29, మార్చి 2022, మంగళవారం

శివార్పణ ఫలితం!*

 *శివార్పణ ఫలితం!*

              ➖➖➖✍️


*తమిళనాడు దగ్గర సముద్ర తీరంలో ‘నాగపట్నం’ అనే ఊరు ఉన్నది.                       అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహాశివభక్తుడు.*


*ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒకరోజున ఉత్సవం చేస్తారు.*


*ఈ జాలరి వాడికి ఒక దినచర్య…అందరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు. ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని ‘శివార్పణం!’ అని సముద్రంలో వేసేవాడు. మిగిలినవన్నీ తను తీసుకునే వాడు.*


*ఇప్పుడు మనం దుకాణాలలో చూసినా మొదటి ఇడ్లీ భగవంతుడి దగ్గర పెట్టి మిగిలిన ఇడ్లీలు జనాలకి పెడుతూ ఉంటారు.*


*ఇతను భక్తిగా చేశాడు. ఇతని బ్రతుకులో తెలిసినదంతా శివార్పణం.*


*నిజానికి భక్తి అంటేనే శివార్పణం. శివార్పణం అని మనసారా అనగలిగితే ఆ మాట చాలు ఆనందింపజేస్తుంది. శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది. శివభక్తి, శివప్రేమ, శివార్పణం ఇలాంటి మాటలు. ఇతనికి తెలిసిన ఒకే పదం శివార్పణం!*


*అటు తర్వాత చేపలు పట్టుకొనేవాడు. ఇతడు జాలరి వాళ్ళకు నాయకుడు. నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళు అదే. ఒక కట్టు ఉండాలి. ఒక పద్ధతి ఉండాలి గనుక ఒక నాయకుడిని పెట్టుకున్నారు. ఈనాయకుడిగా ఉంటూ ఉంటే అందరూ హాయిగా ఉన్నారు. మత్స్యసంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు. *


*ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదు. ఎన్నాళ్ళు సముద్రంలోకి ఎంతోదూరం వెళ్ళి వేటాడుతున్నా చేపలు పడలేదు. దరిద్రం వచ్చింది. ఉన్న నిల్వలన్నీ కూడా నిత్యభోజనాలకీ, కుటుంబపోషణలకీ అయిపోయాయి.*


*చివరికి తిండికి కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ ఇదే పరిస్థితి. ఇళ్ళల్లో పొయ్యి వెలగట్లేదు.*


*ఒకసారి అందరూ గుంపుగా వెళ్ళినప్పుడు వల వేశారు. ఈ పెద్దాయన వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది. ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని కనీవినీ ఎరుగని ఒక చేప వచ్చింది.*


*అది బంగారు రంగు పొలుసులు, రత్నాలు తాపినటువంటి చర్మంతో ఆశ్చర్యకరంగా ఉన్నది.* 


*దానిని వీళ్ళందరూ కష్టపడి పడవ మీదకి తీసుకువచ్చారు. ఈ చేపని కానీ తీసుకువెళ్ళి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకొని వీళ్ళకి కావలసినంత సంపద ఇస్తాడు. లేదా ఎవరికైనా అమ్ముకున్నా దీనినుంచి వచ్చేది మరి ఎప్పుడూ చేపలు పట్టుకోవలసిన అవసరం లేనంత సంపద వచ్చేది.*


*కానీ ఇతనికున్న అలవాటు వచ్చిన మొదటి చేపని శివార్పణం అని వేయడం.*


*పోనీ దీనితోపాటు ఒక రెండు, మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకొని రెండోది పడేయచ్చు. కానీ ఈయనకి వచ్చింది ఒకటే చేప.*


*ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఈయన అలవాటు వాళ్ళందరికీ తెలుసు. మొదటిది శివార్పణం అని వేయడం అలవాటు. నాయకుడు కాబట్టి వద్దు అనలేరు. అప్పుడు ఏం చేస్తాడో అని ఆవేదన  కలిగినది,  వీళ్ళందరికీ. వచ్చింది శివార్పణం ఇవ్వకపోతే ఏమౌతుందో అని భయం లేదు. మిగిలిన వాళ్ళందరూ తిండికి లేదని ఏడిస్తే ఈయన రోజూ శివార్పణం చేయడానికి చేప లేదు అని ఏడ్చేవాడు.*


*అదీ భక్తి అంటే…!*


*ఇతని ఏడుపులో ఆ ప్రేమ ఉంది. మిగిలిన వారికి సంపద లేదే అని బాధ. ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్ళకి నాకు శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది. ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను. శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది అని ఒళ్ళంతా పులకించిపోయింది. కళ్ళవెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి.*


*పైకి తీశాడు ఆ చేపని. వీళ్ళకి భయం వేసి కాళ్ళు పట్టుకున్నారు పారేయకు అని!*


*వీళ్ళెవరూ పట్టట్లేదు అతనికి.    ఆ శివుడికి అర్పిస్తున్నాను అని తీసుకొని ‘శివార్పణం’ అని సముద్రంలో వేశాడు.*


*వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో మహాకాంతిపుంజం కనిపించి ఆ కాంతిపుంజమధ్యంలో వృషభవాహనారూఢుడై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దర్శనమిచ్చి “సంతోషించాను!” అని ఇతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకొని వాళ్ళకి దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు.* 


*’ఒక్క భక్తుడిని అంటిపెట్టుకున్నా చాలు తరించిపోతాం!’ అని చెప్పడం.* *‘స్వయం తీర్త్వా పరాన్ తారయతి’* 


*తాను తరించడమే కాకుండా ఎందరినో తరింపజేశాడు.*


*ఆ భక్తుడి పేరున ఇప్పటికీ అక్కడ ఉత్సవం జరుగుతుంది.*


*ఆ సమీపంలో ఉన్న శివుని ఉత్సవమూర్తియై ఇక్కడికి తెస్తారు.* 


*ఆ జాలరి వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉత్సవం జరుగుతుంది.* 


*భారతదేశం అంతా ఈ దృష్టితో వెతకాలి, తిరగాలి. భగవంతుడిని చరిత్రలో చెప్పిన సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి అని వెతికితే ఇప్పటికీ దొరుకుతాయి.* 


*ఇలా ఈ మహానుభావుని ‘శివార్పణం’ కథ చెప్పుకున్నాం. దీనిని భావించినట్లయితే ‘అర్పణ బుద్ధి’ అంటే ఏమిటో తెలుస్తున్నది.* 


*కొంతమంది భగవంతుడి దయవల్ల సంపాదించి మాటిమాటికీ అంటూ ఉంటారు భగవంతుడు ఇచ్చాడని. కానీ ఎంత ఉన్నా ఇచ్చింది ఏమౌతుందో అనే భయం వాళ్ళకి. ఒకళ్ళకి ఇవ్వడానికి, దానం చేయడానికి కూడా బుద్ధి పుట్టదు.*


*’అర్పణకి’ సిద్ధంగా ఉన్నవాడికే అన్నీ లభిస్తాయి.*


*కనుక అర్పించేదే నీది, దాచుకున్నది నీదికాదు. తరువాత ఎవడిదో అవుతుంది. ఇలాంటి కథలు వింటే స్వార్థరాహిత్యము, త్యాగనిరతి, ఏర్పడి నీతి, నిజాయితీ అభివృద్ధి చెందుతాయి.*


*ఇలాంటి  నిజ జీవిత గాధలను చిన్నప్పటినుంచీ తెలియజేసినట్లయితే పిల్లల్లో పవిత్రమైన సంస్కారాలు వస్తాయి.*


*భగవత్కథ వింటూ ఉంటే మనలో రజోగుణ తమోగుణాలు పోయి మంచి సంస్కారాలు మేల్కొంటాయి.* 


*భగవంతుడు ఒక తల్లిదండ్రులకంటే ఎక్కువగా కనురెప్పలా కాచుకుంటాడు అనడానికి చాలా అద్భుతమైన చరిత్రలు చాలా వున్నాయి.*

            *ఓం నమ:శ్శివాయ:  !!*


🌹🌼🌼🌼🌼🌹🌹🌼🌼🌼🌼🌹


*📮 ఈ మెసేజ్ చదివి ఊరుకోవడం కాకుండా మీకు వీలైనంత వరకు తప్పకుండా ఫార్వర్డ్ మరియు షేర్ చేయగలరు.*

పిల్లలు చెడిపోవడానికి

 *తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..*


*పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10 % , కానీ 90% మాత్రం తల్లిదండ్రులే..!*🙏


పిల్లల్ని గారాబం *శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..*  పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి  ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు. 


ఇప్పుటి తరం 70% పిల్లలు..

👉తల్లిదండ్రులు కారు, బండి తుడవమంటే తుడవరు..

👉మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

👉లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

👉కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.

👉రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు...

👉గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు..

👉తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..

👉ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..

👉ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

👉అతిథులు వస్తే కనీసం గ్లాసేడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు..

👉20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు..

👉బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి.. 

👉కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు..

👉వారిస్తే వెర్రి పనులు..

👉మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,

కానీ కారణం మనమే..

ఎందుకంటే *మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*


చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..

గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..


*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది*.. 

*కష్టం గురించి తెలిసేలా పెంచండి* 

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం *విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..*


ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.. మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు..


*అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..*

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..


భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..


మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం.. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం..


👉కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...


గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనా తీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, *100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..


03వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు..

05వ తరగతి వారికి అల్సర్, బీపీలు..

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..అందుకే *తల్లిదండ్రులు మారాలి..*


*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి...

*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*


కేవలం గుడికి వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు.


సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..

పిల్లలకు..👇

👉  *బాధ్యత* 

👉  *మర్యాద*

👉  *గౌరవం* 

👉  *కష్టం* 

👉  *నష్టం* 

👉  *ఓర్పు*

👉  *సహనం*

👉  *దాతృత్వం*

👉  *ప్రేమ*

👉  *అనురాగం*

👉  *సహాయం*

👉  *సహకారం*

👉  *నాయకత్వం*

👉  *మానసిక ద్రృఢత్వం* 

👉  *కుటుంబ బంధాలు*

👉  *అనుబంధాలు*    

👉  *దైవ భక్తి*

👉  *దేశ భక్తి*


కొంచెం *కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..* 

మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం, ఆనందం కోసం న్యాయంగా బ్రతుకుదాం.


ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, *ఉత్తమ జీవన విధానం* వారికి అందించిన వారమవుతాం..


భావితరాల పిల్లల కోసం ,




సూక్ష్మక్రిమి పరిజ్ఞానం

 ఆయుర్వేదం నందు గల సూక్ష్మక్రిమి పరిజ్ఞానం  - 


     ఇప్పటివరకు మనం అనుకుంటున్నట్టుగా సూక్ష్మక్రిములను కనుగొన్నది పాశ్చత్య శాస్త్రజ్ఞులు మాత్రం కాదు.  వారికంటే కొన్ని వేల సంవత్సరాల మునుపే మన పూర్వీకులకు సూక్ష్మక్రిముల పైన మరియు అవి కలుగచేసే వ్యాధుల పైన సంపూర్ణ అవగాహన కలదు. ఈ విషయాల గురించి నేను తెలుసుకొవడానికి కొన్ని అత్యంత పురాతన ఆయుర్వేద గ్రంథాలు పరిశీలిస్తున్నప్పుడు వాటిలో కొన్ని చోట్ల ఈ సూక్ష్మక్రిమి సంబంధమైన అనేక విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. ఆ విలువైన సమాచారాన్ని మీకు కూడా తెలియచేయుటకు ఈ పోస్టు పెడుతున్నాను .


         సుశ్రుతునకు సూక్ష్మక్రిములుకు సంబంధించిన పరిజ్ఞానం అపారంగా ఉన్నది అని చెప్పవచ్చు. రోగానికి కారణం అయ్యే సూక్ష్మక్రిములను గురించిన జ్ఞానమునకు "భూతవిద్య " అని పేరుకలదు . అష్టాంగహృదయములో ఇది ఒక ప్రత్యేక భాగముగా పరిగణించబడినది. భూతవిద్యా లక్షణమును చెప్పునప్పుడు దేవాసుర , గంధర్వ , యక్ష , రక్ష , పితృ , పిశాచ , నాగ అనే భూత గ్రహాలుగా సూక్ష్మజీవులను వర్ణించాడు. కొన్ని మంత్రగ్రంధాలలో పైన చెప్పిన పేర్లు కలవారు వేరే లోకమునకు సంభంధించినవారుగా దుష్టశక్తులుగా వర్ణించి వారు మానవులను పట్టి పీడించువారుగా ఉన్నది. కాని సుశృతుడు దీనికి ఒప్పుకోడు వారు దేవాసుర , గంధర్వులు ద్యులోక వాసులు వారు భూలోకమునకు వచ్చి మనుష్యులతో కలిసి ఎన్నటికీ నివసించరు అని ఆయన అభిప్రాయం .


       సుశ్రుతుడు సూక్ష్మజీవుల గురించి వివరిస్తూ వాటిని గ్రహములగా పిలుస్తూ ఈ విధముగా చెప్పుచున్నాడు. కోట్లకొలది అసంఖ్యాకముగా ఉన్న ఈ గ్రహములు రక్తము , మాంసములను భుజించి వృద్ది అగుచుండెను . అవి మహాపరాక్రమము కలిగినవి. అయినను అవి సూర్యుని వెలుగుకు జడిసి రాత్రుల యందు సంచరించుచుండును . చీకటి , నీడగల తావుల యందు పగలంతా ఉండును. ఈ సూక్ష్మక్రిములు నేలమీదను , అంతరిక్షము నందు , అన్ని దిక్కుల లోను పాడిపడిన చీకటి గృహముల యందు నివాసము ఉండును. ఈ సూక్ష్మక్రిములు ఒకొక్క కాలము నందు విజృంభించి జనులను పీడించునని సుశృతుడు తెలియచేసెను .


         వ్రణసంబంధ ఇన్ఫెక్షన్స్ గురించి సుశృతుడు వివరించుతూ ఈ సూక్ష్మక్రిములకు మాంస , రక్తం ప్రియం అగుటచేత గాయములలోకి తరచుగా ప్రవేశించి సమస్యలను కలుగచేయునని తెలుపుతూ ఈ రోగకారణమగు సూక్ష్మక్రిములను మూడు ప్రధాన గణములుగా గుర్తించారు. 


            ఇప్పుడు సుశృతుడు రోగహేతుకారణాలైన సూక్ష్మజీవులను మూడు రకాలుగా వర్గీకరించారు. వాటి గురించి మీకు వివరిస్తాను.  అవి 


 1 -  పశుపతి అనుచరులు .


 2 -  కుబేర అనుచరులు .


 3 -  కుమార అనుచరులు .


 *  పశుపతి అనుచరులు  -


      మనస్సు , ఇంద్రియములను వికలమొనర్చి  భ్రమ , ప్రలాప , ఉన్మాదములను కలిగించును. 


 *  కుబేర అనుచరులు  - 


       ఇవి యక్షరక్షో గణములకు చెందిన క్రిములు . శారీరక బాధలను మాత్రమే కలిగించును.


 *  కుమార అనుచరులు  -


       పసిపిల్లలను వశపరుచుకొని బాధించును . వీటినే బాలగ్రహములుగా పిలుస్తారు . 


         పైన చెప్పినవిధముగా సుశ్రుతుల వారు సూక్ష్మక్రిములను మూడు రకాలుగా వర్గీకరించారు . మలేరియా జ్వరమునకు రురుజ్వరం అని తక్ష్మ జ్వరం అనియు అధర్వణవేదములో వ్యవహరించబడినది. ఈ జ్వరమును కలిగించే సూక్ష్మక్రిములు ఉండు నివాసస్థలము గురించి చెప్పుతూ  గుడ్లగూబ , గబ్బిలము , కుక్క , తోడేలు , డేగ , గద్ద  ఈ జంతుపక్షి శరీరాల్లో మలేరియా క్రిములు ఎల్లప్పుడూ ఉండి వాటి మలముతో బయటకి వచ్చి జనులు తాగే నీటిలో కలిసి మనుష్యులకు సంక్రమించునని ఉన్నది.


           ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో కొన్నింటిలో ఈ విధముగా ఉన్నది. క్రిములు శరీరం నందు ప్రవేశించినంత మాత్రాన రోగము రాదు . శరీరము నందు ఓజస్సు మిక్కిలిగా అభివృద్ధిచెందిన ఊర్జశక్తి అన్ని రకముల క్రిములను జయించుచున్నది. ఇక్కడ మనశరీరములోని రోగనిరోధక శక్తి గురించి వివరణ ఇవ్వడం జరిగింది. శరీరానికి హితమైన ఆహారం సేవించకుండా విరుద్ద ఆహారాలను సేవించువారికి , ప్రకృతివిరుద్ధ నియమాలు పాటించువారికి క్రిములు బాధించును గాని  అగ్నిదీప్తి చక్కగా ఉండి యవ్వనంలో ఉన్నవారికి , స్నిగ్ధ శరీరులకు , వ్యాయమం చేయుచుండువారికి , శరీరబలం అధికంగా ఉన్నవారికి క్రిములు ఏమి చేయలేవు .


               క్రీ . శ 18 వ శతాబ్దములో మైక్రోస్కోప్ యంత్రము కనిపెట్టబడిన పిమ్మట సూక్ష్మజీవులను కనుగొన్నారు అని మన పాఠ్యపుస్తకాలలో చదువుతున్నాం .కాని కొన్నివేల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు ఈ సూక్ష్మక్రిమి విజ్ఞానం సంపాదించారు. మన మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు వారు తమ మనోనేత్రముతో అన్నింటిని దర్శించగలరు మరియు కనుగొనగలరు. మైక్రోస్కోప్ గురించి దానికి పాశ్చాత్యులు కనుగొన్నారు అని గొప్పగా చెప్పుకుంటాం కాని అధర్వణవేదము నాలుగోవ కాండ ఇరవైవ సూక్తములో పిశాచక్షయ మంత్రములో మైక్రోస్కోప్ వంటి "బిబిర్హిని " అను ఒక దివ్య ఔషధి లభించినట్టు కశ్యప మహాముని ఈ ఔషదీ సహయముతో భూమి మరియు అంతరిక్షంలో వ్యాపించి ఉన్న సర్వరోగ క్రిములను చూడగలిగెను అని ఈ మంత్రం చెప్పుచున్నది. క్రీ .శ  మూడొవ శతాబ్దములో బింబసారుని ఆస్థాన వైద్యుడు అయిన జీవకునికి ఇట్టి మహత్తర ఔషధి లభించెనని గ్రంధస్థం చేయబడి ఉన్నది. దీని సహాయముతో నేటి ఎక్సరే యంత్రము వలే శరీర అంతర్భాగము నందలి శరీరభాగాలను చూస్తూ పేగులలో చిక్కుకున్న రాళ్లను తీసివేశారు అని ఎన్నో పురాతన గ్రంథాలలో కలదు.


                           సమాప్తం 


    మరింత విలువైన సమాచారం నేను రాసిన గ్రంథముల యందు సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. 


      గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

సత్సంగం

 🦜 *తెలివైన చిలుక* 🦜


ఒక వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి  ప్రతిరోజు వెళ్ళుతుండేవాడు.


ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరములో ఉంచి పోషించేవాడు.


ఒక రోజు చిలుక తన యజమానిని అడిగింది, 'మీరు ఎక్కడకు రోజు వెళ్తున్నారు' అని?


అతను ఇలా అన్నాడు, "మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను రోజూ సత్సంగానికి వెళతాను."


"మీరు నాకు ఒక సహాయం చేయగలరా?" అని అడిగింది ఆ చిట్టిచిలుక ఆ యజమానిని. "నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలను అని మీ గురువు గారిని అడిగి చెప్పండి" అని.


మరుసటి రోజు, యజమాని సత్సంగానికి వెళ్ళాడు.


సత్సంగం ముగిసిన తర్వాత, అతను గురువు దగ్గరకు వెళ్లి, "మహారాజ్, నా ఇంటిలో ఒక చిలుక ఉంది, అది స్వేచ్ఛ ఎప్పుడు పొందగలదో మిమ్మలను అడిగి తెలుసుకోమని ప్రాధేయపడింది" అని.


అది విన్న వెంటనే, గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.


ఇది చుాసిన చిలుక యజమాని భయపడి,నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.


అతను ఇంటికి చేరుకొన్నాడు. అతని చిలుక అతనిని అడిగింది, 'మీరు నా ప్రశ్నను గురువుగారిని అడిగారా?' అని.


యజమాని బదులిచ్చాడు- 'నేను అడిగాను కానీ నీ అదృష్టం బాగాలేదు. నేను నీ ప్రశ్న అడిగిన వెంటనే, గురువుగారు అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయారు' అని.


"సరే సరే, నేను అర్థం చేసుకున్నాను" అన్నది ఆ చిలుక.


మరుసటి రోజు సత్సంగానికి వెళ్తూ, యజమాని పంజరంలో ఉన్నచిలుక అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూశాడు.


యజమాని పరీక్షగా చూసి చిలుక చనిపోయిందనుకుని  బయటకు తీసాడు. దానిని నేలమీద ఉంచాడు. వెంటనే ఆ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. 


చేసేది లేక సత్సంగం కోసం మామూలుగా వెళ్లాడు ఆ యజమాని.


గురువు అతనిని చూసి, దగ్గరకు పిలిచి, "నీ చిలుక ఎక్కడ ఉంది?" అని అడిగాడు.


"నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు, నా చిలుక అపస్మారక స్థితికి గురై, పంజరంలో పడి ఉంది. దాని ఆరోగ్యం తనిఖీ చేయడానికి నేను పంజరం తెరిచి దానిని నేలమీద ఉంచినప్పుడు, అది పారిపోయింది" అని దిగులుగా చెప్పాడు.


గురువు నవ్వి, "మీ చిట్టిచిలుక మీ కన్నా ఎక్కువ తెలివిగలది. అది నేను ఇచ్చిన చిన్న సూచన అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది.


కానీ మీరు చాలా రోజుల పాటు సత్సంగానికి వస్తూ కూడా సాధన చేయక, ఈ ప్రపంచంలోనే  భ్రమ అనే పంజరంలో చిక్కుకొని ఉన్నారు."


అని అన్నాడు.


యజమాని సిగ్గుతో తలదించు కొన్నాడు.


దూరం నుంచి చిలుక గురువుకు కృతజ్ఞతలు తెలుపుకుంది.


*నీతి :: సత్సంగం యొక్క ఉద్దేశం కేవలం భక్తికోసం కాదు, కాలక్షేపం కోసం కానే కాదు. అజ్ఞానం నుండి, అంధకారం నుండి, భ్రమ నుండి మనం బయటపడి స్వేచ్ఛగా విముక్తలమై దైవానికి చేరువకావడం కోసం అని గ్రహించాలి...☝️

సకాలసంధ్యావందనం

 🌸🌸🌸                       🌸🌸🌸

*సకాలసంధ్యావందనం ఎంతో ముఖ్యమైనది...*




                                                                        సంధ్యాసమయంలో భగవద్ధ్యానం మంచిదనీ అంటారు. సంధ్యాకాలం అంటే సరిగ్గా ఏ సమయం? 'సకాలం'లో సంధ్యావందనం చేయాలి కదా? ఆ 'సకాలం' ఏమిటి? 


      రోజుకి మూడు సంధ్యలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. 1. ప్రాతఃసంధ్య, 2. మధ్యాహ్న సంధ్య, 3. సాయం సంధ్య. ఇవికాక కొన్ని ఉపాసనలకు చెప్పబడ్డ సంధ్య - తురీయ సంధ్య. ఇది నాలుగవది. దీని సమయం అర్ధరాత్రి. (కొందరు ఇది ఆచరిస్తుంటారు)


       ఉదయానికి ముందు వచ్చేకాలం 'ప్రాతఃసంధ్య'. రాత్రికి ముందు వచ్చేది ' 'సాయంసంధ్య', మధ్యాహ్నవేళ 'మధ్యాహ్నిక సంధ్య'. 


*ఉదయా ప్రాక్తనీ సంధ్యా*

*ఘటికా త్రయ ముచ్యతే ౹*

*సాయం సంధ్యా త్రిఘటికా*

*అస్తాదుపరి భాస్వతః ౹౹*


సూర్యోదయానికి ముందు దాదాపు 70 నిమిషాల కాలం ప్రాతః సంధ్యకు ముఖ్యకాలం. సూర్యుడస్తమించడానికి ముందు ఇరవై నిమిషాలు మొదలుకొని, సూర్యుడస్తమించిన తరువాత 30 నిమిషాల కాలం సాయంసంధ్యకు ముఖ్య కాలం. ఇందులోనూ ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలున్నాయి. 


1. *ఉత్తమా తారకోపేతా*

    *మధ్యమా లుప్త తారకా ౹*

    *అధమా సూర్యసహితా*

    *ప్రాతఃసంధ్యా త్రిధామతా ౹౹*


తెల్లవారు ఝామున నక్షత్రాలుండగా ప్రాతః సంధ్యావందనానికి ముఖ్యకాలం. ఇదే సకాలం. తారకలు లేని ప్రాతఃకాలం మధ్య కాలం, సూర్యుడు ఉదయించిన తరువాత సంధ్యా వందనానికి అధమ కాలం, సకాలంలో చేయడమే సర్వశ్రేష్ఠం. అలా కుదరనప్పుడు, మానేయడం మంచిది కాదు కనుక, "ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం" అధిక అర్ఘ్యప్రదానంతో సంధ్యోపాసన చేయాలి. 


2. *ఉత్తమా సూర్యసహితా*

    *మధ్యమా లుప్త భాస్కరా ౹*

    *అధమా తారకోపేతా*

    *సాయం సంధ్యా త్రిధామతా ౹౹*


సాయంవేళ సూర్యుడుండగా చేసే సంధ్యావందనం ముఖ్యకాలం, సకాలం. సూర్యుడస్త మించినప్పుడు మధ్యమం. నక్షత్రోదయం తరువాత చేయడం అధమం. కానీ 'సకాలం' దాటిపోతే, ప్రాతః సంధ్యకు లాగానే, 'ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం' అధిక అర్ఘ్య ప్రదానం చేయాలి. 


'మధ్యాహ్న సంధ్య' అంటే మధ్యాహ్నం 11 గంటల తరువాత నుండి సాయంత్రం లోపల చేయాలి.......

సుభాషితం

 🕉️✡️ *సుభాషితమ్* ✡️🕉️

--------------------------------------------


శ్లోకం:

*అహో దుర్జనసంసర్గాత్*

*మానహానిః పదే పదే।*

*పావకో లోహసఙ్గేన*

*ముద్గరైరభిహన్యతే॥*

                  ~సుభాషితరత్నావళి


తాత్పర్యం:

దుర్జనులతో సహవాసము చేయడం వలన గౌరవానికి అడుగడుగునా భంగము కలుగును. ఇనుముతో సంబంధమువల్ల అగ్నిని సమ్మెటలతో కొడతారు.

------------------------------------------


🌸 *మరొక సుభాషితం* 🌸


శ్లో.

*న శరీరమలత్యాగాత్ నరో భవతి నిర్మలఃl*

*మానసే తు మలే త్యక్తే తతో భవతి నిర్మలఃll*


తా.

"శారీరకమాలిన్యమును తొలగించుకొనుటవల్ల మానవుడు నిర్మలుడు కాడు. మనోమాలిన్యమును తొలగించుకోవడం వల్లనే నిజముగా నిర్మలుడు అగుచున్నాడు".

-----------------------------------------