5, అక్టోబర్ 2020, సోమవారం

**హిందూ ధర్మం** 57

 **దశిక రాము**




 (అక్రోధః)


కోపం అనేది అగ్ని వంటిది. అగ్ని ఇతర వస్తువులను కాలుస్తుంది, కానీ కోపం తనకు వశమైన వ్యక్తినే ముందు కాల్చి, తర్వాత మిగితావారి మీద ప్రతాపం చూపిస్తుంది. కోపం మనిషి పతనానికి కారణమవుతుంది, సర్వరోగాలను తీసుకువస్తుంది. కోపం చేసే అనర్ధాలు అన్ని ఇన్నీ కావు. కోపంతో ఒక రాయిని తన్నితే, మన కాలికి దెబ్బతగులుతుంది. కోపం వలన మనం చేసిన సాధన మొత్తం వ్యర్ధమవుతుంది. అందుకే సుమతీ శతక కర్త బద్దెన 'తన కోపమే తన శత్రువు' అన్నారు. కోపం అనేది మనిషి యొక్క సహజ లక్షణం కాదంటుంది భారతీయ సంస్కృతి.


కోపం గురించి పెద్దలు ఒక చిన్న కధ చెబుతారు. ఒక వ్యక్తికి విపరీతమైన కోపం ఉండేది. అందరి మీద అరిచేవాడు, తిట్టేవాడు. దాంతో జనం అతని దగ్గరకు రావడానికి బయపడేవాళ్ళు. కుటుంబసభ్యులు బిక్కుబిక్కుమంటూ బ్రతికేవారు, తప్పదు కనుక భరించేవారు. ఇదిలా ఉండగా ఒక రోజు అతని తండ్రి, తన పిల్లాడి భవిష్యత్తుని గురించి ఆందోళన చెంది, తమ ఊరికి ఒక సాధువు వచ్చాడాని, అతని దగ్గరకు వెళ్తే పరిష్కారం లభిస్తుందని చెప్తాడు.


తన తండ్రి చెప్పినట్టుగానే ఈ వ్యక్తి ఆ సాధువు దగ్గరకు వెళ్ళి, తన సమస్యను ప్రస్తావిస్తాడు. అది విన్న సాధువు, ఇక నుంచి నీకు కోపం వచ్చి, ఇతరుల మీద అరిచిన ప్రతిసారీ, మీ ఇంటిలో రాతి గోడకు ఒక మేకును కొట్టు, నువ్వు మేకులు కొట్టడం ఆపేసిన రోజు మళ్ళీ నా దగ్గరకు రా అని చెప్పాడు. సాధువు చెప్పినట్టుగానే చేయడం మొదలుపెట్టాడు. రోజులు గడిచేకొద్ది, అతనికి మేకులు కొట్టడం ఇబ్బందిగా మారింది, రాతి గోడ కావున మేకు త్వరగా దిగేది కాదు, ఓపిక ఉండేది కాదు, కోపగించుకుని మేకులు కొట్టడంకంటే కోపాన్ని అదుపు చేసుకుని మౌనంగా ఉండడమే మేలు అనిపించింది.. తిరిగి సాధువు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు సాధువు ఇప్పుడా మేకులన్నీ తీసేసి నా దగ్గరకు రా అన్నాడు. ఏ మేకులన్నీ తీయడానికి కొన్ని నెలలు పట్టింది. మళ్ళీ సాధువు దగ్గరకు వెళ్ళగా, అప్పుడు సాధువు, మేకులన్నీ తీయగా అక్కడ నువ్వు ఏమి గమనించావు అన్నారు, గోడ మొత్తం బొక్కలు పడి, గోడ అందవిహీనంగా తయారైంది అన్నాడు వ్యక్తి. 'నువ్వు కొట్టిన మేకులు వలన గోడ అందం చెడిపోయినట్టే, నువ్వు కోపంలో అన్న మాటల వలన ఇతరుల మనసు బాధపడుతుంది. గోడకు మరమత్తు చేసి, తిరిగి పూర్వ రూపం తీసుకురావచ్చు, కానీ గాయపడిన విరిగిపోయిన మనసును తిరిగి అతికించలేమి నాయానా!' అని సాధువు భోధ చేశాడు. తను చేసిన తప్పును తెలుసుకున్న ఆ వ్యక్తి ఇంకెప్పుడు ఎవరిని పల్లెతి మాట కూడా అనకపోగా, ఇంటికి వెళ్ళి తన కుటుంబ సభ్యులను క్షమించమని ఏడ్చాడు. మనం కూడా ఎందరిని ఆవేశంతో ఏన్నో మాటలు అని ఉంటాము. ఇప్పటికైనా విషయం అర్దం చేసుకుని కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. 


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

https://chat.whatsapp.com/EYVSW5i6Q1O1973h8txkPS


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95


*ధర్మము - సంస్కృతి*


**ధర్మో రక్షతి రక్షితః**

 గ్రూప్స్

 ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: