27, జనవరి 2024, శనివారం

గుఱ్ఱాలు లేని రథం

 *సుభాషితం*

*---------------*

🌺

*యథాశ్చ రథహీనాస్తు*

 *రాథో వాశ్చైర్యథా వినా ౹*

     *ఏవం తపోsప్య విద్యస్య*

    *విద్యావాsప్య తపస్వినః ౹.*      🌺

*(సంగ్రహము)*

            *భావం.రథమే లేని గుఱ్ఱాల్లా, గుఱ్ఱాలు లేని రథంలా  విద్య లేనివాడు తపస్సు, తప్పస్సు లేని విద్య అన్నీ వ్యర్థమైనవి.*

🌺✍🏽

శ్రీమద్భగవద్గీత

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*శ్రీమద్భగవద్గీత - 2వ అధ్యాయము* 

.           *సాంఖ్య యోగము*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹 

ఈ అధ్యాయములో అర్జునుడు, పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తతని పునరుద్ఘాటించి, ఆసన్నమైన యుద్దంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరించాడు. ఆ తరువాత శ్రీ కృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువు గా ఉండమని పద్ధతి ప్రకారముగా, మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి, తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తనకు దిశానిర్దేశము చేయమని శ్రీ కృష్ణుడిని బ్రతిమాలతాడు. శరీరము నశించినా, నశించిపోని, మరణము లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు, ఆ పరమాత్మ. ఒక మనిషి పాత బట్టలు తీసివేసి కొత్త బట్టలు ఎలాగైతే వేసుకుంటాడో ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది. ఆ తరువాత శ్రీ కృష్ణుడు సామాజిక భాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ భాద్యతలను అర్జునుడికి గుర్తుచేస్తాడు. సామాజిక భాధ్యతని నిర్వర్తించటం ఒక పవిత్రమైన ధర్మమని, అది ఉత్తమ గతుల వైపు దారి చూపుతుందని, అదేసమయంలో, కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము, తలవంపు, అపకీర్తి కలుగుతాయని చెప్తాడు.

అర్జునుడిని లౌకిక స్థాయి నుండి పైకి తీసిన శ్రీ కృష్ణుడు, తదుపరి, కర్మ శాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు. కర్మ ఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని 'బుద్ధి యోగము' అన్నాడు. బుద్దిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫల కాంక్షని నిగ్రహించాలి. ఇలాంటి దృక్పథంతో పని చేస్తే, బంధాన్ని కలిగించే కర్మలే, బంధ-నాశక కర్మలుగా మారిపోయి, అర్జునుడు దుఃఖ రహిత స్థితిని చేరుకుంటాడు.

దివ్య జ్ఞానం లో ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు. దానికి జవాబుగా, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక జ్ఞానం లో ఉన్న వారు మోహము, భయం, కోపములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరించాడు. వారు సుఖః-దుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు; వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి; వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది; మానసిక క్లేశములైన - కామము, క్రోధము, లోభములు - ఎలా ఎదుగుతాయో, వాటిని ఎలా నిర్మూలించవచ్చో, దశల వారీగా శ్రీ కృష్ణుడు విశదీకరిస్తాడు.


👆 *సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

.           *🌹వేమన పద్యములు🌹* 

.             *అర్థము - తాత్పర్యము*

.                      *Part - 9*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 22*

      

*అండమండము గన నన్నియు నటుపిండ*

*మండమెట్లో బమ్మ యండ మట్లే*

*కర్మబంధమునను గానరే యీ నరుల్* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

కర్మను ఎవరూ తప్పించలేరు గదా !

అండ పిండ బ్రహ్మాండములు కర్మబంధమునకు మూలములు.


*💥వేమన పద్యాలు -- 23*

 

*అండమందునుండు నఖిలమై జనులార*

*ఎందులేక యుండు నెరుగు నతడె*

*యతని పూజఫలము నందె నాశివయోగి* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

మనిషి పూజాఫలమే శివ సాక్షాత్కారమునకు ముఖ్యము.


*💥 వేమన పద్యాలు -- 24*

 

*అండములో నాకాశం*

*బుండంగా జూడ జూడ నొనరగ దీపై*

*యుండును నంతయు దెలిసిన*

*మెండుగ నొక ముక్తి కాంత మెలగుర వేమా*


*🌹తాత్పర్యము --*       

సర్వజ్ఞునికి మోక్షము సులభము.

ముక్తి కాంత సర్వజ్ఞుని మెచ్చుకొనును.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


👆 *సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పోతనామాత్యులవారి

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*తృతీయ స్కంధము*


*హరి నరుల కెల్లఁ బూజ్యుఁడు*

*హరి లీలామనుజుఁడును గుణాతీతుఁడు నై*

*పరఁగిన భవ కర్మంబులఁ*

*బొఁరయం డఁట హరికిఁ గర్మములు లీల లగున్.*


మహానుభావా! ఉద్ధవా! కర్మవశం వలన పుట్టిన జీవులందరికీ శ్రీహరి పూజింప దగినవాడు. ఆయన కోరికోరి కొన్ని మహాకార్యాలను చేయటానికి భూమిపై పుడుతూ ఉంటాడు. అందువలననే ఆయనను లీలామనుజుడు అంటారు. జీవులందరు సత్త్వము, రజస్సు, తమస్సు అనే గుణాలనుబట్టి మెలగుతూ ఉంటారు. దానివలన వారు బంధాలను వదలించుకోలేరు. కానీ శ్రీహరి గుణాలకు లోబడినవాడుకాడు. కాబట్టి ఆయనకు కర్మబంధాల అంటుసొంటులు ఉండవు. ఆయన చేసే కర్మములు ఆ విధంగా లీలలు అవుతాయి.


👆 *సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

నవగ్రహా పురాణం🪐

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *146వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహ మహిమ - 1*

     

*"హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ ! సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ !!"*


నిర్వికల్పానంద శుక్ర స్తుతి శ్లోకాన్ని పఠించి , శుక్రగ్రహ మహిమా కథనాన్ని ప్రారంభించాడు.


*"శుక్రుడు ప్రధానంగా ఐశ్వర్య , ఆనంద , సౌభాగ్య , వైభవ కారకుడు. ఆయన కారకత్వాలు ఇంకా ఉన్నాయి కానీ , ప్రస్తుతం వాటితో మనకు అవసరం లేదు. ఐశ్వర్య సౌభాగ్య వైభవాలు కోల్పోయి , తిరిగి పొందిన పురాణపురుషుని గాధను ఉదాహరణగా చెప్పుకుందాం. క్షీరసాగర మథన గాథ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ అమృత సాధన కార్యంలో ఇంద్రాది దేవతలకు చేయూత అందించి , అమృతంలో పాలుపంచుకోలేక బలి చక్రవర్తి భంగపడిన విషయం మనం విన్నాం. సాగరమధనం అనంతరం జరిగిన సురాసుర యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన బలిచక్రవర్తిని శుక్రాచారుడు మృతసంజీవనీ విద్యతో పునర్జీవితుణ్ణి చేశాడు. బలిచక్రవర్తి కృతజ్ఞతాభారంతో శుక్రాచార్యుడిని అనన్య సామాన్యమైన రీతిలో సేవించి , సంతోషపెట్టాడు."*


*“శిష్యుడి సేవకు ప్రసన్నుడైన శుక్రుడు ఆయన చేత విశ్వజిత్ యాగం చేయించాడు. యజ్ఞం విజయవంతంగా పరిసమాప్తమైంది. హోమాగ్నిలోంచి సువర్ణ వస్త్రాలు కప్పిన రథమూ , సూర్యరథాశ్వాలలాంటి జవనాశ్వాలూ , సింహపతాకమూ , దివ్యమైన ధనుస్సూ , రెండు అమ్ముల పొదులూ , కవచమూ వెలికివచ్చాయి. అగ్నిదేవుడు వాటిని బలిచక్రవర్తికి బహూకరించాడు. శుక్రాచార్యుడు శిష్యుడికి తెల్లటి శంఖాన్ని ఇచ్చాడు. తాతగారైన ప్రహ్లాదుడు ఎప్పటికీ వాడిపోని పద్యమాల ఇచ్చాడు. బలిచక్రవర్తి ఆనందంతో పొంగిపోయి , గురుదేవుడైన శుక్రాచార్యులకు ధన్యవాదాలు అర్పించాడు..."*


★★★★★★★★★★★★★★★★


యుద్ధానికి అవసరమైన దివ్య పరికరాలను పొందిన బలితో శుక్రుడు ఇలా అన్నాడు.


*"బలీ ! మనకు అమృతం లేకపోతే ఏం ? మా వద్ద మృతసంజీవనీ దివ్య విద్య ఉంది. నీ వద్ద దివ్య రథమూ , ధనుర్భాణాలూ , కవచమూ ఉన్నాయి. మేము బహూకరించిన ధవళ శంఖాన్ని పూరించు. అమరుల మీద సమరం ప్రకటించు !"*


బలిచక్రవర్తి శుక్రాచార్యుడి వైపు క్షణకాలం సందేహిస్తూ చూశాడు. *“గురుదేవా ! క్షీరసాగర తీరాన జరిగింది చూశాక , విజయ సాధన విషయంలో సందేహంగా ఉంది. దేవతలను జయించడానికి ఈ రథమూ , ధనుర్బాణాలూ చాలునంటారా ?”*


*"చాలవు !"*


*"తమ శుభదృష్టిని ప్రసరించి , 'విజయోస్తు' అనండి !”*


*"అది ఒక్కటే కూడా చాలదు. అశుభ దృష్టిని కూడా ప్రసరిస్తాను...”*


*"గురుదేవా ?"* బలి ఆశ్చర్యంగా అన్నాడు.


*“నీ మీదా , నీ అసురగణం మీదా కాదు నాయనా ! ఇంద్రుడి మీద ! మహేంద్రుడి మీద ప్రసరించే ఈ శుక్రుడి వక్రవీక్షణ బలిచక్రవర్తికి వెయ్యింతలు బలాన్ని ఇస్తుంది ! 'సమరానికి సాగు ! ఈ సారి నిశ్చయంగా జయం నీదే !"* శుక్రాచార్యుడు తీక్షణంగా చూస్తూ అన్నాడు.


★★★★★★★★★★★★★★★★★


ఇంద్ర సభ !


రంభా , ఊర్వశీ నాట్యం చేస్తున్నారు. దేవేంద్రుడు తన్మయత్వంతో చూస్తూ , ఆనందిస్తున్నాడు. అప్సరసల అందెలు లయబద్ధంగా శ్రవణ మనోహరంగా ధ్వనిస్తున్నాయి. దేవచారులు ఇద్దరు ఆందోళనతో సభలోకి పరిగెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళ రాకను గమనించిన బృహస్పతి చెయ్యెత్తి ఊర్వశీ , రంభలను వారించాడు. మంజీరాల మనోహర నాదాలూ ఆగిపోయాయి.


*“సుర సామ్రాట్టుకు జయం ! ప్రభూ ! బలిచక్రవర్తి అఖండ సేనా వాహినితో అమరావతిని చుట్టుముట్టాడు !”* ఒక దేవచారుడు అన్నాడు.


*"నిజమా ?!”* ఇంద్రుడు ఆశ్చర్యంతో అరిచాడు.


*“నిజమే ప్రభూ ! కోట చుట్టూ రాక్షస సైన్యం మోహరించింది ! మార్గాలన్నింటినీ మూసి వేశారు !"* రెండవ చారుడు వణికే కంఠంతో విన్నవించాడు.


అసుర సైన్యం మ్రోగిస్తున్న అనేక శంఖాల భీకర ధ్వనులు దేవచారులు తెచ్చిన వార్త నిజమే అంటూ చాటుతున్నట్టు సభా భవనంలోకి దూసుకొస్తున్నాయి. ఇంద్రుడు ఆందోళనతో బృహస్పతి వైపు చూస్తూ , సభ చాలించి లేచాడు.


★★★★★★★★★★★★★★★★


*"గురుదేవా ! పరాజయాన్ని రుచిచూసిన బలి అచిరకాలంలోనే యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడంటే , ఏదో నూతన శక్తి అతనికి లభించి ఉండాలి..."* ఇంద్రుడు సాలోచనగా అన్నాడు.


శూన్యంలోకి చూస్తున్న బృహస్పతి తన దృష్టిని ఇంద్రుడి వైపు తిప్పాడు. *“మహేంద్రా ! శుక్రాచార్యుడు బలి చక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. దానితో అసురుల బలం ఇబ్బడి ముబ్బడి అయింది. బ్రహ్మ వాదులైన భృగువంశీకులు అసామాన్య శక్తులను బలికి ఒనగూర్చుతున్నారు. శ్రీమహావిష్ణువూ , పరమశివుడూ తప్ప మరెవ్వరూ బలిని ఎదిరించి జయించలేరు...”*


*"గురుదేవా !”*


*"అవును , దేవరాజా ! నా గణన ప్రకారం ప్రస్తుతం నీకు కాలం అనుకూలంగా లేదు !"*


*"కర్తవ్యం ఏమిటో చెప్పండి !”*


*"నీకు తెలియనిది ఏముంది మహేంద్రా ! యుద్ధంలో సిద్ధించాల్సిన పర్యసనాలు రెండే ! ఒకటి విజయం. రెండు వీరమరణం. ప్రస్తుతం మనకు లభ్యంగా ఉన్న దైవికబలం , ఆయుధబలం ఈ రెండూ కూడా విజయసాధనకు చాలవు. అంటే ఈ రెండింటివల్లా విజయం రాదు ! అమృతం కారణంగా వీర మరణమూ రాదు !”* బృహస్పతి నిస్పృహతో అన్నాడు.


దేవేంద్రుడు నీరసంగా చూశాడు. *“మీ విశ్లేషణం నాకు ఆందోళన కలిగిస్తోంది ! కర్తవ్య బోధ చేయండి !”*


*"స్వర్గ సామ్రాజ్యాన్ని బలిచక్రవర్తి పరంచేసి , తొలగిపోవడమే కర్తవ్యం !”*


*"గురుదేవా !”*


*"ఆందోళన పడవద్దు మహేంద్రా ! ఈ పరిత్యాగం శాశ్వతం కాదు ; ” తాత్కాలికమే!”* బృహస్పతి ఓదార్పుగా అన్నాడు. ఇంద్రుడు వేడిగా నిట్టూర్చాడు.


★★★★★★★★★★★★★★★★


మహేంద్రుడి ఆనతిని అనుసరించి దేవతలూ , అప్సరసలూ స్వర్గలోకాన్ని వదిలి సురక్షితమైన అనుకూల ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఇంద్రుడూ సతీ సంతాన సమేతంగా తరలి వెళ్ళాడు.


అమరులందరూ కాందిశీకులుగా మారిపోయి , చెట్టుకొకరూ , పుట్టుకొకరూ పారిపోయిన దుర్వార్తను నారదమహర్షి కశ్యపాశ్రమానికి చేరవేశాడు. తన సంతతి అయిన దేవతలకు ప్రాప్తించిన కష్టనష్టాలను విని , అదితి విచారంలో మునిగిపోయింది. భర్త కశ్యప బ్రహ్మ ముందు తన దుఃఖాన్ని ప్రకటించింది.


*"స్వామీ ! నా సంతతిగా జన్మించిన మన బిడ్డలు సౌమ్యులు , అక్రమ ప్రవర్తునులైన అసురుల మూలంగా భోగభోగ్యాలనూ , సుఖసంతోషాలనూ కోల్పోయి దుఃఖ సాగరంలో మునకలు వేస్తున్నారు. నా బిడ్డలైన ఇంద్రాదులను అమరావతిలో పునఃప్రతిష్ఠించండి. దైత్యదానవులను శిక్షించి , అదితేయులను రక్షించండి !”*


ఆవేదనతో కూడిన అదితి అభ్యర్ధన విని కశ్యపుడు నిట్టూర్చాడు. అనునయంగా ఆమె ఆశ్రువుల్ని తుడిచాడు. *"అదితీ ! నీ కోరికను తీర్చే శక్తి , సామర్థ్యం నాకు లేవు. నాకే కాదు ; త్రిలోకాలలో ఎవ్వరికీ లేవు , ఒకే ఒక్క మహితాత్ముడికి తప్ప !”*


*"స్వామీ... ఆ మహితాత్ముడు...”*


*"శ్రీమహావిష్ణువు !”* కశ్యపుడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. *"అసురులను శిక్షించి , సురలను రక్షించే అపూర్వశక్తి ఆయనొక్కడికే ఉంది ! ఆ జగజ్జనకుడిని ఆరాధించు !”*


*"స్వామీ ! ఆ స్వామి కరుణిస్తారా ?”*


*"ఒక విశిష్టమైన , ప్రత్యేకమైన వ్రతవిధానం ఉంది. భక్తి ప్రపత్తులతో , నియమనిష్ఠలతో , చిత్తశుద్ధితో ఆ వ్రతాన్ని ఆచరిస్తే పరమ పురుషుడు తప్పక కరుణిస్తాడు !"* అదితి కుతూహలంగా , మౌనంగా చూసింది.


*"అద్వితీయమైన 'పయోభక్షణ వ్రతం' అది ! ఆ వ్రత విధానాన్నీ , మంత్రాన్నీ వ్రత కాలంలో పాటించవలసిన నియమాన్నీ , తగిన కాలాన్నీ , వ్యవధానాన్నీ నీకు ఎరుకపరుస్తాను. మహాశక్తివంతమైన , దివ్యమైన మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. రేపు ఫాల్గుణ శుక్ల పక్ష పాడ్యమి ! వ్రతం ప్రారంభించడానికి మహత్తరమైన దినం. సరేనా !”*


*"ఆజ్ఞ ! రేపు ఉదయమే వ్రతాన్ని ప్రారంభిస్తాను !"* అదితి ఉత్సాహంగా అంది. *“శుభం ! మహాసంకల్పం చేసుకుని , ప్రారంభించాలి సుమా !”* కశ్యపుడు అన్నాడు.


★★★★★★★★★★★★★★★★


అదితి పతిదేవుని సూచనను అనుసరించి ఆ మరునాడే పయోభక్షణ వ్రతాన్ని ఆరంభించి , నియమనిష్ఠలతో పండ్రెండు రోజుల పాటు ఆచరించింది. పయోభక్షణ వ్రతం పరిసమాప్తమైంది.


అదితిని ఆనందాశ్చర్యాల డోలికలలో ఊపుతూ శ్రీమహావిష్ణువు ఆమె ముందు సాక్షాత్కరించాడు.


*"అమ్మా... అదితీ !"*


*“తండ్రీ ! వచ్చావా ?!”* అదితి ఆనందబాష్పాలు రాలుస్తూ , గద్గదకంఠంతో అంది. *"అమ్మ పిలిస్తే రాకుండా ఉండగలనా !"* శ్రీహరి చిరునవ్వుల వెన్నెలలు కురిపిస్తూ అన్నాడు.


*"తండ్రీ !”* అదితి కదిలిపోతూ అంది.


*"నీ కోరిక నాకు తెలుసు తల్లీ ! నీ కడుపున పుట్టి , దేవతలకు పూర్వవైభవాన్ని చేకూర్చుతాను !”*


*"జగజ్జనకా ! నేనెంత అదృష్టవంతురాలిని !"* అదితి విశాల నేత్రాలు ఆనందాశ్రు వులను వర్షిస్తున్నాయి.


*"అదృష్టం నాది కూడా , మాతా ! నీ గర్భసుధాంబుధి వీచికలలో ఊయల లూగుతూ విశ్రమించి , తుష్టిని పొంది , సకాలంలో నీ వొడిని చేరి , నీ స్తన్యం త్రాగి పుష్టిని పొందుతాను !"*


అదితి శరీరం ఒక్కసారిగా జలదరించింది. *"తండ్రీ... నా తండ్రీ !”*


*“నా రూపాన్ని మనసులో ఉంచుకుంటూ తనువుతో నీ పతిదేవుణ్ణి సేవించు ! పవిత్ర యజ్ఞకుండంలో హవిస్సులాగా నేను నీ పావన గర్భంలో చేరుతాను !”* 


*"ధన్యురాలను స్వామీ !”*


*“సుపుత్ర ప్రాప్తిరస్తు !”* విష్ణువు చిరునవ్వుతో దీవిస్తూ అంతర్ధానమయ్యాడు.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 8*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥 వేమన పద్యాలు-- 19*


*అండజముల బుట్టు నలరు ప్రాణులు కొన్ని*

*బుద్భుధముల బుట్టు పురుగు లెల్ల*

*స్వేదమునను బుట్టు జీవులు కొన్నిరా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

కొన్ని ప్రాణులు గుడ్డు నుండి పుట్టును.

నీటి బుడగల నుండి పురుగులు పుడతాయి.

చమట నుండి కొన్ని జీవులు పుట్టును.


*💥వేమన పద్యాలు -- 20*


*అండం దప్పిన నరు డతి ధార్మికుని ఇల్లు*

*చేర వలయు బ్రదుక జేయు నతండు*

*యా విభీషణునకు నతి గారవంబున*

*భూతలమున రాము రీతి వేమ*


*🌹తాత్పర్యము ---*

విభీషణుని శ్రీరాముడు ఆదరించి గౌరవించినట్లు అండదండలు లేని మనిషి ధార్మికుని ఇంటికి వెళ్లవలెను.


*💥వేమన పద్యాలు -- 21*


*అండపిండము నడి బిందు వాత్మ జ్యోతి*

*యర్కు జ్యోతి సరసి జాండమందు*

*నాదబిందువులకు నడుమ నద్భుత జ్యోతి*

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

ఓంకార నాదం , ఆత్మ జ్యోతి అధ్భుత జ్యోతిగా మానవుని అంతరాత్మ పరిశుద్ధము కావలెను.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 

*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పోతనామాత్యులవారి

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*తృతీయ స్కంధము*


*జననంబందుటలేని యీశ్వరుఁడుదా జన్మించు టెల్లన్ విరో*

*ధి నిరాసార్థము వీతకర్ముఁ డగు నద్దేవుండు గర్మప్రవ*

*ర్తనుఁ డౌ టెల్లఁ జరాచరప్రకట భూతశ్రేణులన్ గర్మ వ*

*ర్తనులం జేయఁ దలంచి కాక కలవే దైత్యారికిం గర్మముల్.*


ఉద్ధవా! మనస్వామి వాసుదేవునకు పుట్టుక అనేదిలేదు. ఆయన అందరకు ఈశ్వరుడు. మఱి కృష్ణుడుగా పుట్టినాడు గదా! అంటావేమో. అది జగములకు పగవారైన దుష్టులను రూపుమాపటంకోసమే. అలాగే మనకులాగా ఆయనకు చేయవలసిన పనులేవీ లేవు. కానీ ఎన్నో కర్మములు చేస్తున్నాడు. అది ఎందుకంటే లోకాలలోని స్థావరములు, జంగమములూ అయిన ప్రాణులనందరినీ వారివారికి ఏర్పడిన క్రియలలో ఎలా మెలగాలో తెలియజేయటానికి మాత్రమే. రక్కసులను మట్టుపెట్టే మహాత్ములకు కర్మలంటూ ఉంటాయా?


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *అర్జున విషాద యోగము*

. *శ్లోకము 47*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*సంజయ ఉవాచ ।*

*ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ ।*

*విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ।।*


*భావము:*

 సంజయుడు పలికెను: ఈ విధంగా పలికిన అర్జునుడు, దీనస్థితిలో, తీవ్ర శోకసంతుప్తుడై తన బాణాలను, ధనుస్సును పక్కన జారవిడిచి, రథం లో కూలబడ్డాడు.

 

*వివరణ:* 

మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవుతాడు. 1.28వ శ్లోకం నుండి అర్జునుడు మొదలు పెట్టిన నిర్వేదం ఇప్పుడు తారా స్థాయికి చేరింది. తను ధర్మ బద్ధంగా నిర్వర్తించవలసిన విధిని నైరాశ్యం తో వదిలివేసాడు. జ్ఞానంతో, భక్తితో భగవంతునికి శరణాగతి చేయటానికి ఇది పూర్తి విరుద్ధం. ఈ సమయంలో ఒక విషయము చెప్పటం సమంజసం. అర్జునుడు ఆథ్యాత్మిక జ్ఞానం లోపించిన అమాయకుడు ఏమీ కాదు. అతడు దివ్య లోకాలకు వెళ్లి తన తండ్రి స్వర్గాధిపతి ఇంద్రుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. నిజానికి, తను పూర్వ జన్మలో "నరుడు" , కాబట్టి పారమార్థిక జ్ఞానం తెలిసినవాడే. (నర-నారాయణులు జంట అవతారములు, ఇందులో 'నరుడు' సిద్దుడైన జీవాత్మ, 'నారాయణుడు' పరమాత్మ). దీనికి రుజువు ఏమిటంటే, మహాభారత యుద్ధం ముందు, యదు సైన్యాన్ని అంతా దుర్యోధనునికి వదిలేసి, అర్జునుడు శ్రీ కృష్ణుడిని తన పక్షంలోకి ఎంచుకున్నాడు. భగవంతుడే తన పక్షాన వుంటే తనకు అపజయం ఎన్నటికీ కలుగదు అని దృఢవిశ్వాసం తో ఉన్నాడు. అయినప్పటికీ, శ్రీ కృష్ణుడు, భావితరాల ప్రయోజనం కోసం, భగవద్గీత సందేశాన్ని చెప్పటానికి సంకల్పించాడు. కాబట్టి, సరియైన సమయం లో ఉద్దేశపూర్వకంగా అర్జునుడి మనస్సులో కలవరము సృష్టించాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

- *శ్రీ రామరక్షా స్తోత్రం - 32*


💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


                  *లోకాభిరామం రణరంగధీరమ్* |

                  *రాజీవనేత్రం రఘువంశనాథమ్* ||

                  *కారుణ్యరూపం కరుణాకరం తమ్* |

                   *శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే* ||


           - *శ్రీ రామరక్షా స్తోత్రం - 32* -


మనోహరమైన రూపము గలవాడు, యుద్ధ రంగమున తిరుగు లేనివాడు, సరసిజాక్షుడు, రఘువంశ శ్రేష్ఠుడు, కారుణ్యమే రూపము దాల్చినట్లు ఉన్నవాడు, దయకు నెలవైనవాడు అయిన శ్రీరామ చంద్రుని శరణు వేడుచున్నాను. సర్వ లోకాలకు సంతోషాన్ని కలిగించేవాడు, రణం అనే క్రీడలో ధీరత్వం కలిగినవాడు, కమలములవంటి కన్నులు కలవాడు, రఘువంశ నాయకుడు, కరుణ రసం మూర్తీభవించినవాడు, అయిన శ్రీరామచంద్రుడు నాకు శరణునిచ్చుగాక. *లోకోత్తర సుందరాకారుడు, రణరంగధీరుడు, కమలనయనుడు, రఘువంశ నాయకుడు, దయాస్వరూపుడు, కరుణామూర్తి అగు శ్రీరామచంద్రుని శరణు వేడుకొందును*.


🧘‍♂️🙏🪷 ✍️🙏


 శ్రీరామరక్షా స్తోత్రము

 అనువాద పద్యము 32


రచన మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు

 మిట్టాపల్లి 


తే గీ . సుందరాకార  విగ్రహశోభితుండు

యుద్ధమందున విజయాల యోగ్యుడితడు 

కమలపత్రములనుబోలు కళ్ళు కలిగి

రాఘవుల వంశ నాయక రామచంద్ర

దయను చూపుట యందున తండ్రి యితడు

రామచంద్రుడే సర్వంబు రక్ష చేయు

జగత్తంతా

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


// *శ్లోకం* // 


కస్సాధుః, స్సద్వృత్తః. కమధమ మౌచక్షతే? త్వదసద్వృత్తమ్౹

కేన జితం జగదేత? త్సత్య తితిక్షావతా పుంసా॥


/- *_సంస్కృత సూక్తి సుధ_* /-


భావము -  సాధువు అంటే ఎవరు? మంచి నడవడిక గలవాడు. అధముడంటే ఎవరు? మంచి ప్రవర్తన లేనివాడు.*ఈ జగత్తంతా ఎవరిచే జయింపబడుతుంది? ఎవడు నిరంతరం సత్యం పలుకుతూ ఉంటాడో వాడి చేత, ఎవడు తనకు అపకారం చేసినా ఎటువంటి వికారం పొందకుండా ఉంటాడో వాని చేత*.... [ ఈ జగత్తు జయింపబడుతూవుంటుంది.]

భక్తులకు సూచన*

 *రామ భక్తులకు సూచన*


సుదూర ప్రయాణం చేసి అయోధ్య చేరుకున్న మన తెలుగు భక్తులకు ప్రతి రోజు స్వామివారి దర్శనం అయితే లభిస్తుంది, 


కానీ భోజన, వసతికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. 


అలాంటి సమయంలో అయోధ్యలో మన తెలుగు వారికి అన్నసమారాధన కార్యక్రమం శ్రీ సీతారామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారు అయోధ్యలో కనక్ భవన్ సమీపంలోనే కల్పిస్తూ ఉన్నారు. 


మీకు ఏ రోజు అన్నసమారాధన కావాలో, ఏ రోజు మీరు భోజనం చేయదలచారో వివరాలకు 9305205903 లేదా 9550754389 నెంబర్లను సంప్రదిచగలరు.


*గమనిక* : ముందుగా తెలియజేసినట్లయితే వారు మీకు భోజన ఏర్పాట్లు చేయగలరు.


*సూచన* : భక్తుల సౌకర్యార్థం మీ WhatsApp Groupల ద్వారా ప్రచారం కల్పించవలసినదిగా కోరుచున్నాను.

                          

*జైశ్రీరామ్*

మహానుభావుల ఔదార్యం

 శ్లోకం:☝️

*చాతకస్త్రిచతురాన్ పయఃకణాన్*

  *యాచతే జలధరం పిపాసయా |*

*సౌపి పూరయతి విశ్వమమ్భసా*

  *హంత హంత మహతాముదారతాం ||*


భావం: దాహంతో చాతకపక్షి మేఘాన్ని మూడు నాలుగు చుక్కల నీటిని యాచిస్తుంది. ఆ మేఘం మొత్తం ప్రపంచాన్ని నీటితో నింపుతుంది. ఆహ! ఈ మహానుభావుల ఔదార్యం ఎంత గొప్పది!

పంచాంగం 27.01.2024 Saturday,

 ఈ రోజు పంచాంగం 27.01.2024

Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస కృష్ణ పక్ష: ద్వితీయా తిధి స్థిర వాసర: ఆశ్రేష నక్షత్రం ఆయుష్మాన్ యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


విదియ రాత్రి 03:37 వరకు.

ఆశ్రేష మధ్యాహ్నం 01:02 వరకు.

సూర్యోదయం : 06:53

సూర్యాస్తమయం : 06:05


వర్జ్యం : రాత్రి 02:27 నుండి 04:15 వరకు.


దుర్ముహూర్తం : ఉదయం 06:53 నుండి 08:23 వరకు.


అమృత ఘడియలు : పగలు 11:16 నుండి మధ్యాహ్నం 01:02.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

మందార మకరంద...

 మందార మకరంద...


మందార మకరంద మాధుర్యమున దేలు

మధుపంబు వోవునే మదనములకు

నిర్మల మందాకినీవీచికల దూగు

రాయంచ చనునే తరంగిణులకు

లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు

కోయిల జేరునే కుటజములకు

పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక

మరుగునే సాంద్ర నీహారములకు


అంబుజోదర దివ్య పాదారవింద

చింతనామృత పాన విశేష మత్త

చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు!

వినుత గుణశీల, మాటలు వేయునేల?


పోతన భాగవతంతో కాస్తంత పరిచయం ఉన్న ఎవరికైనా ఈ పద్యం తప్పకుండా తెలుస్తుంది. భక్తప్రహ్లాద సినిమా చూసినవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుందండోయ్! ప్రహ్లాదుడు మన తెలుగువాళ్ళ హృదయాల్లో నిలిచిపోడానికి ముఖ్య కారణం పోతనంటే అది అతిశయోక్తి కాదు. ఇందులో ఎన్నెన్ని ఆణిముత్యాల్లాంటి పద్యాలు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయాయో!

కవిత్వంలో, చెప్పే విషయం ఎంత గొప్పదైనా, అది చెప్పే విధానంకూడా అంతగొప్పదీ అయితేనే పాఠకుల మనసులకి హత్తుకుంటుందనడానికి ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణ.

విష్ణు భక్తిని వదలడం తన సాధ్యం కాదని చెప్పడం ఈ పద్యం సారాంశం. దాన్ని చక్కని నాలుగు ఉదాహరణల్తో సమర్ధిస్తున్నాడు ప్రహ్లాదుడు. ఆ తీసుకున్న ఉదాహరణల్లో ఎంతో ఔచిత్యం ఉంది. తేనెటీగ, హంస, కోయిల, చకోరం - ఇవన్నీ పురుగులూ, పక్షులూను. వాటికి ఇష్టమైన ఆ వస్తువులు భౌతికమైనవి, అశాశ్వతమైనవి. అలాటి ప్రాణులకే అలాటి వస్తువులమీద అంత వదల్లేని అనుబంధం ఉంటే, ఇంక మనుషులకి, అందులోనూ అమృత ప్రాయమైన హరి చింతన వదిలిపెట్టడం సాధ్యమౌతుందా? సాధ్యమవదు అన్న జవాబు మళ్ళీ ఆ ఉదాహరణల్లోనే దొరుకుతుంది. మందారాల తేనె, గంగా ప్రవాహము, మావిడి చిగురు, వెన్నెల - వీటితో తుమ్మెద, హంస, కోయిల, చకోరాలకి ఉన్న సంబంధం అతి సహజమైనది. ప్రకృతి సిద్ధమైనది. వాటికి తెలియకుండానే పుట్టుకతో వచ్చింది. ప్రహ్లాదుని భక్తి కూడా అలాంటిదే! అందుకే దాన్ని వదులుకోడం అసాధ్యం!


పద్యం ఎత్తుకోడంతోనే అందమైన పదాలకూర్పుతో చదివేవాళ్ళ, వినేవాళ్ళ మనసులని వశం చేసుకోడం ఒక నేర్పు. ఈ పద్యంలో మరింత లోతైన కూర్పు నేర్పు కూడా చూపించాడు పోతన. ఇష్టమైన వస్తువులను ఎక్కువ పదాలతో వర్ణించి, ఇష్టపడని వస్తువులను ఒకటి రెండు పదాలతో చెప్పి ఊరుకున్నాడు. మదనములు - ఉమ్మెత్త చెట్లు. తరంగిణులు - సెలయేళ్ళు. కుటజములు - (వానాకాలంలో పూసే)కొండ మల్లె చెట్లు. సాంద్ర నీహారము - దట్టని మంచు. అయితే వీటిగురించి చెడు విశేషణాలేవీ వాడకపోవడం ఒక విశేషం. ప్రహ్లాదుడు దేనిగురించీ చెడ్డగా మాట్లాడే వాడు కాదు కదా!వాడిన క్రియలుకూడా చెప్పిన ప్రాణులకీ వస్తువులకీ ఉన్న గాఢమైన అనుబంధాన్ని చెప్పేవే - తేలు, తూగు, సొక్కు, స్ఫురితము (చుంబించబడిన).


అంతా చెప్పి చివరికన్న మాట చూడండీ! "అయినా నువ్వు గొప్ప గుణాలున్న శీలవంతుడివి. నీకు నేనింతగా చెప్పాలా!" ఇదేదో ప్రహ్లాదుడు గడుసుగా అన్న మాటలు కావు. అతనికి తండ్రి మీదున్న అచంచలమైన గౌరవమే!

ప్రహ్లాదుని భక్తి మాట అటుంచి, కనీసం అతని సౌశీల్యాన్నయినా ఆదర్శంగా తీసుకుంటే, పిల్లలు మంచి మనుషులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అది మనందరి చేతుల్లోనే ఉంది!

ఉల్లిపాయ

 ఉల్లిపాయతో  ఉపయోగాలు  - 


  *  సిగిరెట్లు , పాన్ పరాగ్ లు అధికంగా వాడటం వలన cancer లు వంటి వ్యాధులకు అద్బుతంగా విరుగుడుగా పనిచేస్తూంది . 


 *  పిల్లలు బాగా పుష్టిగా ఆరోగ్యంగా ఎదగడానికి నీరుల్లి బెల్లం కలిపి తినిపిస్తూ ఉండాలి.


 *  రాత్రి పూట నిద్రపట్టక అవస్తలు పడే వాళ్లు పచ్చి నీరుల్లి పాయల రసం 20 గ్రా , పంచదార 10 గ్రా కలుపుకుని పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే పైల్స్ వ్యాధులు ఆశ్చర్య కరంగా తగ్గుతాయి . 


 *  మేహా వాత నొప్పులు తో బాధపడే రోగులు ఆవాల నూనె , నీరుల్లిగడ్డ రసం సమాన బాగాలుగా కలిపి మర్దన చేస్తూ ఉంటే వాతనోప్పులు మాయం అయిపోతాయి . 


 *  కుక్క కరిచినప్పుడు వెంటనే ఉల్లిపాయని తేనేతో కలిపి మెత్తగా నూరి కాటు వేసినచోట పట్టువేస్తే విషం హరిస్తుంది .


 *  నీరస రోగంతో బాధపడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా 10 గ్రా నీరుల్లి రసం 10 గ్రా తేనే కలిపి తాగుతూ ఉంటే మంచిబలం , వీర్యవ్రుద్ది కలుగుతుంది.


 *  స్థనాల వాపు , పోట్లుతో  బాధ పడే స్త్రీలు ఒక నీరుల్లి గడ్డని కుమ్ములో పెట్టి ఉడికించి స్థనాల మీద వేసి కట్టుకడుతూ ఉండాలి. ఇలా రెండు మూడు సార్లు చేయగానే వాపు , పోటు పోతాయి .


 *  మూర్చ వచ్చినపుడు నీరుల్లి రసం 4 చుక్కలు  ముక్కులో వేసి నీరుల్లి రసాన్ని అరికాళ్ళకు మర్దన చేస్తే వెంటనే మూర్చ నుండి తేరుకుంటారు.


 *  కలరా సోకినపుడు వెంటనే 10 గ్రా నీరుల్లి రసం 10 గ్రా నిమ్మకాయ రసం కలిపి అందులో కొంచం పంచదార వేసి తాగుతూ ఉంటే చాలా తొందరగా కోలుకోవచ్చు . 


 *  వాంతులు విపరీతంగా అవుతుంటే నీరుల్లి గడ్డని చితగ్గొట్టి వాసన చుస్తూ ఉండాలి. 


 *  మూత్రాశయం లొ గాని , మూత్రపిండాల్లో గాని రాళ్లు ఏర్పడిన వాళ్లు ప్రతిరోజు నీరుల్లి రసం 10 గ్రా తీసుకుంటూ ఉంటే రాళ్లు కరిగిపోతాయి. బొట్టుబొట్టుగా పడే మూత్రవ్యాది కూడా పొతుంది.


 *  ముక్కునుండి చెడు నీరు , రక్తం ధారాపాతంగా కారుతూ భాద పడేవాళ్లు నీరుల్లి రసాన్ని రెండు ముక్కు రంద్రాల్లో రెండు చుక్కలు వేస్తే వెంటనే రక్తం , నీరు ఆగిపోతుంది . 


 *  తేలు కాటుకి నీరుల్లిపాయ రసాన్ని రుద్దితే వెంటనే విషం విరుగుతుంది. 


 *  చెవిపోటు వచ్చినపుడు నీరుల్లిపాయల రసం నువ్వుల నూనెలో కలిపి కొంచం గోరువెచ్చ చేసి గోరువెచ్చటి ద్రవాన్ని నాలుగు చుక్కలు చెవిలొ వేస్తే పోటు తగ్గును . 


 *  కంటి రోగాలు ఉన్నవాళ్ళు నీరుల్లిరసం తేనే సమబాగాలుగా కలిపి కళ్ళలో రెండు చుక్కలు వేస్తూ ఉంటే కంటి కలకలు , కంటి ఎరుపులు , కంటి మంటలు , కంటి శుక్లాలు హరించి పోతాయి . 


  గమనిక - నీరుల్లిని డైరెక్టుగా అతిగా వాడకూడదు శరీరంలో వేడిని పెంచుతుంది. నీరుల్లి మజ్జిగతో కలిపి మజ్జిగ అన్నంలో వాడటం మంచిది. 


 

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

డెంగ్యూ జ్వరం వచ్చినపుడు

 డెంగ్యూ జ్వరం వచ్చినపుడు ప్లేట్లెట్స్ సంఖ్య హఠాత్తుగా పడిపోతున్నప్పుడు  ఉపయోగించవలసిన అద్బుత యోగం  - 


    మొదట ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనే కరిగేలా చేసి దానిలో ఒకస్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి వెంటనే రోగికి తాగించాలి. కొంతసేపట్లో ప్లేట్లెట్ల సంఖ్య పెరగడం మొదలవుతుంది. ఒక గంట తరువాత ఒక పెద్ద గ్లాస్ నీటిలో ఒక బొప్పాయి ఆకు మొత్తం చిన్నచిన్న ముక్కలుగా చేసి పొయ్యి మీద పెట్టి అందులొ తాటిబెల్లం వేసి సగం గ్లాస్ కషాయం మిగిలేలా కాచి దానిని కూడా తాగించడం వలన వేగంగా ప్లేట్లెట్స్ సంఖ్య పెరిగి రోగి ప్రాణాయాపాయ స్థితి నుంచి బయటపడతాడు.


           ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034