5, అక్టోబర్ 2020, సోమవారం

శంకర



























 

2 కామెంట్‌లు:

SRI SARMADA చెప్పారు...

పరాన్నభుక్కు

అడవికి దగ్గరగా వున్న కుగ్రామంలో, ఒక సోమరి యువకుడు వుండేవాడు.

వాడికి తల్లిదండ్రులు పెట్టిన లక్షణమైన పేరువున్నా, అది యెవరికీ తెలిసేది కాదు. ఎందుకంటే, వాడు యెప్పుడూ, యెవరైనా యేదైనా వుచితంగా యిస్తారేమో, అని యెదురుచూస్తూ, వాళ్ళు పెట్టింది తిని, గమ్యం లేకుండా, కాలక్షేపం చేస్తుండేవాడు. అందుకని గ్రామస్తులు వాడికి, ' పరాన్నభుక్కు ' అని పేరుపెట్టి చులకనగా చూసేవారు. .

స్వతహాగా బద్ధకస్తుడు అవడం వలన, తిండీతిప్పలు సులభంగా జరిగిపోయే ఉపాయం కోసం వెదుక్కోవడం అలవాటు చేసుకున్నాడు, పరాన్నభుక్కు. ఎక్కడ యేవిధమైన సంతర్పణలు వున్నా, అవి పెళ్ళిభోజనాలైనా, పితృకార్యాలైనా, హాజరయ్యేవాడు

ఆ క్రమంలో, ఒకరోజు మన పరాన్నభుక్కు, ఒక పండ్లతోటలో చెట్టెక్కి, పళ్ళు కోసే ప్రయత్నంలో వుండగా, తోటమాలి,కర్ర పట్టుకుని వస్తుంటే, వాడిని చూసి, భయపడి, పరాన్నభుక్కు, దగ్గరలోని అడవిలోకి, పరుగుతీసాడు, దాక్కుందామని. అడవిలో పరాన్నభుక్కుకు తినడానికి యేమీ దొరకలేదు. మళ్ళీ, నెమ్మదిగా గ్రామంలోకి వద్దామని ప్రయత్నిస్తుండగా, ఒక చిత్రమైన దృశ్యం అతని కంటబడింది.

ఒకనక్క, కాలు పోగొట్టుకుని, పరిగెత్తే వీలులేక, కనీసం నడవలేక, దేక్కుంటూ రావడం కనిపించింది. ఒక చెట్టుచాటునుండి చూస్తున్న పరాన్నభుక్కుకి. ' అంత భయంకరమైన అడవిలో, అన్ని అవయవాలూ వున్న జంతువులే, బితుకు బితుకు మంటూ, క్రూరజంతువుల బారినపడకుండా, దాక్కుని తిరుగుతూ వుంటాయి కదా ! , ఈ కుంటినక్కకు, జీవనోపాధి యెలా దొరుకుతుందా ' అని అమితంగా ఆశ్చర్యపోసాగాడు, పరాన్నభుక్కు.

ఇంతలో, అతని శంకకు తగ్గట్టు గానే, ఒక సింహం యేదోజంతువు మాంసం తింటూ అటు రాసాగింది. వెంటనే, పరాన్నభుక్కు దగ్గరలోని చెట్టెక్కి, ' యేమి జరుగుతుందో ' అని చూస్తున్నాడు. మిగిలిన జంతువులన్నీ కూడా భయంతో పారిపోతున్నాయి. అది చూసి, ' ఇంకేముంది, ఈ నక్క పని అయిపొయింది, సింహం చేతిలో, ' అని పరాన్నభుక్కు అనుకుంటుండగా, అతని ఆలోచనకి విరుద్ధంగా, సింహం రెండు మాంసం ముక్కలను నక్క ముందు పడవేసి వెళ్ళిపోయింది. నక్క వాటిని ఆత్రంగా తిని కడుపు నింపుకున్నది.

అదంతా చూసిన పరాన్నభుక్కుకి, భగవంతుని మీద యెంతో భక్తి కలిగింది. ' ఆహా ! తాను సృష్టించిన ప్రతి ప్రాణిమీదా ఆయనకు యెంత ప్రేమ ! ప్రతి ప్రాణికీ ఆయనే యేదో విధంగా ఆహరం యేర్పాటు చేస్తాడు కదా ! నాకూ అదే విధంగా యెక్కడో ఏర్పాట్లు చేసే ఉంటాడు. ' అనుకుంటూ, వుత్సాహంగా మళ్ళీ గ్రామంలోకి అడుగుపెట్టాడు.

గ్రామంలోకి వస్తూ వస్తూనే, రహదారికి ప్రక్కగా, అందరకూ కనబడే దిక్కులో కూర్చుని, ' ఎవరైనా భోజనానికి పిలిస్తే బాగుణ్ణు ! ' అని యెదురుచూస్తూ కూర్చున్నాడు, పరాన్నభుక్కు, దేవుని మీద భారం వేసి. అయితే, ఆరోజు గడిచిపోయి, మరునాడు కూడా, యెవరూ అతని వైపు కన్నెత్తి చూడలేదు. ఇంత ముద్ద పెట్టలేదు. పరాన్నభుక్కుకి యిదేమిటో అంతుబట్టలేదు. కుంటి నక్కకు ఆహరం అమర్చిన దేవుడు, తనకెందుకు యేర్పాటు చెయ్యలేదని, విలవిలలాడాడు. ఇక ఆకలికి తాళలేక, అక్కడనుండి లేవడానికి నిర్ణయించుకున్నాడు.

అంతలో, ఒక సాధువు అటుగా రావడం పరాన్నభుక్కుకి కనిపించింది. వెంటనే ఆయనకు మోకరిల్లి, ఆయన దగ్గర తన గోడు వెళ్ళబోసుకున్నాడు. సాధువు అతని అజ్ఞానానికి జాలిపడి, ముందుగా, ఆయన దగ్గర వున్నది తినడానికి పెట్టి, మంచినీళ్ళిచ్చి, దాహం తీర్చాడు, పరాన్నభుక్కుకి. కొద్దిగా సేదదీరిన తరువాత పరాన్నభుక్కు, , సాధువుతో, ' స్వామీ ! ఎక్కడో, అరణ్యంలో, కుంటి నక్కకు కూర్చున్న దగ్గరకు ఆహారం పంపించిన దేవుడు, నన్నెందుకు పట్టించుకోలేదు ? ' అని దేవుని మీద నిష్టూరాలాడాడు పరాన్నభుక్కు.

అప్పుడు ఆ సాధువు మందహాసం చేస్తూ, ' నాయనా ! నీవు అనుకున్నదానిలో యేమీ తప్పులేదు. ఆ సృష్టికర్తకు, యెవరికి యెప్పుడు యేమి ఇవ్వాలో అన్నీ తెలుసు. ఎవరి చేత యేపని చేయించాలో కూడా తెలుసు. బహుశా, నిన్ను ఆ దేవుడు, కుంటి నక్కలాగా జీవించమని ఆదేశించడం లేదేమో ! సింహంలాగా. బ్రతుకుతూ, అన్నార్తులకు, నీ ద్వారా సహాయం చేయాలనుకున్నాడేమో ! నిన్ను సింహంలాగా చూడాలని, ఆ భగవంతుని కోరిక అయివుండవచ్చు. అందుకనే, నీకు కుంటినక్క లాగా, యితరులు పెడితే తినే, అవకాశం ఇవ్వలేదేమో, ఆలోచించు. ' అని చెప్పి, దిశా నిర్దేశం చేసి వెళ్ళిపోయాడు.

మన పరాన్నభుక్కుకి, జ్ఞానోదయం అయింది. ' నిజమే కదా ! నాకు భగవంతుడు అన్ని అవయవాలూ యిచ్చాడు. ఆరోగ్యం యిచ్చాడు. అందుకు కృతజ్ఞతగా, నేనెందుకు సింహం లాగా బ్రతుకుతూ, నలుగురికీ సహాయం చెయ్యకూడదు. ? ' అనుకుంటూ, తనకు హితవచనాలు చెప్పి, కళ్ళు తెరిపించిన సాధువుకు, పాదాభివందనం చేద్దామని, ముందుకు వెళ్లి చూడగా, యెక్కడా, ఆ సాధువు కనబడలేదు.

భగవంతుని లీలలు గ్రహించిన ఆ యువకుడు, యిక యెంతమాత్రమూ ' పరాన్నభుక్కు ' గా జీవించలేదు. అనాధల సేవలో ( నారాయణ సేవలో ) అంకితమై, తన తల్లిదండ్రులు పెట్టిన, ' నారాయణ ' నామం సార్ధకం చేసుకున్నాడు.

SRI SARMADA చెప్పారు...

🚩గొప్పవారి వ్యంగ్యాస్త్రాలు, చమత్కారాలు కూడా గొప్పగానే వుంటాయి.🙂

ఒకసారి కవిసమ్మేళనం జరుగుతోంది. కవులందరూ విచ్చేసారు. మహాకవి
శ్రీ విశ్వనాథ సత్యన్నారాయణ గారు కూడా సభకు విచ్చేశారు. ఆయన్ని చూసి కవులందరూ వారిని సగౌరవంగా స్వాగతించారు.
శ్రీ జాషువా మాత్రం ఏదో పుస్తక పఠనంలో ఉండిపోయారు.
అదిచూసిన విశ్వనాథ వారు జాషువా ను ఉద్దేశించి,
"పక్షి నా రాకను గమనించలేదు" అన్నారు.
అది విని కవులందరూ ఇంతటి మహాకవి జాషువాని పక్షి తో పోలుస్తారా! అని ముక్కున వేలు వేసుకున్నారు.😕

కానీ జాషువా మాత్రం చిరునవ్వుతో లేచి విశ్వనాథ వారికి నమస్కరించి , "మీలాంటి కిరాతకుల దృష్టి ఎప్పుడూ పక్షులమీదే కదా!" అన్నారు.

విశ్వనాథుని ఈ జాషువా అంత మాట అంటాడా! అని కవులందరూ నిశ్చేష్ఠులయ్యారు
🤔😕

కానీ జాషువా అన్న మాటకి విశ్వనాథవారు పగల పడి నవ్వేశారు. 😄

దీని అంతరార్ధం ఏమిటంటే.. జాషువాని పక్షితో ఎందుకు పోల్చారంటే జాషువాకి ఆ సభలో "కవి కోకిల" (పక్షి కదా) అనే బిరుదు ఇస్తున్నారు. అందుకే జాషువాకి కోపం రాలేదట.🙂

ఇక జాషువా విశ్వనాథుని కిరాతకుడు అన్నారు.
కిరాతకుడు అంటే విశ్వనాథులవారు
"శ్రీ రామాయణ కల్పవృక్షం" రాస్తున్నారు. అందుకే జాషువా ఆయన్ని (కిరాతకుడు)వాల్మీకి తో పోల్చాడు.🙂

ఇంకో విషయం. జాషువా విశ్వనాధుల వారి అనుంగు శిష్యుడు !!🙏🙂

(సెప్టెంబర్ 28 న జాషువా గారి జయంతి జరుపుకున్న సందర్భంగా, ఫార్వార్డ్ చేయబడిన పోస్ట్) 🙏