29, డిసెంబర్ 2020, మంగళవారం

త్రికూటా

 *🔱🙏 త్రికూటా🙏🔱*




మూడు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'త్రికూటాయైనమః' అని చెప్పాలి.

త్రి = మూడు, కూటా = కూటములుగా ఉన్న మంత్ర స్వరూపిణి.

'మూల కూటత్రయ కళేబరా' అనే 89వ నామ వివరణ కూడా ఇక్కడ మళ్ళీ చదువుకోవాలి.

నిర్దిష్ట సంఖ్యలో ఉండే అక్షర సమూహాలను 'కూటము' అంటారు. 'కూటము' అంటే “విభాగము' అని చెప్పుకోవచ్చును. అమ్మవారి పంచదశాక్షరీ మంత్రం 'క, ఏ, ఈ, ల, హ్రీం; హ, స, క, హ, ల, హ్రీం, స, క, ల హ్రీం' అని మూడు కూటములుగా

ఉంటుంది. ఈ మూడు కూటములు వరుసగా - 'క'తో 'హ' తో స'తో ప్రారంభింపబడతాయి. అందుకే, ఈ మూడు కూటాలను వరుసగా కాదికూటము', 'హాదికూటము', 'సాదికూటము' - అని అంటారు. ఈ మూడూ వరుసగా అమ్మవారి మస్తకంపై నుండి కంఠం వరకు ఉండే భాగాన్ని; కంఠం నుండి నాభివరకు ఉండే భాగాన్ని; నాభి నుండి దిగువ భాగాన్ని సూచిస్తాయి. వీటినే వరుసగా వాగ్భవ కూటము, కామరాజు కూటము, శక్తి కూటము - అంటారు. అందుకని, అమ్మవారు ఈ 'త్రికూట' అనే నామంతో పిలువబడుతుంది. 


మంత్ర శాస్త్రాన్ననుసరించి ఏ మంత్రాన్నైనా, బీజము 'శక్తి' కీలకము' అని మూడు కూటములుగా చెబుతారు. అమ్మవారి మంత్రం కూడా ఈ త్రికూటాలతో ఉంటుంది. అందుకని అమ్మవారు 'త్రికూటా' అయింది.

1) కాది, సాది, హాది కూటత్రయంలో నుండు మంత్రస్వరూపిణి.

2) బీజ, శక్తి, కీలకములు - అని మూడు కూటములుగా చెప్పబడు మంత్రస్వరూపిణి - అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును.


🙏ఓం ఐం హ్రీం శ్రీo త్రికూటాయై నమః🙏


🌷శ్రీ మాత్రే నమః🌷

కామెంట్‌లు లేవు: