11, అక్టోబర్ 2024, శుక్రవారం

శుక్రవారం*🌹 🪷 *11, అక్టోబర్, 2024*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        🌹 *శుక్రవారం*🌹

🪷 *11, అక్టోబర్, 2024*🪷     

     *దృగ్గణిత పంచాంగం*                 


          *ఈనాటి పర్వం*

    🌹 *శ్రీ దుర్గాష్టమి*🌹    

    🪷 *మహానవమి* 🪷


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*


*తిథి : అష్టమి* మ 12.06 వరకు ఉపరి *నవమి*

*వారం : శుక్రవారం* ( భృగువాసరే )

*నక్షత్రం : ఉత్తరాషాఢ* పూర్తిగా రోజంతా రాత్రితో సహా


*యోగం*  : *సుకర్మ* రా 02.46 వరకు ఉపరి *ధృతి*

*కరణం : బవ* మ 12.06 *బాలువ* రా 11.37 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు*

*ఉ 06.00-08.00 & 09.30-10.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  :*రా 11.05 - 12.40*

అభిజిత్ కాలం  : *ప 11.30 - 12.18*


*వర్జ్యం : మ 01.36 - 03.11*

*దుర్ముహూర్తం : ఉ 08.21 - 09.08 మ 12.18 - 01.05*

*రాహు కాలం : ఉ 10.25 - 11.54*

గుళికకాళం : *ఉ 07.28 - 08.56*

యమగండం : *మ 02.51 - 04.20*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *ధనుస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 05.59* 

సూర్యాస్తమయం :*సా 05.49*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.59 - 08.21

సంగవ కాలం  :      *08.21 - 10.43*

మధ్యాహ్న కాలం:*10.43 - 01.05*

అపరాహ్న కాలం: *మ 01.05 - 03.27*

*ఆబ్ధికం తిధి : ఆశ్వీయుజ శుద్ధ నవమి*

సాయంకాలం  :  *సా 03.27 - 05.49*

ప్రదోష కాలం   :  *సా 05.49 - 08.15*

రాత్రి కాలం : *రా 08.15 - 11.30*

నిశీధి కాలం      :*రా 11.30 - 12.18*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.10*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*     


🪷 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🪷


*దారిద్ర్యార్ణవ మగ్నో - హం నిమగ్నో -హం రసాతలే /*

*మజ్జంతం మాం కరే ధృత్వా తూద్దర త్వం రమే ద్రుతమ్ //* 


🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷 🙏


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🪷🪷🌹🌷

🌹🍃🌿🌹🌹🌿🍃🌹

అభిజిత్ ముహూర్తం*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

      *అభిజిత్ ముహూర్తం*

    *గడ్డపలుగు ముహూర్తం*

🛐🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛐🛐

నక్షత్రాలు మొత్తం ఇరవై ఏడు. ఇవన్నీ దక్షప్రజాపతి కుమార్తెలు. దక్షుడు ఈ నక్షత్ర కన్యలను చంద్రుడికిచ్చి పెళ్లిచేశాడు. చంద్రుడు తన భార్యలందరిలోకి రోహిణి మీద ఎక్కువ అనురాగాన్ని పెంచుకొని ఆమెతోనే ఎక్కువకాలం గడుపుతుండేవాడు. ఓసారి వసంత రుతువులో చంద్రుడు ఒక్క రోహిణి దగ్గరే ఉంటూ మిగతా నక్షత్రాలను నిర్లక్ష్యం చేశాడు. దాంతో మిగిలిన నక్షత్రాలు కొంత ఊరుకున్నా శ్రవణా నక్షత్రం మాత్రం సహనాన్ని కోల్పోయింది. ఓపిక పట్టలేక తన నుంచి తనలాగే ఉండే ఒక ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి విషయాన్ని గురించి తన తండ్రికి చెప్పేందుకు వెళ్లింది. ఆ శ్రవణా నక్షత్రపు ఛాయ ఒక నక్షత్రమైంది. దానిపేరు అభిజిత్తు.


అలా ఇరవైఏడు నక్షత్రాలే కాక అభిజిత్తు అనే ఇరవై ఎనిమిదో నక్షత్రం ఏర్పడింది. ఆ తర్వాత కాలాలలో శ్రవణం చెప్పిన విషయాన్ని దక్షుడు వినటం, ఒకటికి రెండుసార్లు ఆయన చంద్రుడిని హెచ్చరించినా చంద్రుడు వినకపోయేసరికి ఆయన శపించటం ఇవన్నీ జరిగాయి. అయినా అభిజిత్తు మాత్రం ఓ పవిత్రమైన స్థానాన్నే పొందింది.


అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్ళలో "గడ్డపలుగు" ముహూర్తం అని అంటారు. గడ్డపలుగు భూమిలో పాతిన దాని నీడ మాయమయ్యే మిట్ట మధ్యాన్న సమయాన్ని అభిజిత్ ముహూర్తంగా, మంచి ముహూర్తంగా నిర్ణయించారు. పూర్వకాలంలో బ్రాహ్మణులు పంచాంగం చూడటం రాని పల్లె ప్రజలకు ఎటువంటి గందరగోళం లేకుండా స్ధూలమైన మంచి ముహూర్తం ఈ విధంగా ఎన్నుకోవచ్చని తెలియజేశారు. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమకేంద్రంలో ఉంటాడని ఈ యోగం ముహూర్తంలోని చాలా దోషాలను పోగొడుతుందని తెలియజేసేవారు.


అభిజిత్తు అంటే మధ్యాహ్నం 11-45నుండి 12-30వరకు ఉన్న సమయాన్ని అభిజిత్ ముహూర్తం అని, సూర్యోదయం నుండి లేదా సూర్యాస్తమయం నుండి ఎనిమిదవ ముహూర్తం అభిజిత్ ముహూర్తం అంటారు. పగటి భాగం లో ఎనిమిదవ ముహూర్తం ఇది .దీనికే ‘’విజయ ముహూర్తం ‘’అంటారు. ఈ అభిజిత్ ముహూర్తం లోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. ఇదే ముహూర్తం లో దేవతలు సముద్ర మధనం మొదలు పెట్టారు. ఈ శుభ ముహూర్తం లోనే దేవరాజు ఇంద్రుడు దేవ సింహాసనం అధిరోహించాడు. శ్రీరాముడు జన్మించినది, సీతారాముల కల్యాణం, భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టింది . ఇన్ని మంచి పనులు ఈ గొప్ప ముహూర్తం లో జరిగాయి.


లోకాస్సమస్తా సుఖినోభవంత్ .

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఆత్మ స్వచ్ఛత

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

         *ఆత్మ స్వచ్ఛత*

🛐🛐🛐🛐🔯🔯🔯🔯🛐

*మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ ధ్యానం చేసేటపుడు వందలకొద్దీ పక్షులు ఆయన సమీపంలోను, ఆయన మీద వాలుతూ, తుల్లుతూ ఆడుకుంటూ ఉండేవి.... ఆయన యొక్క ఆత్మ స్వచ్ఛత ....పక్షులు, ఉడుతలు లాంటి జీవులను ఆయనవైపుకు ఆకర్షించేది.*


*ఒకరోజు ఒక చిన్న బాలుడు ఆయన దగ్గరకొచ్చి తాతగారూ....నాకు ఒక పక్షిని పట్టి ఇవ్వండి...అని కోరాడు. అందుకు ఆయన" ఉండు నాయనా....నేను ధ్యానం చేసే సమయంలో చాలా పక్షులు వస్తాయి....అప్పుడు నీకొక పక్షిని పట్టిస్తాను అని చెప్పి....ధ్యానానికి వెళ్ళాడు. ఆశ్చర్యంగా ఒక పక్షి కూడా ఆయన దగ్గర వాలలేదు....ఆ రోజు నుండీ... ఏ పక్షీ ఆయన సమీపంలో వాలకపోవడం గమనించిన ఆయన ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాడు.*


*మనచుట్టూ ఉన్న ప్రకృతికి మనం అనుసంధానం కావాలంటే.....ఆ ప్రకృతి కల్మషం లేకుండా ఎలా స్వచ్చంగా ఉంటుందో...మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీ స్థాయికి ఆత్మ స్వచ్ఛత కల్గి ఉండాలి. ఆయన స్వచంగా ఉన్నంత కాలం పక్షులు  ఆయన సమీపంలోకి వచ్చాయి.... ఎప్పుడైతే పక్షిని పట్టుకోవాలన్న ఒక చిన్న కల్మషం మనసులో పుట్టిందో.... ఆ రోజునుండీ ఆయన ప్రకృతి నుండీ అనుసంధానం తొలగించబడ్డాడు. అందుకే ...ఒక్క పక్షీ ఆయన చెంతకు రాలేదు.*


*మిత్రులారా....సృష్టిలో.. అత్యంత శక్తివంతమైనది ఏమిటంటే.... స్వచ్ఛత. స్వచ్ఛతకు శక్తి ఎక్కువ. మనం మన హృదయాలను దివ్యత్వపు ఆలయాలుగా మార్చుకోవడమే స్వచ్ఛతను పొందే మార్గం. మనం ఆత్మ స్వచ్ఛతను పొందిన క్షణం....ఈ సమస్త ప్రకృతిలోని ఎన్నో రహస్యాలు అవగతం అవుతాయి.మనం ప్రకృతితో స్నేహం చెయ్యాలంటే....దాని స్థాయికి చేరుకోగల్గాలి.*


*నీవు నీలో దేన్ని కల్గి ఉంటావో....దానినే బయట చూడగలవు.*


*ఓం శ్రీ గురుభ్యోనమః॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

హైందవం వర్ధిల్లాలి 27*

 *హైందవం వర్ధిల్లాలి 27*


సభ్యులకు నమస్కారములు.


*మహిళా గౌరవం, ఆశ్లీలతలకు  తావివ్వని విధంగా సముచిత, సమున్నత స్థానం స్త్రీల కివ్వాలి, గౌరవించాలి* 

ii):- ఇటీవలి కాలంలో అనగా ఒక దశాబ్ద కాలంగా ప్రజలు నాల్గవ తరగతి ఉద్యోగస్తులు మొదలుకొని  ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు ఆంగ్ల మాధ్యమం గల పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. నేటి బాల బాలికలపై అమ్మ, నాన్న మరియు ఇతర పెద్దల పెంపకం కంటే ఆంగ్ల విద్యా ప్రభావం ఎక్కువగా గోచరిస్తున్నది. నాల్గవ తరగతిలో ప్రవేశించగానే పిల్లలు *అమ్మా యు డోంట్ నో, నానమ్మ యు డోంట్ నో, అమ్మమ్మ యు డోంట్ నో*  అను పదాలను ప్రయోగిస్తున్నారు. పిల్లల ఈ వైఖరి నగర ప్రాంతాలలోనే గాకుండా LKG UKG, Primary తరగతులున్న అన్ని ప్రాంతాలలో దృశ్యమగుచున్నది.


బాల్యం వరకు బాగానే ఉంటుంది జీవితం. బాల బాలికల స్థాయి నుండి యువతి యువకుల స్థాయి వరకు ఎదిగిన తదుపరి వారి భావి జీవితంపై మంచి చెడుల ప్రభావం ఉంటుంది. గత వ్యాసాలలో తెలుసుకున్నట్లుగా  ప్రస్తుత సాంస్కృతిక, సంప్రదాయాల సమ్మేళనం వలన మిశ్రమ జీవన  పద్ధతులు, యువతీ యువకుల మనో బుద్ధులలో తిష్ట వేసుకున్నందున *అధిక యువతరం*  బరువు బాధ్యతలకంటే *విలాస, విషయ (ఇంద్రియ, రూప రసాదులు),  సుఖలాలసల ధోరణికే మ్రొగ్గు చూపుతున్నారు. కాలమేదైనా, పరిస్థితులు ఏవైనా బాధ్యతా రాహిత్య జీవితము నష్టదాయకమే గాకుండా గర్హనీయము మరియు ఇతరులకు ఏహ్యభావము,  తక్కువ భావము కలిగిస్తుంది కూడా*  


యువతలో కొన్ని తప్పు దారులు గమనిద్దాము. *విచ్చలవిడి ప్రవర్తనలు, ఒకరి ఫోన్ నంబర్ లు  ఇంకొకరు తీసుకోవడం, అశ్లీల  వీడియో (Porno Videos), అశ్లీల చిత్రాలు (ఫోటోలు), సెలవు వచ్చిందంటే  క్లాసెస్ ఉన్నాయనో, కంబైన్డ్ స్టడీ పేరుపై ఇంటి బయట గడపడం, హోటళ్ళు, పబ్లు, ఫామ్ హౌజ్ లలో హద్దుమీరిన ఖర్చులు,  ప్రవర్తన ఇందులో మరింత విపరీత వైఖరి....చేసే తప్పులను కొండంతలుగా వర్ణిస్తూ మిత్రుల మధ్య వెలిగిపోవాలనే తపన, దాంతో బాటు సెల్ఫీలు ,Videos, likes, comments  కొరకు తాపత్రయాలు*.   వాస్తవానికి ఇవన్నీ వారి వారి గౌరవాన్ని తగ్గించేవే కాక ఆరోగ్యం రూపుమాపు చర్యలే తప్ప *పెద్దలు మరియు చట్టం అంగీకరించనివి*


తల్లి తండ్రులు ఇతర పెద్దలు తమ సంతానానికి చిన్నప్పటి నుండే సరైన మార్గాలు సూచించాలి.  అసభ్య మార్గాలకు దూరంగా ఉంచాలి. ఇంటి పనులు నేర్పాలి. ఇందువల్ల *కష్టించే తీరు, కుటుంబ సభ్యులందరితో ఆత్మీయత, బాధ్యత* ఒకరికోసం మరొకరు సహకరించడం అనేది నేర్పాలి. *"మనము"  "మన" అనే ఆత్మీయత ప్రేమ అనుబంధం పెరుగుతుంది, బాధ్యతలు తెలుస్తాయి. డబ్బు విలువ తెలియజెప్పాలి.  యువతీ యువకులలో వర్తమానాన్ని, కాల నియమాన్ని  సరిగా వినియోగించుకోవాల్సిన ఆలోచనలను తీరును పెంచాలి. లేకుంటే సంతానం యొక్క భవిష్యత్తుకు ఇబ్బందులు తప్పవు. తప్పు మార్గాన నడిచే వ్యక్తులకు సమాజంలో గౌరవం దక్కదు*. 


గౌరవం అనేది స్నేహాలను, సంబంధాలను కలిపి ఉంచే ప్రధాన  మాధ్యమము.  గౌరవింపబడాలంటే ప్రతి పౌరుడు, వ్యక్తి ప్రవర్తనలో ఉత్తమ నియమాలు, తల్లి దండ్రుల పట్ల పెద్దల పట్ల, దైవంపట్ల భక్తి, చిన్న వారి పట్ల ఆప్యాయత, పండుగలు సంప్రదాయాల ఆచరణలు కల్గి ఉండాలి. *సమాజం అనేది సామాజిక సంబంధాల అల్లిక, ఒక కూర్పు. "ఒకరి కొరకు ఒకరు" అను భావజాలంతో కూడుకొని ఉన్నదే సమాజము*. గతంలో హిందూ ధర్మాలను, సంప్రదాయాలను  "తు" "చ" తప్పకుండా అనుసరించే వారు కావున గౌరవాలకు కొదవ ఉండేదికాదు, గౌరవం, ప్రేమ పుష్కలంగా ఇచ్చేవారు,  పొందేవారు కూడా. *కావున మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు/వ్యక్తీ కంకణం కట్టుకోవాలి*. గతంలో లాగే స్త్రీలతో సహా అందరూ పేరు ప్రతిష్ఠలు, గౌరవం పొందాలి.


ధన్యవాదములు

*(సశేషం)*

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం  -  అష్టమి - ఉత్తరాషాఢ -‌‌ భృగు వాసరే* (11.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

దుర్గామాతకి

 శ్లోకం:☝️

*దుర్గాయై దుర్గపారాయై*

 *సారాయై సర్వకారిణ్యై |*

*ఖ్యాత్యై తథైవ కృష్ణాయై*

 *ధూమ్రాయై సతతం నమః ||*


భావం: దుర్గమమైన కష్టాలను దాటించేది, అన్నిటికి సారమైనది, అంతటికి కారణభూతురాలు అయినది, సుప్రసిద్ధమైనది, నీలము లేక నల్లని పొగ వర్ణములో ప్రకాశిస్తున్న దుర్గామాతకి నమస్కారములు.🙏

Adi Nuvve అది నువ్వె