5, అక్టోబర్ 2020, సోమవారం

శివామృతలహరి



శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


శా||

చూడంజూడ విచిత్రమాత్మ కనిపించున్ దేహిదేహంబటుల్

మోడంబందున నీటిచందమున నా లోకింప శబ్దార్థపున్

గాడిన్; గూడున పక్కికైవడి; నిరాకారండునౌ బ్రహ్మమున్

క్రీడించున్ భువి నామరూపగుణియై శ్రీ సిద్ధలింగేశ్వరా!


భావం;

పరికించి చూస్తే మేఘంలో ఏవిధంగా నైతే కంటికి కనపడకుండా నీరు ఉంటుందో, అదే విధంగా, ప్రతి జీవి దేహంలో ఆశ్చర్యకరంగా ఆత్మ స్వరూపం గోచరమవుతుంది.

మరింతగా లోతుగా అర్థం చేసుకుని గమనిస్తే గూటిలో దాగిఉన్న పక్షిలాగా, నిరాకారమైన బ్రహ్మము నామ, రూప గుణాలున్న జీవుడిగా పిలువబడే ప్రతి ప్రాణిలోనూ విహరిస్తూ ఉంటుంది కదా స్వామి! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: