2, ఏప్రిల్ 2022, శనివారం

ఉగాది పండుగ శుభాకాంక్షలు

 శుభం...


తెలుగు ప్రాంత ముంగిటన

మేలుకొల్పేను సూర్యోదయ

శ్రీ శుభకృతు సంవత్సర

నవ కాంతులు రాక తోడ..


గడచిన తంతు జ్ఞాపకం

కదిలేను నవ గమనం

ఆశా జనకపు పయనం

భావ వీచికల సమయం.


షడ్రచులతో సమ్మేళనం

జీవన సాగర మధనం

పాత జ్ఞాపకాల పదిలం

భవష్యత్ సుఖమయం.


ఆరోగ్యం అంత్యంత శ్రేయం

గౌరవ,అవమాన తూకం

లక్ష్మీ కటాక్షం మేలుకరం

యశస్సు జేయును కీర్తనం.


వసంతపు కాల తరుణం

ధరణి పర్చు పచ్చదనం

చిగురేయు మానుకు జీవం

లోకానికి కల్గును శుభం.


ఉగాది పండుగ శుభాకాంక్షలు.


అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9391456575.

 శ్రీరస్తు!


శుభకృత నామ సంవత్సరంలో మీ ఇంట కొత్త వెలుగులు నిండాలనీ, అష్టఐశ్వరాలు మీ సొంతం కావాలని ఆకాంక్షిస్తు మీకు మీ కుటుంబ సభ్యులకు


శ్రీ శుభకృత నామ సంవత్సర


ఉగాది


శుభాకాంక్షలు


బంధుమిత్రులందఱికీ...


హృదయపూర్వకంగా "మీ .శ్రీశర్మద


శ్రీలను చాల నిచ్చుత! సుచేలము లిచ్చుత! భాగ్యమిచ్చుతన్! ప్రాలు సమృద్ధి నిచ్చుతయు! భాషలు భూషలు సౌఖ్య మిచ్చుతన్! వేళకు తగ్గ బుద్ది సుమపేశల మానస మిచ్చు హెచ్చుగన్! కీలిత శ్రీలదాత శుభకృత్ హిత వత్సర మిచ్చు తేజమున్!


శుభమస్తు!

శుభాకాంక్షలు

 ప్రభ నింపుచు జగములకును

'శుభకృతు' వర్షమ్ము వచ్చె శోభన మిడుచు

న్నిభవరదుడు సర్వేశుడు

నభయము తా నిచ్చు గాక యనయము మీకున్


తమకు 

తమ కుటుంబము నకు శుభకృతు

ఉగాది శుభాకాంక్షలు.. వందనములు 🙏


జ్ఞానమనెడు

 🕉️🕉️ *సుభాషితమ్* 🕉️🕉️

--------------------------------------------


శ్లోకం:

*మనోధావతి సర్వత్ర మదోన్మత్త గజేంద్రవత్ l*

*జ్ఞానాంకుశ సమాబుద్ధిస్తస్య నిశ్చలతే మనః ll*

                 ~సుభాషితరత్నావళి


తాత్పర్యం:

మదముచే మదించిన ఏనుగు వలె మనస్సు పరి పరి విధముల పరుగెత్తును. జ్ఞానమనెడు అంకుశముతో సమానమగు బుద్ధియే ఆ మనస్సును నిశ్చలము చేయగలదు.


కాలం*

 *ॐ    శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు* 


*కాలం*  


"కాలః కలయతామహం" - "కాలములో కూడిక నేను" అంటారు పరమాత్మ. 

    మన 

  - మనస్సుతో చేసే ప్రతి ఆలోచన, 

  - నోటితో పలికే ప్రతి మాట, 

  - శరీరాంగాలతో చేసే ప్రతి పనీ లెక్కించబడుతూంటుంది. 


ఉదా॥ 

    హిరణ్యకశిపుని చర్యలన్నీ లెక్కించబడ్డాయి. 

    ప్రహ్లాదునివీ లెక్కించబడ్డాయి. 

    ఇవి విడివిడిగా కూడబడి కాలంలో ఎవరి ఫలాలు వారికి  అందించబడ్డాయి. 

         

    ఎక్కడెక్కడవి - ఎవరెవరితో - ఎప్పుడెప్పుడు - ఏఏ విధంగా కలపాలో సంకల్పించి నిర్ణయించేది  "కాలములో కూడిక" అయిన పరమాత్మయే. 


*కాలం - మనం*


మనం 

  - భూతకాలానికి తిరిగి వెళ్ళలేము. 

  - భవిష్యత్కాలము తెలియదు. 

  - కేవలం వర్తమానంలోనే జీవించగలం. 


*కాలం - పరమాత్మ* 


    పరమాత్మ కాలానికి అతీతుడు. 

    కాలాన్ని అధీనంలో ఉంచుకున్నవాడు. 

    ఆయన కాలస్వరూపుడు కూడా. 


*కాలం - కొలబద్దలు* 


    ఆ కాలాన్ని మనం అనేక మానాలలో కొలుస్తాము. 

    సౌర - చాంద్ర - బార్హస్పత్య - నక్షత్ర - హవన మొదలైనవి భారతీయ కాలమానాలు. 

    అందులో చాంద్రమానాన్ని మనం పాటిస్తాం. 

    ఆ చాంద్రమాన సంవత్సరాదే యుగాది. 


*ఉగాది - యుగాది* 


     యుగాది అంటే యుగానికి ఆది అని అర్థం. 

     ఉగము అంటే సంవత్సరమనే అర్థంలో "ఉగాది" అంటే "సంవత్సరాది" అని అర్థం. 

 

*సంవత్సర - జలస్థానాలు* 


    కాలాన్ని సంవత్సరాలలో కొలుస్తాం. ప్రవాహంతో పోలుస్తాం. 

    ఇక్కడ విశేషం ఏమిటంటే, 

    "సంవత్సరోవా  అపామాయతనం ----" 

    సంవత్సర స్థానమే జలముది. 

    జల స్థానమే సంవత్సరముది. 

    పరస్పరం సంవత్సర(కాల) జల(నారాయణ) స్థానాలు ఒకటే. 

      అదే పరమాత్మ కాలస్వరూపుడని తెలుపుతోంది. 


*శుభాకాంక్ష*  


    కాబట్టి భగవంతుని స్వరూపమైన కాలంయొక్క ప్రమాణంలో, 

    ఈ శుభకృత్ నామ సంవత్సరం అందరి 

  - మనస్సులూ 

  - వాక్కులూ 

  - చేతలూ దైవానుగ్రహంతో త్రికరణ శుద్ధిగా అందఱికీ సుఖశాంతులను ఇచ్చి ఆనందపరచుగాక! అని సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేత శ్రీరామచంద్రస్వామిని ప్రార్థిస్తూ 

      అందఱికీ మరొకసారి శుభాకాంక్షలు. 


  - బట్టేలంక శ్రీశ్రీశ్రీ కృష్ణానంద స్వామిచే వి.హిం.ప. పెద్దల సమక్షంలో "రామాయణం శర్మ"గా ప్రారంభించబడి, దాదాపుగా మూడు దశాబ్దాలుగా అందఱిచేతా ఆ పేరుతో పిలువబడుతున్న 


    బొడ్డపాటి శ్రీరామ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ 

                       భద్రాచలం

యౌవనం

 శుభోదయమ్-సుభాషితమ్||-_ ॐ卐*💎

శ్లో𝕝𝕝 వసంత యౌవనా వృక్షాః

పురుషా ధన యౌవనాః|

సౌభాగ్య యౌవనా నార్యో

యువానో బుద్ధి యౌవనాః||

*--- నీతి శాస్త్రం ---*

తా𝕝𝕝 *వృక్షములకు వసంత కాలమే యౌవనం*..... 

*పురుషులకు ధనమే యౌవనం*..... 

*స్త్రీలకు సౌభాగ్యమే యౌవనం*.... 

*ఉత్తములకు బుద్ధియే యౌవనం*....

*చైత్ర మాసం విశిష్టత*




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



*చైత్ర మాసం విశిష్టత*


*“ఋతూనాం కుసుమాకరాం”* అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు , దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.


చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది.

ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లూ , చేమలే కాదు , పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. సంవత్సరమునకు యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది , ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుండీ సంవత్సరాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు కొన్ని పనులను చేయాలని పెద్దలు చెప్పారు. అవి ఏమిటంటే , ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం చేసి , నూతన వస్త్రాలు ధరించాలి. ప్రతీ గృహమునందు ధ్వజారోహణం , లేదా జయకేతనం ఎగురవేయాలి. సృష్టి మొదలు అయిన రోజున (యుగాది) సృష్టిని చేసిన బ్రహ్మగారిని పూజించాలి. ఉగాది నాడు షడ్రుచులతో కూడిన పచ్చడిసేవనం(నింబకుసుమ భక్షణం), పంచాంగ శ్రవణం , తెలుగు వారికే ప్రత్యేకమైన అవధానం , వంటివి పండుగకే శోభనిస్తాయి.


ఉగాది పచ్చడి సేవనం వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వేపపువ్వు , కొత్త బెల్లం , కొత్త చింతపండు , మామిడి , చెరకు వంటివాటితో చేసిన పచ్చడిని తినటంవల్ల ప్రకృతిలో వచ్చే మార్పులకు మన శరీరం సిద్ధపడుతుంది. వేపపువ్వు , బెల్లం ఈనాటినుండీ పదిహేనురోజుల పాటు రోజూ ఉదయాన్నే స్వీకరించడం వల్ల ఆరోగ్యం చక్కబడుతుంది.


పంచాంగ శ్రవణం – పంచాంగాన్ని పూజించి , తిథి , వార , నక్షత్ర , యోగం , కరణాలతో కూడిన పంచాంగాన్ని చదివి , విని , రాబోయే సంవత్సరంలో గ్రహాల గతుల ఆధారంగా ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయో తెలుసుకుని , తదనుగుణంగా తమ నిర్ణయాలను తీసుకోవడం , శుభ ఫలితాల కోసం భగవంతుని పూజించడం వంటివి చేస్తారు. ఇక కవిసమ్మేళనాలు , అవధానాలు , సాంస్కృతిక కార్యక్రమాలతో కాలాన్ని ఆనందంగా గడుపుతారు.


చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు

సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాము. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు , రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు , మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి , నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి , చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది. రామాయణం లోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు , వనవాసానికి వెళ్ళటం , దశరథుని మరణం , సీతాపహరణం , రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం , శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి. 


చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి , మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు.


చైత్ర శుద్ధ తదియ – డోలాగౌరీ వ్రతం(సౌభాగ్య గౌరీ వ్రతం), సౌభాగ్య శయన వ్రతం , ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి , డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు , చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని , పుత్రపౌత్రాదులను , భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ రోజు మత్స్య జయంతి కూడా. – శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి , వేదాలను రక్షించిన రోజు.


చైత్ర శుద్ధ పంచమి – లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు 

పూజించాలి. అనంత , వాసుకి , తక్షక , కర్కోటక , శంఖ , కుళిక , పద్మ , మహాపద్మ అనే మహానాగులను పూజించి , పాలు , నెయ్యి నివేదించాలి.

అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది. ఒకవేళ చేయలేకపోయినా , శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది.


చైత్ర శుద్ధ అష్టమి – భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి , అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది.


చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి . శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈ రోజు ఊరూరా , వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం.


చైత్ర శుద్ధ ఏకాదశి – వరూధిన్యేకాదశి , కామద ఏకాదశి అని అంటారు.


చైత్ర శుద్ధ పౌర్ణమి – స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు.


చైత్ర బహుళ త్రయోదశి – యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు.

ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు , ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని , రామాయణ సారాన్ని గ్రహించి , సీతారాముల కళ్యాణం చూసి తరించి , సనాతన ధర్మాచరణకై పాటుపడదాము.

సనాతన ధర్మం

 హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు. 


(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 


1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.


2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.


3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..


4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.


5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 


6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.


7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 


వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 


8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.


9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.


ఇంకా ..


1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.


2.  ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)


3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.


ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు


1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.


2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..


3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 


4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.


5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.


6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)


7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 


8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).


9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).


10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.


*ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి*


*తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి*

ఇదే మన సనాతన ధర్మం యెుక్క గోప్పతనం🙏🏻🌷💐💐

శ్రీ అంబా పంచరత్న స్తోత్రమ్*

 *శ్రీ ఆది శంకరాచార్య విరచితం శ్రీ అంబా పంచరత్న స్తోత్రమ్*

🕉🕉️ *శ్రీమాత్రే నమః* 🕉️🕉️



*1) అంబా శంబరవైరితాత భగినీ శ్రీచంద్ర బింబాననా|*


*బింబోష్ఠీ స్మితభాషిణీ శుభకరీ కాదంబవాట్యాశ్రితా |*


*హ్రీంకారాక్షరమంత్రమధ్యసుభగా శ్రోణీనితంబాంకితా|*


*మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు ||* 




*2) కల్యాణీ కమనీయసుందరవపుః కాత్యాయనీ కాలికా|*


*కాలా శ్యామల మేచకద్యుతిమతీ కాదిత్రిపంచాక్షరీ |*


*కామాక్షీ కరుణానిధిః కలిమలారణ్యాతిదావానలా|*


*మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు ||* 




*3) కాంచీకంకణ హారకుండలవతీ కోటీకిరీటాన్వితా|*


*కందర్పద్యుతికోటికోటిసదనా పీయూష కుంభస్తనా |*


*కౌసుంభారుణకాంచనాంబరవృతా కైలాసవాసప్రియా|*


*మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు ||* 




*4) యా సా శుంభ నిశుంభ దైత్యశమనీ యా రక్తబీజాశనీ|*


*యా శ్రీ విష్ణు సరోజ నేత్రభవనా యా బ్రహ్మవిద్యాఽఽసనీ |*


*యా దేవీ మధుకైటభా సురరిపుర్యా మాహిష ధ్వంసినీ|*


*మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు ||*




*5) శ్రీవిద్యా పరదేవతాఽఽదిజననీ దుర్గా జయాచండికా|*


*బాలా శ్రీత్రిపురేశ్వరీ శివసతీ శ్రీరాజరాజేశ్వరీ |*


*శ్రీరాజ్ఞీ శివదూతికా శ్రుతినుతా శృంగార చూడామణిః|*


*మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు ||* 



*6) అంబాపంచక మద్భుతం పఠతి చేద్యో వా ప్రభాతేఽనిశం|*


*దివ్యైశ్వర్యశతాయురుత్తమమతిం విద్యాం శ్రియం శాశ్వతమ్ |*


*లబ్ధ్వా భూమితలే స్వధర్మనిరతాం శ్రీసుందరీం భామినీం|*


*అంతే స్వర్గఫలం లభేత్స విబుధైః సంస్తూయమానో నరః ||*



*ఇతి శ్రీ ఆది శంకరాచార్య విరచితం శ్రీ అంబా పంచరత్న స్తోత్రమ్ ||*


🕉🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ఉగాది

 ఉగాది.


ఉర్వి పల్కు ఉషోదయము

మామిడి ఆకుల తోరణం

శుభకృత్ నామవత్సరం

తొలి పండుగ సంబరము.


తెలుగు ప్రాంత పర్వదినం

షడ్రుచుల జీవన సారం

ఉగాది పండుగ సమయం

కోయిల పాటల సంగీతం.


సంవత్సరాదిన పంచాంగం

భవిష్యత్ ఆశాజనకం

గతమంతా యుద్ద ప్రభావం

రాబోవు శాంతి ఆశా చిత్రం.


తెలుగు ప్రాంత వికాసము

మేలు హెచ్చుగా మేల్కొనుము

తెలుగు నాట నవోదయం

శుభకృత్ కాల గమనం.


ఉగాది పండుగ శుభాకాంక్షలతో...


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

బడంగపేట, తెలంగాణ.

9391456575.

ఆకలితో బాధపడే పరిస్తితి

 *_ఈ తీర్పును ఎలా తీసుకుందాం_*


అమెరికా దేశం లో .. 

ఓ పదిహేనేళ్ళ కుర్రవాడు ఓ షాప్ లో బ్రెడ్-బటర్ ప్యాకెట్ దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. కాపలాదారు పట్టుకున్నాడు. ఆ కుర్రవాడు వదిలించుకుని పారిపోయే క్రమంలో షాప్ కు సంబంధించిన షెల్ఫ్ పగిలిపోయింది. 

కుర్రవాన్ని న్యాయాధికారి ముందుకు ప్రవేశపెట్టారు. 

“నువ్వు బ్రెడ్-బటర్ ప్యాకెట్ దొంగిలిస్తూ పట్టుబడ్డావా?” ప్రశ్నించాడు జడ్జ్. 

“అవును” నేల చూపులు చూస్తూ చెప్పాడు కుర్రవాడు. 

“ఎందుకు?”

“అవసరం పడింది”

“కొనుక్కోవచ్చుగా”

“డబ్బులు లేవు”

“మీ ఇంట్లోంచి తెచ్చుకోవాల్సింది” అన్నాడు జడ్జ్. 

“ఇంట్లో అమ్మ ఒక్కతే  ఉంటుంది. ఏ పనీ చేయలేదు. జబ్బు మనిషి. ఈ బ్రెడ్-బటర్ ప్యాకెట్ ఆమె కోసమే” నిదానంగా చెప్పాడు. 

“నువ్వేం పనిచేయవా?

“కార్లు కడిగి ఏ రోజు కా రోజు డబ్బు సంపాదించేవాడిని. నిన్న అమ్మ ఆరోగ్యం అసలేమీ బాగా లేకపోతే ఆమెను చూసుకుంటూ ఇంట్లో ఉన్నందుకు పని లోంచి తీసేశారు.” బదులిచ్చాడు కుర్రవాడు. 

“ఎవరి సహాయమైనా తీసుకోకపోయావా” జడ్జ్ స్వరం లో జాలి కనిపించింది. 

“పొద్దున్నే ఇంట్లోంచి బయలుదేరి కనీసం ఓ యాభై మందిని సహాయం కోసం అర్థించాను. ఎవరూ కనికరించలేదు. చివరికి బ్రెడ్-బటర్ ప్యాకెట్ దొంగతనం చేయవలసి వచ్చింది. 

జడ్జ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. తన తీర్పు వెల్లడించాడు. 

“కేవలం ఒక బ్రెడ్-బటర్ కోసం దొంగతనం చేయవలసి రావడం చాలా సిగ్గు పడాల్సిన నేరం. దీనికి ఆ కుర్రవాడు ఏమాత్రం బాధ్యుడు కాడు. ఈ కోర్టు లో ఉన్న నాతో సహా మిగిలినవారందరూ బాధ్యులే.. నేరస్తులే. అందుకే నాతో సహా ఈ కోర్టు లో ఉన్న ప్రతి ఒక్కరికీ తలా పది డాలర్ల చొప్పున జరిమానా చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరిస్తున్నాను. పది డాలర్లు చెల్లించకుండా ఎవరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు.”

జడ్జ్ తన తీర్పు చదవడం ఆపాడు. తన పర్స్ లోంచి పది డాలర్ల తీసి టేబల్ పై ఉంచాడు. మళ్ళీ తన తీర్పును కొనసాగించాడు.

“అంతేకాకుండా ఆకలితో ఉన్న కుర్రవాడి మీద కనీస దయ చూపకుండా పోలీసులకు పట్టించినందుకు షాప్ యాజమాన్యానికి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తున్నాను. ఇరవై నాలుగు గంటల్లో జరిమానా కోర్టు కు చెల్లించక పోతే షాప్ మూసివేసి తాళం వేయవలసిందిగా కోర్టు ఆదేశాలిస్తుంది.”

కోర్టు లో జరిమానా గా వసూలు చేసిన డబ్బును కుర్రవాడికి అందించారు. 

ఆకలితో బాధపడే పరిస్తితి కుర్రవాడికి కలిగించినందుకు సమాజాన్ని మన్నించవలసిందిగా అతడిని కోరుతూ తీర్పును ముగించాడు న్యాయాధికారి. 

ఈ తీర్పు విన్న కోర్టు లోని ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. కుర్రవాడు వెక్కి వెక్కి  ఏడుస్తూ జడ్జ్ వంక చూశాడు. ఆయన కూడా ఉబికి వచ్చే తన కన్నీటిని అదుపు చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. 

మన సమాజం, వ్యవస్థ, కోర్టు లు ఈ తరహా తీర్పులకు /నిర్ణయాలకు సిద్ధంగా ఉన్నాయా???

“ఆకలి తో ఉన్న వ్యక్తి తిండికోసం దొంగతనానికి వొడిగడితే ఆ సమాజం, దేశం, ప్రజలు సిగ్గు పడాలి” అని చాణక్యుడు ఏనాడో చెప్పాడు. 

ఒకవేళ ఈ కథనం మీ హృదయాన్ని తాకి చెమరింప జేస్తే.. మరి కొందరికి కూడా పంచండి. 

-బాలగంగాధరరావు.