🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*తృతీయ స్కంధము*
*జననంబందుటలేని యీశ్వరుఁడుదా జన్మించు టెల్లన్ విరో*
*ధి నిరాసార్థము వీతకర్ముఁ డగు నద్దేవుండు గర్మప్రవ*
*ర్తనుఁ డౌ టెల్లఁ జరాచరప్రకట భూతశ్రేణులన్ గర్మ వ*
*ర్తనులం జేయఁ దలంచి కాక కలవే దైత్యారికిం గర్మముల్.*
ఉద్ధవా! మనస్వామి వాసుదేవునకు పుట్టుక అనేదిలేదు. ఆయన అందరకు ఈశ్వరుడు. మఱి కృష్ణుడుగా పుట్టినాడు గదా! అంటావేమో. అది జగములకు పగవారైన దుష్టులను రూపుమాపటంకోసమే. అలాగే మనకులాగా ఆయనకు చేయవలసిన పనులేవీ లేవు. కానీ ఎన్నో కర్మములు చేస్తున్నాడు. అది ఎందుకంటే లోకాలలోని స్థావరములు, జంగమములూ అయిన ప్రాణులనందరినీ వారివారికి ఏర్పడిన క్రియలలో ఎలా మెలగాలో తెలియజేయటానికి మాత్రమే. రక్కసులను మట్టుపెట్టే మహాత్ములకు కర్మలంటూ ఉంటాయా?
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి