5, అక్టోబర్ 2020, సోమవారం

సామజవరగమన

 🔴 *సామజవరగమన..అంటే అర్ధం ఎంత మందికి తెలుసు?*


తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా , ఒక పాట హోరెత్తుతోంది . అదే *సామజవరగమన* చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది , అలానే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది ... కానీ చాలా మందికి " సామజవరగమన " అంటే ఏంటో తెలీదు..


*సామజవరగమన ' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది* ... ' సామజ ' అనగా " ఏనుగు " అని ..' వరగమనా ' అనగా " చక్కని నడక " అని అర్థం ... అలానే సామవేదం అనగా సంగీతం! .. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం! " సామజవరగమన " అంటే ఏనుగు లా గంభీరంగా , హుందాగా , ఠీవిగా నడిచేవారు అని అర్థం ..


*మరి అసలైన " సామజవరగమన " ఎవరు ??*... 

అసలైన " సామజవరగమన .." శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు ..". వాల్మీకి తన రామాయణం లో 'అరణ్యవాసం'లో ఒకచోట రాముడిని "గజవిక్రాంతగమను"డంటారు ... అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని ... ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు తన కీర్తనలో ' సామజవరగమన ' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు ..


చాలా మంది " సామజవరగమన " అంటూ పాడేస్తున్నారు .... కానీ వారికి అసలు ఇది దేవుని కీర్తన అని కూడా తెలీదు .. దాని అర్థం ఏంటో తెలీదు ... వారికి చెప్పేందుకైనా " సామజవరగమన " కీర్తన , దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం ..


🛑 *సామజవరగమనా ! సాధుహృత్సారసాబ్జపాల ! కాలాతీతవిఖ్యాత ! ॥ సామజ॥*

*సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల ! దయాలవాల ! మాంపాలయ ! ॥*

*వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా।*

*స్వీకృత యాదవకులమురళీ !*

*గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥*


ఈ కీర్తన త్యాగ రాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది .. ఈ కీర్తన లో ని ప్రతి పదం శ్రీ కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది ... కీర్తన అర్థం ... ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో , మునులు మానవుల హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరీ! నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చే కొనియాడ బడతావు .. సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది .. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే , గుణమునకు , దయకు ఉదాహరణ నీవే .. నన్ను కూడా నీవే నడిపించాలి!....


సామవేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల , ప్రకాశిస్తూ .. గోవులని రక్షిస్తూ .. మురళి గానంతో అందరిని ఆనంద పరుస్తూ ..ఈ త్యాగరాజ వందనములను అందుకో! ..


ఇదీ సామజవరగమన కు సంబంధించిన అసలు భావం.

గడియారం శేషఫణి

కామెంట్‌లు లేవు: