11, అక్టోబర్ 2021, సోమవారం

అసుర సంపత్తిని వదలినవారికే

 ఆత్మను ఆశ్రయించుకొని సమస్త ఇంద్రియాలు వాటి వాటి వ్యాపారాల యందు ప్రవర్తిస్తున్నాయి. ఇక్కడ మనస్సుకు మనస్సు అని చెప్పడంలో గల తాత్పర్యమేమనగా? చైతన్యజ్యోతి యొక్క ప్రకాశము లేకుండా అంత:కరణము తనకు విషయములైన సంకల్పము, నిశ్చయము, శ్రద్ధ, అశ్రద్ధ, అధృతి మొదలగు వాటి యందు సమర్థము అవ్వదు. కావున ఆత్మ మనస్సునకు కూడ మనస్సు అని చెప్పబడినది. ఈ ఉపనిషత్తులో మరొక ప్రధాన విషయం- దేవాసుర సంగ్రామంలో అసురుల పై దేవతలు విజయాన్ని పొందారు. విజయగర్వంతో దేవతలు ఆనందిస్తున్న వేళ వారి గర్వాన్ని అణచడానికి బ్రహ్మ ఒక యక్షరూపాన్ని దాల్చి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యక్షుడు ఎవరో కనుక్కోమని మొదటగా 'అగ్నిదేవత'ను పంపిస్తాడు ఇంద్రుడు. ఆ యక్షుడు నువ్వు ఎవరివి? అని ప్రశ్నించగా నేను 'అగ్ని'దేవతను. ఈ సమస్తాన్ని క్షణకాలంలో దహించగలనని సమాధానం చెప్పాడు. యక్షుడు ఒక గడ్డిపోచను అతడి ముందు ఉంచి దీనిని దహించమని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవత సర్వశక్తితో గడ్డిపోచను కాల్చలేకపోయాడు. అవమానంచే వెనుదిరిగాడు. తరువాత మాతరిశ్వుడు వచ్చి గడ్డిపోచను కదలించలేక వెళ్ళిపోయాడు. చివరకు దేవేంద్రుడు గర్వంతో వచ్చేసరికి యక్షుడు కనిపించకపోగా, అతడు అక్కడే ఉండి తపస్సు చేయగా, ఉమాదేవి ప్రత్యక్షమయి ఆ యక్షుడు ఎవరో కాదు సాక్షాత్ బ్రహ్మయేనని తెలిపింది.


ఇక్కడ గ్రహించవలసిన విషయమేమనగా! అహంకారాది అసుర సంపత్తి గల మనుజుడు ఆ భగవంతుని యొక్క వాస్తవతత్త్వాన్ని తెలుసుకోలేడు. కనుక అహంకారాది అసుర సంపత్తిని వదలినవారికే అతడి దర్శనం కలుగుతుందని గ్రహించాలి.

ఉపనిషత్తనగా బ్రహ్మవిద్య.

ఆధ్యాత్మిక జగతిలో ఉపనిషత్తుల యొక్క మహత్వం వర్ణనాతీతం. మోక్ష సాధకహేతుభూతములు ఉపనిషత్తులు, వేదాల యొక్క అంతిమ భాగమే ఉపనిషత్తులుగా చెప్పబడుతున్నాయి. ఉపనిషత్ ప్రతిపాద్య విషయం జీవేశ్వర ఐక్యత్వం. అత్యంత భయంకర మృత్యురూప సంసారం నుండి బయటపడదలచిన ప్రతి ముముక్షువు ఉపనిషత్ వేద్య పరమాత్మను తెలుసుకోవాలి. ఉపనిషత్ వేద్యపరమాత్మ నిత్య- శుద్ధ-బుద్ధ-ముక్త స్వభావుడు, ఆనంద స్వరూపుడు, ఓంకార శబ్దవాచ్యుడు, గుణాతీతుడు ఇత్యాది లక్షణాలు కలిగి ఉంటాడు. ఉపనిషత్ జ్ఞానం వల్ల అనిర్వచనీయమైన అనాది అవిద్య నశిస్తుంది.


ఉపనిషత్ శబ్దార్థం- “సదేరా తో: విశరణగత్య వసాదనార్థస్యోపనిపూర్వస్య క్విప్ ప్రత్యయాన్తస్యరూపముపనిషత్” ఉపనిషత్ అను పదములో ఉప, ని, షత్ అను మూడు మాటలు గలవు. 'షదల్' అనునది ధాతువు. ఈ ధాతువునకు విడిపోవుట, ప్రాప్తి, నాశము అను మూడక్టములు గలవు. ఉప, ని, అనునవి రెండును ఉపసర్గలు. ఈ మూడు మాటలకు 'క్విప్' అను ప్రత్యయమును చేర్చగా 'ఉపనిషత్' అను పదము నిష్పన్నమగును.


"ఉపనిషదితి విద్యోచ్యతే తచ్ఛీలినాం గర్భజన్మజరాది నిశాతనాత్ తదేవసాదనాద్వా బ్రహ్మణా వా ఉపనిగమయితృత్వాత్ ఉపనిషణ్ణం వా స్యాం పరంశ్రేయ ఇతి”


ఉపనిషత్తనగా విద్య. అట్టి విద్యను పొందినవారికి జరామరణాద్యనర్థజాతము నశించుట వలనను, బ్రహ్మమును పొందించుట వలనను, ఈ విద్యయందు పరమశ్రేయస్సు నిహితమై ఉన్నది కనుక ఉపనిషత్తనగా బ్రహ్మవిద్య.

పార్వతీప రమేశ్వరౌ

 పార్వతీప రమేశ్వరౌ అని విడదీసింది వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. వేటూరి సుందర్రామ్మూర్తి తన చిన్నతనంలో ఈ 'వాగర్థా వివసంపృక్తౌ 'శ్లోకాన్ని వల్లె వేస్తూ ఉండగా ఆయన పెదతండ్రి గారైన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వచ్చి 'జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటే ఏమిటో తెలుసా?' అడిగారు.


 “ఈ జగత్తుకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అని అర్థం" అంటూ జవాబిచ్చారు. సుందర్రామూర్తి.


 "పితరౌ అంటే తల్లిదండ్రులు అనే ఎందుకనుకోవాలి!? పితః అంటే తండ్రికి ద్వివచనంగా తండ్రులు అని అర్థం వచ్చేట్టుగా పితరౌ అని వాడి ఉంటారనుకో వచ్చుగా" అని అన్నారు ప్రభాకరశాస్త్రి. 


 దాంతో ఆలోచనలో పడ్డారు సుందర్రామ్మూర్తి. 


"కాళిదాసు శివభక్తుడు. కనుక శివపార్వతులను ఉద్దేశించే అయి ఉంటుంది" అని అన్నారు సుందర్రామ్మూర్తి. 


 దానికి ప్రభాకర శాస్త్రి గారు -" కానీ కాళిదాసు ఈ శ్లోకాన్ని రాసింది రఘువంశంలో .అది విష్ణువు అవతారమైన రామునికి సంబంధించిన కావ్యం. అంచేత విష్ణువునే స్తుతించాలి. నువ్వన్నట్టు తను సహజంగా శివభక్తుడు కావటం చేత శివుడు, విష్ణువూ ఇద్దరూ ఈజగతికి తండ్రులు అని అన్నాడు" అంటూ వివరించారు. 


“మరి పార్వతీ పరమేశ్వరౌ అని అన్నాడు కదా!?" అంటూ తన మనసులోని సందేహాన్ని ముందుంచారు సుందర్రామ్మూర్తి.


 "దాన్ని ఇలా విడదీసుకుని చూడు. 'పార్వతీప' అంటే పార్వతి భర్త అయిన శివుడు అని, రమేశ్వరౌ అంటే లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు అని అనుకుంటే సరిపోతుందిగా” అంటూ విశ్లేషిస్తూ విపులీకరించారు ప్రభాకర శాస్త్రి,


 పదాల్ని విడదియ్యటంలోనూ కలపడంలోనూ ఎంతటి రసజ్ఞత వెల్లివిరుస్తుందో, అర్థాల్ని స్థూలదృష్టితో కాకుండా సూక్ష్మదృష్టితో చూస్తే ఎంతటి విజ్ఞత కలుగుతుందో అప్పుడర్థమయింది వేటూరి సుందర్రామూర్తికి.(హాసం పత్రిక సౌజన్యం 15-31 అక్టోబర్ 2001 21 వపుట)

ఊరగాయలు

 S A V Foods

స్వగృహ ఆకెళ్ల ఊరగాయలు 


ఉసిరికాయ

చింతకాయ 

పండుమిర్చి

మామిడి తొక్కుపచ్చళ్ళు 

మామిడి ముక్కల పచ్చడి    

మెంతికాయ

ఆవకాయ 

పెసర ఆవకాయ 

బెల్లం ఆవకాయ 

మాగాయ

గోంగూర 

టమాటో 

నిమ్మకాయ

వంగపండు ఊరగాయ 

కొత్తిమీర ఊరగాయ  

ఉసిరి ఆవకాయ 


పుట్నాల పొడి

కందిపొడి

ఇడ్లి కారంపొడి 

కరివేపాకు కారం పొడి 

వెల్లుల్లి కారంపొడి 

పల్లీలపొడి 

కూరపొడి 




అప్పడాలు

వడియాలు

గుమ్మడి పడియాలు 

చల్ల మిరపకాయలు



అన్ని రకాల ఊరగాయ పచ్చళ్ళు, పొడులు ఆర్డరుపైచేసి ఇవ్వబడును కావలసిన వారు సంప్రదించగలరు.

Phone no. 9441593152

Akella Savithri 

Malkajgiri

Hyderabad

Be proud to Be a Telugu person.

 I love my mother tongue Tamil. That doesn't mean i shouldn't know about other languages, right? I came across some interesting facts about TELUGU


For those whose mother tongue is Telugu, Who loves Telugu and who wants to know something about Telugu. 


1. Telugu Language was known to exist since the Time period 400 BCE.


2. In 2012 Telugu has been voted as the 2nd best script in the world by International Alphabet Association, Korean ranks no 1.


3. Speaking Telugu Language activates about 72000 neurons in your body, highest for any Language in the world proven by Science.


4. An ethnic group from Sri Lanka called Sri Lankan Gypsy people mostly speak Telugu.


5. There are many many Telugu communities in Myanmar Just do a Google Search.


6. In 16th century an Italian Explorer Niccolò de’ Conti found that the words in Telugu language end with vowels, just like those in Italian, and hence referred it as “The Italian of the East”.


7. Telugu ranks 3rd by the number of native speakers in India (75 million people), and 15th in the Ethnologue list of most-spoken languages worldwide.


8. Telugu derived from trilinga, as in Trilinga Desa, “the country of the three lingas”. According to a Hindu legend, Shiva descended as a linga on three mountains: Kaaleeshwaram in Nizam, Srisailam in Rayalaseema and Bhimeshwaram in Kostha.


9. Telugu is the only language in the Eastern world, that has every single word ending with a vowel sound.


10. Telugu language has the most number of सामितलु i.e., idioms and proverbs.


11. Telugu language Previosly also known as Tenungu or Telungu.


12. Rabindranath Tagore is said to have stated that Telugu is the sweetest of all Indian Languages.


13. About 200 Years ago about 400 people Telugu speaking people were taken to Mauritius as plantation workers, now Prime Minister is one of their descendants.


14. A Palindrome of 40 slokas which when read from start to end is Ramayana and end to start Mahabharata, there is no other Language like this.


15. Sri Krishnadevaraya visited this ⛩ in Srikakulam and paid homage to the deity. It was here that Krishnadevaraya wrote the literary classic, Amukthamalyada at the order of the Lord Andhra Vishnu who had said “Des Bhashalandhu Telugu Lessa” (Telugu is the greatest among the state’s languages”) and ordered Sri Krishnadevaraya to adopt Telugu as the official language of his province.


16. We have a single lettered poem in Telugu also called Ekaakshara Padhyamulu

Often said by all Greatest Saints that...Telugu language is greatest boon from Creators.


Be proud to Be a Telugu person.


 

Letter of resignation by Netaji Subhas Chandra Bose.


Letter of resignation by Netaji Subhas Chandra Bose. Just look at the command over the English and his handwriting which looks like a computer typed letter.👍👍


 16 Herbert street, Cambridge 22.4.21


2701


Mr. Right Hon. E.S. Ncoolique M P., Secretary of state for India


Sir,


I desire to have my name removed from the list of probationers in the Indian Civil Services. may state in this connection that I was selected as a result of an open competitore in August 1920.


examination held I have received an allowance hundred pounds only) up till now. shall remit the amount to the India Office as soon aj my £100 lone of resignation is accepted.


have the honour to be sure servant


Your most obedient


Subhas Chandra Bose


J OD PECE 25 AM !


ir..


are offerte

పది సార్లు ఆలోచించండి.*

 **హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు పది సార్లు ఆలోచించండి.*


మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తె హాస్పిటల్ లో అడ్మిట్ కావద్దు.


ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు. అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు.


👤చాలా మంది కమర్షియల్ అయిపోయారు. హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. పైన ఉన్నంత అందమైనది కాదు.


 మేనేజ్మెంట్ పెట్టె టార్గెట్స్ రీచ్ కావడానికి నానా అబద్ధాలు అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్.


డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది.అది డెబ్బై శాతం అబద్దం. ముప్పై శాతమే నిజం.



Sp బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే.


😌ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు. అదేదో హోటల్ అనుకున్నాడు. అటు నుండి అటే అనే తెలుసుకోలేక పోయాడు.రెండు కోట్లు బిల్లు వసూలు చేశారు. శవాన్ని ఇచ్చారు.


దాసరి నారాయణ రావు, జయలలిత....ఇలా చాలా మంది చావుకు రోగం కారణం కాదు. నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి,టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, భయంకరమైన ఆంటీ బయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు.


 తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు,డబ్బు ఉన్నవారు. వైద్యమును చాలా మిస్టరీ గా చేశారు అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం. అది తప్పు.


అసలు అన్నీ రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది? 


ఉన్న రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా??


అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో. ఇంకో పది ఏండ్లు బ్రతికే అవకాశం ఉన్న మనిషి ఆయన.


అందుకే మిత్రులారా హాస్పిటల్... అది ఎలాంటి దైనా ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి. సెకండ్ opinion తీసుకోండి. ఊరకే జొరబడ వద్దు.


అత్యంత మోసపూరిత వ్యవస్థ వైద్యం. కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది. ప్రతీ దానికీ కార్పొరేట్ హాస్పిటల్ లోకి పోవడం కరె క్టు కాదు.

కనీసం మీరైనా ఈ విషయాలను మనస్సులో పెట్టుకోండి. ఇంట్లో ఉంటే వంద ఏండ్లు బ్రతుకుతారు. హాస్పిటల్ కు పోతే రేపే ....


జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త. 


*అందరికీ మంచి జరుగాలనీ కోరుకుంటూ.*

👍👍🤝🤝

💯% Correct ఎన్ని గ్రూప్ లకైనా షేర్ చేయొచ్చు ఇది సగటు భారతీయుని మనస్సు లోని మాట, ఆవేదన, నగ్నసత్యం మన ప్రియతమ గౌరవ రాష్ట్రపతి మరియు ప్రధాని గార్లకు చేరేవరకు భారతఫౌరుని బాధ్యత గా బావించి షేర్ చేద్దాం మిత్రులారా🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Disruptive Technology

What is Disruptive Technology ?? A superb article ...


When TV came to my house. I forgot how to read books. When the car came to my doorstep, I forgot how to walk. When I got the mobile in my hand, I forgot how to write letters. When computer came to my house, I forgot spellings. When the AC came to my house, I stopped going under the tree for cool breeze. When I stayed in the city, I forgot the smell of mud. By dealing with banks and cards, I forgot the value of money. With the smell of perfume, I forgot the fragrance of fresh flowers. With the coming of fast food, I forgot to cook traditional cuisines..


Always running around, I forgot how to stop. And lastly when I got whatsapp, forgot how to talk..


So very true

ప్రయత్నిస్తారుగా

 కొంచెంకష్టం మరికొంత సులభం, ప్రయత్నిస్తారుగా !

____________________


(1) దృతరాష్ట్రుని తమ్ముడు మరియు మంత్రి అయిన విదురుని తల్లిపేరేమిటి ?


(అ) అంబ

(ఆ) అంబిక

(ఇ) అంబాలిక

(ఈ) అంబిక యొక్కదాసి


(2) జనమేజేయునికి మహాభారతకథను వినిపించిన బుుషి ఎవరు ?


(అ) వైశంపాయనుడు

(ఆ) కృష్ణద్వేపాయనుడు

(ఇ) బుుష్యశృంగుడు

(ఈ) వైవస్వితుడు


(3) శమంతకమణిని మెడలోధరించి వేటకు వెళ్ళి సింహం బారినపడి మరణించనవాడెవరు ?


(అ) సత్యజిత్తు

(ఆ) సుసేనుడు

(ఇ) చిత్రసేనుడు

(ఈ) ప్రసేనుడు


(4) అజ్ఞతవాసంలో భీముడికి గల మరో పేరేమిటి ?


(అ) తంత్రీపాలుడు

(ఆ) జయంతుడు

(ఇ) డిచికుడు

(ఈ) భయంకరుడు


(5) శ్రీకాళహస్తీశ్వరుని భార్య పేరేమిటి ?


(అ) జ్ఞానప్రసూనాంబ

(ఆ) పార్వతి

(ఇ) కాళహస్తీశ్వరి

(ఈ) విశాలాక్షి


(6) కృష్ణుడు బాలుడిగా వున్నపుడు సుడిగాలిరూపంలో అతనిని ఆకాశంలోనికి తీసుకువెళ్ళి చంపబడిన రాక్షసుడెవరు ?


(అ) తృణావర్తుడు

(ఆ) త్రిపృష్ఠుడు

(ఇ) త్రదస్యుడు

(ఈ) తూవలకుడు


(7)జనకమహారాజు పురోహితుని పేరేమిటి ?


(అ) శతానందుడు

(ఆ) శతానీకుడు

(ఇ) శతనందుడు

(ఈ) శతరూపుడు


(8) వేయిఏనుగుల బలంకల రాక్షసి ఎవరు ?


(అ) శబళాదైత్యి

(ఆ) శతధృతి

(ఇ) రాజాధిదేవి

(ఈ) తాటకి


(9)దశావతారాలలో శ్రీరాముడి అవతారం ఎన్నవది ?


(అ) ఆరు

(ఆ) ఏడు

(ఇ) ఎనిమిది

(ఈ) తొమ్మిది


(10) ఆధ్యాత్మరామాయణాన్ని వ్రాసిందెవరు ?


(అ) వాల్మీకి

(ఆ) వేదవ్యాసుడు

(ఇ) భవభూతి

(ఈ) వరరుచి


 జవాబులు. 

-

(1) దృతరాష్ట్రుని తమ్ముడు మరియు మంత్రి అయిన విదురుని తల్లిపేరేమిటి ?


(అ) అంబ

(ఆ) అంబిక

(ఇ) అంబాలిక

(ఈ) అంబిక యొక్కదాసి🚩


(2) జనమేజేయునికి మహాభారతకథను వినిపించిన బుుషి ఎవరు ?


(అ) వైశంపాయనుడు🚩

(ఆ) కృష్ణద్వేపాయనుడు

(ఇ) బుుష్యశృంగుడు

(ఈ) వైవస్వితుడు


(3) శమంతకమణిని మెడలోధరించి వేటకు వెళ్ళి సింహం బారినపడి మరణించనవాడెవరు ?


(అ) సత్యజిత్తు

(ఆ) సుసేనుడు

(ఇ) చిత్రసేనుడు

(ఈ) ప్రసేనుడు🚩


(4) అజ్ఞతవాసంలో భీముడికి గల మరో పేరేమిటి ?


(అ) తంత్రీపాలుడు

(ఆ) జయంతుడు🚩

(ఇ) డిచికుడు

(ఈ) భయంకరుడు


(5) శ్రీకాళహస్తీశ్వరుని భార్య పేరేమిటి ?


(అ) జ్ఞానప్రసూనాంబ🚩

(ఆ) పార్వతి

(ఇ) కాళహస్తీశ్వరి

(ఈ) విశాలాక్షి


(6) కృష్ణుడు బాలుడిగా వున్నపుడు సుడిగాలిరూపంలో అతనిని ఆకాశంలోనికి తీసుకువెళ్ళి చంపబడిన రాక్షసుడెవరు ?


(అ) తృణావర్తుడు🚩

(ఆ) త్రిపృష్ఠుడు

(ఇ) త్రదస్యుడు

(ఈ) తూవలకుడు


(7)జనకమహారాజు పురోహితుని పేరేమిటి ?


(అ) శతానందుడు🚩

(ఆ) శతానీకుడు

(ఇ) శతనందుడు

(ఈ) శతరూపుడు


(8) వేయిఏనుగుల బలంకల రాక్షసి ఎవరు ?


(అ) శబళాదైత్యి

(ఆ) శతధృతి

(ఇ) రాజాధిదేవి

(ఈ) తాటకి🚩


(9)దశావతారాలలో   శ్రీరాముడి అవతారం ఎన్నవది ?


(అ) ఆరు

(ఆ) ఏడు🚩

(ఇ) ఎనిమిది

(ఈ) తొమ్మిది


(10) ఆధ్యాత్మరామాయణాన్ని వ్రాసిందెవరు ?


(అ) వాల్మీకి

(ఆ) వేదవ్యాసుడు🚩

(ఇ) భవభూతి

(ఈ) వరరుచి

____________________________________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

__________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కోపము

కోపము అనేది ప్రతి మనిషికి వుండే సహజ లక్షణం కానీ మనిషి స్థితులను పట్టి అది నాలుగు రకాలుగా అభివర్ణించారు అవి. 

1)  ఉత్తముని కోపము - నీటిపై వ్రాత వలె.

 (క్షణ కాలము)
 2) మధ్యముని కోపము - ఇసుక పై వ్రాత వలె. (కొన్ని గంటలు) 
3) అధముని కోపము - పలకపై వ్రాత వలె. (కొన్ని వారాలు/నెలలు) 
4) అధమాధముని కోపము - శిలపై వ్రాత వలె. (కొన్ని సంవత్సరాలు/దశాబ్దాలు) ఉంటుందని పండితులు తెలుపుతారు. 

ఆశ్రమం

 ఆశ్రమం 
ఈరోజుల్లో చాలామంది బాబాలు, గురువులుగా చెలామణి అయేవారు, స్వామీజీలు ఎన్నో ఆశ్రమాలను నిర్మించి ఎంతోమంది భక్తులని ఆకర్షిస్తున్న సంగతి మనం రోజు చూస్తున్నాము. మరి ఈ ఆశ్రమం అనే పదానికి అర్ధం ఏమిటో చూద్దాం. 
 ఈ 'శ్రమ'ను (సంసార తాపాన్ని) తొలగించి., ఆ 'శ్రమ'ను (ఆధ్యాత్మిక తాపాన్ని) కలిగించేది "ఆశ్రమం".
 ఆ 'శ్రమ'ను (ఆధ్యాత్మిక తాపాన్ని) కలిగించేది "ఆశ్రమం".
అంటే సాంసారిక విషయవాంఛలను తొలగించి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించేది అని అర్ధం. మరి మనం చూస్తున్న ఆశ్రమాలు ఇలానే ఉన్నాయా అన్నది ప్రతివారు ఆలోచించవలసినది. 

నిజమైన సన్యాసికి ఆశ్రమంతో పనిలేదు. 

ఆత్మను ఎవరు తెలుసుకొనగలరు

 ఆత్మను ఎవరు తెలుసుకొనగలరు  

కర్మ వ్యాపారంతో ఇంద్రియ నిగ్రహం బోధించబడుట లేదు. ఇంద్రియములు వ్యవహరించినను, వ్యవహరించకున్ననూ, తాను వ్యవహరించుట లేదు. తాను సదా ఆంతరిక యజ్ఞమునందు నిమగ్నుడై, ఆత్మానందమగ్నుడై ఉన్నాడు. కాబట్టి సామాన్య వ్యవహారం ఏదైతే ఉన్నదో, అట్టి సామాన్య వ్యవహారమునకు సుఖ దుఃఖ ఆసక్తిని పొందక, శీతోష్ణాది ద్వంద్వముల చేత కుంగక, శరీరాది జరామరణాది వార్థక్యరూప జరా మృత్యు వార్థక్యరూపమైనటువంటి వాటి చేత కుంగక, పొంగక, యవ్వనాది విశేషముల చేత లాభింపక, శరీర ఇంద్రియ వ్యాపార సహితమైనటువంటి చర్యల యందు నిమగ్నము కాక, సంగత్వమును పొందక ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు మాత్రమే ఆత్మను తెలుసుకొనగలడు. 

నిష్ఫలాపేక్ష కర్మలు ఆచరించే వారు అనగా 

ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులువీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు ఇవి జీవాత్మ ను బంధించవు.

ఈశ్వరార్పణగా కర్మలు చేయటం 

జీవుడిలో అగ్ని యొక్క స్థానం ఇలా ఉంటుంది

 సృష్టి మొత్తం ఆమె నుండి ఏర్పడినప్పుడు పంచభూతాలు, పంచతత్వాలు, పంచప్రణవాలు అన్ని ఆ తల్లి రూపమే, అలా అగ్ని రూపంలో అమ్మవారు సాక్షాత్తు శక్తి గా వ్యక్తం అవుతుంది. ఆ తల్లి చిదగ్ని నుండే రూపు దాల్చుతుంది..ఈ అగ్ని ద్వారానే హావిస్సు రూపంలో దేవతలకు శక్తి అందుతుంది.. ఈ నిత్య అగ్నిహోత్రం ఎంతో గొప్ప అనుష్ఠానం.


జీవుడిలో అగ్ని యొక్క స్థానం ఇలా ఉంటుంది ,అగ్ని వాక్కుగా ముఖమునందు, వాయువు ఘ్రాణముగా నాసిక యందు, ఆదిత్యుడు దృష్టిగా నేత్రములందు, దిశలు శ్రవణేంద్రియములుగా చెవుల యందు, జలము వీర్యముగా శిశ్న మందు, మృత్యువు అపానముగా నాభి యందు ప్రవేశించగా; ఈశ్వరుడు శరీరం నిలబడుటకు శిరస్సు ద్వారా పైనుండి బ్రహ్మ రంధ్రములోనికి ప్రవేశించెను. అగ్ని నుండి సమస్త ప్రపంచము ఏర్పడినది. సూర్యుడు కూడా అగ్ని స్వరూపుడే. రాత్రి, పగలు అగ్ని యొక్క సంతానము.


అగ్ని రూపంలో అమ్మవారిని భావించి దీపం లో దర్శనం చేయాలి దీపం జోతిలోకి ఆ తల్లిని ఆవాహన చేసి ఆ దీపంలో ఉపాసించాలి అగ్నిలో ఆమె ప్రత్యక్షంగా దర్శనం ఇస్తుంది ఇది దీప దుర్గా ఉపాసనలో అనుభవం అవుతుంది. దీపాలు వెలిగించి చేసే ప్రార్ధనకి అందుకే అంత శక్తి ఉంటుంది. దీపాలతో దీప కాంతి రూపంలో అమ్మవారిని ప్రత్యక్షంగా ఉపాసన చేస్తారు..ఈ ఉపాసనలో ఆ కాంతి అమ్మవారి ఆకారంలోనే ప్రత్యక్షంగా పూజను స్వీకరిస్తుంది. ఇది పద్దతిగా గురువును నుండి సాధన నేర్చుకుని చేయాలి. అలా ఆవాహన చేసిన తల్లి ని దేవి మహత్యం స్ట్రోత్రాలతో, ఉపదేశం పొందిన మంత్రం యొక్క సంపుటికరణ స్త్రోత్రం అర్చనతో పూజించి ఆ స్వరూపం అంతర్ధానం అయే వరకు మనసులో నే మంత్రం జపిస్తూ ధ్యానం చేయాలి అలా చేయగా చేయగా ఆ శక్తి మనలోకి చేరిపోతుంది. ఈ సాధన కోరికలతో చేయాకుడదు అమ్మవారి అనుగ్రహము పొందడానికి చేయాలి ఎందుకంటే ఆ స్థాయిలో అమ్మవారిని ప్రత్యక్షంగా ఆ కాంతిలో అనుభూతి చందుతూ ఒకరకమైన భయం తో కూడిన భక్తి ఏర్పడుతుంది వెన్నులో వణుకు పుడుతుంది నేరుగా ఆమెను చూసే ధైర్యం సరిపోక చూపు ఆమె పాదాలను వెతుకుతుంది. అలా చూస్తూ చేసే శక్తి లేక ధ్యానంలో కి వెళ్ళిపోయి ఉపాసన కొనసాగిస్తారు లేకుంటే భయంతో మైకం వచ్చి పడిపోతారు. నిదానంగా అలవాటు అయిన కొద్దీ ఆ భయం తగ్గక పోయిన ధైర్యంతో సాధన కొనసాగించడం అలవాటు అవుతుంది.. క్రమంగా ఈ సాధన సమయం కూడా పెరుగుతుంది. అకండ దీపం లో అమ్మవారిని భావించి చేసే మండల దీక్షకు కూడా అంత శక్తి ఉంటుంది.


ఈ ఉపాసన అంతా తెలియక పోయినా ప్రాతః కాలం సూర్యోదయానికి పూర్వం ఎక్కడ దీపం వెలుగుతుందో ఆ ఇంటిని ఆ దీపం రూపములో అమ్మవారు రక్షిస్తుంది దీపానికి ఒక్కో సమయానికి ఒక్కో దేవత అధిపతిగా ఉంటారు ఉదయం 5 గం దీపంలో వినాయకుడు అధిపతిగా ఉంటారు , 5.30 నుండి 6 గం సమయం వరకు లక్ష్మీ దేవి అధిపతిగా ఉంటుంది ఆ తల్లి దీపంలో కొలువై నరాయణుడిని ప్రార్థిస్తూ ఉంటుంది ఎక్కడ లక్ష్మీ కొలువై స్వామిని ఆరాధిస్తారో ఆ ఇంటిపైన క్ నరాయణుడి దృష్టి పడుతుంది. అగ్ని రూపం సాక్షాత్తు అమ్మవారే ఆ అగ్నిని దీపం రూపంలో ఆరాధిస్తే అంతకంటే గొప్ప ఉపాసనా సాధన ఏముంటుంది.


ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి, అగ్నిహోత్రం అలవాటు ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా సాధన చేస్తే ఆ తల్లిని ప్రత్యక్షంగా ఆరాధించినట్టు. దీపాలు వెలిగించండి అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి. ఆ తల్లి మీ ఇంటికి దీపమై చీకటిని మాపి వెలుగును నింపుతుంది.

నవావరణ పద్యార్చన*

 *శ్రీ ప్లవ - శరన్నవరాత్రులు - నవావరణ పద్యార్చన*

           రచన: శ్రీశర్మద - స్వర్ణపురి (పొన్నూరు)


ఆశ్వయుజ శుక్ల పంచమి మరియు షష్ఠి: ది.11-10-2021 (ఈ సం.రం రెండూ ఒకేరోజున)


పంచమి:

శార్దూలము: 

పాదాబ్జమ్ములు కేలుదమ్ము లుదజప్రాశస్త్యనేత్రద్వయం

బా దేదీప్యముఖారవింద మొకటై యంభోరుహశ్రీరుతిన్

ప్రాదుర్భావము జెందె సౌరు ఘనమై రాగోజ్జ్వలారాశియై

ఔదార్యాంచిత దాడిమీకుసుమవర్ణాపర్ణ శ్రీమాతకున్

            


షష్ఠి:

శార్దూలము: 

శ్రీగంధాంకితగాత్రకోమలసితా! చిన్ముద్రసంశోభితా!

సౌగంధోజ్జ్వలకుంకుమాదివిలసత్సంభావితా! రాజితా!

రాగాలంకృతభూషితా! గుణహితా! రాజ్ఞీ! ప్రమోదాంచితా!

భోగమ్ముల్ కడుసేయుచున్ స్తుతులతో పూజింతు నిన్ శాంభవీ!

✍️శ్రీశర్మద

మొగలిచెర్ల అవధూత శ్రీ

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అణగారిన అహంకారం!.*


శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన రెండు మూడు సంవత్సరాలు గడిచిన తరువాత ఒక వేసవి కాలంలో..విజయవాడ నుంచి ఒక సిద్దాంతి గారు మొగలిచెర్ల వచ్చారు..పలు దేవాలయాల ప్రతిష్టలు ఆయన చేసివున్నారు..ఆ రోజుల్లో ఆలయాల వాస్తు చూడాలన్నా వారినే సంప్రదించేవారు..మా అమ్మా నాన్న గార్లకు ఆయనతో చాలాకాలం నుంచీ పరిచయం ఉంది..అప్పటికే సుమారు అరవై ఏళ్ల వయసు..మా అమ్మగారిని "అమ్మాయీ.." అనీ..నాన్న గారిని.."శ్రీధరా.." అనీ పిలిచేవారు..అంతటి చనువు ఉండేది..మా అమ్మగారు "బాబాయి గారూ.." అని పిలిచేది..


శ్రీ స్వామివారు మాలకొండలో తపోసాధన చేస్తున్న రోజుల్లో..ఈ సిద్ధాంతి గారిని తీసుకొని మా తల్లిదండ్రులు ఒక శనివారం నాడు మాలకొండ వెళ్లి, శ్రీ లక్ష్మీనృసింహుడి దర్శనం చేసుకొని..శ్రీ స్వామివారిని కూడా కలుద్దామని శ్రీ పార్వతీ దేవి మఠం వద్దకు వచ్చారు..నిజానికి ఈ సిద్దాంతి గారికి శ్రీ స్వామివారిని పరిచయం చేయాలని మా నాన్నగారికి కలిగిన కోరిక..అదేమీ చిత్రమో..ఆరోజు ఎంతసేపు ఎదురుచూసినా.. శ్రీ స్వామివారు రాలేదు..సాయంత్రం దాకా చూసి, మా అమ్మానాన్న గార్లు వెనక్కు వచ్చేసారు..సిద్దాంతి గారు ప్రక్కరోజు విజయవాడ వెళ్లిపోయారు..ఆ ప్రక్కవారమే మళ్లీ అమ్మా నాన్న మాలకొండ వెళ్లారు..ఆ వారం శ్రీ స్వామివారు వీళ్ళకోసమే ఎదురుచూస్తున్నట్లు కూర్చుని వున్నారు..


"పోయిన వారం ఒక సిద్ధాంతి గారిని తీసుకొచ్చాము నాయనా..మీ కోసం చాలా సేపు ఎదురుచూసి మొగలిచెర్ల వెళ్ళాము.." అన్నారు మా అమ్మగారు..


"తెలుసమ్మా..ఆ అహంకారిని కలవడం ఎందుకులే అని అనుకున్నాను.." అన్నారు స్వామివారు..అమ్మా నాన్న గార్లు ముఖాముఖాలు చూసుకున్నారు..తమకు పరిచయమైనప్పటినుండి..శ్రీ స్వామివారు ఎవ్వరి గురించీ..ప్రత్యక్షంగా గానీ.. పరోక్షంగా గానీ..ఎటువంటి వాఖ్యలూ చేయలేదు..చేయరు కూడా..కానీ ఈరోజెందుకో ఆ సిద్దాంతి గారిని అహంకారి అని అనేశారు..ఆ తరువాత, సిద్ధాంతి గారు ఇదే మొగలిచెర్ల రావడం..శ్రీ స్వామివారి మందిరానికి వెళదామని ఆయనే అమ్మా నాన్న గార్లతో చెప్పారు..సరే అని చెప్పి..ఎద్దులబండి కట్టించి..అందులో వారిని ఎక్కించుకొని..శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..


శ్రీ స్వామివారి మందిరం ముందు బండి ఆపారు..బండి దిగి.."శ్రీధరా..ఈ మందిరం వాస్తు ఎవరు చూసారు?..చాలా మార్పులు చేయాలి.." అన్నారు సిద్ధాంతి గారు..అప్పటికి ఆయన శ్రీస్వామివారి మందిరం లోపలికి అడుగు కూడా పెట్టలేదు..


"శ్రీ స్వామివారే దగ్గరుండి కట్టించుకున్నారు.." అన్నారు నాన్నగారు.."అవునా..ఒక్క నిమిషం శ్రీధరా..చుట్టూరా తిరిగి చూసి..ఆపైన మందిరం లోపలికి వెళదాము.." అన్నారు సిద్ధాంతి గారు..


నాన్నగారికి కొద్దిగా చిరాకు వేసినా..లోపలే అణచుకొని..సిద్ధాంతి గారిని మందిరం వెలుపలి వైపు చుట్టూ ప్రదక్షిణ గా తిరగసాగారు..సగం ప్రదక్షిణ పూర్తి అయిందో లేదో..సిద్దాంతి గారికి కడుపులో చిన్నగా నొప్పి మొదలైంది..మరో రెండు అడుగులు వేసే సరికి నొప్పి తీవ్రం అయింది..రెండు నిమిషాల కల్లా ఆయన అడుగు కూడా వేయలేక అక్కడే నేలమీద కూలబడి పోయారు..నాన్నగారికి భయమేసింది..ఆయన్ను పొదివి పట్టుకొని..అతికష్టం మీద బండి దాకా తీసుకొచ్చి..బండిలో కూర్చోబెట్టారు..గబ గబా బండికి ఎద్దులు కట్టి మొగలిచెర్ల కు తిరిగి బైలు దేరారు..


బండి శ్రీ స్వామివారు ఆశ్రమం కట్టించుకున్న ఫకీరు మాన్యం హద్దులు దాటిందో లేదో..సిద్ధాంతి గారికి కడుపులో నొప్పి శాంతించింది..లేచి కూర్చున్నారు.. మళ్లీ వెనక్కు తీసుకెళ్ళకుండా నాన్నగారు సిద్ధాంతి గారిని మొగలిచెర్ల లోని ఇంటికి తీసుకొచ్చారు.. అమ్మతో జరిగిన విషయం అంతా చెప్పేసారు..అమ్మకు ఆరోజు శ్రీ స్వామివారు చెప్పిన "ఆ అహంకారిని కలవడం ఎందుకులే అని రాలేదమ్మా.." అనే మాటలు చెవుల్లో మారు మ్రోగాయి..నాన్నగారికి కూడా గుర్తుచేశారు..సమాధి లో కూర్చుని కూడా సిద్ధాంతి గారు తన వద్దకు రావడానికి శ్రీ స్వామివారు ఇష్టపడలేదని మా తల్లిదండ్రులకు అర్ధమైంది..


"బాబాయి గారూ..మిమ్మల్ని శ్రీ స్వామివారు దూరంగా పెట్టారు..మీలోని అహంకారమే అందుకు కారణం.." అని మా అమ్మగారు చెప్పారు.."నిజమే తల్లీ..నేను ఆ మహానుభావుడు కట్టించుకున్న ఆశ్రమానికే వంకలు పెట్టబోయాను.. ఆరోజు స్వామివారు జీవించి ఉండగా ఆయన దర్శనభాగ్యం కలుగలేదు..ఈరోజు కనీసం ఆ స్వామి నన్ను తన సమాధి దర్శనానికి కూడా అనుమతించలేదు.."అన్నారు కళ్లనీళ్లు పెట్టుకుంటూ..సిద్ధాంతి గారు ఆరోజే విజయవాడ కు వెళ్లిపోయారు..


ఆయన తన జీవితకాలంలో మరెప్పుడూ మొగలిచెర్ల రాలేదు..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

 *11.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*


*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ఉద్ధవ ఉవాచ*


*14.1 (ప్రథమ శ్లోకము)*


*వదంతి కృష్ణ శ్రేయాంసి బహూని బ్రహ్మవాదినః|*


*తేషాం వికల్పప్రాధాన్యముతాహో ఏకముఖ్యతా॥12729॥*


*ఉద్ధవుడు ప్రశ్నించెను* శ్రీకృష్ణా! వేదవేత్తలు పెక్కు శ్రేయస్సాధనములను గూర్చి పేర్కొనిరి. వారి, వారి దృష్టిని అనుసరించి అవన్నీ ముఖ్యమైనవేనా? లేక ఏదో ఒక్కటే ముఖ్యమైనదా? దయతో తెలుపుము.


*14.2 (రెండవ శ్లోకము)*


*భవతోదాహృతః స్వామిన్ భక్తియోగోఽనపేక్షితః|*


*నిరస్య సర్వతః సంగం యేన త్వయ్యావిశేన్మనః॥12730॥*


స్వామీ! భక్తియోగము స్వతంత్రసాధనమని నీవు ఉపదేశించితివి. భక్తిద్వారా అన్ని విధములగు ఆసక్తులు తొలగిపోయి, మనస్సు నీయందే లగ్నమగుననియు తెల్పితివికదా.


*శ్రీభగవానువాచ*


*14.3 (మూడవ శ్లోకము)*


*కాలేన నష్టా ప్రలయే వాణీయం వేదసంజ్ఞితా|*


*మయాఽఽదౌ బ్రహ్మణే ప్రోక్తా ధర్మో యస్యాం మదాత్మకః॥12731॥*


*14.4 (నాలుగవ శ్లోకము)*


*తేన ప్రోక్తా చ పుత్రాయ మనవే పూర్వజాయ సా|*


*తతో భృగ్వాదయోఽగృహ్ణన్ సప్త బ్రహ్మమహర్షయః॥12732॥*


*14.5 (ఐదవ శ్లోకము)*


*తేభ్యః పితృభ్యస్తత్పుత్రా దేవదానవగుహ్యకాః|*


*మనుష్యాః సిద్ధగంధర్వాః సవిద్యాధరచారణాః॥12733॥*


*14.6 (ఆరవ శ్లోకము)*


*కిందేవాః కిన్నరా నాగా రక్షః కింపురుషాదయః|*


*బహ్వ్యస్తేషాం ప్రకృతయో రజఃసత్త్వతమోభువః॥12734॥*


*శ్రీకృష్ణభగవానుడు నుడివెను* ఉద్ధవా! వేదవాఙ్మయము ప్రళయకాలమున లుప్తప్రాయమైనది. మరల నేను సృష్టియొక్క ప్రారంభసమయమున సంకల్పమాత్రముచే బ్రహ్మదేవునకు ఈ వేదజ్ఞానమును తెలిపితిని. ఇందులో బ్రహ్మదేవుడు తన జ్యేష్ఠపుత్రుడైన స్వాయంభువ మనువునకు ఈ వేదజ్ఞానమును అందించెను. ఆయననుండి భృగువు మొదలగు సప్తర్షులు దానిని గ్రహించిరి. ఆ సప్తర్షులనుండి వారి కుమారులును, దేవదానవులును, యక్షులును, మానవులు, సిద్ధ, గంధర్వ, విద్యాధరులు, చారణులు, కిందేవులు, కిన్నరులు, నాగులు, రాక్షసులు, కింపురుషులు మొదలగు పెక్కుజాతులవారు ఈ వేదవాఙ్మయమును పొందిరి. వీరు అందరును ప్రకృతి సంబంధమైన సాత్త్విక, రాజస, తామస గుణములతో జన్మించినవారు.


*14.7 (ఏడవ శ్లోకము)*


*యాభిర్భూతాని భిద్యంతే భూతానాం పతయస్తథా|*


*యథాప్రకృతి సర్వేషాం చిత్రా వాచః స్రవంతి హి॥12735॥*


ఆయా జాతులవారు తమ ప్రకృతిబుద్ధి భేదములను అనుసరించి ఈ వేదార్థములను వేర్వేరుగా గ్రహించిరి. ఈ వాఙ్మయము అలౌకికమగుటవలన అందు భిన్నభిన్నార్థములు వెలువడుట సహజమే.


*14.8 (ఎనిమిదవ శ్లోకము)*


*ఏవం ప్రకృతివైచిత్ర్యాద్భిద్యంతే మతయో నృణామ్|*


*పారంపర్యేణ కేషాంచిత్పాఖండమతయోఽపరే॥12736॥*


ఇట్లు స్వభావములయందును, పరంపరాగతములైన ఉపదేశముల యందును భేదములు ఉండుటవలన మనుష్యుల బుద్ధులలో భిన్నత్వము ఏర్పడెను. కొందరు ఏ మాత్రమూ ఆలోచింపక వేదవిరుద్ధములైన పాషండ మతములను అవలంబించిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీలలితా సహస్రనామ భాష్యము

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*448వ నామ మంత్రము* 11.10.2021


*ఓం స్వస్తిమత్యై నమః*


క్షేమము, పుణ్యము, మంగళము, శుభములు అను స్వస్తి శబ్దవాచక స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *స్వస్తిమతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం స్వస్తిమత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపూరితమైన హృదయంతో ఆరాధించు భక్తులకు సకలము క్షేమకరము, మంగళకరము, పుణ్యప్రదము మరియు శుభప్రదమై జీవనమంతయు ఆనందమయమై కొనసాగును.


స్వస్తిమతీ యనగా శుభప్రదము, క్షేమకరము, మంగళదాయకము, పుణ్యప్రదము. అమ్మవారిని మనోనేత్రములతో వీక్షిస్తే శుభప్రదము, క్షేమకరము, మంగళదాయకము, పుణ్యప్రదము. అందుచే ఆ తల్లి *స్వస్తిమతీ* యని అనబడినది. పరబ్రహ్మస్వరూపిణి యైన పరమేశ్వరి పరమ సత్యము. ఎంత సత్యమంటే పంచప్రాణాలు, పంచఉపప్రాణాలు - అంత. ఎందుకంటే పంచప్రాణాలు, పంచఉపప్రాణాలు ఉన్నాయి గనుకనే హృదయస్పందన, రక్తప్రసరణ, ఆకలి దప్పులు, త్రిగుణములు, ఇంద్రియకార్యములు, మనోవికారములు ఏర్పడుతున్నాయి. గనుక పరమేశ్వరి సత్యమేగదా. 


స్వస్తిమతి అంటే చక్కని ఉనికి గలిగినది. ఎందుకంటే మూలకూటత్రయ స్వరూపిణి. అనంతకోటి జీవరాశులలో పరమాత్మగా విలసిల్లునది. ఆ తల్లి యథార్థతగలిగి యున్నది అన్నారు. అంటే ఆ యథార్థత ఏమిటి? వీచేగాలి, జ్వలించే అగ్ని, కురిసే వాన, ప్రవహించే గంగ. అంతేనా? సుగంధభరితమైన మలయమారుతము. త్రికాలములందు ఒకటే రూపమున చక్కగా ఉన్నది యనుటనే *స్వస్తిమతీ* యని అనదగును. సృష్టికి పూర్వము, స్థితియందు, లయమందు కూడా ఆ తల్లి ఆదిపరాశక్తియే. ప్రాణములుండుట సత్యమేగదా. ప్రాణమున్న శరీరము శివమయితే, ప్రాణములేని శరీరము శవము. ప్రాణములుండుట ఎంత సత్యమో, పరమాత్మ యనునది సత్యమునకే సత్యము. దీనినే సత్యసత్యము పారమార్థిక సత్యము, సుసత్త అని చెప్పారు. స్వస్తియను శబ్దమునకు పారమార్థిక కోశమునందు ఆశీర్వాదము, క్షేమము, నిష్పాపము, పుణ్యము, మంగళము అను అర్థములు గలవు. ఈ అర్థములు అన్నియును పరమేశ్వరికి అన్వయించవచ్చును గనుకనే, ఆ తల్లి *స్వస్తిమతీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం స్వస్తిమత్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*447వ నామ మంత్రము* 11.10.2021


*ఓం శాంత్యై నమః*


కామక్రోధలోభమోహమదమాత్సర్యములు అనబడు అరిషడ్వర్గములను నశింపజేసి, సాధకులకు శాంతిని అనుగ్రహించు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శాంతిః* అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం శాంత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ తల్లి వారిలోని కామక్రోధలోభమోహమద మాత్సర్యములనబడు అరిషడ్వర్గములను నశింపజేసి, వారిని శాంతస్వరూపులుగా పరివర్తింపజేయును. 


*ఆణవాది మలములు (కల్మషములు)*


1. *ఆణవము* (పరబ్రహ్మమును గూర్చి అప్పుడప్పుడు కలిగెడి జ్ఞానమును మఱుగుపఱచునది),


 2. *కార్మికము* (గురువు బోధించిన పరమార్థమున బుద్ధి చొరనీయనిది), 


3. *మాయికము* (పరతత్త్వ జ్ఞానవాసన నెప్పుడును కలుగనీయనిది), 


4. *మాయేయము* (సాపకార్యములందు మాత్రమే బుద్ధిని జొన్పునది), 


5. *తిరోధానము* (పరబ్రహ్మ మనిత్యమను బుద్ధిని కల్గించి జనన మరణాది దుఃఖములను కలుగజేయునది). 


జగన్మాత తనను ఆరాధించు సాధకులలో ఇటువంటి మలములను (కల్మషములను) నశింపజేసి సత్త్వగుణ ప్రధానమైన శాంతిని ప్రసాదించును గనుక ఆ తల్లి *శాంతిః* అని యనబడినది. ఈ ఆణవాది మలములు అనునవి మలమాయావికారములు. వీటిని నశింపజేయునదియే శాంతికళ. అటువంటి శాంతికళా స్వరూపిణియైన పరమేశ్వరి *శాంతిః* అని యనబడుచున్నది. ఈ కళ వాయుసంబంధమైనది. ఈ శాంతి యనునది ఏర్పడుటనే ఉన్నత స్థితియని శైవాగమనమందు చెప్పబడినది.


నాసికకు (ముక్కునకు) పదునైదు అంగుళముల బాహ్యస్థానమును వ్యాపించి మలములను పారద్రోలి జీవుని శుద్ధిచేయు కళాస్థానముగలదు. అదియే షోడశీకళ అని యనబడును. ఈ కళనే శాంతి అని అంటారు. షోడశకళారూపిణియైన పరమేశ్వరి ఈ శాంతిస్వరూపిణియగుటచే, ఆ అమ్మ *శాంతి* అని యనబడినది.


*శాంతమె భూషణంబు* అని ఒక కవీశ్వరులు అని యుంటిరి. అనగా శాంతము అనునది ఆభరణముల కన్నిటికన్నను అపురూపమైన ఆభరణము. శాంతి యను సాధనముతో ఎంతటి క్లిష్టసమస్యనైనను జయించవచ్చును. 


*తన కోపమె తనశత్రువు తనశాంతమె తనకురక్ష, దయ చుట్టంబౌ* అని మరొక కవి అన్నారు. ఎవరే మన్నా, అనుభవపూర్వకముగా చెప్పబడినది ఈ సూక్తి. 


మహావిష్ణువును *శాంతాకారం* అన్నారు. పాలకడలిలో, శేషతల్పశయనుడైన ఆ పరమాత్మ అత్యంత శాంతమూర్తిగా గోచరిస్తాడు. 


లలితా పరమేశ్వరిని తదేకంగా వీక్షిస్తే ఆ తల్లి వదనారవిందము మందస్మితముగా, అత్యంత శాంతస్వభావంతో కనిపిస్తుంది. అందుకే అమ్మవారు *శాంతిః* అని యనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శాంత్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం

 *10.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదమూడవ అధ్యాయము*


*భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*13.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*ఏవం విమృశ్య గుణతో మనసస్త్ర్యవస్థా మన్మాయయా మయి కృతా ఇతి నిశ్చితార్థాః|*


*సంఛిద్య హార్దమనుమానసదుక్తితీక్ష్ణజ్ఞానాసినా భజత మాఖిలసంశయాధిమ్॥12719॥*


ఈ విధముగ చక్కగా విచారించుటవలన మనస్సు యొక్క ఈ మూడు అవస్థలను గుణములద్వారా నా మాయచే నా అంశస్వరూపుడగు జీవునియందు కల్పింపబడినదనియు, ఇవన్నియును ఆత్మయందు ఎంతమాత్రమూ లేవనియు, ఇవి అసత్యములనియు స్పష్టమగును. కావున మీరు అనుమాన ప్రమాణముల ద్వారా, సత్పురుషులద్వారా బోధింపబడిన ఉపనిషత్తుల జ్ఞానము చక్కగా శ్రవణము చేయుటచే వివేకమనెడు ఖడ్గమునకు వాడియైన పదును లభించును. అట్టి వాడియైన జ్ఞానఖడ్గముతో సంశయము లన్నింటి మూలమైన అహంకారమును ఛేదింపుడు. అంతట మీ హృదయములందు విరాజిల్లుతున్న పరమాత్మయగు నన్ను భజింపుడు.


*13.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*ఈక్షేత విభ్రమమిదం మనసో విలాసం దృష్టం వినష్టమతిలోలమలాతచక్రమ్|*


*విజ్ఞానమేకమురుధేవ విభాతి మాయా స్వప్నస్త్రిధా గుణవిసర్గకృతో వికల్పః॥12720॥*


ఈ జగత్తు అంతయును మనఃకల్పితము. అలాతచక్రమువలె చంచలమై, చూచుచుండగనే ఇది నష్టప్రాయమగును. ఇది భ్రమగొలుపునట్టిది అని ఎఱుంగవలెను.ఈ స్థూలశరీరము, ఇంద్రియములు, అంతఃకరణము - అనునవి త్రిగుణముల యొక్క వికల్ప పరిణామములే. ఇది స్వప్నమువలె మాయావిలాసము, అజ్ఞానకల్పితము.


*13.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*దృష్టిం తతః ప్రతినివర్త్య నివృత్తతృష్ణస్తూష్ణీం భవేన్నిజసుఖానుభవో నిరీహః|*


*సందృశ్యతే క్వ చ యదీదమవస్తుబుద్ధ్యా త్యక్తం భ్రమాయ న భవేత్స్మృతిరానిపాతాత్॥12721॥*


సాధకుడు శబ్దాది విషయములనుండి తన విషయాభిలాషను (తృష్ణను) మానసికముగా వీడవలెను. విషయములచే ఆకర్షింపబడకుండునట్లుగా కర్మేంద్రియములను నియంత్రింపవలెను. అతడు అంతర్ముఖుడై, ఎట్టి వాంఛలును లేనివాడై, ఆత్మానందమగ్నుడు కావలెను. అప్ఫుడప్పుడు విషయములు ఏవైనను తన దృష్టికి వచ్చినప్పుడు 'ఇవి అన్నియును మాయ. వీటితో నాకు ఏమి పని?' అని భావించి, ఆత్మ వస్తువునకు అతిరిక్తములగు వాటిని త్యజించివేయును. అంతట అతని భ్రమ తొలగిపోవును. శరీరము ఉండునంతవఱకును కేవలము పూర్వసంస్కారముయొక్క స్మృతి మిగిలి ఉండును.


*13.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*దేహం చ నశ్వరమవస్థితముత్థితం వా సిద్ధో న పశ్యతి యతోఽధ్యగమత్స్వరూపమ్|*


*దైవాదపేతముత దైవవశాదుపేతం వాసో యథా పరికృతం మదిరామదాంధః॥12722॥*


మద్యపానముచే శరీరస్పృహ కోల్పోయి యున్నవానికి 'తన శరీరముపై వస్త్రము ఉన్నదా, జారిపోయినదా!' అను విషయమే పట్టదు. సిద్ధపురుషుడు తనకు ప్రారబ్ధవశమున వచ్చిన నశ్వరమైన శరీరమును ఆధారము చేసికొని సాధన చేయుటద్వారా స్వస్వరూపసాక్షాత్కారమును పొందును. ఆ స్థితిలో ఆ శరీరము కూర్చొనియున్నను, నిలబడియున్నను, ఎచ్చటికైనా వెళ్ళినను, వచ్చినను అతడు సచ్చిదానందస్వరూపమునందు నిలిచియుండుటవలన శరీరముపై ఏమాత్రమూ ధ్యాసయే యుండదు.


*13.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*దేహోఽపి దైవవశగః ఖలు కర్మ యావత్ స్వారంభకం ప్రతిసమీక్షత ఏవ సాసుః|*


*తం స ప్రపంచమధిరూఢసమాధియోగః స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్ధవస్తుః॥12723॥*


ప్రాణములతో, ఇంద్రియములతో గూడియున్న ఈ దేహము జీవికి తన పురాకృతకర్మఫలముగా ఏర్పడును. ఆ కర్మఫలములను అనుభవించునంతవరకును (కర్మఫలములు తీరునంతవరకునూ) ప్రాణములు నిలిచియేయుండును. కాని ఆత్మసాక్షాత్కారమును పొంది, సమాధిస్థితుడైయున్న యోగికి దారాపుత్రధనాది ప్రాపంచిక విషయములు నిద్రనుండి మేల్కొనిన వానికి స్వప్నదృశ్యములవలె భాసిల్లును. అతడు లౌకిక విషయములతో మరల ఎట్టి సంబంధమునూ కలిగియుండడు.


*13.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*మయైతదుక్తం వో విప్రా గుహ్యం యత్సాంఖ్యయోగయోః|*


*జానీత మాఽఽగతం యజ్ఞం యుష్మద్ధర్మవివక్షయా॥12724॥*


బ్రాహ్మణులారా! సాంఖ్యయోగములను గూర్చి శాస్త్రములలో పేర్కొనిన విషయములను (స్వస్వరూపజ్ఞాన విషయములను, సమాధిస్థితికి చేరిన యోగియొక్క లక్షణములను) మీకు వివరించితిని. ఇవి మిగుల గోప్యములు. మోక్షధర్మమును గూర్చి మీకు తెలుపుటకై యజ్ఞస్వరూపుడనైన నేను హంసరూపమున ఇచటికి వచ్చితినని ఎఱుంగుము.


*13.39 (ముప్పది తొమ్మిదివ శ్లోకము)*


*అహం యోగస్య సాంఖ్యస్య సత్యస్యర్తస్య తేజసః|*


*పరాయణం ద్విజశ్రేష్ఠాః శ్రియఃకీర్తేర్దమస్య చ॥12725॥*


భూసురోత్తములారా! నేను సాంఖ్యయోగములకునూ, సత్యమునకును, ఋతమునకునూ (యుక్తభాషణమునకును), తేజస్సునకును, సంపదలకును, కీర్తికిని, దమమునకును (ఇంద్రియ నిగ్రహమునకును) ఆశ్రయుడను.


*13.40 (నలుబదియవ శ్లోకము)*


*మాం భజంతి గుణాః సర్వే నిర్గుణం నిరపేక్షకమ్|*


*సుహృదం ప్రియమాత్మానం సామ్యాసంగాదయోఽగుణాః॥12726॥*


నేను నిర్గుణస్వరూపుడను, స్వార్థచింతన లేకుండ ఇతరుల దుఃఖములను పారద్రోలువాడను, అందరికిని హితమును గూర్చువాడను. అట్టి నన్ను సమత్వము, అనాసక్తి మొదలగు శ్రేష్ఠగుణములు సేవించుచుండును. ఈ సద్గుణములు అన్నియును ఎట్టిమార్పును చెందకుండా నిత్యము నాయందే స్థిరముగ నిలిచియుండును.


*13.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*ఇతి మే ఛిన్నసందేహా మునయః సనకాదయః|*



*సభాజయిత్వా పరయా భక్త్యాగృణత సంస్తవైః॥12727॥*


*13.42 (నలుబది రెండవ శ్లోకము)*


*తైరహం పూజితః సమ్యక్ సంస్తుతః పరమర్షిభిః|*


*ప్రత్యేయాయ స్వకం ధామ పశ్యతః పరమేష్ఠినః॥12728॥*


ఉద్ధవా! నేను హంసరూపములో ఈ విధముగా ఉపదేశించిన పిదప, సనకాది మహామునుల సందేహములు అన్నియును తొలగిపోయినవి. అంతటవారు భక్తిశ్రద్ధలతో నన్ను ఆరాధించి స్తుతింపసాగిరి. ఆ సనకాది మహర్షులు త్రికరణశుద్ధిగా నన్ను స్తుతించి పూజించిన పిమ్మట బ్రహ్మదేవుడు చూచుచుండగనే నేను వైకుంఠధామమును చేరితిని.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే త్రయోదశోఽధ్యాయః (13)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట* అను పదమూడవ అధ్యాయము (13)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

Stroke has a new indicator.*

 🍃 *Stroke has a new indicator.*


*Blood Clots/Stroke - They Now Have a Fourth Indicator - the Tongue*


🍃 *Senario :- During a BBQ, a woman stumbled and took a little fall - she assured everyone that she was fine. They offered to call paramedics ... she said she had just tripped over a brick because of her new shoes.*


*They got her cleaned up and got her a new plate of food. While she appeared a bit shaken up, Jane went about enjoying herself the rest of the evening.*


🍃 *Jane's husband called later to say that his wife had been taken to the hospital - (at 6:00 PM Jane passed away)*


*She had suffered a stroke at the BBQ.* 


*Had they known how to identify the signs of a stroke, perhaps Jane would be with us today.*


🍃 *A neurologist says that if he can get to a stroke victim within 3 hours he can reverse the effects of a stroke .... TOTALLY.* 


*He said the trick was getting a stroke recognized, diagnosed, and then getting the patient medically cared for within 3 hours, which is tough.*


🍃 *RECOGNIZING A STROKE*


🍃 *Sometimes symptoms of a stroke are difficult to identify.* 


*Unfortunately, the lack of awareness spells disaster.* 


*When people nearby fail to recognize the symptoms of a stroke, the stroke victim may suffer severe brain damage . Some don't die; instead they end up in a helpless, hopeless condition.*


*Now doctors say a bystander can recognize a stroke by asking three simple questions* *(Remember the First Three Letters of* 🍃 *STROKE* 🍃

🍃 *S. T. R. ):*


✅ S *Ask the individual to SMILE.*


✅ T *Ask the person to TALK and SPEAK A *SIMPLE SENTENCE* *(Coherently)*

*(e.g. Chicken Soup)*


✅ R *Ask him or her to RAISE BOTH ARMS.*


🍃 *If he or she has trouble with ANY ONE of these tasks, call emergency number immediately and describe the symptoms to the dispatcher.*


 🍃 *New Sign of a Stroke -*


✅ *Stick out Your Tongue!*


*NOTE: Another 'sign' of a stroke is this: Ask the person to 'stick' out his or her tongue.* 


*If the tongue is 'crooked', if it goes to one side or the other that is also an indication of a stroke.*


✅ *A cardiologist says if everyone who gets this e-mail sends it to 10 people you can bet that at least one life will be saved.* 


✅ Will you send this ? I have done my part. Will you?