పరిహారాలు పని చేస్తాయా లేదా!
పరిహారాలు నిజంగా పని చేస్తాయా లేదా అనే విషయానికి వస్తే పని చేస్తాయని చెప్పవచ్చు. ఎవ్వరికీ పని చేస్తాయి అనే విషయానికి వస్తే 360 డిగ్రీల రాశి చక్రములో వుండే 12 భావాలు, ఈ 12 భావాలలో ఏ భావాలతో సిగ్నిఫీకేసన్స్ వుంటే పరిహారాలు పని చేస్తాయి అనే విషయము గురించి చాలా స్పష్టమైన అవగాహన వుండాలి.అంటే ఈ పరిహారాలు పని చేస్తాయా లేదా అనే ఖచ్చితమైన విషయనికి వస్తే, రాశి చక్రములోని లగ్నాని బట్టి, గ్రహాల యెక్క స్థితి గతులను బట్టి, అలాగే గ్రహాల యెక్క డిగ్రీలను బట్టి పరిహారాలు నిజంగా పని చేస్తాయా లేదా అని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు.
మరి ఎవ్వరికీ పని చేస్తాయి?
రాశి చక్రములో 1 నుండి 12 స్థానాలను ధర్మ, అర్థ, కామ, మోక్ష స్థానాలుగా 4 భాగాలుగా చేశారు. వీటిని చతుర్విది పురషార్దములు అంటారు.
1, 5, 9 – ధర్మ స్థానాలు
2, 6, 10 – అర్థ స్థానాలు
3, 7, 11 – కామ స్థానాలు
4, 8, 12 – మోక్ష స్థానాలు
వీటిలో 1,5,9 – ధర్మ స్థానాలతోటి సిగ్నిఫికేసన్స్ వున్నప్పుడు మాత్రమే పరిహారాలు పని చేస్తాయి.
మరి ఏ విదంగా సిగ్నిఫికేసన్స్ వుండాలి?
ఈ 1,5,9 – ధర్మ స్థానాలకు చెందిన అధిపతులతోటి మరియు నక్షత్రాదిపతులతోటి తప్పనిసరిగా 1,4,7,10 స్థానాలతోటి అలాగే 3,6,9,12 స్థానాలతోటి అలాగే 11 వ స్థానముతోటి సిగ్నిఫికేసన్స్ వున్నప్పుడు మాత్రమే పరిహారాలు ఖచ్చితంగా పని చేస్తాయి.
ఈ స్థానాలతోటి మాత్రమే ఎందుకు సిగ్నిఫికేసన్స్ వుండాలి అంటే –
1, 4, 7, 10 – బౌతిక స్థాయి ( Physical )
2, 5, 8, 11 – మానసిక స్థాయి ( Mental )
3, 6, 9, 12 – ఆద్యాత్మిక స్థాయి ( Spiritual )
ఇక్కడ 1, 4, 7, 10 – బౌతిక స్థాయి గురించి, 3, 6, 9, 12 – ఆద్యాత్మిక స్థాయి గురించి తెలియజేస్తునాయి. అలాగే మానసిక స్థాయికి చెందినా 11 వ స్థానాన్ని తీసుకున్నాము, ఈ స్థానము లాభాలు గురించి అలాగే స్నేహ బంధము గురించి తెలియజేస్తుంది.కావున ఈ స్థానాలతోటి సిగ్నిఫికేసన్స్ వున్నప్పుడు మాత్రమే పరిహారాలు పని చేస్తాయని ఏ మాత్రమూ సందేహము లేకుండా చెప్పగలను.
ఈ విదంగా సిగ్నిఫికేసన్స్ అందరి జాతకాలలో వుండవు. కేవలము వందలో 50 శాతము జాతకలలో మాత్రమే ఈ సిగ్నిఫికేసన్స్ఉంటాయి. మిగత వారికీ పరిహారాలు కేవలము మానసికంగా మనశాంతిని మాత్రమే ఇస్తాయి. ఈ మనశాంతికి సంకల్ప బలము వుంటే పరిహారాలు ఖచ్చితంగా పని చేస్తాయి.
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి