23, మార్చి 2025, ఆదివారం

ప్రియ బాంధవా మేలుకో 18*

 *ప్రియ బాంధవా మేలుకో 18*




గత వ్యాసాలలో గుర్తు చేసుకున్నాము...యువకులు వారి వారి జీవన సమస్యలతో 

(విద్యా, ఉపాధి, వివాహ) సతమతమవుతూ,  మధ్యవయస్కులు వారి వారి సంతతి అభివృద్ధి, సంతతికి సంబంధించిన వేడుకలు, సంప్రదాయాలు మరియు లాంఛనాలలో తల మునకలుగా ఉంటారని. 

పై రెండు వర్గాల వారికి సమాజ సంస్కరణలలోకి పిలుపు నివ్వడం  అంత భావ్యం కాదు.


అరువది ఐదు సంవత్సరముల తదుపరి విశ్రాంత జీవన యానంలో అడుగిడుతున్న *ఆరోగ్యవంతమైన* పౌరులు సమాజం గురించి యోచించే స్థితిలో తప్పక ఉంటారు. మానసిక శాస్త్రవేత్తల నిర్వచనం మేరకు విశ్రాంతి అంటే అచేతనత్వము, జడత్వము మరియు నిశ్చల తత్వము కాదు,*వ్యాసంగాల మార్పు మాత్రమే*. వైద్య పరిభాషలో విశ్రాంతి అనగా శారీరక దుర్భలత్వము ఉన్నప్పుడు అధిక శారీరక మరియు మానసిక శ్రమకు లోను కాకుండా ఉండడం. 

*కావున విశ్రాంత జీవన యానంలో అడుగిడిన పౌరులు సామాజిక చైతన్యానికి సహకరించు శారీరక మరియు మానసిక స్వస్థత కలిగియేవుంటారు*.


సాధారణ ప్రజలతో పాటు మధ్య తరగతి ప్రజలలో భద్రతా అధికారులన్నా, చట్టలన్నా విపరీతమైన భయమున్నది. *చట్టం పేదవాడిని పాలిస్తుంది, సంపన్నుడు చట్టాన్ని పాలిస్తాడు* అను వాడుక ప్రజలలో బలంగా నాటుకుని ఉన్నది. ఇందుకు కారణం ప్రజలలో చైతన్యము మరియు ఐకమత్యం లేకపోవడమే.


వాస్తవానికి పోలీసులకు, తత్సంబంధ చట్టాలకు దుర్మార్గులు మరియు దుష్టులు మాత్రమే భయపడాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే తప్పులు చేసిన వారు చట్టాలకు, పోలీసులకు *మాత్రమే గాకుండా సమాజానికి గూడా భయపడాలి*.  సమాజ భయం ఉన్నప్పుడు నేరాలు చేయడానికి సాహసించరు. ఎందుకంటే  *చైతన్య సమాజంలో* వెంటనే *దేహ శుద్ధి జరుగుతుంది*. అన్ని భయాలకన్న ప్రాణ భయము మిన్న. *నగదు జరిమానాలకు, స్వల్ప శిక్షలకు నేరస్థులు భయపడడం లేదు*  డబ్బులు చెల్లిస్తున్నారు మళ్ళీ మళ్ళీ నేరాలు చేస్తూనే ఉన్నారు. *గతంలో లాగా corporal శిక్షలు రావాలి అంటే మేధావులు మరియు నేతలు పూనుకోవాలి*.మరియొక విషయం నేరారోపణలు మోపబడినంత మాత్రాన నిందితులు కారు. నిందలు నిరూపించబడనంత వరకు అందరూ నిర్దోషులే.


సమాజ నైతికత, సమాజ శ్రేయస్సు మరియు సమాజ క్రమశిక్షణకై పాటుపడాలన్న సభ్యుల ఆలోచన, తహతహ (ఉత్సాహం) మంచిదే. ఉత్సాహం ఉన్నా...ఏమి చేయాలి, ఏలా చేయాలి అను సందేహాలు *కొన్ని సార్లు* కొందరిని వెంటాడుతూనే ఉంటాయి. అవుతే *ధీర మనస్తత్వంతో అవకాశాలను అందిపుచ్చుకోవాలి*. ప్రారంభంలో అవకాశాల వెనుక అడ్డంకులు ఉండవచ్చును. *కాని, సభ్యులు మరువరానిది ...ప్రతి అడ్డంకి వెనుక గూడా అవకాశాలు,  విజయాలు ఉంటాయి*.  సభ్యులు దేన్ని చూస్తున్నారనేదే ముఖ్యం.


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: