**దశిక రాము**
2 - క్షమా:
క్షమించడం, క్షమా గుణం కలిగి ఉండడం ధర్మం యొక్క రెండవ లక్షణం. క్షమించడం అన్నమాటని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ఒకడు బలహీనుడై, ఎదుటివాడు బలవంతుడైనప్పుడు, వాడితో పోరాటం చేయలేక, వాడు ఎన్ని అకృత్యాలు చేస్తున్నా, వాడిని క్షమించేస్తాం. ఇది పరికితనంతో చేసే పని. ఇది క్షమా గుణం కాదు, చేతకానీతనం అంటుంది ధర్మం. ఏలా అంటే, మీకు ఎవరి మీదో బాగా కోపం వచ్చింది, గట్టిగా నాలుగు తగించాలనుకున్నారు, కానీ అవతలివాడు మీకంటే శక్తివంతుడని, మీరు ఒక్క దెబ్బ కొడితే, వాడు పది దెబ్బలేస్తాడని తెలుసు కనుక, మీరు వెనక్కు తగ్గుతారు. అది కాదు క్షమా అంటే అంటుంది ధర్మం.
మీరు ముందు బలవంతువులుగా మారండి. ఎవరైనా మీ జోలికి వస్తే వాడికి బుద్ధి చెప్పేటంతగా, శారీరికంగానూ, మానసికంగానూ మీరే బలవంతులవ్వాలి. ఎదుటివాడిని మట్టి కరిపించే శక్తి మీకు ఉండాలి. అన్నీ ఉండి, అవతలవాడు బలహీనుడని తెలిసి కూడా మీరు క్షమించగలగాలి. అదే నిజమైన క్షమా గుణం. ఇదే కర్మయోగం చెప్తుంది. ధర్మం కూడా అటువంటి క్షమాగుణాన్నే అలవరచుకోవాలని చెప్తున్నది. ఎందుకంటే ఏమి లేనీవాడు, శక్తిహీనుడు ఎట్లాగో వాదన చేయలేడు, కనుక సర్దుకుపోతాడు. క్షమించడం ధీరులైనవారి లక్షణం. చేతగానితనం బలహీనుల లక్షణం. అందుకే బలహీనులు ఎప్పటికి క్షమించలేరు, క్షమించడం బలవంతుల సద్గుణం .
తరువాయి భాగం రేపు...........
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి**
🙏🙏🙏
https://chat.whatsapp.com/EYVSW5i6Q1O1973h8txkPS
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి