*ॐ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు*
*కాలం*
"కాలః కలయతామహం" - "కాలములో కూడిక నేను" అంటారు పరమాత్మ.
మన
- మనస్సుతో చేసే ప్రతి ఆలోచన,
- నోటితో పలికే ప్రతి మాట,
- శరీరాంగాలతో చేసే ప్రతి పనీ లెక్కించబడుతూంటుంది.
ఉదా॥
హిరణ్యకశిపుని చర్యలన్నీ లెక్కించబడ్డాయి.
ప్రహ్లాదునివీ లెక్కించబడ్డాయి.
ఇవి విడివిడిగా కూడబడి కాలంలో ఎవరి ఫలాలు వారికి అందించబడ్డాయి.
ఎక్కడెక్కడవి - ఎవరెవరితో - ఎప్పుడెప్పుడు - ఏఏ విధంగా కలపాలో సంకల్పించి నిర్ణయించేది "కాలములో కూడిక" అయిన పరమాత్మయే.
*కాలం - మనం*
మనం
- భూతకాలానికి తిరిగి వెళ్ళలేము.
- భవిష్యత్కాలము తెలియదు.
- కేవలం వర్తమానంలోనే జీవించగలం.
*కాలం - పరమాత్మ*
పరమాత్మ కాలానికి అతీతుడు.
కాలాన్ని అధీనంలో ఉంచుకున్నవాడు.
ఆయన కాలస్వరూపుడు కూడా.
*కాలం - కొలబద్దలు*
ఆ కాలాన్ని మనం అనేక మానాలలో కొలుస్తాము.
సౌర - చాంద్ర - బార్హస్పత్య - నక్షత్ర - హవన మొదలైనవి భారతీయ కాలమానాలు.
అందులో చాంద్రమానాన్ని మనం పాటిస్తాం.
ఆ చాంద్రమాన సంవత్సరాదే యుగాది.
*ఉగాది - యుగాది*
యుగాది అంటే యుగానికి ఆది అని అర్థం.
ఉగము అంటే సంవత్సరమనే అర్థంలో "ఉగాది" అంటే "సంవత్సరాది" అని అర్థం.
*సంవత్సర - జలస్థానాలు*
కాలాన్ని సంవత్సరాలలో కొలుస్తాం. ప్రవాహంతో పోలుస్తాం.
ఇక్కడ విశేషం ఏమిటంటే,
"సంవత్సరోవా అపామాయతనం ----"
సంవత్సర స్థానమే జలముది.
జల స్థానమే సంవత్సరముది.
పరస్పరం సంవత్సర(కాల) జల(నారాయణ) స్థానాలు ఒకటే.
అదే పరమాత్మ కాలస్వరూపుడని తెలుపుతోంది.
*శుభాకాంక్ష*
కాబట్టి భగవంతుని స్వరూపమైన కాలంయొక్క ప్రమాణంలో,
ఈ శుభకృత్ నామ సంవత్సరం అందరి
- మనస్సులూ
- వాక్కులూ
- చేతలూ దైవానుగ్రహంతో త్రికరణ శుద్ధిగా అందఱికీ సుఖశాంతులను ఇచ్చి ఆనందపరచుగాక! అని సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేత శ్రీరామచంద్రస్వామిని ప్రార్థిస్తూ
అందఱికీ మరొకసారి శుభాకాంక్షలు.
- బట్టేలంక శ్రీశ్రీశ్రీ కృష్ణానంద స్వామిచే వి.హిం.ప. పెద్దల సమక్షంలో "రామాయణం శర్మ"గా ప్రారంభించబడి, దాదాపుగా మూడు దశాబ్దాలుగా అందఱిచేతా ఆ పేరుతో పిలువబడుతున్న
బొడ్డపాటి శ్రీరామ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి