15, ఫిబ్రవరి 2022, మంగళవారం

అంతరం- అంతరంగంలో...

 #అంతరం- అంతరంగంలో...


*అంతరాలు, ఓ చక్కని వ్యాసం :*🤘🏼


*మధ్యతరగతి అంతరంగంలో ఆ #అంతరం అలాగే ఉండిపోయింది!*

🤔🤔🤔🤔🤔🤔🤔🤔


*1)* చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు - తినడానికి , ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం.


 కొంతమంది - రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది!

 

అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, *అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని!*


ఇప్పుడు పెద్దయ్యాక - 

మనం కొనుక్కుని తినే టైంకి.....

 ఆ పెద్ద వాళ్ళు , గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు.😂


*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది .*


*2)* చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే - కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు.

 అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు ...

*అది ఖరీదైనది మనం అంత పెట్టగలిగేవాళ్ళంకాదని!*   


పెద్దయ్యాక - 

మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే .....

వాళ్ళు - కాటన్ కు దిగారు. ఇప్పుడు, కాటన్ దుస్తుల ధరే ఎక్కువ ! 🤪


*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ..*😒🤔


⚖⚖⚖⚖⚖⚖⚖


*3)* చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే - మోకాళ్ళ దగ్గర చినిగితే , పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా #రఫ్ చేసి ఇస్తే ...మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం!


పెద్దయ్యాక చూస్తే - 

జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని.... ఫ్యాషన్ పేరుతో #అధికధరలకు కొంటున్నారు !


*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ...*🤔😒


⚖⚖⚖⚖⚖⚖⚖⚖


*4)* ఓ వయసులో మనకు - సైకిల్ కొనగలగడమే కష్టం.


 అదీ సాధించేసరికి - వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు.


 మనం - స్కూటర్ కొనే సమయానికి ....

వాళ్ళు కార్లలో తిరిగేవారు.


 మనం కొంచెం ఎదిగి - మారుతి 800 కొనే సమయానికి ....

వాళ్ళు BMW ల్లో తిరిగారు.


 మనం రిటైర్మెంట్ వయసుకి వచ్చిన కూడబెట్టుకున్న వాటితో - కొంచెం పెద్ద కారు కోనేసమయానికి ....

 వాళ్ళు ఆరోగ్యావసరాలతో సైక్లింగ్ చేస్తున్నారు!


*దాంతో ఇప్పటికి ఆ అంతరం అలాగే ఉండిపోయింది* . .🤔😒

                        

ప్రతి దశలో ,

ప్రతి సమయాన ,

 విభిన్న మనుషుల మధ్య - స్థాయి అంతరం ఉండనే ఉంటుంది.


*ఆ అంతరం - నిరంతరం* ఎప్పటికి ఉండి తీరుతుంది.


రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని .....😢

 మళ్ళీ రేపటిరోజున - గతించిన ఇవాళ్టి గురించి ,చింతించేకంటే, 🥱 


ఇవాళ అందినదానితో ఆనందిస్తూ , ఆస్వాదిస్తూ 💃🏻 రేపటికి స్వాగతం పలకడం శ్రేయస్కరం.🥰


*మనo .... మనవారి గురించి కాలాన్ని వెచ్చిద్దాం*

💞🌹


*మనం నవ్వుతూ ఉందాం*😊


 *జీవితం కూడా సంతోషంగా ఉంటుంది* 🤩

జ్ఞాన శర్మ కథ -

 _*మాఘమాసం*_

🚩 _*బుధవారం*_🚩

_*ఫిబ్రవరి  16వ తేది 2022*_


   🌝 _*మాఘ పురాణం*_🌝

🌴 _*15 వ అధ్యాయము*_🌴


🕉🎋🌾🌝🌝🌾🎋🕉️


*జ్ఞాన శర్మ కథ - (మాఘపూర్ణిమ)*


☘☘☘☘☘☘☘☘


గృత్నృమదుడు జహ్నువుతో నిట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను , బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి యుండెను. అప్పుడు శ్రీహరి ఓయీ నీవు మరల నారాకను గోరి తపమచరించితిని యెందులకు ? నీ మనస్సులో నేమియున్నది చెప్పుమని యడిగెను. అప్పుడా విప్రుడు *'స్వామీ ! నాకు పుత్రవరము నిచ్చి సంతోషము కలిగించితివి , నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను , కాని నారదమహర్షి వచ్చి యీ బాలుడు పండ్రెండు సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది , నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితినని శ్రీహరికి విన్నవించెను.*


అప్పుడు శ్రీహరి *'ఓయీ ! ఉత్తముడైన నీ పుత్రునకు పండ్రెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వ జన్మమున చేసిన దోషమే ఇప్పుడి గండమునకు కారణము. పూర్వజన్మమున గూడ మీరిద్దరును భార్యాభర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమశీలము , గుణములు కలిగియుండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్యపుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము నాచరించినందున యీ జన్మయందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమనాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట , భర్త చెప్పినను చేయకపోవుటయును రెండు దోషముల వలన పండ్రెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషముపోయి నీ పుత్రుడు చిరంజీవియగును.


ఓయీ ! మాఘ స్నానము ఆయువును , ఆరోగ్యమును , ఐశ్వర్యమును యిచ్చును. మాఘస్నానము చేయనివరికి , వారి సంతానమునకు ఆపదలు కల్గును , అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాపదోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు దీర్ఘాయువులు , బుద్దిమంతులు , ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు. మాఘమాసస్నాన వ్రతము కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రత బ్రహ్మ , శివుడు , లక్ష్మి , పార్వతి , సరస్వతి , ఇంద్రుడు , వశిష్టుడు , జనకుడు , దిలీపుడు , నారదుడు వీరు మాత్రమే బాగుగ తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు , మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ అందరికిని తెలియదు. నా భక్తులు , మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమనెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును , నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను.


బ్రాహ్మణుడును శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను , బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు వాని భార్యా , పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


జహ్ను మునివర్యా ! మాఘవ్రతమునకు సాటియైనది మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడనిచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి యిహలోక సౌఖ్యములను , నిశ్చలమగు హరి భక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖమును గూడ పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము , సర్వజన సమాచరణీయము అని గృత్నృమద మహర్షి జహ్నుమునికి వివరించెను.


      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🌝🙏🙏🌝🙏🙏

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి

 సాహితీ కిరణం

----------+---------





ఈరోజు...

ప్రసిద్ధ నాటక రచయిత,

శతావధానాలలో మేటి,

'కళాప్రపూర్ణ' 

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి

(8-8-1870 ◆ 15-2-1950)


"గగనఘంటాపథంలో విహరిస్తూవుండిన,

పద్యగంగాఝరినితొలుత భూమండలానికి దింపి,

ప్రజావళికి పంచిపెట్టిన వాడుతిక్కన సోమయాజి.


తర్వాత ప్రబంధయుగంలో పాండిత్య ప్రభాకరులైన

రామరాజభూషణాది కవుల తీక్షణతచేత తెలుగు పద్యం ఆవిరైమళ్ళీ ఆకాశమండలం చేరింది.


కానీ-మళ్ళీ తెలుగు పద్యాన్ని భూమండలానికి దింపి,అఖండ గోదావరి ప్రవాహంలాగాప్రవహింపజేసి, తెలుగు సాహిత్య క్షేత్రాన్నిశ్యామలంగాను,

కోమలంగాను వెలుగొందజేసినమహానుభావులు

శ్రీ తిరుపతి వేంకటకవులు"అన్న గుంటూరు శేషేంద్రశర్మ గారిమాటలు అక్షరసత్యాలు.


తిరుపతి వేంకట కవులుగా వినుతికెక్కిన,దివాకర్ల తిరుపతి శాస్త్రి,చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగార్ల

సాహితీ ప్రస్థానాన్నినిశితంగా-సునిశితంగా 

పరిశీలిస్తే-పరికిస్తేపై విషయం మనకు

తేట తెల్లమవుతుంది-ప్రస్ఫుటమవుతుంది.


చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు అవధాన విద్యకు  

రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన 

తిరుపతి వేంకట కవులులో ఒకరు. దివాకర్ల తిరుపతిశాస్త్రితో జంటగానూ, ఆయన

మరణానంతరం విడిగానూ ఎన్నో య తండ్రి కామయ్య,తల్లి రామచంద్రమ్మ. గోదావరి జిల్లా కడియం లో నివాస మేర్పరచుకొన్నారు.


శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి,ప్రతివాద భయంకరం 

రాఘవాచార్యులు వద్దఏ కొద్దో చదువుకున్నా,

చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్దనే క్షుణ్ణంగా

విద్యనభ్యసించారు


యానాంలో వేంకట శాస్త్రి తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషలు అధ్యయనం చేశారు. అనంతరం ఆయన సర్వాత్మనా గురువుగా స్వీకరించిన 

చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వద్ద వ్యాకరణాన్ని నేర్చుకునేందుకు తాడేపల్లిగూడెం సమీపంలోని కడియం గ్రామానికి వెళ్లాడు. వ్యాకరణాన్ని సాంగోపాంగంగానేర్చుకుంటున్న వేంకటశాస్త్రికికాశీకి వెళ్ళి చదువుకోవాలన్న సంకల్పం కలిగింది. ఆపై గురువు అంగీకారంతో వివాహం జరగడం వంటి అనుకోని పరిణామాలు ఎదురు కాగా, వివాహమైన అనంతరం తన సహాధ్యాయితో కలిసి సాహసించి వారణాసి బయలుదేరాడు. వారణాసికి వెళ్ళేందుకు చేతిలో డబ్బు లేకున్నా ఆయన, సహాధ్యాయి కృష్ణశాస్త్రులు విద్యాప్రదర్శనలు, కవిత్వ సభల ద్వారానే డబ్బు సంపాదించుకుని కాశీ చేరుకున్నారు.


నోరి సుబ్రహ్మణ్యశాస్త్రులు (బ్రహ్మయ్యశాస్త్రిగారి గురువు)గారివద్ద వ్యాకరణం తరువాయి నేర్చుకోవటం మొదలుబెట్టారు. వారణాశిలో స్థిరపడ్డ తెలుగు పండితుడు శోభనాధ్రి శాస్త్రులు వేంకటశాస్త్రిని అభిమానించి, ఆ వాత్సల్యం చేత బలవంతపెట్టి మరీ 'సిద్ధాంత చంద్రోదయమ'నే వ్యాఖ్యాన సహితంగా తర్కసంగ్రహాన్ని ఉపదేశించారు. మరికొన్నాళ్ళకు తల్లిదండ్రులు ఉత్తరం వ్రాసి, డబ్బు పంపి తిరిగి రమ్మని మరీమరీ కోరడంతో తిరిగివచ్చేసారు.  వేంకటశాస్త్రి ప్రధానంగా బ్రహ్మయ్యశాస్త్రి శిష్యునిగానే ప్రఖ్యాతుడైనా చాలామంది గురువుల వద్ద శిష్యరికం చేశారు.


కవనార్థం బుదయించినట్లు చెప్పుకున్న చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి రెండు తరాలపాటు ఆంధ్రదేశం

ఆబాలగోపాలానికి అవధానమంటే ఏమిటో రుచి చూపించిన తిరుపతి వేంకట కవులలో ఒకరు. 


వేంకటశాస్త్రి ప్రధాన లక్షణం రంజకత్వం.ఆయన పద్యం చదివేతీరు వినసొంపుగా,వీనుల విందుగా వుండి శ్రోతల హృదయాలను రంజింపజేసేది.

తిరుపతి శాస్త్రి కవిత్వంలో ప్రధానలక్షణం ప్రౌఢిమ.అవధానాల పరంపరలను ఒక వంక కొనసాగిస్తూ,మరొక వంక ఆంధ్ర నాటక సాహిత్యాన్ని 

రసవత్తరమైన పాండవ నాటకాలతో సుసంపన్నం చేశారు.పాండవ జననం మొదలు అశ్వమేథం వరకు కథను ఆరు నాటకాలుగా రచించారు. ఆ తరువాత కథను ఎత్తుకుంటే విషాదాంతం చేయవలసి  వస్తుందని మానేసినట్టు తోస్తుంది.


ఈ ఆ‌రు నాటకాలలో పాండవ జననం, పాండవ రాజసూయం,పాండవ ప్రవాసం,పాండవాశ్వమేథం

వెంకట శాస్త్రిగారు రచించారు.పాండవోద్యోగ విజయాలలో మూడువంతుల రచన వేంకట శాస్త్రిగారిదే.మొదట పాండవోద్యోగం‌,పాండవ విజయం అంటూ రెండు నాటకాలు  వేరువేరుగా లేవు.రెండింటి కథను కలిపి పాండవవిజయం అనే పేరుతోనేప్రకటించారు. తరువాత పాండవవిజయాన్ని వేరుచేసి మొదటి రెండు అంకాలకు ఇంకా నాలుగుఏ అంకాలు చేర్చి 'పాండవోద్యోగమ'నిపేరు పెట్టారు. తక్కిన దానికి ఇప్పటి మొదటి అంకం చేర్చి 

'పాండవవిజయమ'ని ప్రకటించారు.


ఈ ఆ‌రు నాటకాలలో ఎక్కువ ప్రచారంలోకి వచ్చి 

ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న నాటకాలు పాండవోద్యోగం,పాండవవిజయం.ఈ రెంటిని కలిపి 

పాండవోద్యోగ విజయాల పేరుతోనూ,

కురుక్షేత్రం అనేపేరుతోనూ ప్రదర్శిస్తున్నారు. 

ఇవి పౌరాణిక నాటకాలకు విజయ పతాకలు.

ఈ నాటకాలలో స్త్రీ పాత్రకుఅంత ప్రాధాన్యం లేకపోవడంవల్ల,వీటికి ప్రదర్శనా సౌలభ్యం చేకూరింది. పైగా ప్రధాన పురుష పాత్రలు వీటిలో ఎక్కువ.రెండు కలిపిన నాటకం పెద్దది కావడంవల్ల పేరు పొందిన నటులు అనేక మంది ఒకే ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కలిగింది.


ఈ నాటకాల ద్వారానే మంజులూరికృష్ణారావు, 

బుర్రా రాఘవాచార్యులు, పింగళి లక్ష్మీ కాంతం, మల్లాది గోవింద శాస్త్రి,బెల్లంకొండ సుబ్బారావు, 

బందా కనకలింగేశ్వరరావు,పీసపాటినరసింహమూర్తి,

మాధవపెద్దివెంకట్రామయ్య,తదితరులు నటలోకంలో తారాపథం అందుకున్నారు.

పాండవ విజయం,పాండవ ప్రవాసం,అపూర్వ కవితా వివేచనం,సుకన్య,పాండవజననం, అనర్ఘనారదం,పండితరాజం,పాండవఉద్యోగం,పాండవ అశ్వమేథం,ప్రభావతీప్రద్యుమ్నం,రాజసూయం,                వ్యసనవిజయం,మొదలైనవి వీరి స్వతంత్ర నాటకాలు


పల్లెటూళ్ళ పట్టుదలలు,  నవీన విద్యా విలాసం,     

గ్రామ సింగం,తవిటిరొట్టె,రసాభాసం,                   కవిసింహ గర్జితములు,మొదలైనవి వీరి ప్రహసనాలు


మృచ్ఛకటికంముద్రారాక్షసం వీరి అనువాద నాటకాలు


వీరి వచన రచనలలో 'కథలు-గాథలు'విమర్శన వ్యాసాల సంపుటి.1974లో వీరి గ్రంథాలు 

మొత్తం 8 సంపుటాలుగా ప్రచురితమైనాయి.


వీరి అవధానశక్తి అత్యంత విలక్షణం. ధారాశుద్ధితో కూడిన ధారణాశక్తి, ఆశుధారాపటిమ ఆజన్మసిద్ధమా 

అనిపిస్తుంది. అవధానమనే యాగాశ్వంతో 

దిగ్విజయ యాత్ర సలిపి కవితా సామ్రాజ్య 

పట్టాభిషిక్తులయ్యారు. పద్యమైనా, వచనమైనా, 

కబుర్లైనా చవులూరించేటట్లు రాయగలరు; చెప్పగలరు. తిరుపతి వేంకట కవుల కన్నా ముందు 

అవధాన ప్రక్రియ కాస్తో కూస్తో వ్యాప్తిలో ఉంది. 

శ్రీనాథుడు, చరిగొండ ధర్మన్న, భట్టుమూర్తి అవధానాలు చేశారని ప్రతీతి. 64 కళల్లోని కావ్య సమస్యాపూరణం అవధానానికి ప్రాచీన రూపం. పూర్వం నుంచీ సమస్యాపూరణం అనే విద్య రాజస్థానాల్లోనూ, ప్రజాబాహుళ్యంలోనూ ప్రచారంలో ఉండడం చాటువులు చెప్తాయి. తిరుపతి వేంకట కవులకు పూర్వంఏ గుంటూరుకు చెందిన మాడభూషి వేంకటాచార్యులు, పిఠాపుర ఆస్థానకవులు దేవులపల్లి సోదరులు, విజయనగరంలో హరికథా పితామహుడు 

ఆదిభట్ల నారాయణదాసు అష్టావధానాలు చేశారు.

అయితే ఆ విద్యని ఒక క్రీడగా భావించి చేసిన 

ప్రదర్శనలే కానీ అవధానాలను ఉద్యమస్థాయిలో ప్రాచుర్యం తీసుకువచ్చిన వారు తిరుపతి వేంకట కవులు. అష్టావధానాలకూ, శతావధానాలకూ 

స్ఫుటమైన రూపాన్ని సంతరించిపెట్టారు. 

అవధానం అంటే ఇలా ఉండాలి,ఈ అంశాలను ప్రదర్శించాలి, ధారణ సమయం ఇది అంటూ 

నిర్దుష్టంగా ప్రదర్శించి ప్రక్రియాపరమైన ఆకారాన్ని 

కల్పించిన వారు తిరుపతి వేంకట కవులు.


కాశీకి వెళ్ళేందుకు ధనార్జన కోసం చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తన సహాధ్యాయి కందుకూరి కృష్ణశాస్త్రితో కలిసి శనివారప్పేట గ్రామంలో (నేడు ఏలూరు నగరంలో భాగమైపోయింది) తొలి శతావధానం చేశారు. అనంతరం కాశీ నుంచి తిరిగివచ్చాక గంగా సంతర్పణ కోసం ధనార్జన యత్నాల్లో భాగంగా నిడమర్రు, ముమ్మిడివరం, అయినాపురం గ్రామాల్లో ఒంటరిగా అష్టావధానాలు చేశారు.అనంతర కాలంలో గురువు 

చర్ల బ్రహ్మయ్యశాస్త్రి ఆదేశంతో దివాకర్ల

తిరుపతిశాస్త్రితో కలిసి అవధానాలు ప్రారంభించారు. 

1891లో కాకినాడలో చేసిన శతావధానమే 

తిరుపతి వేంకటకవులుగా వీరి తొలి ప్రదర్శన. 

అందులో వారు చెప్పిన పద్యాల్లో వ్యాకరణ దోషాలున్నాయని పెద్ద పండితులు శంకించారు. 

తిరుపతి వేంకట కవులు కూడా నోరు మెదపకుండా 

అవి నిజంగా తప్పులే అని అందరికీ అనుమానం వచ్చేటట్టుగా ప్రవర్తించారు. అలా శతావధానమంతా అయిపోనిచ్చి, శతావధానం చివరిలో ప్రధానసభకు ముందు జరిగిన ఉపసభలో ఆయా శంకలు అన్నీ 

వరుసగా చెప్తూ పూర్వ మహాకావ్యాల ప్రయోగాలు 

ఉదహరించి ఎగరగొట్టారు. ఆ హఠాత్పరిణామాన్ని ముందుగా ఊహించకపోవడంతో సభ్యులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. పైగా నిండా 20ఏళ్ళు నిండని కుర్రవాళ్లు దిగ్గజాల్లాంటి మహా పండితులను ఓడించడంతో నాటి నుంచి వారి ప్రభ వెలిగిపోవడం మొదలుపెట్టింది.ఆపైన అప్రతిహతమైన వారి శతావధానాల జైత్రయాత్ర తిరుపతి వేంకట కవులకే కాక తెలుగునాట అవధాన ప్రక్రియకే గొప్ప ప్రాచుర్యానికి నాంది అయింది.ఆపై వారి అవధాన పరంపరలో భాగంగా కొప్పరపు సోదర కవులు, వేంకట పార్వతీశ్వర కవులతో వివాదాలు జరిగి పోటాపోటీగా అవధానాలు చేసి పేరు సంపాదించారు.


అవధానాల్లో భాగంగా ఎన్నో గొప్ప పద్యాలను ఆశువుగాఏ రచించారు. అవధానాల్లో ప్రధాన అంశాలైన సమస్యాపూరణం, దత్తపది, ఆశువు, నిషిద్ధాక్షరి వంటి అంశాల్లో వ్రాసిన పద్యాలు ఆయా సభలకు హాజరైన శ్రోతల్నే కాక అనంతర కాలంలో వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సందర్భాల్లో ప్రచురించిన పలు గ్రంథాల్లో వాటిని చదివిన పాఠకులూ ఆస్వాదించారు.


వేంకటశాస్త్రి గారు బందరు హిందూ 

హైస్కూల్ లో పదవీవిరమణ చేసిన తరువాత కొంత కాలం కడియం గ్రామంలో, ఆ తరువాత విజయవాడలో స్థిరపడ్డారు.

ఉమ్మడి మదరాసు ప్రభుత్వం వారువిజయవాడలో మహాసభ జరిపి  వేంకట శాస్త్రిగారిని ఆస్థాన కవిగా నియమించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం  'కళాప్రపూర్ణ'

బిరుదుతో గౌరవించింది.


పద్య,గద్య కావ్యాలు, నాటకాలు, ప్రహసనాలు, విమర్శనా వ్యాసాలు విరివిగా రాసి,పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటక రచనలతో జీవితపర్యంతమూ, సాహిత్య సేవ చేస్తూ,చిరకీర్తి గడించిన, కళాసాహితీ ప్రియులకు ప్రాతఃస్మరణీయుడైనచెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు,1950 ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినమున శివసాయుజ్యాన్ని పొందారు.

●●●●●●

ఎంతవరకు

 శ్లోకం:☝️

*యావన్నాశ్రయతే దుఃఖం*

    *యావన్నాయాంతి చాపదః*

*యావన్నేంద్రియవైకల్యం*

    *తవచ్ఛ్రేయస్సమభ్యసేత్ |*

*యావత్తిష్ఠతిదేహోఽయం*

    *తావత్తత్వం సమభ్యసేత్*

*సందీప్తేకోణభవనే*

    *కూపం ఖనతి దుర్మతిః ||*


భావం: మానవునికి ఎంతవరకు దుఃఖం ప్రాప్తించదో, ఎంతవరకు ఆపద దాపురించదో, ఎంతవరకు అంగవైకల్యం రాదో, ఎంతదాక వృద్ధాప్యం చేరువ కాదో అంతవరకు మాత్రమే తన శ్రేయస్సు తాను చూసుకోగలడు. యవ్వనమంతా కండ్లకు పొరలు కమ్మినట్లు బ్రతికి వ్యర్థం చేసుకొని, చివరి క్షణంలో శ్రీహరిని తలుచుకుంటే మోక్షం వస్తుందిలే అనుకుంటే పొరపాటే. అట్లా జరుగదు. ఇల్లు కాలిపోతుంటే ఆర్పటానికి నీళ్లకోసం బావి తవ్వుతాననే తెలివితక్కువ వాడిని ఏమి అనగలం?

*శుద్ర దంపతుల కథ*

 _*మాఘమాసం*_

🚩 _*ఆదివారం*_🚩

_*ఫిబ్రవరి 13వ తేది 2022*_


     _*🌞మాఘ పురాణం🌞*_

 🌴 _*12 వ అధ్యాయము*_🌴


🕉️🌞🌴🌞🌞🌴🌞🕉️


*శుద్ర దంపతుల కథ*


☘☘☘☘☘☘☘☘


వశిష్ఠమహర్షి దిలీపునితో మహారాజా మరియొక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడి వాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు , వ్యవసాయము చేయును. పశువులవ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకను సంపాదించ లేకపోవు చున్నానని విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయవంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. *"అమ్మా నేను బాటసారిని అలసినవాడను , చలి , చీకటి మిక్కుటములుగ నున్నవి. ఈ రాత్రికి నీ ఇంట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే వెళ్లిపోదునని"* ఇంట నున్న కుముదను అడిగెను. ఆమెయు వానిస్థితికి జాలిపడి యంగీకరించెను. ఆమె యదృష్టమో ఆ బ్రాహ్మణుని యదృష్టమో యజమానియగు సుమనందుడు వడ్డీని తీసికొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్లసావిడిలో ఒక చోట బాగుచేసి కంబళిమున్నగు వానినిచ్చి , పాలను కూడ కాచియిచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరి నామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలపాడుచుండెను.


కుముద *"ఓయీ నీవెచటినుండి వచ్చుచున్నావు యెచటికి పోవుచున్నావని యడిగెను. అప్పుడా విప్రుడు "తుంగభద్రాతీరము నుండి శ్రీ రంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును , అందులకై ఇట్లు వచ్చితిని సమాధానమునిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను , కుముదయు మాఘస్నానము చేయుటకైన నదికి పోవలయునని యనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసిరావలెననుకొనెను. తన అభిప్రాయమును చెప్పగ బ్రాహ్మణుడును సంతోషముతో నంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీస్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు నదీస్నానము వలదు అనారోగ్యము కలుగును. పూజకు , అనారోగ్యమునకు , ధనవ్యయమగును వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండ బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి. నదిలోస్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా నా దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడ కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచుకొట్టుచు ఇంటికి తీసికొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసికొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు గొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి.*


అప్పుడామె విష్ణుదూతలారా ! నామాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమ లోకమునకు తీసికొనిపోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో బాటు యమలోకమునకు పోవలసియున్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏలగొనిపోవుచున్నారని అడిగెను. అప్పుడు విష్ణుదూతలు అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగ నరకమునకు పోవలసియున్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడుపనులు నీ కిష్టము కాకున్నను , భయమువలన గాని , పతిభక్తి వలన గాని నీ భర్తకు యెదురు చెప్పలేదు. కాని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివికావు. ఇంతే గాక మాఘమాస స్నానమును కూడ మనః పూర్వకముగ భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యము నొందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడామే నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగెను కదా ! మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనయు నీటమునిగి లేచెను కదా ! బలవంతముగ చేసినను ఇష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా ! ఆవిధముగా జూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు నాతోబాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమునడిగిరి.


అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను జూచెను. సుమందుడుని పట్టికలో నన్నియును పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీజలమున పడుట , నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసికొని రావలయునను ప్రయత్నమున , నీటిలో పలుమార్లు మునిగి తేలుటవలన నితడు ఇష్టములేకున్నను. బలవంతముగ మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణు లోక ప్రాప్తిని పొందవలసియున్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును గొనిపోయిరి. రాజా ! బలవంతముగ నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగ పూర్వము చేసిన పాపములుపోయి , విష్ణులోకమును చేరు పుణ్యమువచ్చిన దన్నచో మాఘమాసమంతయు నదీస్నానము చేసి , యిష్ట దేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని , యధాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత యుండునో ఆలోచింపుము.


మానవుడు తెలిసికాని , తెలియకకాని బలవంతముగ దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగ చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవజన్మ దుఃఖ భూయిష్టము పాపబహుళము. ఇట్టివారికి చెడు కార్యములయందాసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పని సరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు యత్నింపవలయును , తన పనులను నూరింటినైనను వదలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లుకాక స్నానము , పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒకదినమైనను స్నానము పూజా , పురాణశ్రవణము , దానము యధాశక్తి గా పాటించినవాడు పైన చెప్పిన కుముదా సుమందులవలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసినవానికి పునర్జన్మ వుండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి , కృష్ణవేణి , నర్మద , తుంగభద్ర , సరస్వతి , గోకర్ణ , ప్రభాస , కోణభద్ర , గౌతమీ యిత్యాది నదులయందు స్నానము చేసినను , కూడ ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరును వారెట్టి వారయినను మాఘస్నానము పూజ , పురాణశ్రవణము , దానము వీనినన్నిటినిగాని , కొన్నిటిని యధాశక్తిగ చేయుటయే వారికి పాపతరణోపాయము , మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠమహర్షి దిలీపునకు వివరించి చెప్పెను.


      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

అతిమూత్ర రోగమునకు

 అతిమూత్ర రోగమునకు నేను ప్రయోగించిన రహస్య యోగం - 


   ఇటీవల ఒక వ్యక్తి అతిమూత్ర వ్యాధితో బాధపడుతూ నన్ను సంప్రదించాడు . అతనికి తంగేడు పువ్వులు ఎండించి చూర్ణం చేసి 20gm , 500ml నీటిలో వేసి 250ml నీరు అయ్యేవరకు సన్నని మంట మీద మరిగించి 125ml నాటు ఆవుపాలు , 30gm పటికబెల్లం చూర్ణం కలిపి ఉదయం సమయంలో ఇచ్చాను . అదేవిధముగా రాత్రి పడుకునే సమయంలో త్రిఫలా చూర్ణం రెండు స్పూన్స్ ఒక పెద్ద గ్లాస్ నీటిలో కలిపి ఇవ్వడం జరిగింది. 40 రోజుల్లో అతిమూత్ర వ్యాధి నుంచి సంపూర్ణంగా బయటపడ్డాడు .


                 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

దేవుడిని నమ్మిన

 

*దేవుడిని నమ్మిన వాడికి - దేవుడే భోజనం పంపిస్తాడు!!! అది ఎలా???*


_-[స్వామి_వివేకానంద జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన..]-_


ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా ఒక సంఘటన చోటుచేసుకుంది...


వివేకానందుడు సన్యసించారు, కనుక వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజిస్తుండేవారు. భిక్షగా ముడి సామాన్లు లభిస్తే వండుకుని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తుండేవారు...


వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. 

ఆకలి బడలికలతో దాహార్తితో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడనారంభించాడు. 

అతని ఆలోచన ప్రకారం సన్యాసులు అంటే ఏ పనీ చేయకుండా, సోమరిలా తిరుగుతూ, ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ, ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని.

 ఇటువంటి భావం కలిగి స్వామీజీతో అతడిలా అన్నాడు…


“ఓ స్వామీ! చూడు... చూడు... నేనెంత మంచి భోజనం చేస్తున్నానో..   

నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్ళు ఉన్నాయి కూడా, నేను డబ్బులు సంపాదిస్తాను. 

కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. 

ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా...? ఏ సంపాదనా లేకుండా దేవుడు... దేవుడూ... అంటూ తిరిగేవాడివి, అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా... ఆకలి బడలిక తప్ప..!” అని దెప్పి పొడవటం మెుదలుపెట్టాడు...


స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు, విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు...


*అప్పుడు ఒక అద్బుతం జరిగింది ...*


ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. 

అతను స్వామితో ఇలా అన్నాడు, “మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల శ్రీ రామ చంద్రమూర్తి అనుగ్రహం.

 దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి!" అని ప్రాధేయపడ్డాడు.


స్వామీజీ “ఎవరు నాయనా నీవు? నేను నిన్ను ఎరుగనే...

 పొరబడుతున్నట్లున్నావు, నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు!” అని అంటూ ఉంటే, ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ"... 

" లేదు స్వామీ నేను కలలో చూసింది మిమ్మల్నే..!”


”శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా.. లే.. లేచి అతనికి భోజనం పెట్టు! అని ఆజ్ఞాపించారండి." 

"ఆహా.. ఏమి నాభాగ్యం మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రీబిడ్డలు ఇరువురుది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మరచిపోలేరు.”


”నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు." 


స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది.     

ఏ అభయ హస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో... అదే అభయ హస్తమిది.


ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామి వారి పాదాలపైపడి, కన్నీటి ధారాలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు. 

సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం అని అర్థమయింది. 

నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్లే అని తెలుసుకున్నాడు.


*తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు...*

*యోగుల హృదయాలలో సదా నివసిస్తుంటాడు ఆ పరమాత్మ.*


ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే కాదు,

తనను నమ్ముకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఎలాంటి అనుభవాలెన్నో నిత్యం అనుభవిస్తూనే వుంటారు... 

ఇంతకు మించినవి, ఇంకా ఎంతో ఆశ్చర్యం కలుగజేసేవి, భగవంతుని పట్ల, సడలని విశ్వాసం కలుగజేసేవి మరెన్నో అనుభవిస్తుంటారు...!

                 🌷🌷🌷

శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రమ్

 ॐ              श्री अर्धनारीश्वरस्तोत्रम् 

                శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రమ్ 

      SREE ARDHA NAREESWARA 

                        STOTRAM


           (श्रीमच्छंकरभगवतः कृतौ)

          (శ్రీ శంకరాచార్య విరచితమ్)

          (By Sree Adi Sankara)


                                    శ్లోకం : 7/9

                            SLOKAM : 7/9


प्रपञ्चसृष्ट्युन्मुखलास्यकायै

समस्तसंहारकताण्डवाय।

जगज्जनन्यै जगदेकपित्रे

नमः शिवायै च नमः शिवाय ।।7।। 


ప్రపఞ్చసృష్ట్యున్ముఖలాస్యకాయై

సమస్తసంహారకతాణ్డవాయ I

జగజ్జనన్యై జగదేకపిత్రే

నమః శివాయై చ నమః శివాయ ৷৷7৷৷ 


    ప్రపంచమును సృష్టించుటకు ఉన్ముఖమైన లలిత నృత్యముచేయు జగన్మాతయగు పార్వతీమాతా, 

    సమస్తమును సంహరించు ప్రపంచతాండవము చేయు జగత్పతియగు శివుడూ 

    సగసగభాగాలుగా కలిగిన ఏకరూపుడైన అర్ధనారీశ్వరునకు నమస్కారము.  


I bow to the form

  - by which the creation of the cosmos begins with the gentle smile on the face of Goddess Parvati and 

  - by which the entire cosmos will get reunited back to the Shivaa by the tandava dance 


    O the Mother and the Father of the Cosmos 


    I bow to you, Goddess Parvathi and God Shiva in the single form of Ardhanareeswara 


https://youtu.be/cmr5w6dUJD4


                   =x=x=x=    


  — రామాయణం శర్మ 

            భద్రాచలం