11, అక్టోబర్ 2021, సోమవారం

ఆత్మను ఎవరు తెలుసుకొనగలరు

 ఆత్మను ఎవరు తెలుసుకొనగలరు  

కర్మ వ్యాపారంతో ఇంద్రియ నిగ్రహం బోధించబడుట లేదు. ఇంద్రియములు వ్యవహరించినను, వ్యవహరించకున్ననూ, తాను వ్యవహరించుట లేదు. తాను సదా ఆంతరిక యజ్ఞమునందు నిమగ్నుడై, ఆత్మానందమగ్నుడై ఉన్నాడు. కాబట్టి సామాన్య వ్యవహారం ఏదైతే ఉన్నదో, అట్టి సామాన్య వ్యవహారమునకు సుఖ దుఃఖ ఆసక్తిని పొందక, శీతోష్ణాది ద్వంద్వముల చేత కుంగక, శరీరాది జరామరణాది వార్థక్యరూప జరా మృత్యు వార్థక్యరూపమైనటువంటి వాటి చేత కుంగక, పొంగక, యవ్వనాది విశేషముల చేత లాభింపక, శరీర ఇంద్రియ వ్యాపార సహితమైనటువంటి చర్యల యందు నిమగ్నము కాక, సంగత్వమును పొందక ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు మాత్రమే ఆత్మను తెలుసుకొనగలడు. 

నిష్ఫలాపేక్ష కర్మలు ఆచరించే వారు అనగా 

ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులువీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు ఇవి జీవాత్మ ను బంధించవు.

ఈశ్వరార్పణగా కర్మలు చేయటం 

కామెంట్‌లు లేవు: