5, అక్టోబర్ 2020, సోమవారం

సినిమా హాళ్లూ కమ్యూనిజమూ...

 

మన దేశంలో... ఒకప్పుడు టాకీసులుండేవి. 

వాటిలో నేల క్లాసు టిక్కెట్లు చాలా ఎక్కువగానూ...

బెంచ్ కొంత తక్కువగానూ...

కుర్చీ ఇంకొంచెం తక్కువగానూ ఉండి...

బాల్కనీ టిక్కెట్లు చాలా తక్కువగా ఉండేవి. 

అంటే భారతదేశంలో పేద మధ్య తరగతి ఎక్కువగా ఉన్నారనీ...

డబ్బులున్న మారాజులు తక్కువ మందే ఉంటారనేది అప్పటి థియరీగా అర్ధం చేసుకోవచ్చు. 

తొంభైల్లో నూతన ఆర్ధిక సంస్కరణలు వచ్చాక థియేటర్లలో ప్రొడక్టర్ గోడ నుంచి మొదలు పెట్టి తెర ముందు మూడో లైను వరకూ బాల్కనీయే పెట్టేయడం మొదలెట్టారు.

 మిగిలిన మూడు లైన్లు నేల, బెంచీ,కుర్చీ అనే మూడు దిగువ తరగతులూ అన్నమాట. 

అంటే పేదరికం దారుణం గా తగ్గిపోయిందనీ...

డబ్బున్నోళ్లు విపరీతంగా పెరిగారనేది ఆ టైమ్ థియరీగా అర్ధం చేసుకోవచ్చు. 

రీసెంట్ గా మల్టీ ప్లెక్సుల్లో అసలు తరగతులే లేవు. ప్రొజక్టరు గోడ నుంచీ తెర ముందు వరకు అంతా ఒకటే ధర. 

అంటే...హేవిటి వర్గ రహిత సమాజం అన్నమాట. అంటే కమ్యునిస్టు థియేటర్లన్నమాట. 

ఇలా సినిమా హాళ్ల ప్రకారం చూస్తే దేశంలోకి వర్గరహిత సమాజం వచ్చేసిందన్నమాట.

అయితే కొన్ని మల్టీ ప్లెక్సుల్లో... ఒక లైన్ పడక కుర్చీలు పెట్టి కొంత సామాజిక న్యాయం చేస్తున్నారనుకోండి.. 

సూక్ష్మం గా ఇదీ కథ.

కామెంట్‌లు లేవు: