.
🙏 హరిః ఓమ్ 🙏
🌸🌻పద్యాల🌻తోరణం🌻🌸
🌹శు భో ద యం 🌹
ప్రాతఃస్మరణీయులు శ్రీమాన్
కూచిమంచి తిమ్మకవివరేణ్య
విరచిత
" చిరవిభవా ! శతకము "
🌼🌹🌼
-6- చంపకమాల :
మరలని భక్తితోడ మును మల్హణబిల్హణముఖ్యసత్కవీ
శ్వరులు కవిత్వవైఖరిని సారెకు
నిన్ బ్రణుతించి ధన్యులై
బరగిరటంచు నేను నినుఁ బద్య
ముఖంబుగ సంస్మరించెదన్
చిరవిభవా ! భవా ! విజితచిత్తభవా ! యభవా ! మహాభవా🙏
టీకా :
(నీ నుండి ప్రక్కకు..)మరలని భక్తితోడ , మును = పూర్వము , మల్హ(..ణుడు)ణ , బిల్హ(..ణుడు)ణ , ముఖ్య = మొ॥ , సత్కవీశ్వరులు , కవిత్వ(..ము) ,
వైఖరిని = మూలకముగా , సారెకు = మాటిమాటికి = ఎల్లవేళలా ,
నిన్ = నిన్ను , (బ్ర)ప్రణుతించి = కీర్తించి , ధన్యులై , (బ)పరగిరి = ప్రసిద్ధులైరి ,
+ అటంచు , నేను నినుఁ ,
(బ)పద్యముఖంబుగ , సంస్మరించెదన్ .. ( అనుగ్రహింపుము ..)
శివా ! ..
[ ఈ మకుటార్థము
ప్రతి పద్యమునకును అన్వయము ..
చిరవిభవా ! = శాశ్వతమైన విభవము గలవాడా ! , భవా ! = శివా !
< విజిత = జయించబడిన ,
చిత్తభవా ! = మన్మథుని గలవాడా > =
మన్మథుని జయించినవాడా ! (య)అభవా ! = (జనన మరణ
చక్రబంధ క్రమమున ..) జన్మ లేనివాడా !
మహాభవా ! = ౘచ్చి , పుట్టునటువంటిది కాని గొప్ప పుట్టుక కలవాడా = శాశ్వతుడా..]🙏
భావము : !
చిరవిభవా ! భవా !
విజితచిత్తభవా ! యభవా ! మహాభవా !
నీ నుండి ప్రక్కకు మరలని భక్తితోడ పూర్వము మల్హణుడు - బిల్హణుడు మొ॥ సత్కవీశ్వరులు కవిత్వము మూలకముగా ఎల్లవేళలా నిన్ను కీర్తించి ధన్యులై - ప్రసిద్ధులైరి అని గ్రహించి నేను కూడా నిన్ను పద్యముల మూలముగనే సంస్మరించెదను .. అనుగ్రహింపుము శివా ! ..🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి