🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఆత్మ స్వచ్ఛత*
🛐🛐🛐🛐🔯🔯🔯🔯🛐
*మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ ధ్యానం చేసేటపుడు వందలకొద్దీ పక్షులు ఆయన సమీపంలోను, ఆయన మీద వాలుతూ, తుల్లుతూ ఆడుకుంటూ ఉండేవి.... ఆయన యొక్క ఆత్మ స్వచ్ఛత ....పక్షులు, ఉడుతలు లాంటి జీవులను ఆయనవైపుకు ఆకర్షించేది.*
*ఒకరోజు ఒక చిన్న బాలుడు ఆయన దగ్గరకొచ్చి తాతగారూ....నాకు ఒక పక్షిని పట్టి ఇవ్వండి...అని కోరాడు. అందుకు ఆయన" ఉండు నాయనా....నేను ధ్యానం చేసే సమయంలో చాలా పక్షులు వస్తాయి....అప్పుడు నీకొక పక్షిని పట్టిస్తాను అని చెప్పి....ధ్యానానికి వెళ్ళాడు. ఆశ్చర్యంగా ఒక పక్షి కూడా ఆయన దగ్గర వాలలేదు....ఆ రోజు నుండీ... ఏ పక్షీ ఆయన సమీపంలో వాలకపోవడం గమనించిన ఆయన ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాడు.*
*మనచుట్టూ ఉన్న ప్రకృతికి మనం అనుసంధానం కావాలంటే.....ఆ ప్రకృతి కల్మషం లేకుండా ఎలా స్వచ్చంగా ఉంటుందో...మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీ స్థాయికి ఆత్మ స్వచ్ఛత కల్గి ఉండాలి. ఆయన స్వచంగా ఉన్నంత కాలం పక్షులు ఆయన సమీపంలోకి వచ్చాయి.... ఎప్పుడైతే పక్షిని పట్టుకోవాలన్న ఒక చిన్న కల్మషం మనసులో పుట్టిందో.... ఆ రోజునుండీ ఆయన ప్రకృతి నుండీ అనుసంధానం తొలగించబడ్డాడు. అందుకే ...ఒక్క పక్షీ ఆయన చెంతకు రాలేదు.*
*మిత్రులారా....సృష్టిలో.. అత్యంత శక్తివంతమైనది ఏమిటంటే.... స్వచ్ఛత. స్వచ్ఛతకు శక్తి ఎక్కువ. మనం మన హృదయాలను దివ్యత్వపు ఆలయాలుగా మార్చుకోవడమే స్వచ్ఛతను పొందే మార్గం. మనం ఆత్మ స్వచ్ఛతను పొందిన క్షణం....ఈ సమస్త ప్రకృతిలోని ఎన్నో రహస్యాలు అవగతం అవుతాయి.మనం ప్రకృతితో స్నేహం చెయ్యాలంటే....దాని స్థాయికి చేరుకోగల్గాలి.*
*నీవు నీలో దేన్ని కల్గి ఉంటావో....దానినే బయట చూడగలవు.*
*ఓం శ్రీ గురుభ్యోనమః॥*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి