15, సెప్టెంబర్ 2022, గురువారం

సాధనకు సమయం దొరకడంలేదు

 సాధనకు సమయం దొరకడంలేదు 

చాలామంది సాధకులు చెప్పేది ఏమిటంటే నాకు సాధనకు సమయం దొరకటం లేదు.  నిజంగా ఇది వినటానికి వింతగా వున్నా ఇది నిజం. మీకు ఎందుకు సమయం దొరకడంలేదు అని అడిగితె వాళ్ళు చెప్పే సమాదానాలు.  నాకు ఆఫీసులో పని వత్తిడిగా వుంది. ఇంట్లో నాభార్య నాకు అనుకూలంగా లేదు కాబట్టి నా మనస్సు ఎప్పుడు చికాగుగా వుంటున్నది. దేనిమీద మనస్సు నిలవటం లేదు.  నిజానికి నాకు ఒక్క క్షణం కూడా తీరిక దొరకటం లేదు మరి ఎలా సాధన చేయాలి. అని అనేక సాకులు చెపుతువుంటారు. యదార్ధానికి ఇవి ఏవి కూడా సాధనకు అవాంతరాలు కావు వారికి సాధన చేయాలని ఉంటే సమయం అదే దొరుకుతుంది. 

మీరు రోజు టీ కాఫీ తాగుతున్నారా అయ్యో టీ తాగకుంటే నాకు వెంటనే తలకాయ నొప్పి పుడుతుంది. కాబట్టి సమయానికి నాకు టీ కావలసిందే. మీరు రోజు ఫలహారాలు తింటున్నారా అంటే నాకు బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి.  రోజు ఒకటే తినాలంటే నాకు ఇష్టముండదు. అంటారు.  మరి భోజనం సంగతి అంటే ఏ పాటు తప్పినా సాపాటు తప్పదుగా అని హాస్యం చేస్తాడు. సమయానికి భోజనం చేస్తాను  అందుకే ఇంతమాత్రం ఆరోగ్యంగా వున్నాను అని అంటారు. నీ దైనందిక జీవితంలో ప్రతిదానికి నీకు సమయం దొరుకుతుంది మరి సాధనకు ఎందుకు సమయం కేటాయించలేక పోతున్నావు? నీ దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు.  చాలా సంతోషం మరి నీకు ఈ దేహాన్ని ఇచ్చిన ఆ భగవంతునికి సాధన చేయటానికి సమయాన్ని ఎందుకు కేటాయించలేక పోతున్నావు? 

నిజానికి నీకు చిత్త శుద్ధి ఉంటే నీ దైనందిక జీవితంలో సాధనను కూడా ఒకటిగా చేసుకుంటావు.  ఆలా చేసుకొని చూసుకో.  తప్పకుండ నీకు సాధనకు సమయం చేకూరుతుంది. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ప్రతి సాధకుడు తన దైనందిక జీవితంలో సాదనను కూడా ఒక భాగంగా చేసుకోవాలి, అప్పుడే సాధన నిర్విఘ్నంగా కొనసాగుతుంది. తెలివిగా ప్రతి వక్కరు వారి దైనందిక జీవితాన్ని ఒక ప్రణాళికా బద్దంగా రూపుదిద్దుకుంటే తప్పకుండ సాధన నిరంతరాయంగా కొనసాగుతుంది. మోక్షం కారతలామలకాలం అవుతుంది.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ.


గురువుగా ఉన్నత స్థానాన్ని

 🎻🌹🙏ఓ రోజున... రాముడు తన దర్బారులో కొలువై ఉన్నాడు...


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


 అతని చుట్టూ మంత్రులు పరివేష్టించి ఉన్నారు. రుషివర్యులు ఉచితాసనాలని అలంకరించారు.


 అలాంటి నిండుసభలో రాముల వారు లక్ష్మణుని వంక చూస్తూ ఎవరన్నా పౌరులు కార్యార్థులై, తన సభకు చేరుకున్నారా అని అడిగాడు. ప్రత్యేకించి విన్నవించుకునేందుకు ఎవరికీ ఏ సమస్యా, అవసరమూ లేవని బదులిచ్చాడు లక్ష్మణుడు.


 పోనీ రాజద్వారం దగ్గర ఎవరన్నా సమస్యలతో నిలబడి ఉన్నారేమో చూసి రమ్మని పంపాడు రాముడు. రాముని ఆజ్ఞ మేరకు రాజద్వారాన్ని చేరుకున్న లక్ష్మణుడికి అక్కడ ఓ గాయపడిన కుక్క కనిపించింది. ‘ఓ శునకమా! నీకేం ఆపద వచ్చింది? ఎలాంటి సంకోచమూ లేకుండా నీకు వచ్చిన సమస్యని చెప్పుకో!’ అంటూ అభయమిచ్చాడు. 


దానికి ఆ కుక్క తన సమస్యని రామునికే విన్నవించుకుంటానని పట్టుపట్టింది. దాంతో దానిని రాముని సమక్షానికి తోడుకుపోక తప్పలేదు.వెంటనే ఆ కుక్క – ‘ప్రభూ! రాజన్నవాడు తన పౌరులకి దేవునితో సమానం. వారికి సృష్టి, స్థితి, లయకారుడు ఆ రాజే! అందుకనే తన రాజ్యంలోని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత రాజు మీదే ఉంటుంది.


 దానం, కరుణ, సత్పురుషులని ఆదరించడం, మంచి నడవడి వంటి లక్షణాలన్నీ కూడా ఆ ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. కానీ నీ రాజ్యంలో ఒకరు ధర్మాన్ని తప్పి నా మీద దాడి చేశారు. సర్వదసిద్ధుడనే పరివ్రాజకుడు నన్ను గాయపరిచాడు,’ అంటూ వాపోయింది.


 ఆ శునకం మాటలు విన్న రాములవారు వెంటనే సర్వదసిద్ధుని పిలిపించారు. ‘ఆ కుక్కను గాయపరిచిన మాట నిజమే ప్రభూ! నేను యాచనకు బయల్దేరిన సమయంలో ఈ కుక్క నా దారికి అడ్డంగా నిలిచింది. అసలే ఆకలితో ఉన్న నేను ఆగ్రహాన్ని పట్టలేకపోయాను. ఆ ఆగ్రహంతోనే ఈ కుక్కను గాయపరిచాను.


 నేను చేసిన పని తప్పేనని ఒప్పుకుంటున్నాను. అందుకుగాను మీరు ఎలాంటి శిక్షను విధించినా సంతోషంగా స్వీకరిస్తాను,’ అంటూ వేడుకున్నాడు సర్వదసిద్ధుడు. సర్వదసిద్ధునికి ఎలాంటి శిక్ష విధించాలా అని దర్బారులో జనమంతా తర్జనభర్జన పడుతుండగా ఆ శునకం- ‘ప్రభూ! తమరేమీ అనుకోనంటే నాది ఒక విన్నపం. 


మీకు నిజంగా నా పట్ల జాలి కలిగితే, నన్ను కరుణించాలన్న తలంపు మీలో ఉంటే నేను చెప్పిన శిక్షను అతనికి విధించండి,’ అని కోరింది. ఆ మాటలకు రాములవారు అంగీకరించగానే- ‘ఈ బ్రాహ్మణుడిని కులపతిగా నియమించండి. అతడిని కలంజర అనే మఠానికి అధిపతిని చేయండి,’ అని కోరింది.


 ఆ మాటలు విన్నంతనే సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడు మాత్రం తనకు శిక్షకు బదులుగా పదవి లభించినందుకు సంబరపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘అదేమిటీ, నీకు జరిగిన అన్యాయానికి బదులుగా సర్వదసిద్ధుని కఠినంగా శిక్షించమని కోరతావనుకుంటే... అతనికి కులపతి హోదానీ, మఠాధిపతి పదవినీ కట్టబెట్టించావెందుకనీ,’ అంటూ అడిగారు సభలోని పెద్దలు. 


దానికి ఆ శునకం ఇలా బదులిచ్చింది- ‘అయ్యా గత జన్మలో నేను ఆ మఠాధిపతిని. రుషులను ఆదరిస్తూ, దేవతలని పూజిస్తూ, సేవకుల బాగోగులను గమనిస్తూ, అందరికీ పంచగా మిగిలిన ఆహారాన్ని భుజిస్తూ చాలా నిష్టగా జీవించాను. 


అయినా కూడా కుక్కగా జన్మించాల్సి వచ్చింది. అంత సత్ప్రవర్తనతో మెలిగిన నేను ఈ స్థితికి చేరుకుంటే... చిన్నపాటి కోపాన్ని కూడా అదుపు చేసుకోలేని ఆ సర్వదసిద్ధుడి గతేమవుతుందో ఆలోచించండి,’ అంటూ నవ్వింది. 


అధికారం చేతిలోకి వస్తే మనిషి విచక్షణలో మార్పు వస్తుంది. ఆ మత్తులో అతను తెలిసో తెలియకో చిన్నచిన్న పొరపాట్లు చేయడం ఖాయం. మఠాధిపతి హోదాలో అతిపవిత్రంగా ఉండాల్సిన మనిషి ఇంకెంత నిష్టగా ఉండాలో కదా! ఈ విషయాన్ని సున్నితంగా తెలియచేస్తోంది పై కథ. 


ఇందులో ఒక పక్క కుక్క చూపించిన సమయస్ఫూర్తి అబ్బురపరచినా... గురువుగా ఉన్నత స్థానాన్ని అలంకరించేవారు ఎంత పవిత్రంగా ఉండాలో హెచ్చరిస్తోంది..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

నిత్యాన్నదాన సత్రం

 బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం, బీచుపల్లి క్షేత్రము,  NH - 44

జోగుళాంబ గద్వాల జిల్లా.

==================

మహాలయ పక్షాలు - 

బ్రాహ్మణ సమారాధన

==================

తేదీ *11-09-2022 నుండి 25-09-2022 వరకు మహాలయ పక్షాలు* పురస్కరించుకుని పితృ దేవతలకు మహాలయ పక్షాలలో నదీ పరీవాహక ప్రాంతానికి వచ్చి కార్యక్రమం చేసుకోవడం వీలుకాని వారికి, స్వంత ఇంట్లో కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నవారికి కూడా *బ్రాహ్మణ సమారాధన* అనే పితృ మోక్ష సేవా కార్యక్రమం అందరికి ట్రస్టు బోర్డు అవకాశము కల్పించినది. 

మీరు, మీ సన్నిహితులు ఈ సదవకాశం వినియోగించు కొనగలరని మనవి.


*Rs. 1000/-* నుండి ఆపైన పంపిన వారికి మన సత్రంలో *మహాలయ పక్షాలలో బ్రాహ్మణ సమారాధనను* మీరు సూచించిన వారి పేరుపై తిథి లేదా తేదీ రోజున చేయుటకు నిర్ణయించనైనది.


మీరు సత్రం *QR Code* లో డబ్బు వేసినట్లుగా మరియు అన్నదానం చేసే వారి పూర్తి వివరములు Watsup No. *9440722088* ద్వారా తెలియజేసినచో మీకు రశీదుని పోస్టు ద్వారా పంపడం జరుగుతుంది.

*కావున అందరు పితృ యజ్ఞంలో పాల్గొన వలసినదిగా కోరుచున్నాము.*

                     ఇట్లు:-   ట్రస్ట్ బోర్డు

         బ్రాహ్మణ సత్రం,  బీచుపల్లి

నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని

 రాత్రి భోజనాల తర్వాత ఒకటీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది. 


ఆమె పిల్లలు పడుకున్నారు!


భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.


చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది.


ఆ  ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!


"ఏమైంది? ఎందుకు  ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.


 నిన్న నా సెకండ్ క్లాస్  విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.


"అయితే...?"


"ఇదిగో! ఈ చివరి  పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"


భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"


హెడ్డింగ్ ఇలా పెట్టాడు


💥నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక.💥


అమ్మానాన్నలు  స్మార్ట్ ఫోన్ ను చాలా ప్రేమిస్తారు!


వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా...!!


నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!


అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్  చేతిలోకి తీసుకుని  జవాబిస్తారు!


కానీ... నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ...

నేను  ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!


వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!


వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు! 

అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!


అదే ఒకవేళ నాతో  మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే  ఫోన్ కి జవాబిస్తారు!


అమ్మానాన్నలు

స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!

ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!

దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!

దాన్ని చాలా ఇష్టపడుతారు!!

దానితో రిలాక్స్ అవుతుంటారు!!

దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!


దానిని ఎపుడు పనివాళ్ళకి అప్పగించరు


నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోన్ ఒక్కగంట పనిచేయకపోతే చాలా కంగారుపడతారు హడావిడి చేస్తారు 


రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!

ఉదయం లేవగానే దాన్నే  చేతిలోకి తీసుకుంటారు!!


కాబట్టి! నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్న  చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!! 


భార్య చదువుతుంటే... విన్న  భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...

"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.


"మన కొడుకు" అంది భార్య కన్నీరు కారుతుండగా!


వస్తువులను ఉపయోగించుకోవాలి!

బంధాలను ప్రేమించాలి!!


అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!......


ఇది నిజంగా జరిగిన కథ.. 


కాబట్టి ఇలాంటి కథలో తల్లిదండ్రులు మీరు కాకండి ..🙏


🙏దయచేసి ప్రతిఒక్కరూ ఆలోచించండి 🙏


 *మీ గుండెను తాకితే ... మరికొన్ని గుండెలకు చేర్చండి ,,, కొంతమందైనా మారే అవకాశం కల్పించండి*

ఆచరించదగిన ధర్మములు:*

 🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*మన నిత్య జీవితంలో…*

 

     *ఆచరించదగిన ధర్మములు:*

                ➖➖➖✍️


**1. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?*


*జ. పిల్లలకు ‘9‘ వ నెలలో కాని, ’11‘వ నెలలో కాని, ‘3‘వ సంవత్సరం లో కాని తీయవలెను.*


**2. పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?*


*జ. ఆడ పిల్లలకు ‘5‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. 6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.*


**3 .పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు ?*


*జ. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి , తేనె, పంచదార, వీటిని పంచామృతం అని,*

*ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు.*


**4. ద్వారానికి అంత ప్రాముఖ్యం ఎందుకు ఇస్తారు?*


*జ. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.*


**5. తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?*


*జ. తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు, మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.*


**6. తీర్థ మంత్రం:*


*జ. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప ఉశమనం విష్ణుపాదోదకం శుభం .*


**7. స్నానము ఎలా చేయ వలెను?*


*జ. నదిలో ప్రవహమునకు ఎదురుగ పురుషులు, వాలుగ స్త్రీలు చేయవలెను. చన్నీటి స్నానము శిరస్సు తడుపుకొని, వేడి నీటి స్నానము పాదములు తడుపుకొని ప్రారంభించ వలెను. స్నానము చేయునపుడు దేహమును పై నుండి క్రిందకు రుద్దుకొనిన కామేచ్ఛ పెరుగును. అడ్డముగా రుద్దుకొనిన కామేచ్ఛ నశించును.*

*సముద్ర స్నానము చేయునపుడు బయట మట్టి ని లోపలి వేయవలెను. నదులలో, కాలువలు, చెరువులలో చేయునపుడు లోపల మట్టిని ముమ్మారు బయట వేయవలెను.*


**8. ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము ఉంటుంది?*


*జ. గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది.*

*గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది.* 

*పుణ్య ప్రదేశాల్లో, దేవాతా సన్నిదిలోను చేస్తే పదివేల రెట్లు వస్తుంది.* 

*శివసన్నిధిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద కుర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కుర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది.*

*రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఖము, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.*


**9. పూజగది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకు అంటారు?*


*జ. తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖంగా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణ ముఖంగా ఉండకూడదని అంటారు.*


**10. ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?*


*జ. సూర్య భగవానుని ఉ॥4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును. మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహువునకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేళ.  రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణా కటాక్షములు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారు ఝామున మూడు గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంఠవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది. (ఇది నిబంధన మాత్రం కాదు. సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును పూజించవచ్చు )*


**11. హనుమంతునకు, సువర్చలకు వివాహం జరిగిందా?*


*జ. కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. విషయం తెలిసిన సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలను వివాహమాడమన్నాడు. హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు.      ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు. ఇచ్చిన మాట ప్రకారం, సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారం.*


**12. ఈశాన్యాన దేవుణ్ణి పెట్టే వీలులేకపోతే?*


*జ. మారిన జీవన పరిణామాల దృష్ట్యా, ఉద్యోగ నిర్వహణలవల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి.*


**13. పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?*


*జ. పార్వతి, పరమేశ్వరులను దర్శించడానికిఅనేక మంది తాపసులు కైలసానికి వస్తారు. అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవి, జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది. తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది.*


**14. మహాభారాతాన్ని వినాయకుడు ఎక్కడ వ్రాశాడు?*


*జ. వ్యాసుడు చెపుతుంటే వినాయకుడు ఘంటం ఎత్తకుండా వ్రాసింది మన భారత దేశ చివర గ్రామమైన “మాన ” లో.  హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం. బదరినాద్ వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు.     “జయ” కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసుని పలుకు ప్రకారం రాస్తుంటే పక్కన ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల, ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని మౌనం వహించి ప్రవహిస్తుంది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺

శుక్ర మౌఢ్యమి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*సెప్టెంబర్ 15 గురువారం నుండి శుక్ర మౌఢ్యమి ప్రారంభం...*


*🌓 డిసెంబర్ 2 వరకు శుక్ర మౌడ్యమి 🌗*


జ్యోతిష్య శాస్త్రం రెండు రకాల మౌఢ్యమిల గురించి చెబుతోంది. ఒకటి శుక్ర మౌఢ్యమి, మరొకటి గురు మౌఢ్యమి. సెప్టెంబర్ మాసం 15 వ తేదీనుండి డిసెంబర్ 2 వ తేదీ వరకు అనగా 79 రోజులపాటు శుక్ర మౌఢ్యమి ఉంటుంది. మౌఢ్యమినే వాడుక భాషలో మూడం అంటారు.


నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమిపై ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూడం అంటారు. గ్రహాలకు రాజు సూర్యుడు అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆగ్రహం తన శక్తిని కోల్పోతుంది, అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. అందుకే దానికి మూఢం అనే పేరు పెట్టి శుభ కార్యాలకు దూరంగా ఉండమని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అన్ని గ్రహాలకు ఈ పరిస్థితి వస్తున్నప్పటికీ ప్రధానంగా శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది జ్యోతిష్య శాస్త్రం. 


గురు, శుక్రులు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు అని చెబుతారు. ఏ శుభ కార్యక్రమానికైనా గురు శుక్రులు బాగుండాలని, శక్తివంతంగా ఉంటే శుభం జరుగుతుందని విశ్వసిస్తారు. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం జరుగుతుందని. కష్టం కలుగుతుందని, నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.


శుక్రమౌఢ్యమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం. ఆటు, పోటులలో మార్పులు వస్తాయి. శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్త్రీల మీద అత్యధికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి, శృంగార జీవితానికి కారకుడు జాతకంలో శుక్రుడు బల హీనంగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు. ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయాలి.


*🌑 మూఢంలో చేయతగినవి 🌕*


💠 అన్నప్రాసన చేసుకోవచ్చు.

💠 ప్రయాణాలు చేయవచ్చు.

💠 ఇంటి మరమ్మత్తులు చేసుకోవచ్చు.

💠 భూములు కొనుగోలు, అమ్మకాలు, అగ్రిమెంట్లు చేసుకోవచ్చు. 

💠 నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు. 

💠 నూతన వాహనాలు, వస్త్రాలు కొనవచ్చు.

💠 జాతకర్మ,, జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, జప, హోమాది శాంతులు, గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు చేయవచ్చు.

💠 సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు చేయవచ్చు. గర్భిని స్త్రీలు, బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తిథులలో అశ్విని, దేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.


*🌑 మూఢంలో చేయకూడనివి 🌕*


💠 వివాహాది శుభ కార్యాలు జరుపకూడదు.

💠 లగ్నపత్రిక రాసుకోకూడదు. వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరారు.

💠 పుట్టు వెంట్రుకలు తీయించరాదు.

💠 గృహ శంకుస్థాపనలు చేయ రాదు.

💠 ఇల్లు మారకూడదు.

💠 ఉపనయనం చేయకూడదు.

💠 యజ్ఞాలు, మంత్రానుష్టానం, విగ్రహా ప్రతిష్టలు, ప్రతాలు చేయకూడదు.

💠 నూతన వధువు ప్రవేశం, నూతన వాహనం కొనుట పనికిరాదు.

💠 బావులు, బోరింగులు, చెరువులు తవ్వించకూడదు

💠 వేదావిధ్యా ఆరంభం, చెవులు కుట్టించుట. నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయకూడదు.


💠💠💠💠💠💠💠💠

సేకరణ: వాట్సాప్ పోస్ట్