కాలసర్ప యోగములు. ( దోషములు )
ప్రస్తుత గ్రహసంచారములో
ఈ కాలసర్ప యోగములు ఈ 4 మాసములలో
తే.13-12-2020ది.రా.10-42ని.ల నుండి
తే.14-04-2021ది.ఉ.01-14ని.ల వరకు
మొత్తం 120 రోజులలో 80 రోజుల వరకు
అనగా 79రో. 19గం. 25ని.లు కాలసర్ప
యోగముతో వుంటుంది.
చంద్రుడు తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం
చేయగానే గ్రహము లన్నియు రాహు కేతువుల
మధ్యలోకి వచ్చి కాలసర్ప యోగము పట్టినట్లు
భావించ వలెను. తదుపరి
చంద్రుడు వృషభ రాశి నుండి అనగా రాహు
గ్రహం విడిచి మిధున రాశి యందు ప్రవేశం
జరిగితే కాలసర్ప దోషము నుండి ఒక గ్రహం వెలుపలకు వచ్చినట్లవుతుంది.
1.
తే.13-12-2020ది. రాత్రి గం.10-42ని.ల నుండి
చంద్రుడు తులారాశి నుండి వృశ్చికం ప్రవేశం.
తే.29-12-2020.ఉ. గం.04-40ని.ల నుండి
చంద్రుడు వృషభం నుండి మిధున ప్రవేశం.
2.
తే.09-01-2021ది.ఉ.06-58ని.ల నుండి
చంద్రుడు తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం.
తే.26-01-2021ది.మ.01-03ని.ల నుండి
చంద్రుడు వృషభం నుండి మిధున ప్రవేశం.
3.
తే.05-02-2021ది.మ.12-47ని.ల నుండి
చంద్రుడు తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం.
తే.21-02-2021ది.రా.09-56ని.ల నుండి
చంద్రుడు వృషభం నుండి మిధున ప్రవేశం.
4.
తే.04-03-2021ది.సా.06-21ని.ల నుండి
చంద్రుడు తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం.
తే.22-03-2021ది.ఉ.06-09ని.ల నుండి
చంద్రుడు వృషభం నుండి మిధున ప్రవేశం.
5.
తే.01-04-2021ది.ఉ.01-56ని.ల నుండి
చంద్రుడు తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం.
తే.14-04-2021ది.ఉ.01-14ని.ల నుండి
కుజుడు వృశ్చికం నుండి మిధున ప్రవేశం.
తే.17-04-2021ది.మ.01-10ని.ల నుండి
చంద్రుడు వృషభం నుండి మిధున ప్రవేశం.
గ్రహ కూటములు:
1.
తే.14-01-2021ది. మకర రాశిలో చంద్ర, బుధ, గురు, శని చాతుః గ్రహ కూటమి.
2.
తే.15-01-2021ది.మకర రాశిలో చంద్ర,
బుధ, గురు, శని, రవి పంచ గ్రహ కూటమి.
3.
తే.16-01-2021ది.నుండి తే.25-01-2021ది.
వరకు 10రోజులు మకర రాశిలో
బుధ, గురు, శని, రవి చాతుర్ గ్రహ కూటమి.
4.
తే.26-01-2021ది.నుండి తే.04-02-2021ది.
వరకు 8రోజులు మకరరాశిలో
గురు, శని, రవి, శుక్ర చాతుర్ గ్రహ కూటమి.
5.
తే.05-02-2021ది.నుండి తే.09-02-2021ది.
వరకు 5రోజులు మకర రాశిలో
గురు, శని, రవి, శుక్ర, బుధ పంచ గ్రహ కూటమి.
6.
తే.10-02-2021ది.నుండి తే.11-02-2021ది.
వరకు 2రోజులు మకర రాశిలో గురు, శని,
రవి, శుక్ర, బుధ, చంద్ర షష్ట గ్రహ కూటమి.
7.
తే.12-02-2021ది.1రోజు మకర రాశిలో గురు,శని,రవి, శుక్ర,బుధ పంచ గ్రహ కూటమి.
8.
తే.13-02-2021ది.నుండి తే.20-02-2021ది.
వరకు 8రోజులు మకర రాశిలో
గురు, శని, బుధ, శుక్ర చాతుర్ గ్రహ కూటమి.
9.
తే.09-03-2021ది. నుండి తే. 11-03-2021ది.
వరకు 3రోజులు మకర రాశిలో
గురు, శని, బుధ, చంద్ర చాతుర్ గ్రహ కూటమి.
10.
తే.12-03-2021ది.నుండి తే.13-03-2021ది.
వరకు 2రోజులు కుంభ రాశిలో
బుధ, శుక్ర, రవి, చంద్ర చాతుర్ గ్రహ కూటమి.
ఈ క్రింద తెలిపిన విధంగా
32రోజులు 6మార్లు చాతుర్ గ్రహ కూటములు
7రోజులు 3మార్లు పంచ గ్రహ కూటములు
2రోజులు 1మారు షష్ట గ్రహ కూటమి
పై తెలిపిన విధంగా 120రోజుల పూర్తి కాలంలో కాల సర్ప యోగములతో 80రోజులు
గ్రహ కూటములతో 41రోజులు జరుగుతుంది.
గ్రహములు చివరగా మారిన సమయములు.
1.
తే.24-01-2020దిఉ.గం.09-57ని.ల నుండి
శని ధనస్సు నుండి మకర ప్రవేశం.
2.
తే.23-09-2020ది.ఉ.గం.10-43ని.ల నుండి
రాహువు మిధునం నుండి వృషభ ప్రవేశం.
3.
తే.23-09-2020ది.ఉ.గం.10-43ని.ల నుండి
కేతువు తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం.
4.
తే.16-11-2020ది.ఉ.గం.06-54ని.ల నుండి
రవి తులారాశి నుండి వృశ్చిక ప్రవేశం.
5.
తే.20-11-2020ది.ప.గం.01-24ని.ల నుండి
గురువు ధనస్సు నుండి మకర ప్రవేశం.
6.
తే.28-11-2020ది.ఉ.గం.07-05ని.ల నుండి
బుధుడు తుల నుండి వృశ్చిక ప్రవేశం.
7.
తే.11-12-2020ది.ఉ.గం.05-18ని.ల నుండి
శుక్రుడు తుల నుండి వృశ్చిక ప్రవేశం.
8.
తే.13-12-2020ది.రా.గం.10-42ని.ల నుండి
చంద్రుడు తుల నుండి వృశ్చిక ప్రవేశం.
9.
తే.24-12-2020ది.గం.ఉ.10-20ని.ల నుండి
కుజుడు మీనం నుండి మేషం ప్రవేశం.
కాలసర్ప యోగం
జ్యోతిష్య విద్వాంసులైతే మొత్తం 288 రకాల కాలసర్పదోషాలను వర్ణించిచెప్పారు. వీటిలో కాలసర్పభావాల ప్రకారం 12 ముఖ్యమైనవి .
అనంత, కులిక, వాసుకి, శంఖ, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, మహాశంఖ, పతాక, విషధర, శేషనాగ అని 12 రకాల కాలసర్పయోగాల గురించి పూర్వీకులు వివరించారు.
ఈ దోషాల పలితాలను గుర్తించేటప్పుడు మనం అనేక జ్యోతిశాస్త్ర నియమాలను కూడ పరిగణలోకి తీసుకోవాలి.
🏵కాలసర్పయోగం సాదారణ మానవులపై ప్రభావం చూపించదు.కాలసర్ప దోషం ప్రపంచాన్ని ,దేశాన్ని,రాష్ట్రాన్ని,సంస్ధని,అదికారం చలాయించే వారికి కాలసర్పదోష ప్రభావం ఉంటుంది.వారు పరిపాలించేచోట సరియైన సమయంలో వర్షాలు పడక పంటలు సరిగా పండక ,ఆర్దికవ్యవస్ధ దెబ్బతిని,కోట్లాటలు,అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారు.
పరిపాలాద్యక్షుకుడికి,పాలనా వ్యవస్ధపై కాలసర్పదోష ప్రభావ కనపడుతుంది.పాలకులు సరియైన నిర్ణయాలు తీసుకోలేరు.🏵
🔥అయితే కాలసర్పదోషం ఉన్నవ్యక్తులకు,రాహు,కేతు దశలు నడుస్తున్న వ్యక్తులకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాడు.కొన్నిరెమిడీస్ చేసుకుంటె రాహు,కేతు చాయగ్రహాలభాదలనుండి విముక్తి లభిస్తుంది.🔥
జాతక చక్రంలో వున్న గ్రహాలలో రాహుకేతువుల గురించి చరిత్ర పరిశీలిస్తే.. క్షీరసాగర మధన సమయంలో అమృతం తాగబోయిన రాహువు అనే రాక్షసుని శ్రీహరి తన యొక్క సుదర్శనంతో చీల్చివేయడంతో మొండెం క్రింద భాగం, మొండెం పై భాగం రాహు కేతువులు అయిరి.
కాలసర్పదోషం అంటే రాహు కేతువుల మధ్యలో మిగిలిన రవి చంద్ర కుజ గురు శుక్ర శని గ్రహాలు ఒకపక్కన వుండి మరొక పక్కన అసలు గ్రహాలు లేకుండా ఉండడం. సరే బాగా జ్యోతిశ్శాస్త్రం రీసెర్చ్ చేసేవారు వారి అనుభవాలతో చెప్పే అంశాలు ఏమిటి అంటే రాహుకేతువుల మధ్య మాలికా యోగం (సప్తగ్రహ) అనగా వరుస ఏడు రాశులలో ఏర్పడితే అది ప్రమాదకరం అని రాహు కేతువులకు ఈ మాలికా యోగం వలన ప్రత్యక్ష సంబంధం కలగడం వంటివి ఏర్పడుతాయి. కావున ఇబ్బందికరం అని చెబుతారు.
మిగిలిన విషయాలలో కేవలం కాలసర్పదోషం వలన జీవితం పాడయిపోతుంది. అభివృద్ధి వుండదు అనే భావన వాదన శాస్త్ర దూరమైన విషయమే. మిగిలిన గ్రహాలు వాటి స్థితి బాగుండకపోతే వచ్చే ఫలితాలు బాగుంటే వచ్చే ఫలితాలు గూర్చి పరిశీలింపక కేవలం కాలసర్ప దోషం వలన జాతకం పాడయిపోతున్నది అని చెప్పే సిద్ధాంతులు నేటి సమాజంలో ఎక్కువ వున్నారు.
అసలు దోష శాంతి ఏమిటి? రాహు కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు చేరడం వలన వచ్చిన దోషం కావున శాంతి కోసం తొమ్మిది గ్రహాలకు జపం దానం హోమం తర్పణం చేయుట వైదిక ప్రక్రియ. తద్వారా దోష శాంతి చేకూరుతుంది. ఇది వైదీక విజ్ఞానం వున్న బ్రాహ్మణులు, నవగ్రహ మంటపం వున్న ప్రతి దేవాలయంలోనూ చేయించుకోవచ్చు. అలాగ కాకపోతే ఎవరి ఊరిలో వారు కాలసర్ప దోష శాంతి చేసుకోవచ్చు.
మరి కాలసర్పదోషమే ప్రధాన కారణంగా జరిగే నష్టాలు ఏమిటి అని పరిశీలిస్తే పంచాంగ గణిత ఫలితాంశాలు చెప్పే గ్రంథాలలో కాలసర్ప దోషం జరిగే కాలంలో రాజులకు (పాలకులకు) అలాగే పంటలకు నాశనం కలుగును అని చెప్పబడినది. అందువలన కాలసర్ప దోషం కాలంలో దేశారిష్టము అనే అంశం సరిఅయినది.
🏵ఇందుకే ఏమో మన భారతదేశ పాలకులు
ప్రస్తుత కిసాన్ చట్టలాను తొలగించాలని డిల్లీ సమీపమున చేస్తున్న ఉద్యమం పై గందరగోళం పడుతున్నట్లుగా వాతావరణం కనపడుతున్నాది.🏵
🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి