23, మార్చి 2025, ఆదివారం

ప్రియ బాంధవా మేలుకో 18*

 *ప్రియ బాంధవా మేలుకో 18*




గత వ్యాసాలలో గుర్తు చేసుకున్నాము...యువకులు వారి వారి జీవన సమస్యలతో 

(విద్యా, ఉపాధి, వివాహ) సతమతమవుతూ,  మధ్యవయస్కులు వారి వారి సంతతి అభివృద్ధి, సంతతికి సంబంధించిన వేడుకలు, సంప్రదాయాలు మరియు లాంఛనాలలో తల మునకలుగా ఉంటారని. 

పై రెండు వర్గాల వారికి సమాజ సంస్కరణలలోకి పిలుపు నివ్వడం  అంత భావ్యం కాదు.


అరువది ఐదు సంవత్సరముల తదుపరి విశ్రాంత జీవన యానంలో అడుగిడుతున్న *ఆరోగ్యవంతమైన* పౌరులు సమాజం గురించి యోచించే స్థితిలో తప్పక ఉంటారు. మానసిక శాస్త్రవేత్తల నిర్వచనం మేరకు విశ్రాంతి అంటే అచేతనత్వము, జడత్వము మరియు నిశ్చల తత్వము కాదు,*వ్యాసంగాల మార్పు మాత్రమే*. వైద్య పరిభాషలో విశ్రాంతి అనగా శారీరక దుర్భలత్వము ఉన్నప్పుడు అధిక శారీరక మరియు మానసిక శ్రమకు లోను కాకుండా ఉండడం. 

*కావున విశ్రాంత జీవన యానంలో అడుగిడిన పౌరులు సామాజిక చైతన్యానికి సహకరించు శారీరక మరియు మానసిక స్వస్థత కలిగియేవుంటారు*.


సాధారణ ప్రజలతో పాటు మధ్య తరగతి ప్రజలలో భద్రతా అధికారులన్నా, చట్టలన్నా విపరీతమైన భయమున్నది. *చట్టం పేదవాడిని పాలిస్తుంది, సంపన్నుడు చట్టాన్ని పాలిస్తాడు* అను వాడుక ప్రజలలో బలంగా నాటుకుని ఉన్నది. ఇందుకు కారణం ప్రజలలో చైతన్యము మరియు ఐకమత్యం లేకపోవడమే.


వాస్తవానికి పోలీసులకు, తత్సంబంధ చట్టాలకు దుర్మార్గులు మరియు దుష్టులు మాత్రమే భయపడాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే తప్పులు చేసిన వారు చట్టాలకు, పోలీసులకు *మాత్రమే గాకుండా సమాజానికి గూడా భయపడాలి*.  సమాజ భయం ఉన్నప్పుడు నేరాలు చేయడానికి సాహసించరు. ఎందుకంటే  *చైతన్య సమాజంలో* వెంటనే *దేహ శుద్ధి జరుగుతుంది*. అన్ని భయాలకన్న ప్రాణ భయము మిన్న. *నగదు జరిమానాలకు, స్వల్ప శిక్షలకు నేరస్థులు భయపడడం లేదు*  డబ్బులు చెల్లిస్తున్నారు మళ్ళీ మళ్ళీ నేరాలు చేస్తూనే ఉన్నారు. *గతంలో లాగా corporal శిక్షలు రావాలి అంటే మేధావులు మరియు నేతలు పూనుకోవాలి*.మరియొక విషయం నేరారోపణలు మోపబడినంత మాత్రాన నిందితులు కారు. నిందలు నిరూపించబడనంత వరకు అందరూ నిర్దోషులే.


సమాజ నైతికత, సమాజ శ్రేయస్సు మరియు సమాజ క్రమశిక్షణకై పాటుపడాలన్న సభ్యుల ఆలోచన, తహతహ (ఉత్సాహం) మంచిదే. ఉత్సాహం ఉన్నా...ఏమి చేయాలి, ఏలా చేయాలి అను సందేహాలు *కొన్ని సార్లు* కొందరిని వెంటాడుతూనే ఉంటాయి. అవుతే *ధీర మనస్తత్వంతో అవకాశాలను అందిపుచ్చుకోవాలి*. ప్రారంభంలో అవకాశాల వెనుక అడ్డంకులు ఉండవచ్చును. *కాని, సభ్యులు మరువరానిది ...ప్రతి అడ్డంకి వెనుక గూడా అవకాశాలు,  విజయాలు ఉంటాయి*.  సభ్యులు దేన్ని చూస్తున్నారనేదే ముఖ్యం.


ధన్యవాదములు

*(సశేషం)*

ప్రియ బాంధవా మేలుకో 17*

 *ప్రియ బాంధవా మేలుకో 17*




ఇప్పటి వరకు దేశ మరియు సమాజ రుగ్మతలనబడే అశుద్దాని (ఇష్టపడని, అంగీకరింపబడని) గురించి అవలోకనం చేస్తూ వచ్చాము. ఈ రుగ్మతల పట్ల సమాజ  పెద్దలు ఏలా  స్పందిస్తారో వారి విజ్ఞతకే వదిలేద్దాము. మనదేశంలో  ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న మహామహుల గురించి ఇప్పుడు ఒకసారి పునశ్చరణగావిద్దాము. 


భారతీయ సంస్కృతి  సంప్రదాయాలకు, జ్ఞాన విజ్ఞానాలకు, వివిధ ధర్మాలకు, దర్శన, సదాచారాలకు, సాహిత్యాలకు మూలమైనది వేదము. ఇట్టి వేదమునకు పీఠమైన మన దేశము వేద భూమి. అందునా మన తెలుగు నేలలో శిష్యులకు.... వైదిక స్వర ప్రక్రియలు, వేద వచనాల అంతరార్థాలు, మస్క నిరుక్తము, పాణినీయ, భరద్వాజ, కౌండిన్య శిఖా పాఠాలు, స్వాధ్యాయ సంగ్రహాలు, ఆరాధనా పంచకాలు, సోమ పంచాకాలు, వ్యాకరణ, మీమాంస, వేదాంత, ఆయుర్వేద, జ్యోతిష్య నిరుక్త, కల్ప గ్రంథాల సారము, నైషథం, అనుబంధ శాస్త్రాలు ఇత్యాది నేర్పే అవధాన శిరోమణులు, మహా మహోపాధ్యాయ, వేద,  భవిష్య సామ్రాట్ లు, పూర్వోత్తర  మీమాంసా భాస్కరులు, వ్యాకరణ మహోదధి,  సర్వ శాస్త్ర మహోద్ధ సాంగ స్వాధ్యాయ భాస్కర బిరుదాంకితులైన గురుమూర్తులున్న ప్రభావ ప్రాంతాలు. 


జ్ఞాన పరంగా నిల్చిన పై మాన్యులు  మరియు దేశాభివృద్ధి కారకులైన  విద్యా పారంగతులు, వైద్య ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, వైజ్ఞానిక శాస్త్ర వేత్తలు, ఆర్థిక శాస్త్ర అనుభవజ్ఞులు,భూగర్భ శాస్త్రజ్ఞులు, న్యాయ శాస్త్ర కోవిదులు, పరిపాలనా సమర్థులు లాంటి అత్యుత్తమమైన, అసాధారణ, అసమానమైన ప్రతిభావంతులు.... *సమాజమనే పళ్ళెంలో అభివృద్ధి అనే భోజనము,... దాని ప్రక్కనే నేరాలు, అకృత్యాలు అనే సమాజ రుగ్మతలను (అశుద్ధాన్ని) అంగీకరిస్తారా*.  ప్రతి ఒక్కరి సమాధానం *ముందుగా రుగ్మతలను (అశుద్ధాన్ని) తొలగించాలి*. ఈ వ్యాస  పరంపర ముఖ్యోద్దేశము కూడా ఇదే. 


ప్రజలకు మేలుచేసే ప్రజా చైతన్యము మరియు సంఘీభావము ఉన్న చోట దుష్టులు వెనకడుగు వేస్తారు.


ధన్యవాదములు

*(సశేషం)*

వరుcడు వచించె నీ వధువు వద్దని

 వరుcడు వచించె నీ వధువు వద్దని పచ్చని పెండ్లి పందిటన్. 

ఈ సమస్యకు నా పూరణ. 



కురుపతి ముద్దుబిడ్డయయి కోరపు మీసము దువ్వినాడహో


సరసము చేయ మాయశశిc జాటుగ గిల్లగ జూచె నంతలో 


విరసము గల్గ భూతముల వీక్షణ గల్గెను  కంపమొందుచున్ 


*వరుcడు వచించె నీ వధువు వద్దని  పచ్చని పెండ్లి పందిటన్.* 


అల్వాల లక్ష్మణ మూర్తి.

దత్తపది

 కల్లలు - ఎల్లలు - మల్లెలు - జల్లులు (దత్తపది) *వసంత ఋతువు*


కల్లలు గావు రాజ! నవకంబులె నిత్యము సౌరు దిద్దుచున్


ఎల్లలు దాటె శోభలును  నేర్పడె పల్లవ మందహాసముల్


మల్లెలు పూచె కొల్లలుగ  మావులు నిండెను పూప పిందెతోన్


జల్లులు రాల్చె పుష్పతతి జావళి పాడ వసంత! రాగదే.


అల్వాల లక్ష్మణ మూర్తి.

ప్రియ బాంధవా మేలుకో 16*

 *ప్రియ బాంధవా మేలుకో 16*




శాస్త్ర, సాంకేతిక, విద్యా, ఆర్థిక రంగాలలో భారత దేశం ఎంత పురోగమిస్తున్నా, చట్ట పరమైన నిబంధనలు ఎన్ని అమలుచేస్తున్నా దిన దినము వ్యక్తిగత, సామాజిక అవినీతి మరియు నేరాలు పెరుగుటకు కారణాలు పెద్దలు అన్వేషించాలి. 


లెక్కకు మించిన క్రిమినల్ కేసులలో నిందితులైన వారిని, సాంఘికంగా దుశ్చరిత్ర కలవారిని తమ పార్టీ ప్రతినిధులుగా ఎన్నికలలో అభ్యర్థులుగా ఎంపిక చేసే

 *దుర్నీతి రాజకీయ* పార్టీలు వేళ్లూనుకున్న సమాజంలో మనం జీవిస్తున్నామన్న స్పృహ ప్రజలకు (సామాన్యులు + మాన్యులు)  ఉండాలి. *మేథోప్రజ నిద్ర నటిస్తే* చట్టాలను ఉల్లంఘించే వారు *శాసన కర్తలవుతున్నారు* అంటే ఆశ్చర్యానికి తావులేదు, నేర గ్రస్థ రాజకీయ నేపథ్యంలో ఇవన్నీ సాధ్యమే. 


సాక్షుల అకారణ మరణాలు, హత్యలు, ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభత్వ అధికారుల అనైతిక ప్రాబల్యాలు, తాబేదారుతనం ప్రజలు గమనిస్తున్నారు. 


హత్యా ప్రయత్నాలు, హత్యలు, అత్యాచారాలు, అపహరణలు, కుంభకోణాలు, స్కాంలు, వీటిపై నత్తనడక విచారణలు, దర్యాప్తులు, న్యాయస్థానాలలో ఏళ్ల తరబడి వాద వివాదాలు,  వాయిదాలపై వాయిదాలు, సుధీర్ఘ విచారణలు చివరికి *శిక్షలు జీవిత కాలం లేటు*.దేశ ద్రోహులకు, తీవ్ర వాదులకు, విదేశీ నేరస్థులకు కారాగారాలలో మృష్టాన్న భోజనాలు, రాజ మర్యాదలు.  

 

భారతీయ న్యాయ స్థానాల సామర్థ్యము కంటే మించిన వ్యాజ్యాలు. 2024 సంవత్సరపు గణాంకాల ప్రకారం భారత దేశ జనాభా మరియు న్యాయ మూర్తుల నిష్పత్తి (:) ...పది లక్షలు : ఒకటి. న్యాయ మూర్తుల నియామకాలు గూడా చాలినంతగా లేవు. 


ఏ దేశంలో లేని  మరియు ప్రపంచం అబ్బురపడే వింత... *దేశ ద్రోహులను, అరాచక మరియు తీవ్రవాదులను సమర్థిస్తూ వాదించే న్యాయవాదులు మన దేశంలోనే  కోకొల్లలు*.


దేశ  సామాజిక పరిస్థితి గురించి ఒక అవలోకనము, ప్రశ్నల రూపంలో....*దేశంలో నేర నిరోధక మరియు న్యాయ వ్యవస్థ శక్తివంతంగా ఉందా*. సాక్షుల రక్షణకు న్యాయపాలిక నిర్దేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ  *అవి యథాతథాంగా అమలవుతున్నాయా*. ఇవన్నీ ఎవరు గమనించాలి అంటే సమాజమే గమనించాలి, *అది సమాజ బాధ్యత*.


అధిక శాతం ప్రజలకు  సమాజ శ్రేయస్సు విషయమై పట్టింపులేదు, ఉండదు,  ఎందుకంటే తాము బాగున్నాము, తమ వాళ్ళు బాగున్నారు, *ఎక్కడ ఏమైతే మనకెందుకు*.  ఇంత దుర్గంధ భూయిష్టంగా ఉన్న సమాజంలో విద్యావంతులు, విజ్ఞానవంతులు మరియు ప్రజ్ఞావంతులు ప్రశాంతంగా ఉండడం లేదా ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి లోనుగావడం నాలాంటి సామాన్యులందరికీ ఆశ్చర్యకరమే.


ధన్యవాదములు

*(సశేషం)*

సీతా జన్మదినోత్సవం ..

 🍀✡️🍀🕉️🍀🕉️🍀


🙏 నేడు సీతా జన్మదినోత్సవం ...!!


🌿కృత్యరాజ సముచ్చయం అనే గ్రంథంలో ఈనాడు సీతాపూజ చేయాలని ఉంది. ఇది సీతాదేవి పుట్టిన రోజు పండుగ. 


🌸సీత రాముని భార్య అనే విషయం తెలిసిందే. ఆమె జనక మహారాజు పుత్రిక. ఆమె పూర్వజన్మలో వేదవతి అనే కన్యక. వేదవతి కథ చదవదగినది.


🌿కుశధ్వజుడు అనే మునికి మాలావతి అనే భార్య ఉండేది. ఈ దంపతుల కుమార్తె వేదవతి. కుశధ్వజుడు వేదాలు చదువుతూ ఉండగా, ఈమె పుట్టడం వల్ల, ఈమె పుట్టినపుడు పురిటింటి నుంచి వేదఘోష వెలువడుట వల్ల ఆ శిశువుకు వేదవతి అనే పేరు పెట్టారు.


🌸 శిశువు పెరిగి పెద్దదయ్యింది. ఈమెను విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేస్తానని కుశధ్వజుడు చెబుతుండే వాడు. అంతలో ఒకసారి దంభుడు అనే రాక్షసుడు వచ్చి ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని కోరాడు. 


🌿కుశధ్వజుడు అందుకు నిరాకరించాడు. దీంతో రాక్షసుడు ఒక రాత్రివేళ దొంగచాటుగా వచ్చి నిద్రపోతున్న కుశధ్వజుడిని హతమార్చాడు. అప్పుడు అతని భార్య మాలావతి భర్త మరణాన్ని తట్టుకోలేక తానూ ప్రాణాలు విడిచింది. 


🌸తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి తండ్రి నిశ్చయం ప్రకారం విష్ణువును పతిగా కోరి తపస్సు చేయడానికి వెళ్లింది. తపోదీక్షలో ఉన్న ఆమెను ఒకసారి రావణుడు దిగ్విజయార్థం వెళ్తూ చూశాడు.


🌿 ఆమె రూపానికి మోహితు డయ్యాడు. తనను వరించాలని కోరాడు. విష్ణు మూర్తిని తప్ప ఇతరులను తాను పెళ్లాడనని వేదవతి ఖరాఖండీగా చెప్పింది.


🌸రావణుడు మోహపారవశ్యం వీడక ఆమెను బలాత్కారంగా ముట్టుకున్నాడు. అప్పుడామె కఠిన స్వరంతో- ‘నువ్వు నీచుడవని తెలిసీ నీతో మాట్లాడాను. 


🌿నువ్వు నన్ను అవమానించావు. అవమానితమైన ఈ దేహం ఇప్పుడే త్యజిస్తున్నాను. నేను అయోజనిగా ఈ భూమీ మీద తిరిగి పుట్టి నిన్ను పుత్ర మిత్ర కళత్రంగా నాశనం చేయడానికి కారణభూతురాలిని అవుతాను’ అని యోగాగ్నిని సృష్టించు కుని అందులోకి దూకి దహనమైంది.


🌸అనంతరం ఆమె లంకలో ఒక తామర కొలనులోని ఒక తామర పువ్వు బొడ్డులో సూక్ష్మరూపంతో దాగి తపస్సు చేసుకోసాగింది. 


🌿శివపూజ కోసం రావణుడు ఒకనాడు తామరపువ్వులను కోస్తూ వేదవతి దాగిన పువ్వును కూడా కోశాడు. అన్ని పువ్వుల కంటే ఈ పువ్వు బాగా బరువుగా ఉంది. 


🌸కారణం ఏమిటోనని అతను ఆ పువ్వును చీల్చి చూశాడు. అందులో నుంచి కన్యక బయటకు వచ్చింది.

‘రావణా! నన్ను వదులు. లేకుంటే నువ్వు చచ్చిపోతావు’ అని ఆ కన్యక పలికింది. 


🌿అయినా సరే, రావణుడు ఆ కన్యకను తన మందిరానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆస్థాన జ్యోతిష్యులతో సంప్రదించాడు. ఆమె జన్మ లంకకు చాలా అరిష్ట సూచకంగా ఉందని వారు చెప్పారు. అప్పుడు రావణుడు ఆమెను ఒక బంగారపు పెట్టెలో పెట్టి సముద్రంలోకి వదిలేశాడు.


🌸 అది అలల తాకిడికి కొట్టుకునిపోయి జనక మహారాజు రాజ్యంలో భూస్థాపితమైంది. జనకుడు ఒకసారి యజ్ఞశాల నిమిత్తం భూమిని దున్నిస్తుం డగా, ఒక నాగలికర్రుకు ఈ బంగారపు పెట్టె తగిలింది.


🌿 ఆయన దానిని వెలికి తీయించి తెరిచి చూశాడు. ఒక కన్య బయపడింది. ఆనాడు ఫాల్గుణ అష్టమి. నాగలి చాలును సంస్క•తంలో సీత అంటారు. నాగలిచాలులో లభ్యమైనందున ఆమెకు సీత అనే పేరు పెట్టారు.


🌸 ఆమెను కాల క్రమంలో రాముడికి ఇచ్చి వివాహం చేశారు. సీత తాను వేదవతిగా ఉన్నప్పుడు పలికినట్టే.. సీతగా పుట్టి లంకకు చేటు తెచ్చింది. అదెలాగో నన్న విషయం అందరికీ తెలి సింది

🌿 సీతాదేవి పుట్టిన ఫాల్గుణ కృష్ణ అష్టమి నాడు సీతాదేవిని పూజిస్తే పుణ్యము. గ్రంథాంత రాల్లో ఈ తిథి నాడు కాలాష్టమి, శీతలాష్టమి అనే పర్వాలు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు..🙏🙏🙏🙏


.

Panchangam


 

ఆదివారం🌞* *🌹23, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🌞ఆదివారం🌞*

*🌹23, మార్చి, 2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*                   


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం -  కృష్ణపక్షం*


*తిథి         : నవమి* (24) తె 05.38 వరకు ఉపరి *దశమి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం   : పూర్వాషాఢ* రా 04.18 తె వరకు ఉపరి *ఉత్తరాషాఢ*


*యోగం  : వరీయాన్* సా 05.59 వరకు ఉపరి *పరిఘ*

*కరణం   : తైతుల* సా 05.36 ఉపరి *గరజి* పూర్తిగా రాత్రంతా


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 07.00-09.00 & 11.00-12.00 మ 03.00-04.30*

అమృత కాలం  : *రా 11.19 - 12.59*

అభిజిత్ కాలం  : *ప 11.50 - 12.38*


*వర్జ్యం               :  మ 01.21 - 03.01*

*దుర్ముహూర్తం  : సా  04.41 - 05.39*

*రాహు కాలం   : సా 04.48 - 06.19*

గుళికకాళం      : *మ 03.16 - 04.48*

యమగండం    : *మ 12.14 - 01.45*

సూర్యరాశి : *మీనం* 

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.09*

సూర్యాస్తమయం :*సా 06.19*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.09 - 08.35*

సంగవ కాలం         :      *08.36 - 11.01*

మధ్యాహ్న కాలం    :      *11.01 - 01.27*

అపరాహ్న కాలం    : *మ 01.27 - 03.53*

*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ బహుళ నవమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.19*

ప్రదోష కాలం         :  *సా 06.19 - 08.41*

రాత్రి కాలం                :  *రా 08.41 - 11.50*

నిశీధి కాలం          :*రా 11.50 - 12.37*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.34 - 05.21*

________________________________

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య చంద్ర కళా స్తోత్రం🌝*


*దివానాథ నిశానాథౌ తౌ చ్ఛాయారోహిణిప్రియౌ |*

*కశ్యపాఽత్రిసముద్భూతౌ* 

*సూర్యచంద్రౌ గతిర్మమ ||*


🙏 *ఓం నమో సూర్యదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

       🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

ఆదివారం

 ఆదివారం ...సరదాగా

(ఇది ప్రతి ఇంట్లో జరిగేదే)

😁😁😁😁😁😁😁😁



ఎవరినో అనుకుని ఏఁ ప్రయోజనం? స్వయంకృతం. ముచ్చట పడి కొడుకును డాక్టరీ చదివిస్తే వాడే కొరకరాని కొయ్యాలాగా అయ్యాడు. 


'అది తినొద్దు, ఇది తినొద్దు' అంటూ ఆంక్షలు. 


అసలు కందిపొడి, ఆవకాయ కాంబినేషన్ లో పేరినెయ్యి నాలుక్కి రాసుకుంటూ తింటూ ఉంటే .... ఆ మాటకొస్తే గోంగూర మాత్రం తక్కువా .... శాకంబరీ దేవి ప్రసాదం .... ఆంధ్ర శాకం .... ఇంత వెన్న ముద్ద పక్కన పెట్టుకుని ఓ పట్టు పడదా మంటే వీడు ఒప్పుకుంటేనా? ధప్పళంలో గుమ్మడొడియాలు .... ఆయిలుంటుంది .... వద్దంటాడు .... అసలు వేడి వేడి అన్నంలో మీగడ పెరుగు వేసుకుని మాగాయ ముక్క నంజుకుంటూ తింటూ ఉంటే .... సాక్షాత్తు ఘటోత్కచుల వారే వచ్చి ఆశీర్వదించి వెళ్ళరూ?


అసలు గుత్తొంకాయ పొడి పెట్టి చెయ్యి తిరిగినవాడు చేస్తేనా .... ఆ మాటకొస్తే మా భ్రమరాంబ వండినట్లు గుత్తొంకాయ మరెవరూ వండలేరు .... 


అలాంటిది .... మా కుంక నా గుత్తొంకాయ ను కాశీలో నా చేత వదిలించేద్దాఁవని కాశీకి టికెట్లు తీస్తాడా?


ఆ కాశీవిశ్వేశ్వరుడు నాయందు దయ తలచి రెండుసార్లు టికెట్లు రద్దు చేయించేసాడు కాబట్టి సరిపోయింది .... 


పైగా మా కుంక అంటాడూ .... ఎవరితోనైనా గుత్తొంకాయను కాశీకి పంపించెయ్యనా? అని. 


"ఎంథ మాత్రం వీల్లేద"ని మా బ్రహ్మగారు చెప్పబట్టి ఆగాడు గానీ లేకుంటే నా పేరు మీద ఎవరి చేతనో వదిలించేసేవాడు.


పొద్దున లేవగానే కోడలు పిల్ల ఒక 'పేద్ద గ్లాసు'లో ఫిల్టర్ కాఫీ ఇస్తుంది. ఆ గ్లాసు లోపలకు తొంగిచూడాలి .... కాఫీ ఎక్కడుందా? అని.


'కాకి ఒకటి నీటికి కావు కావుమనుచునూ ....' అంటూ చిన్నప్పుడు పాడుకున్న పాట గుర్తొచ్చి చిన్న చిన్న రాళ్ళ కోసం వెతుకుతుంటానా .... 'కాఫీ ఎక్కువగా తాగితే gas వస్తుంది మాఁవయ్య గారు' అంటుంది. అసలు gas ఎందుకొస్తుందో తెలిసేడిస్తే కదా?


'హర్రీ, వర్రీ' అన్నారు .... 'కర్రీ అనేది ఈ మజ్జ చేర్చారని నా అనుమానం.


నా కాఫీ బాధ చూడలేక మా ఆఁవిడ 'ఇంకో గుక్కెడు ఇద్దూ పాపం ....' అంటుంది.


ఇంకొంచెం ఇస్తుంది ఆ పిల్ల ....


'అకాల మృత్యు హరణం, సర్వ వ్యాధి నివారణం' అనుకుంటూ తీర్ధంలాగా పుచ్చుకోడఁవే .... 


వాడైతే అసలు కాఫీని ఇంకు పిల్లరుతో పొయ్యమంటాడేఁవో?


ఇదివరకంటే స్నానం అయ్యి పూజ్జేసుకున్నాక గానీ టిఫినీ జోలికి వెళ్ళే వాడిని కాదు ....


ఆ మధ్య గుమ్మడి గారు పలకరించినప్పటి నుండి ముందు కడుపులోకి ఏదైనా వెళ్తే గానీ కుదరదంటూ మా వాడు మొండికేయడంతో తప్పడం లేదు.


ఏదో నాలుగిడ్లీలు తింటే కొంపలంటుకు పోయినట్లు హడావిడి .... భోజనానికి ఒకటిన్నర దాకా ఆగాలా? మరి అప్పటి లోపల ఆకలేస్తే? అని ఘఠ్ఠిగా నిలదీస్తే ఇదుగో ఈమధ్యనే వేరుశనగ పప్పు ముందు రోజు నానబెట్టి, మర్నాడు ఉడకబెట్టి పెడుతున్నారు .... ఒక కేరట్టుతో సహా .... అసలా కేరట్టు మనది కాదట. విదేశాల నుండి వచ్చిందట. దానికి మన ఆచారాలు వగైరాలు ఏం తెలుసు? అంటే 'దానికి ఆచారం ఏఁవిటి నాన్నగారు' అంటాడు మా వాడు.


అసలు వీటన్నిటికి మూల కారణం అదుగో .... అప్పుడు ఆసుపత్రిలో చేరినప్పటి నుండి మొదలయింది.


ఒంటి నిండా చెమటలు పట్టి, ఎడం చెయ్యి లాగేస్తుంటే గుండెపోటని ఆసుపత్రికి పట్టుకుపోయారు. 


వాళ్ళు ఓ వారం అట్టే పెట్టుకుని 'హెల్తు కార్డు' లేదని తెలిసి ఆపరేషన్ అవసరం లేదని చెప్పి డిశ్చార్జ్ చేసారు .... మందులతో నయమౌతుందని.


అదుగో ఆ డిశ్చార్జ్ సమయంలోనే మొదలయింది ఈ ఆంక్షల గోల .... ఇరాన్ వాడి మీద అమెరికా వాడి ఆంక్షల్లాగా ....


ఇంకో గంటలో బైటకొస్తాననగా కాస్త కాలు సాగినట్లుంటుందని రూమ్ బైటకొచ్చా.


ఎదురుగా ఓ బల్లేసుకుని ఓ అమ్మాయి 

కూర్చునుంది .... బల్ల మీద కాదు .... బల్లకెదురుగా కుర్చీలో .... 


నన్ను చూడగానే 'బాబాయి గారు, ఒకసారి ఇలా రండి' అన్నది..


'సరే పిలుస్తోంది కదా'ని వెళ్ళా.


"ఎవరమ్మా నువ్వు?" అని అడిగా.


"నేనిక్కడ డైటీషియన్ అండి" అన్నది.


నాకు మరోలా వినపడింది.


"బ్యూటీషియన్ కు ఆసుపత్రిలో ఏం పని?" అన్నాను.


"అయ్యో, బాబాయ్ గారు, బ్యూటిషియన్ కాదు, డైటీషియన్ .... అంటే ఆహారం ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్న విషయాల గురించి చెబుతానన్నమాట" అన్నది.


నాకు మండదూ..? "మా అమ్మ నా చిన్నప్పుడే నేర్పింది ఎలా తినాలో నాకు ...

నువ్వేం చెప్పనవసరం లేదు" అన్నాను.


ఇంతలో మా ఆఁవిడొచ్చి నన్ను రూమ్ లోపలకు తీసుకెళ్ళి మళ్ళీ బైటకొచ్చి ఆ డైటీషియన్ తో కాసేపు ముచ్చట్లాడి 'వచ్చే శ్రావణ మాసం నోఁవులకు తప్పకుండా రావాలమ్మాయ్' అంటూ వచ్చేసింది.


ఆ పిల్ల ఏం చెప్పిందో గానీ ఆనాటి నుండి నా కష్టాలు మొదలయ్యాయ్ ....


అరే .... ఓ గుత్తొంకాయ లేదు, ఓ కందా బచ్చలి లేదు, ఓ దోసావకాయ లేదు .... నెయ్యైతే దాచేసారు ....ఏఁవి తిండది?


అసలు నా చిన్నప్పుడైతే మా సత్యవతత్తయ్య రోట్లో వేసి కంది పచ్చడి రుబ్బుతుంటే అక్కడక్కడే తిరిగేవాణ్ణి .... పోనీలే చిన్న వెధవ అని ఆఁవిడ రుచికన్నట్లు పొత్రం చుట్టూ వేలు తిప్పి ఇంత పచ్చడి చేతిలో పెట్టేది .... 'ఉప్పు సరిపోయిందా?' అంటూ ....


అంతా తినేసి ఆ.. 'ఉప్పు అయితే సరిపోయిందత్తయ్యా, కారం సరిపోయిందో లేదో చూళ్ళేదు' అంటూ మళ్ళీ చెయ్యి చాపేవాణ్ణి.


'వెధవకు పొట్టనిండా తెలివి తేటలే' అంటూ మారు వడ్డించేది. అప్పటినుండి తెలివితేటలు పొట్టలో ఉంటాయనుకుని ఆ పొట్టను జాగ్రత్తగా కాపాడుకుంటూ  వస్తున్నా ....అలా కాపాడుకుంటూ వస్తున్న దాన్ని ఇవాళ ఇలా ఎండబెట్టేస్తే నా తెలివి తేటలన్నీ ఏఁవై పోవాలి?


ఇహ భోజనాల దగ్గరకొస్తే ఆఁవిడా, కోడలు చెఱో పక్క కాపలా ....


వంద గ్రాములకంటే ఎక్కువ తినకూడదట. 


'వంద గ్రాముల బియ్యఁవేఁవోనే?' అంటే 

'కాదు వండిందే వంద గ్రాములు' అంటుందాఁవిడ.


"ఐటమ్ కు వంద గ్రాములేఁవో? సరిగ్గా కనుక్కున్నావా ఆ పిల్లను?" అంటే 'అన్నిటికీ కలిపి వంద గ్రాముల'ట' అంది.


ఆ లెఖ్ఖన కూర, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు .... ఒక్కొక్కదానికి ఇరవై గ్రాములు. అంటే ఐదు వేళ్ళు పెట్టి కలిపితే వేలుకు నాలుగు గ్రాములు తేలింది. బంగారం తూకంలాగా ....


అసలలా తింటే మందులు వేసుకోడాని కైనా నేనుండాలిగా? అంటే వినిపించుకోరు. 


బరువు అరవై దాటకూడదట. కొత్త రూలొహటి. అప్పటికీ నమకం, చమకం వింటూ వాకింగ్ చేస్తా. మృత్యుంజయ మంత్రం అష్టోత్తరం అయ్యేసరికి గంట పడుతుంది. ఐనా 'బరువు తగ్గాలండి' అంటే నేనిక ఏకాదశం నడవాలి.

 కమ్మగా తిననివ్వండర్రా" అంటే ....


దంపుడు బియ్యం తిన్న శరీరఁవాయె .... ఏదో పని వత్తిడి వల్ల అలా ఆసుపత్రి వాడి పూర్వ జన్మ బాకీ చెల్లించా గానీ లేకుంటే ఇవాళ ఇంతమంది కాపలాలో జైల్లో ఖైదీ లాగా తూకం భోజనం ఏఁవిటో?

60 దాటాక  అన్నీ బాధలే 😧😧😧😧


(చదివినదే కాని మరల చదువూకోవచ్చు నవ్వుకోవచ్చు మరోసారి)



గరికపాటి. సాంబశివరావు గారిని ఫాలో అవ్వండి.


పచ్చ గడ్డి తిని పదికాలాలు బతికే బదులు 

కావలసింది తిని, ఆరోగ్యం కాపాడుకుంటే చాలు 

😅💝

మిత్రుడు కంటే శత్రువుకు

 N🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏                 🔥 *మనిషి తన జీవితంలో మిత్రుడు కంటే శత్రువుకు తన మెదడులో ఎక్కువ స్థానాన్ని ఆక్రమించడానికి అవకాశం ఇస్తాడు.. మనిషికి అహం పుట్టినంత త్వరగా ఆప్యాయత పుట్టదు.. అహం వల్ల  తోటి వారందరు దూరమవుతారు.. ఆప్యాయత వల్ల తోటివారందరు దగ్గర అవుతారు*🔥జీవితంలో అవసరానికి వాడుకునే వాడు కష్టాల్లో నీకు తోడు రాడని తెలుసుకో..జీవితంలో నటించే వాడు జీవితాంతం విలువలేడని తెలుసుకో.. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలువదని తెలుసుకో..అవసరానికి మించిన ఆస్తి నిరుపయెగం కాకతప్పదని తెలుసుకో.. అసత్యం ఆకట్టుకున్నా సత్యాన్ని సమాధి చేయలేదని తెలుసుకో.. అవినీతి సులువైనా, నిజాయితీయే విలువైనది తెలుసుకో🔥వేదం చదివితే ధర్మం తెలుస్తుంది.. వైద్యం చదివితే రోగం తెలుస్తుంది.. గణితం చదివితే లెక్క తెలుస్తుంది.. లోకం చదివితే బతకడం తెలుస్తుంది..ప్రతికూల ఆలోచనల నుండి మనలని మనము విడదీసినప్పుడే అందమైన అనుభవాలు ప్రారంభం అవుతాయి🔥🔥మీ *అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N. 29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593. 9182075510*🙏🙏🙏

నీలోని గుడికి... 18 మెట్లు

 *🌹🌹      నీలోని గుడికి... 18 మెట్లు      🌹🌹*


            *మనిషి మనసులో దైవత్వం ఉంటే... మనిషి ఉనికి ఆలయం అవుతుంది.*


            *ఈ 18 మెట్లను అధిరోహించి... మీలోని దైవత్వాన్ని చాటి చెప్పండి. మీలోని సుగుణాలతో... సమాజంలో పరివర్తనకు దారులు వేయండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల నుంచి జల్లెడ పట్టి... మీ కోసం అల్లిన విశిష్ఠ సుమమాల ఇది.*


               *సృష్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని నిజానిజాలు తర్కించే శక్తి మానవుడికొక్కడికే ఉన్నది. కానీ దురదృష్టం ఏమంటే నేటిరోజుల్లో నేను నమ్మిందే కరెక్టు, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను అనడమే గొప్ప విషయంగా చలామణి అవుతోంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట భీష్మద్రోణ కృపాచార్యులున్నా ఎందుచేత మట్టుపెట్టబడ్డాడనేదానికి ఒకటే కారణం చెబుతారు పెద్దలు. దుర్యోధనుడితో మహర్షులందరూ చెప్పారు... "నీవు చేస్తున్నది తప్పు. నీ పనివల్ల పాడైపోతావు. మా మాట విను. ఇలా చెయ్యకు "  అన్నారు. అందుకాయన– "మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను, మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను"  అన్నాడు. ఆ తత్వం పశువు కన్నా హీనం, అత్యంత ప్రమాదకరం.*


         *1 . సంస్కారబలం ఉండాలి. సంస్కారమనే మాట గొప్పది. చదువు దేనికోసం? సంస్కారబలం కోసం. చదువుకు సంస్కారం తోడయితే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. సంస్కారబలంతో మీకు తెలియకుండానే గొప్ప వ్యక్తిత్వం ఏర్పడుతుంది.*


         *2 . మోహాన్ని పోగొట్టుకోవాలి. మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. మీ క్షేమం కోరి, మీతో కఠినంగా మాట్లాడేవ్యక్తి దొరకడం కష్టం. దొరికినా అటువంటి మాట వినేవారు ఉండరు. ఒకవేళ అలా ఇద్దరూ దొరికితే జన్మ సార్థకమౌతుంది. మోహంలో పడిన అర్జునుడికి భగవద్గీతంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చివరన "నీకేం అర్థమయింది" అని అడిగాడు. " నాకు మోహం పోయింది. స్మృతి కలిగింది. నేను యుద్ధానికి బయల్దేరుతున్నా" అన్నాడు అర్జునుడు.*


             *3 . తప్పొప్పుల కూడిక ఈ ప్రపంచంలో ఎవరూ ఒప్పులకుప్ప కాదు. నాలో దోషం తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతా. మారీచుడు చెప్పాడు రావణుడికి... "నీకేంలోటు, ఇంతమంది భార్యలున్నారు. కాంచనలంక ఉంది, భటులున్నారు. రాముడి జోలికి వెళ్ళకు. వెళ్ళావా, అన్నీపోతాయి"  అన్నాడు. అన్నీ విన్న రావణుడు " నువు చెప్పేది అయిపోయిందా. అయితే విను. నువ్వు చచ్చిపోవడానికి ఎలాగూ సిద్ధం. నామాట వింటే రాముడిచేతిలో చచ్చిపోతావు. వినకపోతే నా చేతిలో చస్తావు. ఎలా చచ్చిపోతావో చెప్పు"  అన్నాడు. అంతేతప్ప నేను వింటానని అనలేదు. అలా అననందుకు అంత తపశ్శక్తి ఉన్న రావణాసురుడు చివరకు ఏమయిపోయాడు?*


             *4. మాట వినడమన్నది తెలుసుకోవాలి . మహాభారతం సమస్త సారాంశం ఇదే. దుర్యోధనుడి దగ్గరకెళ్ళి మహర్షులందరూ చెప్పారు, కొన్ని గంటలపాటూ చెప్పారు... అన్నీ విన్నాడు. అన్నీ విని వెటకారమైన మాటొకటన్నాడు. అహంకారబలం అది – " నాకు ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యాలనిపించడం లేదు. అయినా నేను తప్పులు చెయ్యడమేమిటి! నాకు చెబుతారెందుకు" అన్నాడు. మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలుకొట్టాడు, చివరకు తొడలు విరిగి పడి పోయాడు.*


               *5 . పెద్దలమాట శిరోధార్యంగా స్వీకరించు తల్లి, తండ్రి, గురువులు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ నీ దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యపడుతుందా ? సాధ్యమే, ఎలానో తెలుసా? నేను చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారి అనుగ్రహభాషణం చదువుతుంటే, నా పక్కనే వచ్చి కూర్చుని స్వామి నాతో మాట్లాడుతుంటాడు. పరమాచార్య ప్రసంగాలు చదవండి, భారతీతీర్థస్వామి వారి ప్రసంగాలు చదవండి. పీఠాధిపత్యం వహించిన వారి వాక్కులు చదవండి. రామకృష్ణ పరమహంస, ఎపిజె అబ్దుల్‌ కలాం గారి మాటలు చదవండి.*


              *6 .బాగుపడినా, పాడయిపోయినా కారణం–జడత్వమే జడమనే మాట ఒకటుంది. జడం–అంటే చైతన్యముంటుంది, కానీ ప్రతిస్పందన ఉండదు. ఒక రాతిలో చైతన్యం లేదని చెప్పలేం. కానీ దానిలో ప్రతిస్పందన ఉండదు. మీరు వెళ్ళి ఒక చెట్టును కొట్టారనుకోండి. మీకు వినబడకపోవచ్చు కానీ, దానిలో ప్రతిస్పందన ఉంటుంది. ఈ ప్రతిస్పందించగల శక్తి జడత్వానికి విరోధి. జడత్వం–అంటే చైతన్యం ఉండి కూడా ప్రతిస్పందించలేని బతుకు. ఒక మాటంటే ప్రతిస్పందన ఉండదు. అలాంటి ప్రతిస్పందనలేని లక్షణంలో నుంచి జడత్వం ఆవహిస్తుంది. అసలు లోకంలో ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చినా, ఒక వ్యక్తి పాడయిపోయినా కారణమేమిటని అడిగింది శాస్త్రం. అందుకు జడత్వమే కారణం.*


               *7. ఆదర్శాలు చెప్పడమే కాదు... ఆదర్శంగా మారాలి. ఎప్పుడు ఏం చేస్తున్నా శ్రీరామాయణంలో చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకుని ఆచరణలోకి తీసుకు వచ్చే ఒక కార్యశీలిని "నడిచే రామాయణం" అంటారు. తాను చెప్పడం వేరు, తానే ఆ వస్తువుగా మారడం వేరు. చెప్పడం అందరూ చెప్తారు.*


 *"సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః"*


            *ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడూ వ్యాసుడే, ప్రతివాడూ పరాశరుడే. కానీ నీవు చెప్పినదాంట్లో నీవెంత ఆచరిస్తావన్న దాన్నిబట్టి నీవు ఆదర్శంగా మారడమనే వస్తువు సిద్ధిస్తుంది.*


                *8. ఎవరిలోపాన్ని వారే దిద్దుకోవాలి . నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి. అది దిద్దుకోవలసిన స్థితి. మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పదిమందికీ అతను పనికొస్తాడు. పదిమంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే, మీరేమీ చేయాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే, "మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం" చెప్పండి.*


             *9. కోపాన్ని తగ్గించుకోవాలి మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప. నాకు కోపం వచ్చేసిందండీ. నేను కోపిష్టివాడినండీ అన్న తరువాత మీ ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేడు. నేను ఇలా ఉండవచ్చా? ఇంతటి కోపమేమిటి నాకు. ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు వచ్చిన కోపాన్ని మీరు పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడు దేశానికి, సమాజానికి పనికొచ్చి తీరుతాడు.*


              *10. జీవితం ప్రణాళికా బద్ధంగా ఉండాలి . అధికారులు కింది వారిని సంప్రదించాలి. పని చేయడంలోని సాధకబాధకాలను తెలుసుకోవాలి. అధికారి చేతిలో వేలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసే అధికారం ఉంటుంది. అవి సక్రమంగా ఖర్చుకావాలి. ప్రజలకు ఉపయోగపడాలి. అందుకు సరైన ప్రణాళిక ఉండాలి. రేపు మీరే ఆ అధికారి అయితే? అందుకే కత్తికి రెండు వైపులనూ అర్థం చేసుకుని ప్రణాళిక రచన చేయడానికి తగిన నైపుణ్యాన్ని అలవరుచుకోవాలి.*


            *11. వినండి, వినడం నేర్చుకోండి . ఒక సమస్యను బాగా పరిశీలించి, అవసరం అయితే కిందికి వచ్చి విని దానిని విశ్లేషణం చేసే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి రంధ్రాన్వేషణ చేయడం అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి. అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో పైకి రావాల్సిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు. ఆ మాటలలో మనకు ఏమైనా సారాంశం అందుతుందా? అని ఎదురు చూసి, అందులో ఒక్క మంచి మాటను పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే... వారి జీవితం చక్కబడుతుంది.*


          *12. మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి . నేను ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహాపురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు. వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. ఇవి కలిసే ఉంటాయి. ఒక చంద్రశేఖరేంద్రస్వామివారు ఎప్పుడూ మీ పక్కన ఉండాలంటే ఆయన సందేశాల పుస్తకం మీ దగ్గర ఉండాలి.*


           *13. మృత్పిండంలా కాదు... రబ్బరు బంతిలా ఉండాలి . పదిమందికి ఉపయోగపడకుండా ఎప్పుడు పోతారో తెలుసాండి. మీలో తట్టుకునే శక్తి లేనప్పుడు. మట్టి ముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారికిందపడి పోయిందనుకోండి. ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంతపైకి లేస్తుంది. చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంకపెట్టారని మీరు మృత్పిండమై పాడైపోకండి. మీవల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిననాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి.*


            *14. నిరాశను దరిచేరనివ్వకండి . అబ్దుల్‌ కలాంగారి కెరీర్‌ ఎక్కడ నుండి ప్రారంభం. ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి. ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి ఆయన నిరాశతో ఋషికేశ్‌లోని ఒక స్వామిజీ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. స్వామిజీ అలా వెళుతూ నీరసంగా కూర్చున్న కలాంగారిని పిలిచి అడిగారు. ఏం ఎందుకలా కూర్చున్నావని. ఈయనన్నారు. "నేను ఫలానా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లాను, అది పొందడం నాకిష్టం. కాని నేను సెలెక్ట్‌ అవ్వలేదు. ఏదో ఈ ఇంటర్వ్యూ అని మరో దానికి వెళ్లాను, సెలెక్ట్‌ అయ్యాను. ఇప్పుడు నాకీ ఉద్యోగం చేయాలని లేదు. నాకిష్టంలేదు"  ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి అన్నారు. " నీవు కోరుకుంటున్నదే దొరకాలని ఎందుకనుకుంటున్నావు. ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి యేం చేయించాలనుకుంటున్నాడో "ఆ మాట ఆయన మీద పనిచేసింది. అంతే ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యాడు.*


           *15. మంచి మంచి పుస్తకాలు చదవండి. ఏ పుస్తకం పడితే అది చదవకండి. వివేకానందుని ఉపన్యాసాలు చదవండి. మీకెంతో ధైర్యం వస్తుంది. పేడలో పురుగుపుట్టి పెరిగినట్లు బ్రతకకూడదు. మంచిగా బ్రతకడానికి ఖలేజా కావాలి. రామకృష్ణ పరమహంస కథలు చదవండి. చాలామందిలో తెలుగు మాట్లాడాలా? ఇంగ్లిషు మాట్లాడాలా అన్న సందిగ్ధం మొదలైంది. ఇంగ్లిషు బాగా చదువుకుని పాసవండి. చక్కగా తెలుగులో మాట్లాడండి. మీరు పెద్దయ్యాక రామాయణ గ్రంథప్రతుల్ని వేయి ముద్రించి పంచిపెట్టండి. ఆదివారాలు సాహితీ సభలకు వెళితే చక్కగా తెలుగులో మాట్లాడండి. పోతన గారి నాలుగు పద్యాలు చెబుతూ ప్రసంగం చేయండి. గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదను సంతరించుకోండి.*


           *16. ఆరాధించడం కాదు... ఆదర్శంగా తీసుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ఉత్థాన పతనాలున్నాయి. ఎంత కిందకి పడిపోయాడో అంతపైకి లేచాడు. టెండూల్కర్‌ క్రికెట్‌ చూడటం కాదు. టెండూల్కర్‌ వెనుక ఆ స్థాయికి ఎదగడానికి ఉన్న కారణం చూడండి. ఒక బాల్‌ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడిపిల్లను చూస్తున్నట్టు చూస్తూ ఉంటాను. బంతి ఎక్కడ పడుతుంది. దీన్ని ఏ డైరెక్షన్లో కొట్టాలి? అని... అంతే! స్ట్రోక్‌ అప్లై చేస్తాను అన్నాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పేటటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి.*


                *17. విజయాన్నీ, వైఫల్యాన్నీ సమానంగా తీసుకోవాలి. మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం, వైఫల్యం ఉంటుంటాయి. ఒక చోట విజయం వరిస్తే ఇక నా అంతటి వాడు లేడని రొమ్మువిరుచుకుని తిరగకూడదు, అక్కరలేని భేషజాలకు పోయి పాడయి పోకూడదు. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్‌ అయినట్లు కనబడుతుంటుంది. అలా ఫెయిలవడం నీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా వైఫల్యం సంభవిస్తే బెంగపెట్టుకుని స్తంభించి పోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పూనికతో వృద్ధిలోకి రావాలి.*

https://chat.whatsapp.com/LbYrKf7JokM6lc6MEhj5if

              *18. పొగడ్తకు పొంగిపోకండి. ఎప్పుడైనా సరే పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు. జీవితంలో పొగడ్త అన్నది ఎంతమోతాదులో పుచ్చుకోవాలో అంతే మోతాదులో పుచ్చుకోవాలి. మందులే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే విషమై చచ్చిపోతారు. అలాగే నీవు వృద్ధిలోకి రావడానికి పొగడ్త కూడా ఎంతవాడాలో అంతే వాడాలి.*


*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

Religious calender


 

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం  - నవమి - పూర్వాషాఢ -‌‌ భాను వాసరే* (23.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*