31, జులై 2024, బుధవారం

సకల దేవతలకును దేవుడు

 👆శ్లోకం

సురేశః శరణం శర్మ                             

విశ్వరేతాః ప్రజాభవః ।                        

అహస్సంవత్సరో వ్యాళః                      

ప్రత్యయః సర్వదర్శనః ॥


ప్రతిపతార్ధ:

సురేశః --- సకల దేవతలకును దేవుడు; దేవదేవుడు; భక్తుల కోర్కెలను తీర్చువారిలో అధిపుడు.      

శరణం --- తన్ను శరణు జొచ్చినవారిని రక్షించువాడు; ఆర్తత్రాణ పరాయణుడు; ముక్తుల నివాస స్థానము.

శర్మ --- సచ్చిదానంద స్వరూపుడు; మోక్షగాముల పరమపదము.

విశ్వరేతాః --- విశ్వమంతటికిని బీజము, మూల కారణము.

ప్రజాభవః --- సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు, జన్మకారకుడు.

అహః - ఎవరినీ ఎన్నడూ వీడనివాడు; పగటివలె ప్రకాశ స్వరూపుడై అజ్ఞానమును తొలగించి జ్ఞానోన్ముఖులను చేయువాడు; తన భక్తులను నాశనము కాకుండ కాపాడువాడు.

సంవత్సరః - భక్తులనుద్ధరించుటకై (వెలసి)యున్నవాడు; కాల స్వరూపుడు.

వ్యాళః - భక్తుల శరణాగతిని స్వీకరించి అనుగ్రహించువాడు; (సర్పము, ఏనుగు, పులి వంటివానివలె) పట్టుకొనుటకు వీలుగానివాడు (చేజిక్కనివాడు)

ప్రత్యయః --- ఆధారపడ దగినవాడు; విశ్వసింపదగినవాడు (ఆయనను నమ్ముకొనవచ్చును); ప్రజ్ఞకు మూలమైనవాడు.

సర్వదర్శనః --- తన కటాక్షపరిపూర్ణ వైభవమును భక్తులకు జూపువాడు; సమస్తమును చూచుచుండెడివాడు

కామెంట్‌లు లేవు: