ఒడిశా రాష్ట్రం రాజధాని భువనేశ్వర్ కు ఈశాన్యం దిశగా, 98 కీ.మీ దూరంలో జాజపూర్ పట్టణం కలదు. ఇది జిల్లా కేంద్రం. జాజ్ పూర్(Jaipur) బస్ స్టాండ్ కు 2 కీ.మీ దూరం లో శ్రీ బిరజాదేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రతీతి. దక్షిణ భారతీయులు గిరిజాదేవిగా కొలుస్తారు. క్షేత్రం ను " నాభి గయ " అని కూడ పిలుస్తారు. బిరజాదేవి ఆలయ సింహ ద్వారం తూర్ప అభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం చాల విశాలముగా ఉంటుంది. ప్రధానాలయం తో పాటు నాభి గయ మండపం, డోల మండపం, శ్రీ ఇన్నెశ్వరాలయం (శివాలయం), శ్రీ హనుమాన్ మందిరం, భైరవ, కార్తికేయ, గంగాధర్, విష్ణు రూపాలు, 108 శివ లింగాలు మొదలగునవి ఉన్నాయి. ప్రధానాలయం నందు శీ బిరజాదేవి అమ్మ వారిని దర్శించగలము. ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయం. కలిగి యున్నాది. ప్రాచీన ఆలయం ను 18 వ శతాబ్ధములో పునరుద్ధరించారు. గర్భాలయం లోని అమ్మ వారు మహాతేజోమహిమతో అలరారుతుంది. మాఘ అమావాస్య నాడు అమ్మ వారి జన్మదిన ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వీటిని త్రివేణి అమావాస్య ఉత్సవాలుగా పిలుస్తారు. దసరా ఉత్సవాలు 16 రోజులు నిర్వహించుతారు.
భారతదేశములో శిరో గయ (బీహర్ గయ), నాభి గయ (జాజ్ పూర్), పాద గయ (పిఠాపురం) అను మూడు గయా క్షేత్రములున్నాయి. గయా క్షేత్రాల్లో జరుపు శాద్ధ విధులు వలన పితృ దేవతలుకు శాశ్వత కైవల్యం పొందగలరు అని గాఢమైన విశ్వాసం హైందవులుకు ఉంది. తమ పితృ దేవతలకు పితృ కర్మలు, పిండ ప్రదానములు భక్తి శ్రద్ధలతో గయా క్షేత్రాలలో నిర్వహించు చుంటారు. బిరజాదేవి ఆలయ ప్రాంగణములో ఈశాన్యం వైపు నాభిగయ మండపం ఉండును. ఇచ్చట గల బావిలో తర్పణాలు విడవడం జరుగుతుంది. ఇవి నేరుగా కాశీ చేరుతాయట! క్షేత్రం నందు శ్రీ త్రిలోచనేశ్వరాలయం, శ్రీ వరనాథ్ ఆలయం, శ్రీ జగన్నాథాలయం, వైతరణి నది మొదలగునవి చూడదగినవి.
చెన్నై - హౌరా రైలు మార్గంలో భువనేశ్వర్ దాటగానే కటక్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి జాజ్ పూర్ కు రవాణా సదుపాయములున్నాయి. కటక్ రైల్వే స్టేషన్ కు 73 కీ.మీ దూరంలో జాజపూరు-కెంఝార్ రోడ్డు అను రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ అన్ని రైలు ఆగుతాయి. రైల్వే స్టేషన్ కు ఉత్తరం వైపుగా కెంఝార్ పట్టణం ఉంటుంది. రైల్వే స్టేషన్ కు దక్షిణ వైపుగా 30 కీ.మీ దూరాన జాజపూర్ ఉండును. రైల్వే స్టేషన్ నుంచి జాజ్ పూర్ కు బస్సులు/వేన్లు/టాక్సీలు నిరంతరం బయులుదేరుతాయి. జాజపూర్ బస్ స్టాండ్ నుంచి శ్రీ బిరజాదేవి ఆలయం మరియు మిగిలన ఆలయాలు సందర్శించుటకు ఆటోలు ఉంటాయి. యాత్రికులుకు వసతులు జాజ్ పూరు-కెంఝార్ రోడ్డు రైల్వే స్టేషన్ నందు మరియు స్టేషన్ బయట దొరుకుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి