శృంగేరి క్యాలెండర్ కోసం
https://drive.google.com/file/d/1UQlukxHnUQ1UNdq2qW5DZI-cK2CVjFP9/view?usp=drivesdk
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
శృంగేరి క్యాలెండర్ కోసం
https://drive.google.com/file/d/1UQlukxHnUQ1UNdq2qW5DZI-cK2CVjFP9/view?usp=drivesdk
శుక్రుడు : -
భృగు ప్రజాపతికిని ఉషనలకు మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి రోజున
"ఉశనుడు" జన్మించెను. కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెను. పరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము రూపమున విసర్జింపబడెను కనుక అతడిని "శుక్రుడు" అనెదరు. అత్యంత మహా మంత్ర శక్తిని పోందినవాడు. శుక్రుడిని రాక్షసులు వారి గురువుగా పొందిరి నాటి నుండి "శుక్రచార్యునిగా" పెరుపొందెను. గ్రహమండలమున స్థానంపొందెను. భృగుపుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీగ్రహం. రుచులలో పులుపుకు ప్రతీక, తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు. జాతి -బ్రాహణ, అధి దేవత - ఇంద్రాణి. ఏడు సంవత్సరాల వయసును సూచిస్తాడు. మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. శ్లేష్మ, వాత ప్రకృతిని సూచిస్తాడు. తత్వము - జలతత్వం, దిక్కు -ఆగ్నేయము, రత్నము - వజ్రము, లోహము -వెండి, ఋతువు -వసంతం, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము - రజోగుణము, ప్రదేశం - కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థ. వృషభం, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. రవి, చంద్రులు శత్రువులు. శని, బుధులు మిత్రులు. కుజుడు, గురువులు సములు. శుక్ర దశా కాలం ఇరవై సంవత్సరాలు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.శుక్రుడు (ఆంగ్లంలో వీనస్) సౌరమండలము లోని ఒక గ్రహం, సూర్యునికి దగ్గరలో ఉన్న రెండవ గ్రహం. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల గ్రహాల్లోకెల్లా అత్యంత వేడిని కలిగియున్న గ్రహం ఇది. అంతే కాకుండా అష్టగ్రహాల్లోకెల్లా అత్యంత ప్రకాశవంతమైంది కూడా. దీనికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం 224.7 భూదినములు. రాత్రివేళ చంద్రుడి తరువాత మనకంటికి మెరుస్తూ కనబడే గ్రహం. దీనికి ఉదయతార అని సంధ్యాతార అని కూడా వ్యవహరిస్తారు. దీనికి ఉపగ్రహాలు లేవు. శుక్రుడు, భూమి అనేక విషయాలలో సారూప్యత కలిగిన కారణంగా వీటికి "సోదర గ్రహాలు" అని కూడా అంటారు. గర్భాశయ వ్యాధులు, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాధులు మొదలైన వాటికి కారకుడు. కుజుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు వాపు మొదలైనవి కలుగుతాయి. బుధుడితో కలిసిన నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం, శనితో కలిసిన సుఖ వ్యాధులు, రాహువుతో కలిసిన గర్భ సంబంధిత వ్యాధులు, కేతువుతో కలిసిన సంతాన లేమి మొదలైన వ్యాధులు కలుగుతాయి.
శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందరశరీరం కలిగిన వాడు, సుఖజీవి, చిరంజీవి ఔతడు. శుక్రుడు ద్వితీయస్థానమున ఉన్న బహువిధములుగా సంపదలు కలవాడు, కవి ఔతాడు. తృతీయముస్థానమున శుకృడు ఉన్న జాతకుడు భార్యాహీనుడు, కష్టవంతుడు, బీదవాడు, దుఃఖవంతుడు, అపకీత్రి కలవాడు ఔతాడు. చతుర్ధస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు వానములు కలవాడు, మంచిగృహం కలవాడు, నగలు, వస్త్రములు, సుగంధద్రవ్యములు కలవాడు ఔతాడు. పంచమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు అపారధనవంతుడు, ఇతరులను రక్షించు వాడు, బహుమేధావి, పుత్రులు కలవాడు ఔతాడు. షష్టమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు శతృవులు లేని వాడు, ధనమును లేని వాడు, యువతుల చేత వంచింపబడిన వాడు, విచారగ్రస్తుడు ఔతాడు. సప్తమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు మంచి కళత్రం ఉన్న వాడు, పరస్త్రీ ఆసక్తుడు, కళత్రం లేని వాడు, ధనవంతుడు ఔతాడు. అష్టమ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు చిరంజీవి, ధనవంతుడు, రాజు ఔతాడు. నవమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు భార్యాబిడ్డలు, సంతానం, ఆప్తులు కలిగి రాజాశ్రయం కలిగి అభివృద్ధి చెందుతూ ఉంటాడు. దశమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగినవాడు, మిత్రులు కలిగిన వాడు, ప్రభువు ఔతాడు. ఏకాదశ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడు, బహు సుఖవంతుడు ఔతాడు. ద్వాదశము స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతుడు, ధనవంతుడూ ఔతాడు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557
🙏🚩🕉పురోహితుడు అంటే ఎవరు🕉🚩🙏
శ్లో:జన్మనా జాయతే శూద్రః
సంస్కారద్వ్దిజ ఉచ్యతే౹
విద్యయా యాతి విప్రత్వం
త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే౹౹
🦢పుట్టుకతో శూద్రుడు, ఉపనయన కాలంలో ద్విజుడు,విద్యాభ్యాసంలో విప్రుడు, ఈ మూడింటితో అతడు శ్రోత్రియుడు అగును🦋
👉పురోహితుడు అనగా:ముందుగా హితము పలికెడివాడు
👉పురోహితుడు అనగా:ధర్మార్థ కామమోక్షములకు సోపానము
👉పురోహితుడు అనగా:పూజనీయుడు
👉పురోహితుడు అనగా:సహృదయతకు, మృదుభాషనకు, మధురానుభూతికి మారుపేరు
👉పురోహితుడు అనగా:నిత్య కర్మానుష్ఠానము ఒనర్చు ఒక తపస్వి
👉పురోహితుడు అనగా:ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు
👉పురోహితుడు అనగా:హైందవ సాంప్రదాయానికి రక్షణ కవచం
👉పురోహితుడు అనగా:సాదారణమైన పేరు వశిష్ఠుడు
👉పురోహితుడు అనగా:మానసిక వ్యాధిని ఛేదించె సైకాలజీ, ఒక హిప్నాటిస్ట్
👉పురోహితుడు అనగా:ఆత్మస్థైర్యమును, నమ్మకమును కలిగించె, బాధలను తొలగించె పిలాసపీ, ఒక మెజీషియన్
👉పురోహితుడు అనగా:సందేహ నివృత్తికి ఒక నిఘంటువు
👉పురోహితుడు అనగా:తాను ఉద్దరింపబడుచు, ఇతరులను ఉద్ధరింపజేయు జ్ఞాన దీపిక
👉పురోహితుడు అనగా:భగవంతునికి భక్తునికి మద్య ఒక వారధి
👉పురోహితుడు అనగా:భూత భవిషత్వర్తమాన కాలముల సూచిక
👉పురోహితుడు అనగా:శుభాశుభ కార్యములను ఆరాధించు సమదర్శి
👉పురోహితుడు అనగా:నిత్య కాల గణన చేయు గణిత వేత్త
👉పురోహితుడు అనగా:గోసంపద, వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించు యజ్ఞమూర్తి
👉పురోహితుడు అనగా:పర్యావరణ పరిరక్షణలో వృక్ష ప్రతిష్టకు మొదటి ప్రతినిధి
(జన్మ నక్షత్ర వృక్షాలు, యజ్ఞసమిదల వృక్షాలు, ఫలపుష్పాది వృక్షాలు, ఓషధివృక్షాలు మొదలగువాటిని ప్రతిష్టించి, పెంచి, పోషించుమని ప్రోత్సహించువాడు)
👉పురోహితుడు అనగా:ధర్మ శాస్త్ర ప్రియుడు
🌹🌿🍇పురోహితము🍇🌿🌹
పు ,అనగా పురజనులందరికి
రో ,అనగా రోజురోజుకి
హి ,అనగా హితముచెప్పుచు
త ,అనగా తరింపజేసి
ము ,అనగా ముదముగూర్చునది🔥🥥🍁🦢🚩
పరిహారాలు పని చేస్తాయా లేదా!
పరిహారాలు నిజంగా పని చేస్తాయా లేదా అనే విషయానికి వస్తే పని చేస్తాయని చెప్పవచ్చు. ఎవ్వరికీ పని చేస్తాయి అనే విషయానికి వస్తే 360 డిగ్రీల రాశి చక్రములో వుండే 12 భావాలు, ఈ 12 భావాలలో ఏ భావాలతో సిగ్నిఫీకేసన్స్ వుంటే పరిహారాలు పని చేస్తాయి అనే విషయము గురించి చాలా స్పష్టమైన అవగాహన వుండాలి.అంటే ఈ పరిహారాలు పని చేస్తాయా లేదా అనే ఖచ్చితమైన విషయనికి వస్తే, రాశి చక్రములోని లగ్నాని బట్టి, గ్రహాల యెక్క స్థితి గతులను బట్టి, అలాగే గ్రహాల యెక్క డిగ్రీలను బట్టి పరిహారాలు నిజంగా పని చేస్తాయా లేదా అని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు.
మరి ఎవ్వరికీ పని చేస్తాయి?
రాశి చక్రములో 1 నుండి 12 స్థానాలను ధర్మ, అర్థ, కామ, మోక్ష స్థానాలుగా 4 భాగాలుగా చేశారు. వీటిని చతుర్విది పురషార్దములు అంటారు.
1, 5, 9 – ధర్మ స్థానాలు
2, 6, 10 – అర్థ స్థానాలు
3, 7, 11 – కామ స్థానాలు
4, 8, 12 – మోక్ష స్థానాలు
వీటిలో 1,5,9 – ధర్మ స్థానాలతోటి సిగ్నిఫికేసన్స్ వున్నప్పుడు మాత్రమే పరిహారాలు పని చేస్తాయి.
మరి ఏ విదంగా సిగ్నిఫికేసన్స్ వుండాలి?
ఈ 1,5,9 – ధర్మ స్థానాలకు చెందిన అధిపతులతోటి మరియు నక్షత్రాదిపతులతోటి తప్పనిసరిగా 1,4,7,10 స్థానాలతోటి అలాగే 3,6,9,12 స్థానాలతోటి అలాగే 11 వ స్థానముతోటి సిగ్నిఫికేసన్స్ వున్నప్పుడు మాత్రమే పరిహారాలు ఖచ్చితంగా పని చేస్తాయి.
ఈ స్థానాలతోటి మాత్రమే ఎందుకు సిగ్నిఫికేసన్స్ వుండాలి అంటే –
1, 4, 7, 10 – బౌతిక స్థాయి ( Physical )
2, 5, 8, 11 – మానసిక స్థాయి ( Mental )
3, 6, 9, 12 – ఆద్యాత్మిక స్థాయి ( Spiritual )
ఇక్కడ 1, 4, 7, 10 – బౌతిక స్థాయి గురించి, 3, 6, 9, 12 – ఆద్యాత్మిక స్థాయి గురించి తెలియజేస్తునాయి. అలాగే మానసిక స్థాయికి చెందినా 11 వ స్థానాన్ని తీసుకున్నాము, ఈ స్థానము లాభాలు గురించి అలాగే స్నేహ బంధము గురించి తెలియజేస్తుంది.కావున ఈ స్థానాలతోటి సిగ్నిఫికేసన్స్ వున్నప్పుడు మాత్రమే పరిహారాలు పని చేస్తాయని ఏ మాత్రమూ సందేహము లేకుండా చెప్పగలను.
ఈ విదంగా సిగ్నిఫికేసన్స్ అందరి జాతకాలలో వుండవు. కేవలము వందలో 50 శాతము జాతకలలో మాత్రమే ఈ సిగ్నిఫికేసన్స్ఉంటాయి. మిగత వారికీ పరిహారాలు కేవలము మానసికంగా మనశాంతిని మాత్రమే ఇస్తాయి. ఈ మనశాంతికి సంకల్ప బలము వుంటే పరిహారాలు ఖచ్చితంగా పని చేస్తాయి.
🙏🙏🙏
😇అసలీ జనవరి 1 నూతన సంవత్సర కథ ఏంటో? తెలుసుకుందాం🤔
నాకు చాలా మంది మిత్రులు జనవరి ఒకటిన "విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ " అని అభిమానంగా, సంతోషంగా చెబుతారు. అది వారి ప్రేమకు తార్కాణం.
ఇలా విషెస్ చెప్పే వారిది ఏ తప్పూ లేదు. ఎందుకంటే మనకెవ్వరికీ జనవరి ప్రారంభం న్యూ ఇయర్ కాదని తెలియదు.
ఇక ఎంజాయ్ ఎంజాయ్ అని త్రాగి
తిరిగే వాళ్ల కథ వేరే విషయం.
. ఇక పై ప్రశ్నలకు సమాధానం చూద్దాం.
ఇప్పుడు మనం అనుసరించే క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్. ఇదంతా తప్పులతడక, లోపాల పుడక.క్రీశ 1582 లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన క్యాలెండర్ ఇది.ఈ క్యాలెండర్ ప్రకారం మనం యదార్థ సంవత్సరం కంటే 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నాము. ఆప్రకారం 3,513. సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త JOHN VERSHAL. ఈ లోపాన్ని సవరించటానికి ఒక ఉపాయం చెప్పాడు. అదేంటంటే, క్రీశ 4,000 సంవత్సరంను లీప్ ఇయర్ గా లెక్కించకుండా వదిలేయడం.
ఈ క్యాలెండర్ లోని లోపాలను సరిచేయడం అవసరమని సూచనలు చేస్తూ "నానాజాతిసమితి" ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ 185 రకాల ప్లాన్లను పరిశీలించి, క్రీశ 1926 లో ఒక రిపోర్టు ఇచ్చింది.
ఇప్పటి దాకా అది ఎటూ తేలలేదు లెండి.
ఇంకా ఇలాంటి చిన్నచిన్న చిక్కులు చాలానే ఉన్నాయి. మంచిది...
ప్రపంచమంతా ఒకప్పుడు నూతన సంవత్సరం ఉగాదినాడు ప్రారంభమయ్యేది.
బైబిల్ లోని ""ఎజ్రా "" పుస్తకం 10:17 వ వచనం సంవత్సరం లోని మొదటి నెల మార్చి - ఏప్రిల్ లో ప్రారంభమౌతుందని సాక్ష్యం పలుకుతోంది.
ఫ్రాన్స్ లో క్రీశ 1582 వరకూ, ఇంగ్లాండులో క్రీశ 1752 వరకూ నూతన సంవత్సరం మార్చి 25 న ప్రారంభం అయ్యేదని చరిత్ర చెబుతూంది.
అయితే, కాలగమనంలో ఇది ఎప్పుడు మారిందో తెలియదు కానీ, అది ఏప్రిల్ కు మారింది. అయితే నూతన సంవత్సరం మార్చి లో ఉంచాలా, ఏప్రెల్ లో ఉంచాలా అనేది వారికి కొంత సమస్యగా మారింది. సంవత్సరం ఆరంభం ఎప్పుడూ ఒకే నెలలో ఒకే తేదీన వస్తే బాగుంటుంది అని వారు ఆలోచించసాగారు. ఆ సమయం లో క్రీశ 15 శతాబ్ది చివరి కాలంలో ఫ్రాన్స్ చక్రవర్తి " చార్లెస్ "అంతవరకూ 11 వ నెలగా ఉన్న జనవరి ని ఒకటవ నెలగా నూతన సంవత్సరం గా ప్రారంభించాడు.ఈ విధంగా నేటి మన నూతన సంవత్సరం ప్రారంభమైంది.
ఇందుకు ఎలాంటి శాస్త్రీయ, ప్రకృతి పరమైన, ఆధారమూ లేదు.
ముందుగా ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగీసు, స్పెయిన్ దీనిని అంగీకరించాయి.
క్రీశ 1699 లో జర్మనీ, క్రీశ 1752లో ఇంగ్లండు, క్రీశ 1873 లో జపాన్, క్రీశ 1912 లో చైనా, క్రీశ 1916 లో బల్గేరియా, క్రీశ 1918 లో రష్యా లు ఈ క్యాలెండర్ ను అంగీకరించాయి.
17,18 శతాబ్దంలో తమ ఆధీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిషు వాడు దీన్ని ప్రవేశపెట్టాడు.
కానీ భారతీయ క్యాలెండర్ ఋషులచే తయారుచేయబడింది.
ఆర్యభట్టు, భాస్కరాచార్య వంటి మహా శాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది. కొన్నివేల సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరం లో, ఏ నెలలో, ఏ రోజున ఏ గ్రహణం వస్తుందో, వారం వర్జ్యము తో సహా చెప్పగలిగేంతగా శోధించబడింది.
ప్రకృతి కి అనుగుణంగా, వసంత ఋతువు చైత్రశుద్ధ పాఢ్యమి రోజున ఉగాది ప్రారంభ మవుతుంది. (కొన్నిచోట్ల వసంత ఋతువు మేశరాశి లో సూర్యుడు ప్రవేశించటాన్ని ఉగాదిగా చేస్తారు.)
ప్రపంచమంతా మొదటి నుంచీ అనుసరిస్తున్న ఉగాదిని కాదని, వాడెవడో ఫ్రాన్స్ వాడు ఏ ఆధారమూ లేకుండా ప్రతిపాదించిన నూతన సంవత్సరం ను ఫాలో అవడం కంటే, ఆత్మాభిమానం కలిగి భారతీయుల మందరమూ మన సాంప్రదాయక ఉగాది నూతన సంవత్సరం ను ఫాలో కావటం ఉత్తమము మరియు మన కర్తవ్యము.
ఏ లోపాలు లేని మన కాలమానం గొప్పతనాన్ని ప్రచారం చేయటమే మన తక్షణ కర్తవ్యం.🙏
బృహస్పతి :
సురూప ఆంగీరసులకు "బృహస్పతి" సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ద ద్వాదశి నాడు జన్మించెను.ఇతని భార్య "తారాదేవి" బృహస్పతి దేవతలకు గురువుని కావున ఇతడిని
"గురుడు" అంటారు.
గురుడు : దేశ త్యాగం , విత్తం లాభం అనర్ధం ధన నాశనం
సంపద , క్లేశం , ఆరోగ్యం , ధన హానిం ,ధనాగమం
పీడనం లాభ నష్టంచా క్రమేణ కురుతే గురుః
తాత్పర్యము : గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయములో 1 దేశ త్యాగము 2 ధన లాభము 3 కార్య హాని 4 ధన నాశనము 5 సంపద 6 దుఃఖము 7 ఆరోగ్యము 8 ధన హాని 9 ధనాగమము 10 ఆయాసము 11 లాభములను 12 నష్టములను కల్గించు చున్నాడు. బృహస్పతి హిందూ మతంలో ఒక దేవుడు. వేదములు మరియు 64 కళలలో దిట్ట. ఎన్నో త్యాగాలకొనర్చి దేవతల యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ, అసురుల యజ్ఞయాగాదులకు విఘ్నాలను ఏర్పరుస్తూ, దేవతలకు శిక్షణ, రక్షణ ని అందిస్తూ, వారిని పోషిస్తూ ఉంటాడు. అందుకే దేవతలకు బృహస్పతి గురువు మరియు పురోహితుడు. గురువారం (లక్ష్మీవారం) బృహస్పతిని స్మరిస్తూ నామకరణం చేయబడినది. మానవుల ప్రవర్తనను నిర్ధారించే నవగ్రహాలలో బృహస్పతి (గురు గ్రహం) ఒకడుకొన్ని వేదము ఋక్కులలో బృహస్పతి అగ్ని అని భావించారు. ఇతడు యజమానులకు పురోధ (పౌరోహితుడు). దేవతలకు గురువు.ఋషి.సప్తఋషులలో ఒకడుగు అంగిరునకు బ్రహ్మతేజో రూపముగా బృహస్పతి పుట్టెనని పరాశరుడు చెప్పెను. బృహస్పతి అంగిరునకు శుభ కడుపున పుట్టెను. ఇతనికి తేజస్సు అధ్యయన సంపద ప్రతిభావిశేషము మంత్రశక్తియు అత్యధికము కావున ఇతనికి బృహస్పతి అని పేరు వచ్చెను అని మహా భారతము చెప్పు చున్నది. అతి పురాతన కాలమునకే గురుడు ఉనికిని తెలియుననుటకు తార్కాణంగా పరాశరుడితనిని బ్రహ్మ మానసపుత్రుడని వచించెను. ఇతడు తిష్యలో పుట్టెనని తైత్తిరీయబ్రాహ్మణము. సూర్యుడును, చంద్రుడును, బృహస్పతియు ఏకకాలములో (కర్క) పుష్యమిలో సమ్మిళితురగురని అపుడు సత్యయుగ మావిర్భవించునని విష్ణు పురాణము చెప్పెను గురుడు జీవుడని ఒక పేరుకలదు. ఋగ్వేదము న ఇతడు పుష్టివర్ధకుడు. ఓషధులకు జనకుడు. గురుడు దేవాసుర సంగ్రామమున చనిపోయి దేవతలకు దివ్యౌషధములు ఇచ్చి బ్రతికించుచుండువాడు కావున జీవుడని పేరు వచ్చెను. ఇతడు ఫల్గునిలో పుట్టెనని వాయు పురాణము చెప్పెను. కావున ఇతడు ఫల్గునీభవుడు. గురువు దేవ గురువు. ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాలలో ఒకటి. ఇతడికి వాచస్పతి, దేవేజ్యుడు, ఆంగీరస, జీవ అనే ఇతర నామాలు ఉన్నాయి. ఆది వారంతో మొదలయ్యే వారాలలో గురువుది అయిదవ స్థానం. అందుకే దానిని బృహస్పతి వారం అని కూడా అంటారు. అత్యంత శక్తి వంతమైన గ్రహం. పురుష గ్రహం, అధి దేవత బ్రహ్మ, రుచులలో తీపికి రుచి కారకుడు, వయసు ముప్పై, ప్రకృతి కఫ ప్రకృతి, హేమంత ఋతువుకు అధిపతి, తత్వం ఆకాశ తత్వం, దిక్కు ఈశాన్య దిక్కును సూచిస్తాడు. లోహములలో బంగారమును, రత్నములలో పుష్యరాగమును సూచిస్తాడు. గురువు లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ. గురువు కటక రాశిలో ఉచ్ఛ స్థితిని, మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు. గురువు ధనస్సు రాశికి, మీనరాశికి ఆధిపత్యం వహిస్తాడు. గురువుకు మిత్రులు రవి, చంద్ర, కుజులు. శత్రువులు బుధ, శుక్రులు. సముడు శని. గురుదశ పదహారు సంవత్సరాలు. స్వభావం మృదు స్వభావం, సత్వగుణం, శుభ గ్రహం, జీవులు ద్విపాదులు, స్థానం ధనాగారం, అత్మాధికారత్వం జ్ఞానం, ధాతువు కొవ్వు, కుటుంబ సభ్యులు పుత్రుడు, గృహ స్థానం పూజ గది, ధన స్థానము, కాల బలం పగలు, స్థాన బలం లగ్నం, కాల ఆధిపత్యం మాసము, దిక్బలం తూర్పు, వర్ణం పసుపు వర్ణం, రాశిలో ఉండే కాలం ఒక సంవత్సరం, సమిధ రావి, మూలిక రావి అరటి వేరు, గోత్రము అంగీరస, వేదము ఋగ్వేదము. స్వక్షేత్రము :- ధనసు మీనము. ఉచ్ఛ క్షేత్రము :- కర్కాటకము. శత్రుక్షేత్రము :- మిధునము, కన్య,
మిత్రక్షేత్రము :- మేషము, వృషభము, సింహము. సమక్క్షేత్రము :- వృషభము, తుల. నీచక్షేత్రము :- మకరము. మూలత్రికోణ క్షేత్రము :- ధనసు. గోచార రీత్యా శుభస్థానాలు :- 2,5,7,9,11. గోచారరీత్యా అశుభస్థానములు:-1,3,4,6,8,12....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557
_*"ఋభుగీత" (226)*_
🕉🌞🌎🌙🌟🚩
_*బ్రహ్మానందము"*_
_*16వ అధ్యాయము*_
_*ప్రవర్తన మారకపోతే నిజమైన ప్రయోజనం అందదు !*_
_*అశాంతికి కారణం సమాజ పోకడ. సమాజం అంటే వ్యక్తుల ప్రవర్తన. శాంతి కావాలంటే ప్రవర్తన మారాలి. అది మన నుండే మొదలవ్వాలి. భక్తి, పూజలు, పుణ్యకార్యాలు మనం భౌతికంగా బాగుంటానికి మాత్రమేకాదు, మానసికంగా బాగుపడటానికి కూడా. దేవుళ్ళు, గురువుల చుట్టూ తిరిగితే తనకు కలిసి వస్తుందనుకున్నంత కాలం గురువు, దైవంల నుండి రావాల్సింది రాదు. ధనం, సుఖం, కీర్తి, హోదా వంటి బయటదొరికే ప్రయోజనాలు, లాభాలకోసం గురువులను ఆశ్రయించడం అల్పత్వం అవుతుంది. తనపబ్బం గడుపుకోడానికి ఒక గుర్తింపుకోసం కోతిని వెంటేసుకొని ఆడించినట్లే మనిషి దైవాన్ని, మతాన్ని, గురువును మెడలో వేసుకున్నంతకాలం వాటి నిజమైన ప్రయోజనం అందదు !*_
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
*కర్మలు, క్రియలు అనేకం ఉండొచ్చు... 'కర్త' ఎప్పుడు ఏకవచనమే.*
⚡️✨⚡️✨⚡️✨
*గర్భస్థ శిశువును పోషిస్తున్నది ఏ శక్తి? -- అదే సకలాన్ని పోషిస్తున్నది, అన్న నిశ్చింతలో జీవించడమే జీవన్ముక్తి.*
⚡️✨⚡️✨⚡️✨
*నిరంతరం మార్పులతో కూడిన 'ప్రకృతి' ప్రయాణం...*
*ఎట్టి మార్పులు లేని నిశ్చలత్వమైనా 'ఆత్మ' వైపుకే.*
🕉🌞🌎🌙🌟🚩
*✍🏼 నేటి కథ ✍🏼*
*దివాను ఎంపిక*
మహేంద్రపురం జమీందారీలో దివాను ముసలివాడయ్యాడు. ఆయన విశ్రాంతి కోరటంతో కొత్త దివాను అవసరం ఏర్పడింది. దివాను పదవికి అర్హులైన వారందరూ దరఖాస్తులు పంపమని జమీందారు గారు చాటింపు వేయించారు. చాలా మంది చదువుకున్నవాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ పరీక్ష పెట్టగా అన్నింటా సమానంగా ఉన్న అభ్యర్ధులు ముగ్గురు లెక్కతేలారు. కానీ పదవి ఉన్నది ఒకటే కదా! దిక్కుతోచని జమీందారుగారు పాత దివానునే పిలిపించి, కొత్తదివాను ఎంపిక బాధ్యతను ఆయనకు అప్పగించారు.
పాత దివాను ఆ ముగ్గురినీ పిలువనంపి, ఆ ఊరి రచ్చబండ దగ్గరకు పోయి రమ్మన్నాడు. ఇద్దరు అభ్యర్థులు వెంటనే బయలుదేరి వెళ్ళారు; కానీ మూడోవాడు మాత్రం అక్కడే కూర్చుని ఉండిపోయాడు.
"ఏం, నువ్వెందుకు వెళ్ళలేదు?" అని అడిగారు జమీందారు గారు. "అసలు తమరు మమ్మల్ని అక్కడికి ఎందుకు వెళ్ళమన్నారు, అని ఆలోచిస్తున్నాను ప్రభూ!" అన్నాడు వాడు.
కొంచెం సేపు అయ్యిందో లేదో, వెళ్ళినవాళ్ళలోఒకడు తిరిగి వచ్చాడు వగర్చుకుంటూ. "నీతోపాటు వెళ్ళినవాడు ఏడి?" అనడిగారు జమీందారుగారు. "అతని సంగతి నాకు తెలీదు- పోయి రమ్మన్నారు గనుక పరుగు పరుగున పోయి వచ్చాను" అన్నాడు వాడు.
ఇంకో పావుగంట గడిచాక రెండోవాడు తిరిగివచ్చాడు. "ఏమి, ఇంత ఆలస్యం ఎందుకైంది?" అని అడిగాడు పాత దివాను. "తమరు పోయి రమ్మని ఊరికే చెప్పరు కదా, అందుకని, పోయి ఆ పరిసరాలను గమనించి వచ్చాను. రావిచెట్టు, మఱ్ఱిచెట్టు కలిసి పెరిగిన చోట అరుగు ఏర్పరచి రచ్చబండ కట్టించారు. కానీ దాని నిర్వహణ సరిగ్గా లేకపోవటంతో చెట్టు మీద చేరిన పక్షుల రెట్టలతో అదంతా చాలా అపరిశుభ్రంగా అయ్యింది. పనీపాట లేనివాళ్లంతా అక్కడ చేరి దారిన పోయే మామూలు వాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అక్కడంతా బాగుచేసి, రచ్చబండను ఊరి పెద్దల చర్చలకు అనువైన ప్రదేశంగా మార్చాల్సి ఉంది" అని జవాబిచ్చాడతను వినయంగా.
పాతదివాను నవ్వుతూ జమీందారు వైపు చూశాడు. జమీందారు కూడా నవ్వి, రెండవవాడినే కొత్తదివానుగా నియమించాడు. మిగిలిన ఇద్దరూ నిరాశ చెందటం చూసిన పాతదివాను వాళ్ళను అనునయిస్తూ "ఏదైనా పనిని అప్పగించినప్పుడు ఆ పనిని అసలు మొదలు పెట్టకనే, 'అది ఎందుకు చెప్పారా' అని కారణాలు వెతకబోవటం తెలివైన పని కాదు- శుద్ధ అవివేకం. అలానే సమస్య ఏమిటో గుర్తించకుండా గుడ్డిగా ఎవరో చెప్పారు కాబట్టి ఏదోముగించుకొని రావాలనుకోవటమూ సరైనది కాదు. ఈ విషయాన్ని మీరిద్దరూ గుర్తించారనుకుంటాను" అన్నాడు.
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
--- శ్రీమద్రామాయణావతరణము ---
శ్రీహరి నామమ్ము చెలువార బలుకుచు
సర్వ జగమ్మున సంచరించు
ఘన తపః స్వాధ్యాయి కమనీయ సంయమి
వాగ్విదాంవర సురవంద్యుడైన
నారదు ప్రశ్నించె నతమస్తకుండౌచు
విమలుడౌ వాల్మీకి వినయముగను
" వీక్షించ నిప్పుడీ విశ్వంబు నందున
సద్గుణుం డెవ్వడు ? సాహ సెవడు ?
ధర్మజ్ఞు డెవ్వడు ? తాత్వికుం డెవ్వడు
దృఢమతి యెవ్వండు ? ధీరు డెవడు ?
సతత కృతజ్ఞత సాత్వికుం డెవ్వడు ?
సచ్చరిత్రు డెవడు ? సాధు వెవడు ?
సర్వభూతహితుడు సద్వర్తనుండును
నిశ్చయాత్ము డెవడు? నియతు డెవడు ?
భీకరాహవశాలి ప్రియదర్శనుండును
విజితాత్ము డెవ్వడు ? విమలు డెవడు ?
యలిగిన నెవ్వాని యాహవమ్మందున
యతిభీతి నొందెదరమరులైన
ఆట్టి వానిని నెరుగంగ నంతరమున
నమితమైనట్టి కౌతుక మగుచు నుండె
వాని నామమ్ము దెలుపగ వసుధ యందు
నెవరు లేరింక మునివరా ! నీవు దక్క. 01
భవ్యుడౌ వాల్మీకి ప్రార్థించనారీతి
నారదుం డిట్లనె నయము గాను
" నీవు జెప్పిన యట్టి నిఖిల సద్గుణములు
దొరకుట నొకనిలో దుర్లభమ్ము
యైననూ యోచించి యమ్మహా పూరుషు
స్మృతి యందు నెఱిఁగియు చెప్పె దిపుడు
అట్టి యా సుగుణము లరయంగ నిప్పుడు
నొకని యందే నుండె నుర్వి యందు
వైభవ యిక్ష్వాకు వంశమ్ము నందున
ప్రభవించె నాతడు ప్రముఖునిగను
" రాముడు " యనియెడి రాపట్టి యాతడు
యవనిపై బుట్టిన యనఘు డతడు
అవని రఘువంశ మందున నవతరించి
పుడమి నున్నట్టి దశరథ పుత్రు డతడు
పడతి కౌసల్య వరముల పంట యతడు
పుడమి వెల్గొందు పరిపూర్ణ పురుషు డతడు 02
వీరుండు ధీరుండు విజితేంద్రియుండును
దివ్యతేజోమయదేహు డతడు
ఆజానుబాహుండు యరవిందనేత్రుండు
సువిశాల గాత్రుండు సుందరుండు
సమ విభక్తాగుండు సత్ఫాల యుక్తుండు
కమనీయ గాత్రుండు కంబు గ్రీవి
వేదాంగవేద్యుండు విజ్ఞాననిలయుండు
గాంభీర్యమందున కడలిసముడు
సౌమ్యవచోనిత్య సత్యసంధుండును
సదమలహృదయుండు మృదులభాషి
సర్వ లోక హితుడు సాత్విక హృదయుండు
కరుణాంత రంగుండు ధర నుతుండు
అట్టి రఘువంశ శ్రీరాము డవని నేడు
ధార్మికోన్నత సోదరత్రయము తోడ
నాల్గుపాదాల ధర్మము నడచుచుండ
పాలనము సేయుచుండెను భవ్యముగను 03
✍️గోపాలుని మధుసూదన రావు🙏
శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రమ్
1. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ॥ 1 ॥
తా. లక్ష్మీదేవి భర్తయును, కళ్యాణ గుణములకు నిధియును, శరణార్థులకు రక్షకుడును, వేంకటాచలనివాసియు నగు శ్రీనివాసునకు మంగళ మగును గాక.
2. మంగళా శాసన పరై ర్మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృపాయాస్తు మంగళమ్. ॥ 15 ॥
తా. మంగళాశాసనమును చేయుచున్న మా గురువును, సమస్త పూర్వాచార్యులును ఆరాధించు శ్రీనివాసునకు మంగళమగు గాక.
3. సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ‖
*నోటికి నియంత్రణ..*
"చూడని గుడి లేదు..మొక్కని దేవుడు లేడు..మాకు తెలిసిన క్షేత్రాలన్నీ తిరిగాము..ఇతరులు చెప్పిన తీర్ధాలూ క్షేత్రాలూ కూడా చూసి, మొక్కుకొని వచ్చామండీ..గత రెండేళ్లుగా అబ్బాయికి ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు ఏదో ఒక గుడికి వెళుతూనే ఉన్నాము..ఇదిగో..ఇక్కడికి కూడా..మా దూరపుబంధువు చెపితే..చూసి పోదామని వచ్చాము..ఉన్నది ఒక్కగానొక్క కొడుకు..మా వారు కూడా కాలం చేసి ఐదేళ్లు అయింది..నాకు వాడూ, వాడికి నేనూ తోడుగా వుంటున్నాము..పిల్లవాడు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు..మంచి జీతం వస్తున్నది..కానీ ఏం లాభం?..ఇప్పుడు వాడికి ముప్పై మూడేళ్ల వయసు..ఇంకా వివాహం కాలేదు..వాడికి పెళ్లై..పిల్లలతో హాయిగా సంసారం చేసుకుంటుంటే చూసి కన్నుమూద్దామని అనుకుంటున్నాను..ఏ దేవుడూ కరుణించలేదు..ఇప్పటికీ వివాహం కాకపోతే..ఇక బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే నని ఒకటే బెంగగా ఉంది.." అంటూ ఆ ల్వచ్చిన పార్వతమ్మ గారు వాపోతున్నారు..
ఆవిడ అలా బాధపడటం లో తప్పులేదు..తన కుమారుడు త్వరగా పెళ్లిచేసుకొని, జీవితం లో స్థిరపడాలని కోరుకోవడం తల్లిగా ఆవిడ బాధ్యత..అబ్బాయి ఉద్యోగం లో చేరి సుమారు తొమ్మిదేళ్లు అవుతోంది..మొదట్లో సంబంధాలు వచ్చాయి..అమ్మాయి రంగు తక్కువనీ..లేదా..జాతకం సరిపోలేదనీ..అదీ కాకుంటే..తమ కుమారుడి కంటే అమ్మాయి ఎక్కువ చదువుకున్నదనీ..రకరకాల కారణాల తో చాలా సంబంధాలు పార్వతమ్మ గారు తిరస్కరించారు..పార్వతమ్మ గారి భర్త గారు ఉన్నంతవరకూ కొద్దో గొప్పో వచ్చిన పెళ్లి సంబంధాలు..ఆయన మరణించిన తరువాత..రాలేదు..పార్వతమ్మ గారి ప్రవర్తన కూడా కొంత కారణం కావొచ్చు..మెల్లిగా భర్త వైపు బంధువుల రాకపోకలూ తగ్గాయి..
"అంకుల్..ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇక్కడి పూజలూ వాటి విధానాలూ మాకు తెలియవు..మీరు చెప్పండి.." అని పార్వతమ్మ గారి అబ్బాయి అడిగాడు.."ఈరోజు శనివారం..మరికొద్దిసేపట్లో పల్లకీసేవ మొదలవుతుంది..నువ్వు అందులో పాల్గొను..వీలైతే పల్లకీ కనీసం ఒక ప్రదక్షిణ చేసేవరకూ మోయి..రేపుదయం స్వామివారి సమాధి దర్శనాన్ని మీ తల్లీకొడుకులు చేసుకోండి..నీ కోరికను, స్వామివారి సమాధి వద్ద చెప్పుకో..స్థూలంగా ఇదీ విషయం.." అని చెప్పాను..సరే అన్నాడు..
పల్లకీసేవ లో పాల్గొన్నాడు..పల్లకీని ఒకటి రెండు ప్రదక్షిణాలు అయ్యేదాకా మోసాడు..పార్వతమ్మ గారు కూడా పల్లకీ తోపాటు మందిరం చుట్టూరా మూడు సార్లు తిరిగారు..తమ రూముకు వెళ్లిపోయారు..తెల్లవారి ఆదివారం నాడు ఉదయాన్నే ఆ తల్లీ కొడుకులు గుడిలోకి వచ్చారు..శ్రీ స్వామివారి సమాధికి అర్చక స్వాముల చే జరుగుతున్న అభిషేకము, విశేష హారతులూ చూసారు..ఆ తరువాత..ఇద్దరూ స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు..
"మేము వెళ్ళొస్తామండీ..ఆ నాయన సమాధి వద్ద వీడి వివాహం గురించి మొక్కుకున్నాను..మా ప్రాప్తం ఎలా వుందో..?స్వామి దయవల్ల వీడికి త్వరలో పెళ్లి కుదిరితే..ఇక్కడే వివాహం జరిపిస్తానని మొక్కుకున్నాను..అదికూడా ఆదివారం నాడే వివాహం చేస్తాను.. ఇంతకు ముందు లాగా నేను కూడా చిన్న చిన్న విషయాల్లో పట్టు బట్టను..ఎందుకనో ఇన్నాళ్లూ నా తప్పుకూడా ఉందని అనిపించింది..లేనిపోని పట్టింపులకు పోయాను..స్వామివారే అలా నాలో మార్పు తెచ్చారేమో..వచ్చిన భక్తులందరికీ భోజనం పెడతాను..అనికూడా మొక్కుకున్నాను..ఇక అంతా ఆ స్వామి దయ.." అని చెప్పి, స్వామివారి విభూతి గంధం తీసుకొని తమ ఊరు వెళ్లిపోయారు..ఇలాటి కోరికలతో చాలామంది వస్తుంటారు కనుక.. నేనూ, మా సిబ్బందీ..ఈ తల్లీకొడుకుల విషయం త్వరగా మర్చిపోయాము..
నాలుగు నెలలు గడిచిపోయాయి..ఆరోజు బుధవారం..ఉదయం పది గంటల వేళ..పార్వతమ్మ గారు, ఆమె కుమారుడు ఇద్దరూ కారు లో వచ్చారు..స్వామివారి మందిరం లో ఉన్న నా దగ్గరకు నేరుగా వచ్చి, "అంకుల్..వచ్చే ఆదివారమే నా పెళ్లి..ఉదయం తొమ్మిది గంటలకు..ఇక్కడే చేసుకుందామని నిర్ణయించుకున్నాము..ఈ సంబంధం కుదిరింది కూడా మొన్న సోమవారమే..స్వామివారి కృప మా మీద ఉన్నది..ఇక్కడినుంచి వెళ్లిన తరువాత నాకు మొత్తం మూడు సంబంధాలు వచ్చాయి..అందులో ఇప్పుడు చేసుకోబోయే అమ్మాయి వాళ్ళది కుదిరింది..అంతా స్వామి దయ..అందుకే వాళ్లకు చెప్పుకొని..ఒప్పించి..వివాహం ఇక్కడే జరుపుకునేటట్లు నిర్ణయించుకున్నాము.." అన్నాడు..ఆ ఇద్దరి ముఖాల్లో ఆనందం తాండవిస్తోంది.."ఇంతకుముందు లాగా నేను ఏ విషయం లోనూ జోక్యం చేసుకోలేదు..అంతా మా మరిది గారు, తోడికోడలు మాట్లాడారు..స్వామివారు ముందు నా నోటికి తాళం వేసి, ఆపై మా అబ్బాయికి పెళ్లి కుదిర్చాడు బాబూ.." అని నిండుగా నవ్వారు పార్వతమ్మగారు..
ఆ మరుసటి ఆదివారం ఆ అబ్బాయి వివాహం శ్రీ స్వామివారి సమక్షంలో జరిగిపోయింది..అనుకున్న విధంగా ఆరోజు భక్తులకు భోజనం పార్వతమ్మ గారే ఏర్పాటు చేశారు..
ముందుగా తల్లిని నియంత్రించి..ఆపై కొడుక్కి వివాహం చేశారు స్వామివారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
*Tamil Nadu, West Bengal and Hindus from rest of Bharatbarsha should learn a lesson from the Hindus of Kerala!*
Mathrubhumi Magazine, a leading magazine in the state of Kerala, commented on an indecent critical novel titled 'Mustache' about the worship of Hindu women in the state of Kerala.
This was followed by unrest among Hindus in the state of Kerala and huge opposition to the Mathrubhumi newspaper.
The Hindu Movement announced its opposition and call for the Mathrubhumi newspaper administration to publicly apologize to the Hindu community for indecently criticizing Hindu women and their process of worship / rituals and simultaneously appeal to the entire Hindus of Kerala to boycott the newspaper to register their opposition to the Mathrubhumi daily.
*In response to the call of the Hindu movements to register their opposition to Mathrubhumi, 3,88,000 permanent subscribers of the newspaper's have immediately stopped Mathrubhumi and expressed their strength and sentiment* ...
It is learned that the number of permanent subscribers of the magazine will further decrease as Mathrubhumi subscribers continue to ignore the magazine ...
Bhima Jewelers, the newspaper's largest publisher of the magazine, has withdrawn its advertisement for Mathrubhumi magazine's subscribers due to the boycott of the magazine.
The situation is such that many businesses will stop advertising contracts with Mathrubhumi daily.
As a result, the daily circulation revenue of Mathrubhumi newspaper and the commercial advertising revenue have been greatly reduced.
Other daily newspaper companies, weekly magazines and media in the state are shocked ...
No longer for publishing and disseminating anti-Hindu content and news, Kerala state newspapers and media are in a state of panic ...
This event is for Hindu unity and Awareness!
There are no two opinions on the role model ...
If this Hindu community awareness, uprising and unity develops among the Hindus of the entire nation, the anti-Hindu press and media within the country and abroad will stop expressing anti-Hindu narratives and anti-Hindu sentiments.....
*Hindus need to think !*
You MUST unite with the national identity of Sanatan Dharmik Hindus only and dump secularism for good which was a leftist / Islamist tool to destroy Hindus !
Sanatan Dharma Ki Jai 🙏🕉️🚩
Bharat Mata Ki Jai 🙏🕉️🚩
Vande Maataram 🙏🕉️🚩
🌷🙏 *దాత యాచకుల లో ఎవరు పెద్ద*🙏🌷
దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసుకుని జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్తాడు.
అప్పుడు జనక మహారాజు వారి వివాహ శోభాయాత్రకు సాధరపూర్వక స్వాగతం చెబుతాడు.
అప్పుడు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనక మహారాజుకు పాదాభివందనం చేస్తాడు.!
అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగలించుకొని.....
రాజా!మీరు పెద్దవారు.
పైగా వరుని పక్శం వారు.!
ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి?
గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా!?అని అంటాడు.
అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన.,సుందరమైన జవాబు చెబుతాడు.
*మహారాజా మీరు దాతలు.!*
*కన్యదానం చేస్తున్నారు.!!*
*నేనైతే యాచకున్ని.!*
*మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను.!*
*ఇప్పుడు చెప్పండి.*
*దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద?ఎవరు గొప్ప?* అని అంటాడు.
ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనందభాష్పాలు రాలుస్తూ....ఇలా అంటాడు.
*ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో?!వాళ్ళు భాగ్యవంతులు.!*
*ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు!*
ఇదీ భారతీయత
ఇదీ సంస్కృతి
ఇదీ రామాయణం నీతి
జైశ్రీరాం.
🙏 ..... హరి లక్ష్మణ్ కుమార్🙏
-10- చంపకమాల :
గురుతరలీలఁ బీఠపురి కుక్కుటలింగమహాప్రభుండవై
బరగెడు నిన్ను నేనిపుడు భక్తి
దలిర్పఁగ నాశ్రయింతు నీ
వరకరుణానిరీక్షణము వాలెము
నాపయి నిల్పి ప్రోవవే
చిరవిభవా ! భవా ! విజితచిత్తభవా ! యభవా ! మహాభవా🙏
టీకా :
గురుతర = ఘనమైన , లీలఁ = వైభవముతో , (బీ)పీఠపురి = (ప్రస్తుత ..)పిఠాపురమున ,
కుక్కుటలింగమహాప్రభుండవై = కుక్కుటలింగమహేశ్వరుడు అను
పేరున , (బ)పరగెడు = ప్రసిద్ధి గాంచిన , నిన్ను , నేనిపుడు , భక్తి ,
(ద)తలిర్పఁగన్ = చిగురింపగా ,
+ ఆశ్రయింతు(..ను) , నీ ,
వర = దివ్యమైన , కరుణా , నిరీక్షణము = దృష్టి ని , వాలెము = వాలాయము యొక్క రూపాంతరము = సర్వకాలము ,
నాపయి నిల్పి , ప్రోవవే = ప్రోవుము తండ్రీ ..
శివా ! ..
[ ఈ మకుటార్థము
ప్రతి పద్యమునకును అన్వయము ..
చిరవిభవా ! = శాశ్వతమైన విభవము గలవాడా ! , భవా ! = శివా !
< విజిత = జయించబడిన ,
చిత్తభవా ! = మన్మథుని గలవాడా > =
మన్మథుని జయించినవాడా ! (య)అభవా ! = (జనన మరణ
చక్రబంధ క్రమమున ..) జన్మ లేనివాడా !
మహాభవా ! = ౘచ్చి , పుట్టునటువంటిది కాని గొప్ప పుట్టుక కలవాడా = శాశ్వతుడా..]🙏
భావము : !
చిరవిభవా ! భవా !
విజితచిత్తభవా ! యభవా ! మహాభవా !
ఘనమైన వైభవముతో (ప్రస్తుత ..)పిఠాపురమున కుక్కుటలింగమహేశ్వరుడు అను పేరున ప్రసిద్ధి గాంచిన నిన్ను నేనిపుడు భక్తి చిగురింపగా ఆశ్రయించెదను ..
నీ దివ్యమైన కరుణాదృష్టిని సర్వకాలము నా పయిన నిల్పి ప్రోవుము తండ్రీ .. శివా ! ..🙏
--- శ్రీమద్రామాయణావతరణము ---
శ్రీహరి నామమ్ము చెలువార బలుకుచు
సర్వ జగమ్మున సంచరించు
ఘన తపః స్వాధ్యాయి కమనీయ సంయమి
వాగ్విదాంవర సురవంద్యుడైన
నారదు ప్రశ్నించె నతమస్తకుండౌచు
విమలుడౌ వాల్మీకి వినయముగను
" వీక్షించ నిప్పుడీ విశ్వంబు నందున
సద్గుణుం డెవ్వడు ? సాహ సెవడు ?
ధర్మజ్ఞు డెవ్వడు ? తాత్వికుం డెవ్వడు
దృఢమతి యెవ్వండు ? ధీరు డెవడు ?
సతత కృతజ్ఞత సాత్వికుం డెవ్వడు ?
సచ్చరిత్రు డెవడు ? సాధు వెవడు ?
సర్వభూతహితుడు సద్వర్తనుండును
నిశ్చయాత్ము డెవడు? నియతు డెవడు ?
భీకరాహవశాలి ప్రియదర్శనుండును
విజితాత్ము డెవ్వడు ? విమలు డెవడు ?
యలిగిన నెవ్వాని యాహవమ్మందున
యతిభీతి నొందెదరమరులైన
ఆట్టి వానిని నెరుగంగ నంతరమున
నమితమైనట్టి కౌతుక మగుచు నుండె
వాని నామమ్ము దెలుపగ వసుధ యందు
నెవరు లేరింక మునివరా ! నీవు దక్క. 01