23, మార్చి 2025, ఆదివారం

ప్రియ బాంధవా మేలుకో 17*

 *ప్రియ బాంధవా మేలుకో 17*




ఇప్పటి వరకు దేశ మరియు సమాజ రుగ్మతలనబడే అశుద్దాని (ఇష్టపడని, అంగీకరింపబడని) గురించి అవలోకనం చేస్తూ వచ్చాము. ఈ రుగ్మతల పట్ల సమాజ  పెద్దలు ఏలా  స్పందిస్తారో వారి విజ్ఞతకే వదిలేద్దాము. మనదేశంలో  ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న మహామహుల గురించి ఇప్పుడు ఒకసారి పునశ్చరణగావిద్దాము. 


భారతీయ సంస్కృతి  సంప్రదాయాలకు, జ్ఞాన విజ్ఞానాలకు, వివిధ ధర్మాలకు, దర్శన, సదాచారాలకు, సాహిత్యాలకు మూలమైనది వేదము. ఇట్టి వేదమునకు పీఠమైన మన దేశము వేద భూమి. అందునా మన తెలుగు నేలలో శిష్యులకు.... వైదిక స్వర ప్రక్రియలు, వేద వచనాల అంతరార్థాలు, మస్క నిరుక్తము, పాణినీయ, భరద్వాజ, కౌండిన్య శిఖా పాఠాలు, స్వాధ్యాయ సంగ్రహాలు, ఆరాధనా పంచకాలు, సోమ పంచాకాలు, వ్యాకరణ, మీమాంస, వేదాంత, ఆయుర్వేద, జ్యోతిష్య నిరుక్త, కల్ప గ్రంథాల సారము, నైషథం, అనుబంధ శాస్త్రాలు ఇత్యాది నేర్పే అవధాన శిరోమణులు, మహా మహోపాధ్యాయ, వేద,  భవిష్య సామ్రాట్ లు, పూర్వోత్తర  మీమాంసా భాస్కరులు, వ్యాకరణ మహోదధి,  సర్వ శాస్త్ర మహోద్ధ సాంగ స్వాధ్యాయ భాస్కర బిరుదాంకితులైన గురుమూర్తులున్న ప్రభావ ప్రాంతాలు. 


జ్ఞాన పరంగా నిల్చిన పై మాన్యులు  మరియు దేశాభివృద్ధి కారకులైన  విద్యా పారంగతులు, వైద్య ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, వైజ్ఞానిక శాస్త్ర వేత్తలు, ఆర్థిక శాస్త్ర అనుభవజ్ఞులు,భూగర్భ శాస్త్రజ్ఞులు, న్యాయ శాస్త్ర కోవిదులు, పరిపాలనా సమర్థులు లాంటి అత్యుత్తమమైన, అసాధారణ, అసమానమైన ప్రతిభావంతులు.... *సమాజమనే పళ్ళెంలో అభివృద్ధి అనే భోజనము,... దాని ప్రక్కనే నేరాలు, అకృత్యాలు అనే సమాజ రుగ్మతలను (అశుద్ధాన్ని) అంగీకరిస్తారా*.  ప్రతి ఒక్కరి సమాధానం *ముందుగా రుగ్మతలను (అశుద్ధాన్ని) తొలగించాలి*. ఈ వ్యాస  పరంపర ముఖ్యోద్దేశము కూడా ఇదే. 


ప్రజలకు మేలుచేసే ప్రజా చైతన్యము మరియు సంఘీభావము ఉన్న చోట దుష్టులు వెనకడుగు వేస్తారు.


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: