31, జులై 2024, బుధవారం

తెలుగు పరీక్ష

 *" తెలుగు పరీక్ష 😊 "* 


*సమాధానాలలో  పదానికి  చివర "తి " మాత్రమే  రావలెను!!* 

*ప్రయత్నించండి* 


1) ఒక  నది పేరు 

2) ఒక పుణ్య క్షేత్రం  

3) ఒక గ్రహము  

 4) ఒక తిథి  

5) ఓరుగల్లు నేలిన రాజుల ఇలవేల్పు   

6) ఒక  తెలుగు  సంవత్సరం

7 అసోమ్ లో ఒక పట్టణం  

8) భార్య 

9) ఒక నక్షత్రం  

10) నారదుని వీణ 

11) ఇంద్రుడు  

12) విష్ణుమూర్తి మెడలోనిమాల

13) శివుని  సతి

14)మానవుని దేహంలో ఒక అవయవం  

15) ఒక పూల తీగ 

16) చిన్న పిల్లల ఆట వస్తువు 

17) ధైర్యం  

18) ఏడుకొండల వాడు  

19) కృష్ణుని  సతి  

20) ఒక  వాహనం  

21) ఒక ఋషి పత్ని  

22) జటాయువు సోదరుడు  

23) దుర్యోధనుని  ఇల్లాలు  

24) హరిశ్చంద్రుని  భార్య  

25) బలరాముని  పత్ని


సమాదానలు వ్రాసి కామెంటులొ పెట్టండి. మీ పేరు ఫొను నెంబరు వ్రాయటం మరవకండి

*శ్రీ రంగనాథస్వామి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 395*


⚜ *కర్నాటక  :  శ్రీరంగపట్నం- మండ్యా*


⚜ *శ్రీ రంగనాథస్వామి  ఆలయం*



💠 పురాణాల ప్రకారం, భక్తులు ఆధ్యాత్మిక ముక్తిని పొందే ప్రధాన ఆలయాలలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఒకటి. 

కావేరి నది తన మార్గంలో శివనసముద్రం, శ్రీరంగపట్నం మరియు శ్రీరంగం అనే మూడు ద్వీపాలుగా ఏర్పడిందని నమ్ముతారు. 

ఈ ప్రదేశాలలో ఒకే రోజున మూడు ఆలయాలను సందర్శించిన భక్తులు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు అని

గట్టి నమ్మకం.


💠 ఆలయ ప్రధాన దేవత శ్రీ రంగనాథుని అవతారంలో ఉన్న విష్ణువు కాబట్టి ఈ పట్టణానికి ఈ పేరు వచ్చింది.


💠 రంగనాథస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి మరియు శ్రీరంగపట్నంలో సందర్శించవలసిన ప్రధాన ప్రదేశాలలో ఒకటి . ఈ ఆలయం పంచరంగ క్షేత్రాలలో ఒకటి, మిగిలిన నాలుగు...

శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం, కుంభకోణంలోని సారంగపాణి ఆలయం, తిరుచ్చిలోని అప్పకుదతన్ ఆలయం మరియు మైలాడుతురైలోని పరిమళ రంగనాథస్వామి ఆలయం. 


💠 శ్రీరంగపట్నాన్ని ఆది రంగం అని, శ్రీరంగం అంత్య రంగం అని, కర్ణాటకలోని శివసముద్రంను మధ్యరంగం అని కూడా పిలుస్తారు.


💠 పురాణాల ప్రకారం, గౌతమ మహర్షి ఈ ప్రదేశంలో మహావిష్ణువును శయన భంగిమలో దర్శనం చేసుకోవడానికి కఠోర తపస్సు చేసాడు. తన భక్తుడిని ఆశీర్వదించడానికి, విష్ణువు తనను తాను ఈ ప్రదేశంలో రంగనాథ స్వామిగా శయనించిన రూపంలో దర్శనం ఇచ్చాడు.

రాబోయే యుగాలలో భక్తులు తనను ప్రార్థించగలిగేలా శాశ్వతంగా ఇక్కడే ఉండమని గౌతమ మహర్షి కోరగా, దేవుడు అక్కడ విగ్రహ రూపంలో ఉన్నాడు. 


💠 ఈ ఆలయానికి సంబంధించి ఇంకొక పురాణగాథలు ఉన్నాయి.  

ఈ క్షేత్రం వద్ద ప్రవహించే కావేరి నది వైకుంఠంలోని నది వలె పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.  

శ్రీ రంగనాథస్వామి విగ్రహం మానవ నిర్మితం కాదు.  శ్రీ రంగనాథ భగవానుడు ఈ ప్రదేశంలోనే మూర్తిగా వెలిశాడు.  


💠 ఒకసారి కావేరి నది శ్రీ మహావిష్ణువు ఆదిశేష మరియు మహాలక్ష్మి సమేతంగా తనపై విశ్రమించమని తపస్సు చేసింది.  

ఆమె తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై ఉన్న శ్రీ రంగనాథస్వామి విగ్రహాన్ని ధరించాడు.


💠 శ్రీరంగపట్టణం అనాదిగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. విజయనగర పాలకుల కాలంలో ఇదొక అతిపెద్ద సామంతరాజ్యంగా పేరొందింది.

 మైసూరు, తలకాడు  రాజ్యాలు కూడా ఈ కావేరీ పట్టణం అదుపాజ్ఞల కిందే ఉండేవి. విజయనగర సామ్రాజ్య ప్రాబల్యం క్షీణించిన తరువాత ఇది మైసూరు ప్రభువుల పాలన కిందికి వచ్చింది. 


💠 1610 నుంచి 1947 లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు శ్రీరంగ పట్టణం మైసూరు రాజ్యంలోని అంతర్భాగంగానే ఉండేది.

 

💠 మైసూరుకు కేవలం 15 కిమీ దూరంలోనే ఉన్నప్పటికీ ఇది పక్క జిల్లా అయినట్టి మండ్య లో ఉంది.

894 లో ఇక్కడ గంగ రాజ్యపాలకుడు తిరుమల రాయడు అనే రాజు నిర్మించిన శ్రీ రంగనాథస్వామి ఆలయం సుప్రసిద్ధం. 


💠 మొత్తం కర్ణాటక రాష్ట్రంలోనే అతిపెద్ద రంగనాథుడి విగ్రహం ఈ ఆలయంలోనే ఉంది. శేష తల్పం మీద శయనించిన కారణంగా శ్రీ రంగనాథుడిని శేషతల్ప శాయి అనికూడా అంటారు.


💠 ఆలయ ముఖద్వారాన్ని నవరంగ ద్వారం అంటారు. దానికి ఇరువైపులా ద్వారపాలకులైన జయవిజయుల విగ్రహాలు చెక్కబడ్డాయి. ఆలయ ప్రాంగణం, అక్కడి స్తంభాలు హోయసల పాలకుల నిర్మాణాలని భావిస్తున్నారు. 

ప్రధాన ప్రవేశద్వారం దగ్గరున్న నాలుగు స్తంభాలు విజయనగర పాలనాకాలంలో నిర్మించినవి. వాటి మీద విష్ణువు 24 రూపాలు చెక్కబడ్డాయి. 

రంగనాయకి, నరసింహస్వామి , సుదర్శన, గోపాలకృష్ణ, రామాలయాలు,  శ్రీనివాస ఆలయం, రామానుజ దేశికుల మంటపం కూడా మనం ఈ ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.


💠 విజయనగర పాలకుల కాలంలో ప్రతిష్ఠ చేయబడిన ఇక్కడి సుప్రసిద్ధ ఏకశిలా గరుడ స్థంభం చూడదగినట్టిది.

ఆలయ ప్రవేశానికి అటూ ఇటూ ఉన్న రెండు ముచ్చటైన ఏనుగు విగ్రహాలు హోయసల పాలకుల కాలం నాటివని భావిస్తున్నారు.


💠 ఆలయ స్థంభాల మీద నరసింహుడు, ఆంజనేయుడు, శంఖ చక్రాల మూర్తులు చెక్కబడ్డాయి.


💠 గర్భగుడిలో, విష్ణుమూర్తి పాము ఆదిశేషునిపై, పాము యొక్క ఏడు పడగలపై ఏర్పడిన పందిరి క్రింద, అతని భార్య లక్ష్మి అతని పాదాల వద్ద ఉంది.  

పక్కనే ఉన్న ఇతర దేవతలు;  

శ్రీదేవి, భూదేవి మరియు బ్రహ్మ.

 నరసింహ, గోపాలకృష్ణ, శ్రీనివాస, హనుమంతుడు, గరుడ మరియు ఆళ్వార్ లకు అంకితం చేయబడిన ఇతర చిన్న మందిరాలు ఈ సముదాయంలో ఉన్నాయి.


💠 మైసూర్ నుండి 14 కి.మీ దూరంలో ఉంది. బెంగళూరు నుండి ఈ పట్టణం 125 కి.మీ దూరంలో ఉంది.

భార్య ఇంటికి ఆభరణం!!*

 భార్య ఇంటికి ఆభరణం!!* 

(నేడు ప్రపంచ వివాహ దినోత్సవం)

* భరించేది భార్య,

* బ్రతుకు నిచ్చేది భార్య,

* చెలిమి నిచ్చేది భార్య 

* చేరదీసేది భార్య 

* ఆకాశాన సూర్యుడు    లేకపోయినా...

ఇంట్లో  భార్య లేకపోయినా...

అక్కడ జగతికి వెలుగుండదు,

ఇక్కడ ఇంటికి వెలుగుండదు. 

* భర్త  వంశానికి సృష్టికర్త 

* మొగుడి అంశానికి మూలకర్త,

*కొంగు తీసి ముందుకేగినా...

* చెంగు తీసి మూతి తుడిచినా...ముడిచినా..

తనకు లేరు ఎవరు సాటి 

* ఇలలో తను లేని ఇల్లు...  కలలో....

ఊహకందని భావన...

* బిడ్డల నాదరించి...

* పెద్దల సేవలో తరించి

* భర్తని మురిపించి..

మైమరపించి...

* బ్రతుకు మీద ఆశలు పెంచి... 

* చెడు ఆలోచనలు త్రుంచి...

* భ్రమరం  లా ఎగురుతూ...

* భర్త ను భ్రమల నుండి క్రిందకు దించుతూ...

* కళ్ళు కాయలు కాచేలా...

*  భర్త  జీవితాన పువ్వులు పూచేలా చేసిన

జీతం లేని పని మనిషి.

 

జీవితాన్ని అందించే మన మనిషి.

 ... 

ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం 

ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప.. 


ఒకరికి ఒకరు తోడు నీడ చిరకాలం. 


బిడ్డల బాధ్యతలు తీరాక వృద్ధాప్యంలో నూతన వసంతం తోడు నీడ బంధం. 


అదే  భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం..!

🙏🙏🙏🙏🙏🙏🙏

మహాభారత సారాంశం*

 *లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం* 


ఆణిముత్యాలు వంటి ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి.


1 మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు..వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు.


   ఉదా *కౌరవులు.*


2. నువ్వు ఎంత బలవంతుడు అయినా,ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ..ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. వాటిని అధర్మం కోసం వినియోగిస్తే..అవి నిరుపయోగమవుతాయి.

  ఉదా: *కర్ణుడు*

 

3 యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.

 ఉదా.. *అశ్వత్థామ*.


 4. పాత్ర తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.

  ఉదా-- *భీష్ముడు.*


5.సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  దురహంకారం తో అధర్మం గా వినియోగిస్తే వినాశం జరుగుతుంది.

ఉదా.. *దుర్యోధనుడు*


6.స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.

  ఉదా:- *ధృతరాష్ట్రుడు*

 

 7. తెలివితేటలకి ధర్మం, సుజ్ఞానం తోడైతే విజయం తప్పక లభిస్తుంది.

 ఉదా: *అర్జునుడు*.


8. మోసం,కపటం, జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. 

  ఉదా: *శకుని*


9. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హానిచేయదు.

     ఉదా.. *యుధిష్ఠిరుడు*

     

 *సర్వే జనాః సుఖినోభవంతు.*

Panchaag


 

విష్ణు సహస్రనామం

 విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది🙏🏵️🙏


భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?


అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు.


ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు


ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"


స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"


మళ్ళీ నిశబ్దం.


స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు.


అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని.


"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.


శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.


"అదెలా" అని అందరూ అడిగారు.


శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.


శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు.ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

 శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।

విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూధానం ||

హరిం నరహరరిం రామం గోవిందం దధివామనం ||

A Collection from 

Admin 

Brahmana Samaakhya

మొటిమల నివారణ

 మొటిమల నివారణ కొరకు  - 


      వేపాకులు , స్వచ్చమైన పసుపు , పాలు , సెనగపిండి వీటిని సమబాగాలుగా నూరి పేస్ట్ లా చేసి దానిని ముఖానికి ఒత్తుగా పట్టించి ఆరిన తరువాత గొరువెచ్చని నీటితో కడుగుతూ ఉంటే మొటిమలు నివారించును.


 గమనిక - మగవారు కేవలం మొటిమల పైన మాత్రమే రాయవలెను.


  

       ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కర్ణుడు కనక స్వార్థపరుడు అయితే

 6 అనే సంఖ్యను నా వైపు నుండి చూస్తే.. 6 లాగా ..మీ వైపు నుండి చూస్తే 9 లాగా కనపడుతుంది ..


మన ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అంటే ఎవరైనా ఏమ్ చెప్పగలరు ... ఇద్దరూ కరక్టే అని చెప్తారు...


ధర్మరాజు కి అస్త్ర శస్త్రాలలో నైపుణ్యం తక్కువ ..


భీముడు కేవలం గదా యుద్ధంలో మాత్రమే నైపుణ్యం కలవాడు ...


నకుల సహదేవులలో ఒకరు అశ్వ శాస్త్రం లో నిపుణుడు .. మరొకరు. కత్తి యుద్ధంలో నైపుణ్యుడు... 


కేవలం అర్జునుడు మాత్రమే విలు విద్యలో నైపుణ్యం కలవాడు ...


మాలో ఏ ఒక్కరితో అయినా సరే యుద్ధం చేసి గెలవమని చెప్పినప్పుడు.. 

కర్ణుడు అర్జునుడిని కాక వేరెవ్వరిని ఎన్నుకున్నా ..అది న్యాయం కాదు ...


అలాగే ..కర్ణుడు కౌరవుల పక్షం వీడి ..పాండవుల పక్షానికి వస్తె మహారాజుని చేస్తా అని కూడా కృష్ణుడు చెప్పినట్లు ..మనం చదువుకున్నాము...


కర్ణుడు కనక స్వార్థపరుడు అయితే.. పాండవుల పక్షానికి వెళ్ళేవాడు కదా !!  .. 


..


🙏🙏🙏

శ్రీరాముణ్ణి అందరూ అనుసరించాలి*

 *శ్రీరాముణ్ణి అందరూ అనుసరించాలి* 


ప్రతి ఒక్కరూ సుఖదుఃఖాలను సమంగా చూడగలిగిన దృష్టిని అలవరచుకోవాలి. కానీ మనం ఈవిధంగా ప్రవర్తించం. ఆనందం వచ్చినప్పుడు మనల్ని మనమే మర్చిపోతాం. దుఃఖం వచ్చినప్పుడు క్రుంగిపోతాం. అలా కాకుండా మనం శ్రీరాముణ్ణి అనుకరించడానికి ప్రయత్నించాలి. 

*"నిన్ను రేపు చతుస్సాగర పర్యంతమైన భూమండలానికి రాజుగా చేస్తాను"* అని శ్రీరామునితో దశరథుడు చెప్పినప్పుడు ఆయన *'సరే'* అన్నాడు. అదే దశరథుడు మరునాడు పిలిచి *"నువ్వు అన్నీ విడిచి అరణ్యానికి వెళ్ళాలి"* అని చెపితే కూడ వెనుకటి వలెనే *"సరే"* అన్నాడు. రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాను అన్నప్పుడు ఆనందం  పరవశుడై పోలేదు. అరణ్యానికి వెళ్ళమన్నప్పుడు దుఃఖాక్రాంతుడైపోలేదు.

ధర్మమార్గంలో ఉన్నవానికి తిర్యగ్జంతువులుకూడ సహాయం చేస్తాయి. తిర్యజ్గంతువుల మాట అటుంచి సోదరుడు కూడా దుర్మార్గుణ్ణి విడిచి వేస్తాడు.

" *యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతామ్ |* 

 *అపంథానం తు గచ్చంతం సోదరోపి విముంచతి ||* 

రామాయణంలో వర్ణించిన రామరావణుల చరిత్ర ఈ విషయాన్ని స్పష్టీకరిస్తుంది. శ్రీరాముడు ఎల్లప్పుడూ ధర్మమార్గాన్ని అనుసరించాడు. కలలో కూడ అధర్మం వైపు చూడలేదు. *"ధర్మమే రాముని రూపంలో అవతరించింది"* అని వాల్మీకి వర్ణించాడు.

ఇందుకు విరుద్ధంగా రావణుడున్నాడు. అతడు మూర్తీభవించిన అధర్మం. ఒకప్పుడు విశ్వామిత్రుడు యాగం చేశాడు. దానివల్ల రావణునికి కలిగే నష్టం ఏదీ లేదు. అయినా ఈ యాగం జరగడం అతనికి ఇష్టం లేదు. అందుచేత దానికి విఘ్నం కలిగించమని వెప్పి మారీచ సుబాహుల్ని పంపాడు. అదే విధంగా దండకారణ్యంలో ఉండే మునులందరికీ అతడు చాలా కష్టాలు కలిగించాడు. ఇవన్నీ రామాయణం చదివిన వాళ్ళందరికీ తెలిసినవే. అతడు చేసిన చాలా చెడ్డపని ఏమనగా శ్రీమహాలక్ష్మీ అవతారమూ, మహా పతివ్రతా అయినా సీతా దేవిని అపహరించడం. అలాంటప్పుడు వాని సాక్షాత్సోదరుడే అయిన విభీషణుడు కూడా వానిని విడిచి పెట్టేశాడంటే ఆశ్చర్యం ఏముంది? రావణుణ్ణి అధర్మ మార్గం నుండి  తప్పించడానికి విభీషణుడు ఎంతగానో ప్రయత్నించాడు. ఎంత చెప్పినా ప్రయోజనం లేదని గ్రహించిన తరువాత *"ఏది జరగాలో  అది జరుగుతుంది. అయితే నేను మాత్రం నీవు అవలంబించిన అధర్మమార్గంలో నీకు అండగా ఉండలేను"* అని రావణునితో చెప్పి రావణుని వదిలి వేసాడు. తరువాత రాముని ఆశ్రయించి ఆయన కృపకు పాత్రుడయినాడు.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు*

విజయం



         *విజయం అంటే ఏమిటి?*

                  ➖➖➖✍️

```

మన దేశం నుండి    ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ     లో విద్యార్థులతో మాట్లాడుతూ...    “విజయం అంటే ఏమిటి?” అని అడిగితే ఒక యువతి “విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం!”అన్నది.


అపుడు ఆ ప్రొఫెసర్ “అయితే ఇరవై ఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో చెప్పండి?” అంటే ఎవరూ చెప్పలేదు.


[ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి]


బ్రతకడానికి కొంత డబ్బు కావాలి కానీ, డబ్బే బ్రతుకు కాదు!                అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట.

   

మరో యువకుడు లేచి “విజయం అంటే బలం/శక్తి”  అన్నాడు.


అలా అయితే అలెగ్జాండర్, నెపోలియన్, ముస్సొలిని, హిట్లర్, స్టాలిన్, బిన్ లాడెన్ ... వీళ్ళంతా బలవంతులు, ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా, వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా?  వీళ్ళ జీవితాలు ఎలా గడిచి, ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా ! తన బలంతో, తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్, తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల  కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే విజయమంటే బలం/శక్తి సంపాదన కాదు అన్నమాట.


మరో యువతి “విజయమంటే ప్రఖ్యాతి, అందం!” అంది. 


“అయితే కేట్ మోస్, జీన్ ష్రింప్టన్, సోఫియాలారెన్, మార్లిన్ మన్రో ... లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు.  భారత్ విషయానికొస్తే, పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే, అమితాబ్ బచ్చన్ తో సహా, ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ, మహేష్ భట్ లతో ఆమె ప్రేమ, పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్.. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి, నమ్మిన వాళ్ళు మోసం చేస్తే, తాగుడుకు బానిస అయ్యి, ఒక దశలో కాలికి కురుపు లేచి, అది ఒళ్ళంతా ప్రాకి, ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో, అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే, ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని, జనం ఆమెను తాళ్ళతో కట్టి, ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు. అయితే అందం, ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట!


మరోసారి మరొకరు “విజయమంటే అధికారం” అని అన్నారు.


”అయితే కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి!” అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు.


మా అనంతపురంలో  ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి, పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట.


చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు  - “విజయం అంటే ఏమిటి?”  అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు, “మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా?” అందరూ 'తెలుసు’ అన్నారు. “వాళ్ళ అవ్వ, తాతల పేర్లు తెలుసా?” అని అడిగితే అయిదారుమంది “తెలుసు” అన్నారు. “వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా?”


‘తెలియదు’ అన్నారు.


అపుడు ప్రొఫెసర్ గారు “శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఆదిశంకరుడు, అందరూ?”


”ఓ, తెలుసు!” అని ముక్తకంఠం తో బదులిచ్చారు.


”మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు?”అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి, ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అంది : “సార్, మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం, రాముడు, కృష్ణుడు, బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే... తమ కోసం కాకుండా సమాజ హితం కోసం తపించిన ఋషులు, మునులు చిరంజీవులైనారు.

తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది, ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే!”


”నా గురించి నేను దుఃఖించక పోవడమే నా ఆనందానికి కారణం!” అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట, “ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు, అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క” [Only they live who live for others, the others are more dead than alive]  అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే కదా.✍️```

                               ….సేకరణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



పరమేశ్వర ఆరాధన !



పరమేశ్వర ఆరాధన !        


             చ:  ఉనికి  శిలోచ్చయంబు , నిజయోష  శిలోచ్చయరాజ  పుత్రి ,  నీ


                   ధనువు  శిలోచ్చయంబు , పురదాహ!  రథీకృత రత్నగర్భ !  నీ 


                    మనమున  కీ  శిలాశకల  మండలమెట్లు  ప్రియంబు  సేసె?  నే


                    మనగలవాడ  నిన్ను?  వ్రతహానియొనర్చు  దురాత్ముఁడుండగన్.


                     శ్రీ కాళ హస్తీశ్వర మాహాత్మ్యము--2--ఆ :  122పద్యం:  ధూర్జటి  మహాకవి! 


                అర్ధములు:  శిలోచ్చయము-- రాళ్ళసముదాయం-పర్వతం;  నిజయోష-- భార్య ;  పురదాహ--త్రిపురములను దహించినవాడా!  రథీకృత--రథముగా చేయబడిన; రత్నగర్భ-- భూమి; శిలాశకలములు--రాతిముక్కలు:  మండలము--సముదాయము; 


                    భావము;  త్రిపురములను దహించిన ఓపరమశివా! రత్నగర్భను రథముగా నెన్నుకొనినవాడా!  నీనివాసం  రాళ్ళగుట్ట(కొండ )నీభార్యయా పర్వత రాజపుత్రి ( ఒకపెద్ద బండరాయి కూతురు)  నీకు రాళ్ళకేమి కొదవయ్యా! నీపరివారమంతా రాళ్ళేకదా? అయినా నీకీ రాతిముక్కలెలా  ప్రియమయ్యాయి స్వామీ! నిన్నని పనేమిలే  నాపూజా వ్రత భంగకారకుడుండగా!

అని భావము. 


                           ఇదియొక  గొప్పపద్యము. నిందాస్తుతితో  పరమేశ్వరారాధనము  చేయుట. వినుటకిదినింద వలేగన్పించును గాని , నిజమున కిది పరమేశ్వర తత్వమను ప్రస్తుతించుటయే. 


                               హిమవత్పర్వతమాతని నివాసమని, పరమేశ్వరుడు  మనకందనంత స్థానంలో ఉంటాడనీ భక్తితో ఆరాధిస్తే  అతని సన్నిధికి చేరగలమని  సూచిమచటమే! పరివత రాకుమారిగా పార్వతిని పేర్కొనటం ప్రకృతి స్వరూపిణియని  చెప్పటమే! పర్వతములు

భూధహములట!- అంటే  భూభార వహన శక్తిగలవని యర్ధము. అట్టిపర్వతములకు శివుడు బంధువగుట పరోక్షముగా భూభారనిర్వహనమునకు తోడుపడుటయే.పర్వతరాజపుత్రి యతని భార్య యగుట ,సకల ప్రాణిసముదాయమునకు  మాతృరూపిణిగా సూచించుటయే!


                             రథీకృత  రత్నగర్భ!  యని సంబోధించటం  సమస్త రత్నములకు నెలవైన భూమి యతని సేవకి యని సూచిమచుట. దానివలన రత్నములకు లోటులేనివాడని  సూచించుట. ఇన్నియున్నవాడవే  నీకేని లోటని యాఱాతిముక్కల కాసపడితివని  పరనేశ్వరుని  నిలదీయుట. ఈపద్యమువందలి చమత్కారము.


                      ఇంతకు కథాపరముగా అక్కడ జరిగినదిది. కాళము --అనగా పాము  రత్నములతో  పూజించి వెడలిన వెనుక  హస్తి వచ్చింది. అది మృగమాయె  దానికేమితెలుసు.? అవి మణులని విలువైన రత్నములని.మణులుకూడ  రాళ్ళేయగుట  రాతిముక్కలవలె 

నది భావించినది. పరమేశ్వరుని పూలతోపూజించాలిగానీ  పనికిరాని రాళ్ళతోనా? అని బాధపడి  వానిని తొలగించి పూలతో ఆకులతో పూజించి వెడలిపోతుంది. 


                                  ఈవిధంగా ఈగ్రంధంలో మృగజాతుల ఆరాధనా విశేషాలను ధూర్జటిబహు రమ్యంగా వర్ణించాడు.


                 వ్యాజ స్తుత్యలంకారం  ఈపద్యంలో  ప్రధానంగా గమనింపదగినది.


                                                                               స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

గౌరవాన్ని కలిగిస్తాయి*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


          శ్లో𝕝𝕝 *విత్తం బంధుర్వయఃకర్మ*

               *విద్యా భవతి పంచమీ* |

               *ఏతాని మాన్యస్ధానాని*

              *గరీయో యద్యదుత్తరమ్* ||


                *--- మనుస్మృతి ---*


          తా𝕝𝕝 *న్యాయార్జిత ధనం, బంధుత్వం, వయస్సు, వంశాచారములనాచరించుట, విద్య అను ఈ ఐదు ఒకదాని కంటే మరోకటి మిక్కిలి గౌరవాన్ని కలిగిస్తాయి*


 ✍️🌷💐🌹🙏

*శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 394*


⚜ *కర్నాటక  : మద్దూరు - మండ్యా*


⚜ *శ్రీ   ఉగ్ర నరసింహస్వామి ఆలయం* 

⚜ *శ్రీ వరదరాజస్వామి (నేత్ర నారాయణ) ఆలయం*



💠 మద్దూరు కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం. మద్దూరుకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది మరియు అనేక మంది ప్రముఖ పాలకులు ఈ స్థలాన్ని సందర్శించి అనేక దేవాలయాలను నిర్మించారు.


🔆 మద్దూరు అనే పేరు ఎందుకు వచ్చింది?


💠 కొన్ని శతాబ్దాల క్రితం, పాళెగార్ల పాలనలో, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి ఇక్కడ తయారు చేయబడింది మరియు నిల్వ చేయబడింది. 

అందుకే దీనిని మద్దూరు అని పిలుస్తారు. కన్నడలో 'మద్దు' అంటే గన్ పౌడర్. 


💠 శ్రీ ఉగ్ర నరసింహ ఆలయానికి కుడి వైపున ఉన్న మద్దూరమ్మ దేవి పేరు మీదుగా ఈ పట్టణానికి పేరు వచ్చిందని కొందరు అంటున్నారు. 

ఈ ఊరు మద్దూర్ మద్దూర్-వడకి కూడా బాగా ప్రసిద్ధి చెందింది.

 

💠 కదంబ ఋషి ఇక్కడ జలాలను పూజించి, తపస్సు చేసినందున ఈ నగరాన్ని 'కదంబ నది క్షేత్రం' అని కూడా పిలుస్తారు. 

హోయసల వంశానికి చెందిన రాజు విష్ణువర్ధనుడు ఈ నగరాన్ని శ్రీవైష్ణవ బ్రాహ్మణులకు బహుమతిగా ఇచ్చాడు.

కావేరి, శింసా, హేమావతి, వీరవైష్ణవి మరియు లోకపావని అనే ఐదు నదులకు మాండ్య నిలయంగా పరిగణించబడుతుంది. 


💠 పూర్వం, సోమవర్మ ఈ ప్రాంతాన్ని అగ్రహారంగా మార్చి ఇక్కడ కోటను నిర్మించినప్పుడు ఈ పట్టణాన్ని మండెవేము లేదా మండేయ అని పిలిచేవారు.


💠 కృతయుగంలో, ఒక ఋషి క్రూరమృగాలకు పవిత్రమైన పదమైన వేదాన్ని ఉచ్చరించడానికి ప్రయత్నించాడని నమ్ముతారు, అందుకే ఈ ప్రదేశాన్ని ముందుగా వేదారణ్య అని పిలిచేవారు. 


💠 ఈ స్వామి మూర్తిని భగవత్ రామానుజులు స్వయముగా ప్రతిష్ఠింపజేశారు.   

విష్ణుకుండిన మహరాజు ఈ ఆలయము నిర్మింపజేసెను.

ఇందు స్వామి 12 అడుగుల అతి ఎత్తైన రూపము.  

ఈ స్వామి మహిమను గురించి ఒక ఐతిహ్యము కలదు .


💠 విష్ణుకుండిన మహరాజు తల్లికి వృద్ధాప్యములో కనులు కనపడకుండా పోవుటచే రామానుజులను ప్రార్ధింప ఆమెను కంచి వరదరాజస్వామి దర్శనము చేయించ చేయమనెను . 

ఆమె అంతదూరము ప్రయాణము చేయలేక పోయినందున , రాజు కంచి వరదుని మూర్తిని చేసిన శిల్పుల చేతనే  అదే కొలతలతో మరొక  విగ్రహము చేయించి మద్దూరు కోటలో ప్రతిష్ఠింప  చేయగా రాజమాత తిరిగి దృష్టి పొందుటచే నేత్రనారాయణుడను పేరు పొందెను .

దీని కారణంగా ఇది కంచి కణ్వరదరాజ స్వామి అని, నేత్ర నారాయణస్వామి అని కూడా ప్రసిద్ధి చెందింది.   ఇది కాకుండా మరొక పురాతనమైన శ్రీ పట్టాభిరామ దేవాలయం కూడా ఉంది.


💠 నేత్ర సంబంధ వ్యాధులు కలవారు చూపు తిరిగి పొందుటకు ఈ స్వామిని  ప్రార్ధించెదరు.


💠 ఈ దేవాలయం.మహాభారతం, ద్వాపరయుగం కాలం నాటి ఆలయం.

ద్వాపర యుగంలో, పాండవులలో ఒకరైన అర్జునుడి పేరు మీద మద్దూరును అర్జునపురి అని పిలిచేవారు.


💠 ఒకసారి అర్జునుడు తన నరసింహ అవతారాన్ని చూపించమని శ్రీకృష్ణుడిని అభ్యర్థించాడు;  

ఆ ఉగ్రరూపాన్ని చూపడం సాధ్యం కాదని కృష్ణుడు అర్జునుడికి సమాధానం చెప్పాడు.  బదులుగా అతను ఒక విగ్రహం రూపంలో దర్శనం పొందవచ్చు. 

 అందుచేత కృష్ణుడి కోరికపై బ్రహ్మ శ్రీ ఉగ్ర నరసింహుని చెక్కి అర్జునుడికి దర్శనం ఇచ్చాడు.  ఆ తర్వాత మద్దూరులో దేవత ప్రతిష్ఠించారు.  ఈ ఉగ్ర నరసింహ స్వామి విగ్రహం  ఈ గ్రహం మీద పూజించబడే నరసింహ భగవానుని అత్యంత క్రూరమైన రూపాలలో ఒకటి.


💠 నరసింహ స్వామికి ఎనిమిది చేతులు మరియు మూడు కళ్ళు ఉన్నాయి. 

 నరసింహ భగవానుడి కాళ్ళపై పడుకున్న హిరణ్యకశిపుని రెండు చేతులు చీల్చివేస్తున్నాయి;  రెండు చేతులు హిరణ్యకశిపుని పేగులను పట్టుకున్నాయి, అవి భగవంతుని అతీంద్రియ శరీరంపై మాలలా కనిపిస్తాయి;  ఇతర నాలుగు చేతులు భగవంతుని ఆయుధాలను పట్టుకుని ఉన్నాయి - సుదర్శన (చక్రం ), పాంచజన్య (శంఖం), పాశ & అంకుశ.  

స్వామికి కుడివైపున ప్రహ్లాదుడు, ఎడమవైపున గరుడదేవుడు వినయంగా నిలబడి స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు.  

హిరణ్యకశిపుని చంపేటప్పుడు అతని మూడవ కన్ను ప్రత్యక్షమైంది.


💠 నది ఒడ్డున ఉన్న నరసింహ స్వామి దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయని మరియు ఈ స్థలం  అటువంటి ప్రత్యేకతను కలిగి ఉందని పూజారి సూచించారు.


💠 మద్దూర్ బెంగుళూరు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది .

జనులు స్వార్థపరులు.

 శ్లోకం:☝️

*కారణాత్ ప్రియతామేతి*

     *ద్వేష్యో భవతి కారణాత్ ।*

*అర్థార్థీ జీవలోకోఽయం*

      *న కశ్చిత్ కస్యచిత్ ప్రియః ।।*


భావం: ఒక వ్యక్తి కొన్ని కారణాల వల్ల (వారి వారి అవసరాన్ని బట్టి) ఇతరులచే ప్రేమించబడతాడు మరియు అతను కొన్ని కారణాల వల్ల ద్వేషింపబడతాడు. జనులు స్వార్థపరులు. ఎవరూ ఎవరిచేత ప్రేమించబడరు.

సకల దేవతలకును దేవుడు

 👆శ్లోకం

సురేశః శరణం శర్మ                             

విశ్వరేతాః ప్రజాభవః ।                        

అహస్సంవత్సరో వ్యాళః                      

ప్రత్యయః సర్వదర్శనః ॥


ప్రతిపతార్ధ:

సురేశః --- సకల దేవతలకును దేవుడు; దేవదేవుడు; భక్తుల కోర్కెలను తీర్చువారిలో అధిపుడు.      

శరణం --- తన్ను శరణు జొచ్చినవారిని రక్షించువాడు; ఆర్తత్రాణ పరాయణుడు; ముక్తుల నివాస స్థానము.

శర్మ --- సచ్చిదానంద స్వరూపుడు; మోక్షగాముల పరమపదము.

విశ్వరేతాః --- విశ్వమంతటికిని బీజము, మూల కారణము.

ప్రజాభవః --- సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు, జన్మకారకుడు.

అహః - ఎవరినీ ఎన్నడూ వీడనివాడు; పగటివలె ప్రకాశ స్వరూపుడై అజ్ఞానమును తొలగించి జ్ఞానోన్ముఖులను చేయువాడు; తన భక్తులను నాశనము కాకుండ కాపాడువాడు.

సంవత్సరః - భక్తులనుద్ధరించుటకై (వెలసి)యున్నవాడు; కాల స్వరూపుడు.

వ్యాళః - భక్తుల శరణాగతిని స్వీకరించి అనుగ్రహించువాడు; (సర్పము, ఏనుగు, పులి వంటివానివలె) పట్టుకొనుటకు వీలుగానివాడు (చేజిక్కనివాడు)

ప్రత్యయః --- ఆధారపడ దగినవాడు; విశ్వసింపదగినవాడు (ఆయనను నమ్ముకొనవచ్చును); ప్రజ్ఞకు మూలమైనవాడు.

సర్వదర్శనః --- తన కటాక్షపరిపూర్ణ వైభవమును భక్తులకు జూపువాడు; సమస్తమును చూచుచుండెడివాడు

పంచాంగం 31.07.2024

 ఈ రోజు పంచాంగం 31.07.2024 Wednesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస కృష్ణ పక్ష ఏకాదశి తిధి సౌమ్య వాసర: రోహిణి నక్షత్రం ధ్రువ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి మధ్యాహ్నం 03:58 వరకు.

రోహీణి పగలు 10:13 వరకు.


సూర్యోదయం : 05:59

సూర్యాస్తమయం : 06:46


వర్జ్యం : మధ్యాహ్నం 03:52 నుండి సాయంత్రం 05:29 వరకు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 11:57 నుండి 12:48 వరకు.


అమృతఘడియలు : ఉదయం 07:03 నుండి 08:38 వరకు తిరిగి రాత్రి 01:33 నుండి 03:09 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

26 ఏకాదశి పేర్లు



   కామిక ఏకాదశి కొరకు ధాన్యాల నుంచి ఉపవాసము..ఫలాలు, పాలు స్వీకరించవచ్చు.


మీకు వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ, కుదిరిన వారు

మహా మంత్రజపము (వారి వారి ఉపదేశానుసారం/కుల దేవతా పూజాదికాలు) రామాయణ,భారత, భగవద్గీత, భాగవతము ఎక్కువ సమయము చదవగలరు.


ఉపవాసం చేసినా చేయకపోయినా, ఈ 26 ఏకాదశి పేర్లు ఖచ్చితంగా ఏకాదశి నాడు జపించండి.

26 ఏకాదశి నామములు :-


1 పాపమోచని ఏకాదశి

2.కామాదా  ఏకాదశి

3.వరూధిని ఏకాదశి

4.మోహినీ ఏకాదశి

5.అపర ఏకాదశి

6.పాండవ నిర్జల ఏకాదశి

7.యోగిని ఏకాదశి

8.శయన ఏకాదశి

9.కామిక ఏకాదశి

10.పవిత్రోపన ఏకాదశి

11.అన్నదా ఏకాదశి

12.పార్శ్వ ఏకాదశి

13.ఇందిరా ఏకాదశి

 14.పాశాంకుశ ఏకాదశి  

15. రమా ఏకాదశి  

16.ఉత్థాన ఏకాదశి              

17.ఉత్పన్న ఏకాదశి

18.మోక్షదా ఏకాదశి

19.సఫల ఏకాదశి 

20.పుత్రదా ఏకాదశి               

21.షట్తిల ఏకాదశి 

22.భైమి ఏకాదశి 

23.విజయ ఏకాదశి

24.ఆమలకి ఏకాదశి                       25.పరమ ఏకాదశి

26. పద్మిని ఏకాదశి


వాటి వాటి సమయానుసారం ఒక్కో నెలలో వచ్చే క్రమానుసారం వాటి పేర్లు సుస్పష్టంగా చదవి,భగవదనుగ్రహం పొందండి


🌹🌴🙏🪔🙏🌴🌹

కామిక ఏకాదశిగా .

 *_𝕝𝕝 ॐ 𝕝𝕝 31/07/2024 - కామిక ఏకాదశీ 𝕝𝕝 卐 𝕝𝕝_*

*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*


ఆషాఢ మాసములో కృష్ణ పక్ష ఏకాదశిని  కామిక ఏకాదశిగా జరుపుకుంటారు.

ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించటం, తులసీ దళాలతో పూజ చేయటం, వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి  ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి.

 

*_కామిక ఏకాదశి మహత్యం - వ్రత కథ_*


ధర్మవర్తనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణున్ని " ఆషాఢ మాసములో కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని" కోరగా, దానికి ఆ వాసుదేవుడు సంతోషించినవాడై "ఓ రాజా! ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్య కార్యమే, ఒకసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మ దేవుడిని ఇలా అడిగాడు. " ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు అధిదేవత ఎవరు, వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయయుంచి తెలపండి" అని కోరాడు. 

 

దానికి బ్రహ్మ బదులిస్తూ " నా ప్రియమైన కుమారుడా! మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించెద. ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి  మహిమ విన్నంతనే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. శంఖ, చక్ర గదాధరుడు, తామర పాదములు కలిగి ఉన్నవాడు, శ్రీధరుడు, హరి, విష్ణు, మాధవుడు మరియు మధుసూధనుడు అనే పేర్లతో పిలవబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు. 

 

కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గురు గ్రహం సింహ రాశిలో ఉన్న పౌర్ణమి రోజు-సోమవారం, గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. 

 

కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడ మరియు గ్రాసములతో  కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతములో చేసిన పాపములకు భయపడేవారు, పాపమయమైన జీవితంలో కూరుకపోయినవారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. ఏకాదశి రోజులు స్వచ్చమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి. 

 

నారదా! ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు." కామిక ఏకాదశి రోజు ఉపవసించినవారు,సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారి కన్నా గొప్పవారు." ఈ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు. కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు, అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. 

 

ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము, బంగారం, వెండి దానం చేస్తే వచ్చే దాని కన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి, ముత్యాలు, కెంపులు, పుష్పరాగములు, వజ్రాలు, నీలం మరియు గోమధికములతో పూజించినదానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు. లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించివేస్తుంది. 


కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ల పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు. ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో, వారు శాశ్వతముగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామిక ఏకాదశికి బ్రహ్మ హత్యా పాతకాన్ని, భ్రూణ హత్యా పాపమును కూడా తొలగించే శక్తి ఉంది. " అని బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా" శ్రీకృష్ణుడు ధర్మరాజు తో చెప్పెను.


*_𝕝𝕝 ॐ 𝕝𝕝 శ్రీమన్నారాయణాయ చరణౌ శరణం ప్రపద్యే 𝕝𝕝 卐 𝕝𝕝_*


*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*


*_𝕝𝕝 శుభమస్తు 𝕝𝕝_*