1, జనవరి 2021, శుక్రవారం

తంజావూరుబొమ్మ

 ఇంటింటా మన తెలుగు వారి బంగారు #తంజావూరుబొమ్మ


వంద మాటలు చెప్పలేనిది ఒక్క చిత్రం చెబుతుంది అంటారు. అందుకే ఇంటి అలంకరణలో అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడైనా చిత్రపటాలదే పైచేయి.  రంగులతో జీవకళ ఉట్టిపడేలా గీసిన సీతారాములు, వేంకటేశుడు, వినాయకుడు, యశోద కృష్ణ,  రాధాకృష్ణులు, రాజస్థానీ పల్లెపడుచు... ఇలా దేని అందం దానిదే. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆ చిత్ర పటాలన్నీ అచ్చమైన బంగారంతో మెరుస్తూ గృహాలంకరణ ప్రియుల్ని అలరిస్తున్నాయి. తమిళనాటే కాక మన తెలుగింటి పూజ గదులలో కూడా హారతులు అందుకుంటున్నాయి. బంగారంతో గీసిన చిత్రపటాలు అందంగా ప్రతి ఇంట్లో  కొలువుదీరుతున్నాయి. గృహప్రవేశం, పెళ్లిరోజు, పెళ్లి వేడుకల్లో సంపన్నులు ఇచ్చిపుచ్చుకునే కానుకల్లో అందమైన ఈ చిత్రాలదే అగ్రస్థానం. అత్యంత పలుచని బంగారు రేకుతో సునిశితమైన నైపుణ్యంతో ఏ చిత్రకారుడో కుంచెతో గీసినట్లే రేకుని చెక్కుతూ చేస్తోన్న ఈ చిత్రాలు ఓ పట్టాన చూపు తిప్పుకోనీయవు. దేవీదేవతల రూపాలతోబాటు జంతువులూ పక్షులూ చెట్లూ... ఇలా ప్రకృతి అందాలకీ బంగారు సొబగులు అద్దేస్తున్నారు కళాకారులు. ఆపై వీటిని బంగారు రంగు ఫ్రేముల్లో బంధించి ఆ పటం మొత్తం బంగారమేనా అన్న భ్రమని కలిగిస్తున్నారు. కొందరు అచ్చంగా 24 క్యారెట్ల బంగారురేకుతోనే చిత్రాలు గీయిస్తుంటే మరికొందరు బంగారుపూత పూసిన వెండి రేకులతోనూ ఈ పెయింటింగుల్ని రూపొందిస్తున్నారు. వాతావరణ మార్పులకి ఫ్రేముకి ఉండే రంగు కొద్దిగా మాయొచ్చేమోగానీ లోపలి గీసిన పెయింటింగు మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరదు సరికదా, ధగధగా మెరిసే ఆ సువర్ణ పటాన్ని హాల్లోని ఓ గోడకు తగిలిస్తే చాలు... ఇంటికి వచ్చినవాళ్లు అక్కడే ఆగి అలా చూస్తుండిపోతారు. బంగారమా... మజాకానా..!


చరిత్ర

భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక చారిత్రక ప్రదేశాల్లో తంజావూరు ఒకటి. ఈ నగరము ముఖ్యముగా కర్ణాటక సంగీతానికి చేసిన సేవలకూ,  తంజావూరు చిత్రలేఖనానికి (పెయింటింగ్) చాలా ప్రసిద్ధి. ఇంకా వీణ, తంజావూరు బొమ్మలు, తవిల్‌ ఇక్కడి ప్రముఖమైన విషయములు. రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి బృహదీశ్వరాలయము ఇంకా ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడనే ప్రఖ్యాత సరస్వతీ మహల్‌ గ్రంథాలయము ఉంది. ఈ గ్రంథాలయమున సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.ఈ నగరము ఒకప్పుడు చోళ రాజులకు బలమైన రాజధాని కేంద్రం. తరువాత నాయక రాజులు తరువాత విజయ నగర రాజులు ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని ఏలినారు. 


తంజావూర్ చిత్రలేఖనాలు మన దక్షిణ భారతానికే సొంతమైన ప్రాచీన సంప్రదాయ కళ...భారతీయ చిత్రలేఖన చరిత్రలో తంజావూరుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తంజావూరు కృష్ణదేవరాయ యొక్క సోదరుడు మరియు వారసుడు అచ్యుతారాయ (1529–42) పాలనలో స్థాపించబడింది. అత్యంత విజయవంతమైన తంజావూర్ నాయక పాలకుడు అయిన రఘునాథ, కళలను, కళాకారులను గొప్పగా  పోషించడమే కాక, తంజావూర్ కళాకారుల కోసం  ప్రత్యేకమైన పాఠశాలను స్థాపించడంలో సహాయపడ్డాడు. తరువాత తంజవూర్ శైలి చిత్రాలను మరాఠాల క్రింద అభివృద్ధి చేశాడు. ఈ పాఠశాల యూరోపియన్ పద్ధతుల ద్వారా బాగా ప్రేరణ పొందింది. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం వరకు తమిళనాడులో అత్యంత ప్రాచుర్యం పొందింది. 


క్రీ.శ 1565 లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం ఫలితంగా ఆ సామ్రాజ్య చిత్రకారులు మధురై, తంజావూరు ప్రాంతాలకి వలస వెళ్ళారు. వారిలో కొందరు తంజావూర్ నాయకుల ఆధ్వర్యంలో పనిచేశారు. నాయక రాజులు ప్రధానంగా శాస్త్రీయ నృత్యం సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం ఈ కాలంలో బాగా ప్రోత్సహించారు. తదనంతరం, తంజావూర్ నాయకులను ఓడించిన మరాఠా పాలకులు ఈ కళాకారుల వ్యక్తిగత అభిరుచులను గ్రహించారు.ఇది ప్రత్యేకమైన తంజావూర్ శైలి చిత్రలేఖనాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడింది. దేవాలయాలను అలంకరించడంతో పాటు తంజావూరు కళాకారులు మరాఠా రాజులు మరియు ప్రభువుల ప్రధాన భవనాలు, ప్యాలెస్‌లు, చట్రామ్‌లు మరియు నివాసాలను చిత్రించడం,  అలంకరించడం ప్రారంభించారు. ఈ చిత్రాలలో  11 వ శతాబ్దపు చోళ గోడ చిత్రాలు బృహదీశ్వర ఆలయంలో ఉన్నాయి. అలాగే నాయక రాజుల కాలం నుండి వచ్చిన చిత్రాలు 16 వ శతాబ్దానికి చెందినవి. 


మన తెలుగువారి హస్తకళ

తంజావూరు కళాకారుల పూర్వీకులు మన తెలుగు వారు కావడం మనకెంతో గర్వకారణం. ఈ కళాకారులు ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి చెందిన రాజులు, నాయుడులుగా గుర్తించారు. వారు తెలుగులోనే  మాట్లాడేవారు. కళాకారులు వాళ్ళ ఆసక్తి, ఆవశ్యకత ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి వివిధ విషయాలపై వైవిధ్యమైన నాణ్యత కల చిత్రాలను విస్తృతంగా  అందించారు. అప్పటి కళాకారులకి ఈ హస్తకళ చాలా పవిత్రమైనది. వీరిలో చాలామంది  వారి చిత్రాలకు ఎప్పుడూ సంతకం చేయలేదు. సి. కొండయ్య రాజు ( C. Kondiah Raju) కోవిల్పట్టికి చెందిన ప్రసిద్ధ క్యాలెండర్ కళాకారుడు, రాజు సమాజం నుండి ఆధునిక కాలంలో కళాకారుడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ వారసులలో ఒకరు.


తయారుచేసే విధానం

తంజావూర్ చిత్రాలు స్పష్టమైన రంగులు, మెరిసే బంగారు రేకులు, గాజు పూసలు, విలువైన రత్నాలతో పొదగబడి ఉంటాయి. తంజావూర్ పెయింటింగ్ కి సాధారణంగా అరబిక్ జిగురు, కలప (టేకు) తో అతికించిన కాన్వాస్‌ ఉపయోగిస్తారు. కళాకారుడు కాన్వాస్‌పై ప్రధాన చిత్రం పెన్సిల్ తో గీసాక సుద్ద పొడి లేదా సున్నపురాయి పేస్ట్ తో ఆ చిత్రంపై పూత పూసి ఎండబెడతారు. స్తంభాలు, తోరణాలు, సింహాసనాలు, దుస్తులు మొదలైన ఎంచుకున్న ప్రదేశాలలో బంగారు పూత వేసి రకరకాల రంగుల రత్నాలు పొదుగుతారు. చివరగా మిగిలిన చిత్రాన్ని రంగులు స్కెచ్‌తో దిద్దుతారు. ఈ విధంగా అందమైన తంజావూరు చిత్రం పూర్తి అవుతుంది. పరిమాణం, వాడిన వస్తువులని బట్టి ధర నిర్ణయిస్తారు. వీటి ధర అధికమే అయినా ప్రస్తుతం గిరాకీ కూడా బావుంది. శిక్షణలో ఉన్నవారికి ఆసక్తి ఉన్నవారికి కేవలం మక్కుతో ఉన్న ఫ్రేములు కూడా లభ్యం అవుతున్నాయి.


చిత్రాల సేకరణ

చెన్నై గవర్నమెంట్ మ్యూజియం,  తంజావూర్ ఆర్ట్ గ్యాలరీలో తంజావూర్ చిత్రాల చక్కటి సేకరణలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌లోని బ్రిటిష్  విక్టోరియా & ఆల్బర్ట్ మ్యూజియమ్‌లలో సాంప్రదాయ శైలులలో పెద్ద తంజావూర్ పెయింటింగ్‌లు ఉన్నాయి. కోపెన్‌హాగన్ యొక్క నేషనల్ మ్యూజియంలో 17 వ శతాబ్దపు తంజావూర్ చిత్రాల చక్కటి సేకరణ ఉంది.  1806 లో ప్రచురించబడిన ఓరియంటల్ డ్రాయింగ్స్ అనే పుస్తకంలో బ్రిటిష్ చరిత్రకారుడు చార్లెస్ గోల్డ్ ప్రకారం టాంజోర్ పెయింటింగ్స్‌ను 'మూచీస్ లేదా ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా' చిత్రించారు. 


ప్రస్తుతం

తంజావూర్ పెయింటింగ్స్ నేటి వరకు కూడా కొనసాగుతున్నాయి. ఎగ్జిబిషన్లు, వర్క్‌షాప్‌లు మరియు శిక్షణా శిబిరాలు రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలు సంస్థలచే క్రమం తప్పకుండా జరుగుతున్నాయి.  సాంప్రదాయ విషయాలతో పాటు, విస్తృతమైన ప్రజాదరణ పొందిన ఆధునిక ఇతివృత్తాలు తంజావూర్ చిత్రాలలో చిత్రీకరించబడుతున్నాయి. ఈ సాంప్రదాయిక కళ ఇంకా తన పట్టును కొనసాగించడం సంతోషకరమైన పరిణామం. తంజావూర్ పెయింటింగ్స్ శైలి మరియు సౌందర్యం చాలా మంది సమకాలీన కళాకారులను ప్రేరేపిస్తూనే ఉన్నాయి.

#TanjorePaintings

శ్రీమాతా

 *శ్రీ లలితా నామ వైభవం-6*


 ‘శ్రీమాతా’ – అంటే మంగళప్రదురాలైన అమ్మా! అని అర్థము. గుర్తు పట్టవలసిన విషయము లోకములో ఉన్న ఏకైక సంథానమయిన అమ్మ అన్నమాటకు పరిచయము లేదు. కడుపులో ఉండగా నాభీగొట్టముతో ప్రారంభమైన అనుబంధము బయటికి వచ్చాక తెగిపోతుంది. హృదయసంబంధము అలాగే ఉంటుంది. అమ్మ అంటే పోషణ – రక్షణ – మంగళము. అమ్మలేకపోతే సృష్టి ఆగిపోతుంది. అమ్మవారి సృష్టిశక్తి, మాతృత్వము ఒక పురుష వీర్యమును స్త్రీ శరీరము పుచ్చుకునేట్టుగా నిర్మాణము చేయడములో ఉన్నది. ఆ తల్లి అనుగ్రహముతో పిల్లవాడు పూర్తిగా తయారు అయ్యేవరకు పెరగాలి. లోపల పిల్లవాడు నొక్కుడు పడకుండా, తల్లి శరీరము పిగిలిపోకుండా, మళ్ళీ పిల్లవాడు బయటికి వచ్చాక సంకుచితమవ్వాలి. ఇంతమంది జన్మించడానికి స్త్రీ ఉపాధుల యందు అంత మార్పుతో నిర్మాణము చేసి, లోపల పసిగుడ్డును కాపాడి జాగ్రత్త చేసింది శ్రీమాత. కడుపులో నుంచి బిడ్డ బయటకు రాగానే అమ్మ స్తన్యములో కోలోస్ట్రం అనే పసుపు పచ్చని ముద్ద ఒకటి ఊరుతుంది. ఏమీ తెలియని వాడిని జగన్మాత ఆవహించి ‘ నీ పోషణకోసము, రక్షణకోసము మీ అమ్మ స్తన్యములయందు నేను ప్రకాశిస్తున్నాను’ అని చెపుతుంది. అమ్మ స్తన్యములలో ఊరిన ఆ పదార్థమును పిల్లవాడు చప్పరిస్తే లోపలున్న ఊపిరితిత్తులు, జీర్ణాశయము అన్నీ పనిచేస్తాయి. కడుపులో ఉండగా నల్లటి మలము గడ్డలుగా పెరుగుతుంది. దానిని బయటికి పంపడము ఎవరికీ సాధ్యముకాదు. కోలోస్ట్రం మ్రింగగానే నల్లటి మలము బయటికి వెళ్ళిపోతుంది. మలినములు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అమ్మ కడుపులో, పక్కలో దూరి పడుకోవడములో పిల్లవాడు ఎంతో భద్రత అనుభవిస్తాడు. ఆ అమ్మతనము అంతా హృదయము పరవశించిపోయే శ్రీమాతాతత్త్వము. అమ్మవారి వంకచూసి ‘శ్రీమాతా’ అని పిలవడానికి భయపడనవసరము లేదు. ఉపాసన చేయడానికి నియమ నిబంధనలు లేవు. అమ్మగా అమ్మవారిని చూడాలి. అమ్మని ఒక మొగవాడిగా చూస్తే దోషము. ఏ అమ్మా క్షమించదు. కొడుకుగా నిలబడి నమస్కారము చేస్తే ఆదుకోవడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధముగా ఉంటుంది. ఆవిడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త గర్భాలయము ఇచ్చింది, పాలు పట్టింది, (స్వల్పకాలికలయము) నిద్రపుచ్చింది. ముగ్గురూ అమ్మలో ఉన్నారు కనక మొదటి దైవము అమ్మ.  భగవంతుడు ఒక్కడే అయినా కర్తవ్యనిష్ఠ కలిగినప్పుడు బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రునిగా మూడురూపములతో ప్రకాశిస్తాడు. శ్రీమాత ఈ ముగ్గురూ మూడురకములైన కార్యములను నిర్వహించడానికి మూడురకములైన శక్తులను ఇచ్చింది.  ఉపనిషత్తు – ‘యతోవా ఇమాని భూతాని జాయన్తి’ అంటుంది. దేనినుండి సమస్తము ఉత్పన్నము అయినదో – ‘దేనినుండి’ అన్నమాట ఏది ఉన్నదో అదే అమ్మవారు. దేనినుండి సమస్తము పుట్టాయో అన్న ఉపనిషత్ వాక్యము మారిస్తే అదే శ్రీమాత. అన్ని ప్రాణులను సృజించుట వెనక అమ్మదయ ఉన్నది.  శ్రీమాత ఎవరు? అన్న విషయము జాగ్రత్తగా అవలోకనము చేస్తే ‘శ్’  ‘ర్’  ‘ఈ’ అన్న మూడు అక్షరములు కలిస్తే ‘శ్రీ’ అవుతుంది. ఆ మూడూ సత్త్వ, రజ, తమో గుణములను చూపిస్తాయి. లోకమంతా వీటిలోనే ఉన్నది. ఇవి బయటికి రాకుండా కలసిపోయి అవ్యక్తమైపోయి ఒక దానిలోకి వెళ్ళి ఉండిపోతే ‘శ్’  ‘ర్’  ‘ఈ’ కలసి శ్రీ – కలసిపోయి మాత – ఆవిడలోకి వెళ్ళిపోతాయి. సృష్టికి ముందర ఆవిడ ఒక్కత్తే ఉన్నది. ఆమెను పూర్వజా అంటారు. ఆవిడలో ఉన్న మూడుగుణములు ఆవిడలోనుంచే పైకి వచ్చాయి. ఈ మూడుగుణములు తీసి శుద్ధసత్త్వము ఆమెయే ఇవ్వాలి. అమ్మా! ఈ గుణముల వలన లోపలనుండి కలిగే కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యములన్న శత్రువులు అని గుర్తించి  ఆవి ఉండటము వలన బాధ, కష్టము కలుగుతున్నాయి అమ్మా! అని నిజాయితీగా అంటే చాలు అమ్మవారు ఆ మూడూ ఉపసంహారము చేసి బాధలను తీర్చేస్తుంది.   భాస్కరరాయలవారు అంటారు --  ‘లోకములో ఒక తల్లికీ తండ్రికీ జన్మించిన బిడ్డడు అమ్మా! అనే పిలుస్తాడు. బిడ్డడిని విడచి ఉండమంటే ఏ తల్లీ అంగీకరించదు. నేను వేరొకజన్మ లేకుండా చేసుకోవడానికి తురీయాశ్రమమునకు వెళ్ళిపోతాను అంటే అంగీకరించదు. శ్రీమాతా అని పిలిస్తే వేరొకజన్మలో అమ్మా! అని ఎవరినీ పిలవనవసరము లేని స్థితిలో మోక్షము ఇస్తుంది. శివజ్ఞానము ఇస్తుంది. ఆ జ్ఞానము కలగగానే పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యస్థితి పొందడము జరుగుతుంది.


*శ్రీ మాత్రే నమః*

చిన్న జీయర్ స్వామీ

 చిన్న జీయర్ స్వామీ నేతృత్వంలో వేర్వేరు పేర్లతో కొనసాగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. వాటిలో నాకు తెల్సినవి కొన్ని


#విద్య: ప్రకాశం జిల్లా మార్టూరులో ‘జీవన్ వికాస్’ పేరుతో పేదపిల్లలకోసం పదోతరగతి వరకు పాఠశాల నడిపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి (గిరిజనులకు), ఉట్నూరు మండలం బీర్సాయిపేట, ప్రకాశం జిల్లా కఠారివారాపాలెం (గంగపుత్రులకు) లలో జీయర్ గురుకులాలు నడుస్తున్నాయి.


#వేద_విద్యాలయాలు: శ్రీరామనగరంతో పాటు విశాఖ, సీతానగరం, కరీంనగర్ (ఎల్‌ఎండి) లలో వేదపాఠశాలలు నడుస్తున్నాయి.


#అంధులకు_విద్య: శ్రీరామనగరంలో అంధులైన విద్యార్థుల కోసం జూనియర్, డిగ్రీకాలేజీలు నడుస్తున్నాయి. విశాఖ జిల్లా వారిజలో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల నడుస్తున్నాయి.


#ప్రజ్ఞ: ప్రజ్ఞ పేరుతో విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దేందుకు శ్రీరామనగరంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


#అన్నదానం: బదరీనాథ్ అష్టాక్షరీ క్షేత్రం, హృషీకేష్, శ్రీరంగం, మేల్కొటే, తిరుమల, భద్రాచలం, నడిగడ్డపాలెం, సీతానగరం, శ్రీరామనగరంలలో రోజూ ఉచిత అన్నదానం జరుగుతోంది.


#ఆదర్శగ్రామం: ఆదిలాబాద్ జిల్లాలో యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ఆదర్శ గ్రామాలను రూపొందించే మహత్తర కార్యక్రమం కొనసాగిస్తున్నారు. 11 గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్మాణం చేశారు.


#ప్రకృతి విలయాలు: ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు స్వామి వెంటనే స్పందిస్తున్నారు. భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు రంగంలోకి దిగి బాధితులకు చేయూత ఇస్తున్నారు. గుజరాత్‌లోని వల్లభాపూర్‌లో 88 శాశ్వత గృహాలు నిర్మించి ఇచ్చారు. నేపాల్ భూకంపబాధితులకు తాత్కాలిక సాయం అందిస్తూ, 1.50 కోట్ల ఖర్చుతో విద్యాలయం నిర్మిస్తున్నారు. తమిళనాడులో సునామీ రాగా, నాగపట్నంలో 50 మందికి పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారు. మత్స్యకారుల జీవనం కోసం పడవలు అందించారు. జపాన్‌లో సునామీ సందర్భంగా 11 లక్షల రూపాయలు అందించారు.


#ఉగ్రవాద_నివారణ_కోసం: ఉగ్రవాద నివారణ కోసం మానస సరోవరం తీరంలో బ్రహ్మయజ్ఞం 2002 లో నిర్వహించారు. కార్గిల్  కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారు.


#వృద్ధాశ్రమం: గుంటూరు జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.


#జిమ్స్: జీయర్ ఇంటిగ్రెటివ్ మెడికల్ సర్వీసెస్ (జిమ్స్) పేరుతో శ్రీరామనగరంలో హోమియో మెడికల్ కాలేజీ, 100 పడకల ఆసుపత్రి నడిపిస్తున్నారు. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి విధానాల్లో వేర్వేరుగా చికిత్స అందిస్తున్నారు.


#వైద్య_శిబిరాలు: గ్రామీణులకు ఉచితంగా వైద్య చికిత్స అందించేందుకు తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 2500 పైగా ఉచిత క్యాన్సర్ శిబిరాలు నిర్వహించి రెండు లక్షల మంది మహిళలకు చికిత్స అందించారు. 1300 వరకు ఉచిత వైద్య శిబిరాలు, 900 పైగా కంటి చికిత్స శిబిరాలు, 1000 కిపైగా దంత వైద్య శిబిరాలు నిర్వహించారు.


#అవయవదానం: అవయవదానం గొప్ప దానమని భావించిన చిన్నజీయర్ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎవరైనా అవయవదానం చెయవచ్చు. అనుకోకుండా ఎవరైనా చనిపోతే, ఆరుగంటల వ్యవధిలో వారి అవయవాలను సేకరించి, అవసరమైన వారికి అమరుస్తారు. ఇందుకోసం ముందుకు వచ్చేవారు 040-6636 9369/98492 45948 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తీసుకోవచ్చు

2019 లో విశాఖపట్నం లొ 90 మందికి పైగా జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యములో అవయవదానం 


#పశువైద్య_శిబిరాలు: పశువులకు ఉచితంగా చికిత్స అందించేందుకు తరచూ పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఈ తరహా శిబిరాలను నిర్వహిస్తూ, ఏటా రెండు లక్షల పశువులకు చికిత్స అందిస్తున్నారు


#ఆలయాల_జీర్ణోద్ధరణ: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు చిన్న జీయర్ శ్రీకారం చుట్టారు.


#గోసేవ: సీతానగరం, శ్రీరామనగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేసి దాదాపు 500 గోవులను రక్షిస్తున్నారు.


#ఖైదీల్లో_పరివర్తన: ఖైదీల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు జీయర్‌స్వామి ప్రయత్నిస్తున్నారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా రూపుదిద్దుతున్నారు. వారి కుటుంబాల పోషణకోసం కుట్టుమిషన్లు, సైకిళ్లు తదితర వస్తువులను అందిస్తున్నారు.


#భక్తినివేదన: భక్తినివేదన పేరుతో ఆధ్యాత్మిక మాసపత్రిక నడిపిస్తున్నారు.


#పురస్కారాలు: వేదవిద్యావ్యాప్తికి పాటుపడుతున్నవారికి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైదిక గ్రంథాలను ముద్రిస్తున్నారు.


ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఒకటా.. రెండా.. చెబుతూపోతే కొండవీటి చాంతాడంత ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్), జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (సొసైటీ), వికాసతరంగిణి-భారత్, వికాస తరంగిణి-విదేశాలు స్థాపించారు. ఆకలిగొన్నవారికి ఆహారం అందించేందుకు ప్రధాన కేంద్రాల్లో అన్నదానాల కార్యక్రమం కొనసాగుతోంది. యువతీయుకులకు హోమియో, ఆక్యుప్రషర్‌లలో అవసరమైన ప్రాథమిక శిక్షణ ఇస్తూ, సమాజంలో అవసరమైన వారికి సేవలను అందిస్తున్నారు.

భారతీయుడా గ్రహించు...

 క్రైస్తవం 

మనం తరచుగా వింటుంటాం…హిందు ధర్మంలో కుల వ్యవస్థ ఉందని ! 

ఇది కేవలం హిందువులలో ఐక్యత లేకుండా చేయడానికి, 

కొన్ని వాస్తవాలు చూడండి.


మీకే అర్థం అవ్తుంది....


-------------

**


*ఒక క్రీస్తు*

*ఒక బైబిలు*

*ఒక మతం*


*కాని ఇది తెలుసా?*


*లాటిన్ కాథోలిక్  - సిరియన్ కాథోలిక్ చర్చ్ కి వెళ్ళరు.*


*ఈ రెండు వర్గాలు - మార్తోమ చర్చ్ కి వెళ్ళరు.*


*ఈ మూడు వర్గాలు - పెంతెకొస్తు చర్చ్ కి వెళ్ళరు.*


*ఈ నాలుగు వర్గాలు -  సాల్వాషన్ ఆర్మీ చర్చ్ కి వెళ్ళరు.*


*ఈ ఐదు వర్గాలు - సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కి వెళ్ళరు.*


*ఈ ఆరు వర్గాలు - ఆర్తోడక్స్ చర్చ్ కి వెళ్ళరు.*


*ఈ ఏడు వర్గాలు - జాకోబైట్ చర్చ్ కి వెళ్ళరు.*


*ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోనే 146 కులాలు ఉన్నాయి క్రైస్తవం లో ! ఒకరి చర్చ్ లోకి మరోక కులం వారు వెళ్ళరు !*


-------------

 *ముస్లింలు*


*ఒక అల్లహ్*

*ఒక ఖురాన్*

*ఒక ప్రవక్త*

*గొప్ప ఐక్యత…!*


*ముస్లిం దేశాలలో షియా, సున్నీ ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటారు !*

*మత కలహాలు అంటే ఎక్కువగా ఈ రెండు వర్గాల మధ్యే జరుగుతుంటాయి ముస్లిం దేశాలలో !*


*సున్నీ మసీదుకు - షియా వెళ్ళడు.*


*ఈ రెండు వర్గాలు - అహమ్మదియా మసీదుకు వెళ్ళరు.*


*ఈ మూడు వర్గాలు - సూఫీ మసీదుకు వెళ్ళరు.*


*ఈ నాలుగు వర్గాలు - ముజాహిద్దిన్ మసీదుకు వెళ్ళరు...*


*ఇలా మొత్తం 13 కులాలు ఉన్నాయి. ఒకరినొకరు బాంబు దాడుల ద్వారా చంపుకోవడం మనం పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తునే ఉన్నాం.*


-----    -----   

   *🕉హిందువులు🕉*


*1280 ధర్మ గ్రంథాలు,*

*10,000 భాష్యాలు,*

*ఇంకా ఈ గ్రంథాలకు దాదాపు లక్ష భాష్యాలు,*

*ముక్కోటి దేవతలు,*

*భిన్నమైన ఆచార్యులు,*

*వేలాది ఋషులు,*

*వందలాది భాషలు...*


*కాని అందరు ఒకే ఆలయానికి వెళ్తారు. మతం పేరుతో హిందువులు ఒకరికొకరు ఎప్పుడు చంపుకోలేదు!*


 *కేవలం రాజకీయనాయకులు కుల వ్యవస్థను సృష్టించి విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్నారు.*


*ఇలా కొనసాగితే  కొన్ని సం. తర్వాత మన సనాతన ధర్మం* 

*కేవలం పుస్తకాలలో మాత్రమే* *మిగులుతుందేమో...?*


*ఆలోచించండి..... ఈ మేసేజ్ పంపించాల్సిన ఆవశ్యకతను మళ్ళీ  చెప్పక్కర్లేదనుకుంటాను.... అందరికి షేర్ చేయండి...*


*ఇది భారతీయుడా గ్రహించు...*

🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽