**దశిక రాము**
PART-9
🙏🏻కవిసార్వభౌముడైన శ్రీనాధుని రచన🙏🏻
అగస్త్యుడు గోదా వరి తీరానికి చేరి సంచ రిస్తున్నా ఇంకా మనసులో కాశి భావం తొలగి పోలేదు .పదే పదే తలుచుకొంటునే ఉన్నాడు ..పిచ్చి వారి వలె ఇద్దరు గాలిని చూసి ‘’కాశీ పట్నం కుశల మేనా ?ఎప్పుడు మళ్ళీ కాశీకి వేడతాము /అని ప్రశ్నిస్తున్నారు .అంత అవినా భావ సంబంధం తో వారు కాశీ లో మెలిగారు ..కొల్హాపురం చేరి అక్కడి మహా లక్ష్మి అమ్మ వారిని దర్శించారు .ముల్లోకాలను అడవి పంది గా భయ పెట్టిన కోలాసురుడిని సంహరించిన లక్ష్మీ దేవి ఇక్కడ కొలువై ఉంది .మహా లక్ష్మి ని ఇద్దరు మనసా రా స్తోత్రం చేసి ,ప్రార్ధించారు ‘’అమ్మా లక్ష్మీ దేవీ ! నువ్వు ఎక్కడ ఉంటె అక్కడ సమస్త మంగళాలు ఉంటాయి.నువ్వు అనుగ్రహిస్తే అన్నీ చేకూరుతాయి ‘’అని ప్రార్దిన్చారు .అమ్మవారు ప్రత్యక్షమై ‘’మిత్రా వరుణ సంభవా అగ్స్త్యమునీ ! !పతివ్రతా శిరోమణీ లోపాముద్రా !’’అని సంబోధించి ,లోపాముద్రా దేవి ని తన సమీపం లో కోర్చో బెట్టుకొని ,ఆమె శరీరాన్ని స్పర్శించింది మహా లక్ష్మి అమ్మ వారు ..’’కోలాహల రాక్షసుని అస్త్రం చేత బాధింప బడ్డ నా శరీరాన్ని నీ స్పర్శ తో స్వాస్త్యం పొందుతున్నాను ‘’అని పలికి , లోపాముద్రను కౌగిలించుకొని ,సౌభాగ్యాలను కారణాలైన ఆభరణాల తో ఆమె ను అలంకరించింది .మహర్షితో ‘’రుషి సత్తమా !నీ తాప కారణం తెలిసింది కాశీ ని వదిలి నందుకు నీ మనసు అమిత బాధ పడుతోంది ,ఏదైనా వరం ఇవ్వాలని ఉంది ‘’అన్నది .దానికి ముని ‘’అమ్మా మహా లక్ష్మీ !వరం ఇవ్వ దలిస్తే మళ్ళీ మాకు కాశి సందర్శన భాగ్యం అనే వరమే ఇవ్వు .ఇంకేమి వద్దు ‘’అన్నాడు .లక్ష్మీ దేవి ‘’తధాస్తు ‘’అని దీవించి స్వస్తత కలిగించింది .’’మహర్షీ !రాబొయె ద్వాపర యుగం లో పందొమ్మిదవ బ్రహ్మ కాలం లో నువ్వు వ్యాసుడవు అవుతావు .మళ్ళీ వారణాసి కి వెళ్లి వేద శాస్త్రాలను పరిష్కరించి ,ధర్మ బోధ చేస్తావు ..ప్రస్తుతం ఇక్కడి నుండి నువ్వు బయల్దేరి వెళ్లి స్కందుని దర్శనం చేసుకో .అతడు నీకు వారణాసి రహస్యమంతా వివరం గా చెబుతాడు .’’ అని చెప్పి ఇద్దరినీ దీవించి పంపించింది .
PART-9
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి