5, అక్టోబర్ 2020, సోమవారం

👌 *చిన్న నీతి కథ* 👏

__________________. ఒకసారి ఒక వ్యక్తికి, ఓ అడవిదారిలో చాలా దూరం నడుచుకుంటూ వెళుతూండగా, అధికం గా దాహం వేయడంతో పాత్రలో మిగిలిన కొద్దిపాటి నీరూ త్రాగుతూండగా, యమధర్మరాజు మాయావేషాన కలిశారు. అందుకే ఆ వ్యక్తికి కలిసిన ఆయన యమధర్మరాజు గారని తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తితో చాలాసేపటి నుండి దప్పికతో బాధపడుతూన్నాననీ, ఎక్కడా నీళ్లు దొరకడం లేదనీ.. తాగడానికి కాసిన్ని నీళ్ళు కావాలని కోరారు. యమధర్మరాజు రావడం ఓక్షణం ఆలస్యమై ఉంటే ఆ నీళ్లను ఆ వ్యక్తి తాగేసేవాడే ! కానీ, వెంటనే యమధర్మరాజు పరిస్థితి కి జాలిపడి నీళ్లు ఇచ్చేసాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు సంతోషించి, ఆ వ్యక్తితో చెప్పాడు "నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యమధర్మరాజునే.. కానీ నీవు తాగడానికి నాకు నీళ్ళిచ్చి, నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మార్చుకోడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. యమధర్మరాజు ఆ వ్యక్తికి తన చేతనున్న పుస్తకాన్నిచ్చి "ఇది అందరి జాతకాలున్న భవిష్యద్వాణి. నీపై కాలపాశమేసి తీసుకుపోయేందుకు మరో ఐదు ఘడియల సమయముంది. కనుక, ఇందులో నీ జాతకం చదువుకొని నీకున్న ఆనందం, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, ప్రశాంతతసౌఖ్యం లను ఒక ఐదు ఘడియల సమయం లో మరికొంచెం పెంచుకునే అవకాశం తో మార్చి రాసుకో.. జరుగుతుంది కానీ ఇచ్చిన సమయం లోపలే పూర్తవాలన్నారు. దాంతో ఆవ్యక్తి గబగబా మొదటిపేజీలోనిది చదివాడు.. అందులో తన పక్కింటాయనకు "లాటరీ రాబోతోంది - అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు" అన్నది చదివి, ఆ వ్యక్తికి లాటరీ తగలకూడదని మార్చేసాడు. తర్వాత పేజీ చదవగా "తన స్నేహితుడు ఎన్నికలలో గెలిచి, మంత్రి పదవి రాబోతోందని చదివి, అతడు ఓడిపోవాలి అని మార్చేసాడు. ఈ విధంగా, వేరేవారి జాతకాలు చదువుతూ, చివరికి తన పేజీలకొచ్చి కావాల్సినది రాసుకుందామనుకునే లోపుగా, సమయమాసన్నమై, యమధర్మరాజు ఆ వ్యక్తి చేతినుండి డైరీని తీసేసుకుని, నీకిచ్చిన అమూల్యమైన సమయాన్ని పక్కవారి వినాశనానికి ఆలోచించావు తప్ప నీవు స్వయం గా ఉద్ధరింపబడటానికి ఉపయోగించుకోలేదు. పరచింతన లో వృధా చేసుకుని నీ జీవితాన్ని స్వయంగా నీవే కష్టాలలోకి నెట్టు కున్నావు అనగా, చాలా పశ్చాతాప పడ్డాడు వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నందుకు.


ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే, భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉండమని దాదాపు సమాన ఆయుఃప్రమాణం, ఆనందకరమైన మనసూ, ఆరోగ్యకరమైన అవకాశాలనూ ఇస్తాడు. కానీ మనము వ్యర్ధాలోచనలు, అలసత్వాలతో వాటన్నింటినీ మనమే వృధా చేసేసుకుని, ఆయువూ ఆరోగ్యాలను ఆభగవంతుడు లాగేసుకున్నాడంటున్నాము. అలాకాక, ఎవరైతే చక్కటి సమయపాలనతో పెద్దలు నేర్పిన యోగా ధ్యానం శౌచ సదాచారాలతో భగవంతుడిచ్చిన ఆయువూ ఆనందాల ప్రమాణాన్ని పెంచేసుకునీ, ఇతరులతో కూడా సదా పంచుకుంటారో వారి పైన సదా ఆ భగవంతుని కృప వర్షిస్తూనే ఉంటుంది! సర్వేజనాః సుజనాభవంతు.. సర్వేసుజనా సుఖినోభవంతు!


ఈ సంగమ యుగంలో, భగవంతుడు కలం మనచేతికే ఇచ్చి "మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి "అని ఇస్తూన్న ఈ సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోమని మరో సారి విన్నవించుకుంటూ, భవదీయ- జగన్నాథ🙏

భోజనం - సదాచార నియమాలు............!!

       


1. భోజనానికి ముందు,తరువాత తప్పక 

కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. 

తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.


2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.


3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) 

తినే పళ్ళానికి తాకించరాదు.  

అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. 

ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. 

చాలా దోషం.  


4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.


5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.


6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.  


7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. 

ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.  


8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.  


9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.


10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.


11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.


12. ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు 

ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.


13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు. 

(ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)

 

14. మాడిన అన్నాన్ని నివేదించరాదు. 

అతిథులకు పెట్టరాదు.

    

15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు. 

(వెంట్రుకలు కత్తిరించడం)


16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే 

మనం తినగా మిగిలినవి పెట్టరాదు. 

మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి. 

 

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. 

   

18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.

  

19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది. 

   

20. భగవన్నామము తలుచుకుంటూ లేదా 

భగవత్ కథలు వింటూ వంట వండడం, 

భోజనం చేయడం చాలా ఉత్తమం. 

 

21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని 

ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు) 

 

22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  

  

23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు . 

ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.


24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.


25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.


26. అరటిఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు 

(తిన్న విస్తరిని మడవడం అనాచారం).  

తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.

 

27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం.

(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)    


28. భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి. 

అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి. 

నోరు నీటితో పుక్కిలించుకోవాలి.


29. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)  


30. స్నానం చేసి మాత్రమే వంట వండాలని 

కఠోర నియమము.  

పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం. అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,

పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం. 

అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.

                          

31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. 

ద్విపాక దోషం వస్తుంది. 


32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.

15-14-గీతా మకరందము


         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - జీవులు భుజించు ఆహారమును తానే పచనమొనర్చుచున్నానని భగవానుడు చెప్పుచున్నారు -

 

అహంవైశ్వానరో భూత్వా 

ప్రాణినాం దేహమాశ్రితః | 

ప్రాణాపానసమాయుక్తః 

పచామ్యన్నం చతుర్విధమ్ ||


తాత్పర్యము:- నేను ‘వైశ్వానరుడ'ను జఠరాగ్నిగానయి ప్రాణులయొక్క శరీరమును ఆశ్రయించి, ప్రాణాపానవాయువులతో గూడుకొని నాలుగువిధములగు అన్నమును పచనము చేయుచున్నాను.


వ్యాఖ్య:- క్రిందటిశ్లోకములో భగవానుడు తాను సస్యములను పోషించుటద్వారా జీవులు తిను అన్నమును సృష్టించుచున్నానని పలికి, ఇపుడా యన్నమును తానే జీవుల శరీరములందు పచనమొనర్చుచున్నానని వచించుచున్నారు. శరీరము ఆహారముచే నేర్పడుచున్నది. ఆ యాహారము జఠరాగ్నిచే పక్వముకానిచో, రక్తాదులద్వారా శరీరమంతటను వ్యాపించనేరదు. కావున జఠరాగ్ని శరీరమున కీలకస్థానమాక్రమించుకొనియున్నది. భగవానుడు తానే జఠరాగ్నిరూపమున అచ్చోట వర్తించుచున్నారని చెప్పుటవలన, దేహ నిర్మాత, దేహపోషణకర్త వారేయని స్పష్టమగుచున్నది. ఈ ప్రకారముగ ఆహారమును ధాన్యాదులద్వారా సృజించి, మఱల దానిని చక్కగా పచనముచేసి శరీరమునకు పుష్టిని కలుగజేయుచు జీవులకు మహోపకృతి నొనర్చుచున్న ఆ పరమాత్మకు కృతజ్ఞత చెల్లించక, ఆ అన్నము వారికి నివేదించక భుజించువాడు ఎంతటి కృతఘ్నుడు? అట్టివాడు దొంగయే యగునని పూర్వము శ్రీకృష్ణమూర్తి చెప్పియుండుట గమనించదగినది. [యో భుఙ్క్తే స్తేన ఏవ సః (3-12)] కనుకనే ఆహారమును భుజించుటకు ముందు దేవునకు ‘నైవేద్యము’ సమర్పించు ఆచారము లోకములో నేర్పడినది. అట్లు దేవునకు నివేదింపకుండ, దైవభావనలేకుండ భుజించునది అపవిత్రమే కాగలదు. కాబట్టి ప్రతివారును తాము భోజనముచేయుటకు ముందుగా, తమ యాహారమును దైవమునకు సమర్పించి, లేక అందలి కొంతభాగమును దైవస్వరూపులేయగు భూతకోట్లకు పెట్టి, భగవద్భావనతో భుజించవలెను. అప్పుడా భోజనమను క్రియ యజ్ఞముగాను, భుజించుపదార్థము అమృతముగాను మారిపోవును. 

  ‘ప్రాణినాం దేహమాశ్రితః’ - అని చెప్పుటవలన భగవంతుడు అతిసమీపమున దేహమందే యున్నాడని నిశ్చతమగుచున్నది. కావున తమ శరీరమున దైవసన్నిధానమును అనుభవించుచు, భగవద్భక్తిగలిగి, పాపాచరణలేక జనులు పవిత్రమార్గమునే చేబట్టవలెను.

      'పచామ్యన్నం చతుర్విధమ్’ - పరమాత్మ జీవుల శరీరములో జఠరాగ్నిరూపమున వర్తించుచు, వారు తిను నాలుగు విధములైన ఆహారమును జీర్ణమొనర్చుచున్నారని తెలుపబడినది.

నాలుగు విధములైన ఆహారము - (1) భక్ష్యము (2) భోజ్యము (3) లేహ్యము (4) చోష్యము.

(1) భక్ష్యము = దంతములచే కొఱకి తినబడు కఠినపదార్థములు, పిండివంటలు, కూరగాయలు మున్నగునవి.

(2) భోజ్యము = నాలుకచే చప్పళించి మ్రింగబడు మెత్తటి వస్తువులగు అన్నము మొదలైనవి. 

(3) లేహ్యము = నాలుకచే రుచిచూడబడు పచ్చళ్లు మొదలైనవి.

(4) చోష్యము = నోటిచే జుఱ్ఱబడు పాయసము, చారు, మజ్జిగ మున్నగునవి.

 ఇట్టి యాహారమును భగవానుడే జీర్ణమొనర్చుచుండుటవలన ఇక ఆహారవిషయమై మనుజుడెంత జాగరూకుడుగా నుండవలెనో యోచించుకొనవలయును. ఆహారసంబంధముగ ఈ క్రింది జాగ్రతలను పాటించుట ఉత్తమము - (1) అమితముగా భుజించి జీర్ణకర్తయగు భగవంతునకు పనిని కల్పించరాదు. (2) సాత్త్వికాహారమునే భుజించవలెను. రాజస, తామసాహారములను వర్జించవలెను*. (3) తిను ఆహారమును భగవంతునకు ముందుగా భక్తితో నివేదించవలెను. (4) ఆ యాహారము న్యాయార్జితవిత్తముచే నేర్పడినదిగా నుండవలెను. అధర్మమార్గముద్వారా సంపాదించిన ధనముతో పంచభక్ష్యపరమాన్నములను భుజించుట కంటె, న్యాయార్జితమైన సొత్తుతో లభించిన అంబలి త్రాగి బ్రతుకుట ఉత్తమము. భగవానుడు ప్రతివాని కడుపులో దాగి అంతయు గమనించుచున్నారు. కావున ఆహారాదివిషయములలో జనులు బహుజాగరూకులై యుండవలెను.

ఈ ప్రకారముగ ఈ అధ్యాయములో ఆహారవిషయమైన ప్రస్తావన విశేషముగ వచ్చియుండుటంబట్టి భోజనకాలమున ఈ అధ్యాయమును పఠించు ఆచారము లోకమున ఏర్పడినది. అనేక ఆశ్రమములందును, మఠములందును, గృహములందును ఈ అధ్యాయమును సమష్టిగా గాని వ్యష్టిగా గాని భోజనకాలమున జనులు పఠించి తదుపరి ఆహారమును సేవించుచుందురు. ఈ ప్రకారముగ భగవద్భావనతో భుజించువానికి పెట్టబడు అన్నము సాక్షాత్ భగవంతునకు పెట్టబడినట్లేయగును. అంతటి పుణ్యమాతనికి తప్పక లభింపగలదు. మఱియు దైవధ్యానముతో భుజించుటవలన మనుజుని శరీరములోని అణువణువు దైవశక్తితో గూడియుండును.

భోజనముచేయుటకు ముందుగా 15వ అధ్యాయమంతయును చెప్పి చివఱకు చేతిలో తీర్థమును గ్రహించి " బ్రహ్మార్పణం బ్రహ్మహవిః -' అను గీత 4వ అధ్యాయములోని 24వ శ్లోకమును భక్తితో పఠించి పిదప ఆ నీటిని అన్నముపైచల్లి ఆ పిదప భుజించుట ఉత్తమము.

ప్రశ్న:- పరమాత్మ జీవుల శరీరములందు ఏ రూపమున వెలయుచున్నాడు? 

ఉత్తరము:- (వైశ్వానరుడను) జఠరాగ్నిరూపమున. 

ప్రశ్న:- అట్లుండి యాతడేమి చేయుచున్నాడు?

ఉత్తరము:- ప్రాణాపానవాయువులతో గూడి జీవులు భుజించు ఆహారమును పచనమొనర్చుచున్నాడు.

ప్రశ్న:- కాబట్టి జను లేమి చేయవలెను?

ఉత్తరము:- తమశరీరముననే వెలయుచున్నట్టి ఆ పరమాత్మను భక్తితో ధ్యానించుచు, తాము భుజించుటకు ముందుగా నాతని కర్పించి, దైవభావనతో భుజించవలెను.

~~~~~~~~~~~~~~

* సాత్త్విక, రాజస, తామసాహారముల వివరణమునకై 17వ అధ్యాయములోని 8,9,10వ శ్లోకములను జూడుడు. 

~~~~~~~~~~~

యమధర్మరాజు కలిశారు.

 ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. అయితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజుని తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్ళు అడిగారు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే, వెంటనే యమధర్మరాజుకు నీళ్లు ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు వ్యక్తితో చెప్పాడు నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముని కానీ నీవు తాగడానికి నాకు నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని , యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చారు. నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అది జరుగుతుంది కానీ గుర్తుంచుకో నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే. ఆ వ్యక్తి డైరీ తీసుకుని ఓపెన్ చేసాడు. మొదటిపేజీలోనిది చదివాడు అందులో తన పక్కింటాయనకు "లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు" అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు. తర్వాత పేజీ చదివాడు, "తన స్నేహితుడు ఎన్నికలలో గెలిచి మంత్రి పదవి రాబోతోంది " అది చదివి అతడు ఓడిపోవాలి అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీ ఉన్న పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతినుండి డైరీని తీసుకుని నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయ్యింది. ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల చింతన చేయడంలో సమయం వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టంలోకి నెట్టు కున్నావు నీ యొక్క మృత్యువు నిశ్చితం అయింది అని డైరీ తీసుకున్నాడు యముడు . ఆ వ్యక్తి చాలా పశ్చాతాప పడ్డాడు. వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు.


 ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. కానీ మనము వ్యర్థము ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారి పైన సదా భగవంతుని కృప నిండి ఉంటుంది.


ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మనచేతికి ఇచ్చి "మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి "అని అవకాశం ఇస్తున్నారు. కానీ మనము పర చింతన చేస్తూ సమయము వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాని మనమే వంచన చేసుకుంటున్నాం...

ఇంతకీ సప్తర్షులు ఎవరు!*

 *


చిమ్మచీకటి రోజున ఆకాశంలోకి చూసినప్పుడు ఒక ప్రశ్నార్థకంలా కనిపించే నక్షత్ర సమూహమే... సప్తర్షి మండలం. సప్తర్ష మండలం మనకి కొత్త కాదు. తల పైకెత్తి పరిశీలించినప్పుడల్లా కనిపించేదే. అందులో ఉండేవి కేవలం నక్షత్రాలు మాత్రమే కాదనీ... మహారుషులే అలా తారారూపంలో సంచరిస్తున్నారనీ మన నమ్మకం. మరైతే ఆ సప్తర్షులు ఎవరు.. వారి పేర్లు ఏమిటి అని తెలుసుకోవడం కూడా ఆసక్తికరమే కదా!


సప్తర్షుల పేర్లు ఏమిటి అని ఖచ్చితంగా చెప్పడం అంత తేలికైని విషయం కాదు. ఎందుకంటే వేర్వేరు పురాణ గ్రంథాలలో వేర్వేరు సప్తర్షులు కనిపిస్తారు. బృహదారణ్యకంలో, వేదాలలో, మహాభారతంలో... ఇలా ఒకో ప్రమాణం ప్రకారం వారి పేర్లు మారుతూ కనిపిస్తాయి. అంతేకాదు వేర్వేరు మన్వంతరాలలో కూడా వీరి పేర్లు వేర్వేరుగా కనిపిస్తాయి. దీనిని బట్టి సప్తర్షి అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదనీ, అది ఒక హోదా అని భావించవచ్చునేమో. కాలానుగుణంగా ఈ హోదాను వేర్వేరు రుషులు దక్కించుకుంటూ ఉండవచ్చు. కేవలం హైందవ మతంలోనే కాదు... హైందవం ఆధారంగా వచ్చిన సిక్కు, జైన మతాలలో కూడా ఈ సప్త రుషులు ప్రస్తావన కనిపిస్తుంది. మహాభారతం మనకు ఇటీవలి ప్రమాణం కాబట్టి ఇందులో ఉన్న పేర్లను ప్రస్తుతానికి ఉన్న సప్తర్షులుగా భావించవచ్చు. వీరు... మరీచి, అత్రి, అంగీరసు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు.


సప్తర్షి జాబితాలో ఉన్నవారంతా అసాధారణమైనవారే! తమ పేరుతో ఒక గోత్రాన్ని స్థాపించినవారే! విద్యాదాతలుగా, జ్ఞానప్రదాతలుగా, హోమద్రవ్యాలను స్వీకరించేవారుగా వీరికి గొప్ప పేరు. అయితే వీరందరూ కూడా గృహస్థులే కావడం విశేషం! ఒకో రుషి కుటుంబాన్ని కనుక గమనిస్తే అందులో పురాణ పాత్రలు చాలానే కనిపిస్తాయి. రామాయణంలో ముఖ్య పాత్ర అయిన రావణాసురుడు సాక్షాత్తూ పులస్త్యుని మనవడు. మహాపతివ్రతగా పేరొందిన అనసూయ అత్రిమహాముని భార్య.


ఒకవైపు నడి సముద్రం, చుట్టూ చిమ్మచీకటి... ఇలాంటి సందర్భంలో మన పెద్దలకు సప్తర్షి మండలం ఒక దారిని చూపించే సాధనంగా ఉండేది. సముద్రం నుంచి ఎడారి వరకూ బాటసారులకు గమ్యం వైపు నడిపించేది. ఆఖరికి ప్రళయకాలంలో సత్యవ్రతుడనే రాజు సకల జీవరాశులను పడవలోకి చేర్చినప్పుడు, అతనికి దారి చూపింది కూడా సప్తర్షి మండలమే అని చెబుతారు. బహుశా అందుకనే ఆ నక్షత్రమండలానికి సప్తర్షి హోదాను కట్టబెట్టి ఉండవచ్చు. కేవలం భారతీయులకే కాదు! పాశ్చాత్యులు కూడా ఈ సప్తర్షి మండలాన్ని ‘బిగ్‌ డిప్పర్‌’ పేరుతో పిలుచుకుంటారు. ఉత్తరఖగోళార్ధంలో సంవత్సరం పొడవునా కనిపించే ఈ బిగ్ డిప్పర్‌, నౌనాయానం ద్వారా మన నాగరికత ముందుకు సాగడానికి తోడ్పడింది.


సప్తర్షి మండలం అనగానే మనకు గుర్తుకువచ్చే మరో విషయం... అరుంధతీ నక్షత్రం! తన భర్త వశిష్ఠుని అడుగుజాడల్లో నడిచే అరుంధతి నక్షత్రం ఆయనతో పాటుగానే సప్తర్షి మండలంలో భాగమైందని విశ్వాసం. అందకనే పెళ్లయిన నూతన వధువుకు, అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు. అలా భర్తను నిత్యం అనుసరించే అరుంధతి, ఆమెను అంత ఎత్తున నిలబెట్టిన వశిష్ఠులు సప్తర్షి గణంలో ఒక భాగమైపోయారు.

రామాయణమ్..118

 

.

ఎదురుగా నిలుచున్న పర్వతాకారుడైన రాక్షసుని పేరు విరాధుడు.

.

అత్యంతజుగుప్సాకరమైన ఆకారం గలవాడు,ఏ అవయవమూ కూడా ఒకదానితో ఒకటి పొంతనలేకుండా అమరిఉన్నది వాడి వికృతాకారము చూపరులకు భయం కలిగిస్తున్నది.

.

ఒకపెద్ద శూలానికి మూడు సింహాలను,నాలుగుపెద్దపులులను,పదిచుక్కలజింకలను,పైన పసతోనిండిన దంతాలతోకూడిన ఏనుగు తలను గుచ్చి మోసుకుపోతున్నాడు.

.

సీతా రామలక్ష్మణులను చూడగనే వారిని చంపటం కోసం వారి మీదకు దూసుకుంటూ వస్తున్నాడు.

.

వచ్చీ రావడం తోనే వాడు సీతను లాగి తన ఒడిలో కూర్చోపెట్టుకుని అందమైన ఈమెను నా భార్యను చేసుకొని మీ ఇద్దరినీ ఆహారంగా చేసుకుంటాను బాగా కండబట్టి ఉన్నారు మీ ఇద్దరూ అంటూ వికృతంగా వికటాట్టహాసం చేస్తుంటే పెనుగాలికి ఊగే చివురుటాకులా గజగజవణికి పోతున్నది సీతమ్మ.

.

వాడి ఒడిలో సీతమ్మ స్థితి చూసిన రాముడికి దుఃఖమాగటంలేదు .లక్ష్మణా అదిగో చూడు సుకుమారి,అల్లారుముద్దుగా పెరిగిన నా సీత ఎలా పరాయిమగాడి ఒడిలోకి నెట్టబడ్డదో చూశావా! 

.

కైక కళ్ళు చల్లబడ్డాయి ఇప్పటికి! అయ్యో నాకెందుకు ఇంత దుఃఖము సంప్రాప్తించినది! నా రాజ్యము నాకు కాకుండా పోయినది ,నా తండ్రి మరణించాడు,నా భార్యను పరపురుషుడు తాకాడు.

.

రాముడి దీనాలాపాలు వింటున్న లక్ష్మణుడు ఒక్కసారిగా మహాసర్పము(పాము)లాగ బుసలుకొట్టాడు.

.

రామా ! దేవేంద్ర సమానపరాక్రమము గల నీవు చింతించడమా? నేను నీ దాసుడను .ఇదిగో ఇప్పుడే నేను ప్రయోగించే బాణము విరాధుడి రక్తమును భూమికి గల దాహం తీర్చగలదు..

.

వీరి సంభాషణ వింటున్న విరాధుడు ఎవరురా మీరిద్దరూ ఆడుదానిని వెంట పెట్టుకొని ముని వేషాలతో అడవులలో సంచరిస్తున్నారు.అని అడిగాడు.అప్పుడు తామెవరో రాముడు తెలియచేసి మరి నీవెవరు అని అడిగాడు.

.

అప్పుడు వాడు, నేను జవుడు,శతహ్రదలకు పుట్డినవాడను.

ఎవ్వరిచేత ఛేదించబడకుండా,చంపబడకుండా బ్రహ్మవద్దనుండి వరాలు పొందాను.మీరు నన్నేమి చేయలేరు. ఈ ఆడదానిని నాకు వదిలేసి వచ్చిన దారినే త్వరగా పారిపొండి నేనేమీ చేయను మిమ్ములను అని పలికాడు.

.

వాడి మాటలకు ఒక్కసారిగా రాముడి కన్నులు ఎర్రగా అయిపోయినాయి.ధనస్సును ఎక్కుపెట్టి బంగారుపొన్నులు గల ఏడు బాణాలను ఒక్కసారే సంధించి మహావేగంగా వదిలిపెట్టాడు ,అవి రయ్యిన దూసుకుంటూ వెళ్ళి వాడి శరీరాన్ని చీల్చి అవతలపడ్డాయి బుస్సుమంటూ రక్తం పొంగి వాడి శరీరంనుండి కార సాగింది.

.

ఆ బాధకు వాడికి కోపం వచ్చి సీతను దింపి శూలాన్ని ఎత్తి రామలక్ష్మణులవైపు పరుగెత్తాడు.వాడి మీదకు అన్నదమ్ములిరువురూ ఏకధాటిగా బాణవర్షం కురిపించినా వాడు లెక్కచేయక వారివురునీ చెరొక చేతిలో ఒడిసిపట్టుకుని తన భుజములకెక్కించుకొని అరణ్యంలో పరుగెత్తసాగాడు .అది చూసి బిగ్గరగా ఏడుస్తూ సీతమ్మకూడా వాడివెంట పరుగెత్తింది.

.

పరుగెత్తుకుంటూ ఏడుస్తూ తమను అనుసరిస్తున్న సీతను చూడగనే రాముడి హృదయంలో అగ్నిపర్వతము బ్రద్దలయినప్పుడు ప్రవహించే విధముగా క్రోధము కట్టలు తెంచుకొని ప్రవహించింది.

.

రామలక్ష్మణులు ఇరువురూ ఒకరికొకరు చెప్పుకుని వారు కూర్చుని ఉన్న రాక్షసుడి భుజాలను ఒక్కవేటుతో ఒకేసారి తెగ నరికారు.ఆ దెబ్బకు ఆ రాక్షసుడు నేలపై కూలబడ్డాడు.

.

నేలపై పడ్డవాడిని కత్తులతో పొడిచి,ఖడ్గాలతో నరుకుతున్నా వాడు చావడంలేదు.

.

అప్పుడు బ్రహ్మ వరప్రసాది అయిన వాడిని చంపడం తమవల్లకాదని గ్రహించి ,తమ్ముడూ వీడిని మరల లేవకుండా భూస్థాపితం చేద్దాం ! నీవు వెంటనే వీడికి సరిపడా పెద్ద గొయ్యితవ్వు అని చెప్పి తాను వాడి కంఠం మీద కాలుపెట్టి వాడు లేవకుండా అణచిపట్టి ఉంచాడు.

.

శ్రీ రామచంద్రుడి చేతిలో చావుదెబ్బలు తిన్న వాడికి అప్పటికి గాని స్పృహ వచ్చి, రామా ! మహానుభావా నీవెవరో తెలుసుకొనలేక అజ్ఞానముతో ప్రవర్తించాను.ఓ కౌసల్యానందనా నిన్ను,లక్ష్మణుని ,సీతామాతను గుర్తించాను.కుబేర శాపము వలన నాకీ రూపము వచ్చింది.

.

ఎప్పుడైతే రాముడి చేతిలో చంపబడతావో నీ నిజ రూపం నీకు వస్తుందని చెప్పాడాయన.స్వామీ నా కళేబరాన్ని పాతిపెట్టండి అని పలికి నిజరూపాన్ని ధరించి ,ఓ రామా ఇటనుండి ఒకటిన్నర యోజనముల దూరములో శరభంగ మహర్షి ఆశ్రమము ఉన్నది అక్కడికి వెళ్ళండి మీకు శుభము కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు.

.

రామాయణమ్..119

.

విరాధుడి భయం నుండి ఇంకా తేరుకోని సీతను ఊరడిల్లచేసి ,తమ్ముడు లక్ష్మణునితో ఇది చాలా దుర్గమారణ్యములాగ ఉన్నది మనము వెంటనే విరాధుడు చెప్పినట్లుగా శరభంగ మహాముని ఆశ్రమమునకు వెళ్ళి ఆయనను మనకు వాసయోగ్యమైన ప్రదేశము గురించి అడిగి తెలుసుకొనవలె అని పలికి ముని ఆశ్రమము వైపుగా నడక సాగించారు.

.

ముందు లక్ష్మణుడు ,ఆవెనుక సీతమ్మ వారివురినీ అనుసరిస్తూ రామయ్య ప్రయాణం సాగించారు.

.

వారికి అల్లంత దూరంలో శరభంగుడి ఆశ్రమం కనపడుతూ ఉన్నది.మునితో ఎవరో దివ్యపురుషుడు మాట్లాడుతున్నట్లుగా కనపడ్డది. ఆ దివ్యపురుషుడి కాళ్ళు నేలకు ఆనటంలేదు.ఆయన ఎక్కివచ్చిన రధం దివ్యమైన ఆకుపచ్చ వెలుగులు విరజిమ్మే గుర్రాలతో పూన్చబడి ఉన్నది.

.

అక్కడ ఉన్న లక్షణాలను బట్టి చూడగా అది దేవేంద్రుడి రధమని వచ్చినవాడు మహేంద్రుడని రాముడికి అర్ధమయ్యింది.

.

సీతా లక్ష్మణులను ఆశ్రమసమీపంలో బయట ఉండమని చెప్పి తానొక్కడే మునిని దర్శించడానికి లోనికి వెళ్ళాడు.

రాముని రాక గమనించిన దేవేంద్రుడు శరభంగునితో నేను ఇప్పుడే ఈయనకు కనపడ రాదు ఈయన వల్ల ఒక మహా కార్యము జరుగవలసి ఉన్నది ఆ తరువాత మాత్రమే మాట్లాడగలను అని పలికి అంతర్ధానమైనాడు.

.

రాముడిని చూసిన మహర్షి, రామా ! నీ కోసమే వేచి ఉన్నానయా ! ఇంద్రుడు తనతో రమ్మనమని అన్నా రాముడిని కలిసిన తరువాతే వస్తాను అని చెప్పాను.

నిన్ను చూశాను నాకు చాలా సంతోషంగా ఉన్నది ,ఇక ఈ శరీరాన్ని వదలి స్వర్గానికి పయనమవుతాను అని పలికాడు.

.

అప్పుడు రాముడు మునితో ,స్వామీ! మాకు వాసయోగ్యమైన ఏదైనా ఒకస్థలాన్ని చూపించండి అని అడిగాడు.

.

అప్పుడు శరభంగుడు ,రామా! నీవు ఈ అరణ్యంలోనే నివసించే సుతీక్ష్ణుడు అనేముని వద్దకు వెళ్ళు ఆయనే నీకు అందమైన వనప్రదేశంలో వసతి ఏర్పాటు చేయగలడు అని పలికి హోమము చేసి అగ్నిలో ప్రవేశించాడు శరభంగుడు.

.

అగ్నికి ఆహుతి అయిపోయంది ఆయన శరీరం అప్పుడు ఆ కుండమునుండి ఆయన దివ్యశరీరము ఊర్ధ్వలోకాలవైపు సాగిపోయి బ్రహ్మలోకంలో ప్రవేశించింది.

.

ఆ ఆశ్రమ వాటికలో ఉన్న మునులంతా రాముని చుట్టూ చేరారు.

.

NB 

శరభంగుడితో ఇంద్రుడు ఒక విషయం చర్చించాడు.అది రాముని గురించిన రహస్యము .ముందు ముందు వస్తుంది.

ఆదిపర్వము-40

 

వశిష్టుడు, కల్మాషపాదుని వృత్తాంతం


అప్పుడు అర్జునుడు అంగారపర్ణుని చూసి “గంధర్వా, మా పూర్వులకు గురువులు, పురోహితులు అయిన వశిష్టుని గురించి వినాలని ఉంది” అని అడిగాడు. అప్పుడు అంగారపర్ణుడు, అర్జునునితో ఇలా చెప్పసాగాడు.

పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఒక రోజు తన సేనలతో వేటకు వెళ్ళాడు. వేటాడి అలసిపోయి సమీపములో ఉన్న వశిష్ట మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. వసిష్టుడు విశ్యామిత్ర మహారాజుకు అథితి సత్కారాలు గావించాడు. వశిష్టుని వద్ద నందిని అని ఒక కామధేనువు ఉంది. విశ్వాంత్రునికి, అతని అపార సేనావాహినికి భోజన సత్కారాలు చెయ్యమని నందినికి చెప్పాడు. నందిని వారందరికి ఇష్టమైన వంటకాలతో భోజనం పెట్టింది. ఇది చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు.

లక్ష పాడి ఆవులు ఇస్తాను ఆ కామధేనువును ఇమ్మని వశిష్టుని అడిగడు విశ్వామిత్రుడు. వసిష్టుడు దానికి నిరాకరించాడు. బలవంతంగా ఆ ధేనువు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు. నందిని వశిష్టుని వైపు చూసింది. వసిష్టుడు మౌనంగా చూస్తున్నాడు.

నందిని విజృంభించింది, తన శరీరం నుండి అనేక మంది సైన్యాలను పుట్టించింది. వారందరూ విశ్వామిత్రుని సైన్యాలను చీల్చి చెండాడారు.

విశ్వామిత్రునికి జ్ఞానోదయం అయింది. క్షాత్రబలం కన్నా తపోబలం గొప్పది అని తెలుసుకున్నాడు. రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోయాడు. దివ్య శక్తులను పొందాడు. కాని వశిష్టుని మీద మత్సరం మానలేదు.

వశిష్టుడు కల్మాష పాదుడు అనే మహారాజుకు యాజకుడు(యజ్ఞములు చేయించే పురొహితుడు)గా ఉంటున్నాడు. కల్మాష పాదునకు యాజకుడు కావాలని విశ్వామిత్రుడు కూడా ప్రయత్నిస్తున్నాడు.

ఒకరోజు కల్మాషపాదుడు వేటకు వెళ్ళాడు. అలసిపోయి సమీపములో ఉన్న వశిష్టుని ఆశ్రమానికి వెళుతున్నాడు. దారిలో వశిష్టుని నూర్గురు కుమారులలో పెద్ద వాడైన శక్తి ఎదురుగా వస్తున్నాడు. కల్మాష పాదుడు గర్వంతో శక్తిని తప్పుకొని తనకి దారి ఇవ్వమన్నాడు.

“రాజా, ఎంతటి గొప్ప వారైనా, బ్రాహ్మణులు ఎదురుగా వచ్చినపుడు తప్పుకొని దారి ఇస్తారు. ఇది ధర్మం” అని అన్నడు. ఆ మాటలకు కోపంచి, కల్మాష పాదుడు తన చేతికర్రతో శక్తిని కొట్టాడు.

శక్తికి కోపం వచ్చి “నన్ను రాక్షస బుధ్ధితో అవమానించావు. నువ్వు రాక్షసుడివై నరమాంసం తింటూ జీవించు” అని శాపం ఇచ్చాడు.అప్పుడు కళ్లు తెరిచాడు కల్మాష పాదుడు. అతనిని వశిష్టుని పెద్ద కుమారుడిగా గుర్తించి, శాప విమోచన కొరకు ప్రార్థించాడు.

ఇదంతా దూరం నుండి చూస్తున్న విశ్వామిత్రుడు, కల్మాష పాదుని మనసులోకి కింకరుడు అనే రాక్షసుని ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి కల్మాష పాదుడు రాచ కార్యాలు మానివేసాడు.

ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కల్మాష పాదుని వద్దకు వచ్చాడు. తనకు మాంసాహార భోజనం కావాలని అడిగాడు. సరే అని వెళ్లాడు కాని మరిచిపోయాడు. రాత్రి పొద్దు పోయిన తరువాత ఆ విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే వంట వాడిని పిలిచి “నేను ఒక బ్రాహ్మణుడికి మాంసాహార భోజనం పెడతాను అని చెప్పాను. అతనికి భోజనం పెట్టు” అని చెప్పాడు.

దానికి వంట వాడు “మహారాజా, ఈ రాత్రప్పుడు మాంసం ఎక్కడ దొరుకుతుంది?” అని అన్నాడు. అప్పటికే కింకరుడు కల్మాష పాదుని మనసులో ఆవేశించి ఉండటం వల్ల “నీ ఇష్టం. నర మాంసమైనా వండించు పెట్టు” అని అన్నాడు.


సరే అని వంటవాడు ఆ బ్రాహ్మణుడికి నరమాంసం రుచిగా వండి పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు దానిని తిన్నాడు. కాని తాను తిన్నది నరమాంసం అని గ్రహించాడు. ఆ బ్రాహ్మణునికి కోపం వచ్చి, “నర మాంసంతో నాకు భోజనం పెట్టావు కాబట్టి నువ్వు నరమాంసం తినే రాక్షసుడివై పో” అని శాపం పెట్టాడు. వెంటనే కల్మాష పాదుడు రాక్షసుడిగా మారిపోయాడు.

కల్మాష పాదుడు వెంటనే శక్తి వద్దకు వెళ్లి “దీనికంతా నువ్వే కారణం ముందు నిన్నే తింటాను” అని శక్తిని చంపి తిన్నాడు. అంతటితో ఆగకుండా వశిష్టుని పుత్రులందరిని చంపి తిన్నాడు.

తన నూర్గురు పుత్రులూ రాక్షసునికి ఆహారం కావడం చూసి వశిష్టుడు తట్టుకోలేక పోయాడు. పుత్ర శోకంతో కుమిలి పోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని ఎంతో ప్రయత్నించాడూఉ. కాని సఫలం కాలేదు.

ఇదంతా శక్తి భార్య, వశిష్టుని కోడలు, అదృశ్యంతి చూస్తూ ఉంది. అప్పుడు ఆమె గర్భవతి. ఆమె కడుపులో ఉన్న బిడ్డ వేద్దాలు సుస్వరంతో వల్లె వేస్తున్నాడు. అది విని వశిష్టుడు ఆశ్చర్యపోయాడు. తన మనుమడిని చూడాలని అనుకున్నాడు. ఆత్మహత్యా యత్నం విరమించాడు.

ఒకరోజు రాక్షస రూపంలో ఉన్న కల్మాష పాదుడు అదృశ్యంతి మీద పడి చంపపోయాడు. వశిష్టుడు మంత్ర జలం చల్లాడు. కల్మాష పాదుడు శాప విముక్తుడు అయ్యాడు. కల్మాష పాదుడు వశిష్టునకు నమస్కరించి “మహామునీ నీ దయవల్ల నాకు శాప విమోచనం అయింది” అన్నాడు.

“బ్రాహ్మణులను అవమానితే వచ్చే అనర్థాలు చూసావు కదా. ఇంకనైనా బ్రాహ్మణులను పూజించు” అని హితభోధ చేసాడు. వశిష్టుని ఆశీర్వాదము తీసుకొని కల్మాష పాదుడు అయోధ్యా నగరానికి వెళ్లి రాజ్యం చేస్తున్నాడు.


కాని రాక్షస రూపంలో ఉన్నపుడు కల్మాష పాదుడు, ఒకనాడు, ఒక బ్రాహ్మణ దంపతులు కామ క్రీడలలో ఉండగా, ఆ బ్రాహ్మణుడిని చంపి తిన్నాడు. దానికి కోపించి ఆ బ్రాహ్మణ వనిత “స్త్రీతో సంభోగం చేసినపుడు నువ్వు కూడా నా భర్త మాదిరి చస్తావు” అని శపించింది. అందువలన కల్మాష పాదుడు భార్యతో కలిసి సంతానం పొందలేకపోయాడు.

సంతానం కావాలనే కోరిక అధికం కావడంతో, వశిష్టుని తనకు సంతానం ప్రసాదించమని కోరాడు. వశిష్టుడు అలాగె అన్నాడు. కల్మాష పాదుడు ఋతుస్నానం చేసిన తన భార్య మదయంతిని వశిష్టుని వద్దకు పంపాడు. అతని అనుగ్రహంతో మదయంతి గర్భం దాల్చింది. పన్నెండేఅళ్లు గడిచాయి. కాని ఎంతకూ ప్రసవం కాలేదు. అందుకని ఒక పదునైన రాతి ముక్కతో తన గర్భం చీల్చుకుంది. ఆమెకు అశ్మకుడు అనే రాజర్షి జన్మించాడు.

అదే సమయానికి వశిష్టుని పెద్ద కుమారుడైన శక్తి భార్య అదృశ్యంతికి కూడా ఒక పుత్రుడు కలిగాడు. అతనే పరాశరుడు. పరాశరుడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. తన తంద్రి శక్తిని ఒక రాక్షసుడు చంపాడని తన తల్లి వలన తెలుసుకున్నడు. తన తపో మహిమతో లోకాలన్నీ భస్మం చెస్తానని శపథం చేసాడు. అది విని వశిష్టుడు అతనిని వారించాడు.Cont...

“పరాశరా, అది ధర్మము కాదు. పూర్వం కృతవీర్యుడు అనే మహారాజు భృగువంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా చేసుకుని ఎన్నో యజ్ఞాలను, యాగాలను చేసారు. కృతవీర్యుడు వారికి మిక్కుటమైన ధనాన్ని ఇచ్చాడు. దానిని వారు దాచుకున్నారు. తరువాతి కాలంలో కొంత మంది క్షతియులు “భృగువంశ బ్రాహ్మణులు కృతవీర్యుయుని ధనాన్ని అపహరించి దాచుకున్నారు” అని అపప్రధ పుట్టించారు.

అదివిని కొంతమంది బ్రాహ్మణులు తమ వద్ద ఉన్న ధనాన్ని ఆ క్షత్రియులకు ఇచ్చారు. మరికొంతమంది బ్రాహ్మణులు ఆ ధనాన్ని భూమిలో పాతిపెట్టారు. క్షత్రియులు ఇది చూసి, ఆ బ్రాహ్మణులను చంపి ఆ ధనం తీసుకుని వెళ్లారు. భృగువంశ బ్రాహ్మణులనందరిని, గర్భంలో ఉన్న బిడ్డలతో సహ చంపారు. ఆడు వారందరూ వీరికి భయపడి హిమాలయాలకు వెళ్లిపోయారు.

అందులో ఒక బ్రాహ్మణుని భార్య తన తొడలో గర్భం ధరించింది. ఆమె తొడలో నుండి ఔర్వుడు అనే అత్యంత తేజోవంతుడైన కుమారుడు జన్మించాడు. అతని తేజస్సుకు, కృతవీర్యుని వంశంలోని క్షత్రియులందరు దృష్టి కోల్పోయి గుడ్డి వాళ్లయ్యారు.

తరువాత ఔర్వుడు తన తండ్రి, మిగిలిన బంధువులు ఒక్కసారి చనిపోయారని తెలుసుకొని, లోకాలన్నింటిని నాశనం చెయ్యాలని సంకల్పించి, ఘోర తపస్సు చెయ్య సంకల్పించాడు. అతని పిత్దేవతలు ఔర్వుని చూసి “మేము అసమర్థులమై క్షత్రియులచేత చంపబడ లేదు. మేము ధనమునకు ఆశపడి ధనమును దాచలేదు. మేము ఎంతో తపస్సు చేసాము. మా తపో మహిమ వలన మాకు మరణం రావడం లేదు. ఆత్మహత్య చేసుకుందామంటే అది పాపము అని తెలుసు. ఈ మనుష్య లోకంలో ఎక్కువ కాలము ఉండలేము. అందువలన మేము కావాలనే క్షత్రియులతో వైరం తెచ్చుకుని వారి చేతిలో చంపబడ్డాము.కాబట్టి ఆ కారణం చేత నువ్వు లోకాలను నాశనం చెయ్యడం ధర్మం కాదు” అని పలికారు.

వారి మాటలు విని, ఔర్వుడు సంకల్పం విరమించుకున్నాడు. కాబట్టి పరాశరా! కోపంతో నువ్వు చెయ్యబోయె తపస్సు మంచిది కాదు. కనుక శాంతం వహించు” అని చెప్పాడు. వశిష్టుడు. తాతగారి మాటను మన్నించి, ఆ సంకల్పం విరమించుకున్నాడు పరాశరుడు.

కాని తన తండ్రి శక్తిని, పిన తండ్రులను చంపిన రాక్షసుడి మీద కోపం పోలేదు. రాక్షసవినాశనానికి సత్రయాగం చెయ్యడానికి సంకల్పించాడు. దానికి వశిష్టుడు కూడా అడ్డు చెప్పలేదు. ఆ సత్రయాగంలో దుర్మార్గులైన రాక్షసులందరూ పడి మల మలా మాడిపోతున్నారు.

అలా రాక్షస జాతి అంతరిస్తుంటే చూసి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు వశిష్టుని దగ్గరకు వచ్చారు. పరాశరుడు చేసే రాక్షస వినాశనాన్ని ఆపమని కోరారు. వారి కోరిక మేరకు పరాశరుడు తన సత్రయాగాన్ని, రాక్షస వినాశనాన్ని ఆపుచేసాడు.” అని అంగార పర్ణుడు అనే గంధర్వుడు అర్జునునితో చెప్పాడు.

తరువాత అర్జునుడు ఆ గంధర్వుని చూసి, “మిత్రమా, ఇక్కడ మాకు ఎవ్వరూ తెలియదు. నువ్వే మాకు దారి చూపించాలి. మంచి పురోహితుడు ఎవరో చెప్పాలి” అని అడిగాడు.

“అర్జునా, ఇక్కడికి సమీపంలో ఉత్కంచం అనే పుణ్యతీర్థం ఉంది. అక్కడ ధౌమ్యుడు అనే బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటున్నాడు. మీరు అతనిని పురోహితునిగా చేసుకోండి” అని చెప్పాడు

కోరికలు

 **


"గురువుగారు….దేవుడ్ని అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా.. అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా?" 


"అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలీదు కానీ ఒక కథ చెప్తా విను"  


ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి

ప్రసన్నంగా నవ్వుతూ "తథాస్తు" అన్నాడు. 


శిష్యుడు గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు. 


" ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను." 


"ఏమిటా కోరిక గురువు గారూ" 


"తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని." 


"వచ్చే జన్మలోనా" 


"కాదు ఈ జన్మలోనే" 


శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "


" అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా" 


" అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది"


" ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు."


ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. 


శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.

**

సంవత్సరం తరువాత. 


శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ.. ఈ వింత

విన్నారా….శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!" 


గురువు గారు నవ్వి, "చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. అయింది కదా.." 


"అంటే.." 


అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో

ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలు గా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. 


శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, 

భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి.

ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది." అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం 

చేశాడు శిష్యుడు. 


భగవంతుడి లీలలు 🙏🏼

“శ్రీ” కారం

 శ్రీ 🌹🌹


ఏదైనా రాసేటప్పుడు పేపరుపైన “శ్రీ” కారం రాస్తారెందుకు?

“శ్రీ” లక్ష్మీ ప్రదమైనది. మంగళకరమైనది మరియు మోక్ష దాయకమైనది. “శ్రీ” కారమున “శవర్ణ”, “రేఫ”, “ఈ” కారములు చేరి, “శ్రీ” అయినది. అందు “శవర్ణ” , “ఈ” కారములకు, “లక్ష్మీ దేవి” ఆధిదేవత, “రేపము” నకు, అగ్ని దేవుడు దేవత.


“శ్రియ మిచ్దేద్దు తాశనాత్!” అను పురాణ వచనానుసారముగా “అగ్నీ లక్ష్మీ ప్రదుడే, శుభకరుడే. ఈ ఇధంగా “శ్రీ” లోగ మూడు వర్ణములకు శుభదేవతలే కారకులు.


మరియు, “శ” వర్ణమునకు గ్రహము “గురుడు”, “రేఫ “ఈ” కరములకు గ్రహములు “గురుడు”, “శుక్రుడు” గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున “శ్రీ” శుభాన్ని సూచిస్తుంది. శుభాన్ని కోరుతుంది.


నిఘంటువులో, “కమలా శ్రీర్హరి ప్రియా” అని ఉండటంతో, లక్ష్మీ నామలలో “శ్రీ” ఒకటి అని తెలియుచున్నది. కావున శుభకరమైంది.


ఇన్ని విధాలుగా “శ్రీ” సర్వశ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యానికి, “శ్రీ” కారం తలమానికమై వెలుగొందుచున్నది. “శ్రీ” శుభసూచికయేకాదు, గౌరవప్రదమైనది కూడా. ఏ ప్రాంతమందైననూ, ఏ భాషయందైననూ, “శ్రీ” అను పదము గౌరవ సూచకముగా, శుభసూచకముగా వాడుతుంటారు.

🙏🙏

అమరలింగేశ్వర స్వామి*

 పరమ శివుడు కొలువైన పంచారామ క్షేత్రాలు శ్రీ అమరలింగేశ్వర స్వామి*


(అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం) దివ్య క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నాయి. వీటిని స్వయంభూ క్షేత్రాలని, దేవతా నిర్మిత క్షేత్రాలని, ఋషి కల్పితమైన క్షేత్రాలని, మానవ ప్రతిష్టితమైన క్షేత్రాలని నాలుగు విధాలుగా విభజించారు. పంచారామ క్షేత్ర దర్శనం భక్తి, ముక్తి ప్రదమైనదని చెబుతారు.


పంచారామాలలో మొదటిది ‘అమరారామం’. ఇది అమరావతిలో నిర్మితమైంది. ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం దేవరాజైన ఇంద్రుని ప్రతిష్ఠను తెలుపుతుంది. ఇక్కడ స్వామి ముఖం ‘అఘోర’ రూపంలో ఉంటుంది. అమ్మవారు ‘బాల చాముండేశ్వరి’. ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలవై ఉన్నారు.


రెండోది ‘ద్రాక్షారామం’. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ భక్తులు శివుణ్ణి భీమేశ్వరుడిగా కొలుస్తున్నారు. అమ్మవారు మాణిక్యాంబ.


మూడోది ‘కుమారారామం’. ఈ క్షేత్రం సామర్లకోటలో ఉంది. ఇక్కడ శివుణ్ణి సత్య సుందర స్వరూపంలో కుమారస్వామి ప్రతిష్టించాడు. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా వాసికెక్కారు.


నాలుగో ఆరామం ‘సోమారామం’. ఈ క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా గునుపుండి (భీమవరం) లో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా నిత్య పూజ లందుకుంటున్నాడు. ఇక్కడ శివపత్ని పార్వతీదేవిని భక్తులు నిత్య నూతనంగా కొలుస్తున్నారు. చంద్ర ప్రతిష్ఠితమైన శైవక్షేత్రం ఇది.


ఐదో ఆరామం ‘క్షీరారామం’ (పాలకొల్లు). ఇక్కడ కొలువైన స్వామి రామలింగేశ్వరుడు. అమ్మ పార్వతీ మాత. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టితమై ఈశాన్య ముఖుడిగా లోకమంతా తానే అయి విలసిల్లుతున్నాడు.


పంచారామాలన్ని ఒకే రోజులో సందర్శించాలను కుంటే అమరావతితో ప్రారంభించి భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలను క్రమంగా దర్శించుకోవలసి ఉంటుంది. ఈ క్షేత్రాలు దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని, అఖండ ఫలితంతో పాటు, కాశీ క్షేత్ర దర్శనం వలన కలిగే పుణ్యం కూడా లభిస్తుందని పెద్దలంటారు.


*1. అమరారామం*


శంకరుడులో ‘శం’ అంటే శుభాన్ని, ‘కరుడు’ అంటే కలిగించే వాడనే అర్థం దాగుంది. స్థల పురాణం ప్రకారం తారకాసుర సంహారం జరిగినప్పుడు కుమారస్వామి తారకుని కంఠంలో ఉన్న శివలింగాన్ని చేధించగా ఏర్పడిన అయిదు శకలాల్లో (ముక్కలు) పెద్దది, మొదటి శకలం పడిన చోటు ఈ అమరారామం. ఈ అమరావతి పూర్వ నామం ‘ధాన్య కటకం’.


కృష్ణా నదీ తీరంలో వెలసిన మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో అమరేశ్వర లింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్టించాడు. అందువల్లే ఇక్కడి శివయ్య అమరేశ్వరుడయ్యాడు. ఈ క్షేత్ర మహత్యం గురించి స్కంధ, బ్రహ్మ, పద్మ పురాణాలలో చెప్పారు. ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్థంభాలున్నాయి. దక్షిణ ముఖంగా ముఖ మండపం, తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణవేణి ప్రవాహం ఉంది. దీనినే ‘పంచాయతన క్షేత్రం’ అంటారు. దీనికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. మూల విరాట్‌ శ్రీ అమరలింగేశ్వర స్వామి. ఈయన మూడు అడుగుల ఎత్తులో లింగాకారుడై కొలువు తీరాడు. పై అంతస్తులో తొమ్మిది అడుగుల ఎత్తైన లింగం ఉంది. అమరావతి క్షేత్రం నుంచి కృష్ణానది ఎనిమిది వందల మైళ్ళు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది.


కృష్ణానదీ తీరానికి దగ్గరున్న ఈ అమరావతి క్షేత్రంలో స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకునే భక్తులు జీవన ముక్తులవుతారని పురాణాలలో చెప్పారు. త్రిలోక ప్రసిద్ధమైన ఈ అమరేశ్వర తీర్థం ఉత్తమమైంది. అమరేశ్వరస్వామిని దర్శించడం వలన వేయి గోవులను దానమిచ్చిన ఫలితంతో పాటు, పునర్జన్మ ఉండదని పురాణ ప్రవచనం. ఇక్కడ శివుణ్ణి ప్రణవేశ్వరుడు, అగస్తేశ్వరుడు, కోసలేశ్వరుడు, సోమేశ్వరుడు, పార్థివేశ్వరుడు అనే నామాలతో కీర్తిస్తున్నారు. ఈ క్షేత్రంలో మూడు రోజులు ఉండి అమరేశ్వరున్ని భక్తితో సేవించినట్లయితే మంచి జరుగుతుందని శివ భక్తులు నమ్ముతారు.


శివుడు వెలసిన ఈ పంచారామ క్షేత్రాలను మీరూ దర్శించి తరించండి. 

వదనస్మరమాంగల్య

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 18 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


‘వదనస్మరమాంగల్య గృహతోరణచిల్లికా’ 


లలితాసహస్రనామ స్తోత్రములో ఉన్న ప్రతి నామము పవిత్రము. మనిషి పుట్టినదాదిగా జీవితాంతము నీడ ఎలా వెంటాడుతుందో అలా వెంటాడి సమస్త అజ్ఞానమునకు ఆలవాలమై, మనిషిని ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యనివ్వకుండా నాలుగు మెట్లు పైకి ఎక్కితే ఇరవై మెట్లు కిందకు దిగజార్చే దానిని శాస్త్రము ‘భయం’ అని పిలిచింది. ఎప్పుడూ నేను ఏమైపోతానో అనే భావన భయానికి కారణము. అలా బెంగ పెట్టుకున్నవాళ్ళు ఉండిపోలేదు. నాకేమీ అవదు అనుకున్న వాళ్ళుకూడా ఉండిపోలేదు. వెళ్ళిపోవడమన్నది నిజమయిన తరవాత ఇంక ఆ శరీరముతో, దానితో సంబంధము ఉన్న ఏ వస్తువుతో సంబంధము లేదు. ఎంత భయపడినా, భయము లేకుండా ఉన్నా శరీరము ఉండదు. ఎంత విన్నా, ఎన్ని చదివినా భయము వెంబడిస్తూనే ఉంటుంది. 


ప్రధానముగా రెండుకారణములు మనిషిని వెంటాడుతూ ఉంటాయి. ఉన్నది ఉండకుండా పోతుందేమో అని ఒక కారణము. నావి అనుకున్నవి నాకు కాకుండా పోతాయేమో అని ఒక కారణము. నిజానికి బెంగ పెట్టుకోకపోతే ఇంకా కొద్దికాలము శరీరము ఉంటుందేమో ఎంత బెంగ పెట్టుకుంటే అంత తొందరగా వెళ్ళిపోతుంది. ఇటువంటి భయమును తొలగించడానికి ఏదైనా ఉన్నదా అంటే అమ్మవారి రూపము ఇందుకే వచ్చిందని శాస్త్రము చెప్పింది. రూపము లేని అమ్మవారు రూపమును దాల్చింది. ఆ రూపమును బట్టి నామములు. జీవితములో ఏదో ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంటే దానిని తొలగించుకోవడానికి ఆ అవయవమును ధ్యానము చేస్తే ఫలితమును పొందుతారు. ఆవిడ ప్రత్యేకమైన అవయవ దర్శనము ఇబ్బంది ఉన్నదానిని తొలగించి కాపాడుతుంది. ఒక్కక్క అవయవమునకు ఒక్కక్క ఫలితము ఉంటుంది. భయం ఏ ఒక్కరికో ఉండేది కాదు. సాధారణముగా అందరికీ ఉంటుంది.   


ఈ నామములో మన్మధునికి చాలాకాలానికి మంచి ఇల్లు దొరికింది అన్నారు. ఇల్లు భయాన్ని పోగొడుతుంది. ఎవరైనా అమ్మయ్య ఇంటికి వచ్చేసామని అనుకుంటూ ఉంటారు. మనసిజుడు, పుష్పబాణుడు, అనంగుడు ఇలా ఎన్నో పేర్లుకల మన్మధుని ఇక్కడ స్మరుడు అన్నారు. స్మరుడు అందరిలో కోరికలు పెంచుతూ భయం కల్పిస్తున్నాడు. అటువంటి ఆయనకు భయం లేకుండా చేయకలిగిన ఇల్లు కావలసి వచ్చింది. ఆయనకు ఎందుకు భయం అనగా ఎవరితో తగువు పెట్టుకుంటే మనశ్శాంతి ఉండదో అటువంటి వారితో తగువు పెట్టుకున్నాడు. మనశ్శాంతికి హేతువైన దానితో తగువు పెట్టుకుంటే అశాంతికి లోనవుతారు. దోషం అని తెలిసి మరీ మన్మధుడు తన పరిధిని అతిక్రమించాడు. ఇంద్రుడి మెప్పుదల కోసము పరమశివుని మీద బాణము వేసాడు. శివుడు మూడవకన్ను తెరిచి కాల్చేస్తే బూది అయిపోయాడు. ఆయన ఒక్కడే బూది అవలేదు. తాను తోడు తెచ్చుకున్నకోయిలలు, కలహంసలు, పుష్ప బాణములు, తుమ్మెదలు తన పరివారము మొత్తముతో బూదిగా మారిపోయాడు. అన్ని జాతులు తామరతంపరగా పెరగాలి అంటే మన్మధుడు బాణములు వెయ్యాలి. పుష్పబాణములు వెయ్యకపోతే సృష్టి ఆగిపోతుంది. అంతర్లీనముగా ఆనందము ఉన్న ప్రజోత్పత్తి, సృష్టి ఆగిపోతుంది. ప్రకృతిని కాపాడే కారుణ్యము ఉన్న అమ్మవారు ముందుకు వచ్చి మన్మధుని పునర్జీవితుని చేసింది. మన్మధుడు మనసుని మధించేవాడు. రతి అంటే అనుభవము. ఎవరి కోరిక వారియొక్క అనుభవములో తెలుస్తుంది. రతీదేవికి ఒక్కదానికి మాత్రము కనపడతాడని అనడములోని రహస్యము. ప్రకృతిని కాపాడే కారుణ్యము ఉన్న అమ్మవారు ముందుకువచ్చి మన్మధుని పునర్జీవితుని చేసి ఇకనుంచి నువ్వు అనంగుడివై రతికి మాత్రమే కనపడతావు. పూర్వము ఏమిచేసావో అదే చేస్తూ ఉండమన్నది. ఒకసారి బాణము వేసి దెబ్బతిని ఉన్నవాడు ఎక్కడ, ఎవరి మీద బాణము వేస్తాడు? శివుడు సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు. ఒకసారి దెబ్బతిని ఉన్న మన్మధునికి భయము పట్టుకున్నది. ఒక భద్రమైన గృహము ఎంచుకోవాలి అనుకుంటే అమ్మవారి ముఖమే ఇల్లుగా దొరికింది. 


కాముడు కాలిపోయిన తరవాత ఆమె మహాకామేశ్వరునికి ఇల్లాలు అయింది. కాముడు లేకపోయినా భార్య కాగలిగినది అంటే ఆ విల్లు బాణములు తాను పట్టుకున్నది. శివకామ సుందరి అయి పరమ జ్ఞాని అయిన శివుని సాకారుని చేసి తన పక్కన కూర్చోపెట్టుకున్నది. ఆవిడ ముఖము చూసేసరికి శివుడు సంతోషమును పొందుతాడు. మన్మధునికి చాలా భద్రమైనది అమ్మవారి ముఖము. అందులో వెళ్ళి కూర్చున్నాడు. రోజూ బాణములు వెయ్యాలి మళ్ళీ పరమశివుడు ఎక్కడ మూడో కన్ను తెరుస్తాడో అన్న భయము. ఎప్పుడూ ఇంటికి తోరణము ఉండాలనుకున్నాడు. ఇంట్లో శుభకార్యము జరుగుతుంటే లక్ష్మికమ్మికి మంగళతోరణము ఉంటుంది. మన్మధుడు తన ఇంటికి మంగళప్రద స్థానములైన అమ్మవారి కనుబొమలను మంగళతోరణముగా కట్టుకున్నాడు భయం పోయింది. వాటిశక్తి వలన ఆయన ఇంటికి అమంగళము లేదు. ఈ నామము స్మరుడి పాలిట మంగళప్రదమైన గృహముగా అమ్మవారి ముఖమై ఆమె కనుబొమలు ఆ ఇంటికి మంగళతోరణములని చెప్పడము. ఏ కోణములో చూసినా అమ్మవారి కనుబొమలు భయమును పోగొట్టకలిగిన శక్తికేంద్రములు.


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

ముఖచన్ద్రకళంకాభమృగనాభివిశేషికా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 17 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


‘ముఖచన్ద్రకళంకాభమృగనాభివిశేషికా’


ఈ నామములో అమ్మవారు మృగనాభితో పెట్టుకునే బొట్టు గురించి చెపుతున్నారు. కస్తూరిమృగము నాభి దగ్గరనుంచి ఊరిన ద్రవము కనక మృగనాభి అని పేరు. అ సువాసన దానిదే అని కస్తూరిమృగమునకు తెలియదు. అమ్మవారి ముఖములో బొట్టు చంద్రబింబములోని మచ్చలా చాలా సహజముగా ఉంటుంది. బొట్టు కనుబొమల మధ్యలో ఆజ్ఞా చక్రము మీద పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకుంటే ఆజ్ఞాచక్రమునకు రక్షణ కలుగుతుంది. మనిషి ఆలోచనలు ఆజ్ఞాచక్రము మీదే ఉంటాయి. ఆజ్ఞాచక్రము బొట్టు చేత ఆచ్ఛాదన చేయబడితే దృష్టి దోషము ఉండదు. కొన్ని వేలమంది దృష్టి ఒక్కముఖము మీద నిలబడుతుంటే ఆ వ్యక్తికి ఉపాసన చేత కలిగిన ధృతి క్షీణిస్తుంది. ఈ ధృతి క్షీణించకుండా ఉండాలి అంటే ఆజ్ఞాచక్రం మీద అమ్మవారి రక్ష పెట్టుకుంటే దృష్టి దోషము విరిగిపోతుంది. లలాటము మీద మూడు విభూతి రేఖలు ఉండటము వలన ఈశ్వరరక్ష కలుగుతుందన్నది అన్నిటికంటే గొప్ప విషయము.  

హరినాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి |

లలాట లిఖితా రేఖా పరిమాస్తు న శక్యతే ||

లలాటము మీద వ్రాసిన గీత మారదు. ప్రతిరోజూ విభూతి చేత ఆచ్ఛాదింపబడి బొట్టు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహము వలన సరైన నిర్ణయాలు తీసుకుని మంచివైపు నడవడము జరుగుతుంది. బొట్టు లేకపోతే అశౌచముతో ఉన్నారని గుర్తు. బొట్టు సువాసినీత్వమునకు సూచన. ఎప్పుడూ బొట్టుతో కనపడుతూ ఉండాలి. సుగంధ భరితములైన వాటితో చేసిన బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఒక ఇంటి యొక్కమంగళము అంతా స్త్రీయొక్క బొట్టులోనే ఉన్నది. బొట్టు పెట్టుకున్న లలాటము ఆ కుటుంబవృద్ధికి సూచన. ప్రతి ఇల్లాలు తనభర్త పక్కన లక్ష్మీప్రదయై ఇంటిని నిర్వహించగలిగిన శక్తి సువాసినీత్వమునకు గుర్తయిన బొట్టులోనుంచి వస్తున్నది. ఈ బొట్టు లోనికి శక్తి అమ్మవారి బొట్టునుంచి వస్తున్నది. స్త్రీ ఎక్కడకయినా వెడితే ‘ఉండమ్మా బొట్టు పెడతా’ అంటారు. ఆ బొట్టు అంత పరమపవిత్రం. అమ్మవారి బొట్టులో నుంచి ఇన్ని బొట్టులు ప్రకాశిస్తున్నాయని, దానిని చూస్తున్న వారు అద్భుతమైన శక్తిని పొందుతారని, ఆ బొట్టు దర్శనము చేత సర్వమంగళములు పొందుతారని వేదము చెప్పిన దానిని నమ్మాలి. 

https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?

 [05/10, 7:13 am] +91 93913 24915: సత్పురుషుల సాంగత్యం


🍁🍁🍁🍁


‘సత్పురుషుడు ఎక్కడ ఉంటాడో ఆ ప్రదేశం ఇతర విషయాల్లో ఎలాంటిదైనా స్వర్గం కంటే అధికమైన దవుతుంది. అది జ్ఞానవంతులకు నివాసయోగ్యం.


 "సత్పురుషుడు, వృక్షము లేని చోటు.. సర్వవస్తు సమృద్ధమైనా అది మరుభూమి (శ్మశానం)తో సమానం’’అని జ్ఞానవాసిష్ఠ బోధ. జీవితంపై సందేహ, సంకటాలు కలిగినవారు మహాత్ములైన సజ్జనుల చెంత చేరాలి.


 

దుఃఖితులైన వారికి సత్పురుషులు.. ధైర్యాన్ని, దైవాలంబనోపాయాన్ని బోధిస్తారు. ధర్మ, తత్వ రహస్యాలను తెలియపరచి శాంతహృదయులు చేస్తారు.



ఇంతకీ సజ్జనులంటే, సత్పురుషులంటే ఎవరు ? అంతర్యామియైున భగవంతుని కనుగొనడానికి ప్రయత్నించే సాధనాపరులే సజ్జనులు, సత్పురుషులు. సజ్జనులైన మానవులు మానవ ధర్మ సారాన్ని ఎరిగి ఉంటారు. వారికి చిత్త చలనం ఉండదు. తాపత్రయాలను పొందరు. ఎన్ని కష్టాలు వచ్చినా.. పర్వతం వలె చలించక స్థిరచిత్తులై ఉంటారు.

 

మనస్సునందున్న మాలిన్యాన్ని దైవనియమ సాధనలచే పోగొట్టుకొని స్థిరమతితో యత్నించిన మానవులు పరమేశ్వరుని కనుగొనగలుగుతారు. ఆత్మవేత్తలైనవారు దేని మీదా ఇచ్ఛ లేనివారై ఉంటారు. ఆత్మదర్శనం చేతనే తృప్తి చెంది ఉంటారు. అటువంటి వారి దర్శనం లభించినవారే ధన్యులు.


 పద్మాకరం దినకరో వికచం కరోతి

చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్‌

నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి

సంతః స్వయం పరహితే విహితాభియోగాః’’


 తామరలు ప్రార్థించకుండానే సూర్యుడు పద్మాలను వికసింపజేస్తున్నాడు. కలువలు అడగకుండానే చంద్రుడు వాటిని వికసింపజేస్తున్నాడు. అడగకుండానే మేఘుడు వర్షోదకధారలు కురిపించి జీవనదానం చేస్తున్నాడు. ఇలా సత్పురుషులు తమంత తామే పరహితాసక్తులై ఉంటారని.. ఎవరూ అడగకుండానే సాయం చేస్తారని భర్తృహరి చెప్పాడు.



ఆత్మోద్ధరణకు ధనం, స్నేహితులు, శాస్త్రాలు, బంధువులు చేయగలిగిన ఉపకారమేదీ లేదు. ఆ విషయంలో సహాయం చేయగలిగినది సత్పురుషులే ! సత్పురుష సమాగమమనే చక్కని నావలో సంసారం నుంచి ముక్తిని పొందడమే ఉత్తమ మార్గం.


 సత్పురుషుల తోడి సాంగత్యం పూర్వపుణ్య వశానే లభిస్తుంది. అది గంగలా పాపాలను పోగొడుతుంది. వెన్నెలలా అందరి మనస్సులకూ ఆనందం కలిగిస్తుంది. సూర్యుని ప్రభలవలె అజ్ఞానాంధకారాన్ని నిర్మూలిస్తుంది. చల్లని చెట్టు నీడవలె తాపమును పోగొడుతుంది. బహుదుర్లభమైన సజ్జన సాంగత్యం వల్లనే పాప, తాప, దైన్యాలు నశిస్తాయి



 🌸జై శ్రీమన్నారాయణ🌸

[05/10, 7:13 am] +91 93913 24915: *ఇది చదవండి చాలా బాగుంటది good message*


మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ...  ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!! 


మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు .


🌷 *1* . *తల్లి* 


మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...  👩‍🦱తల్లి మొదటి అద్భుతం. 


🌷 *2* . *తండ్రి* 


మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు  

మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు 

దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ..😎 సంతోషాన్ని  మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం. 


🌷 *3* . *తోడబుట్టిన*  *వాళ్ళు* 


మన తప్పులను వెనుకెసుకురావాడానికి...  

మనతో పోట్లాడడానికి...  మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... 

తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం 😥🥴☺


🌷 *4* . *స్నేహితులు*  


మన భావాలను పంచుకోడానికి..  

మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...

ఏది ఆశించకుండా..  మనకు దొరికిన స్నేహితులు  నాలుగో  అద్భుతం. 🌚🌝👨‍✈️🕺


 *🌷5* . *భార్య* / *భర్త* 


ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా  చేస్తుంది 

కలకాలం తోడు ఉంటూ...🌛 ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే...  ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది  🌜

భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  ఐదో అద్భుతం మన సొంతం .


🌷 *6* . *పిల్లలు* 


మనలో స్వార్థం మొదలవుతుంది..  

మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...  

వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..  

వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ  ఉంటుంది.. 

వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు  అసలు ఉండరు...  🙏

పిల్లలు ఆరో అద్భుతం 


అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?


🌷 *7* . *మనవళ్ళు* *మనవరాళ్లు* 


వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే  ఆశపుడుతుంది.. 

వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం 

మళ్ళీ పసిపిల్లలం...🏃🏃‍♀️👩‍🔧👨‍💼👨‍🎓👩‍🎓 అయిపోతాం  

వీరు మన జీవితానికి  దొరికిన.. ఏడో అద్భుతం 🌹🌺🌷🥀


🌹ఇలా అద్భుతాలన్నీ  మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... 

కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి  

చిన్న పలకరింపు  చాలు... మనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి.  

అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం ...🙏

[05/10, 7:13 am] +91 93913 24915: 🙏అమృతం తాగిన దేవతలు కూడా ఒకనాడు కాలం చేయవలసినదే, కానీ విషాన్ని మింగిన శివుడు మృత్యుంజయుడు. ఆ తల్లి మాంగళ్యాన్ని ఎవ్వరు స్మరించినా గండాలు ఆపదలు తొలగిపోతుంది. మాంగళ్యాన్ని భావన చేసి నమస్కారం చేసుకోవాలి.


🌹సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,

శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే.


🙏​​​​తాత్పర్యం:

 ఓం = ఓంకారము

సర్వ = సమస్తములైన

మంగళ = శుభములకును

మాంగళ్య = శుభ కరమగు దానా !

శివే = శివుని అర్ధాంగి అయిన

సర్వ = సమస్తములైన

అర్ధ = ప్రయోజనములను

సాధికే = నెర వేర్చెడి శక్తి గలదానా

శరణ్యే = భక్తులకు పెద్ద దిక్కు అయినదానా !

త్ర్యంబకే = ముక్కంటి అర్ధాంగి

నారాయణి = విష్ణుమూర్తి సోదరికి

గౌరీ = ఓ పార్వతి మాతా !

తే = నీకు

నమః = నా యీ వందనము

అస్తు = చెందును గాక !


🌹భావం: 

      సకల శుభములకు మూలమైన పార్వతీ! కోరికలన్నీ తీర్చు తల్లీ ! అందరికీ శరణము నిచ్చు,  మూడు కన్నుల కల శివుని అర్ధాంగి అయిన గౌరీ ! నారాయణుని సోదరీ ! నీకు నమస్కరము.


ఈ  శ్లోకమ్ స్త్రీలు పురుషులు అన్న బేధం లేకుండా అందరూ నిత్యం స్మరించవచ్చు.. ఉదయాన్నే వినాయకుడిని


ఓం గం గణపతయే నమః (21 సార్లు)


ఓం గంగా దేవై నమః (మూడు సార్లు) తలుచుకుని తర్వాత


సర్వ మంగళ మాంగళ్యే శివ సర్వార్ధ సాధికే

శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే||

సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతని

గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే||

శరణాగత దీనార్త పరిత్రాణ నారాయణే

సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే||

జయ నారాయణి నమోస్తుతే ( చై చూసుకుని నమస్కారం చేసాకే గణపతి స్మరణ తో మొదలు పెట్టాలి)


ఇలా స్త్రోత్రం చేసి తర్వాత మీ నిత్య కర్మలు పూర్తి చేసి ఇంటిదేవుణ్ణి, విష్ణు ఆరాధన చేసే వాళ్ళు వారి వారి పూజ విధులు యదా విధిగా పూర్తి చేసుకోవచ్చు.


రాత్రి పడుకునే సమయంలో 11 సార్లు శివ నామ స్మరణ చేయాలి.


🌹శ్రీ మాత్రే నమః🌹

[05/10, 7:14 am] +91 93913 24915: 🙏 సకల సౌభాగ్యలను యిచ్చే వట్టి వేరు. 🙏 దైవీక సువాసనలు వెదజల్లే చోట్ల మహాలక్ష్మీ నివాసముంటుంది.  పసుపు , కుంకుమ, చందనం,  వంటి సువాసన వెదజల్లే ద్రవ్యాలన్నీ మహాలక్ష్మి పూజకి యోగ్యమైనవే.  దేవి అనుగ్రహంతో , సకలసౌభాగ్యాలు  మనకు కలిగించే,  ద్రవ్యం  వెట్టి వేరు. జీవితంలో విజయాలు కలిగించే, వేరు యిది. మంచి సువాసన వెదజల్లే యీ  వట్టి వేరు పూజకి ఉపయోగించే విధానం.🙏 🙏 1. చెయ్యంత వట్టి వేరు తెచ్చి పూజా గదిలో  అమర్చుతేనే మంచి ప్రకంపనలు కలుగుతాయి.  🙏2. ఒక చిన్న కప్పులో  నీరు పోసి  అందులో వట్టి వేరు నిమ్మపండు వేసి , పూజా గదిలో  అమర్చుకుంటే లక్ష్మీ దేవి సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుంది.  (నిమ్మపండు మాత్రం మారుస్తూ  వుండాలి.)  ఇందువలన ఋణబాధలు వుండవు .  సంపదలు వృధ్ధి చెందుతాయి.  🙏3.వట్టి వేరుతో చేసిన, వేంకటేశ్వరుని, వినాయకుని ఇతర దైవాల రూపాలను పూజా గదిలో  అమర్చి పూజలు చేస్తే ఉన్నతమైన శుభఫలితాలు  కలుగుతాయి. 🙏 4.నవరాత్రి, వరలక్ష్మీ పూజలు గృహంలో జరిపే విశేష పూజలకి, కళ్యాణాలలో వట్టి వేరుతో చేసిన  దైవ  మూర్తులను  అందరికీ వినియోగించినందు వలన మనకి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి.🙏

[05/10, 8:57 am] +91 93913 24915: *\!/ ఓం నమో వెంకటేశాయః.\!/* 

 **_అందరికీ  శుభోదయం...**_ 

         *నారసింహ విజయము* 

+++++++++++++++++++++

                 శ్రీ ప్రహ్లాద భక్తి    

************************

173శ్లోకము కొనసాగింపు 

**************************

" నిండినం బట్టుచాలక దోధూయమాన హృదయంబు లయి పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాఁ బ్రపుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర, చాప, హల, కులిశ, అంకుశ, జలచర రేఖాంకిత చారు చరణతలుండును, చరణచంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగళుండును,"


 *భావము* : “బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు మొదలైన దేవతలందరితో, సమస్త జీవజాలంతో సహా బ్రహ్మాండభాండం గుండెలవిసేలా ఒక్కసారి ఫెఠేలున పగులినట్లు అయింది. స్తంభం ఛిన్నాభిన్నమైంది. దానిలో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నరసింహదేవుని పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలు కలిగి, వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి దివ్య పాదాలతో అడుగులు వేస్తుంటే, ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలూ, కులపర్వతాలూ, కూర్మరాజూ అణిగి మణిగిపోతున్నారు.”


+++++++++++++++++++++

 *విష్ణుసహస్రం* .... అర్థం, పరమార్థం.

+++++++++++++++++++++

571) దివ: సృక్ - దివిని అంటియున్నవాడు.

+++++++++++++++++++++

 *ఈ ఉదయం శ్రీహరి కీర్తన* 

+++++++++++++++++++++

" ఇతనికంటే మరి 

దైవము కానము  "

+++++++++++++++++++++

[05/10, 9:01 am] +91 93913 24915: 🙏🙏🙏🙏🙏


ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.


– వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.


– అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.


– జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.


– భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.

ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.


– జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.


– అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.


– వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.


– ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.


కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.


Copied


🙏🙏🙏🙏🙏

[05/10, 10:28 am] +91 93913 24915: 🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

        *ఇంతకీ సప్తర్షులు ఎవరు!*

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

చిమ్మచీకటి రోజున ఆకాశంలోకి చూసినప్పుడు ఒక ప్రశ్నార్థకంలా కనిపించే నక్షత్ర సమూహమే... సప్తర్షి మండలం. సప్తర్ష మండలం మనకి కొత్త కాదు. తల పైకెత్తి పరిశీలించినప్పుడల్లా కనిపించేదే. అందులో ఉండేవి కేవలం నక్షత్రాలు మాత్రమే కాదనీ... మహారుషులే అలా తారా రూపంలో సంచరిస్తున్నారనీ మన నమ్మకం. మరైతే ఆ సప్తర్షులు ఎవరు.. వారి పేర్లు ఏమిటి అని తెలుసుకోవడం కూడా ఆసక్తికరమే కదా!


సప్తర్షుల పేర్లు ఏమిటి అని ఖచ్చితంగా చెప్పడం అంత తేలికైని విషయం కాదు. ఎందుకంటే వేర్వేరు పురాణ గ్రంథాలలో వేర్వేరు సప్తర్షులు కనిపిస్తారు. బృహదారణ్యకంలో, వేదాలలో, మహాభారతంలో... ఇలా ఒకో ప్రమాణం ప్రకారం వారి పేర్లు మారుతూ కనిపిస్తాయి. అంతేకాదు వేర్వేరు మన్వంతరాలలో కూడా వీరి పేర్లు వేర్వేరుగా కనిపిస్తాయి. దీనిని బట్టి సప్తర్షి అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదనీ, అది ఒక హోదా అని భావించవచ్చునేమో. కాలానుగుణంగా ఈ హోదాను వేర్వేరు రుషులు దక్కించుకుంటూ ఉండవచ్చు. కేవలం హైందవ మతంలోనే కాదు... హైందవం ఆధారంగా వచ్చిన సిక్కు, జైన మతాలలో కూడా ఈ సప్త రుషులు ప్రస్తావన కనిపిస్తుంది. మహాభారతం మనకు ఇటీవలి ప్రమాణం కాబట్టి ఇందులో ఉన్న పేర్లను ప్రస్తుతానికి ఉన్న సప్తర్షులుగా భావించవచ్చు. వీరు... మరీచి, అత్రి, అంగీరసు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు.


సప్తర్షి జాబితాలో ఉన్నవారంతా అసాధారణమైనవారే! తమ పేరుతో ఒక గోత్రాన్ని స్థాపించిన వారే! విద్యాదాతలుగా, జ్ఞాన ప్రదాతలుగా, హోమ ద్రవ్యాలను స్వీకరించేవారుగా వీరికి గొప్ప పేరు. అయితే వీరందరూ కూడా గృహస్థులే కావడం విశేషం! ఒకో రుషి కుటుంబాన్ని కనుక గమనిస్తే అందులో పురాణ పాత్రలు చాలానే కనిపిస్తాయి. రామాయణంలో ముఖ్య పాత్ర అయిన రావణాసురుడు సాక్షాత్తూ పులస్త్యుని మనవడు. మహాపతివ్రతగా పేరొందిన అనసూయ అత్రిమహాముని భార్య.


ఒకవైపు నడి సముద్రం, చుట్టూ చిమ్మచీకటి... ఇలాంటి సందర్భంలో మన పెద్దలకు సప్తర్షి మండలం ఒక దారిని చూపించే సాధనంగా ఉండేది. సముద్రం నుంచి ఎడారి వరకూ బాటసారులకు గమ్యం వైపు నడిపించేది. ఆఖరికి ప్రళయకాలంలో సత్యవ్రతుడనే రాజు సకల జీవరాశులను పడవలోకి చేర్చినప్పుడు, అతనికి దారి చూపింది కూడా సప్తర్షి మండలమే అని చెబుతారు. బహుశా అందుకనే ఆ నక్షత్రమండలానికి సప్తర్షి హోదాను కట్టబెట్టి ఉండవచ్చు. కేవలం భారతీయులకే కాదు! పాశ్చాత్యులు కూడా ఈ సప్తర్షి మండలాన్ని ‘బిగ్‌ డిప్పర్‌’ పేరుతో పిలుచుకుంటారు. ఉత్తర ఖగోళార్ధంలో సంవత్సరం పొడవునా కనిపించే ఈ బిగ్ డిప్పర్‌, నౌనాయానం ద్వారా మన నాగరికత ముందుకు సాగడానికి తోడ్పడింది.


సప్తర్షి మండలం అనగానే మనకు గుర్తుకువచ్చే మరో విషయం... అరుంధతీ నక్షత్రం! తన భర్త వశిష్ఠుని అడుగుజాడల్లో నడిచే అరుంధతి నక్షత్రం ఆయనతో పాటుగానే సప్తర్షి మండలంలో భాగమైందని విశ్వాసం. అందకనే పెళ్లయిన నూతన వధువుకు, అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు. అలా భర్తను నిత్యం అనుసరించే అరుంధతి, ఆమెను అంత ఎత్తున నిలబెట్టిన వశిష్ఠులు సప్తర్షి గణంలో ఒక భాగమైపోయారు.

✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️

*తెలుగు వెలుగు సౌజన్యంతో*

🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

[05/10, 10:28 am] +91 93913 24915: 🕉🕉🕉 🕉🕉🕉


 🙏🏼 *భగవంతుని గురించి మన మనసు ఎంత పరితపిస్తే మనము ఆయనకు అంత సన్నిహితంగా ఉన్నట్లు అర్థం* 🙏🏼


🕉🔯🔯🕉☸☸🕉⚛

[05/10, 10:29 am] +91 93913 24915: *అరుణాచలంలోని ని ఉత్తర గోపురం ఈ గోపురం పేరు  అమ్మణ్ణీ అమ్మన్ గోపురం అని పిలుస్తారు.*


 అమ్మణ్ణీ అమ్మన్ అనే ఆమె మహా శివ భక్తురాలు ఆమె శివభక్తి కి టెంపుల్ లో ఒక గోపురం కట్టాలని సంకల్పించి ఆమె ఈ ఉత్తర గోపురం కట్టించారు. ఎలా కట్టించారు అంటే గోపురం కట్టడానికి ఆమె దగ్గర అ చిల్లి గవ్వ కూడా లేదు. ఆమె తిరువన్నామలై వీధులలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి చందా ఇవ్వమని అడిగేది చందా అంటే ఎవరైనా 100, 50 ఇస్తారు కానీ  అమ్మణ్ణీ అమ్మన్ అనే ఆమె వెళ్లి మీ ఇంట్లో పలానా ప్రదేశంలో లో ఇన్ని డబ్బులు ఉన్నాయి అవి నాకు చందాగా ఇవ్వండి  స్వామివారికి గోపురం కట్టాలి అని అడిగేది ఆమె చెప్పినట్టు అక్కడ అన్ని డబ్బులు ఉండేవి వారు అన్ని డబ్బులు తీసుకొనివచ్చి ఇచ్చే వారు అలా చందాలు వసూలు చేసి ఆమె ఈ గోపురం కట్టించారు. అందుకనే దీనిని అమ్మణ్ణీ అమ్మన్ గోపురం అని పిలుస్తారు అరుణాచలం వెళ్లే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ గోపురం నుంచి లోపలికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకొని బయటికి రావాలి అని ఒక సంప్రదాయం ఉంది. అందువలన ప్రతి ఒక్కరు అరుణాచల యాత్రలో ఉత్తర గోపురం లోనుంచి ఒకసారి లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని బయటికి వచ్చి మీ  యాత్ర సంపూర్ణం చేసుకొని ధన్యులు కండి*

 

*ఓం అరుణాచలేశ్వరాయ నమః*


🙏🙏🕉🙏🙏🕉🙏🙏🕉🙏🙏

[05/10, 10:29 am] +91 93913 24915: ఆత్మజ్ఞానం అతి సులభం..!!

ఆత్మజ్ఞానం పొందడం ఎంతో తేలికని సద్గురు చెబుతున్నారు. మనం చేయవలసిందల్లా అది ఎక్కడో లేదు మనలోని ఉందని తెలుసుకొని అంతరంగంలో చూడడమే అని అంటున్నారు.

ఇప్పుడు భగవంతుడు దీనిని ఎందుకు ఇంత కష్టంగా చేశాడు అన్నది ప్రశ్న..! నిజానికి భగవంతుడు దీనిని ఏమాత్రం కష్టంగా చేయలేదు. మరోరకంగా చెప్పాలంటే, ఇది కష్టమైనదీ కాదు. మీరు రమణ మహర్షి గురించి విన్నారా..? ఆయన ఏమన్నారంటే “ఆత్మజ్ఞానం అతి సులభం” అని..! అంటే సృష్టిలో ఉన్న అన్నింటిలోకీ ఆత్మజ్ఞానం తేలికైనది అని..! అది నిజానికి అంత తేలికైనది కూడా..! ఇది కేవలం మీరు ఒకే సమయంలో సుముఖంగానూ విముఖంగానూ ఉండడంవల్ల ఇలా జరుగుతోంది. ఈ సంఘర్షణ అన్నది మీది..! ఇది కష్టమైనది కాదు. మీలో ఉన్నదానిని అనుభూతి చెందడానికి మీరు ఏ కష్టమైన పనులు చెయ్యాలి..? కాని మీరు ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు. మీరు ఈ ప్రక్క గదికి వెళ్లాలంటే, మీకు ఈ బిల్డింగ్ గురించి కొంత తెలిస్తే, మీరు ఇలా తిరిగి అలా వెళ్లిపోతారు. అదే, మీకు ఈ బిల్డింగ్ ఎలా కట్టారో తెలియకపోతే మొత్తం ఇలా చుట్టూ తిరిగి వస్తారు. ఆ విధంగా కూడా ఆ గదిని చేరుకోవచ్చు. కాకపోతే ప్రపంచం అంతా చుట్టూ తిరిగిరావలసి ఉంటుంది. ఇది కూడా ఒక విధంగా ప్రయాణం చెయ్యడమే. కానీ ప్రపంచాన్ని అంతా చుట్టి రావడం అనేది ఒక మూర్ఖమైన పని. అవునా..? కాదా..? మీరు ఇలా ప్రపంచాన్ని అంతా చుట్టి రావాలి అనుకుంటే, ఎన్నో ప్రమాదాలు మీకు మధ్యలో ఆటంకం కలిగించవచ్చు.

మీరు ఏదో ఒక రోజున ఇటువంటి ఎరుకను తెచ్చుకొని, ఒక్కసారి వెనుదిరుగుతారని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఇది ఎంతో సరళం, ఎంతో తేలిక..!

ఒకానొక సమయంలో యూరప్ లో కొన్ని వేలమంది ప్రజలు, ఇండియాను కనుగొనాలని బయలుదేరారు. చాలామంది మార్గమధ్యంలోనే రాలిపోయారు. వారు సముద్రంలో మునిగిపోయారు. కేవలం ఒక్క వాస్కోడీగామా మాత్రమే రాగలిగారు. ఎవరైతే సముద్రంలో మునిగిపోయారో, మనం వారి గురించి ఎప్పుడూ విననేలేదు. వారి పేర్లు కూడా మనకి తెలియదు. వారు ఎవరు..? ఏమి చేశారు..? ఏమీ మనకు తెలియదు..! కానీ ఎవరైతే వచ్చారో, వారినే మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాం. కానీ ఆ వేల సంఖ్యలో ఉన్నవారు ఎవరైతే సముద్రంలో మునిగిపోయారో, వారు తుడిచిపెట్టుకు పోయారు! అవునా..? కాదా..? అందుకని ఈ ప్రక్క గదికి వెళ్లడానికి ప్రపంచాన్ని అంతా చుట్టి వెళ్లాలనుకుంటే, ఆ గదికి వెళ్లగల అవకాశం ఎంతో తక్కువ. మీరు అక్కడికి వెళ్లలేరని కాదు..! కానీ అందుకు అవకాశం ఎంతో తక్కువ. ఎందుకంటే ప్రయాణం ఎంతో కష్టంగా ఉంటుంది కాబట్టి..! మీరు కూడా ఈ విధంగానే వెళ్లాలనుకుంటున్నారు. కానీ గది ఇక్కడ ఉంది. కేవలం మీరొకసారి వెనుదిరిగారనుకోండి, అంతే!

మీరు ఏమి చెయ్యాలనుకుంటున్నారంటే, ఉదాహరణకి ఇక్కడ మీ ఎదురుగుండా మీ నీడ ఉందనుకోండి. మీరు ఎలా అయినా సరే, దాన్ని దాటి వెళ్లాలనుకొని మొదట త్వరగా నడవడం మొదలు పెడతారు. అప్పుడు మీ నీడ మీకంటే తొందరగా నడుస్తుంది..! ఆ తర్వాత మీరు పరుగెట్టడం మొదలు పెడతారు. ఇప్పుడు మీ నీడ మీకంటే వేగంగా పరుగెడుతుంది..! కానీ మీరు కనుక ఒక్కసారి వెనుదిరిగారనుకోండి, మీ నీడ మీ వెనక్కి వెళ్లిపోతుంది. చెయ్యవలసినదల్లా ఇంతే..! కానీ మీరు అలా తిరగాలనుకోవడం లేదు. మీరు ఇదే త్రోవలో వెళ్లాలనుకుంటున్నారు. ఇది సాధ్యమే..కానీ ప్రపంచాన్నంతా చుట్టిరావలసి ఉంటుంది.

మీరు ఏదో ఒక రోజున ఇటువంటి ఎరుకను తెచ్చుకొని, ఒక్కసారి వెనుదిరుగుతారని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఇది ఎంతో సరళం, ఎంతో తేలిక..!!!

సద్గురు జగ్గీ వాసుదేవ్...🙏

[05/10, 10:29 am] +91 93913 24915: ధర్మసూక్ష్మమ్ :-

************

   కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో, 

పండునో విడిచి పెట్టి రావాలంటా రు. ఆమేరకు

మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక

కాయను వదిలేసి వస్తుంటాం.ఆ తర్వాత నుండి

వాటిని తినడం మానేస్తాం.పైగా

"నేను జామపండు తి ననండీ"కాశీలో ఎప్పుడో

వదిలేశాను "

"నేను కాకరకాయ తిననండీ, కాశీలో వదిలేశాను

అని చెప్పుకుంటాం.


నిజానికి పెద్దలు వదలమన్నది,

  "కాయాపేక్ష, ఫలా పేక్ష "


 *వదులుకోవడం అంటే తినే కాయలు ఫలాలు వదిలేయటం కాదు.*


   కాయాపేక్ష అంటే :- దేహం పట్ల ప్రేమ.  ప్రతి వ్యక్తికి

ఉంటుంది. శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని, నా శరీరానికి సుఖం కావాలి ,

ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి

రుచికరమైన భోజనం కావాలి ,ఇలాంటి వన్నీ

వదిలేసి సాధువులా బతకమని అర్ధం.


  ఫలాపేక్ష అంటే :-  ఏదైనా పని చేసి దాని ధ్వారా

లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని.


ఉదా:- పది రూపాయలు దానం చేసి, దాని ద్వారా ఫలితం ఆశించటం.  యజ్ఞం చేసి ఏదో కోరుకోవడం.  బంధుమిత్రులకు సహాయం చేసి దాని ద్వారా

ఏదో కావాలని కోరుకోవడం మానుకొమ్మని అర్ధం.


(ఎవరినో అనాలని కాదు అందరం చేసేవే.  మారటానికి ప్రయత్నిద్దాం)(అన్యథా భావించవద్దు)


(ఎక్కడో చదివాను బావుందని తెలియపరుస్తున్నాను) 


   ఓం నమశ్శివాయ

🙏🙏🕉🙏🙏🕉🙏🙏🕉🙏🙏

ఓ మహానగరంలో  ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్మాత్మిక శిక్షణ ఇస్తూ, ధర్మప్రబోధం చేస్తుండేవారు.

మహాసంపన్నుడొకడు ఈ గురువుగారి దగ్గరకు వచ్చి

అసలు గురువు అవసరమా?

గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?

అని ప్రశ్నించాడు.

గురువుగారు నవ్వుకుని, మీరేం చేస్తుంటారని అడిగారు.

నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానమిచ్చాడు సంపన్నుడు.

అయితే! ఒకసారి మీ సూపర్ బజార్ కు నన్ను తీసుకువెళ్లండని గురువుగారు అడిగారు.

ఇద్దరూ కలిసి సూపర్ బజార్ కు వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది.

ఏడంతస్థుల పెద్ద భవంతి. అందులో దొరకనిదంటూ ఉండదు. దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు.

అక్కడే ఈ సంపన్నుడు ఆవులను, కుక్కలను పెంచుతున్నాడు.

ఆ మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు.

కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది అన్నీ తిరుగుతూ, తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్లింది. కడుపునిండా , తృప్తిగా మేసింది. రెండుగంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది.

తదుపరి తను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ, తిరుగుతూ వాసన చూస్తూ, మూడవ అంతస్థులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్లింది. తృప్తిగా తినేసింది. మూడు గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది.

ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి, నీకు నచ్చినన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువు.

ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి, ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్ధం కావటం లేదు.

రెండు, మూడు, నాలుగు గంటలు గడిచిపోయినా బయటకు రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు.

గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటకి చేరుకున్నాడు. నెత్తిమీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్ధం కావడం లేదు. ఈ వస్తులన్నింటినీ చూస్తుంటే పిచ్చెత్తిపోతోంది అన్నాడు ఆ వ్యక్తి.

దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు.

ఆవుకీ, కుక్కకీ పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి వచ్చాయి.

మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు. తనకే అన్ని తెలుసనుకుంటాడు.

పాపం! అందుకే వీడికి గురువు కావాలి.

ఎలా జీవించాలో జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి.

అందుకే వాటిని తెలియజెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగింది.

గురువుతోనే గమ్యం సాధ్యమని తెలుసుకున్నాడు.👏

[05/10, 3:27 pm] +91 93913 24915: పురుష సూక్త శ్లోకాలు


*శ్లోకం..   2/25*


*పురుష ఏవేదగ్ం సర్వమ్! యద్భూతం యచ్చభవ్యమ్!*    

*ఉతామృతత్త్వ స్యేశానః! యదన్నే నాతిరోహతి!*


*భావం*


మునుపు ఏది ఉన్నదో,  ఇక ఏది రాబోతున్నదో, సమస్తమూ భగవంతుడే. మరణము లేని ఉన్నత స్థితికి అధిపతి అయిన వాడూ ఆయ‌నే, ఎందుకంటే ఆయన ఈ జడ ప్రపంచాన్ని అతిక్రమించినవాడు కనుక!

[05/10, 3:28 pm] +91 93913 24915: 🌹🌻 చాలామంది లాలితా సహస్రనామ పారాయణ చేస్తుంటారు మీ అందరికీ తెలిసిందే కదా. అయితే లలితాదేవి సృష్టికి మూలాధార శక్తి . అమె నుంచి సర్వ కోటి జీవ.ప్రాణి కోటికి శక్తి ఉత్పన్నం అవుతుంది. అయితే అసలు మన దత్త స్వామి కీ అమెకి ఏమిటి సంబంధం అని చాలామందికి సందేహం రావచ్చు . కాని సృష్టి కే మూలాధారం అయిన అమ్మ , సర్వ జీవ ప్రాణి కోటీ యందు మూలాధారం యందు ఉండీ శక్తిని యిచ్చి నడిపిస్తుంది శ్రీ లలితదేవి తల్లి. అంటే శక్తి లేనిదే మనం లేవు. ఈ చారాచర సృష్టి యే లేదు అనియే కదా అర్థం.   అయితే శ్రీ దత్తాత్రేయ ఆది గురువు . త్రిమూర్తి స్వరూపులు వారికి తెలియని శక్తి లు , యుక్తులు లేవు. మనకీ శ్రీ గురుచరిత్ర లో చెప్పిన విధంగా భగవంతుడు ఒక్కడే. ఆయనే నేను అనేకం అవుదును కాక అని సంకల్పించి సృష్టి ని సృష్టించారు . అప్పుడు భగవంతుడు అనేక జీవ ప్రాణీకోటి ని సృష్టించింది భగవంతుడే. దేవతలను , రాక్షసులు ను సృష్టించినదే ఆయనే. అప్పుడు ఒక్కడే ఉన్న భగవంతుడు తన రూపాలను మార్చుకుంటూ వస్తూ సృష్టి కి శక్తిని యివ్వటం కోసం అమ్మ ని బయటకు తెచ్చి మూలాధారం నందు నివశించి సృష్టి చేయమన్నారు. భగవంతుడు నుండి వేరుపడ్డ రూపమే శ్రీ లలిత దేవి , తన రూపం ప్రకృతి రూపంగా మార్చుకుని ప్రకృతి రూపంలో అమ్మ సర్వ జీవ ప్రాణికోటి కి శక్తిని ఇస్తుంది. అందుకే శ్రీ చక్రధారిణీ అని అంటారు. అందుకే మన దత్త స్వామి శ్రీ చక్రం నందు 6 వ కోణంలో ఉంటారు. అంటే ఆయన అమే వేరుకాదు. యిద్దరూ ఒక్కటే. బయటికి మాయ చేస్తారు మాయ స్వరూపులు కాబట్టి అంతే.    శ్రీ లలితా దేవీ సహస్రనామ అర్థ వివరణ చూడండి👇🌹🙏🌻

🌹🌻లలితాసహస్రనామ స్త్రోత్ర ఫలితం🌻🌹

లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం.

నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం.....కానీ బాహ్యంలో అది రహస్య నామా స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవతుందా!!! ఆవిడ పేరు లలిత అయతే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్కపెట్టలేనన్న్ని. సహస్ర శీర్ష వాదనా సహస్రాక్షీ సహస్రపాత్‌ అంటే ఖచ్చితంగా లెక్కపెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్ధం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి?? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం.

మనసుతో పలకాలి:

లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడము కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడి పోవాలి.

భవానీమాతే లలితాదేవి:

ఎరుపు రంగు దుస్తులు కట్టు కొన్న, ప్రేమ మయ చూపులు కలిగిన పాశము, అంకు శం, పుష్పం చెరకు గడను నాలుగు చేతులలో ధరించిన అణిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానియే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామం త్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటు వంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలను కుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంఝాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీలలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే, ఆ తల్లి పలుకు తుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో ఆశువుగా వస్తాయి. ఈనామ సహస్రమే లలితా సహస్రం. ఇవి వేయినామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గ, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కల్యాణి, రాజరాజేశ్వరి మహాత్రిపురసుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండికా, విశాలాక్షి, గాయిత్రి అనేక దేవి రూపాలు కనపడతాయి. శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్తము,గొప్ప ప్రమాణం.

183 శ్లోకములలో చెప్పబడినది:

ఈ వేయినామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. శ్రీమాతా అను నామముతో మొదలై లలితాంబికా అనునామముతో పూర్తవుతుంది. విడివిడిగా చదువుతే ఓం శ్రీమాత్రేనమః అని చదవాలి. అర్థము తెలుసుకునే చదవాలి. అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది. ఈ నామమము వివరణ ఇవ్వబడుతున్నది. శ్రీమాతా శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువు రూపములోవున్నది. శ్రీఅంటే లక్ష్మి.మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్తప్రాణి కోటిని సరిదిద్దుతుంది. ప్రతినామము ఒక మంత్రం. ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకొందాం. జీవితం తరిస్తుంది. అపమృత్యువు పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.అందుకే శ్రీలలితా సహస్రనామాలు చదువుదాం. చదివించుదాం. ముక్తిని పొందుదాం.

🙏🙏🙏

[05/10, 3:28 pm] +91 93913 24915: భగవంతుడు సర్వశక్తిమంతుడు.ఆ సర్వేశరుడిని ఒకరు అర్ధించాలే కాని, ఆయన మరెవరినీ అర్ధించాల్సిన అవసరం లేదు...అంతటి శక్తివంతుడైన భగవంతుడు భక్తుని భక్తికి లొంగిపోతాడు. మనసా వాచా తనను నమ్మిన భక్తుడిని రక్షించేందుకు ఆయన ఏ రూపం దాల్చడానికైనా సిధ్ధమే...


అర్జునుడి భక్తికి లొంగే శ్రీకృష్ణుడు రథసారధి అయ్యాడు. శబరి భక్తికి లొంగే ఆమె పెట్టిన ఎంగిలి పండ్లను తృప్తిగా ఆరగించాడు శ్రీరాముడు....అందుకే భగవంతుని లొంగదీసుకునే ఏకైక ఆయుధం భక్తి...

 పరమేశ్వరుడు అందరిలో అంతటా అన్నిటా అంతర్లీనుడు. గంగా నది  పరివాహక ప్రాంతం లో లభించే లేత గరిక శష్పము . లేత గడ్డి కూడా పరమేశ్వర స్వరూపమే. వీటిని బాలతృణములు అని కూడా అంటారు . లేత గరికతో శివ పూజ శ్రేష్టమైనది. నదీ ప్రవాహము లోని నురుగు  శివస్వరూపమే. నదీ ప్రవాహపు నరగతో కూడా శివ పూజ  చేయ యోగ్యమైనది. ఫేన్యము అంటే నురుగు.  లేత పచ్చి గరిక స్వరూపుడైన శష్పునికి, నీటి నురుగు రూపంలో వున్న ఫేన్యునికి నమస్కారం .

తెలుగు సాహిత్యంలో

 తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో చూద్దాం.


1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 

*-దేవులపల్లి కృష్ణ శాస్త్రి*


2. ‘‘కప్పివుంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’’

*డా.సి.నారాయణరెడ్డి*


3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 

*- కాళోజి*


4. ‘‘గత కాలము మేలు వచ్చుకాలముకంటెన్‌’’ 

*- నన్నయ*


5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 

*-సుబ్బారావు పాణిగ్రాహి*


6. ‘‘రాజే కింకరుడగు కింకరుడే రాజగు’’ 

*-బలిజేపల్లి లక్ష్మీకాంతం*


7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 

*-బసవరాజు అప్పారావు*


8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 

*-గుర్రం జాషువా*


9. ‘‘అత్తవారిచ్చిన అంటు మామిడి తోట

 నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 

*- కాళ్ళకూరి నారాయణరావు*


10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ 

*- దాశరధి*


11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 

*-నార్ల వెంకటేశ్వర రావు*


12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 

*- తిరుపతి వెంకట కవులు*


13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 

*- గురజాడ*


14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 

*- గరిమెళ్ళ సత్యనారాయణ*


15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’ 

*- శ్రీనాథుడు*


16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 

*- పోతన*


17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 

*- గద్దర్*


18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 

*- శ్రీ శ్రీ*


19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 

 *- వెన్నలకంటి*


20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 

*- కొనకళ్ల వెంకటరత్నం*


21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’

*- అల్లసాని పెద్దన*

 

22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 

*- చేమకూరి వేంకటకవి*


23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 

*- త్యాగయ్య*


24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 

*- ధూర్జటి*


25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’ 

*- బద్దెన*


26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’ 

*- వేమన*


27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 

*- కంచర్ల గోపన్న*


28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 

*- సుద్దాల హనుమంతు*


29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 

*- ఆరుద్ర*


30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ 

*- వేముల శ్రీ కృష్ణ*


31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 

*- త్రిపురనేని రామస్వామి*


32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 

*- బాలాంత్రపు రజనీకాంతరావు*


33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 

*- అడవి బాపిరాజు*


34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’

*- కరుణశ్రీ*

 

35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 

*- గుడ అంజయ్య*


36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 

*- అలిసెట్టి ప్రభాకర్*


37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 

*- సావిత్రి*


38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 

*- ఖాదర్ మొహియుద్దీన్*


39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను 

*- బాలగంగాధర తిలక్*


40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 

*- అన్నమయ్య*


41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’ 

*- ఏనుగు లక్ష్మణ కవి*


42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 

*- పాలగుమ్మి విశ్వనాథం*


43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 

*- చెలం*


44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’

*- విమల*

 

45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’ 

*-నండూరి సుబ్బారావు*


46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’ 

*- అందెశ్రీ*


47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

*- చెరబండరాజు*

 

48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ 

*- కందుకూరి రామభద్రరావు*


49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ 

*- నందిని సిధారెడ్డి*


50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

*- మిట్టపల్లి సురేందర్*


"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను 

తెలుగు వల్లభుండ.........

దేశభాషలందు తెలుగు లెస్స".(శ్రీకృష్ణదేవరాయలు)...


వీరినందరినీ మీ పిల్లలకు పరిచయం చేయండి..

........

...........

మూకపంచశతి

 దశిక రాము


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏


🌹 🌹


🌹 ఆర్యాశతకము🌹


🌹16.

శ్లోకం


మధురధనుషా మహీధర జనుషా


నన్దామి సురభి బాణజుషా౹


చిద్వపుషా కాఞ్చీపురే కేలిజుషా


బన్ధు జీవకాన్తి ముషా౹౹


🌺భావం:


తీయనిచెరుకుగడ ధనువుగా,సుగంధ భరితమైన పుష్పములు బాణములు గా ,బంధూకపుష్ప జీవకాంతిని అపహరించినట్లున్న చిద్విలాసమైన చైతన్య స్వరూపముతో కాంచీనగరిని కేళిగా విహరించుచున్న ఆ పర్వతరాజపుత్రిక యైన కామాక్షీ దేవి స్మరణచే చిదానందానుభూతి ని పొందుచున్నాను.🙏



🌼మనోరూపేక్షుకోదండముతో ,పంచపుష్ప

(పంచేద్రియముల)బాణములతో,దివ్యచైతన్యముగా కాంచీనగరమున చిద్విలాసకేళినొనర్చు ఆతల్లి ,గిరిరాజపుత్రి స్ఫురణమాత్రమున

ఆనందానుభూతి కలుగుచున్నది.


🌺 నందామి !🌼నందామి🙏


🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


ధర్మము-సంస్కృతి

🙏🙏🙏


హిందూ సాంప్రదాయాలను 


పాటిద్దాం

మన ధర్మాన్ని రక్షిద్దాం


ధర్మో రక్షతి రక్షితః

🙏🙏🙏 

*పంకజం పదనిసలు :- 22*

  (1975 ఎ లవబుల్ స్టోరీ)

             🌷🌷🌷

బడికెళుతూ దారిలో పంకజంతో కబుర్లు చెబుతూ నడుస్తున్నాను. భుజాన చాకలి మూటలా స్కూలు బ్యాగూ, చేతిలో లంచిబ్యాగూ రెండూ మోస్తూ అచ్చం పొలంలో కాడిమోసే ఎద్దులా బడికెళ్ళే నేను, నేనేముంది లెండి. ఆరోజుల్లో అందరూ అంతే! ఈ రోజు లంచిబ్యాగు లేకుండా చేతులూపుకుంటూ నడుస్తుంటే" అయ్యో లంచి బ్యాగేదీ, మర్చిపోయావా" అని కంగారుపడింది పంకజం. అప్పట్లో పంకజంకూడా నా లానే చిన్నపిల్లేలెండి. 


"కాదు, ఈరోజు కార్తీక పౌర్ణమి నేను ఉపవాసం తెలుసా! " అన్నాను. "ఉపవాసమా హమ్మో ! మూడు కిలోమీటర్లు స్కూలుకి నడవాలి మళ్ళీ వచ్చేటప్పుడు అంతదూరం తిరిగి రావాలి అంతసేపు ఉండగలవా? రాత్రికేగా ఇంక అన్నం తినేదీ" అని ఆశ్చర్య పోయింది. 


"అవును పొద్దున్నే అమ్మమ్మతో సాగర్ కాలువలో స్నానం కూడా చేను తెల్సా" అన్నాను గొప్పగా." చాల్లే, గొప్పలు సాయత్రం దాకా ఎమీ తినకుండా ఉండు అప్పుడు చూద్దాం" అంది ఎగతాళిగా" ఏం ఫర్లేదు అరటి పళ్ళు తినొచ్చు ఇదిగో, అమ్మ ఇచ్చింది నాలుగు అరటి పళ్ళు. ఇంకా ఏవైనా పండ్లు తినమని రూపాయి ఇచ్చింది తెలుసా" అన్నాను.


స్కూలుకి వచ్చే సరికి మొదటి గంట మోగింది. బైట జామకాయల బండి మీద తెల్లజామ కాయలు ఊరిస్తున్నాయి. గబగబా వెళ్ళాను కొనుక్కుందాం ఎందుకైనా మంచిది మధ్యలో ఆకలేస్తుందేమో, అని. 


ఒక కాయ పదిపైసలు. పావలాకి మూడు కొన్నాను బేరం చేసి. జాగ్రత్తగా సంచిలో దాచి హడావుడిగా అసెంబ్లీలో వెనగ్గా నిలబడ్డాను. జనగణమన టైం కే కడుపులో ఆకలి మొదలైంది. గబగబా రెండరటిపండ్లు తినేసి క్లాసులోకి జొరబడ్డాను. 


ఇంగ్లీషు మనకి వీజీ! పైగా సూజన్ టీచర్ చెప్పే పాఠం భలే వినబుద్ధేస్తుంది. నా వెనక లైన్లో అన్నపూర్ణ చిన్నగా నా షర్టు పట్టుకు లాగుతోంది. లెక్కల హోంవర్క్ నోట్స్ దానికిచ్చేసి శ్రద్ధగా పాఠం విన్నాను. ఆరోజు ఇంగ్లీష్ హోవర్క్ పుస్తకం టీచర్ పక్కనే బొత్తిలో పెట్టేసాను. 


తరువాత లెక్కల పీరియడ్. ఇది మాత్రం మనకి గొంతులో పచ్చివెలక్కాయే. నెమ్మదిగా వెనక లైనుకి చేరిపోయాను. నా వెనుకే అన్నపూర్ణ కూడా దాని పుస్తకాల బుట్టేసుకుని వచ్చేసింది." ఇదుగోనబ్బా నీ హోంవర్కు. రోజూ నేనేచేస్తే నీకేమొస్తుందీ." అంది. హుష్ గట్టిగా అరవకు అన్నాను. ఏవిటో, తిన్న రెండరటిపళ్ళూ అప్పుడే అయిపోయాయి. నెమ్మదిగా బాగులోంచి జామకాయ తీసాను. "ఏంటదీ" అంది, అది గుడ్లగూబలా చూస్తూ "జాంకాయి" అన్నాను స్కర్ట్ కింద జాంకాయి పెట్టి పైనించి కొరికి దానికో ముక్క చేతిలో పెడుతూ" ఇవాళ నేను ఉపవాసం తెలుసా" చెప్పాను దానికి. 

లెక్కల టీచర్ క్లాసులోకి రాగానే "గుడ్మానింగ్ టీచర్" అని అందరం అరిచాం. ఆ రోజు మాటీచర్ బ్లాక్ బోర్డు జోలికి వెళ్ళకుండా పోయిన వారం జరిగిన యూనిట్ పరిక్ష పేపర్లు ఇవ్వసాగింది. అందరి పేపర్లూ వచ్చాయి నాదెందుకు రాలేదా అని చూస్తుంటే, "ఆరెస్సూ, ఇట్రా" అని పిలిచింది. 


మనకెలాగూ లెక్కల్లో ఫస్టు రాదు. ఇది నాకేకాదు మాక్లాసులో అందరికీతెలుసు. అలాగని సున్నరాదని గట్టి నమ్మకం. అన్నపూర్ణ పాపం బానే చూపిస్తుంది పరిక్షలో, సందేహంగా వెళ్ళిన నన్ను "ప్రేమాభిషేకం సినిమాలో హీరోయిన్నెవరు?" అని అడిగింది." ఇద్దరూ శ్రీదేవీ , జయసుధ" నాసమధానం. 


"మిస్సమ్మసినిమాలో ఒక పాటపాడూ, కరుణించుమేరి మాతా, శరణింక మేరిమాతా". "ఇంక ఆపు a+b హోల్ స్క్వేర్ ఎంతో చెప్పు". భయంకరమైన నిశ్శబ్దం. గొంతు పెగిలి ఒక్క మాట రాలేదు." ఇవ్వాళ హోం వర్క్ చేశావా." గబగబా బుర్రూపాను." నువ్వేచేశావా?" "అవునండీ". "రేపణ్ణించీ నా కుర్చీ పక్కనే కూర్చో,ఎంచక్కా క్లాసులో అందరూ కనిపిస్తారు" అన్నారు. పాపం ఆవిడకి మిగిలిన సబ్జెక్టుల్లో మంచిమార్కులు తెచ్చుకుంటూ లెక్కల్లో గుడ్లుపెడుతున్నానని బాధ. "అలాగేనండీ" అన్నాను. అంతా అబద్ధం అందరికీ నేనే కనిపిస్తాను. 


మిగిలిన సబ్జెక్ట్స్ బానే వస్తాయిగానీ, అదేంటో లెక్కల్లో మరీ బీదదాన్ని నేను. ఇంటర్వెల్ లో మిగిలిన జామకాయలు తినేసి , ఇంకో పావలాకి బోలెడు గంగి రేగ్గాయలు తెచ్చుకున్నాను. 


అన్నం బెల్లు లో అందరూ "రాబ్బా అన్నం తిందాం "అని పిలిచిన వాళ్ళకూ పిలవని వాళ్ళకూ ఉపవాసం సంగతి చెప్పేశాను. కానీ అన్నాల దగ్గర అదొక సందడి. అమ్మమ్మ వారానికి మూడురోజులు చేసే బంగాళాదుంప వేపుడు రాజీకి చాలా యిష్టం. అది నంచుకోటానికి తెచ్చుకునే బూందీ నాకిచ్చి , నాకూర అది తీసుకునేది. ఇక అన్నపూర్ణ తెచ్చే పప్పొడుం అందరికీ ఫావరెట్. దాన్ని గన్ పౌడర్ అనేవాళ్ళం లెండి. 


ఇంక మేరీ పెరుగన్నం లోకి తెచ్చుకునే గరుగ్గాయలు ఉప్పూ, నిమ్మరసంలో ఊరేసి భలే ఉండేవి. నా మాగాయి ముక్క దానికిచ్చి నేనవి తీసుకునేదాన్ని. ఈ రకంగా అన్నాలు తినేసి ఎంచక్కా బాక్సులు కడిగి పంపునీళ్ళు తాగేవాళ్ళం. అదంతా మిస్సయి ఒంటరిగా కూచుంటే, పార్వతీ టీచర్ చూసి" ఏంటోయ్ ఒంటరిగా కూచున్నావ్ అన్నం తిన్నావా" అంటే "నేను ఉపవాసం టీచర్" అని చెప్పేశాను. "అవునా,అయ్యో, ఆకలేస్తోందా ఇదితిను" అంటూ బాగులోంచి యాపిల్ తీసిచ్చింది. 


పంకజం మాత్రం అన్నం తింటున్న వాళ్ళమధ్య, నామధ్య తిరుగుతూ బాక్సుల్లోకి ఎవరేమి తెచ్చుకున్నారో చెబుతోంది. "చాల్లే ఇంక చెప్పకు, అసలే ఆకలేస్తుంటే" అని విసుక్కున్నాను. 


సాయంత్రం దాకా కాలక్షేపం చేసి చిన్నగా కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదాకా నడిచివచ్చేసరికి బొత్తిగా గాలితీసేసిన బెలూన్ లా ఉంది పరిస్థితి. కాళ్ళూ, చెతులు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెడుతూనే అమ్మమ్మ "అమ్మడూ, చకచకా పాలు తాగేసి, స్నానం చేసేసి రా నాకు కాస్త వంటలో సాయం చెద్దువూ, నీకు మడి లంగా, జాకెట్టూ బాత్ రూం గోడ మీదపెట్టాను" అని కేకేసింది.

స్నానం చేసి వచ్చేసరికి తులసికోటకు పక్కగా వెలిగించిన కుంపటీ, పక్కనే కంచు తవ్వతప్పాలా, చిన్ని పప్పు గిన్నే, ఒక స్టీలు గిన్నే, ఒక చిల్లుల పళ్ళెం, ఇంకో రెండు సిబ్బిరేకులూ చక్కగా అమర్చి ఉన్నాయ్ అచ్చం బాపూగారి సినిమాలో లాగా. 

ఆసరికే పొంగలి చేసి , స్టీలుగిన్నెలో కుమ్మరించేసి మూత పెట్టేసింది. చామ దుంపలు కూడా ఉడకేసి చిల్లుల పళ్ళెం లో వేసి వొలుస్తోంది. "అమ్మడూ, కాస్త చెట్లన గోంగూర ఉంది కోసుకురా. ఆచేత్తోనే కొంచెం కొత్తిమీర కూడా" అని పురమాయించింది. గోంగూర, కోత్తిమీర కోసుకుని బావి దగ్గర వాటిని శుభ్రంగా కడిగి పట్టుకొచ్చాను. నాలుగు బాదమాకులు కూడ కడిగి తెచ్చిచ్చాను. ఈలోగా కూర తిరగమోత చేసేసి చిల్లుల పళ్ళెంలో బాదమాకులు వేసి కూర సర్దింది. కందిపప్పు గిన్నెలో కడిగి ఎసరు పోసి కుంపట్లో పెట్టి, "నేను దీపాలు రడీచేస్తాను ఈ లోగా వంట చూడు" అని ఇంట్లోకి వెళ్ళింది. ఈలోగా నేను మాదొడ్లో దూరంగా కనిపించే కోటప్పకొండా, అందమైన వరిచేలూ, పడమటివైపు ఆకాశానికి ఎర్రరంగు వేసుకుంటున్న సూరీడు వైపూ చూస్తూ ఆనందించేలోగా "అమ్మడూ పప్పుఉడికిందేమో చూడూ" అమ్మమ్మ కేక. "ఎలా చూడాలి అమ్మమ్మా" అంటే " గరిటతో పప్పు తీసి ఒక గింజ బండమీద వేసి వేలితో నొక్కు. కొంచెం చిదిగిందంటే, ఉడికినట్లు. ఇప్పుడు గోంగూరా, పసుపు, ఒక్క చింతుట్టీ వెయ్యి. ఐదు నిముషాలాగి నీ చిన్నచేత్తో చారెడు ఉప్పెయ్యి. పది నిముషాలాగి రెండు చెంచాల కారమెయ్యి" అమ్మమ్మసలహా. 


అలా అమ్మమ్మ సలహా, సంప్రదింపులతో, పప్పు పూర్తిచేసి, అన్నం పొయ్యికి ఎక్కించాను. పావుగంటకి "అమ్మలూ అన్నం ఉడికిందా, నీరు తీసిందా" అమ్మమ్మ కేక. "ఎలా చూడాలి అమ్మమ్మా" గిన్నె పక్కవైపు నీళ్ళు వేలితో అలా చిలకరించు,చుర్రుమంటే దింపెయ్." ఓహో అన్నం కూడా వండేశా!

"ఒక దోసకాయ్ తెచ్చి కుంపట్లో పడెయ్, నే వస్తున్నాలే" అమ్మమ్మ కేకవిని ఒక దోసకాయ తెచ్చి కుంపట్లో వేశాను. 


కాసేపటి తర్వాత అమ్మమ్మ వచ్చి కాలిన దోసకాయ పొట్టుతీసి విచ్చతీసి ఆరబెట్టి,

నిమ్మకాయంత చింతపండూ, పది పచ్చిమిర్చీ, చారెడు ఉప్పూ, కాసింత కొత్తిమేరా, కాల్చిన దోసకాయా నాచేత రోట్లో నూరిచ్చి కమ్మగా నేతి తిరగమోత పెట్టేసింది. 


చివరిగా కాస్త చింతపండు రసంతీసి కొత్తిమేరా, కరేపాకూ, ఉప్పూ , బెల్లమ్ముక్కా కలిపి కుంపటి మీద పెట్టి, పూజ చేసి నాచేత కూడా దీపాలు వెలిగించి వాకిట్లోనూ తులసెమ్మదగ్గరా పెట్టించింది. అప్పటికి చందమామ గుండ్రంగా వెండిపళ్ళెంలా ఆకాశం లో మెరిసిపోతున్నాడు. 

కుంపట్లో బొగ్గులు సరిచేసి పాలగిన్నె పెట్టింది. అందులో నెమ్మదిగా పొంగకుండా బాగా కాగి భలే రుచిగా ఉంటాయి పాలు. నన్ను అరిటాకులు కోసుకు రమ్మని అమ్మనీ, చెల్లినీ, ఉమక్కనీ, అన్నయ్యనీ, నాన్ననీ అందర్నీ రమ్మని భోజనాలు వడ్డించింది. అన్నాలు తింటూ మధ్యలో "మాచిట్టి తల్లి చిన్ని చేతులతో ఎంత బాగా చేసిందో, పప్పెంత రుచిగా ఉందో పచ్చడెంత బాగుందో" అని మెచ్చుకుంటూ తిన్నది. ఆ మెప్పుదల ఇప్పటిదాకా నాకు వండటం అనే పనిమీద ఎంతటి ఉత్సాహాన్ని కలిగించిందో చెప్పలేను. అందరం పరమాన్నం. పప్పూ, పచ్చడీ, చారూ, గడ్డపెరుగూ వేసుకుని సుష్టుగా తిన్నాం. 


కొద్ది కొద్దిగా మిగిలిన పప్పూ, అన్నం , కూరా అన్నీ ప్లేట్లో సర్ది వెనగ్గా ఉండే రిక్షా హనుమంతు భార్యను కేకేసి ఇచ్చేసింది. అమ్మడూ చిన్న బకెట్ తో నీళ్ళు పట్రా అని ఆ రెండు గిన్నెలూ ప్లేట్లూ అక్కడే కడిగేసింది. ఆనక వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటూ బజ్జుండిపోయాం. 


"వింటుంటే భలే భాగుంది కదా" అన్నాను పంకజంతో" అవును మంచి కృష్ణ వంశీ ఫామిలీ మువీలాగా బానే ఉంది అంది," నవ్వుతూ" అయితే పద" అని వంటింట్లోకి దారి తీసాను. వంటింట్లో కెందుకూ, ఇప్పుడు మీ అమ్మమ్మ చేసిన వంటేదో మళ్ళీ చేయాలా?" అంటూ నావెనకే వచ్చింది పంకజం. 

"సరిగా చూడు సింకునిండా స్థలం చాలకపొర్లిపోతున్నాయి గిన్నెలు,ఇంకా వాషేరియాలో కూడా బోలెడూ"


"కేవలం రెండుమూడు గిన్నెలతో రుచిగా, శుచిగా, అంతమందికి వండి, రెండు నిముషాల్లో గిన్నెలు కడిగేసేది మా అమ్మమ్మ, హౌ? ఎలా? నిన్న నలుగురు అతిథులు (గెస్ట్ లు) వచ్చి ఇవ్వాళ పనమ్మాయి రాకపోతే ఇదీ నా పరిస్థితి." 


"ఐ వాంట్ నెల్లూర్ పెద్దారెడ్డీ రైట్ నౌ, ఐ వాంట్ అమ్మమ్మా రైట్ నౌ, పంకజం ఐ వాంట్ అమ్మమ్మా రైట్ నౌ అంటున్న " నాకేసి జాలిగా చూస్తూ.


"నిజమే ఆరోజుల్లో ఆహారంలో సింప్లిసిటీ ఎక్కువ రుచికూడా ఎక్కువ. 

ఈ రోజుల్లో రుచిపక్కనబెడితే ఆర్భాటం ఎక్కువ, అందుకే పాత్రల వాడకం ఎక్కువ, అందుకే పనీ ఎక్కువ" అంది నావైపు జాలిగా చూస్తూ.


 *పద్మజ కుందుర్తి.*

తిరుమల

 


 *ఇప్పుడే ప్రారంభించారు*


అక్టోబర్ నెల ఈరోజు నుండి 31 వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ .300 / -) అదనపు కోటా ఒక స్లాట్‌కు 1500 టిక్కెట్లలను రెండు

స్లాట్‌కు 3000 

  *ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టీటీడీ* https://tirupatibalaji.ap.gov.in.

సినిమా హాళ్లూ కమ్యూనిజమూ...

 

మన దేశంలో... ఒకప్పుడు టాకీసులుండేవి. 

వాటిలో నేల క్లాసు టిక్కెట్లు చాలా ఎక్కువగానూ...

బెంచ్ కొంత తక్కువగానూ...

కుర్చీ ఇంకొంచెం తక్కువగానూ ఉండి...

బాల్కనీ టిక్కెట్లు చాలా తక్కువగా ఉండేవి. 

అంటే భారతదేశంలో పేద మధ్య తరగతి ఎక్కువగా ఉన్నారనీ...

డబ్బులున్న మారాజులు తక్కువ మందే ఉంటారనేది అప్పటి థియరీగా అర్ధం చేసుకోవచ్చు. 

తొంభైల్లో నూతన ఆర్ధిక సంస్కరణలు వచ్చాక థియేటర్లలో ప్రొడక్టర్ గోడ నుంచి మొదలు పెట్టి తెర ముందు మూడో లైను వరకూ బాల్కనీయే పెట్టేయడం మొదలెట్టారు.

 మిగిలిన మూడు లైన్లు నేల, బెంచీ,కుర్చీ అనే మూడు దిగువ తరగతులూ అన్నమాట. 

అంటే పేదరికం దారుణం గా తగ్గిపోయిందనీ...

డబ్బున్నోళ్లు విపరీతంగా పెరిగారనేది ఆ టైమ్ థియరీగా అర్ధం చేసుకోవచ్చు. 

రీసెంట్ గా మల్టీ ప్లెక్సుల్లో అసలు తరగతులే లేవు. ప్రొజక్టరు గోడ నుంచీ తెర ముందు వరకు అంతా ఒకటే ధర. 

అంటే...హేవిటి వర్గ రహిత సమాజం అన్నమాట. అంటే కమ్యునిస్టు థియేటర్లన్నమాట. 

ఇలా సినిమా హాళ్ల ప్రకారం చూస్తే దేశంలోకి వర్గరహిత సమాజం వచ్చేసిందన్నమాట.

అయితే కొన్ని మల్టీ ప్లెక్సుల్లో... ఒక లైన్ పడక కుర్చీలు పెట్టి కొంత సామాజిక న్యాయం చేస్తున్నారనుకోండి.. 

సూక్ష్మం గా ఇదీ కథ.

సౌందర్య లహరి -Soundarya Lahari 🌹* *3 వ శ్లోకము*

 *🌹 సౌందర్య లహరి -Soundarya Lahari 🌹* 

*3 వ శ్లోకము*

*🍃 సమస్త జ్ఞాన సముపార్జన* 🍃

  

శ్లోII 3. అవిద్యానా మంత స్తిమిరమిహిరద్వీపనగరీl  

          జడానాం చైతన్య స్తబకమకరందస్రుతిఝరీl  

          దరిద్రాణాం చింతా మణిగుణనికా జన్మజలధౌ  

         నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతిll 

 

తా ll అమ్మా !నీ చరణ పద్మ రేణువు అజ్ఞానము అను చీకటితో ఉన్న వానికి సూర్యోదయము జరుగు పట్టణము వంటిది, మంద బుద్ధులకు చైతన్యము అను పుష్పముల నుండి వెలువడిన మధుర ధార వంటిది,దరిద్రముతో ఉన్న వానికి చింతామణుల హారము వంటిదియు, సంసార సముద్రమున మునిగిన వానికి వరాహావతారము అగు విష్ణు మూర్తి యొక్క కోర వంటిది కదా !


జప విధానం - నైవేద్యం:-

ఈ శ్లోకమును ప్రతి రోజు 45 రోజుల పాటు 2000 సార్లు చేసి, నైవేద్యంగా వడ ప్రసాదంగా సమర్పించిన, జ్ఞాన, విజ్ఞానాలు ప్రసాదించబడును అని చెప్పబడింది


SLOKA -3

🍃Attainment of all Knowledge🍃


3.. Avidyanam antas-timira-mihira-dweeppa-nagari Jadanam chaitanya-stabaka-makaranda-sruti jhari Daridranam cinta-mani-gunanika janma-jaladhau Nimadhanam damshtra mura-ripu-varahasya bhavati.


The dust under your feet, oh goddess great, is like the city of the rising sun, that removes all darkness, unfortunate, from the mind of the poor ignorant one, is like the honey that flows, from the flower bunch of vital action, to the slow witted one, is like the heap of wish giving gems, to the poorest of men, and is like the teeth of lord Vishnu in the form of Varaha, who brought to surface, the mother earth, to those drowned in this sea of birth.


Chanting procedure and Nivedyam( offerings to the Lord) :

If one chants this verse 2000 times every day for 45 days, and offers Vada (made out of Urad Dhal ) as prasadam,one is said to attain knowledge and wisdom. 

🌹 🌹 🌹 🌹 🌹

*అనుకోని అతిధి (కథానిక )*


      🌷🌷🌷

రోజూ ఉదయాన్నే స్నానంచేసి 

పెరట్లో తులసికోట గూటిలో దీపం పెట్టి పూలతో అలంకరణ చేసి,"తన్మూలే సర్వ తీర్ధాని" శ్లోకం చెప్పుకొని, అరటిపండో, బెల్లం ముక్కో, ఏదోకటి నైవేద్యంపెట్టేది బామ్మ. కోడలు పెట్టిన ఇడ్లీలు తిన్నాక బీపీ బిళ్ల వేసుకొని, మళ్ళీ పెరట్లోకెళ్ళి ఆ నైవేద్యం తీసుకొని కళ్లకద్దుకొని తిని, కాసేపు ఎండలో తిరుగుతూ పూల మొక్కలు, కరివేపాకు చెట్లు, కూరల పాదులు పరిశీలించి లోపలకెళ్ళి విశ్రాంతి తీసుకోవడం నిత్య కృత్యం!

ఒకరోజు అలాగే వచ్చిచూస్తే 

తులసికోట దగ్గర అరటిపండ్లు 

లేవు. ఎవరో తినేసి తొక్కలు 

మందారచెట్టు మొదట్లో వేసి వెళ్లారు. ఎవరు చెప్మా, తమఇంట్లో చిన్నపిల్లలు ఎవరూలేరు మనవడూ, మనవరాలు సిటీలో ఉద్యోగం. సంసారాలు. కొడుకు, కోడలు, తానూ మాత్రమే ఉంటారు. రెండ్రోజులు అలా ప్రసాదం మాయమయ్యాక నిఘా పెట్టింది బామ్మ. తొమ్మిది గంటలకు ప్రహరీ గోడదూకి ఒక కోతిపిల్ల నేరుగా వచ్చి ఇత్తడి పళ్లెంలోని దానిమ్మ గింజలు మొత్తం తినేసి వెళ్లిపోవడం చూసి నవ్వొచ్చింది బామ్మకి. ఆరి బుజ్జిముండా, నువ్వట్రా అని, 

తర్వాత రోజునుండి నైవేద్యం పరిమాణo పెంచి అక్కడ నిలబడి గమనిస్తూ, కోతిపిల్లని పలకరించేది బామ్మ. దాంతో భయం పోయిన కోతిపిల్ల సాయంత్రం వరకూ పెరట్లోనే నీడలో పడుకొని బామ్మపెట్టే మధ్యాహ్న భోజనం కోసమే ఎదురు చూసేది. మెడలో ఎర్రదారంతో ముద్దొస్తున్నావ్ మారుతీ అంటూ దాంతో మాట్లాడుతున్న అత్తగారిని చూసి కోడలు ఆక్షేపణ చేసింది. 

"అత్తయ్య గారూ, మీనేస్తం మన మొక్కలు పాడు చెయ్యకుండా చూసేబాధ్యత మీదే మరి!" అంటూ. 

"నిజమే లక్ష్మి, కోతిబుద్ది అన్నారు కదా, కానీ తరమ బుద్ది కావడం లేదే,ఏగారడీ వాళ్ళనుండో తప్పించుకొచ్చి ఉంటుంది. ఈ ఊర్లో కోతులు ఎప్పుడు కనపడలేదు. ఈసారి గుంపువస్తే వాటితో ఇదే వెళ్తుందిలే. అందాకా మనమే ముద్దపెడదాం. అసలు ఇది రాత్రిళ్ళు ఎక్కడఉంటుంది అని, ఆశ్చర్యంగా ఉంది!"

అంటున్న అత్తగారితో" వీధి చివరి రామాలయం గాలిగోపురం అరుగుల మూల 

గూడులా ఉందట. అక్కడ పడుకుంటున్నదని పక్కింటి పిల్లలు చెప్పారు" అన్నది లక్ష్మి. ఆమెకీ భర్తకీ కూడా మూగజీవులమీద ప్రేమ. అందుకే అభ్యంతరం చెప్పలేదు ఇద్దరూ. బామ్మ భోంచేసాక చిన్నచాపా, దిండు తెచ్చుకోని పెరట్లోనే నీడగా ఉండేచోట కాసేపు నడుమువాల్చేది కోతి పిల్లమీద ఓకన్నేసి. వత్తులు చేసుకోవడమో, పప్పులు, బియ్యం బాగుచేసి డబ్బాల్లో పోయడమో, అన్నీ చిన్నిచిన్ని 

కళ్లతో వింతగా చూస్తూ మారుతి బామ్మదగ్గర బాగా అలవాటు అయింది. ఇంట్లోకి మాత్రం వచ్చేది కాదు, మిక్సీ, కుక్కర్ విజిల్ చప్పుడంటే చాలా భయం! అన్నం పెడితే తినడం, పెరట్లో ఉన్న చిన్న ఉసిరి కాయలు కిందరాలినవి, కొండ రేగుపండ్లు ఏరుకొని తింటూ, నూతిపళ్లెం దగ్గర తనకోసమే ఉంచిన ప్లాస్టిక్ మగ్గులో నీళ్ళు తాగుతూ, సూరీడు దిగిపోయాక, బామ్మ ఇచ్చిన పండో బిస్కెట్లో తినేసి వెళ్లిపోయేది మారుతీ. సాయంత్రం తులసిమొక్క దగ్గర బామ్మ పాట వినడం దానికి బాగా ఇష్టం. సెలవులకి వచ్చి వారం ఉండివెళ్లే పిల్లలకీ, ఊరిలో ఉండే బంధువులకీ కూడా అలవాటు అయింది కోతిపిల్ల. నుదుట సింధూరం బొట్టు పొడవుగా బామ్మ పెడుతుంటే, బుద్దిగా పెట్టించుకుంటుంది. చిన్నరేకులగది వేశారు మారుతి కోసమే!

కాలంతో బాటు పెరిగింది మారుతీ. బంధువులలో వెటర్నరీ డాక్టర్ ఉండడంతో వ్యాక్సిను, మందులు వాడుతున్నందున ఆరోగ్యంగా ఉంది. వడియాలు పెట్టినపుడు కాకులు ముట్టుకుంటే తరమడం బామ్మ ఏదైనా చెప్తే 

అర్ధమైనా కాకున్నా శ్రద్దగా వినడం, మనవళ్లకి, పిల్లలకీ బాగా మాలిమి అయింది మారుతీ. వచ్చిన మూడునెలలకి కార్తీకమాసంలో ఒకరోజు పొద్దున్నే గారడీ జంట వచ్చివాకిట్లో కూర్చుంది. ఎవరు మీరు, ఎందుకు వచ్చారూ అని బామ్మగారి కొడుకు అడుగుతా ఉంటే ఇద్దరూ ఏడవడం మొదలు పెట్టారు. ఆ కోతి మాదే బాబూ. అడవిలో కష్టపడి పట్టుకొనివచ్చాము. కాస్త గడమీద నడవడం, బిందె చంకలో పెట్టుకొని నీళ్లకి పోవడం, ఇల్లు చిమ్మేది, కర్రపుల్ల భుజంమీద పెట్టి డాన్స్ లూ నేర్పిన, మాతో బాటు బాగానే చూస్తిమి, తప్పిచ్చుకొని వచ్చేసింది దొంగకోతి. అదిలేకుంటే పదిరూపాయలు కూడా రావట్లేదు సామీ, మా కోతిని మాకిచ్చేయ్," అంటూ ఒకటే గోల. గుడికెళ్ళి వచ్చిన బామ్మ అసలే ఉపవాసంతో ఉందేమో వీధిఅరుగుమీదే కూలబడిపోయింది. వీళ్ళు వదిలేలాలేరు ఎలా శివయ్యా అనుకుంటూ. కొన్ని నిముషాలు మౌనంగా ఉండి," ఎందుకు ఇవ్వాలి,అది మా మారుతి. నువ్వు చెప్పేది నిజమే అయితే నీదగ్గరికి రాలేదేం? అదిగో ఆ జామ చెట్టెక్కి అరుస్తూ ఉంది. నువ్వు ఎన్ని హింసలు పెట్టి ఉంటావో, పాలుతాగే వయసులో వలపెట్టి తేవడానికి దయలేదా? ఇప్పుడు శోకాలు పెట్టావే, నీపిల్లలు నీకుముద్దు అయితే, దానికి తల్లి ప్రేమలేకుండా చేస్తివి. తిండి పెడితే సరిపోదు. మూగజీవిని 

దేవుని బిడ్డగా చూడాలి. వెళ్ళెళ్ళు!" అన్నది బామ్మ. "అమ్మా, వీళ్ళతో గొడవలెందుకు పంపేద్దాం!" అన్న కొడుకుమాటలుకి మండిపడింది శాంతమ్మ గారు." ఒరేయ్, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏమి అడగలేదు, ఇవాళ ఈ ప్రాణి గురించి చెప్తున్నా, అనుకోని అతిధిలా మన జీవితంలోకి వచ్చింది. కుక్కలే కాదు ప్రతిజీవి విశ్వాసం చూపేవే. వాళ్ళు తీసుకొనివెళ్లి ఇంకా హింసపెట్టి బందీగానే చూస్తారు. పంపేసానంటే నా కంటే పాపి ఎవరూ ఉండరు. నేను ఇవ్వను మారుతిని" అంటున్న పెద్దామెని చూసి, కాళ్లకి దండాలు పెట్టి, "అమ్మా, తప్పే చేశాము, మీరు సదువు, ఉజ్జోగాలు, ఇల్లు వాకిలి భద్రంగా ఉన్నోళ్లు. మావి సంచారి బతుకులు. ఈ రోజుకి ఆకలి తీర్తే సాలు, నలుగురు బిడ్డలుండారు. వాళ్ళని సాక్కో వాలా, ఆదాయం లేకపోతే ఎట్లా సెయ్యల?" అంటూ మొండిగా 

వాదిస్తూ ఉన్న వాళ్ళని చూసి, చివాలున అరుగుమీదనుండి లేచి ఇంట్లోకి వెళ్లిన బామ్మ, తన ట్రంకుపెట్టె అడుగున ఉన్న తమిళనాడు పసుపు రంగు సంచీలో ఉన్న నోట్లు అన్నీ తీసుకొని వచ్చి కొడుకు చేతిలో పెట్టి లెక్కపెట్టబ్బాయ్ అన్నట్టు చూసింది. లెక్కేసి ఇరవై ఒక్క వేలు అమ్మా అన్నాడు కొడుకు. "వాళ్ళకిచ్చి పంపు, ఇక ఎప్పుడూ ఇటు రాకూడదు. ఆ డబ్భుతో కిరాణా కొట్టు పెట్టుకోమను, తలో పనిచేసుకుంటే ఆ కొట్టులో ఉప్పు, పప్పుతోనే కుటుంబం కూడా గడిచిపోతుంది. వచ్చే ఆదాయం లో పెట్టుబడి పోను మిగతా పిల్లలకే" అంటున్న 

బామ్మ కాళ్లమీద పడబోయాడు గారడీ అతను. డబ్బులు సంచీ లో పెట్టుకుని దండాలు పెడుతూ వెళ్లిపోయారు. చుట్టూ చేరిన జనం నోరెళ్ళ బెడుతూ ఇళ్ళకి వెళ్లారు. "కాశీకి వెళ్ళాలి, అంటూ దాచుకున్న డబ్బులు అలా ఇచ్చేసారు ఏమిటి అత్తయ్యా?" అన్నది కోడలు నొచ్చుకుంటూ, ఆమెకు తెలుసు శాంతమ్మ గారి ఔదార్యం. కోడలుగా కాదు కన్న బిడ్డలాగే చూసింది తనను అత్తగారు. తన పుట్టింటి వారికి ఎంతో సాయం చేసింది, కట్నాలు, కానుకలూ అసలు అడగలేదు. తనకున్న దేదో పెట్టి జరిపించినది అత్తగారు ఇంట్లో ప్రతి కార్యక్రమం. "కాశీ కి వెళ్ళేది మాత్రం పుణ్యం కోసమే కదా లక్ష్మి. ఆ మూగజీవి చూడండి వాళ్ళని చూసి పిచ్చిగా అరుస్తూ ఏడుస్తూ చెట్టెక్కి పోయింది. దీనిని రక్షించడం కంటే పుణ్యం ఇంకోటి ఉందా? ఏదీ నాకు పొంగలి పెట్టు, ఆకలిగా ఉంది. రారా మారుతీ, అప్ప తిందాం" అంటూ పెరట్లోకి వెళ్ళింది బామ్మ. అలా ఏళ్ళపాటు బంధం నిలిచిఉంది. తొంభయ్ ఆరేళ్ళు ఆరోగ్యంగా కోడలితో సమానంగా పనిచేసిన బామ్మ 

ఒకరాత్రి నిద్రలోనే అనాయాస 

మరణం పొందినారు. ఊరు మొత్తం కదిలింది ఆమె ఆఖరియాత్రలో. మారుతి మౌనంగా పడుకున్నావా బామ్మా, లే అన్నట్టు చూస్తూ తలదగ్గరికి వెళ్లి గంటల తరబడి కూర్చున్నది. స్నానం చేయించే సమయంలో పిల్లలు పెరటిలో ఉన్న రేకుల గదిలో మారుతిని ఉంచి పండ్లు ఉంచి తలుపులు గొళ్ళెం పెట్టేసారు. బామ్మగారు నిశ్చలంగా రుద్రభూమిని చేరారు. ఇంటికి వచ్చి స్నానాలు చేసి రూమ్ తలుపులు తీసి చూస్తే మారుతి బామ్మతెల్లచీర 

మీద పడుకొని నిద్రలో ఉంది. 

పండు ఒకటి కూడా ముట్టుకోలేదు. నెమ్మదిగా కోడలు లక్ష్మి పరామర్శతో, దగ్గరికి తీసుకొని అన్నం పెట్టడంతో మామూలుగా ఉన్నా ఎక్కువగా గుడి దగ్గరికి వెళ్లి పోతున్నది మారుతి. 

కుటుంబం కూడా పెద్దదిక్కు కోల్పోయిన దుఃఖం నుండి తేరుకొని, బామ్మగారికి ఇష్టమైన పనులు చేస్తూ, ఒక రోజు ఆమె రాసే రామకోటి పుస్తకంలో చివరిపేజీలలో, మారుతి గురించి చదివి చాలా 

ఆశ్చర్యపోయారు. మారుతిని బాగా చూసుకోమని, ఒకవేళ కోతుల సమూహం ఊరిలో కొస్తే దాని ఇష్టప్రకారమే వెళ్లిపోనివ్వమని, లేదా మునుపటి లాగే ఆదరణగా చూడండి అని రాసి పెట్టింది బామ్మ. ఊరివాళ్ళకి కొన్ని ఏళ్ళ పాటు ఈఅనుబంధం గుర్తు ఉండిపోయింది!


✍️. ఎం. వి. ఉమాదేవి, నెల్లూరు.

శంకర