29, డిసెంబర్ 2020, మంగళవారం

జలము సేవించుటకు

 జలము సేవించుటకు నియమాలు  - 


 *  భోజనమునకు ముందు నీరు తాగిన అగ్నిమాంద్యము , శరీర కృశత్వము కలుగును. భోజన మధ్యమమున నీరు తాగిన అగ్ని వృద్ది అగును . భోజన చివరన తాగిన రసాయనముగా పనిచేయును . 


 *  భోజన మధ్యమము నందు నీరు తాగిన సమ శరీరము కలిగిన వారుగా , భోజన అంతము నందు నీరు తాగిన స్థూల శరీరులుగా , భోజనం ప్రారంభమునకు ముందు తాగిన సన్నగా ఉండును. 


 *  ప్రొద్దుగూకు లోపల ఎక్కువుగా నీరు తాగవచ్చు . రాత్రి సమయము నందు నీరు అతిగా తీసుకోరాదు   అతిగా నీరు తీసుకున్నను , అసలు తీసుకోకపోయినను అజీర్ణ రోగం పుట్టును . అగ్నిదీప్తి కొరకు మితముగా నీరు తాగవలెను . 


 *  ఉదరము యొక్క రెండు భాగములు అన్నము చేత ఒక భాగము పానీయము చేత నింపి నాలుగొవ భాగము వాతాది దోషముల యొక్క సంచారము కొరకు వదలవలెను . 


 *  ఎక్కువుగా భుజించుట చేత వ్యాధియు , అసలు భుజించకుండుట చేత బలం తగ్గిపోవును . మితముగా ఆహారం తీసుకొనుట చేత మంచి ధారుడ్యము , ఆయుర్వృద్ధి కలుగును . 


 *  దప్పికతో ఉన్నవాడు భుజించరాదు . అట్లు భుజించిన గుల్మ వ్యాధి కలుగును. 


 *  ఆకలితో ఉన్నవాడు నీరు తాగరాదు. అట్లు తాగిన భగంధర వ్యాధి కలుగును. 



             తరవాతి పోస్టు నందు మరికొంత విలువైన సమాచారం అందిస్తాను . 


    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: