ధర్మసూక్ష్మమ్ :-
************
కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో,
పండునో విడిచి పెట్టి రావాలంటా రు. ఆమేరకు
మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక
కాయను వదిలేసి వస్తుంటాం.ఆ తర్వాత నుండి
వాటిని తినడం మానేస్తాం.పైగా
"నేను జామపండు తి ననండీ"కాశీలో ఎప్పుడో
వదిలేశాను "
"నేను కాకరకాయ తిననండీ, కాశీలో వదిలేశాను
అని చెప్పుకుంటాం.
నిజానికి పెద్దలు వదలమన్నది,
"కాయాపేక్ష, ఫలా పేక్ష "
*వదులుకోవడం అంటే తినే కాయలు ఫలాలు వదిలేయటం కాదు.*
కాయాపేక్ష అంటే :- దేహం పట్ల ప్రేమ. ప్రతి వ్యక్తికి
ఉంటుంది. శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని, నా శరీరానికి సుఖం కావాలి ,
ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి
రుచికరమైన భోజనం కావాలి ,ఇలాంటి వన్నీ
వదిలేసి సాధువులా బతకమని అర్ధం.
ఫలాపేక్ష అంటే :- ఏదైనా పని చేసి దాని ధ్వారా
లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని.
ఉదా:- పది రూపాయలు దానం చేసి, దాని ద్వారా ఫలితం ఆశించటం. యజ్ఞం చేసి ఏదో కోరుకోవడం. బంధుమిత్రులకు సహాయం చేసి దాని ద్వారా
ఏదో కావాలని కోరుకోవడం మానుకొమ్మని అర్ధం
(ఎక్కడో చదివాను బావుందని తెలియపరుస్తున్నాను)
ఓం నమశ్శివాయ
****
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి