29, డిసెంబర్ 2020, మంగళవారం

Bird bath









 

హ్యూమన్_బైట్

 *హ్యూమన్_బైట్ (పాము_కుక్క_దోమలు_తేలు_కరిచినప్పుడు_పరిష్కార_మార్గం_అవగాహన_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు*

*1.పాము_కరిస్తే_ఇలా_చేయండి_చేయించండి*

       ఎంతటి విషపు పాము కరిచినా… 5 పాములు అత్యంత విషాన్ని కల్గిఉన్నవి. అవి కరిస్తే మ్యాగ్జిమమ్ 3 గంటల్లో మనిషి చనిపోతాడు.. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మనకు దక్కడు.

కరిచిన పాము విషపుదా, మామూళుదా….? అని తెల్సుకోవాలంటే అది కరిచిన చోట ఎన్నిగాట్లున్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి.

*విషపు పాము కరిస్తే….కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు* చేరుతుంది….ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం.

విషపు పాము కరిచిన వెంటనే…. కాటు కు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి….మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం…ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాక మనిషి సృహలోకి వస్తాడు.

వాస్తవానికి పాము తన కొరల్లో ఉంచుకునే విషం 0.5 ML నుండి 2 ML వరకు మాత్రమే.!

ప్రతి ఒక్కరి ఇంట్లో *💊హోమియోపతి మెడిసిన్ అయిన #NAJA-200 ను 5ML బాటిల్ ఉంచుకోవాలి దీని ఖరీదు 5/- నుండి 10 రూపాయలే*.దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే…పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు.

తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.

https://m.facebook.com/story.php?story_fbid=2370703493194522&id=1536735689924644

*2.పిచ్చికుక్క_కరిచిన_వెంటనే_ఈ_విధంగా_చేయాలి....*

      కుక్క కరిచిన వెంటనే గాయాన్ని బట్టల సబ్బుతో కడిగి...గాయం పైనుండి బాగా ఎత్తుగా నీరు గాయం మీద పడేటట్లు పోయాలి. ఈ విధంగా చేయడం వలన వైరస్ శరీరంలోకి వెళ్ళకుండా..బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత కట్టుకట్టకుండా...డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. కరిచింది ఇళ్ళదగ్గర రోజూ ఉండే కుక్క అయినట్టయితే. 

*#Verocel_Culture* అనే పేరు గల ఇంజెక్షన్ ను కరిచిన రోజు ఒక ఇంజెక్షన్..7 వ రోజు రెండవ ఇంజెక్షన్..14 వ రోజు.. 3 వ సారి ఇంజెక్షన్ చేయించుకుంటే సరిపోతుంది  కుక్కకు పిచ్చిలక్షణాలుంటే..పిచ్చికుక్కగా భావించి కరిచిన వెంటనే ఒక ఇంజెక్షన్..3 వ రోజు..7 వ రోజు..14 వ రోజు..28 వ రోజు.. చివరిగా 90 వ రోజు.. మొత్తం 6 సార్లు ఇంజెక్షన్ చేయించుకోవాలి

💊💊కుక్క పిచ్చిదైనా..మంచిదైనా  'అల్డక్టర్ ను మాత్రమే కలిసి ఇంజెక్షన్ చేయించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో పిచ్చికుక్క కరిస్తే తగ్గించే మందులు ఇస్తామని..నాటు మందులు ఇస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నాటు మందులు వాడవద్దు.    పిచ్చికుక్క తో పాటు.. ఏ రోగానికీ నాటు మందులు వాడవద్దు. పాము కరిస్తే..నాటు పసర్లు వాడి..ఇంకా అనేక జబ్బులకు నాటు మందులు వాడి ఎందరో ప్రాణాలు పో గొట్టుకున్న వారున్నారు.

*3.తేలు_కుడితే_చల్లటి_కాపటం_పెట్టండి.*

         పాము విషానికి విరుగుడు మందుంది. తేలు విషానికి విరుగుడు మందులేదు.విరుగుడు మందు లేదు తేలు కుడితే వచ్చే నొప్పి

 భరించలేనంత తీవ్రంగా వుంటుంది. చెప్పనలవి కాని విధంగా వుంటుంది.

         సాధారణంగా  నొప్పికి వాడే సూదిమందుకు ఈ నొప్పి జవాబు చెప్పదు. కానీ చల్లటి కాపటంతో ఈ నొప్పిని చాలావరకు తగ్గించుకోవచ్చు. 

        ఐసు ముక్కల్ని గుడ్డలో వేసి గానీ, ప్లాస్టిక్ కవర్లో వేసిగానీ, నీళ్లు తాగే గ్లాసులో వేసిగానీ తేలు కుట్టిన దగ్గర కాపటం పెట్టాలి.


      5 నుంచి 10 నిముషాలు పాటు కాపటం పెట్టాలి. 10 నిముషాల తరువాత మళ్లీ 10 నిముషాల పాటు కాపటం పెట్టాలి.

        తేలు కుట్టిన శరీర భాగంలో బిగుతుగా వుండే మెట్టెలు, ఉంగరం.,గజ్జెలు, గాజులు లాంటి ఢఆభరణాలను వెంటనే తీసివేయడం రెండవది.


కాటుకి గురైన భాగాన్ని గుండీ 

కంటే తక్కువ ఎత్తులో వుండే విధంగా వుంచితే  కరచిన బాగంలో వున్న విషం గుండెకు చేరడానికి కొంతసమయం తీసుకుంటుంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం కొంత ఆలస్యంగా జరగవచ్చ.

        తేలు కుట్టిన శరీర భాగంలో ఉంగరాలు వుంటే, వాపు ఎక్కువై వేలుకు రక్తప్రసరణ తగ్గి వేలు తీసి వేసే పరిస్థితికి రావచ్చు. 

*3 దోమల_బాధ_నివారణ :*

      దోమ కుడితే నొప్పి, దురదగా ఉన్న చోట వెనిగర్‌ అద్దిన దూదితో మృదువుగా రుద్దితే సమస్య పరిష్కారం అవుతుంది.

*ఇంట్లో దోమల బాధ ఎక్కువగా ఉంటే టీ పొడిని ఒక పాత్రలో వేసి కాల్చితే ఆ ఘాటుకు దోమలు దూరమవుతాయి.

*పుదీనా మొక్కను ఓ కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఘాటుకు దోమలు పారిపోతాయి.

*ఒక గ్లాసులో సగానికి నీళ్ళు పోసి అందులో అరడజను కర్పూరం బిళ్ళలు వేస్తే వాటి వాసనకు దోమలు బయటకు పోతాయి.

*దోమలను తరిమేందుకు ప్రత్యేకంగా అగర్‌బత్తీలు లాంటివి కూడా లభ్యమవుతున్నాయి. వాటిని ఉపయోగించి చూడవచ్చు.

*ధన్యవాదములు 🙏*

*మీ నవీన్ నడిమింటి*

       9703706660

    *సభ్యులకు విజ్ఞప్తి*

******************

 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

పాతివ్రత్య మాహాత్మ్యం

 అత్రిమహర్షి భార్య అనసూయాదేవి. తన పాతివ్రత్య మాహాత్మ్యం చేత ఆ మాట బ్రహ్మవిష్ణుమహేశ్వరులను శిశువులుగా చేసి ఆడించింది, పాలిచ్చింది. ముగ్గురుమూర్తులూ ఆ దంపతులకు కొడుకులయ్యారు.త్రిమూర్తుల సమిష్టిరూపంగా అత్రి,అనసూయల బిడ్డడైన శ్రీదత్తాత్రేయుడు అనాదిగా హైందవ జాతీయుల పూజలందుకుంటున్నాడు. విష్ణువు దత్తాత్రేయుడని శివుడే దుర్వాస మహర్షి అని, బ్రహ్మదేవుడు చంద్రుడనీ భావించడం కూడా సనాతన సంప్రదాయం. శ్రీ దత్తాత్రేయుణ్ణి పూజించడం త్రిమూర్తులను పూజించడమే. తెల్లవారు ఝామున స్నానం చేసి సంధ్యావందనాది నిత్యకృత్యాలను ఆచరించిన తరువాత శ్రీ దత్తాత్రేయుడిని షోడశోపచారాలలో అర్చించడం సంప్రదాయం.

పవిత్ర నదులలో ఈ రోజున స్నానం చేసి ఆతరిని అనసూయను శ్రీదత్తాత్రేయుడిని పూజించడం విశేష వ్రాత. శ్రీ దత్తాత్రేయుని చెంత నిలబడి ఉండే గోమాత సకల చరాచర సృష్టికి ప్రతీక. ఆయనను పరివేష్టించి ఉండే శునక చతుష్టం - నాలుగు కుక్కలు - నాలుగు వేదాలకు ప్రతిరూపాలు. శునకం కాలభైరవుడు.

కోరల పౌర్ణమి*_

 _*నేడు కోరల పౌర్ణమి*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్టే.  మార్గశిర మాసంలో  *రేపు వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి* అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు. *హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు , అందువల్ల అనేక రకాల వ్యాధులు , అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు.*


*ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు.*


ఈ రోజు *కోరల* అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది.


చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికీ నరక బాధలు అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభం అయింది.


కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినప రొట్టె తయారుచేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి. కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్ర వ్రతం చేయాలనీ పురాణాలు చెపుతున్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు , అపమృత్యు భయాలు తొలగిపోతాయి.



*మార్గశిర్ష పూర్ణిమపై ముఖ్యమైన సమయాలు*



సూర్యోదయం డిసెంబర్ 30, 2020 7:11 ఉదయం

సూర్యాస్తమయం డిసెంబర్ 30 , 2020 5:47 అపరాహ్నం

పూర్ణిమ తిథి ప్రారంభమైంది డిసెంబర్ 29, 2020 7:54 ఉదయం

పూర్ణిమ తిథి ముగుస్తుంది డిసెంబర్ 30, 2020 8:58 ఉదయం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఆచారాలను

 సనాతన ధర్మంలోని ఆచారాలను పాటించడం వల్ల లాభమేమిటి?

సనాతనధర్మశాస్త్రాలు మానవుని శ్రేయస్సుకై ప్రధానంగా రెండు విషయాలను బోధిస్తున్నాయి. (1) జీవన విధానం; (2) జీవిత లక్ష్యం. ఇవి రెండూ అర్థం కాని వారి జన్మ వ్యర్థమే. అందుకే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని పురుషార్థాల ద్వారా పొంద వచ్చని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. 


పురుషార్థాలంటే ఏమిటి? 

ధర్మార్థ కామ మొక్షములే పురుషార్థములు. ఈ లోకంలో ప్రతి వ్యక్తీ సుఖంగా జీవించాలని కోరుకుంటాడు. ఆ కోరికనే "కామః" అంటుంది శాస్త్రం. అట్టి సుఖాన్నిచ్చే పరికరములను పొందడానికి ధనం అవసరం. కనుక ధనాన్ని "అర్థః" అంటుంది. అయితే ఈ ధనాన్ని 'ధర్మ' మార్గంలో ఆర్జించి తద్వారా జీవితంలో సుఖాన్ని, హాయిని, తృప్తిని పొందే జీవన విధానాన్ని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. 


మనిషి జీవన విధానానికి ధర్మ, అర్థ, కామములు ప్రధానమైన అంశములైతే, మనిషి యొక్క జీవిత లక్ష్యానికి 'మోక్షమే' అత్యంత ప్రధానమైన అంశముగా శాస్త్రాలు పరిగణిస్తున్నాయి. అట్టి జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని పొందాలనుకునే వారికి ఆశ్రమ ధర్మాలను ప్రభోధిస్తున్నాయి. 


ఆశ్రమ ధర్మములంటే ఏమిటి?

ఆశ్రమ ధర్మములంటే జీవన విధానానికి, జీవిత లక్ష్యానికి శాస్త్రం సూచించిన నిర్దిష్టమైన పంథా అని అర్థం. జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తికి ముఖ్యంగా జీవన విధానం పట్ల అవగాహన అవసరం. జీవితాన్ని అర్థం చేసుకోలేనివాడు జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమే. అందుకే మన సనాతన ధర్మ శాస్త్రాలు మానవ జీవితాన్ని (1) బ్రహ్మచర్యాశ్రమం; (2) గృహస్థాశ్రమం; (3) వానప్రస్థాశ్రమం; (4) సన్న్యాసాశ్రమం గా పరిగణిస్తుంది. 


బ్రహ్మచర్యాశ్రమం అంటే ఏమిటి?

ఇది ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థి దశ. ఈ దశలోనే ప్రతి వ్యక్తీ తన జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. శిశువుకు మొట్టమొదటి గురువు తల్లి, తదుపరి గురువు తండ్రి. తరువాత 'ఆచార్యుడే గురువు'. అట్టి గురువు వద్ద నియమ నిబంధనలతో తన విద్యార్థి దశ ప్రారంభం అవుతుంది. ఈ దశనే బ్రహ్మచర్యాశ్రమం అంటారు. 


గృహస్థాశ్రమం అంటే ఏమిటి?

బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచి వైవాహిక జీవితంలో అడుగు పెట్టడాన్ని గృహస్థాశ్రమం అంటారు. ఈ గృహస్తు ఎంతసేపూ ఉద్యోగం, వ్యాపారం, సంపాదన, సుఖాల వరకే పరిమితం కాకూడదు. మోక్షమనే చివరి పురుషార్థమైన జీవిత లక్ష్యాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. అర్థ, కామములను ధర్మబద్ధంగా నెరవేర్చుకునే వ్యక్తికి క్రమేపీ మోక్షరూపమైన పరమాత్మను పొందేందుకు అవకాశాన్ని కల్పించేదే గృహస్థాశ్రమం. 


ఈ దశలో స్త్రీ పురుషులు ఇరువురిని హిందూ ధర్మ శాస్త్రాలలో వివరించిన విధంగా పవిత్రమైన వైవాహిక వ్యవస్థతో కలుపుతారు. అనంతరం వారిరువురూ భార్య, భర్త అనే బాధ్యతాయుతమైన పాత్రలతో జీవితంలో ప్రధానమైన ఘట్టం లోకి అడుగిడుతారు. వారికి కేవలం విలాసము, సుఖ భోగాలే లక్ష్యం కాకూడదు. 


విలాసవంతమైన పాలరాతి మేడలలో కుటుంబ సభ్యులు నవగ్రహాల్లాగా తలొక దిక్కుకీ చూస్తూ ఎడమొహం, పెదమొహం తో జీవిస్తుంటే అది గృహస్థాశ్రమం అనబడదు. ఆకలిలేని వాడికి పంచభక్ష్య పరమాన్న భోజనం ఎంత నిరుపయోగమో మమత, అనురాగం, ప్రేమ, ఆప్యాయత లోపించిన కుటుంబాలలో ఎన్ని మేడలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా అంతే. కుటుంబం లోని వారు కలసి మెలసి అన్యోన్యతతో తమ ధర్మాలను, బాధ్యతలను గుర్తించి సక్రమంగా నిర్వర్తించే విధానాన్నే గృహస్థాశ్రమం అంటారు.


జై శ్రీమన్నారాయణ 🙏🏻

_వాగ్భూషణం

 *_వాగ్భూషణం - అవి ఎన్ని రకాలు_*


*వాక్కు భగవంతుడు మానవునుకి ఇచ్చిన అద్భుతమైన వరం.* 

*ఆ శక్తిని అంటే వాక్కును సద్వినియోగ పరచుకోవడం లేదా దుర్వినియోగ పరచుకోవడం అనేది మానవునిలోనే ఉంది...* 

*మనిషి మాట్లాడే తీరును బట్టి అతని వ్యక్తిత్వం అవగతమవుతుంది, మాట్లాడే మాటను బట్టి అతని సంస్కారం అర్థమవుతుంది.* 

*మాటల్లో ఎంత మహత్తు ఉందంటే మనిషి మాట్లాడే విధానం, పద్ధతి వలన, ఉపయోగించే పదాల వలన మిత్రులు ఏర్పడతారు.* 

*బంధువర్గం ఏర్పడుతుంది, శత్రువులు కూడా మిత్రులవుతారు.* 

*వైరివర్గం బంధుగణం అవుతుంది, అలాగే మిత్రులు శత్రువులవుతారు, బంధువులు విరోధులవుతారు.*


*అంచేత వాక్కు మనిషికి భూషణం కావాలంటే భాషణం లోనే ఉంది అంతా. అయితే ఈ భాషణం ఎలా ఉండాలీ అంటే మితం గానూ, ప్రియం గానూ, మృదువు గానూ, సత్యమైనది గానూ ఉండాలి.*


*మిత భాషణం...*


*మితంగా, అవసరమైనంత వరకే మాట్లాడడం, దీని వలన ఆత్మస్తుతికీ, పర నిందకూ అవకాశం ఉండదు. వాదోపవాదాలకూ, ఘర్షణలకూ తావుండదు. అనవసరమైన సంభాషణలు లేనప్పుడు కాలమూ వ్యర్థమవదు.*


*ప్రియ భాషణం...*


*ఎదుటి వారికి ప్రియం కలిగించేలా మాట్లాడడం, దీని వలన మైత్రి, సఖ్యత, ప్రేమ, అభిమానం, గౌరవం ఏర్పడతాయి.*


*మృదు భాషణం...*


*మృదువుగా మాట్లాడడం ఒక విధంగా కటువుగా మాట్లాడకపోవడం. కొంత మంది మాట్లాడితే వినాలనిపిస్తుంది.* 

*ఇంకా మాట్లాడితే బాగుండును అనిపిస్తుంది. కొంత మంది మాట్లాడితే వినబుద్ధి వేయదు.* 

*మాట్లాడడం ఆపేస్తే బాగుండును అనిపిస్తుంది, ఇంకా చెప్పాలంటే ఆపకపోతే తిట్టాలనో, కొట్టాలనో అనిపిస్తుంది. అదే కటు భాషణం.*


*సత్యభాషణం...*


*ఎప్పుడూ నిజాన్నే మాట్లాడడం. ఇది ఒక వ్రతం లాంటిది. గొప్ప ధర్మం. శ్రేయస్కరం కూడా. కాని ఒక్కొక్కప్పుడు సత్యం కూడా కఠోరంగా ఉంటుంది.* 

*అందుకే "నిజం నిప్పు లాంటిది" అంటారు. దాన్ని దాచలేము కూడా. నిజం చెపితే నిష్ఠూరం కూడా కలుగుతుంది. అవతలి వారి మనసు గాయపడవచ్చు. వారు బాధపడవచ్చు, అలాంటి సందర్భాలలో వారికది ప్రియభాషణం కాకపోవచ్చు.*

...నేటి చిట్టికథ

 ✍️...నేటి చిట్టికథ




కథలీపురాన్ని సూరసేనుడు అనే రాజు  పాలిస్తుండేవాడు. తన రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటూ వారి మన్ననలు పొందాడు


. తన రాజ్యంలో కొందరు ఏపనీ చేయకుండా సోమరులుగా మారి వారి కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారని గూఢచారులతో తెలుసుకున్నాడు.


 ఎలాగైనా సరే వారికి గుణపాఠం చెప్పి సరైన మార్గంలో పెట్టాలనుకున్నాడు.


‘రాజ్యంలో ఏ పనీ చేయకుండా సోమరులుగా ఎవరైనా ఉంటే వారికి రాజుగారు మంచి బహుమతులు ఇస్తారహో..! అలాంటి వారు ఎవరైనా ఉంటే.. రానున్న పౌర్ణమి రోజు రాజుగారి ఆస్థానానికి రావాలహో’ అని చాటింపు వేయించాడు.


ఈ విషయం తెలిసి ప్రజలు.. ‘పనిచేయని వారికి బహుమతులేంటి?’ అని ఆశ్చర్యపోయారు.


 సోమరులు మాత్రం చాలా ఆనందించారు. పౌర్ణమి రాగానే రాజ్యంలో సోమరులందరూ కలిసి రాజుగారి ఆస్థానానికి బయలుదేరారు. 


మార్గం మధ్యలో రహదారిపై అనేక పెద్దపెద్ద రాళ్లు, దుంగలు అడ్డుగా పడి ఉన్నాయి. వారందరూ కలిసి వాటిని అతికష్టమ్మీద తొలగించి చివరికి రాజుగారి ఆస్థానానికి చేరుకున్నారు. 


బాగా పనిచేసి ఉండటం వల్ల దాహం వేయడంతో.. ‘మాకు దాహంగా ఉంది.. తాగేందుకు కొంచెం నీళ్లు ఇప్పించండి’ అంటూ అక్కడ ఉన్న భటుడిని అడిగారు. ఆ భటుడు.. ‘అదిగో అక్కడ ఉన్న బావిలోని నీటిని తోడి ఇక్కడ మొక్కలకు ఎవరైతే పోస్తారో వారికే తాగేందుకు మంచి నీరు.. ఇదే ఇక్కడి పద్ధతి’ అని చెప్పగానే అందరూ అక్కడికి వెళ్లి మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత తమ దాహాన్ని తీర్చుకున్నారు.


T.me/namonarayana


ఇంతలో రాజుగారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. అందరూ అక్కడికి చేరుకున్నారు. ‘మహారాజా.. మనరాజ్యంలో అవకాశం ఉన్నా.. ఏ పనీ చేయకుండా సోమరులుగా తిరుగుతున్నవారు వీరు’ అని మంత్రి చెప్పారు


. ‘నేను రమ్మన్నది సోమరులను కదా! వీరిని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. కష్టపడి పనిచేసే వారిలా ఉన్నారు. ఇప్పుడు కూడా ఏదో పనిచేసి వచ్చినట్లుగా కనిపిస్తున్నారు’ అని రాజు అన్నాడు. 


వెంటనే సోమరులంతా కలిసి ముక్తకంఠంతో.. ‘మహారాజా! మేం సోమరులం. మాకు మీరు ఇస్తామన్న బహుమతి ఇప్పించండి’ అన్నారు. 


‘మీరు ఎలా సోమరులు అవుతారు? మార్గంమధ్యలో రహదారిపై పడిన బండరాళ్లు, వృక్షాలను తొలగించారు. నీళ్లు తాగడం కోసం మొక్కలకు నీళ్లు పోశారు. సోమరులు ఎవరూ అలా పనిచేయరు. అసలు నిజమైన సోమరి ఎవరు అంటే.. ఈ బహుమతి తీసుకోవడానికి కూడా రాకుండా బద్ధకించేవాడు. కాబట్టి మీరు ఏమాత్రం సోమరులు కాదు. మీరు మానసికంగా అలా భావించుకొని.. ఏ పనీ చేయకుండా మీ వారిని ఇబ్బంది పెడుతూ.. రాజ్యానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు’ అన్నాడు.


‘మహారాజా.. మమ్మల్ని మన్నించండి. మా తప్పేంటో తెలుసుకున్నాం. ఇకనుంచి మాకు చేతనైన ఏ పనైనా చేస్తాం. మమ్మల్ని క్షమించండి’ అని వేడుకున్నారు.


 ‘ఈ రోజు వీళ్లు చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం ఇచ్చి పంపించండి’ అని రాజు మంత్రిని ఆదేశించారు.


 మరుసటి రోజు నుంచి అందరూ తమ సోమరితనం విడిచిపెట్టి కష్టపడి పనిచేశారు.

🍁🍁🍁🍁


చదువు మట్టుపడును; సంస్కృతి చెడిపోవు

సంపదలు తొలంగు; సౌఖ్యముఢుగు;

గౌరవంబు వోవు; గావున సోమరి

తనము కన్న హీన గుణము గలదె?


సోమరితనము వల్ల చదువు అణగారిపోతుంది.సుఖం నశిస్తుంది. సంపదలు తొలగిపోతాయి.సంస్కారం చెడిపోతుంది.గౌరవం ఉండదు.అందుచేత సోమరితనం చాలా చెడ్డ అలవాటు....



🍁🍁🍁🍁🍁

మాతృభాష

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



              *మన మాతృభాష*

                 ➖➖➖✍️


*తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా ?*


డోర్ లాక్ చెయ్యకండి, నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ  ? ’ఇందులో ‘కీస్’ కు అచ్చ తెలుగు పదం వాడొచ్చు. కానీ మనం వాడం.


ఎందుకు ? 


ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, 

తలుపు తాళం వేసుకో, గడియ పెట్టుకో అనే వాళ్ళం. ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?


మన తెలుగులో మాటలు లేవా ? 

ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !

కానీ మనం పలకం. 


వంటింటిని......కిచెన్ చేసాం. 

వసారా.....వరండాగా మారింది. 

ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.


మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు. 

ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు. 

భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. 

అందులో వడ్డించే వన్నీ.......

రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే.

అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే, ఇంకేమన్నా ఉందా,  వాళ్ళేమనుకుంటారో అని భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం. 

బ్యాగ్ పట్టుకుని షాప్‍ కు వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.


ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడను అడిగా. ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి ? అని ఎదురు ప్రశ్న వేసింది. బిత్తరపోవడం నావంతయింది. 


టీ.వీ లో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, 

వంటా - వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళ కు అలవోకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి. 

అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు. 


టీ.వీ వంటల కార్యక్రమం లో ఒకావిడ మన కు వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. 

అది ఏ భాషో మీరే చెప్పండి. 

‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, స్టౌవ్ ఆఫ్‍ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలాసాగుతుంది. 

మరి మన కూరల కు అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?


నిన్న మా పక్కింటాయన వచ్చి 

‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు. 

మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది ? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ?

అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న 

అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.


పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్‍ కు పంపిస్తాం. 

సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు లో మాట్లాడక తప్పదు. 

ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము. 


మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం ? ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా ? తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి ? ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు, నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, 

ఇతరులు అనుకోవాలన్న భావన.


ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.


అలాగని వాడుకలో ఉన్నమాటలను వదిలేసి పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించి పోతుంది. బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా, కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం.✍️


                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

నీళ్లు తాగకపోతే

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


               *నీళ్లు తాగకపోతే...!*

                   ➖➖➖✍️


నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు ఏంటో తప్పని సరిగా తెలుసుకోండి.


ప్రస్తుతం సమాజంలో రోజు ఒక్క బాటిల్ తాగేవారికన్న ...బాటిల్ మందు వేసేవారెక్కువగా తయారవుతున్నారు. 


మీరు మంచి నీళ్లు రోజుకు ఎన్ని సార్లు తాగుతారంటే...దాహం వేసినప్పుడు తాగుతా అంటారు. 


కాని నిజానికి రోజు ఏసీ గదుల్లో ఉంటూ ఎంత మంది నీళ్లు తాగుతున్నారు ? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక లీటర్ కూడా నీళ్లు తాగి ఉండరు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు... నీళ్లు తాగాలంటే బద్దకంగా ఫీలయ్యేవారందరి సమస్య. 


ఈ శరీరానికి నీళ్లు తాగడం చాలా అవసరం. ఎందుకంటే.. మనుషుల శరీరం మూడోవంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి నీళ్లు సరిగా అందకపోతే.. శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. 


1.మీరు కుర్చుని లేవలేక పోతున్నారా... కీళ్లు, కండరాలు నొప్పులతో అవస్తపడుతున్నారా...అయితే మీరు తక్కువ నీళ్లు తాగుతున్నారన్నమాట. ఎందుకంటే.. కీళ్ల మధ్యలో ఉండే కార్టిలేజ్ 80 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది. మీరు నీళ్లు తక్కువగా తాగినప్పుడు ఈ నొప్పుల వస్తాయి..


2. తలనొప్పి తరచుగా వస్తుందా... నీళ్లు తక్కువగా తాగినప్పుడు మీకు తలనొప్పి వేధిస్తుంటుంది. ఆక్సిజన్ తక్కువగా అందడం, బ్రెయిన్ కి బ్లడ్ తక్కువ అందడం వంటివి డీహైడ్రేషన్ ద్వారా కలుగుతాయి. దీంతో తలనొప్పి వస్తుంది.


3. జీర్ణవ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరం. డీహైడ్రేషన్ కారణంగా, ఫ్లూయిడ్స్ తక్కువగా అందడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది.


4. అలసట ,ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా లేకపోవటం అనేవి తక్కువ నీరుకు సంబంధించినదే... బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ సరిగా అందదు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయి అంటే.. మీరు శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగడం లేదని అర్థం.


5. యూరిన్ కలర్ మీ శరీరం డీహైడ్రేట్ అయిందని తెలిపే ముఖ్య లక్షణం మీ యూరిన్ కలర్. అలాగే తరచుగా యూరిన్ కి వెళ్లకపోయినా.. మీరు సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. రోజుకి 4 నుంచి 7 సార్లు యూరిన్ కివెళ్లాలి. అలాగే మీ యూరిన్ కలర్ ఎల్లో కలర్ లో ఉంది అంటే కూడా మీరు నీళ్లు చాలినంత తాగడం లేదని గుర్తించాలి.


6. బ్రెయిన్ ఫంక్షన్ పైనా ఇది ప్రభావం చూపుతుంది. మీ మూడ్, మెమరీ, డెసిషన్, ఏకాగ్రత వంటివాటిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.


7. పెదాలు ఆరిపోవడం , చర్మం ప్రకాశవంతంగా ఉండకపోవటం, పొడిబారిపోవటం. అలాగే చెమట కూడా చాలా తక్కువగా పట్టడం. ఇవే మీరు సరిగ్గా నీళ్లు తాగటం లేదని చెప్పే సంకేతాలు... ఇకనైనా నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి ఇకపై ఈ సిగ్నల్స్ కనిపించిన వెంటనే నీళ్లు తాగటం ఎక్కువ  చేసుకోండి.✍️


                        🌷🙏🌷


  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

 సుగుణారావు,ప్రకృతి యోగా కేంద్రం. గారి సౌజన్యంతో....

పరోపకారం

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



                  *పరోపకారం* 

                 ➖➖➖✍️



ప్రకృతిని నిశితంగా గమనిస్తే సర్వత్రా *‘ఇవ్వడమే’* కనిపిస్తుంది. 


*గాలి ప్రాణవాయువై జీవుల్ని బతికిస్తుంది. 


*చెట్లు కమ్మని పళ్లు ఇచ్చి క్షుద్బాధ తీరుస్తాయి. 


*నదులు తియ్యని నీరిచ్చి దాహార్తిని ఉపశమింపజేస్తాయి. 


*ప్రకృతికి వనరులను ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు.


భగవంతుడు వర ప్రదాత. భక్తుల కొంగుబంగారంగా కొలువై ఉంటాడు. మనుషులెప్పుడూ వరగ్రహీతలే! వరప్రదాతలు కావడం గొప్ప సుకృతం!


 అమ్మస్తన్యం తాగడంతో మొదలయ్యే మనిషి జీవితం, చివరి క్షణాల్లో తులసి తీర్థం పోయించుకోవడంతో అంతమవుతుంది. నడిమి జీవితం చాలావరకు పుచ్చుకోవడంతోనే సాగుతుంది. ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కాని తనకున్నదాంట్లో ఇవ్వడానికి మనిషికి మనస్కరించదు!


మన పురాణాలు *‘దానం’* ప్రాశస్త్యాన్ని వీలున్నప్పుడల్లా ఉటంకిస్తాయి. పుణ్యంతో ముడిపెట్టి మనిషిలోని దానగుణాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తాయి. ఇచ్చే చేయి కలిగి ఉండటం గొప్ప అదృష్టం. చాపే చెయ్యి వెనక సిగ్గుతో ముడుచుకుపోయే హృదయం ఉంటుంది. అది గమనించగలగాలి.


పాత్రతనెరిగి దానం చెయ్యమంటారు. కొంతమంది తమ అవసరాన్ని వ్యక్తపరచి అడిగి తీసుకుంటారు. మరికొంతమంది అస్సలు మనసు బయటపెట్టరు. అలాంటివారిని కనిపెట్టుకుని ఉండాలి. భగవంతుడు మనిషికి విచక్షణను ఇచ్చింది అందుకే. సృష్టిలోని ఏ జీవీ మరో జీవి మనసును చదవలేదు. అంచనా వేయలేదు. మనిషికే అది సాధ్యం.


నవ విధ భక్తిమార్గాల్లో సేవ ఒకటి. సేవ అంటే మనం చేయగలిగింది చేయడమే, ఇవ్వగలిగింది ఇవ్వడమే.  


ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రజలు పెద్దమనసుతో వితరణ చేసి, బాధితుల ముఖాల్లో వెలుగు నింపుతారు. వారి జీవితాన్ని చైతన్యవంతం చేస్తారు.


దానం చేయడానికి తన ఇంట్లో ఏమీ లేక, ఉన్న ఒక్క ఉసిరికాయను దానం చేసింది ఒక నిరుపేదరాలు. చలించిన శంకరాచార్యులవారు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.

అన్నార్తులకు లేదనకుండా అన్నదానం చేసిన దొడ్డ ఇల్లాలు డొక్కా సీతమ్మ.


దానం చేయడానికి మనసుండాలి, చేయి సహకరించాలి. కాలు, చేయి ఆడుతున్నప్పుడే హరి   నామ స్మరణ చేస్తూ- తోచినంత దానం చేయగలిగితే ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి అంటారు వేద ప్రియులు. ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో దానం చేసేవారు కొందరైతే, చేతికి ఎముక లేకుండా దానం చేసేవారు మరికొందరు. తమ కోసం ఏమీ మిగుల్చుకోకుండా దానం చేసినవారు అరుదుగా ఉంటారు.


కీర్తి కోసం కాకుండా, కైవల్య ప్రాప్తి కోసం దానం చేసేవారి అడుగు, మోక్షమార్గంపై పడుతుంది.✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀I

మార్గశిర పౌర్ణమి దత్త జయంతి*

 🥀🍁🥀🍁🥀🍁🥀🍁

🍁🥀🍁🥀🍁🥀🍁🥀




🥀 *మార్గశిర పౌర్ణమి దత్త జయంతి* 🥀




శ్రీమహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో దత్తావతారం ఆరోదని భాగవత పురాణం చెబుతోంది. దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించినదే దత్తావతారం. మార్గశిర శుద్ధ పూర్ణిమనాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. ‘దత్తం’ అంటే ఇచ్చినవాడని. అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడైనాడు. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. ఇరవై నలుగురిని తన గురువులుగా భావించి, సేవించాడు. కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్య బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించాడు.


దత్తుడు గొప్ప అవధూత. మహాజ్ఞాని. చిరంజీవి. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి. లోకగురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సుకోసం జ్ఞానబోధ చేశాడు. దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోకకల్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలినుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని ఉద్బోధించిన మార్గనిర్దేశకుడు. అగ్నినుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు. కొండచిలువలా భ్రాంతిలో పడకూడదన్నాడు. స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి, ఏనుగు నుంచి పట్టుదల, చేపనుంచి త్యాగచింతన నేర్చుకోవాలి. మానావమానాలకు సమస్పందన అలవరచుకోవాలి. సాలెపురుగు నుంచి సృష్టి స్థితిలయకారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలి. సీతాకోక చిలుకలా ఆత్మానందాన్వేషణ అలవరచుకోవాలి. చంద్రుడి నుంచి వృద్ధిక్షయాలు శరీరానికే కాని ఆత్మకు కావని గ్రహించాలి. ఆర్తులను కాపాడే చింతనను నీటినుంచి గ్రహించాలి. చీమలా జిహ్వ చాపల్యానికి లోనుకారాదని తెలుసుకోవాలి. ఇవన్నీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు- జగద్గురువు దత్తాత్రేయ స్వామి!


దత్తాత్రేయుడు సతీమదాలస ముద్దులపట్టి అలర్కుడికి యోగవిద్య నేర్పాడు. ఓంకారోపాసనా విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు. త్రిమూర్తుల అనుగ్రహ అవతారం కావడంతో, దత్తుడిరూపం మూడు శిరసులతో సందేశాత్మకమై ప్రకాశిస్తోంది.


దత్తుడు పదహారు అంశలు కలవాడని ‘దత్తపురాణం’ చెబుతోంది. శ్రీపాదవల్లభులు, శ్రీనృసింహ సరస్వతి, శ్రీ అక్కల్‌కోట మహరాజ్‌, శ్రీమాణిక్య ప్రభువు, షిరిడీ సాయిబాబా, గజానన మహరాజ్‌, శ్రీకృష్ణ సరస్వతీ మహరాజ్‌, వాసుదేవానంద సరస్వతీ మహరాజ్‌ దత్తావతారాలుగా వెలసినట్లు దత్తచరిత్ర చెబుతోంది. దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు.


మత్స్య పురాణం, స్మృతి కౌస్తుభంలో దత్తచరితం విస్తృతంగా ఉంది. ఈ పూర్ణిమనాడు కొన్ని ప్రాంతాల్లో చంద్రపూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తోంది. ఈ రోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సతతం మేలు కలుగుతుందని పురాణోక్తి. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి ‘కోర్ల పూర్ణిమ’గా ప్రసిద్ధి చెందింది. మహామార్గశీర్ష పేరుగల ఈ పున్నమిరోజున నరకపూర్ణిమావ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి కథనం.


మహారాష్ట్రలో దత్తజయంతిని భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకొంటారు. దత్తుడు ‘ఉగ్రదేవత’ అని గర్గసంహిత చెబుతోంది. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికర దినమని చెబుతారు. ఆ స్వామికి ఇష్టమైన వృక్షం మేడివృక్షం. ప్రేమ, అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వదా ఆచరణీయం.

🙏🏻

త్రికూటా

 *🔱🙏 త్రికూటా🙏🔱*




మూడు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'త్రికూటాయైనమః' అని చెప్పాలి.

త్రి = మూడు, కూటా = కూటములుగా ఉన్న మంత్ర స్వరూపిణి.

'మూల కూటత్రయ కళేబరా' అనే 89వ నామ వివరణ కూడా ఇక్కడ మళ్ళీ చదువుకోవాలి.

నిర్దిష్ట సంఖ్యలో ఉండే అక్షర సమూహాలను 'కూటము' అంటారు. 'కూటము' అంటే “విభాగము' అని చెప్పుకోవచ్చును. అమ్మవారి పంచదశాక్షరీ మంత్రం 'క, ఏ, ఈ, ల, హ్రీం; హ, స, క, హ, ల, హ్రీం, స, క, ల హ్రీం' అని మూడు కూటములుగా

ఉంటుంది. ఈ మూడు కూటములు వరుసగా - 'క'తో 'హ' తో స'తో ప్రారంభింపబడతాయి. అందుకే, ఈ మూడు కూటాలను వరుసగా కాదికూటము', 'హాదికూటము', 'సాదికూటము' - అని అంటారు. ఈ మూడూ వరుసగా అమ్మవారి మస్తకంపై నుండి కంఠం వరకు ఉండే భాగాన్ని; కంఠం నుండి నాభివరకు ఉండే భాగాన్ని; నాభి నుండి దిగువ భాగాన్ని సూచిస్తాయి. వీటినే వరుసగా వాగ్భవ కూటము, కామరాజు కూటము, శక్తి కూటము - అంటారు. అందుకని, అమ్మవారు ఈ 'త్రికూట' అనే నామంతో పిలువబడుతుంది. 


మంత్ర శాస్త్రాన్ననుసరించి ఏ మంత్రాన్నైనా, బీజము 'శక్తి' కీలకము' అని మూడు కూటములుగా చెబుతారు. అమ్మవారి మంత్రం కూడా ఈ త్రికూటాలతో ఉంటుంది. అందుకని అమ్మవారు 'త్రికూటా' అయింది.

1) కాది, సాది, హాది కూటత్రయంలో నుండు మంత్రస్వరూపిణి.

2) బీజ, శక్తి, కీలకములు - అని మూడు కూటములుగా చెప్పబడు మంత్రస్వరూపిణి - అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును.


🙏ఓం ఐం హ్రీం శ్రీo త్రికూటాయై నమః🙏


🌷శ్రీ మాత్రే నమః🌷

హిందూ ధర్మాన్ని

 *🚩హిందూ ధర్మాన్ని త్రికరణశుద్ధిగా పాటించడం, రక్షించడం చేస్తే చాలు, హిందూ మతం, హిందూ భారతదేశం రక్షింపబడతాయి..క్రైస్తవ మాఫియా అక్రమ మతమార్పిడులు, ఇస్లామిక్ మతోన్మాద జిహాదీలు దాడులు, దొంగ సెక్యులరిజం, కమ్యూనిస్టు ఎర్ర కుక్కల విషపు రాతలు, పైసాకి కూడా పనికిరాని ప్రతి అడ్డమైన వెధవ, హిందువుల పండుగలు చేసుకోకుండా చెప్పే సలహాలు నుండి,హిందూ ధర్మాన్ని, హిందూ దేశాన్ని రక్షించడానికి మాత్రమే ప్రత్యేకంగా,🇮🇳🚩🕉️ హిందూధర్మమే, దేశ రక్షణ అనే ఈ గ్రూపు రూపొందించాను..*


*🚩హిందువులు మాత్రమే నిజమైన దేశభక్తులు, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశం, క్రైస్తవ దేశం చేయకుండా,ముందే హిందూ భారతదేశం గా మార్చడం ప్రతి ఒక్క హిందువు బాధ్యత.హిందూ బంధువులు, మిత్రులు శ్రేయోభిలాషులు, సన్నిహితులు ఎవరైనా ఈ గ్రూపులో లింక్ ద్వారా జాయిన్ కాగలరు.. మీయొక్క సలహాలు, సూచనలు, హిందూ ధర్మ రక్షణకు, దేశ రక్షణకు పంచుకోగలరు..*


*🚩సదా సనాతన హిందూ ధర్మం,దేశ హితం కోరే*


*🇮🇳🚩🕉️శాయిరి రాజేశ్వర్, మెదక్*


*🚩భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ వందేమాతరం*


https://chat.whatsapp.com/BT0dMt0gut2C1m2qp9QWiG

కళ్యాణ ఘడియాలు

 కళ్యాణ ఘడియాలు తెలుసుకోవ‌డం ఎలా..?


మ‌నిషి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్య‌మైన సంద‌ర్భం. పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుంద‌ని వ‌య‌సు వ‌చ్చిన‌ ప్ర‌తి వ్య‌క్తిలో ఆలోచ‌న మొద‌ల‌వుతుంది. కొంద‌రిలో అనుకున్న స‌మ‌యంలో వివాహం కాక.. అది ఒక‌ స‌మ‌స్య‌గా మారుతుంది. జాత‌కం ప్రకారమే వివాహ స‌మ‌యం నిర్థేశించ‌బ‌డుతుంద‌ని గ‌మ‌నించాలి. అయితే 22 సంవత్సరాల్లోపు జరిగే వివాహాలను తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలుగా చెప్పుకోవచ్చు. 28 సంవత్సరాలు, ఆ పై వయస్సులో జరిగేవి ఆలస్య వివాహం.


తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలకు కార‌ణం


లగ్నం, సప్తమభావముల యందు శుభ గ్రహాలు ఉండి సప్తమాధిపతి పాప గ్రహాలతో కలవకుండా శుభ గ్రహాల దృష్టి పొందడం వ‌ల్ల‌, లేదా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు. అనగా మిథున రాశిలో గాని, తుల, వృషభ రాశులలోగాని, రవికి 150 లకుపైగా దూరంగా ఉన్నప్పుడు. లేదా

శుక్రుడు, శని గ్రహాలపైన చంద్రుని దృష్టి పడకుండా ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు. లేదా ద్వితీయ అష్టమ స్థానమలలో శుభ గ్రహాలు ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు లేదా జ‌లతత్వ రాశులలో శుభగ్రాహాలు ఉన్నప్పుడు వివాహం తొందరగా జరుగుతుంది.


ఆలస్య వివాహానికి గల కారణాలు


లగ్నమందు, సప్తమ స్థానమందు పాపగ్రహాలు అనగా.. శని, రాహు, కేతువు, రవి, కుజ గ్రహాలు ఉన్నప్పుడు, సప్తమ స్థానమందు 2 గాని అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు. లేదా ద్వితీయ అష్టమ భావములలో పాపగ్రహా లు గాని, వక్రములు గాని ఉన్నప్పుడు. లేదా  శుక్రుడు రాహువుతో గాని, శనితో గాని కలిసివున్నప్పుడు. లేదా శుక్రుడు రవి గ్రహానికి 430 201 కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు. లేదా జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచంలో గాని వక్రించి గాని ఉన్నప్పుడు. లేదా సప్తమ భావముపై, సప్తమాధిపై పాప గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్య వివాహం జరుగును.


ఇలా జాతకంలో శ్రీఘ్ర వివాహమా? ఆలస్య వివాహమా అని నిర్ణయించిన తర్వాత జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి గోచారంలో గురువు, శుక్ర గ్రహాలను బట్టి వివాహ కాలం నిర్ణయించుకోవ‌చ్చు.


వివాహకాలం నిర్ణయించుటకు జాతకునికి 21 సంవ‌త్స‌రాలు దాటిన తరువాత వచ్చు దశ అంతర్దశలను పరిశీలించాలి. సప్తమాది యెక్క లేదా సప్తమ భావాన్ని చూస్తున్న లేదా సప్తమాధిపతితో యతి వీక్షణలు పొందుతున్న గ్రహాల యొక్క దశ, అంతర్దశలలో వివాహం జరుగుతుంది. అలాగే నవాంశ లగ్నాధిపతి యొక్క, లేదా సప్తమాదిపతి నవాంశమందున్న రాశి నాథుని యొక్క‌ దశ, అంతర్దశలలో పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా పెళ్లి జరిగే స‌మ‌యం నిర్ణయించిన తర్వాత గురు గ్రహం గోచార గమనాన్ని బట్టి వివాహం జరుగే సంవత్సరం నిర్ణయించాలి. వ‌రుడి జాతకంలో శుక్రుడు, వ‌ధువు జాతకంలో కుజుడు ఉన్న రాశులపై గోచార గురువు యొక్క దృష్టి లేదా కలయిక వచ్చిన సంవత్సరంలో వివాహం జరుగుతుంది.


ఉత్తరాయణ కాలంలో జన్మించిన వారికి నవాంశలో గురువు ఉన్న రాశిలోనికి గాని, గురువుకు 5, 9 స్థానాల్లోగాని రవి గోచార రీత్యా వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. దక్షిణాయణంలో జన్మించిన వారికి నవాంశలో శుక్రుడున్న రాశిలోగాని, శుక్రునికి 5, 9 స్థానాలల్లోనికి గాని గోచార రవి వచ్చిన మాసంలో పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా గురువు యొక్క సంచారాన్ని బట్టి పెళ్లి జరుగు సంవత్సరం, రవి యొక్క సంచారాన్ని బట్టి వివాహం జరుగు మాసం నిర్ణయించాలి. త‌ర్వాత చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి పెళ్లి జరిగే రోజు నిర్ణయించాలి.


జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఆలస్య వివాహానికి కారణం తెలుసుకొని తత్సంబంధమైన గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయాలు చేయాలి. అప్పుడే దోషాలు తొలగి శ్రీఘ్ర వివాహం జరుగుతుంది. సప్తమస్థానంపై రాహు, కేతువుల ప్రభావం ఉన్నప్పుడు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఫ‌లితం ఉండ‌దు. కొన్ని సందర్భాల్లో నిశ్చితార్ధం జరిగిన తరువాత కూడా పెళ్లి ముందు రోజు కూడా ఏవో కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

గురు గ్రహ దోషాలు

 గురు గ్రహ దోషాలు - నివారణ


నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్వగుణ ప్రధానమైన ఈ గ్రహం భూమిపై నివసించే జీవులపై, మానవులపై ప్రభావం చూపుతుంది.


ఈ గ్రహ ప్రాబల్యం బాగా ఉన్న వారికి విద్య, బుద్ధి, జ్ఞానం బాగా ఉంటుంది. ఈ గ్రహం బాగుంటే వారు అమితమైన తేజోవంతులుగానూ, ధనవంతులుగానూ ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఇక ఈ గ్రహానికి సంబంధించిన వ్యాధులు, గురు గ్రహ దోషానికి పరిహార క్రియలను పరిశీలిస్తే.. కాలేయం, వెన్నుపూస, తొడలు, చెవులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నత్తి, మతిమరుపు, శరీరానికి నీరు పట్టడం, కఫం వంటి వ్యాధులు గురు గ్రహ ప్రభావంతో కలుగుతాయి.


అలాగే గౌరవహాని, పండితపామరులతో వివాదం, స్థానచలనం, అధికార నష్టం, తీర్థయాత్రలలో ఇబ్బందులు, స్వార్థం, సంతానదోషం, ధననష్టం, పుత్ర విరోధం, దైవ, గురు భక్తి లోపించడం ఇవి సామాన్యంగా గురు గ్రహ బలహీనతవలన కలిగే ఇబ్బందులు, లోపాలని శాస్త్రం చెబుతుంది.


అందుకే గురుగ్రహ దోషాలు, వ్యాధుల పరిహారం కోసం మంచి పుష్యరాగ మణిని గురువారం రోజు శివ పంచాక్షరి మంత్రం, గురుగ్రహ మంత్రంతో కలిపి జపించిన తర్వాత ధరించాలి. స్త్రీలు పాదాలకు ధరించే పసుపు, గడపలకు పసుపు రాయటం, పూజా కార్యక్రమాల్లోనూ, స్నానానికి మనం వినియోగించే పసుపు ఎన్నో వ్యాధుల్ని నివారించగలదు. కాబట్టి పసుపు రంగు వేయబడిన గది గోడల మధ్య నివాసం ఈ లోపాన్ని పూరిస్తుందని శాస్త్రం చెబుతోంది.


గురు గ్రహ దోషం వల్ల అనేక రకాల వ్యాధులు కలుగుతాయి. ముఖ్యంగా కాలేయం, వెన్నుపూస, తొడలు, చెవులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నత్తి, మతిమరుపు, శరీరానికి నీరు పట్టడం, కఫం వంటి వ్యాధులు గురు గ్రహ ప్రభావంతో కలుగుతాయి. అలాగే గౌరవహాని, పండిత పామరులతో వివాదం, స్థానచలనం, అధికార నష్టం, తీర్థయాత్రలలో ఇబ్బందులు, స్వార్థం, సంతానదోషం, ధననష్టం, పుత్ర విరోధం, దైవ, గురు భక్తి లోపించడం ఇవి సామాన్యంగా గురు గ్రహ బలహీనతవలన కలిగే ఇబ్బందులు, లోపాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.


అందువల్ల గురుగ్రహ దోషాలు, వ్యాధుల పరిహారం కోసం మంచి పుష్యరాగ మణిని గురువారం రోజు శివ పంచాక్షరి మంత్రం, గురుగ్రహ మంత్రంతో కలిపి జపించిన తర్వాత ధరించాలి. స్త్రీలు పాదాలకు ధరించే పసుపు, గడపలకు పసుపు రాయటం, పూజా కార్యక్రమాల్లోనూ, స్నానానికి మనం వినియోగించే పసుపు ఎన్నో వ్యాధుల్ని నివారించగలదు. కాబట్టి పసుపు రంగు వేయబడిన గది గోడల మధ్య నివాసం ఈ లోపాన్ని పూరిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.


జాతకంలో గురువు బలహీనంగా ఉంటే.. సంతాన సౌఖ్యత లేక పోవటం, కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట, నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట, ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం, షుగర్, క్యాన్సర్, మూత్ర రోగాలు, పెద్ద పొట్టతో కలిగిన దేహం, పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం, గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు.


వ్యాధి వస్తే తొందరగా తగ్గదు. లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖం, సంతోషం లేక పోవుట, దైవంపై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేకపోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శించుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.


గురు గ్రహ దోషనివారణకు పసుపు రంగు స్టోన్ నీటిలో వేసుకొని ఆ నీటిని త్రాగిన దోష నివారణ కలుగును. పసుపు కొమ్ము గణపతిని, పసుపు రంగు స్టోన్ గణపతిని పూజిస్తే చాలా మంచిది. పూర్వ కాలం నందు గురుగ్రహ దోష నివారణకు ఇంద్రుడిని పూజించేవారు, ప్రస్తుతం సాయిబాబా, దత్తత్రేయ, హయగ్రీవుడిని పూజిస్తున్నారు.


గురు గ్రహ దోషం - శాంతి


ప్రతి గురువారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల సమయంలో దగ్గరలో ఉన్న దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి 160 ప్రదక్షిణలు చేయాలి. 16 గురువారాలు నవగ్రహములకు 160 ప్రదక్షిణలు చేసి, పసుపు వస్త్రంలో ఐదు పావుల శనగలు పోసి, మూత కట్టి, దాన్ని దానం చేయాలి.


అలాగే గురువారం రోజున ఉడికించిన శనగలు పేదలకు పంచిపెట్టాలి. కుడి చేతి చూపుడు వేలుకి కనకపుష్యరాగం ఉన్న బంగారు ఉంగరాన్ని ధరించాలి. బ్రాహ్మణుడితో గురు గ్రహ జపం చేయించి శనగలు దానం చేయాలి. గురువారం నాడు గురుగ్రహం వద్ద 16 పసుపు రంగు వత్తులతో దీపారాధన చేసి పసుపు వస్త్రాన్ని దానం చేయాలి.


16 గురువారాలు ఉపవాసము ఉండి చివరి గురువారం దక్షిణామూర్తి పూజ, గురు అష్టోత్తర పూజ చేయాలి. ప్రతిరోజూ 160 మార్లు చొప్పున 160 రోజుల పాటు గురు ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి.16 గురువారముల పాటు గురు గాయత్రి మంత్రాన్ని 160 సార్లు పారాయణ చేయాలి. ప్రతి రోజూ దత్త శ్లోకాన్ని పారాయణ చేస్తూ, 40 రోజుల్లో 16.000 సార్లు గురు మంత్రాన్ని జపించండి. తీరిక లేనివారు కనీసం గురుశ్లోకములు 16 సార్లు లేదా గురు మంత్రాన్ని 160 సార్లు కాని పారాయణ చేయాలి. గురు పౌర్ణమి పర్వదినమున 18 సార్లు స్తవం పారాయణ చేయాలి.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

సూర్యుడు

 సూర్యుడు 

 కశ్యప మహర్షికి దక్షుని పుత్రికయగు అదితికిని ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి నాడు "వివస్వంతుడు (సూర్యుడు)" జన్మెంచెను కశ్యపుని కొడుకు కనుక "కాశ్యపుడు" అని అదితి కొడుకు కనుక "ఆదిత్యుడు" అని అండమున మృతము లేనివాడు కనుక "మార్తాండుడు" అని నామములు వచ్చెను. సూర్యునకు సంజ్ఞాదేవికిని "వైవస్వతుడు" "యముడు" "యమున" లు జన్మించెను సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను. తరువాత ఛాయకు "శని" భగవానుడు జన్మించెను. యముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను. వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు. సూర్యుడు పురుష గ్రహం. సూర్యుని స్వభావం రీత్యా పాపి.  సూర్యుడు రాశి చక్రంలో సింహంలో రాజ్యాధికారంలోను, మేషంలో ఉచ్ఛ స్థితిలోను, తులలో నీచ స్థితిలోనూ ఉంటాడు. సూర్యుడికి ఉన్న ఇతరనామాలలో కొన్ని అర్కుడు, ఆదిత్యుడు, అరుణుడు, తపసుడు, పూష, హేళీ, భానుడు, దినకరుడు, మార్తడుడు.

సూర్యుని జాతి క్షత్రియ, తత్వం అగ్ని, వర్ణం రక్తవర్ణం, రజోగుణం, పాప స్వభాభావం, స్థిర స్వభావం, జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు కారకత్వం వహించే రుచి కారం, కారకత్వం వహించే జీవులు పక్షులు, పృష్టోదయం, తూర్పుదిక్కుకు ఆధిపత్యం,  జలభాగం నిర్జల, లోహం  రాగి, శక్తి రాజు, ఆత్మాధికారం శరీరం, ధాతువు ఎముక, కుటుంభ సభ్యుడుగా తండ్రి, శ్యాల వర్ణం,గ్రహ పీడకు   శిరోవేదన, శరీర తాపం, గృహంలో భాగములు ముఖ ద్వారం, పూజా మందిరం, గ్రహ వర్గం  గురువు,

కాల బలం వీరికి పగటి సమయం, దిక్బలం దశమ స్థానం, ఆధిపత్య కాలం ఆయనం,శత్రు క్షేత్రంలు మకరం, కుంభం, విషమ క్షేత్రంములు వృశ్చికం, ధనస్సు, మకరం. మిత్రక్షేత్రం మీనము. సమ క్షేత్రములు మిధునం, కన్య. మిత్రగ్రహాలు :- కుజుడు, చంద్రుడు, గురువు. శత్రు గ్రహాలు :- శుక్రుడు, శని. సమ గ్రహం :- బుధుడు. నైసర్గిక బల గ్రహం :- శుక్రుడు,వ్యధా గ్రహం, :- శుక్రుడు. దిన చలనం :- 1 డిగ్రీ. ఒక్కొక్క రాశిలో ఉండే సమయం :- 30 రోజులు, రాశిలో ఫలమిచ్చే భాగం :- మొదటి భాగం, ఋతువు :- గ్రీష్మ ఋతువు, గ్రహ ప్రకృతి :- పిత్తము. దిక్బలం :- దక్షిణ దిక్కు. 

స్థానభ్రష్టం, భయం , సంపదా , మానభంగం , మహాద్భయ

శత్రు క్షయం , వ్యధా , రోగం , దుఃఖం ,సిద్ది , ధనాదనే

క్రమేణ జన్మ రాష్యాది కురుతేతే పద్మ భాంధవః

తాత్పర్యము : సూర్యుడు జన్మ రాశిలో సంచరించునపుడు స్థాన మార్పిడి , 2 వ రాశికి వచ్చినపుడు భయమును 3 సంపదను 4 మాన హానిని 5 విశేష భయమును 6 శత్రు నాశనం 7 దుఃఖము 8 రోగము 9 విచారమును 10 కార్య సిద్ధిని 11 ధన లాభమును 12 ధన వ్యయమును కల్గించును.

సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల సముదాయమే సౌర కుటుంబం. దీన్ని సౌర వ్యవస్థ  అని కూడా అంటారు. నేరుగా సూర్యుని చుట్టూ తిరిగే వస్తువుల్లో అతి పెద్దవి గ్రహాలు. మిగతావి మరుగుజ్జు గ్రహాల వంటి చిన్న ఖగోళ వస్తువులు. సూర్యుడి చుట్టూ పరోక్షంగా తిరిగే వస్తువులు సహజ ఉపగ్రహాలు. వీటిలో రెండు, బుధ గ్రహం కంటే పెద్దవి. సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో ఓ మహా పరమాణు మేఘం దాని గురుత్వ శక్తి కారణంగా కుంచించుకు పోయి సౌర వ్యవస్థ ఏర్పడింది. దీని మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక భాగం సూర్యుడిలోనే ఉంది. మిగతా దానిలో అత్యధిక భాగం బృహస్పతిలో ఉంది. అంతర సౌర వ్యవస్థలోని నాలుగు గ్రహాలు, ఈ గ్రహాలు ప్రధానంగా రాయి, లోహాలను కలిగి ఉంటాయి. ఇవి చిన్న గ్రహాలు కూడా. బాహ్య సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు రాతి గ్రహాల కంటే చాలా పెద్దవి. వాటిలో అతి పెద్దవైన గురుడు, శని వాయువులతో కూడుకుని ఉంటాయి. ఆ వాయువుల్లో ముఖ్యమైనవి హైడ్రోజన్, హీలియమ్. అన్నిటి కంటే బయట ఉన్న గ్రహాలు - యురేనస్, నెప్ట్యూన్ లు అతిశీతల గ్రహాలు. మీథేన్, అమ్మోనియా వంటి వాయువులతో అవి కూడుకుని ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా దాదాపు వృత్తాకార కక్ష్యలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూంటాయి. సూర్యుడు జ్యోతిష శాస్త్రంలో ఇలా వర్ణించారు. గుండ్రని ముఖం, రక్తవర్ణం, పొడగరి, గోధుమ వర్ణం కలిగిన జుట్టు కలిగిన వాడుగా వర్ణించబడ్డాడు. గుణత్రయాలలో సూర్యుని స్వభావం రజోగుణం. రుచులలో సూర్యుడు కారం రుచికి కారకత్వం వహిస్తాడు. చాతుర్వర్ణములలో సూర్యుడు క్షత్రియ జాతికి కారకత్వం వహిస్తాడు. తత్వం అగ్ని తత్వం, ప్రకృతి పిత్త ప్రకృతి. దిక్కు తూర్పు దిక్కు, లోహము రాగి, రత్నము మాణిక్యము, దిక్బలం దశమ స్థానం, రాశి సంఖ్య 1, కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తర ఆషాఢ నక్షత్రాలకు నక్షత్రాధిపత్యం వహిస్తాడు. శరీరావయవాలలో గుండే మరియు పురుషులకు కుడి కన్ను, స్త్రీలకు ఎడమ కన్ను, రాశ్యాధిపత్యం సింహరాశి, మేహరాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిని, సింహరాశిలో 20 ఇగ్రీలలో రాజ్యాన్ని, తులా రాశి 10 డిగ్రీలలో నీచను పొందుతాడు. సూర్యుని ప్రభావం ఉన్న వారు ఆత్మాభిమానం, చురుకు తనం కలిగి ఉంటారు. సంఘంలో పలుకుబడి ఉంటుంది. దుబారా వ్యయం, పొగడ్తలకు లొంగుట, ఆవేశపడుట, సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. చక్కని సంపాదన ఉంటుంది. కంటి జబ్బులు, గుండె జబ్బులు, వడదెబ్బకు గురి అగుట వంటి శారీరక అవస్థలకు గురి ఔతుంటారు. పిత్త ప్రకృతి కలిగి ఉంటారు. సూర్యుడు ఆత్మకు, తండ్రికి, శక్తికి, అగ్నికి, ప్రతాపానికి, ఆకాశము, దిక్కు తూర్పు, దేశాధిపత్యములకు కారకత్వము వహిస్తాడు. ముళ్ళ చెట్లకు, పంటలలో మిరియాలు, మిరపకాయలు, కొబ్బరి, వాము, బియ్యం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. శివ భక్తులు, శివ పూజ, శివాలయాలకు కారకత్వం వహిస్తాడు, జంతువులలో సింహం, ఎలుగుబంటి, గుర్రము, సర్పములకు కారకత్వం వహిస్తాడు. పక్షులలో కాకి కోకిల, కోడి, హంసలకు కారకత్వం వహిస్తాడు. వృత్తులలో ప్రభుత్వ కార్యాలయాలు, హృదయ సంబంధిత మందులు, వైద్యులు, రిజర్వ్ బ్యాంక్ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు. ఆకాశ సంబంధిత విమానాలు, విమానాశ్రయము, ఖ్హగోళము, వాతావరణము, విమాన చోదకులు, విద్యుత్ సంబంధిత బ్యాటరీలు, విద్యుత్తు ఉత్పత్తి, భూకంపాలు, ఆకాశ వాణి, దూరదర్శన్వంటి ప్రసార సంబంధిత మాద్యమ వృత్తులు, విద్యుత్తు ఉపకరణ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు. సూర్యుడు మేష రాశి 10 డిగ్రీలలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు. సిం,హరాశిలో 20 డిగ్రీల వద్ద రాజ్యా స్థితిని పొందుతాడు. సింహం సూర్యునికి స్వక్షేత్రం మరియు మూల త్రికోణ క్షేత్రం. సూర్యుడికి కుంభరాశి, మకర రాశి శత్రు క్షేత్రాలు, కాగా కన్యా రాశి, మిధున రాశి సమ క్షేత్రాలు. మీనం మిత్ర క్షేత్రం. వృశ్చిక, ధనస్సు, మకరాలు విషమ క్షేత్రాలు. సూర్యుడికి గురువు, చంద్రుడు, కుజుడు మిత్ర గ్రహాలు. శుక్రుడు, శని శత్రు గ్రహాలు. బుధుడు నైసర్గిక బలం కలిగిన గ్రహం. వ్యధా గ్రహం శుక్రుడే. లగ్నం లో సూర్యుడు ఉన్న అల్పకేశములు కలిగి ఉంటాడు. పొడగరి, గర్వి, అల్పదృష్టి, ఉద్రేకి, క్రూరహృదయుడు, నిర్గుణుడు, నిన్న మాటకే రోషం కలిగిన వాడు, ప్రచంఢస్వభావి ఔతాడు. కటకలగ్నజాతకులకు లగ్నంలో రవి ఉంటే కన్నులలో పూవు పూయువాడు, మేషలగ్న జ్ఞాతకులకు లగ్నంలో రవి ఉంటే నేత్రవ్యాధిపీడితుడు, సింహలగ్నజాతకులకు లగ్నంలో రవి ఉన్న రేచీకటి కలిగిన వాడు, తులాలగ్న జాతకులకు లగ్నంలో రవి ఉంటే దారిద్యపీడితుడు, సంతాన నష్టం కలిగిస్తాడు.

ద్వితీయంలో రవి ఉన్న జాతకుడు నిర్ధనుడు, విద్యావినయం లేని వాడు, దుర్వచనాలు పలికేవాడు ఔతాడు.

తృతీయంలో రవి ఉన్న జాతకుడు బలవంతుడు, ధనవంతుడు, ధైర్యవంతుడు ఉదారుడు ఔతాడు. అప్తుల ఎడల ద్వేషం కలిగి ఉంటాడు.

చతుర్ధస్థానంలో రవి ఉన్న ఎడల బంధుహీనుడు, సుఖహీనుడు, క్షేత్రహీనుడు అంటే భూసంబంధిత సంపద లేని వాడు, స్నేహనుడు, గృహహీనుడు ఔతాడు. పిత్రార్జితం ఖర్చు చేయవాడు. ప్రభుత్వం ఉద్యోగి ఔతాడు.

పంచమస్థానంలో రవి ఉన్న జాతకుడు సుఖపుత్రహీనుడు, అల్పాయుష్మంతుడు, జ్ఞాని, అరణ్యప్రదేశములందు తిరుగువాడు ఔతాడు.

ష్టమ స్థానమున రవి ఉన్న జాతకుడు రాజు, ఖ్యాతివంతుడు, ధనవంతుడు, విజయవంతుడు ఔతాడు.

సప్తమ స్థానమున రవి ఉన్న జాతకుడు ఆధిక్యభావము కలిగిన కళత్రం కలిగిన వాడు ఔతాడు. భాగస్వాముల ఆధిక్యత కలిగి ఉంటాడు.

అష్టమ స్థానమున రవి ఉన్న జాతకుడు ఆస్తిని పోగొట్టుకొనుట, అల్పాయుషు కలిగి ఉండుట, దృష్టి లోపం కలిగి ఉన్న వాడు ఔతాడు.

నవమ స్థానమున రవి ఉన్న జాతకుడు తండ్రి లేని వాడు, బంధువులు, మిత్రులు, పుత్రులు కలవాడు ఔతాడు.

దశమస్థానంలో రవి ఉన్న జాతకుడు పుత్రులు కలవాడు, వాహనము కలవాడు, భాగ్యవంతుడు, కీర్తి యశస్సు కలవాడు, ప్రభువు కాగలడు.

రవి లాభస్థానమున ఉన్న జాతకుడు బహుధనవంతుడు, శోకములు లేని వాడు ఔతాడు.

ద్వాదశమున రవి ఉన్న జాతకుడు పితృద్వేషి, నిర్ధనుడు, దోషదృష్టి కలవాడు, పుత్రులు లేని వాడు ఔతాడు....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

చంద్రుడు

 చంద్రుడు :

అత్రి మహర్షి అనసూయల సంతానంగా నందన నామ సంవత్సర కార్తీక శుద్ద చతుర్థశి నాడు

అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హితార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారలు ప్రదక్షిణలు గావించెను ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదులు మొలకెత్తెను. సోముని బ్రహ్మ భూమికి రాజును చేసెను. చంద్రుని పుత్రుడు బుధుడు.  అన్నవృద్ధిం, ధన క్షీణం , ద్రవ్య లాభం , మహాద్గతం కార్యనాశంచ , విత్తంచ , ద్రవ్యలాభంచ .మృత్యుచః నృపక్రోధం ,సుఖం , లాభం , ధనక్షీణంటు చంద్రమా తాత్పర్యము : చంద్రుడు 12 రాశులలో సంచరించునపుడు 1 భోజన సౌఖ్యమును 2 ధన క్షయమును 3 ద్రవ్యలాభమును 4 విశేష రోగ భయమును 5 కార్య నాశనము 6 ధనరాబడిని 7 ద్రవ్య లాభమును 8 మరణ సమాన ఫలితములను 9 రాజ కోపమును 10 సౌఖ్యమును 11 లాభమును 12 ధన నష్టమును కలిగించు చున్నాడు. జ్యోతిష శాస్త్రంలో మనస్సు కు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వేత వర్ణం, పరిమాణం పొట్టి, వయస్సు డెబ్బై సంవత్సరాలను సూచించును. దిక్కు వాయవ్యం, తత్వం జల తత్వం, ప్రకృతి వాత, శ్లేష్మములు. ఋతువులలో వర్ష ఋతువును, లోహములలో వెండిని, రత్నములలో ముత్యమును సూచించును. చంద్రుడు చతుర్ధ భావంలో దిక్బలం కలిగి ఉంటాడు. గ్రహములలో చంద్రుడు ఏడవ వాడు. సత్వగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణ పక్ష దశమి నుండి శుక్ల పక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడు. శుక్ల పంచమి నుండి అమావాస్య వరకు క్షీణ చంద్రుడు, అమావాస్య నుండి కృష్ణ పక్ష దశమి వరకు మధ్యమ చంద్రుడు అని శాస్త్రం చెప్తుంది. చంద్రుడు రోహిణి, హస్త, శ్రావణ నక్షత్రాలకు అధిపతి. శరీరావయవములలో మగవారి ఎడమ కన్ను, స్త్రీల కుడి కన్ను శరీర మధ్య భాగమును సూచించును. చంద్రుడు కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు వృషభంలో మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు. వృషభంలో మూడు నుండి ఇరవై ఏడు డిగ్రీల వరకు మూల త్రికోణంలో ఉంటాడు. వృశ్చికంలో మూడు డిగ్రీల వరకు పరమ నీచ స్థితిలో ఉంటాడు. బుధుడు, సూర్యుడు మిత్రులు. చంద్రుడికి శత్రువులు లేరు.చంద్రుడు, భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం. చంద్రుడిని కథల్లోనూ, భావయుక్తంగాను చందమామ అని కూడా పిలుస్తారు. భూమి నుండి చంద్రునికి రమారమి 3,84,403 కిలోమీటర్ల దూరముంటుంది. సూర్యుని కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి భూమికి చేరుతుంది. ఇంతదూరం నుండి కాంతి ప్రతిఫలించడానికి సుమారు 1.3 క్షణాలు పడుతుంది. చంద్రుని వ్యాసం 3476 కి.మీ. (2159 మైళ్ళు) [1], ఇది భూమి వ్యాసంలో పావువంతు కంటే కొంచెం ఎక్కువ. చంద్రుడు సౌరమండలములో ఐదో అతిపెద్ద ఉపగ్రహం. గ్యానిమీడ్, టైటన్, క్యాలిస్టో, ఐఓ అనే ఉపగ్రహాలు దీని కంటే పెద్దవి. సముద్రాలలో అలలు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి. చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి 29.5 భూమి యొక్క రోజులు పడుతుంది. అనగా చంద్రుడిపై ఒక్క రోజు, భూమిపై ఒక నెలకు సమానం. చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టిరావడానికి 27.3 రోజులు పడుతుంది. భూమి-చంద్రుడు-సూర్యుడు మధ్య వ్యవస్థాపక మార్పుల వల్ల ఒక చంద్రమాసానికి 29.5 రోజులు పడుతుంది. దీనినే చంద్రమాసము అంటారు. చంద్ర ప్రభావిత వ్యక్తులు శ్లేష్మమ వ్యాధి పీడితులుగా ఉంటారు. వీరు కొంత సమయం ఉత్సాహంతోనూ మరి కొంత సమయం నిరుత్సాహంగానూ ఉంటారు. కొంత కాలం ధైర్యము మరి కొంత కాలం భయం కలిగి ఉంటారు. కొంత కాలం ధనవంతులుగా మరి కొంతకాలం ధనహీనులుగా ఉంటారు. స్థూలంగా మానసిక స్థితి, సందలు అస్థిరంగా ఉంటాయి. అభిప్రాయాలూ తరచూమార్చుకుంటారు. మిత్రులనూ తరచూ మార్చుకుంటారు. భోజన ప్రియులుగా ఉంటారు. ఆ కారణంగా యుక్త వయసు దాటే సమయానికి పొట్ట పెద్దది అయ్యే అవకాశం ఎక్కువ. స్వతంత్రించి ఏకార్యం చెయ్య లేరు. నీటి పారుదల, జల విద్యుత్, ప్రజా ప్రాతినిధ్యం, బియ్యము, వస్త్రములకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు. పాండు రోగం, క్షయ, మధుమేహం, శ్వాశకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. చంద్రుడు తల్లికి, జలరాంతాలు, జలం, పూలు, సముద్రం, నదులు, ముఖము, ఉదరం, మహిళా సంఘాలకు, స్త్రీ సంక్షేమ సంఘాలకు చందుడు కాకత్వం వహిస్తాడు. వృత్తి సంబంధంగా నౌకా వ్యాపారం, ఓడ రేవులు, వంతెనలు, ఆనకట్టలు, చేపల పెంపకం, వెండి, మత్యములకు కారకత్వం వహిస్తాడు. వ్యాధులలో రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, వరబీజము, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్ (రాచ పుండు) మొదలైన వాటికి కారకుడు, ఆహార సంబంధంగా చెరకు, తేనె, పాలు, పెరుగు, భోజనము, గోధుమలు, జొన్నలు, రొట్టెలు, గోధుమలు, చేపలు, పంచదార, అరటి పండు, నెయ్యి, దోసకాయలు, తమలపాకులు, గుమ్మడి, క్యాబేజి, కర్బూజా ఫలం, కుక్కగొడుగులు, ఆవులు, గుడ్లు తాబేలు, గుడ్లగూబ, బాతు, గబ్బిలం, పిల్లి, నీటి గుర్రం, సొర చేపల వంటి ప్రాణులకు కారకత్వం వహిస్తాడు., తిమింగలం మొదలైన ప్రాణులకు కారకత్వం వహిస్తాడు. గుడ్లు, క్కర్పూరం, నికెల్, జర్మన్ సిల్వర్ లాంటి వస్తువులకు కారకత్వం వహిస్తాడు. సంగీతం, నాటం, కవిత్వం లాంటి లలిత కళలకు కారకత్వం వహిస్తాడు. మనస్తత్వ శాస్త్రము పఠనం, వ్యవసాయం, విద్యా సంబంధిత వృత్తులు, జల వనరులవంటి వృత్తులకు కారకత్వం వహిస్తాడు. మూలికలు, స్త్రీలు, జీర్ణ వ్యవస్థ, జున్ను చంద్రుడు కారకత్వం వహించే ఇతరములు. పురాణ కథనంప్రకారం గౌరవర్ణం కలిగిన వాడు చంద్రుడు. శ్వేత వస్త్ర శ్వేత వర్ణ ఆభరణములతో అలంకరించబడిన వాడు. రెండు భుజములతో, శిరస్సున బంగారు కిరీటము ధరించి మెడలో ముత్యాల మాలను ధరించి ఒక చేత గద, ఒకచేత వరద ముద్రతో దర్శనం ఇస్తాడు. దశాశ్వములను పూన్చిన రథమును అధిరోహించి సంచరిస్తాడు. చంద్రుడు కర్కాటకంలో స్వక్షేత్రంలోనూ వృషభంలో మూడు డిగ్రీల వద్ద ఉచ్ఛ స్థితిలోనూ, వృశ్చికంలోని మూడు డిగ్రీల వద్ద నీచస్థితిలోనూ ఉంటాడు. చంద్రుడికి శత్రువులు లేరు అలాగే శత్రు క్షేత్రం లేదు. చంద్రుడికి మిధునం, కన్య, సింహములు మిత్ర క్షేత్రములు. వృషభం త్రికోణ స్థానం. శుక్ర, శనులు సములు. కుంభం, మకరం, తులా రాశులు సమ రాశులు.

లగ్నంలో చంద్రుడు ఉన్న జాతకుడు దృఢశరీరము కలిగిన వాడు, చిరంజీవి, నిర్భయుడు, ధనవంతుడు ఔతాడు. క్షీణచంద్రుడు ఉన్నప్పుడు ఫలితాలు తారుమారుగా ఉంటాయి.

ద్వితీయంలో ఉన్న ధనవంతుడు, విద్యావంతుడు, మృదుభాషి, అంగలోపం కలవాడుగా ఉంటాడు.

తృతీయ స్థానంలో  ఉన్న జాతకుడు సోదరులు కలవాడు, బలవంతుడు, శౌర్యవంతుడు, స్త్రీలను ఆకర్షించు వాడు ఔతాడు. బహుకష్టములను పొందుతాడు.

చతుర్ధస్థానమున ఉన్న జాతకుడు సుఖజీవి, భోగముల యందు ఆసక్తుడు, మిత్రులు కలవాడు, వాహనములు కలవాడు, కీర్తివంతుడు ఔతాడు.

పంచమున ఉన్న జాతకుడు మేధాసంపద, సుపుత్రులు కలవాడు, ఠీవి కలవాడు, మంత్రిపదవి అలంకరించు వాడు ఔతాడు.

షష్టమున ఉన్న జాతకుడు అల్పజీవి, అమాయకుడు, ఉదరశూల (కడుపు నొప్పి) కలిగిన వాడు, దీనుడు ఔతాడు.

సప్తమున  జాతకుడు సౌమ్యవంతుడు, అందమైన యువతుల హృదయమున స్థానము కలిగిన వాడు, సుందరుడు అయి సుంర కళత్రము కలిగి ఉంటాడు.

అష్టమున వున్నా జాతకుడు రోగపీడితుడు, అల్పాయుష్మంతుడు ఔతాడు. క్షీణ చంద్రుడు అయిన ఫలితములలో మార్పులు ఉంటాయి.

నవమమున    జాతకుడు అభివృద్ధి, పవిత్రుడు, పుత్ర సంతానం కలిగిన వాడు, విజయము, కార్యం ఆరంభించగానే శుభఫలితములను కలిగి ఉంటాడు. వీశాలహృదయము సహాయగుణము కలిగి ఉంటాడు.

దశమమున ఉన్న జాతకుడు ఔషధ సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిగిన వాడు ఔతాడు.

ఏకాశమున ఉన్న జాతకుడు విశాలహృదయం, చిరంజివి, ధనవంతుడు ఔతాడు.

ద్వాదశ చంద్రుడు ఉన్న జాతకుడు ద్వేషము కలవాడు, దుఃఖములు, క్లేశం, అవమానం, నిరుత్సాహం పొందుతూ ఉంటాడు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

కుజుడు

 కుజుడు

అంగారకుడు ఉగ్ర స్వభావుడు. అధిపతి కుమారస్వామి. పురుష గ్రహం, రుచి చేదు, జాతి క్షత్రియ, అధి దేవత పృధ్వి, దిక్కు దక్షిణం, తత్వం అగ్ని, ప్రకృతి పిత్తము, ఋతువు గ్రీష్మం, లోహములలో ఇనుము, ఉక్కు, రత్నము పగడము, గ్రహ సంఖ్య ఆరు, భావరీత్యా దశమస్థానంలో స్థాన బలం కలిగి ఉంటాడు. గుణం తమో గుణం, ప్రదేశం కృష్ణా నది మొదలు లంక వరకు. అంగారకుడు మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాలకు అధిపతి. శరీరావయావలో ఎముకలో మజ్జ, కండరాలు, బాహ్యంలో జ్ఞానేంద్రియాలు. అంగారకునికి సూర్యుడు, చంద్రుడు, గురువు మిత్రులు, శత్రువు బుధుడు, సములు శుక్రుడు, శని.  అంగారక ప్రభావితులు పొడుగుగా దృఢంగా ఉంటారు. బంధువులంటే అపార ప్రేమ కలిగి ఉంటారు. అదుపు చేయ లేని ఆవేశ పరులు. విపరీత బంధు ప్రీతి కలిగి ఉంటారు. అధికారం, పదవి, సేవకులను కలిగి ఉంటారు. యంత్రములు, ఆయుధములు మొదలైన వాటిలో శిక్షణ పొందుటలో ఆసక్తుడు. అధిక దానధర్మములు కలిగి ఉంటారు. అంగారకుడు ఎర్రని మేని ఛాయ కలవాడు. సన్నని నడుము, కండలు తిరిగిన శరీరం, వంకీల జుట్టు కల వాడు. వయసు పద హారు. ఎర్రని వస్త్రధారణ, శంఖం వంటి మెడ, వాహనం పొట్టేలు, ఆయుధం శూలం, మంగళప్రథమైన రూపము.

కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ స్తుతి దర్శనం చేయాలి. షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య జననం జరిగిన కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయాలి. సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి. ఎర్రని పుష్పాల మాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. కుజుని అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్ధాలను నైవేద్యం పెట్టాలి. కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించాలి. మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుట చేయాలి. ఎర్రని వస్త్రాలను, ఎర్రని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయాలి. స్త్రీలు ఎర్రని వస్త్రధారణ, పగడపు ఆభరణాలు ధరించి చేసి దుర్గాదేవిని పూజించుట, అమ్మవారికి ఎర్రని పూలను మాలలను సమర్పించి కుంకుమపూజ చేయాలి.దుర్గాదేవిని స్తుతించాలి. మంగళ వారాలు దుర్గాదేవి ఆలయదర్శనం చేసి ప్రదిక్షిణం చేసి స్తుతించి పూజించాలి. గణపతి స్తోత్రం చేయాలి. ఆంజనేయస్వామి దండకం స్తుతి చేయాలి. బలరామ ప్రతిష్ఠిత నాగావళీ నదీతీర పంచలింగాలను దర్శించాలి. మంగళ వారాలాలలో సింధూరవర్ణ ఆంజనేయ స్వామి దర్శనం, ప్రదిక్షిణం, స్తుతి చేయాలి. మంగళ వారం లేక కృత్తికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఏడు వేల కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూట కట్టి దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఏడు మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్భై మార్లు పారాయణం చేసి ఏడవ వారం కందులు దానం ఇవ్వాలి. నానవేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కోతులకు తీపి పదార్ధములు పెట్టాలి, ఎర్రమి కుక్కకు ఆహారం పెట్టాలి. మంగళ వారం రాగిపళ్ళెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకుడికి దానం ఇవ్వాలి.

కుజుడు కటకంలో నీచ స్థితి పొందుతాడు. కటకం లగ్నం నుండి పన్నెండు భావాలలో ఉన్నప్పుడు ఆయాభావాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కనుక వాటికి తగిన పరిహారాలు కింద ఇవ్వబడ్డాయి.

మొదటి భావం లేక లగ్నం కుజుడికి నీచ స్థానమైన కటకం అయి అందులో కుజుడు ఉంటే అబద్ధములు చెప్పకూడదు, దంతంతో చేసిన వస్తువులు వాడరాదు. దానం తీసుకోరాదు.

కుజుడు రెండవ స్థానంలో ఉండి అది కుజుడికి నీచ స్థఆనమైన కటకం అయిన ఎడల కంఠ సమస్యలు ఉంటాయి కనుక కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యస్వామిని సేవించి గంట, దీపం దానం చేయాలి. రెండవ స్థానం కటకం అయి అందు కుజుడు ఉన్న అది కుజుడికి నీచ స్థితి కనుక ధన సమస్యలు ఉంటాయి. పరిహారంగా ఎర్రటి చేతి గుడ్డను ఎప్పుడూ వాడుతుండాలి. ఏడు మంగళ వారాలు చిన్న పిల్లలకు బెల్లం గోధుమలతో చేసిన ఆహారం తినిపించాలి.

కుజుడు అన్నదమ్ములకు చిహ్నం. మూడవ ఇంట కుజుడు ఉన్న సోదరులతో చిక్కులు ఉంటాయి కనుక పరిహారం కొరకు ఏనుగు దంతంతో చేసిన వస్తువును ఇంటికి దక్షిణంలో ఉంచి కుజుడిని ఆరాధించాలి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఇరుగు పొరుగుతో వివాదాలకు దూరంగా ఉండాలి. వెండి ఉంగరంలో పొదిగిన పగడపు ఉంగరం ఎడమ చేతికి ధరించవచ్చు.

నాగవ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కోతులకు, తల్లికి భోజనం పెట్టాలి. పంచదార వంటి తీపి పదార్ధాల సంబధిత వ్యాపారం చేయాలి.

పంచమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు రాగి పాత్రలో రాత్రి అంతా ఉంచిన నీటిని తెల్లవారిన తరువాత పచ్చని చెట్టుకు పోయాలి. ఇంటికి దక్షిణంలో వేప చెట్టు నాటాలి.

ఆరవ స్థానం రోగ, శత్రు స్థానం కనుక కుజ స్తోత్రం చదువుకోవాలి. తుప్పు పట్టిన ఇనుప వస్తువులను ఇంట్లో ఉంచరాదు.

ఏడు స్థానంలో కుజుడు ఉన్న భార్యాభర్తల మధ్య వివాదాలు ఉంటాయి కనుక పరిహారంగా శిరః స్నానమాచరించి ఇంటికి దక్షిణ భాగంలో మూడు వత్తులతో దీపం వెలిగించి కుజుడి స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయాలి. కంది పప్పుతో చేసిన ఆహారం తీసుకుంటే ధన సమస్యలు తీరి భార్యాభర్తల మధ్య అనుకూలత కుదురుతుంది.

ఎనిమిదవ స్థానం ఆయుషు స్థానం స్త్రీలకు మాంగల్య స్థానం కనుక సుబ్రహ్మణ్య, దుర్గ, ఆంజనేయ, గణపతి, శివులకు విశేష పూజలు చేయాలి.

తొమ్మిదవ స్థానం అందు కుజుడు నీచమైన; పెద్ద వారిని గౌరవించడం, వెండితో పొదిగిన పగడపు ఉంగరం ధరించడం చెయ్యాలి.

పదవ స్థానం అందు కుజుడు నీచమైన; కార్యాలల్లో సుబ్రహ్మణ్య స్వామిని ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కార్యాలు మొదలు పెట్టాలి.

పదకొండవ స్థానం లాభస్థానం, అన్నతో పేచీలు ఉంటాయి. మట్టి పాత్రలో సింధూరం లేక తేనె ఉంచిన దోష పరిహారం ఔతుంది.

వ్యయ స్థానం కుజుడు నీచమైన తేనె త్రాగుట, సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి.


మేషరాశి :- కుజుడు మేషరాశిలో ఉన్నప్పుడు కార్యోత్సాహము, ధైర్యము, దుడుకు తనము, సున్నిత మనస్కులై ఉంటారు. అధికారులుగా వీరు రాణిస్తారు.వీరు ఏ కార్యమైనా కొంచము ఆలోచించి ప్రాంరంభించాలి.

వృషభరాశి :- కుజుడు వృషభరాశిలో ఉన్నప్పుడు దుబారా ఖర్చులు చేసే మనస్తత్వము, విలాసముల అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు పొదుపు విషయంలో అత్యధిక ప్రాధ్యానత ఇవ్వాలి.

మిధునరాశి :- మిధునరాశిలో కుజుడున్న బుద్ధిమంతులైన సంతానం కలుగుతుంది, ఇతరుల లోని లోపాలను ఎంచుతారు, వాదోపవాదాలకు ముందు ఉంటారు, ఇతరులు అన్న ప్రతి మాటను వ్యతిరేకిస్తారు, ఉద్రేపూరిత మనస్కులై ఉంటారు. వాదోప వాదాలను అదుపులో ఉంచుకుని ప్రవర్తిస్తే అధికారులుగా రాణించగలను.

కటకరాశి :- కుజుడు కటకరాశిలో ఉన్న వ్యక్తి అస్థిర మనస్తత్వము కలిగి ఉంటాడు. మానసిక ఆవేదనకు లోనౌతూ ఉంటాడు. ఉద్రేక పూరితుడుగా ఉంటాడు.

సింహరాశి :- సింహరాశిలో కుజుడున్న భూదేవికి ఉన్నంత ఓర్పు వహిస్తారు. ఓర్పు హద్దులుదాటిన సమయాన అమీ తుమీ తేల్చుకుంటారు. చక్కగా ఓర్పుతో శ్రమించి కార్యాచరణ చేస్తారు.

కన్యా రాశి :- అత్యధిక ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఇతరులను ఒక పక్షాన నమ్మరు. ఇతరుల చిన్న లోపాలను అధికంగా చూస్తారు. ఉద్రేకపూరిత మనత్వం కలిగి ఉంటారు. ఇతరుల సలహాలను పెడచెవిన పెడతారు.

తులారాశి :- తులారాశిలో కుజుడున్న వ్యక్తి భాగస్వామిని ప్రేమిస్తారు. భాగస్వామి మీద ఆధిపత్యం వహిస్తారు.

వృశ్చికరాశి :- వృశ్చికరాశిలో కుజుడున్న వ్యక్తి కార్యసాఫల్యత ఎలాగైనా సాధిస్తారు. కార్యలలో కొంత గందరగోళం సృష్టించు కుంటారు కనుక కార్యలను క్రమపద్ధతిలో ఏర్పరచుకుని చేసిన సత్ఫలితాలను పొంద వచ్చు. మొదలు పెట్టిన కార్యాలు ముగిసే వరకు ఆందోళన పడతారు. కనుక మనసును కుదుట పరచుకోవడము అలవాటు చేసుకుంటే ఆందోళన తగ్గించుకోవచ్చు. గుండె బలము కండబలము ఎక్కువగా ఉంటుంది. కనుక అన్నిటా ధైర్యసాహసాలు ప్రదర్శించి దూకుడు చూపుతారు కనుక వెనుకా ముందు ఆలోచించి వ్యవహారలలో తల దూర్చాలి.

ధనస్సు రాశి :-ధనస్సు రాశిలో కుజుడున్న వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇతరుల నైపుణ్యాల మీద విశ్వాసం తక్కువ కనుక ఇతరుల నైపుణ్యాలను గుర్తించడం అలవాటు చేసుకోవాలి. వ్యవహారలను చక్కదిద్దటంలో వీరు సామర్థ్యం కలిగి ఉంటారు.ఎటువంటి సమస్యలకైనా అందరికీ ఆమోద యోగ్యమైన సూచనలను ఇవ్వ కలిగిన సామర్థ్యం వీరికి ఎక్కువ. కులపెద్దలుగా, సంఘాలకు మొదలైన వాటికి అధ్యక్షులుగా వీరు రాణిస్తారు. అనాథల మీద జాలి కలిగి ఆదరించడంలో వీరు ముందు ఉంటారు. ఆధ్యాత్మిక విశ్వాసం భక్తి ఎక్కువ దైవకార్యాలు గుడులను కట్టడం లాంటి కార్యాల మీద మక్కువ కలిఒగి ఉంటారు.మాతృ దేశం, మాతృ భాష లాంటి విషయాల మీద మక్కువ ఎక్కువ. పాత సంప్రదాయం అంటే మక్కువ ఉంటుంది. ఆధునిక భావాలకు దూరంగా ఉంటారు. వారి అభిప్రాయాల పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండి ఎటువటి పరిస్థితిలో కూడా త్వరగా వారి అభిప్రాయాలను మార్చుకోరు. ఉద్రేకపూరితులై ఉంటారు. ఎంతటి వారినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు క్ని ఎవరికి తలవంచరు.

మకరరాశి:- మకరరాశిలో కుజుడున్న వారు అధిక జనప్రియులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఇతరుల పనులను ఎంతటి శ్రమకు ఓర్చి అయినా సాధంచడంలో విజయం సాధిస్తారు. ఏ మార్గంలోనైనా కార్యాలను సాధిస్తారు. ధైర్యసాహసాలు ఎక్కువ. నాయకత్వ లక్షళాలు ఎక్కువ. వ్యసనాలు అలవడితే వీరు ఒకంతట వదుల్చుకోలేరు కనుక వ్యసనాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం బాగా చేయాలి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు అధికంగా ఉంటాయి. వీరు ఇతరుల పనులను అత్యంత చాకచక్యంగా సాధించి పెట్టడమే కాక పారితోషికము కూడా తగినంత తీసుకుంటారు.


ద్వాదశ స్థానములలో కుజుడు


లగ్నములో కుజుడు ఉన్న జాతకుడు క్షతగాత్రుడు, క్రూరుడు, అల్పాయుష్మంతుడు, సాహసిగా ఉంటాడు.

ద్వితీయస్థానములో కుజుడు ఉన్న జాతకుడు కురూపి, ధనహీనుడు, దుష్టుల మీద అధారపడి జీవించే వాడు ఔతాడు.

తృతీయస్థానమున ఉన్న జాతకుడు ధనవంతుడు, ధైర్యశాలి, సుఖవంతుడు, సోదరులు లేని వాడు, జయించశఖ్యం కాని వాడు ఔతాడు.

చతుర్ధస్థానమున కుజుడు ఉన్న జాతకుడు మిత్రులు లేని వాడు, మాతృహీనుడు, గృహము లేని వాడు, సుఖము లేని వాడు, వాహన లేని వాడు ఔతాడు.

పంచమ స్థానములో కుజుడు ఉన్న జాతకుడు సుఖము లేని వాడు, సంతానం లేని వాడు, అల్పమేధావి, సంపద పోగొట్టుకున్న వాడు ఔతాడు.

షష్టమ స్థానమున కుజుడు ఉన్న జాతకుడు ధనవంతుడు, కీర్తికలవాడు, విజయుడు ఔతాడు.

సప్తమ భావములో కుజుడు ఉన్న జాతకుడు దుశ్చరిత్రుడు, వ్యాధిపీడితుడు, వృధాగా తిరుగు వాడు, కళత్రహీనుడు ఔతాడు.

అష్టమ భావములో కుజుడు ఉన్న జాతకుడు అంగవైకల్యం కలవాడు, నిర్దనుడు, అల్పజీవి, ప్రజల చేత నిదించబడువాడు ఔతాడు.

నవమ స్థానమున కుజుడు ఉన్న జాతకుడు రాజమిత్రుడు, పితృహీనుడు, ప్రజల చేత ద్వేషించబడువాడు, జనఘాతకుడు ఔతాడు.

దశమ స్థానమున కుజుడు ఉన్న జాతకుడు క్రూరుడైన రాజు ఔతాడు.

ఏకాదశమున కుజుడు ఉన్న జాతకుడు విశాలహృదయుడు, ప్రజలచేత మన్ననలు అందుకొను వాడు ఔతాడు.

ద్వాదశమున కుజుడు ఉన్న జాతకుడు ధనవంతుడు, ధైర్యశాలి, సచ్చరిత్రుడు, శోకహీనుడు ఔతాడు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

కాలసర్ప యోగములు

 కాలసర్ప యోగములు. ( దోషములు )

ప్రస్తుత గ్రహసంచారములో

ఈ కాలసర్ప యోగములు ఈ 4 మాసములలో

తే.13-12-2020ది.రా.10-42ని.ల నుండి

తే.14-04-2021ది.ఉ.01-14ని.ల వరకు

మొత్తం 120 రోజులలో 80 రోజుల వరకు

అనగా 79రో. 19గం. 25ని.లు కాలసర్ప

యోగముతో వుంటుంది.

చంద్రుడు తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం

చేయగానే గ్రహము లన్నియు రాహు కేతువుల

మధ్యలోకి వచ్చి కాలసర్ప యోగము పట్టినట్లు

భావించ వలెను.     తదుపరి

చంద్రుడు వృషభ రాశి నుండి అనగా రాహు

గ్రహం విడిచి మిధున రాశి యందు ప్రవేశం

జరిగితే కాలసర్ప దోషము నుండి ఒక గ్రహం వెలుపలకు వచ్చినట్లవుతుంది.

1.

తే.13-12-2020ది. రాత్రి గం.10-42ని.ల నుండి

చంద్రుడు తులారాశి నుండి వృశ్చికం ప్రవేశం.

తే.29-12-2020.ఉ. గం.04-40ని.ల నుండి

చంద్రుడు వృషభం నుండి మిధున ప్రవేశం.

2.

తే.09-01-2021ది.ఉ.06-58ని.ల నుండి

చంద్రుడు తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం.

తే.26-01-2021ది.మ.01-03ని.ల నుండి

చంద్రుడు వృషభం నుండి మిధున ప్రవేశం.

3.

తే.05-02-2021ది.మ.12-47ని.ల నుండి

చంద్రుడు తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం.

తే.21-02-2021ది.రా.09-56ని.ల నుండి

చంద్రుడు వృషభం నుండి మిధున ప్రవేశం.

4.

తే.04-03-2021ది.సా.06-21ని.ల నుండి

చంద్రుడు తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం.

తే.22-03-2021ది.ఉ.06-09ని.ల నుండి

చంద్రుడు వృషభం నుండి మిధున ప్రవేశం.

5.

తే.01-04-2021ది.ఉ.01-56ని.ల నుండి

చంద్రుడు తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం.

తే.14-04-2021ది.ఉ.01-14ని.ల నుండి

కుజుడు వృశ్చికం నుండి మిధున ప్రవేశం.

తే.17-04-2021ది.మ.01-10ని.ల నుండి

చంద్రుడు వృషభం నుండి మిధున ప్రవేశం.



గ్రహ కూటములు:

1.

తే.14-01-2021ది. మకర రాశిలో  చంద్ర, బుధ, గురు, శని చాతుః గ్రహ కూటమి.

2.

తే.15-01-2021ది.మకర రాశిలో చంద్ర,

బుధ, గురు, శని, రవి పంచ గ్రహ కూటమి.

3.

తే.16-01-2021ది.నుండి తే.25-01-2021ది.

వరకు 10రోజులు మకర రాశిలో 

బుధ, గురు, శని, రవి చాతుర్ గ్రహ కూటమి.

4.

తే.26-01-2021ది.నుండి తే.04-02-2021ది.

వరకు 8రోజులు మకర‌రాశిలో

గురు, శని, రవి, శుక్ర చాతుర్ గ్రహ కూటమి.

5.

తే.05-02-2021ది.నుండి తే.09-02-2021ది.

వరకు 5రోజులు మకర రాశిలో

గురు, శని, రవి, శుక్ర, బుధ పంచ గ్రహ కూటమి.

6.

తే.10-02-2021ది.నుండి తే.11-02-2021ది.

వరకు 2రోజులు మకర రాశిలో  గురు, శని, 

రవి, శుక్ర, బుధ, చంద్ర షష్ట గ్రహ కూటమి.

7.

తే.12-02-2021ది.1రోజు మకర రాశిలో గురు,శని,రవి, శుక్ర,బుధ పంచ గ్రహ కూటమి.

8.

తే.13-02-2021ది.నుండి తే.20-02-2021ది.

వరకు 8రోజులు మకర రాశిలో

గురు, శని, బుధ, శుక్ర చాతుర్ గ్రహ కూటమి.

9.

తే.09-03-2021ది. నుండి తే. 11-03-2021ది.

వరకు 3రోజులు మకర రాశిలో

గురు, శని, బుధ, చంద్ర చాతుర్ గ్రహ కూటమి.

10.

తే.12-03-2021ది.నుండి తే.13-03-2021ది.

వరకు 2రోజులు కుంభ రాశిలో

బుధ, శుక్ర, రవి, చంద్ర చాతుర్ గ్రహ కూటమి.


ఈ క్రింద తెలిపిన విధంగా

32రోజులు 6మార్లు చాతుర్ గ్రహ కూటములు

7రోజులు 3మార్లు పంచ గ్రహ కూటములు

2రోజులు 1మారు షష్ట గ్రహ కూటమి

పై తెలిపిన విధంగా 120రోజుల పూర్తి కాలంలో కాల సర్ప యోగములతో 80రోజులు

గ్రహ కూటములతో 41రోజులు జరుగుతుంది.


గ్రహములు చివరగా మారిన సమయములు.

1.

తే.24-01-2020దిఉ.గం.09-57ని.ల నుండి

శని ధనస్సు నుండి మకర ప్రవేశం.

2.

తే.23-09-2020ది.ఉ.గం.10-43ని.ల నుండి

రాహువు మిధునం నుండి వృషభ ప్రవేశం.

3.

తే.23-09-2020ది.ఉ.గం.10-43ని.ల నుండి

కేతువు తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం.

4.

తే.16-11-2020ది.ఉ.గం.06-54ని.ల నుండి

రవి తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం.

5.

తే.20-11-2020ది.ప.గం.01-24ని.ల నుండి

గురువు ధనస్సు నుండి మకర ప్రవేశం.

6.

తే.28-11-2020ది.ఉ.గం.07-05ని.ల నుండి

బుధుడు తుల నుండి వృశ్చిక ప్రవేశం.

7.

తే.11-12-2020ది.ఉ.గం.05-18ని.ల నుండి

శుక్రుడు తుల నుండి వృశ్చిక ప్రవేశం.

8.

తే.13-12-2020ది.రా.గం.10-42ని.ల నుండి

చంద్రుడు తుల నుండి వృశ్చిక ప్రవేశం.

9.

తే.24-12-2020ది.గం.ఉ.10-20ని.ల నుండి

కుజుడు మీనం నుండి మేషం ప్రవేశం.

కాలసర్ప యోగం


జ్యోతిష్య విద్వాంసులైతే మొత్తం 288 రకాల కాలసర్పదోషాలను వర్ణించిచెప్పారు. వీటిలో కాలసర్పభావాల ప్రకారం 12 ముఖ్యమైనవి .


అనంత, కులిక, వాసుకి, శంఖ, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, మహాశంఖ, పతాక, విషధర, శేషనాగ అని 12 రకాల కాలసర్పయోగాల గురించి పూర్వీకులు వివరించారు.


ఈ దోషాల పలితాలను గుర్తించేటప్పుడు మనం అనేక జ్యోతిశాస్త్ర నియమాలను కూడ పరిగణలోకి తీసుకోవాలి.


🏵కాలసర్పయోగం సాదారణ మానవులపై ప్రభావం చూపించదు.కాలసర్ప దోషం ప్రపంచాన్ని ,దేశాన్ని,రాష్ట్రాన్ని,సంస్ధని,అదికారం చలాయించే వారికి కాలసర్పదోష ప్రభావం ఉంటుంది.వారు పరిపాలించేచోట సరియైన సమయంలో వర్షాలు పడక పంటలు సరిగా పండక ,ఆర్దికవ్యవస్ధ దెబ్బతిని,కోట్లాటలు,అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారు.


పరిపాలాద్యక్షుకుడికి,పాలనా వ్యవస్ధపై కాలసర్పదోష ప్రభావ కనపడుతుంది.పాలకులు సరియైన నిర్ణయాలు తీసుకోలేరు.🏵


🔥అయితే కాలసర్పదోషం ఉన్నవ్యక్తులకు,రాహు,కేతు దశలు నడుస్తున్న వ్యక్తులకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాడు.కొన్నిరెమిడీస్ చేసుకుంటె రాహు,కేతు చాయగ్రహాలభాదలనుండి విముక్తి లభిస్తుంది.🔥


జాతక చక్రంలో వున్న గ్రహాలలో రాహుకేతువుల గురించి చరిత్ర పరిశీలిస్తే.. క్షీరసాగర మధన సమయంలో అమృతం తాగబోయిన రాహువు అనే రాక్షసుని శ్రీహరి తన యొక్క సుదర్శనంతో చీల్చివేయడంతో మొండెం క్రింద భాగం, మొండెం పై భాగం రాహు కేతువులు అయిరి.


కాలసర్పదోషం అంటే రాహు కేతువుల మధ్యలో మిగిలిన రవి చంద్ర కుజ గురు శుక్ర శని గ్రహాలు ఒకపక్కన వుండి మరొక పక్కన అసలు గ్రహాలు లేకుండా ఉండడం. సరే బాగా జ్యోతిశ్శాస్త్రం రీసెర్చ్ చేసేవారు వారి అనుభవాలతో చెప్పే అంశాలు ఏమిటి అంటే రాహుకేతువుల మధ్య మాలికా యోగం (సప్తగ్రహ) అనగా వరుస ఏడు రాశులలో ఏర్పడితే అది ప్రమాదకరం అని రాహు కేతువులకు ఈ మాలికా యోగం వలన ప్రత్యక్ష సంబంధం కలగడం వంటివి ఏర్పడుతాయి. కావున ఇబ్బందికరం అని చెబుతారు.


మిగిలిన విషయాలలో కేవలం కాలసర్పదోషం వలన జీవితం పాడయిపోతుంది. అభివృద్ధి వుండదు అనే భావన వాదన శాస్త్ర దూరమైన విషయమే. మిగిలిన గ్రహాలు వాటి స్థితి బాగుండకపోతే వచ్చే ఫలితాలు బాగుంటే వచ్చే ఫలితాలు గూర్చి పరిశీలింపక కేవలం కాలసర్ప దోషం వలన జాతకం పాడయిపోతున్నది అని చెప్పే సిద్ధాంతులు నేటి సమాజంలో ఎక్కువ వున్నారు.


అసలు దోష శాంతి ఏమిటి? రాహు కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు చేరడం వలన వచ్చిన దోషం కావున శాంతి కోసం తొమ్మిది గ్రహాలకు జపం దానం హోమం తర్పణం చేయుట వైదిక ప్రక్రియ. తద్వారా దోష శాంతి చేకూరుతుంది. ఇది వైదీక విజ్ఞానం వున్న బ్రాహ్మణులు, నవగ్రహ మంటపం వున్న ప్రతి దేవాలయంలోనూ చేయించుకోవచ్చు. అలాగ కాకపోతే ఎవరి ఊరిలో వారు కాలసర్ప దోష శాంతి చేసుకోవచ్చు.


మరి కాలసర్పదోషమే ప్రధాన కారణంగా జరిగే నష్టాలు ఏమిటి అని పరిశీలిస్తే పంచాంగ గణిత ఫలితాంశాలు చెప్పే గ్రంథాలలో కాలసర్ప దోషం జరిగే కాలంలో రాజులకు (పాలకులకు) అలాగే పంటలకు నాశనం కలుగును అని చెప్పబడినది. అందువలన కాలసర్ప దోషం కాలంలో దేశారిష్టము అనే అంశం సరిఅయినది.

🏵ఇందుకే ఏమో మన భారతదేశ పాలకులు 

ప్రస్తుత కిసాన్ చట్టలాను తొలగించాలని డిల్లీ సమీపమున చేస్తున్న ఉద్యమం పై గందరగోళం పడుతున్నట్లుగా వాతావరణం కనపడుతున్నాది.🏵

🙏

ధార్మికగీత - 124*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲  


                            *ధార్మికగీత  -  124*

                                      *****  

            *శ్లో:- దుర్లభం త్రయ మే వై తత్ ౹*

                   *దేవానుగ్రహ హేతుకమ్ ౹*

                   *మనుష్యత్వం ముముక్షత్వం ౹*

                   *మహాపురుష సంశ్రయమ్ ౹౹*

                                    *****

*భా:- దేవుని యొక్క అను గ్రహానికి పాత్రుడు అవ్వాలంటే లోకంలో మూడే మూడుకారణ మవు తున్నాయి.* *1. "మనుష్యత్వం":-  ప్రతి  మనిషిలో కామ,క్రోధ,లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఆష్టవిధ మదాలు*, *తాపత్రయాల మాలిన్యము  పశుత్వ లక్షణాలతో ప్రస్ఫుట మౌతుంది. దానిని పూర్తిగా*  *నిర్మూలనము చేసికొని, మానవత్వ* *పరిమళాలను గుబాళింప జేసుకోవాలి.  అదే మనుష్యత్వము*. *2."ముముక్షత్వము":- మోక్షము కావాలనే కోరిక ప్రబలంగా ఉన్నవారు మానవతా విలువలతో నడుచుకుంటూ, దేహాభిమానాన్ని, అహంకార మమకారాలను , విషయ- వాసనలను వదిలి, ఇంద్రియ నిగ్రహంతో, వైరాగ్య భావంతో ఆత్మ సాక్షాత్కారానికై  చేసే నిరంతర కఠోర సాధనా ప్రక్రియ ముముక్షత్వము. 3. "మహా పురుష సంశ్రయము":- పైన చెప్పబడిన మానవత్వ, మోక్షాపేక్షల సాధనకై జ్ఞాన సంపన్నులైన మహాత్ములను గాని, సద్గురువులను గాని ఆశ్రయించి, వారిని దీక్షా దక్షతలు, శ్రద్ధా సక్తులు, భక్తి ప్రపత్తులతో వివిధ  శుశ్రూషలు చేసి,  ఆత్మజ్ఞాన సముపార్జనము చేయాలి. ఈ మూడింటిని శ్రద్ధాళువై, చిత్తశుద్ధితో, ఏకా గ్రతతతో, నిష్ఠతో  సాధించిన నాడు దైవ సాక్షాత్కారం తప్పక లభించ గలదని సారాంశము*.

                                  *****

                   *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

ఆహార నియమాలు - 1

 ఆహార  నియమాలు  - 1  


 *  ఆమము , విదగ్ధము , విష్టంభము , రసశేషము అను భేదములచే అజీర్ణము నాలుగు విధములుగా ఉండును. వీటన్నిన్నిటికి మజ్జిగ ఔషధముగా పనిచేయును . 


 *  భోజనాంతరము చేతిని కడుగుకొనిన తరువాత అరచేతితో నేత్రములను తుడుచుకొనిన గాని , అరచేతితో నీటిబొట్టును నేత్రములలో వేసుకొనినగాని నేత్రరోగములు మానును . 


 *  భోజనము చేసి పనిలేకుండా కూర్చుండువాడు లంబోదరుడు అగును  . భుజించిన తరువాత శయనించువారికి సుఖము కలుగును. భోజనము చేసి కొంత సమయము తరువాత శ్రమించువానికి ఆయుర్వృద్ది కలిగి మరణము దూరము అగును. 


 * ఆకలిగా ఉన్నప్పుడు భుజించుతూ , ఎడమవైపు తిరిగి పడుకొనినవానికి వైద్యునితో పని ఉండదు. 


 *  ఆకలితో ఉన్నవాడు సమయానికి భుజించని యెడల కట్టెలు లేని ఆగ్నిహోత్రము వలే జఠరాగ్ని నశించి శరీరము కృశించును . 


 *  భోజనం చేసిన పిమ్మట ఎడమప్రక్కకు తిరిగి పడుకుండిన యెడల పిత్తాశయము నుండి ఆహారం జీర్ణం అగుటకు కావలసిన పైత్యరసము సరిగా ప్రసరించి జఠరాగ్ని వృద్ది అగును. కావున భోజనానంతరం ఎడమప్రక్కకు తిరిగి పడుకొనవలెను . 


 *  నిద్రపోవు కాలము నందు ఎడమప్రక్కన పరుండినప్పుడు 32 సార్లు , కుడివైపు పరుండినప్పుడు 25 సార్లు ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసములు వెడలును. ఇతర విధముల పరుండప్పుడు పదిసార్లు కలుగును. 


 *  అనవసరముగా ఔషధసేవన చేయుట , కుడివైపు ఎక్కువుగా పడుకోవడం , భోజనమునకు బదులు ఇతరవస్తువులు భుజించటం వలన మనుష్యునకు తృప్తి కలగవచ్చును కాని అనారోగ్యం తప్పక కలుగును . 


 *  జఠరాగ్ని ఆహారమును వచింప ( జీర్ణం ) చేయును . ఆహారం లేనివారికి ఈ జఠరాగ్ని శరీరమునే దహింపచేయును . దానివల్ల సర్వధాతువులు క్షీణించి ప్రాణములు కూడా పోవును . 


 *  భోజనం చేసిన పిమ్మట భుక్తాయాసం తగ్గువరకు కొంచంసేపు విశ్రాంతి తీసికొనవలెను . తరువాత 100 అడుగులు అటుఇటు తిరగవలెను. కుర్చొని లేచుచూ ఉండవలెను . 


 *  భుజించిన ఆహారం మరునాటికి రసధాతువుగాను , మూడొవ రోజుకి రక్తముగాను , నాలుగొవ రోజుకి మాంసముగాను , అయిదోవ రోజుకి మేధస్సుగాను , ఆరోవరోజుకి అస్థిధాతువుగాను , ఏడోవ రోజుకి మజ్జి ధాతువుగాను , ఎనిమిదొవ నాటికి ఉత్క్రుష్టమైన శుక్రధాతువుగా మారును . 


    తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం అందిస్తాను . 


 

    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

జలము సేవించుటకు

 జలము సేవించుటకు నియమాలు  - 


 *  భోజనమునకు ముందు నీరు తాగిన అగ్నిమాంద్యము , శరీర కృశత్వము కలుగును. భోజన మధ్యమమున నీరు తాగిన అగ్ని వృద్ది అగును . భోజన చివరన తాగిన రసాయనముగా పనిచేయును . 


 *  భోజన మధ్యమము నందు నీరు తాగిన సమ శరీరము కలిగిన వారుగా , భోజన అంతము నందు నీరు తాగిన స్థూల శరీరులుగా , భోజనం ప్రారంభమునకు ముందు తాగిన సన్నగా ఉండును. 


 *  ప్రొద్దుగూకు లోపల ఎక్కువుగా నీరు తాగవచ్చు . రాత్రి సమయము నందు నీరు అతిగా తీసుకోరాదు   అతిగా నీరు తీసుకున్నను , అసలు తీసుకోకపోయినను అజీర్ణ రోగం పుట్టును . అగ్నిదీప్తి కొరకు మితముగా నీరు తాగవలెను . 


 *  ఉదరము యొక్క రెండు భాగములు అన్నము చేత ఒక భాగము పానీయము చేత నింపి నాలుగొవ భాగము వాతాది దోషముల యొక్క సంచారము కొరకు వదలవలెను . 


 *  ఎక్కువుగా భుజించుట చేత వ్యాధియు , అసలు భుజించకుండుట చేత బలం తగ్గిపోవును . మితముగా ఆహారం తీసుకొనుట చేత మంచి ధారుడ్యము , ఆయుర్వృద్ధి కలుగును . 


 *  దప్పికతో ఉన్నవాడు భుజించరాదు . అట్లు భుజించిన గుల్మ వ్యాధి కలుగును. 


 *  ఆకలితో ఉన్నవాడు నీరు తాగరాదు. అట్లు తాగిన భగంధర వ్యాధి కలుగును. 



             తరవాతి పోస్టు నందు మరికొంత విలువైన సమాచారం అందిస్తాను . 


    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

బొప్పాయి చెట్టు

 బొప్పాయి చెట్టు గురించి సంపూర్ణ వివరణ  -  ఔషధోపయోగాలు .


     బొప్పాయి చెట్టు మన గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కనిపిస్తుంది. దీని ఫలం అద్బుతమైన రుచితో కూడుకుని ఉంటుంది. ఈ చెట్టుతో అత్యద్భుతమైన ఔషధ యోగాలు ఎన్నొ ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు . ఇప్పుడు మీకు బొప్పాయి చెట్టు ఉపయోగాలు అందులో ఉన్న విలువైన ఔషధ యోగాలు వివరిస్తాను.


    ఏరండఛిర్బిటావృక్ష , ఛిర్బిటా , నలికాధాల అని సంస్కృతంలో బొప్పాయి చెట్టుకు ఉన్న పేర్లు . కొన్ని చోట్ల వాతకుంభ ఫల అని కూడా పిలుస్తారు . ఇది పోక చెట్టు మొదలగు వాని వలే పెరుగును . దీని ఆకులు వేలి కంటే ఎక్కువ లావు , చిటికెన వేలు పట్టు బోలుగల గజము పొడవు గల గొట్టము చివరను , ఆముదము ఆకువలె చిల్లులు కలిగి ఆముదపు ఆకుకు రెట్టింపు పెద్దవి కలిగిన ఆకులు కలిగి ఉండును. కాయ పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉండి పండిన తరువాత పసుపు పచ్చగా ఉండును. చెట్టును, కాయను గిల్లిన పాలు వచ్చును. పండులో నల్లటి వాయువిడంగముల వంటి గింజలు ఉండును.


 బొప్పాయి ఔషధోపయోగాలు  -


 *  బాలింతలకు పాలు తక్కువ ఉన్నప్పుడు బొప్పాయి పచ్చి కాయలు తీసుకుని పైన ఆకుపచ్చని పెచ్చు మరియు లోపలి గింజలు తీసివేసి సన్నగా తరిగి అందు తెలగపిండి వేసి కూర వండి తినిన బాలింతలకు పాలు వృద్ది అగును.


 *  వాతపు నొప్పులకు బొప్పాయి ఆకులు మెత్తగా నూరి ఆముదంతో ఉడికించి కట్టిన వాతపు నొప్పులు తగ్గును.


 *  తామర , గజ్జి  ఏర్పడినప్పుడు బొప్పాయి పాలు నేతిలో గాని కొబ్బరినూనెతో కాని కలిపి రాయవలెను. ఉత్త పాలు రాసిన శరీరం పై పొక్కే గుణం ఉండును.


 *  ఋతువు రాకుండా ఇబ్బంది పడు స్త్రీలు మూసామ్బారంను బొప్పాయి పాలతో నూరి శనగ గింజలంత మాత్రలు చేసి ఉదయం మరియు సాయంత్రం పుచ్చుకొనుచుండిన రుతురక్తం జారీ అగును.


 *  తేలుకుట్టినప్పుడు బొప్పాయి పాలు కుట్టినచోట వేసిన తేలువిషం విరుగును.


 *  అజీర్ణ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు దోరగా ఉన్న బొప్పాయి కాయని ఎండించి చూర్ణం చేసి ఆ చూర్ణమును ఆహారం తరువాత నీటితో కలిపి 3 గ్రాముల మోతాదులో తీసుకున్న అనేక రకాలైన అజీర్ణాలు పోవును .


 *  బోదకాలు వచ్చి కాళ్లు వాపుగా ఉన్నప్పుడు ఆకులు మెత్తగా దంచి పసుపు కలిపి పైన పట్టు వేయుచున్న బోదకాలు త్వరగా తగ్గును.


 *  కూరలు త్వరగా ఉడుకుటకు పచ్చి బొప్పాయి ముక్కలు కూరలో వేసిన కూర త్వరగా ఉడుకును.


 *  నోటివెంట గాని , గుండెల్లో నుంచి గాని , ఊపిరితిత్తుల నుంచి గాని రక్తం బయటకి వచ్చు సమయంలో బొప్పాయి పండు తినిపించిన వెంటనే రక్తస్రావం ఆగును.


 *  కడుపులోని క్రిములకు బొప్పాయి కాయలోని గింజలను ఎండించి చూర్ణం చేసి ఆ చూర్ణంకు మోదుగ విత్తనం చూర్ణం , వాము రసం కలిపి లోపలికి ఇచ్చిన క్రిములు చచ్చును.


 *  మూలవ్యాధి తో బాధపడే వారు పండు బొప్పాయి తినుచున్న రక్తం కారే మూలవ్యాది తగ్గును.


 *  పొట్టలో తయారయ్యే అమితవేడిని బొప్పాయి పండు తినటం వలన నివారణ అగును.


 *  ఎప్పటినుంచో నీళ్ల విరేచనాలతో ఇబ్బంది పడేవారు బొప్పాయి పండును తరచుగా తీసుకోవడం వలన నీళ్ల విరేచనాల సమస్య నుంచి బయటపడవచ్చు .


 *  వృషణాలు వాపుగా ఉన్నప్పుడు బొప్పాయి ఆకులను కుమ్ములో ఉడికించి మెత్తగా దంచి పైన వేసి కట్టు కడుతున్న వృషణాల వాపును తగ్గించును .


 *  పేను కొరికిన చోట బొప్పాయి పువ్వు మెత్తగా నలిపి పేను కొరికిన చోట రోజూ రెండుపూటల రుద్దుతున్న వెంట్రుకలు తిరిగి వస్తాయి.


 *  ముత్ర ద్వారంలో పుండు , మూత్రం బిగుసుకుపోయి బయటకి రాని సమయంలో బొప్పాయి పండు తినిపించిన మూత్రం ధారాళంగా వచ్చును. మూత్రద్వారంలో పుండు నయం అగును. మూత్రనాళంలో వ్రణాలు కూడా కరిగిపోతాయి.


 *  మలబద్ధకంతో బాధపడేవారు ఉదయాన్నే పండ్లు తోమిన వెంటనే మంచిగా పండిన బొప్పాయి పండును తినుచున్న మలబద్దకం సమస్య పోవును .


 *  శరీరానికి నీరు పట్టి ఉన్నవారు తరచుగా పచ్చి బొప్పాయి కూర తినుచున్న శరీరంలో వేడి పెరిగి నీరు తగ్గును.


 *  ముఖం సౌందర్యవంతముగా ఉండవలెనన్న బొప్పాయి ఆకును నీడన ఎండించి చూర్ణము చేసి దానికి సమాన బాగాలు లోద్దుగ చెక్క, మంజిష్ఠ చూర్ణాలు పాలతో కలిపి నూరి ముఖంపై లేపనం చేసి అరగంట తరువాత చన్నీటితో కడిగిన ముఖం కాంతిమంతంగా ఉండును.


 *  పిప్పి పన్నుతో ఇబ్బంది పడుతున్న బొప్పాయి పాలను పంటి రంద్రములో రెండు చుక్కలు వేసిన పంటినొప్పి తగ్గును.


         ఈ బొప్పాయి పచ్చికాయ గర్బవతులు వాడరాదు. ఆలస్యముగా జీర్ణం అగును. ఎక్కువుగా తినిన శరీరంలో కఫవాతాలను పెంచును. చల్లటి శరీరం కలిగిన వారి జబ్బు చేయును . వేరే ఆహారపదార్దాలు తిని కడుపు నిండుగా ఉన్నప్పుడు బొప్పాయి తినిన జ్వరాన్ని తెచ్చును.  దీనికి విరుగుళ్లు శొంటి , పిప్పిళ్లు , మిరియాల చూర్ణం .


      ఏ వస్తువునైనా అధికమోతాదులో తీసుకున్న శరీరానికి రోగాన్ని కలిగించును. తగిన మోతాదులో తీసుకున్న అమృతం వలే పనిచేయును .


  

   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

Brahmins

 *Warning alert to all Brahmins in the country and World.*

.... If you don't react now... No Brahmin will be there in future.  Please read all details.


T.S.Malleswara Prasad. 

BVP Chairman.

National Vice Chairman. 

National Consumer Rights Commission.

Cell : 9030362942.


*బ్రాహ్మణులందరికీ ముఖ్యమైన విషయాలు, కారణాలు ఇవేగా...* మీ కుటుంబం‌, మీ వంశం, మొత్తంగా  బ్రాహ్మణ జాతి విఛ్ఛిన్నానికి, సర్వ నాశనానికి మీరు గుర్తించని మీ పాత్రకూడా ఉందా ?? తెలుసుకోవాలంటే...  మీరు,  మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తిగా చదవండి. ప్రపంచంలోని మనవాళ్ళందరికీ ఫార్వార్డ్ చేయండి.  


నానాటికీ బ్రాహ్మణులు తగ్గిపోతున్నారు. ఇది జగమెరిగిన సత్యం. కొన్ని దశాబ్దాలలోనే  బ్రాహ్మణ జాతి కనుమరుగైపోయినా ఆశ్చర్య పడనవసరం లేదు .కారణం ... వర్ణాంతర వివాహాలు మాత్రమే. 


ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే .... దేశంలో 40 సంవత్సరాల వయసు వచ్చినా పెళ్లి కాకుండా  బ్రహ్మచారుల్లా మిగిలిపోయిన బ్రాహ్మణ యువతీ యువకులు లక్షల సంఖ్యలో ఉన్నారు.


అందరూ చెప్పే కారణం ...అమ్మాయిలు దొరకడం లేదు. లేదా అబ్బాయిలు దొరకడంలేదు. 


ఇలా ఎందుకు జరుగుతోంది ?  అమ్మాయిలు ఎందుకు దొరకడం లేదు ? అబ్బాయిలు ఎందుకు దొరకడం లేదు  ?  ఇది కేవలం పెద్దవారి మూర్ఖపు ఆలోచనలతో పిల్లల వివాహాలు చేయకపోవడంవలన   జరిగే వర్ణాంతర వివాహాల వల్ల.


మన బ్రాహ్మణ సమాజం ఈ వర్ణాంతర వివాహాల వల్ల విధ్వంసమైపోతోంది. ఇతర కులస్తులు, మతస్తులు బ్రాహ్మణ యవతీ యువకులను ప్రేమ పేరుతో తరలించుకొని పోతుంటే బ్రాహ్మణ సమాజం నుండి ప్రతిఘటన లేకపోవడం, కనీసం గట్టిగా నిరసన వ్యక్తం చెయ్యకపోవడం , రక్షణాత్మక చర్యలకై ఉపక్రమించక పోవడంతో ... నానాటికీ బ్రాహ్మణ యువతులను మభ్యపెట్టి వర్ణాంతర వివాహాలు చేసుకుంటున్న సంఘటనలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. 


పెద్దవారి మూర్ఖపు నాస్తిక వాదనలతో పిల్లలలో నాస్తికత్వ మనస్తత్వం పెరిగిపోవడంవలన,, పిల్లలు.... దానికి  పరాకాష్టగా మనషులంతా ఒక్కటే అంటూ ... నచ్చిన వారిని వివాహం చేసుకుంటే తప్పేమిటి  అంటూ...  తనను ప్రేమిస్తున్నాననే ఇతర కులం లేదా మతం వారితోనే వివాహం చేసుకుటానని పిల్లలు తెగించి చెప్పగానే కుప్పకూలిపోవడం ఎంతవరకూ సమంజసం ? . 


తల్లిదండ్రులు తమ పిల్లలకి పెద్ద చదువులు చదివించి ప్రయోజకులని చేస్తే ...., ఆ పిల్లలే ...... తన జాతి బ్రాహ్మణులని పరిహసించి, దూషించి, ద్వేషించేవారిని పెళ్ళిచేసుకుంటుంటే ఈ బ్రాహ్మణ జాతి భవిష్యత్తులో  ఏమైపోతుంది ? 


ఎంతోమంది బ్రాహ్మణ యువతులు... మగవాడిలో రూపం, డబ్బూ, హోదా మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు తప్ప కులం, గోత్రం, ఆచారం, ధర్మం, సంస్కృతి వంటివి  ఏవీ పరిగణలోకి తీసుకోవడంలేదు.  కనబడడం లేదు.  క్షేత్రం ఇలా వెళ్లి పోతుంటే కులం ఏమైపోతుంది ? 


తను జన్మించిన ఇంటిని , కులాన్ని, వంశాన్ని లేదా మతాన్ని, తల్లిదండ్రులుని, తోబుట్టువులని, బంధువులని  ధిక్కరించి వెళ్లిపోతున్న ఆడపిల్లలను, మగ పిల్లలను వారి తల్లిదండ్రులు ఎలా పెంచారు ? అది పెద్దవారి ఆలోచనలతోపాటూ  పెంపకంలో లోపం లేదా ? కదా  ? 


మన ధర్మాలు, మను ధర్మాలు, ఆచారాలు, ధార్మక కట్టుబాట్లు ఏమీ నేర్పకుండా అంటూసొంటూ లేకుండా పెంచారా ? లేక అసలు ఆచార వ్యవహారాలే లేవా ? లేదా మీరు సంకరజాతి వారా, లేదా నీతీ జాతి లేని వారా... అంటూ ఇలా బ్రాహ్మణ సమాజాన్ని అవహేళనపాలు చేస్తూనే వర్ణాంతర వివాహాలపేరుతో   మనసమాజం మీద సాంఘిక దాడులని నిరంతరం చేసేవారితో 'తందానాతానా' అంటూ దగ్గరుండి మరీ వర్ణ సంకరం పెళ్ళిళ్ళు చేస్తున్న తల్లిదండ్రులకూ, బంధువులకూ,  పురోహితులకూ మనం ఎందుకు సహకరించాలి ?  అటువంటి వారి బంధువులు, స్నేహితులు ఆ పెళ్ళిళ్ళకి హాజరై భోజనాలు చేసి ఆశీర్వదించి ఎందుకు వస్తున్నారు ? వారికి సిగ్గూ శరమూ,  చీమూ నెత్తురూ లేవా ? బ్రాహ్మణ జాతిలో పుట్టి, ఈవిధంగా వర్ణాంతర వివాహం చేసుకునే వారితోపాటూ ఇతర కులస్తులందరికీ మూర్ఖత్వంతో మన సహకారాన్ని అందించడంకాదా ? 


నీ ఇంటి అమ్మాయో, అబ్బాయో నీ ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు పళ్లికిలిస్తూ నిలబడితే , రేపు నీ మిగిలిన పల్లలకి మనవలకి పిల్ల ఎక్కడినుంచి వస్తుంది ? నీ కుటుంబం‌, నీ వంశం, నీ  కులం, నీజాతి విధ్వంసానికి గురౌతున్న విషయం గుర్తించవెందుకు ? 


క్షణికమైన విలాసాలు , డబ్బు , రూపం, ఉద్యోగం , అందం, ఇవన్నీ నీ కులంకన్నా, జాతికన్నా ఎక్కువనుకుంటుంటే....   అంటే నీ  పెంపకంలో ఎక్కడో లోపం జరుగుతోందనే దాని అర్ధం. . 


బ్రాహ్మణ కుటుంబాలు అందరమూ ఏకతాటిపై నిలిచి, మన ధర్మాలను గౌరవించేలా  కృషి చేయకపోతే......   బ్రాహ్మణ్యం భవిష్యత్తు పూర్తిగా అంధకారమే అవుతుంది. అందరూ కాలగర్భంలో కలసిపోయి, భవిష్యత్తు కాలంలోని ప్రజలు.. చరిత్ర పుస్తకాలలో ...ఒకప్పుడు బ్రాహ్మణ జాతి అనే ఒక గొప్పజాతి భారతదేశంలో ఉండేదని,, పాశ్చాత్యులు  తురుష్కలు కలసి కట్టుగా ఆ జాతిని ప్రజలలో మూర్ఖులుగా ముద్రవేసి, చేసి, నిర్వీర్యం చేసేసారని, ఆ తరువాత వారినందరినీ అతితెలివి కలిగిన వారిగా ముద్రవేసి, ఐకమత్యం లేనివారిగా మార్చి ,  ప్రజలలో ఘర్షణలని పెంచి, ఐకమత్యం లేకుండా చేసి,  ప్రజలనుంచి వేరుపడేలాగా చేసారనీ చెప్పుకుంటారు. ఇలాగ ఉత్తరాన కాశ్మీర్ తోసహా బ్రాహ్మణ కుటుంబాలని సర్వనాశనం చేయటంలో సఫలీకృతులైనారనీ, మిగితా అన్ని ప్రదేశాలలో కిరస్తానీ వాళ్ళు సఫలీకృతంచేసా‌రనీ ఒకరికొకరు పోటీలుపడుతూ మొత్తం బ్రాహ్మణజాతిని  కాలగర్భంలో కలసిపోయేలా చేసారని లిఖిస్తారు.


అందుకనే మనమంతా ఇకనైనా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.


ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులు అత్యాశకు పోకుండా సాటి బ్రాహ్మణ యువకుడికి కన్యాదానం చేయాలి.  ఇరవై ఆరేళ్ళ కుర్రాడికి సొంత కారు , సొంత ఇల్లు ఎలా వస్తాయనే ఇంకిత జ్ఞానం కుడా లేకుండా  ఎలా ఉన్నారని ప్రశ్నంచటంలో తప్పేంటి ?  


మీరు బంగారం కొని సువర్ణ దానం చేయవచ్చు . పొలం కొని భూదానం చెయ్యవచ్చు . ఆవును కొని గోదానం చెయ్యవచ్చు . కానీ కన్యాదానం చెయ్యాలంటే కన్యని కొని చెయ్యలేరు కదా ? దయచేసి మీ అమ్మాయిలను ఒక బ్రాహ్మణ యువకుడికే ఇచ్చి వివాహం చేయండి. అదేవిధంగా బ్రాహ్మణ యవకులకి  కూడా మార్గనిర్దేశం చేయండి. 


తక్షణమే సామూహికంగా రక్షణాత్మక చర్యలకోసం ఉపక్రమించక పోతే బ్రాహ్మణ సమాజం ఉనికే లేకుండా పోయే ప్రమాదం  అతి దగ్గరలో ఉందని విశదీకరించండి..


ఈ మెసేజ్ మీకు నచ్చితే, మీకు తెలిసిన బ్రాహ్మణులందరికీ ఫార్వార్డ్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో నాకు చెప్పండి. మీ సలహాలు ఎప్పుడూ నాకు అమూల్యమే.. 


*T.S.Malleswara Prasad.*

*Cell: 9030362942.*

*Chairman.*

*Bharathiya Vajra Party.*

*And*

*National Vice Chairman.*

*National Consumer Rights Commission.*


You can contact me at any time please.

జపం, జపమాలలు

 జపం, జపమాలలు - ఫలితాలు


జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా 'జపయజ్ఞం' గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


మనోభీష్టం నెరవేరేందుకు జపం చేసుకోవాల్సిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి దివ్యమైన నామాన్ని 108 సార్లు జపించినట్టు తెలియడానికిగాను అందరూ జపమాలలు వాడుతుంటారు.

 

జపమాలలు 3 రకాలు

1. కరమాల

అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లవుతుంది.


2. అక్షమాల

‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా ’క్షా కల్మషాలను తొలగిస్తుంది.


3. మణిమాలలు

రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.


ఫలితములు

రేఖాజపం దశగుణాన్ని, శంఖమాలజపం శతగుణాన్ని, పగడాలమాల జపం సహస్రగుణాన్ని, స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని, ముత్యపు మాల జపం లక్ష గుణాన్ని, తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని, బంగారుమాల జపం కోటి గుణాన్ని, తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని, రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి. పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపు మాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసి మాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.


జపం 3 విధాలుగా ఉంటుంది


1. వాచింకం

మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.


2. ఉపాంశువు

తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.


3. మానసికం

మనస్సులోనే మంత్రాన్ని జపించడం.

వాచిక జపం కంటే ఉపాంశు జపం 100 రేట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం 1000 రేట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడా చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరువాత గానీ ఇష్ట దేవతా పూజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదని శాస్త్రం చెబుతోంది. జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.


ఎలా చేయాలి..?

తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.


త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా

తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే


అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి. వెదురు కర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతిమీద రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మళ్లీ దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచి పెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ౠక్, సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.


దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.


గృహస్థులందు దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. 


జపం చేసుకోవడానికిగాను తులసిమాల, స్పటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల, ఉపయోగిస్తూ వుంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో 'పగడాల మాల' కూడా తనదైన ప్రత్యేకత ఏమిటంటే.. పగడాలు ధరించడం, పగడాల మాలతో జపం చేయడమనేది పూర్వకాలం నుంచీ ఉంది. పగడాల మాలతో జపం చేయడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

పెళ్ళిళ్లలో చేస్తున్న పొరపాట్లు*

 *నేటి మన పెళ్ళిళ్లలో చేస్తున్న పొరపాట్లు*


15000 మంది దంపతుల పై గడచిన 20సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్న ఒక పండితుల టీమ్ నుంచి నా తో ఒక పండితుడు షేర్  చేసి వారు చేసిన కృషియే ఈ  అక్షర రూపం 


1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..


పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అని 

ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా


ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,

చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..

భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!


2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో

ఒకరు చూపులు నిలపకపోవటం.. -

ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!

(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)

(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)


3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..

ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!


4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..

ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు ...!


5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి

రావటం వధూవరులని ఆశీర్వదించటం..

ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి

జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!


6. బఫే భోజనాలు..

ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!


7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..

ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!


ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.

అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని

భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....

అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.

వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని ఈ వ్యాసం. అందరికి అందించండి.

అందరూ  వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం

నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻.


Source: శ్రీహర్షశర్మగారి పోస్టింగ్, ముఖపుస్తకం నుండి.