.
“నాయనా! ఎందుకలా వృథాగా ఆయాసపడతావు. నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలితకర్ములైన ముని ముఖ్యులే నన్ను చూడ గల్గుతారు. అంతే కాని జితేంద్రియులు కానివారు నన్ను దర్శించలేరు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించటం కోసం క్షణ కాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను.
1-127-క.కంద పద్యము

నావలని కోర్కి యూరక
పోవదు విడిపించు దోషపుంజములను మ
త్సేవం బుట్టును వైళమ
భావింపఁగ నాదు భక్తి బాలకవింటే
నావలని = నామీద; కోర్కి = భక్తి; ఊరకన్ = ఊరికే; పోవదు = పోదు; విడిపించున్ = విడిపించును; దోష = పాపపు; పుంజములను = సమూహములను; మత్ = నాయొక్క; సేవన్ = సేవవలన; పుట్టును = కలుగును; వైళమ = శ్రీఘ్రముగ; భావింపఁగ = ఎంచిచూస్తే; నాదు = నాయొక్క; భక్తి = భక్తి; బాలక = కుమారా; వింటే = వింటున్నావా
వత్సా! నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలూ దూరమౌతాయి. నన్ను సేవించటం వల్ల నాభక్తి అచిరకాలంలోనే నీమదిలో పదిలమౌతుంది.
1-128-క.కంద పద్యము

నాయందుఁ గలుగు నీ మది
వాయదు జన్మాంతరముల బాలకనీ వీ
కాయంబు విడిచి మీఁదట
మా యనుమతిఁ బుట్టఁగలవు మద్భక్తుఁడవై.
నా = నా; అందున్ = మీద; కలుగు = కలుగును; నీ = నీ; మది = మనసు; పాయదు = విడువదు; జన్మ = జన్మముల; అంతరములు = ఇతరములుకును; బాలక = కుమార; నీవు = నీవు; ఈ = ఈ; కాయంబున్ = శరీరమును; విడిచి = విడిచిన; మీఁదటన్ = తరువాత; మా = మా యొక్క; అనుమతిన్ = అనుమతితో; పుట్టన్ = (మరల) పుట్ట; కలవు = కలవు; మత్ = నాయొక్క; భక్తుఁడవు = భక్తుడవు; ఐ = అయి.
కుమారా నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదలిన అనంతరం నా అనుజ్ఞతో మరు జన్మలో నా భక్తుడివై ఉద్భవిస్తావు.
1-129-మ.మత్తేభ విక్రీడితము

విను మీ సృష్టిలయంబు నొంది యుగముల్ వేయైన కాలంబు యా
మినియైపోయెడిఁ బోవఁగాఁ గలుగుఁజూమీఁదం బునఃసృష్టి యం
దు నిరూఢస్మృతితోడఁ బుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్
ఘనతం జెందెదు శుద్ధ సాత్త్వికులలో గణ్యుండవై యర్భకా!
విను = వినుము; ఈ = ప్రస్తుత; సృష్టి = సృష్టి (మొత్తము); లయంబున్ = అంతము (ప్రళయము); ఒంది = పొంది; యుగముల్ = యుగములు; వేయి = వెయ్యి; ఐన = అయిన; కాలంబు = కాలము; యామిని = రాత్రి (బ్రహ్మ); ఐపోయెడిన్ = అయిపోవుట; పోవఁగాన్ = (అది) గడిచిపోగా; కలుగుఁన్ = జరుగును; సుమీ = సుమా; మీఁదన్ = ఆపైన; పునః = మరల; సృష్టి = సృష్టి; అందున్ = అందు; నిరూఢ = గట్టి; స్మృతి = జ్ఞాపకశక్తి; తోడన్ = కలిగి; పుట్టెదవు = జన్మించెదవు; నిర్దోషుండవు = దోషములు లేనివాడవు; ఐ = అయి; నా = నాయొక్క; కృపన్ = కృప వలన; ఘనతన్ = గొప్పతనమును; చెందెదు = పొందెదవు; శుద్ధ = పరిశుద్ధమైన; సాత్త్వికుల = సత్త్వగుణసంపన్నులు; లోన్ = లో; గణ్యుండవు = గొప్పవాడవు; ఐ = అయి; అర్భకా = బాలకుడా.
విను చిట్టితండ్రి! ఈ సృష్టి యావత్తూ లయమైపోయిన పిమ్మట వేయి యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్లీ జన్మిస్తావు. నీకు పూర్వస్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్వ గుణసంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడవై ప్రసిద్ధుడవు అవుతావు.”
1-130-వ.వచనము
అని యిట్లాకాశంబు మూర్తియు, ఋగ్వేదాదికంబు నిశ్వాసంబునుగా నొప్పి, సర్వనియామకం బైన మహాభూతంబు వలికి యూరకున్న నేను మస్తకంబు వంచి మ్రొక్కి, తత్కరుణకు సంతసించుచు మదంబు దిగనాడి, మచ్చరంబు విడిచి, కామంబు నిర్జించి,క్రోధంబు వర్జించి, లోభమోహంబుల వెడల నడిచి, సిగ్గు విడిచి, యనంత నామంబులు పఠించుచుఁ, బరమ భద్రంబు లయిన తచ్చరిత్రంబులం జింతించుచు, నిరంతర సంతుష్టుండనై కృష్ణుని బుద్ధి నిలిపి నిర్మలాంతఃకరణంబులతోడ విషయవిరక్తుండ నై కాలంబున కెదురు సూచుచు భూమిం దిరుగుచు నుండ; నంతం గొంతకాలంబునకు మెఱుంగు మెఱసిన తెఱంగున మృత్యువు దోఁచినం బంచభూతమయం బయి కర్మస్వరూపం బైన పూర్వ దేహంబు విడిచి హరికృపావశంబున శుద్ధసత్త్వమయం బైన భాగవతదేహంబు సొచ్చితి; నంతం ద్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశి మధ్యంబున శయనించు నారాయణమూర్తి యందు నిదురవోవ నిచ్చగించు బ్రహ్మనిశ్వాసంబు వెంట నతని లోపలం బ్రవేశించితి; నంత సహస్ర యుగ పరిమితంబైన కాలంబు సనిన లేచి లోకంబులు సృజియింప నుద్యోగించు బ్రహ్మనిశ్వాసంబు వలన మరీచి ముఖ్యులగు మునులును నేనును జనియించితిమి; అందు నఖండిత బ్రహ్మచర్యుండనై యేను మూఁడు లోకంబుల బహిరంతరంబు లందు మహావిష్ణుని యనుగ్రహంబున నడ్డంబు లేక యీశ్వరదత్తమై బ్రహ్మాభివ్యంజకంబు లైన సప్తస్వరంబులు దమ యంతన మ్రోయుచున్నయీ వీణాలాపన రతింజేసి నారాయణకథాగానంబు సేయుచుఁ జరియించు చుందు.

అని = అని; ఇట్లు = ఈవిధముగ; ఆకాశంబు = ఆకాశము; మూర్తియు = రూపముగను; ఋగ్వేద = ఋగ్వేదము; ఆదికంబు = మొదలగునవి; నిశ్వాసంబునున్ = ఊపిరియును; కాన్ = కాగా; ఒప్పి = అమరి; సర్వ = సర్వమును; నియామకంబు = నియమించునది; ఐన = అయినట్టి; మహా = బృహత్; భూతంబు = ప్రకృతి; పలికి = పలికి; ఊరక = ఊరక; ఉన్నన్ = ఉండిన; నేను = నేను; మస్తకంబున్ = శిరస్సు; వంచి = వంచి; మ్రొక్కి = నమస్కరించి; తత్ = ఆయొక్క; కరుణ = దయ; కున్ = కు; సంతసించుచున్ = సంతోషించుచు; మదంబున్ = గర్వమును; దిగనాడి = వదిలివేసి; మచ్చరంబున్ = మాత్సర్యమును; విడిచి = విడనాడి; కామంబున్ = కామమును; నిర్జించి = అణచి; క్రోధంబున్ = కోపమును; వర్జించి = వదిలిపెట్టి; లోభ = లోభమును; మోహంబులన్ = మోహములను; వెడలనడిచి = గెంటి వేసి; సిగ్గున్ = సిగ్గును; విడిచి = విడిచి; అనంత = అనంతుని / భగవంతుని అనంతమైన; నామంబులున్ = నామములను; పఠించుచున్ = చదువుతూ; పరమ = అన్నిటికంటె ఉత్తమమైన; భద్రంబులు = క్షేమకరములు; అయిన = అయినట్టి; తత్ = అతని; చరిత్రంబులన్ = చరిత్రలను; చింతించుచు = తలుస్తూ; నిరంతర = ఎడతెగని; సంతుష్టుండను = సంతోషము కలవాడను; ఐ = అయి; కృష్ణుని = విష్ణువుని; బుద్ధిన్ = బుద్ధిలో; నిలిపి = స్థిరపరుచుకొని; నిర్మల = మలినములేని; అంతఃకరణంబుల = లోపలి ఇంద్రియముల {అంతఃకరణములు - శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసనలు వాని స్థానములు}; తోడన్ = తో; విషయ = విషయములమీద {విషయములు - ఇంద్రియాలకు సంబంధించినవి}; విరక్తుండను = ఆసక్తిలేనివాడను; ఐ = అయి; కాలంబు = (మరణ)కాలము; కున్ = కు; ఎదురు = ఎదురు; సూచుచు = చూస్తూ; భూమిన్ = భూమిమీద; తిరుగుచున్ = తిరుగుతూ; ఉండన్ = ఉండగా; అంతన్ = అంతట; కొంత = కొంత; కాలంబు = కాలము; కున్ = తరువాత; మెఱుంగు = మెరుపు; మెఱసిన = మెరిసిన; తెఱంగునన్ = విధముగ; మృత్యువు = మరణము; తోఁచినన్ = ప్రత్యక్షము కాగా; పంచభూత = పంచభూతములతో; మయంబు = కూడినది; అయి = అయినట్టి; కర్మ = కర్మము యొక్క; స్వరూపంబు = స్వరూపము; ఐన = కలిగిన; పూర్వ = పూర్వజన్మలోని; దేహంబు = దేహమును; విడిచి = విడిచిపెట్టి; హరి = హరియొక్క; కృపా = దయ; వశంబునన్ = వలన; శుద్ధ = పరిశుద్ధమైన; సత్త్వ = సత్త్వగుణముల; మయంబు = కూడినది; ఐన = అయినట్టి; భాగవత = భగవంతునియొక్క; దేహంబు = దేహము / రూపము; చొచ్చితిన్ = ప్రవేశించితిని / లీనమైతిని; అంతన్ = అంతట; త్రైలోక్యంబున్ = మూడు లోకములను; సంహరించి = నాశనము చేసి; ప్రళయ = కల్పాంత; కాల = కాలములో; పయోరాశి = సముద్ర; మధ్యంబున = మధ్యభాగమున; శయనించు = పండుకొను; నారాయణమూర్తి = విష్ణుమూర్తి; అందున్ = లోపల; నిదుర = నిద్ర; పోవ = పోవుటకు; ఇచ్చగించు = నిశ్చయించు; బ్రహ్మ = బ్రహ్మయొక్క; నిశ్వాసంబు = ఊపిరి; వెంటన్ = వెనకన; అతని = అతని; లోపలన్ = లోపలికి; ప్రవేశించితిన్ = చొచ్చితిని; అంత = అంతట; సహస్ర = వెయ్యి; యుగ = యుగముల; పరిమితంబు = పర్యంతము; ఐన = అయినట్టి; కాలంబు = కాలము; చనిన = గడచిన; లేచి = లేచి; లోకంబులున్ = లోకములను; సృజియింపన్ = సృష్టించవలెనని; ఉద్యోగించు = ప్రయత్నము చేయు; బ్రహ్మ = బ్రహ్మయొక్క; నిశ్వాసంబు = ఊపిరి; వలనన్ = ద్వారా; మరీచి = మరీచి; ముఖ్యులగు = మొదలగు; మునులును = మునులును; నేనును = నేనును; జనియించితిమి = పుట్టితిమి; అందున్ = వారిలో; అఖండిత = ఎడతెగని; బ్రహ్మచర్యుండన్ = బ్రహ్మచర్య వ్రతధారుడను; ఐ = అయి; ఏను = నేను; మూఁడు = మూడు; లోకంబులన్ = లోకముల యొక్క; బహిర్ = బయటి భాగములు; అంతరంబులు = లోపటి భాగములు; అందున్ = అందును; మహా = గొప్పవాడైన; విష్ణుని = భగవంతుని యొక్క; అనుగ్రహంబునన్ = అనుగ్రహము వలన; అడ్డంబు = అడ్డము; లేక = లేకుండగ; ఈశ్వర = ఈశ్వరునిచే; దత్త = ఇవ్వబడినది; ఐ = అయినట్టి; బ్రహ్మ = పరబ్రహ్మమును; అభివ్యంజకంబులు = అభివ్యక్తము చేయునవి; ఐన = అయినట్టి; సప్తస్వరంబులు = సప్తస్వరములు; తమయంతన = తమంతతామే; మ్రోయుచున్న = మ్రోగు; ఈ = ఈ; వీణ = వీణ; ఆలాపన = రాగముతో / నాదముతో; రతిన్ = కూడినదాని / ఆసక్తి; చేసి = వలన; నారాయణ = నారాయణుని; కథ = కథల; గానంబు = గానము; చేయుచున్ = చేయుచు; చరియించుచున్ = తిరుగుతూ; ఉందున్ = ఉందును;
ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి, సర్వనియంత, వేదమయమూ అయిన ఆ మహాభూతానికి నేను తలవంచి మ్రొక్కాను. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. మదాన్ని వీడాను. మాత్సర్యాన్ని దిగనాడాను. కామాన్ని అణచిపెట్టాను. క్రోధాన్ని వదలిపెట్టాను. లోభాన్ని, మోహాన్ని వదలివేసాను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ, పరమపవిత్రాలయిన హరి చరిత్రలను స్మరిస్తూ, నిత్యసంతుష్టుడనై వాసుదేవుని హృదయంలో పదిలపరచుకొన్నాను. ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరుగసాగాను. కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమయింది. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయవల్ల సత్త్వగుణాత్మకమైన భాగవతదేహంలో ప్రవేశించాను. తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవమైన జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన, బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేనూ భగవానుని ఉదరంలో ప్రవేశించాను. వెయ్యి యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించ తలచెడి బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు, నేను జన్మించాము. ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై, భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై, పరబ్రహ్మముచేత సృష్టింపబడిన సప్తస్వరాలు తమంతతామే మ్రోగే ఈ మహతి అనే వీణమీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను.
1-131-ఆ.ఆటవెలది

తీర్థపాదుఁడయిన దేవుండు విష్ణుండు
తన చరిత్ర మేను దవిలి పాడఁ
జీరఁబడ్డవాని చెలువున నేతెంచి
ఘనుఁడు నామనమునఁ గానవచ్చు.
తీర్థ = తరింపజేయు; పాదుఁడు = పాదములు గలవాడు; అయిన = అయినట్టి; దేవుండు = దేవుడు; విష్ణుండు = విష్ణువు; తన = తనయొక్క; చరిత్ర = చరిత్రను; మేను = శరీరము; దవిలి = పులకరించి; పాడన్ = పాడగా; చీరఁబడ్డవాని = పిలువబడినవాని; చెలువునన్ = విధంగా; ఏతెంచి = వచ్చి; ఘనుఁడు = గొప్పవాడు - భగవంతుడు; నా = నాయొక్క; మనమునన్ = మనసులో; కానవచ్చున్ = కనిపిస్తాడు.
నేను విష్ణుమూర్తి లీలలను గానం చేసినప్పుడ;, తీర్థపాదుడు, దేవాదిదేవుడు, వాసుదేవుడు అయిన పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనస్సులో దర్శనము ఇచ్చేవాడు.
1-132-క.కంద పద్యము

విను మీ సంసారంబను
వననిధిలో మునిఁగి కర్మవాంఛలచే వే
దనఁ బొందెడువానికి వి
ష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా.
వినుము = వినుము; ఈ = ఈ; సంసారంబు = సంసారము; అను = అనే; వననిధి = సముద్రము; లోన్ = లోపల; మునిఁగి = మునిగిపోయి; కర్మ = కర్మములందు; వాంఛల = కోరికల; చేన్ = చేత; వేదనన్ = బాధను; పొందెడువాని = పడేవాడి; కిన్ = కి; విష్ణుని = హరియొక్క; గుణ = గుణముల; వర్ణనము = కీర్తించుట; తెప్ప = పడవ; సుమ్ము = సుమా; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా.
ఓ వ్యాసమహర్షీ! ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంఛలచే క్రిందుమీదై బాధపడేవానికి గోవింద గుణకీర్తనం గట్టుకు చేర్చే తెప్ప లాంటిది.
1-133-చ.చంపకమాల

యమనియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యుఁ గామరో
షములఁ బ్రచోదితంబ యగు శాంతి వహింపదు విష్ణుసేవచేఁ
గ్రమమున శాంతిఁ గైకొనిన కైవడి నాదు శరీర జన్మ క
ర్మముల రహస్య మెల్ల మునిమండనచెప్పితి నీవు గోరినన్."
యమ = యమము; నియమ = నియమము; ఆది = మొదలగు; యోగములన్ = యోగాభ్యాస మార్గముల; ఆత్మ = ఆత్మ; నియంత్రితము = నియమింపపడినది; అయ్యున్ = అయినప్పటికిని; కామ = కామము; రోషములన్ = రోషములచే; ప్రచోదితంబు = ప్రేరేపింపబడినది; అగు = అగును; శాంతి = శాంతిని; వహింపదు = పొందదు; విష్ణు = హరియొక్క; సేవ = భక్తి; చేన్ = చేత; క్రమమున = క్రమముగా; శాంతిన్ = శాంతిని; కైకొనిన = పొందిన; కైవడిన్ = విధముగా; నాదు = నాయొక్క; శరీర = శరీరము; జన్మ = జన్మ; కర్మముల = కర్మముల (పుట్టుపూర్వోత్తరముల); రహస్యము = రహస్యము / మర్మము; ఎల్లన్ = అంతా; ముని = మునులకు; మండన = ప్రకాశించేవాడా; చెప్పితిన్ = చెప్పితిని; నీవు = నీవు; గోరినన్ = కోరగా.
మునికులభూషణా! యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహారాది అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకొన్నప్పటికీ కామం, రోషం మొదలైన వానిచే అది మాటిమాటికీ రెచ్చిపోతూనే ఉంటుంది. కానీ శాంతించదు. అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది. నా పుట్టు పూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను.“
1-134-వ.వచనము
అని యిట్లు భగవంతుం డగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని వీణ వాయించుచు, యదృచ్ఛామార్గంబునం జనియె" నని,సూతుం డిట్లనియె.
అని = అనిచెప్పి; ఇట్లు = ఈవిధముగ; భగవంతుండు = భగవంతుడు; అగు = అయినట్టి; నారదుండు = నారదుడు; వ్యాస = వ్యాసుడు అనే; మునీంద్రుని = మునులలో శ్రేష్ఠుని; వీడ్కొని = సెలవు తీసుకొని; వీణ = వీణను; వాయించుచున్ = వాయించుచు; యదృచ్ఛా = స్వేచ్ఛా, ఇచ్చవచ్చిన; మార్గంబునన్ = మార్గమున; చనియెన్ = వెళ్ళెను; అని = అనిచెప్పి; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.
అని ఈ ప్రకారంగా భగవంతుడు అయిన నారదుడు వ్యాస మునీంద్రునితో పలికి వీడ్కోలందుకొని వీణను మ్రోగించుకుంటూ వెళ్లిపోయాడు. అనంతరం సూతమహాముని శౌనకాదులతో ఇలా అన్నాడు.
1-135-క.కంద పద్యము

వాయించు వీణ నెప్పుడు
మ్రోయించు ముకుందగీతములు జగములకుం
జేయించుఁ జెవుల పండువు
మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే
వాయించున్ = వాయించును; వీణన్ = వీణను; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; మ్రోయించున్ = మ్రోగించును; ముకుంద = హరియొక్క; గీతములు = పాటలు; జగములు = లోకాల; కున్ = కు; చేయించుఁన్ = కలుగజేయును; చెవుల = చెవులకు; పండువు = పండుగ; మాయించున్ = మాయము చేయును; అఘాళిన్ = పాపములను; ఇట్టి = ఇటువంటి; మతి = బుద్ధిమంతుడు; మఱి = మరియొకడు; కలఁడే = ఉన్నాడా.
“నారదమహర్షి సర్వదా మహతీ విపంచి వాయిస్తు, ముకుందగీతాలు మ్రోయిస్తు, సకల జగత్తులకు వీనులవిందు చేస్తు, లోకుల పాపసమూహాలను మాయిస్తు, సంచరించే మేటి భక్తుడు. ఆయనకు ఆయనే సాటి.”
1-136-వ.వచనము
అని నారదుం గొనియాడిన సూతునిం జూచి ”నారదు మాటలు విన్న వెనుక భగవంతుండైన బాదరాయణుం డేమి సేసె" నని శౌనకుం డడిగిన సూతుం డిట్లనియె ”బ్రహ్మదైవత్య యైన సరస్వతి పడమటితీరంబున ఋషులకు సత్రకర్మవర్ధనంబై బదరీ తరుషండ మండితం బయి ”శమ్యాప్రాసం" బనం బ్రసిద్ధంబగు నాశ్రమంబు గలదు; అందు జలంబుల వార్చి కూర్చుండి, వ్యాసుండు తన మది దిరంబు సేసికొని భక్తియుక్తం బయిన చిత్తంబునం బరిపూర్ణుం డయిన యీశ్వరుం గాంచి, యీశ్వరాధీన మాయావృతం బైన జీవుని సంసారంబుఁ గని, జీవుండు మాయచేత మోహితుం డయి గుణవ్యతిరిక్తుండయ్యు మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుం డని యభిమానించుచుఁ ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందు; ననియు నయ్యనర్థంబునకు నారాయణభక్తియోగంబు గాని యుపశమనంబు వేఱొకటి లేదనియు నిశ్చయించి.
అని = అని; నారదున్ = నారదుని; కొనియాడిన = స్తుతించిన; సూతునిన్ = సూతుని; చూచి = చూసి; నారదు = నారదుని; మాటలు = ఉపదేశములు; విన్న = ఆలకించిన; వెనుక = తరువాత; భగవంతుండు = భగవంతుడు; ఐన = అయిన; బాదరాయణుండు = వ్యాసుడు {బాదరాయణుడు - బదరీవనములో నుండు వాడు, వ్యాసుడు}; ఏమి = ఏమి; సేసెన్ = చేసెను; అని = అని; శౌనకుండు = శౌనకుడు; అడిగిన = ప్రశ్నించగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను; బ్రహ్మదైవత్య = బ్రహ్మ తనకు అధిదైవముగాగలది; ఐన = అయినట్టి; సరస్వతి = సరస్వతీనది; పడమటి = పశ్చిమ; తీరంబునన్ = తీరమున; ఋషులు = ఋషులు; కున్ = కు; సత్ర = యాగములయొక్క; కర్మ = కర్మలను; వర్ధనంబు = వృద్ధిచేయునది; ఐ = అయి; బదరీ = రేగుపళ్ళ; తరు = చెట్ల; షండ = గుంపుతో; మండితంబు = అలంకరింపడినది; అయి = అయి; శమ్యాప్రాసంబు = శమ్యాప్రాసము {శమ్యాప్రాసము - శమము యను ఆహారము గలది}; అనన్ = అనేపేరుతో; ప్రసిద్ధంబు = ప్రసిద్ధమైనది; అగు = అయినట్టి; ఆశ్రమంబు = ఆశ్రమము; కలదు = ఉన్నది; అందున్ = అక్కడ; జలంబులన్ = నదిలో; వార్చి = సంధ్యవార్చి; కూర్చుండి = కూర్చొని; వ్యాసుండు = వ్యాసుడు; తన = తనయొక్క; మదిన్ = మనసును; తిరంబు = స్థిరముగ; చేసికొని = చేసికొని; భక్తి = భక్తితో; యుక్తంబు = కూడినది; అయిన = అయినట్టి; చిత్తంబునన్ = చిత్తములో; పరిపూర్ణుండు = పరిపూర్ణుడు; అయిన = అయినట్టి; ఈశ్వరున్ = ఈశ్వరుని; కాంచి = దర్శించి; ఈశ్వర = ఈశ్వరునియొక్క; అధీన = అధీనములో ఉండే; మాయ = మాయతో; ఆవృతంబు = కప్పబడినది; ఐన = అయినట్టి; జీవుని = జీవునియొక్క; సంసారంబున్ = సంసారమును; కని = చూసి; జీవుండు = జీవుడు; మాయ = మాయ; చేతన్ = చేత; మోహితుండు = మోహింపబడినవాడు; అయి = అయి; గుణ = గుణములకంటెను; వ్యతిరిక్తుండు = వేరైనవాడు; అయ్యు = అయినప్పటికిని; మాయ = మాయతో; సంగతిన్ = సహవాసము వలన; తాను = తాను; త్రి = మూడు; గుణ = గుణములు; ఆత్మకుండు = తనవిగా కలవాడు; అని = అనుకొని; అభిమానించుచున్ = (ఆ గుణములను) అభిమానించుచు; త్రి = మూడు; గుణత్ = గుణములయందు; అభిమానంబునన్ = అభిమానమువలన; కర్తయున్ = కర్తను; భోక్తయున్ = భోక్తను; అను = అను; అనర్థంబు = అనర్థమును (అర్థము లేని అభిప్రాయము); ఒందును = పొందును; అనియున్ = అనియూ; ఆ = ఆ; అనర్థంబు = అనర్థమున; కున్ = నకు; నారాయణ = భగవంతుని; భక్తి = భక్తి; యోగంబు = యోగము; కాని = తప్ప; ఉపశమనంబు = అణగింపగలది; వేఱొకటి = మరొకటి; లేదు = లేదు; అనియు = అనీ; నిశ్చయించి = నిర్ణయించి.
అంటూ నారదమహర్షిని సూతుడు స్తుతించగా ”నారదుని మాటలు ఆలకించిన అనంతరం వ్యాసభగవానుడు ఏం చేసాడో చెప్ప” మని శౌనకుడు అడిగాడు. సూతుడు ఇలా చెప్పాడు. ”బ్రహ్మదేవతాకమైన సరస్వతీనది పడమటి తీరాన ఋషులు యజ్ఞాలు చేసుకోటానికి అనుకూలమై అనేక రేగుచెట్లతో నిండి శమ్యాప్రాసమనే ఆశ్రమం ఉంది. వ్యాసుడు ఆ ఆశ్రమానికి వెళ్లి తన చిత్తంలో భగవంతుణ్ణి దర్శించాడు. ఈశ్వరుని మాయ ఆవరించి ఉన్న జీవుని సంసారాన్ని చూశాడు. మాయా మోహితుడైన జీవుడు త్రిగుణాతీతుడై కూడా మయా ప్రభావం వల్ల గుణాభిమానం కలవాడై, తానే కర్తను భోక్తను అనే అనర్థభావనలు చేస్తాడని, ఈ అనర్థాన్ని ఉపశమింప చేయటానికి విష్ణుభక్తి అనే యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించాడు.
1-137-మ.మత్తేభ విక్రీడితము

అవనీచక్రములోన నే పురుషుఁ డే యామ్నాయమున్ విన్న మా
ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపఁగాఁ జాలు భ
క్తివిశేషంబు జనించు నట్టి భువనక్షేమంకరంబైన భా
గవతామ్నాయము బాదరాయణుఁడు దాఁ గల్పించె నేర్పొప్పగన్.
అవనీ = భూ; చక్రము = మండలము; లోనన్ = లోపల; ఏ = ఏ; పురుషుఁడు = పురుషుడైనా; ఏ = ఏ; ఆమ్నాయమున్ = వేదమును; విన్న = విన్నచో; మాధవు = విష్ణువు; పైన్ = మీద; లోక = లోకములకు; శరణ్యు = శరణమైనవాని; పైన్ = మీద; భవములన్ = మళ్ళీపుట్టుటలను; తప్పింపఁగాన్ = తప్పించుటకు; చాలు = సామర్థ్యములు కల; భక్తి = భక్తి యనే; విశేషంబు = విశిష్ఠమైనది; జనించున్ = పుడుతుందో; అట్టి = అటువంటి; భువన = లోకములకు; క్షేమంకరంబు = శ్రేయస్సును కలిగించునది; ఐన = అయినట్టి; భాగవత = భాగవతము అనే; ఆమ్నాయమున్ = వేదమును; బాదరాయణుఁడు = వ్యాసుడు; తాన్ = తాను; కల్పించెన్ = సృష్టించెను; నేర్పు = నేర్పు; ఒప్పగన్ = అమరగా.
ఈ విశాల భూమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసారబంధాలు సమసిపోయి జగన్నాథుడైన నారాయణునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో, అట్టి లోకకల్యాణకరమైన మహాగ్రంథాన్ని, వేదస్వరూపమైన భాగవతాన్ని బాదరాయణ మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు.
1-138-వ.వచనము
ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థియైన శుకునిచేఁ జదివించె" నని చెప్పిన విని శౌనకుండు ”నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండును నైన శుకయోగి యేమిటికి భాగవతం బభ్యసించె?" ననవుడు; సూతుం డిట్లనియె.
ఇట్లు = ఈ విధముగ; భాగవతంబు = భాగవతమును; నిర్మించి = రచించి; మోక్ష = మోక్షమును; అర్థి = అర్థించువాడు; ఐన = అయినట్టి; శుకుని = శుకుని; చేన్ = చేత; చదివించెన్ = చదివించెను; అని = అని; చెప్పినన్ = చెప్పగా; విని = విని; శౌనకుండు = శౌనకుడు; నిర్వాణ = మోక్షమునందు; తత్పరుండును = నిష్ఠగలవాడును; సర్వ = సర్వము అందు; ఉపేక్షకుండును = ఉదాసీనత కలవాడును; ఐన = అయినట్టి; శుక = శుకుడు అను; యోగి = యోగి; ఏమిటి = ఎందు; కిన్ = కొరకు; భాగవతంబు = భాగవతమును; అభ్యసించెన్ = అధ్యయనము చేసాడు; అనవుడు = అనగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = అన్నాడు.
ఈ విధంగా మహాభాగవత మనే సంహితను కల్పించి ముముక్షువైన శ్రీశుకునిచే చదివించాడు” అని సూతుడు చెప్పగానే శౌనకముని విని ”మోక్ష మందు మాత్రమే అపేక్ష కలిగి, సమస్త మందు ఉపేక్ష కల శుకయోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకోసం అధ్యయనం చేసాడు” అని ప్రశ్నించగా సూతమహర్షి ఇలా అన్నాడు-
1-139-క.కంద పద్యము

"ధీరులు నిరపేక్షులు నా
త్మారాములునైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణుఁడట్టివాఁ,డనవ్యచరిత్రా!
ధీరులు = విద్వాంసులు; నిరపేక్షులున్ = దేనియందు ఆపేక్షలేని వారు; ఆత్మారాములున్ = ఆత్మయందు ఆనందించువారును; ఐన = అయినట్టి; మునులు = మునులు; హరి = విష్ణువు యొక్క; భజనమున్ = సంకీర్తనమును; నిష్కారణమ = కారణమేదీ లేకుండానే; చేయుచున్ = చేస్తూ; ఉందురు = ఉంటారు; నారాయణుఁడు = నారాయణుడు; అట్టి = అటువంటి; వాఁడు = వాడు; అనవ్య = పురాతనమైన; చరిత్రా = చరిత్ర కలవాడా.
“పురాణప్రవర్తకా! శౌనకా! జితేంద్రియులు, నిష్కాములు, ఆత్మారాములు అయిన మహామునులు ఫలాపేక్ష లేకుండానే కారణములేకనే భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో కారణము లేకుండానే కటాక్షిస్తూ ఉంటాడు.
1-140-క.కంద పద్యము

హరిగుణవర్ణన రతుఁడై
హరితత్పరుఁడైన బాదరాయణి శుభత
త్పరతంబఠించెఁ ద్రిజగ
ద్వరమంగళమైన భాగవత నిగమంబున్.
హరి = హరియొక్క; గుణ = గుణముల; వర్ణన = వర్ణన యందు; రతుఁడు = అసక్తిగలవాడు; ఐ = అయి; హరి = హరి యందు; తత్పరుఁడు = నిష్ఠగలవాడు {హరి తత్పరుడు - తను కానిది హరి మాత్రమే అని నడచువాడు}; ఐన = అయినట్టి; బాదరాయణి = శుకుడు {బాదరాయణి - బాదరాయణుని పుత్రుడు, శుకుడు}; శుభ = శుభమునందు; తత్పరతన్ = నిష్ఠతో; పఠించెన్ = చదివెను; త్రి = మూడు; జగత్ = లోకములకు; వర = శ్రేష్ఠమైన; మంగళము = శుభము; ఐన = అయినట్టి; భాగవత = భాగవతము అనే; నిగమంబున్ = వేదమును.
శ్రీహరి గుణకీర్తన మందు ఆసక్తుడూ, ఉత్తమ విష్ణుభక్తుడూ అయిన శుకమహర్షి ముల్లోకాలకూ కల్యాణప్రదమైన భాగవతము అనే వేదమును విశ్వశ్రేయస్సును ఆకాక్షించి అధ్యయనం చేసాడు.
1-141-క.కంద పద్యము

నిగమములు వేయుఁ జదివిన
సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్
సుగమంబు భాగవత మను
నిగమంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!"
నిగమములు = వేదములు; వేయున్ = వేలకొలది; చదివినన్ = పఠించినను; సుగమంబులు = సులభముగ అర్థము అగునవి; కావు = కావు; ముక్తి = ముక్తినిచ్చు; సుభగత్వంబుల్ = సౌభాగ్యములు; సుగమంబు = సులభము అగును; భాగవతము = భాగవతము; అను = అనబడే; నిగమంబున్ = వేదమును; పఠింప = చదివినచో; ముక్తి = ముక్తి; నివసనము = నివాసము, ఇల్లు; బుధా = జ్ఞానవంతుడా.
జ్ఞానవంతుడా! వేలకొద్దీ వేదాలను ఎంత
 చదివినా మోక్షసంపదలు అందుకోడం అంత సుళువు కాదు. అదే భాగవతము, అనే వేదాన్ని పఠిచటం ద్వారా అయితే మోక్షం అతి సుళువుగా దొరుకుతుంది."

పంచముఖ ఆంజనేయుడు

*పంచముఖ ఆంజనేయుడు వృత్తాంతం*

తలచుకున్నంత మాత్రాన సకల కష్టాలనూ చిటికెలో రూపుమాపేవాడు ఆంజనీ పుత్రుడు. కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలనూ నెరవేర్చేవాడు ఆ హనుమంతుడు. మనుమంతుని పంచముఖుని రూపంలో ఆరాధించడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నదే. కానీ ఇదేమీ కొత్తగా చేరిన ఆచారం కాదు! శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది.

*మైరావణ వృత్తాంతం:* రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం... తెలిసిందే! సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలుపడిపోతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా.... అందరి కళ్లూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు.

*హనుమంతుని పయనం:* రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారనీ... తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు, హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది.

*మైరావణుని సంహారం:* మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వముఖం... ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి, అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి... మైరావణుని అంతం చేస్తాడు. అతనే పంచముఖాంజనేయుడు.

*పంచముఖాల ప్రాశస్త్యం:* అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ, అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది.

 స్వామివారి పంచముఖాలలో ఒకో మోముదీ ఒకో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే అ అయిదు ముఖాలు తన భక్తులను అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యాలనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్టసిద్ధినీ కలుగచేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.

అందుకే పెద్దలు ఆంజనేయుని ఆకులతో పూజిస్తే, ఆయుస్సు తో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని అంటారు.
పంచముఖ ఆంజనేయ స్వామి కథ విన్నవారికి, చదివిన వారికి, మరియు చెప్పిన వారికి ఎంత పెద్ద సమస్య ఉన్న దానికి ఓక చక్కని పరిష్కార మార్గం వెంటనే చూపించబడుతుంది ఆంజనేయుడు ఆరాధకుల లో అపారమైన ఒక నమ్మకం ఉన్నది.

కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకు ఉంటాడో

💐కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకు ఉంటాడో చాలామందికి తెలియదు, 💐

💐కారణం ఇదే.💐

కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకు ఉంటాడో పురాణ గాథలో ఆసక్తికర కథ ఉంది.
రాక్షస గణాలను అందరినీ చంపగా చివరికి రక్తబీజు అనే రాక్షసుడు మిగులుతాడు.
బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుని ఒంటి నుంచి ఒక్క రక్తం చుక్క భూమిపై పడితే అప్పుడే వందలాది మంది సైనికులు పుట్టుకొస్తారు.
దీంతో దుర్గ అతనితో తలపడి గాయపరిచిన కొద్దీ అతని సైన్యం సంఖ్య పెరుగుతూ పోయింది.
దుర్గాదేవి అయోమయస్థితిలో పడుతుంది.
సైనికులు మూకుమ్మడిగా దుర్గపై దాడి చేస్తూ ఉంటారు. ఆమెకు కలిగిన కోపంతో భయంకర రూపంలోని కాళి ఆవిర్భవించింది.
కాళి సైనికులను సంహరించి , చివరకు రక్తబీజు పై దాడి చేస్తుంది.
రక్తబీజుని ఒడిసి పట్టుకొని అతని ఒంటిలోని రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది.
అనంతరం రక్తబీజుడి తలని చేతిలో పట్టుకొని రక్తం కింద పడకుండా కింద ఓ చిప్ప పట్టుకుంటుంది.
దీంతో రక్తబీజుడు మరణిస్తాడు.

అయితే రక్తబీజు రక్తం తాగిన కాళిపై దుష్ప్రభావం చూపసాగుతుంది.
దీంతో కాళి కరాళనృత్యం చేయడం ప్రారంభిస్తుంది. భూమిపై వేస్తున్న ఒక్కొక్క అడుగుతో కాళి వినాశనం మొదలవుతుంది.
దేవతలు రక్షణకై జోక్యం చేసుకోవాలని శివుడిని ప్రార్ధిస్తారు.
శివుడు యుద్ధభూమికి వచ్చి కాళిని శాంతిపచేయడానికి ఆమెను పలుమార్లు పిలుస్తాడు.
అయితే ఆమె వినిపించుకొనే స్థితిలో ఉండదు.
రాక్షసుల మాంసాన్ని తింటు నృత్యం కొనసాగిస్తుంటుంది. ఆమె కొప్పుముడి తొలిగి కేశరాశిగా మారుతుంది.
విప్పుకొన్న ఆమె కేశపాశం కదలికతో వెలువడే గాలి కొందరు దేవతలను దూరానికి విసిరేస్తుంది.
శివుడు అన్ని విధాలా ప్రయత్నించి చివరకు గత్యంతరం లేక శాంతించమని కోరుతూ కాళి పాదాల కింద చేరతాడు. తన పాదాల కింద ఉన్న వ్యక్తి తన భర్త అని కాళి తెలుసుకొని కొంత సేపటి తర్వాత శాంతిస్తుంది.
ఆ కోపాగ్ని నుంచి బయటపడి శాంతం వహించి మామూలు దుర్గగా మారుతుంది.
ఇలా శివుడు కాళి కింద ఉండడానికి కారణం ఇది అని పురాణాల్లో ఉంది.

LIKE | COMMENT | SHARE |

🔱 శివానందా రూపం శివం శివం 🔱

గీతా మకరందము

14-17-గీతా మకరందము
        గుణత్రయవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అవతారిక - ఆ యా గుణములవలన కలుగు ఫలితములను తెలియజేయుచున్నారు -

సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం
రజసో లోభ ఏవ చ |
ప్రమాదమోహౌ తమసో
భవతోఽజ్ఞాన మేవ చ ||

తాత్పర్యము:- సత్త్వగుణమువలన జ్ఞానము, రజోగుణమువలన లోభము, తమోగుణమువలన అజాగ్రత (మఱపు) భ్రమ, అజ్ఞానము కలుగుచున్నవి.

వ్యాఖ్య:- తత్త్వము బాగుగ దృఢపడుటకొఱకై - ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించిన చందమున - భగవానుడు అర్జునునకు చెప్పినవిషయమునే వివిధరీతుల మఱల మఱల తెలియజెప్పుచున్నారు. లోభము, అజ్ఞానము మున్నగునవి దుఃఖప్రదములు కావున అవాంఛనీయములైనవి. కాబట్టి అవి వేనివలన కలుగునో, అట్టి రజోగుణ, తమోగుణములను దూరీకరించి జ్ఞానదాయకమగు సత్త్వగుణమునే విజ్ఞుడాశ్రయించ వలయును.
ప్రశ్న:- సత్త్వగుణమువలన నేమికలుగును?
ఉత్తరము:- జ్ఞానము.
ప్రశ్న:- రజోగుణమువలన నేమి కలుగును?
ఉత్తరము: - లోభము.
ప్రశ్న:- తమోగుణమువలన నేమి కలుగును?
ఉత్తరము:- అజాగ్రత్త (మఱపు), భ్రమ, అజ్ఞానము కలుగును.

శ్రీ అన్నమాచార్య చరితము

శ్రీ అన్నమాచార్య చరితము

                ----- ప్రశస్థి ------

శ్రీ వెంకటేశ్వరు స్థిరభక్తి ధ్యానించు
             హరికీర్తనాచార్యు డన్నమయ్య
నేతలౌ రాజుల నిరసించి బ్రతికిన
         హరికీర్తనాచార్యు డన్నమయ్య
సర్వ జీవుల యందు సమత జూపిన యట్టి
         హరికీర్తనాచార్యు డన్నమయ్య
పూటకో పాటతో పూజయోనర్చిన
          హరికీర్తనాచార్యు డన్నమయ్య
విశ్వకర్తగు శ్రీమహావిష్ణు దేవు 
నందకాంశంబు నందున నరయ బుట్టి
వేల హరికీర్తనంబుల నిలను బలికి
సన్ను తొందెను జగతిలో నన్నమయ్య

          -------. చరితము ---------

పరగ హూణ పదవ శతాబ్దంబు నందు
కాశి యందున తీవ్రమౌ కఱవు వచ్చె
పండితులు కొంద ఱచ్చోట నుండ లేక
వలస వచ్చిరి దక్షిణ వైపు నకును

వారణాసి నుండి వచ్చిన వారిలో
నందవరము నకును కొందఱేగి
యందు స్థిరత నుండి 'నందవరీకు' లై
పెంపు పొందినారు పేరుగాంచి

నారాయణయ్యను నందవరీకుడు
          కాపురంబుండె నా గ్రామమందు
బాల్యంబు నందునా బాలున కెందుకో
          చదువు లబ్బకనుండె సక్రమముగ
గురువులు పెట్టెడి గురుహింస వలనను
           విపరీత మైనట్టి విసుగుబుట్టె
బహు విరక్తియు బుట్టి బ్రతుకన్న యతనికి
           చావంగ దలచెను చదువు నొదలి
అంత చింతలమ్మ యను గ్రామదేవత
మందిరంబు చెంత మహినియున్న
పుట్ట లోన చెయ్యి పెట్టెనాతం డంత
సర్ప కాటు తోడ చచ్చు టకును 

అంత టమ్మవారు యద్భుత మహిమతో
కరుణ తోడ నతని గావ నెంచి
బాలు నెదుట తాను ప్రత్యక్ష మయ్యును
పరమ వత్స లతతొ బలికె నిట్లు

"సాహసం బేల నీకిట్లు చచ్చుటకును
కలత చెందకు బాలక కలదు శుభము
తప్పకను నీదు మూడవతరము నందు
బాలుడుదయించు శ్రీహరి భావమందు "