5, అక్టోబర్ 2020, సోమవారం

ముదితల్ నేర్వగరాని విద్య గలదే

 ముదితల్ నేర్వగరాని విద్య గలదే 


ముద్దార నేర్పించినన్.



https://cherukurammohan.blogspot.com/2016/10/blog-post_20.html


తెలుగు మాట్లాడుతూ, తెలుగు చదువుతూ ఉండే వారికి ఈ పద్యపాదము సదా సుపరిచితము. కానీ మిగతా మూడు పాదములు తెలిసినవారు తక్కువగా ఉండవచ్చు. అందుకే ఈ ప్రయత్నము.


చదవన్నేర్తురు పూరుషుల్ వలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో


నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో


నుదితోత్సాహము తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో


ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.


ఇది చిలకమర్తి వారి నరకాసుర వధ లేక ప్రసన్న యాదవమను నామాంతరములు గల నాటకములో సత్యభామ యుద్ధ కౌశలాన్ని వీక్షిస్తున్న శ్రీకృష్ణుని చేత కవి గారు


పలికించిన ఆణిముత్యము ఈ పద్యము.

కామెంట్‌లు లేవు: