6, అక్టోబర్ 2022, గురువారం

భీష్మ నిర్యాణంలో

 ఆధునిక ప్రపంచ వైద్యులను విస్మయ పరిచే అంశం భీష్మ నిర్యాణంలో ఉంది. 


      ప్రపంచంలో మొదటి ఆధునిక అంత్యదశసేవాశ్రమం అనే హాస్పీస్ ను 1967లో ఇంగ్లండుకు చెందిన నర్సు ఏర్పాటు చేసిందని అంటున్నారు. 

      దీనికి ముందర క్రీస్తు శకం 11వ శతాబ్దంలో క్రైస్తవంలోని రోమన్ కేథలిక్కు వర్గానికి చెందినవారు ఏర్పాటు చేశారనే వారు కూడా ఉన్నారు. 

      కానీ వీటన్నింటికన్నా ముందర మహాభారతంలో భీష్మనిర్యాణ ఘట్టంలో అంత్యదశసేవల గురించి అద్భుతమైన వివరణ ఉంది.


      భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు పోరాడి ఒళ్ళు అంతా బాణాలు గుచ్చుకోగా నేలకు ఒరిగాడు. అయితే ఆయన వెంటనే చనిపోలేదు. 

     58 రోజులు బాణశయ్య మీద బ్రతికారు. ఆ 58 రోజుల్లో భీష్ముడిని పాండవులు చూసుకున్న తీరు ఆధునికులు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నింటినో తెలుపుతోంది.


      భీష్మ నిర్యాణంపై ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 

    ‘‘మనం చాలా తప్పు చేస్తున్నాము. సీనియర్ సిటిజన్ల పేరుతో 60 ఏళ్ళ ముద్రవేసి వారిని  పట్టించుకోవడంలేదు. కానీ విదేశాల్లో వృద్ధుల నుంచీ ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నారు. జీవితంలో వారు గడించిన అనుభవాలను విదేశీయులు సేకరించి వారివారి రంగాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు. మనం పనికి మాలిన వాళ్ళలాగా మారిపోతున్నాం. ముసలాళ్ళు ఒక బరువు అనుకుంటున్నాము. ఎంతో విలువైన అనుభవసారాన్ని కోల్పోతున్నాము. 

      ప్రతీ వృద్ధుని దగ్గరా తాను పనిచేసిన రంగంలో విశేషమైన అనుభవజ్ఞానం ఉంటుంది. దాన్ని సేకరించే విభాగం ఒకటి రావాలి. నిజానికి దీనివల్ల వృద్ధులకు కూడా "తమను సమాజం నిర్లక్ష్యం చేస్తోంది" అనే భావన పోతుంది. మనకు దాని వల్ల వివిధరంగాలకు కావలసిన అనుభవజ్ఞానం వస్తుంది. ఈ విజ్ఞానం ఎన్ని కోట్ల రూపాయల పరిశోధనలు చేసినా దొరకదు. కేవలం వృద్ధుల దగ్గర మాత్రమే ఉంటుంది. దీనికి అద్భుతమైన ఉదాహరణ మహాభారతంలో ఉంది.


      18 రోజుల యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం నాశనం అయ్యాక, దుర్యోధనుడు కూడా చనిపోయాక, ధర్మరాజు పట్టాభిషేకం ద్వారా చక్రవర్తి అయ్యాడు. 

      ఈ సమయంలో వ్యాసుడు, కృష్ణుడు అద్భుతమైన సలహా ధర్మరాజుకు ఇస్తారు. అప్పటికి భీష్ముడు ఇంకా జీవించే ఉన్నాడని ధర్మరాజుకు గుర్తు చేస్తూ అపారమైన జ్ఞాన సంపద ఆ కురువృద్ధుడి దగ్గర ఉందని ఆయన గతిస్తే ఆయనతో పాటే ఆ మహావిజ్ఞానం అంతరిస్తుందని, కనుక వెళ్ళి తాతను సేవించి తెలుసుకోమని వ్యాసుడు, కృష్ణుడు సలహా ఇస్తారు. 


      వారి సలహా వల్ల భారతంలోనే అతి పెద్ద పర్వం శాంతి పర్వం పుట్టింది. 

      అందులో భీష్ముడు చెప్పిన విషయాలు సకల శాస్త్ర సారాలు. విష్ణుసహస్ర నామం కూడా అందులోదే. 

      కనుక వృద్ధులను సేవించడం వలన సమాజానికి ఎం ప్రయోజనం ఉంటుందో భారతం తెలుపుతోంది‘‘ అని అన్నారు. 

      

      ఆంధ్రవ్యాసుల వారి మార్గదర్శకత్వంలో    మరింత లోతుగా పరిశోధన చేస్తే అద్భుతమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 


1) భీష్ముడు క్రింద పడగానే వేలాది కన్యలు (నర్సుల) వచ్చి ఆప్రదేశాన్ని శుభ్రంచేసి గంధపు పొడి, పేలాలుచల్లి, పూవులతో అలంకరించారు.


2) భీష్ముడి దగ్గరకు ఎవరెవరు వచ్చారో వ్యాసుడు వివరంగా చెప్పాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. 


తూర్యాణి శతసంఖ్యాని తథైవ నటనర్తకాః।

శిల్పినశ్చ తథాఽఽజగ్ముః కురువృద్ధం పితామహం ॥

  - భీష్ముడి దగ్గరకు సంగీత వాయిద్యాలు వందల సంఖ్యలో తీసుకొని గాయకులు, నటులు, నర్తకులు, శిల్పులు (ఇంజనీరింగు విభాగంవారు) వచ్చారని వ్యాసుడు చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. 


      రోగి వేరు అంత్యకాలంలోని వ్యక్తి వేరు. చికిత్స ఉన్నంత కాలమే ఒక వ్యక్తి రోగి అవుతాడు. చికిత్స లేనప్పుడు అతడు పేషంటు కాడు. అతడికి చేయాల్సిన వైద్యం అంత్యకాల సేవ. అది వేరే ఉంటుంది. అదే ఆరోజున భీష్ముడికి చేశారు. 

     అంత్యకాలంలో ఉన్న భీష్ముడికి ఆనందం కలిగించడం కోసం నటులు, నర్తకులు, గాయకులు, సంగీతకారులు వచ్చారు. నేడు కూడా ఆసుపత్రులలో సైతం టివిలు, మ్యూజిక్ సిస్టంలు ఉంచుతున్నారు. 

      ఇక పాలియేటివ్ కేర్ సెంటర్లలో అయితే అంత్యకాలంలో వారు ఆడుకోవడానికి ఆటవస్తువులు కూడా ఉంచుతున్నారు. 


ఇక్కడ అతిముఖ్యమైన అంశం ఏమిటంటే భీష్ముడి దగ్గరకు వారంతా వచ్చారు. అంతేకానీ వారు ఎవరు సంగీత వాయిద్యాలను వాయించారని కానీ, నటులు, నాట్యకారులు నాట్యం చేశారని కానీ చెప్పలేదు. దీనికి కారణం భీష్ముడు తాను మానవ భోగాలకు అతీతుడను అయ్యాను అన్నందువల్ల. 

      అయితే వేల సంవత్సరాల క్రితం భారతంలో పాలియేటివ్ కేర్ పురుడుపోసుకుందని చెప్పడానికి ఇది రెండో అతి ముఖ్యమైన శ్లోకం భీష్మపర్వంలో ఉంది. 


3) దీని తరువాత అతి ముఖ్యమైంది శాంతిపర్వంలో ఉంది. 

* భీష్ముడి మరణశయ్య దగ్గరకు భూమి మీదే కాక ముల్లోకాల్లో ఉన్న మహర్షులు, యతులు, పరమహంసలు, దేవతలు వచ్చారు. వారిలో నారదాది సంగీతవిద్వాంసులు ఉన్నారు. 

* శ్రీకృష్ణుడు చూడడానికి వచ్చి భీష్ముడి బాధలు పోగొట్టగానే  వ్యాస మహర్షితో కూడిన సమస్త ఋషి గణాలూ ఋగ్, యజుస్, సామగానాలు చేశారు. 

* అన్ని ఋతువులకు చెందిన పుష్పాలు ఏక కాలంలో కురిశాయి. 

* దేవతలు, అప్సరసలు వచ్చి సంగీత వాయిద్యాలు మ్రోగించి గానం చేశారు. 

* పవిత్రమైన, ప్రశాంతమైన, స్వచ్ఛమైన చల్లటి గాలి వీచింది. 

* ఆ ప్రాంతంలో ఉన్న సమస్త జంతు పక్షిజాతి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాయి. 

* భీష్మునికి అత్యంత ఆనందదాయకమైన వాతావరణం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడు సూర్యాస్తమయం చూసి రేపు వస్తానని వెళ్ళాడు. 


      ఇక్కడ ఇచ్చిన ప్రతి వర్ణన అంత్యదశసేవల్లో చాలా ముఖ్యమైంది. 

దీనిలో, రెలిజియస్ హీలింగ్, యోగా, మ్యూజిక్ థెరపీ, పుష్పవైద్యం వంటివి ఉన్నాయి. 


తతస్తే వ్యాససహితాః సర్వ ఏవ మహర్షయః।

ఋగ్యజుఃసామసహితైర్వచోభిః కృష్ణమార్చయన్॥ 

తతః సర్వార్తవం దివ్యం పుష్పవర్షం న భస్తలాత్।

పపాత యత్ర వార్ష్ణేయః సగాంగేయః సపాండవః॥ 

వాదిత్రాణి చ సర్వాణి జగుశ్చాప్సరసాం గణాః।

న చాహితమనిష్టం చ కించిత్తత్ర వ్యదృశ్యత॥ 


      అన్నిటికీ మించి పేషంటుకు ఉన్న విజిటర్స్ సమయాన్ని మహర్షులు కూడా గౌరవించి అస్తమయం అవుతుండడంతో మరలా రేపు వస్తానని కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు వద్ద శలవు తీసుకొని  వెళ్ళిపోయారు. ధర్మరాజు, కృష్ణుడు కూడా వెళ్ళిపోయారు.


4) ఇక్కడ అతి ముఖ్యమైన వర్ణన వ్యాసుడు చేస్తాడు. 

     పాండవుల రథాలు వెళ్ళిన తీరు మహానదిని తలపించిందని చెప్పాడు. 


తతో రథైః కాంచనచిత్రకూబరై

ర్మహీధరాభైః సమదైశ్చ దంతిభిః। 

హయైః సుపర్ణైరివ చాశుగామిభిః

పదాతిభిశ్చాత్తశరాసనాదిభిః॥ 


యయౌ రథానాం పురతో హి సా చమూ

స్తథైవ పశ్చాదతిమాత్రసారిణీ। 

పురశ్చ పశ్చాచ్చ యథా మహానదీ

తమృక్షవంతం గిరిమేత్య నర్మదా॥


      ఈ వర్ణన చదవకపోతే తరువాత ధర్మరాజుకు ఉన్న మహత్తరమైన విజ్ఞానం మనకు అర్థం కాదు. 


5) మర్నాడు ధర్మరాజు ఉదయాన్నే భీష్ముని దర్శనానికి వెళుతూ అర్జునుడిని పిలుస్తాడు. పిలిచి ఇలా అంటాడు. 

     "అర్జునా ఈ రోజు ఏవిధమైన మందీ మార్బలం, సైన్యం లేకుండా నేను సోదరులతో మాత్రమే వెళ్లదలచాను. మన అశ్వగజరథ సైన్య పరివారం వెళ్ళివస్తూ ఉండడం వలన అంపశయ్యమీది భీష్ముడికి ఇబ్బంది కలుగకూడదు. కనుక సైన్యాన్ని, భటులను వద్దని చెప్పు. ఈ రోజు నుంచీ నేను భీష్ముడి దగ్గర ముఖ్యమైన రహస్యాలు తెలుసుకోబోతున్నాను. కనుక అనవసరమైనవారు అక్కడ జమకూడడం నాకు ఇష్టంలేదు‘‘ అన్నాడు. 


న సైనికైశ్చ యాతవ్యం యాస్యామో వయమేవ హి।

న చ పీడయితవ్యో మే భీష్మో ధర్మభృతాం వరః


      ఇది నేటికీ ఆచరించదగిన ముఖ్య విషయం. ఎవరైనా గొప్ప వ్యక్తి చనిపోవడమో, జబ్బుపడడమో జరిగితే ముందుగా ట్రాఫిక్కు పోలీసుల గుండెలు ఆరిపోతాయి. వచ్చేవారు పలకరించడానికి వస్తున్నారా? లేక తమ హోదాలు వెలగబెట్టుకోవడానికి వస్తున్నారో తెలియని సందర్భాలు కోకొల్లలు. భారీగా వాహనాలు రోడ్ల మీద పార్కుచేసి ట్రాఫిక్కు స్తంభింపచేయడంతో మొదలుపెడితే గన్ మెన్లు హోషు చూపించుకోవడం, బుగ్గకార్ల హడావుడి--- ఇదంతా చూస్తే ఎంత నీచంగా ఉంటుందో ఒకసారి ఎవరికి వారు గమనించుకుంటే మంచిది. 


      శ్రీకృష్ణుడు కూడా శైబ్య, సుగ్రీవ, వలాహక, మేఘపుష్ప అనే తన రథాశ్వాలను శబ్దం లేకుండా వెళ్ళమని ప్రార్థించాడట. ఆ పశువులైన ఆ గుర్రాలు మహావేగంతో పయనించినా భూమి మీద అతి సుకుమారంగా వెళ్ళాయని వ్యాసుడు చెప్పాడు. 

      నేడు ఆసుపత్రుల దగ్గరకు వాహానాలలో వెళ్ళేవాళ్ళు ఆ గుర్రాలను చూసి బుద్ధి తెచ్చుకుంటే మంచిది. 

    "ఆసుపత్రి ఏరియా - దయచేసి హారన్ మ్రోగించవద్దు" - అనే బోర్డు ఎవరూ పట్టించుకోరు. 

      లోపల మరణావస్థలో ఉన్నపేషంట్ల వినికిడి అవయవాలు మహాబాధపెడతాయని ఎప్పటికి బుద్ధి వస్తుందో నేటి వాహన చోదకులకు?


ఆగచ్ఛత్స్వథ కృష్ణోఽపి పాండవేషు మహాత్మసు।

శైనేయసహితో ధీమాన్రథమేవాన్వపద్యత॥ 

రథస్థాః సంవిదం కృత్వా సుఖాం పృష్ట్వా చ శర్వరీం।

మేఘఘోషై రథవరైః ప్రయయుస్తే నరర్షభాః॥ 

బలాహకం మేఘపుష్పం శైబ్యం సుగ్రీవమేవచ।

దారుకశ్చోదయామాస వాసుదేవస్య వాజినః॥ 

తే హయా వాసుదేవస్య దారుకేణ ప్రచోదితాః।

గాం ఖురాగ్రైస్తథా రాజఁల్లిఖంతః ప్రయయుస్తదా॥ 

తే గ్రసంత ఇవాకాశం వేగవంతో మహాబలాః।

క్షేత్రం ధర్మస్య కృత్స్నస్య కురుక్షేత్రమవాతరన్॥ 


      మహాభారతం నేడు కూడా ఎందుకు? - అనే ప్రశ్నకు ఈ శ్లోకాలు చాలు, ఎంత నిర్లజ్జగా మనం నేడు బ్రతుకుతున్నామో తెలియడానికి. 


      వేల సంవత్సరాల క్రితం మరణశయ్యమీద వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్ళాలో చెప్పిన మరో గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు. 

      లక్షాపదివేల శ్లోకాల్లో ఏం ఉందో చదువుకుంటే మనిషిగా మనం ఎంత పశుప్రాయంతో జీవిస్తున్నామో తెలుస్తుంది. 

     నేడు దౌర్భాగ్య ప్రభుత్వాల కారణంగా సంస్కృతం అడుగంటి భారతంలో ఏం ఉందో చదివి తెలుసుకోలేక  బ్రతుకుతున్నాము. 

      ఏ అమెరికా, ఇంగ్లండు వారో "హాస్పీస్ సేవలు మా దగ్గరే పుట్టాయి" అంటే నిజమే కాబోలు అనుకునే జాతిని సంస్కరింౘుకోవాల్సి ఉన్నది.

లక్ష్మీప్రదురాలు

 127. శ్రీకరీ :                                    లక్ష్మీప్రదురాలు. శ్రీ అంటే శోభ, సంపద, శుభము అని అర్థాలు. తన భక్తులకు సకల సంపదలు ప్రసాదిస్తుంది కాబట్టి దేవిని శ్రీకరీ అనటం జరిగింది. శ్రీమహావిష్ణువు శ్రీకరుడు.               విష్ణుసహస్రంలో                                                         'శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః'                          అని చెప్పబడింది. శ్రీకరుడు విష్ణువు. ఆయన భార్య అయిన లక్ష్మీదేవి శ్రీకరి.దేవి యిక్కడ లక్ష్మీ స్వరూపముగా చెప్పబడుతోంది. లక్ష్మీ స్వరూపము అంటే కేవలం సంపదలిచ్చే లక్ష్మీదేవి మాత్రమే కాదు.                                             అష్టలక్ష్మీ స్వరూపమైనది దేవి : 1.ఆదిలక్ష్మి 2.ధాన్యలక్ష్మి 3.ధైర్యలక్ష్మి 4.గజలక్ష్మి 5.సంతానలక్ష్మి 6.విజయలక్ష్మి 7.విద్యాలక్ష్మి 8.ధనలక్ష్మి. భక్తులకు వారివారి కర్మఫలాన్ననుసరించి అష్టైశ్వర్యముల నొసగునది శ్రీకరి.

విజయశమి శుభాకాంక్షలు;--

 కవిపండితమండలికి,ఆత్మీయులకు ,బంధులకు,హితులకు,పెద్దలకు-పిల్లలకు

విజయశమి శుభాకాంక్షలు;---


మహిషునిమర్దించుమాతదుర్గాంబిక

       విజయముంగొనునేడె విజయదశమి ,

రావణు వధియించిరాముండువిశ్వాన

        వెలుగు నింపిననేడె విజయదశమి,

నవరాత్రిదీక్షల స్తవనీయఫలితాల

         పృథివియేకనునేడె విజయదశమి ,

పారువేటల కేగి భద్రతాదళములు

           ప్రీతిపొల్చెడునేడె విజయదశమి ,


జైత్రయాత్రలుసాగించుసవ్యదినము ,

శమినిబ్రజభక్తిపూజించుప్రముఖదినము,

సర్వకార్యసిద్ధి నిడు సంస్తవ్యదినము

విజయదశమిమీకునుమాకువిజయమిడుత.


శక్తియనంగ స్త్రీయె,మఱిశబ్దముశక్తియుస్త్రీపరంబె,పెన్

భక్తిని భారతీయులిల బ్రార్థనసేయుటకూడ శక్తినే

రక్తియుముక్తిగూర్పగలరాజితులెల్లరుశక్తిరూపులే

సక్తినిశక్తిగొల్చుమతిసద్విజయప్రియులుర్వినందఱున్.


రాయప్రోలుసీతారామశర్మ

భీమవరం--9701764878.

కేదార్‌నాథ్ ఆలయం

 కేదార్‌నాథ్ ఆలయం అనేది పరిష్కరించని రహాస్యం


కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దాని గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి.  

పాండవుల నుండి ఆదిశంకరాచార్యుల వరకు కూడా కానీ 

మనము దానిలోకి వెళ్లాలనుకోవడం లేదు.


కేదార్‌నాథ్ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడిందని 

నేటి శాస్త్రం సూచిస్తుంది. 

అంటే ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుండి ఉంది.


కేదార్‌నాథ్ ఉన్న భూమి అప్పుడే కాదు ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా చాలా ప్రతికూలమైనది. 

 ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్‌నాథ్ కొండ,

మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్‌కుండ్

మరియు మూడో వైపు *22,700 అడుగుల ఎత్తులో భరత్‌కుండ్* ఉన్నాయి.


ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే ఐదు నదులు మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి మరియు స్వరందరి . 

వీటిలో కొన్ని మన పురాణాలలో వ్రాయబడ్డాయి. 

ఈ ప్రాంతం " మందాకినీ నది" యొక్క ప్రారంభ ప్రాంతం.  

చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు,

వర్షాకాలంలో నీరు అతి వేగంతో ప్రవహించే ప్రదేశం,

ఇలాంటి ప్రదేశంలో ఇంతటి కళాఖండాన్ని రూపొందించడం ఎంతో ప్రయాసతో కూడిన అద్భుతమైన విషయం. 

నేటికీ, 

"కేదార్‌నాథ్ ఆలయం" 

ఉన్న ప్రదేశానికి మీరు వాహనాలతో వెళ్లలేరు.


 1000 సంవత్సరాల క్రితం ఇంత ప్రతికూల ప్రాంతంలో, 

అననుకూల పరిస్థితుల్లో ఆలయాన్ని ఎలా నిర్మించారు.


మనమందరం ఒక్కసారైనా ఆలోచించాలి. 

ఈ ఆలయం 10వ శతాబ్దంలో భూమిపై ఉండి ఉంటే, 

అది తక్కువ "ఐస్ ఏజ్" కాలంలో ఉండేదని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.


డెహ్రాడూన్‌లోని " వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ,"

కేదార్‌నాథ్ దేవాలయంలోని *రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించింది.  

"రాళ్ల జీవితం" గుర్తించడానికి ఇది జరుపుతారు. 

 


దానిలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షలో తేలింది.


అయితే ఆలయ నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగలేదు. 


2013లో కేదార్‌నాథ్‌ను తాకిన విపత్కర వరదను అందరూ తప్పక చూసి ఉంటారు. 


ఈ కాలంలో సగటు కంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదైంది.  

తదుపరి వరదలు "5748 మంది" (ప్రభుత్వ గణాంకాల ప్రకారం) మరణించారు 

మరియు 4200 గ్రామాలు దెబ్బతిన్నాయి. 

 *భారత వైమానిక దళం ద్వారా 1 లక్షా 10 వేల మందికి పైగా ప్రజలు విమానంలో* రక్షించబడ్డారు. 

అంతా అతలాకుతలం అయింది.  

కానీ *ఇంత విపత్కర వరదలో కూడా కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణంపై ఏ* మాత్రం ప్రభావం పడలేదు.


"ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా" ప్రకారం, 

వరదల తర్వాత కూడా ఆలయం మొత్తం నిర్మాణం యొక్క ఆడిట్‌లో 99 శాతం ఆలయం పూర్తిగా సురక్షితంగా ఉందని తేలింది.


2013 వరదల సమయంలో నిర్మాణానికి ఎంత నష్టం జరిగిందో 

మరియు దాని ప్రస్తుత స్థితిని అధ్యయనం చేయడానికి 

" *IIT మద్రాస్" ఆలయంపై 

"NDT పరీక్ష" నిర్వహించింది. ఆలయం పూర్తిగా సురక్షితంగా* , పటిష్టంగా ఉందని కూడా తెలిపింది.


రెండు వేర్వేరు సంస్థలు నిర్వహించే "శాస్త్రీయ పరిశీలన మరియు శాస్త్రీయ పరీక్ష"లో ఆలయం ఉత్తీర్ణత సాధించకపోతే, 

ఆ ఆలయాన్నీ శిథిలావస్థకు చేరినట్టే, 

ఆ వరదలు తగ్గిన తరువాత చూస్తే... 

1200 సంవత్సరాల తరువాత, 

ఆ ప్రాంతంలోనికి బయటి నుండి తరలించబడిన ప్రతిదీ తుడుచుకుపెట్టుకు పోయింది, 

ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు. 

కానీ ఈ ఆలయం మాత్రం అక్కడ నిలబడి ఉంది 

మరియు ఇది చాలా బలంగా ఉంది.


ఈ ఆలయం ఇలా ఉండటానికి నిర్మించిన విధానమే దీని పటిష్టత వెనుక ఉందని నమ్ముతారు. 

ఆలయం కోసం ఎంపిక చేయబడిన స్థలం, 

ఈ వరదలో ఈ దేవాలయం నిలదొక్కుకో గలిగినందుకు 

ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాతి మరియు నిర్మాణ పద్ధతి కారణమనే నేడు శాస్త్రం చెబుతోంది.


 *కేదార్‌నాథ్ ఆలయాన్ని "ఉత్తర-దక్షిణ"గా నిర్మించారు.* 

 *భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు "తూర్పు-పశ్చిమ" దిశలో ఉంటాయి.* 

నిపుణుల అభిప్రాయం ప్రకారం, 

ఆలయం " *తూర్పు-పశ్చిమం" గా ఉంటే, 

అది ఇప్పటికే ధ్వంసమై* ఉండేది. 

లేదంటే కనీసం 2013లో వచ్చిన వరదలోనైనా శిథిలమై ఉండేది.


కానీ ఈ దిశలో నిర్మించిన కారణంగా కేదార్‌నాథ్ ఆలయం బయటపడింది.  

ఇంకో విషయం ఏంటంటే ఇందులో *వాడే రాయి చాలా గట్టిగా, మన్నికగా ఉంటుంది.* 

విశేషమేమిటంటే, 

ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన *రాయి 

అక్కడ లభ్యం కాదు, 

అయితే ఆ రాయిని అక్కడికి ఎలా తీసుకెళ్లి ఉంటారో ఊహించుకోండి.*  

అప్పట్లో ఇంత పెద్ద రాయిని మోసుకువెళ్లేందుకు ఎలాంటి రవాణా సాధనాలు కూడా అందుబాటులో లేవు. 

ఈ రాయి యొక్క లక్షణం ఏమిటంటే, 

400 సంవత్సరాలు మంచు కింద ఉన్నప్పటికీ, 

దాని "గుణాలలో" ఎటువంటి తేడా లేదు. 

అందువల్ల, 

ఆలయం ప్రకృతి విపత్తులలో కూడా తన బలాన్ని నిలుపుకుంది.  

గుడిలోని ఈ బలమైన రాళ్లను ఎలాంటి సిమెంట్ ఉపయోగించకుండా "ఆష్లర్" పద్ధతిలో అతికించారు. 

అందువల్ల రాతిపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం లేకుండా ఆలయ బలం అభేద్యంగా ఉంటుంది.


2013లో వీట ఘలై గుండా గుడి వెనుక భాగంలో ఒక పెద్ద బండ రాయి (భీమా శిల) కూరుకుపోయి నీటి అంచుని విభజించి ఆలయానికి ఇరువైపులా ఉన్న నీరు దానితో పాటు అన్నింటిని మోసుకెళ్లింది కానీ, 

ఆలయం మరియు ఆలయంలో ఆశ్రయం పొందిన ప్రజలు సురక్షితంగా ఉన్నారు.  

మరుసటి రోజు భారత వైమానిక దళం వారిని కాపాడి విమానాల ద్వారా తరలించారు.


విశ్వాసాన్ని నమ్మాలా వద్దా అనేది మీ ఇష్టం 

కానీ 1200 సంవత్సరాల పాటు దాని సంస్కృతిని మరియు బలాన్ని కాపాడే ఆలయ నిర్మాణానికి స్థలాన్ని ఎంచుకున్న తర్వాత, 

దాని దిశ, అదే నిర్మాణ సామగ్రి మరియు ప్రకృతిని కూడా మన పెద్దలు ఎంతో జాగ్రత్తగా పరిశీలించారనడంలో సందేహం లేదు.


టైటానిక్ మునిగిపోయిన తర్వాత, 

పాశ్చాత్యులు "NDT పరీక్ష" మరియు "ఉష్ణోగ్రత" ఆటుపోట్లను ఎలా మార్చగలరో గ్రహించారు. 

మన ఆలయం విషయానికి వస్తే, 

కొన్ని నెలలు వర్షంలో, 

కొన్ని నెలలు మంచులో, 

మరియు కొన్ని సంవత్సరాలు మంచులో పూర్తిగా కూరుకుపోయి ఉండి కూడా, 

గాలి మరియు వర్షం ఇప్పటికీ ప్రతికూలంగా, 

సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. 

ఇక్కడ 6 అడుగుల ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడానికి ఉపయోగించిన అపారమైన సైన్స్ గురించి ఆలోచిస్తే మనం ఆశ్చర్యపోతాము. 

వరదలన్నింటి తర్వాత నేడు అదే వైభవంతో 12 జ్యోతిర్లింగాలలో అత్యున్నతమైన గౌరవాన్ని పొందతున్న కేదార్‌నాథ్‌ శాస్త్రవేత్తల నిర్మాణానికి మరోసారి తలవంచుతున్నాం.


వైదిక హిందూ మతం మరియు సంస్కృతి ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.


*ఓం నమః శివాయ*

*ఓం నమః శివాయ*


సేకరణ

పాదాభివందనం

 🙏🙏🙌🙌🙏🙏

*పాదాభివందనం ఎందుకు చేయాలి..*


🙏 *పాదాభివందనం వలన…*

         *ప్రయోజనం ఏమిటి* 

                  🌻🌻


శుభకార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.


కేవలం శుభకార్యాల లోనే కాక, పెద్దవారు కనిపించనప్పుడు కూడా చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు. 


*అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి!*


భారతీయ సంప్రదాయంలో, పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న పురాతన పద్దతి. 

అయితే కొందరు, 

అడుగులను అపరిశుభ్రంగా  భావిస్తారు.


పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలు, ఉన్నాయి.


పెద్దవారి పాదాలను తాకాలంటే, మన అహంకారం వదిలి తల వంచాలి. 

అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.


సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు, వారి ఆలోచనలు, స్పందనలు, వాటి నుండి వచ్చే పదాలు, చాలా శక్తివంతంగా ఉండటం వల్ల చిన్నవారికి లాభం చేకూరుతాయి!


పెద్దవారి పాదాలను తాకడానికి 

మన నడుము వంచి,  

మన కుడి చేతిని పెద్దవారి ఎడమ కాలిమీద పెట్టాలి.  

అలాగే 

మన ఎడమ చేతిని పెద్దవారి కుడి కాలిమీద ఉంచాలి. 

అప్పుడు పెద్దవారి చేతులు, మన మీదఉంటాయి. 


ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. 

ఆ సమయంలో పెద్దవారి శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవ్వుతాయి.


ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే  దీవెనలు ఫలిస్తాయి.


పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం వల్ల, వారి పాద ధూళిలో కూడా, ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది. 


"మేము కూడా మీ మార్గంలో  నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని, సంపాదించడానికి ఆశీర్వదించండి", 

అని చెప్పే సంప్రదాయానికి ప్రతీకగా, 

చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.


*మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు,*

*ఆ ఇంటిలో ఉన్న పెద్దవారికి*

*పాదాభివందనం చేసి, పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.*

అలాగే  - -

*ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా,* 

*వారికి పాదాభివందనం  చేసి,*

*పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.*


🤷‍♂️🙌🙌🤷‍♀️


🙌 *సాధారణంగా పెద్దవారి ఆశీర్వచనాలు ఈవిధంగా ఉంటాయి!* 🙌


🌻 *పెళ్లయిన జంటని :*

అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు.

🌻 *పెళ్లి అయిన ఆడవారిని :*

🙌దీర్ఘసుమంగళీభవ

🌻 *చిన్న పిల్లల్ని :*

🙌చిరంజీవ - చిరంజీవ

🌻 *చదువుకుంటున్నవారిని :*

🙌బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి.

🌻 *పెద్ద చదువులు చదువుకునేవాళ్ళని :*

🙌ఉన్నతవిద్యా ప్రాప్తిరస్తు.

🌻 *పెళ్లికావసలసిన వాళ్ళని :*

🙌శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.

🌻 *ఉద్యోగం చేస్తున్నవాళ్ళని :*

🙌ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు.


💐 *ఏమని ఆశీర్వదించాలో తెలియనప్పుడు :*

*ఒక్క మాటలో ఆశీర్వదించాలంటే :*

🙌"మనోవాంచా ఫలసిద్దిరస్తు"🙌

(నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి)


*ఈవిధంగా పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు!*


(పెద్దలకు, తల్లి దండ్రులకు, పూజ్యులకు, గురువులకు, పాదాభివందనం చేసి, ఆశీర్వచనాలు పొందేలా, మనం మన పిల్లలకు చిన్నప్పటినుంచీ నేర్పాలి.)


🤝 *మన సంస్కృతిని మర్చిపోకూడదు.* 🤝


🙏 *సర్వేజనాః సుఖినో భవంతు*


🙏🙏🙌🙌🙏🙏

Durasa


 

ప్రసాదం గా భోజనం

 హిందూ బంధువులందరికి తెలియజేయునది ఏమనగా,


మనం సాధారణంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మరియు దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశేష అన్నదానాలు చేస్తున్నాము. 

చాలా మందికి అమ్మవారి ప్రసాదం గా భోజనం పెట్టడం జరుగుతుంది.

చాలా మంచి కార్యక్రమం.

మిత్రులారా ఒక చిన్న పని చేద్దాం.

మనం భోజనం ప్లేటు ఇచ్చే ముందు వారి నుదిటి మీద అమ్మ వారి తిలకం దిద్ది ప్లేటు చేతికి ఇద్దాం.

ఇందులో రెండు ప్రయోజనాలు ఉన్నాయి.

1)ఒకటి మన సంప్రదాయం నిలబడుతుంది.

2)మన అమ్మ వారి తిలకాన్ని

ఇష్ట పడని వారు దూరం గా పారిపోతారు.


మిత్రులారా మన సనాతన సంప్రదాయం కూడా అపాత్ర దానం చేయకూడదనే చెపుతుంది.


మన ధర్మాన్ని అనుసరించని వారికి, 

మన దేవతల మీద విశ్వాసం లేని వారికి మనం దానం చేస్తే అది నిరర్థకం అవుతుంది.


పై అభిప్రాయం మీకు నచ్చితే 

పది మంది కి పంపండి. 


ఓం శ్రీ మాత్రే నమహ 🙏

మానవత్వం


మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు. అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు.


- రమణమహర్షి

చేరలేనిచోటు

 మనిషి చేరలేనిచోటు..!?


స్వామి.... నాకు అర్జెంట్ గా వుద్యోగం కావాలి స్వామి.... నాకు అర్జెంట్ గా వివాహం కావాలి


స్వామి.... నాకు అర్జెంట్ గా పిల్లలు కావాలి


స్వామి.... నా పిల్లలు తొందరగా సెటిల్ కావాలి స్వామి.... నాకు ఆరోగ్యం ఆయువు కావాలి


స్వామి.... ఇవన్ని లేకుంటే నిన్ను ఎప్పుడూ, ఎలా తలుచుకోగలను చెప్పు ప్రశాంతంగా !?


దేవుడికి తన ప్రశాంతత గురించి గుర్తు వచ్చింది. ఆ కాలంలో దేవుడు మనిషి కలిసే జీవించేవారు ఆయన సలహాదారులు సూచించారు.. త్వరగా మనుషుల నుండి దూరంగా దేవుడు పారిపోకపోతే... దేవుడుకి శాంతి లేనేలేదని.


@ ఎవరెస్టుకి వెళ్ళిపొండి స్వామీ అన్నారు. భవిషత్తు తెలిసిన దేవుడు అన్నాడు.. # లాభం లేదు. త్వరలో ఒకడు అక్కడికి వస్తున్నాడు.


@ పోనీ చంద్రమండలమో.. అన్నారు. # అది లాభం లేదు. మనిషి అక్కడకి రాబోతున్నాడు.


ఎవ్వరికి ఏమి చెప్పాలో తోచలేదు.


చివరికి వారిలో ఓ పెద్దాయన అన్నాడు. @ మనిషి చేరలేనిచోటు నాకు తెలుసును దేవా. # అవునా! చెప్పుచెప్పు అన్నాడు దేవుడు ఆత్రంగా. @ మనిషి అన్ని చేరగలడు. ఒక్క తన అంతరంగం తప్ప.. అన్నాడు పెద్దాయన.


వెంటనే దేవుడికి ఆ సలహా నచ్చేసింది. ఆరోజు నుండి ఆయన నివాసం అదే అయిపొయింది. వేలాది ఏళ్లుగా ఏ కొద్దిమందో తప్ప ఎవరూ తమ లోలోనే వున్న ఆయనని దర్సించలేకపోయారు. కనుక దేవుడక్కడ హాయిగా వున్నాడు.


వేద సంబంధ 56 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా

 *వేద  సంబంధ 56 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

వేదముల యధార్ద స్వరూపం www.freegurukul.org/g/Vedamulu-1


ఋగ్వేదం www.freegurukul.org/g/Vedamulu-2


శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత-2 www.freegurukul.org/g/Vedamulu-3


ఋగ్వేద సంహిత www.freegurukul.org/g/Vedamulu-4


యజుర్వేదం www.freegurukul.org/g/Vedamulu-5


అధర్వవేదం www.freegurukul.org/g/Vedamulu-6


అధర్వవేదం www.freegurukul.org/g/Vedamulu-7


యజుర్వేద భాష్యం-1నుంచి6భాగాలు www.freegurukul.org/g/Vedamulu-8


వేద విజ్ఞానము www.freegurukul.org/g/Vedamulu-9


వేద రహస్యం www.freegurukul.org/g/Vedamulu-10


వేదములు-2 www.freegurukul.org/g/Vedamulu-11


సంస్కృత సాహిత్య చరిత్ర www.freegurukul.org/g/Vedamulu-12


వేదాలలో విజ్ఞాన బీజాలు-1 www.freegurukul.org/g/Vedamulu-13


భారతీయ సంస్కృతి-1,2,3 www.freegurukul.org/g/Vedamulu-14


సంస్కృత వాగ్మయ చరిత్ర-1-వైదిక www.freegurukul.org/g/Vedamulu-15


సంస్కృత వాగ్మయ చరిత్ర-2-లౌకికము www.freegurukul.org/g/Vedamulu-16


ఆర్ష సంస్కృతి www.freegurukul.org/g/Vedamulu-17


భారతీ నిరుక్తి -వేదస్వరూప దర్శనము www.freegurukul.org/g/Vedamulu-18


మహాభారతంలో విద్యావిధానము www.freegurukul.org/g/Vedamulu-19


వేదామృతము www.freegurukul.org/g/Vedamulu-20


ఋగ్వేద రహస్యాలు www.freegurukul.org/g/Vedamulu-21


వేద వేదాంగ చంద్రిక www.freegurukul.org/g/Vedamulu-22


వేద వాంగ్మయము www.freegurukul.org/g/Vedamulu-23


వేదాంత సంగ్రహము www.freegurukul.org/g/Vedamulu-24


వేద భూమి www.freegurukul.org/g/Vedamulu-25


వేదోక్త ధర్మ తత్వము www.freegurukul.org/g/Vedamulu-26


విశ్వకర్మ విశ్వరూపము www.freegurukul.org/g/Vedamulu-27


అమర సాహిత్యం www.freegurukul.org/g/Vedamulu-28


వేదాలలో అప్సరస - గంధర్వులు www.freegurukul.org/g/Vedamulu-29


విశ్వబ్రాహ్మణులకు ప్రధమ సత్కారార్హత www.freegurukul.org/g/Vedamulu-30


వేద స్వరూపము-1 www.freegurukul.org/g/Vedamulu-31


శిల్పకళా దర్శనము-2-యజ్ఞ శిల్పము www.freegurukul.org/g/Vedamulu-32


సాయణాచార్య భాష్యమునకు తెలుగు అనువాదము www.freegurukul.org/g/Vedamulu-33


చతుర్ధశ భువనములు ఏవి,ఎక్కడ www.freegurukul.org/g/Vedamulu-34


వేద వాంగ్మయము www.freegurukul.org/g/Vedamulu-35


ఆర్ష  విజ్ఞాన సర్వస్వం-1 నుంచి 3 భాగాలు www.freegurukul.org/g/Vedamulu-36


చతుర్వేద సంహిత www.freegurukul.org/g/Vedamulu-37


కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత-వేదార్ధదీపిక-షష్ఠ కాండ-షష్ఠ సంపుటం www.freegurukul.org/g/Vedamulu-38


అధ యజుర్వేద భాష్యము -1 www.freegurukul.org/g/Vedamulu-39


అధ యజుర్వేద భాష్యము -2 www.freegurukul.org/g/Vedamulu-40


యజుర్వేదానుక్రమణికలు www.freegurukul.org/g/Vedamulu-41


శ్రీదేవీసూక్త పరమార్ధము www.freegurukul.org/g/Vedamulu-42


ఆంధ్ర వేదములు - ఋగ్వేదము-1 www.freegurukul.org/g/Vedamulu-43


ఆంధ్ర వేదములు - కృష్ణ యజుర్వేదము-1 www.freegurukul.org/g/Vedamulu-44


ఆంధ్ర వేదములు - సామవేదము www.freegurukul.org/g/Vedamulu-45


ఆంధ్ర పద్య ఋగ్వేద సంహిత-ప్రధమ సంపుటము-1,2 మండలములు www.freegurukul.org/g/Vedamulu-46


ఆంధ్ర పద్య ఋగ్వేద సంహిత-తృతీయ సంపుటము-7,8 మండలాలు www.freegurukul.org/g/Vedamulu-47


ఆంధ్ర పద్య ఋగ్వేద సంహిత-ఐదవ సంపుటము-10 వ మండలము www.freegurukul.org/g/Vedamulu-48


నృసింహ వాజపేయ భాష్య సహితం www.freegurukul.org/g/Vedamulu-49


యజుర్వేద భాష్యము www.freegurukul.org/g/Vedamulu-50


యజుర్వేద భాష్యము-16-నమక చమకములు www.freegurukul.org/g/Vedamulu-51


యజుర్వేద భాష్యము-పంచమ అధ్యాయము www.freegurukul.org/g/Vedamulu-52


అధర్వ వేద సంహిత -5 www.freegurukul.org/g/Vedamulu-53


యజుర్వేద దర్శనము-1 www.freegurukul.org/g/Vedamulu-54


చతుర్వేద పరమార్ధ రహస్యము www.freegurukul.org/g/Vedamulu-55


వేదాంత సిద్ధాంత కౌముది www.freegurukul.org/g/Vedamulu-56


వేదముల పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

స్వర్గం

 * ఖర్చులేని స్వర్గం!*


*వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లినప్పుడు, అలసిపోయి కూర్చున్నప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి, 'ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి!' అన్నాడు. *


*కాసేపు ఆలోచించి... “స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి," అన్నాను.*


* ఆశ్చర్యంగా అతను నా వంకచూసి "అదెలా?" అన్నాడు.*


*నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను.. "జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలా ఇంకా, ఇంకా .. *


కానీ, *ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ద చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు అవసరంలేదు!*


*దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి..*


*డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ..*


*సత్సంగత్వే నిస్సంగత్వం !* *నిస్సంగత్వే నిర్మోహత్వం !!* *నిర్మోహత్వే నిశ్చలతత్వం!* *నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!*


*సత్పురుషులు ..* *మార్గదర్శనం* *సత్సంగత్యం. .* *సహవాసం* *సత్ప్రవర్తన ..* *జీవించడం* *మించి, ఈ భౌతిక ప్రపంచంలో ఇంకొకటి, మరొకటి లేదు.......

పరిపూర్ణ కృప!!

 *పరిపూర్ణ కృప!!*


ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దసరా వేడుకలు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద ఘనంగా ప్రారంభం అయ్యాయి..నిలువెత్తు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించడం మొదలు..సుమారు 150 పై చిలుక మంది భవానీ కంకణ దీక్ష తీసుకోవడం..ఆశ్వీయుజ పాడ్యమి నుంచి నిన్నటి విజయదశమి వరకూ అమ్మవారి కి పూజలు.. హారతులు...ప్రతిరోజూ ఇంతమంది దీక్షాధారులచే భజనలు..శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర పరిసరాలు ఎరుపు వర్ణ శోభితమై..అత్యంత కోలాహలం గా ఉత్సవం జరిగింది...


విజయదశమి రోజు రాత్రికి దీక్షాధారులచే పండరిభజన..భజన అనంతరం అగ్నిగుండం త్రొక్కడం ఆనవాయితీ..భవానీ కంకణ దీక్ష స్వీకరించిన స్వాములే కాకుండా..అగ్నిగుండం త్రొక్కడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు వస్తారు.. పైగా దీక్ష ముగింపు వేడుక కనుక..ఒక చిన్నపాటి తిరునాళ్ళ వాతావరణం ఏర్పడుతుంది.. అందరు భక్తులకు అన్నదానము ఏర్పాట్లు యధావిధిగా దాతల సహకారం తో జరుపుతాము..ఇవన్నీ మామూలుగా జరిగే కార్యక్రమాలు..


కానీ..


నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి.. ఒక్కసారిగా వర్షం ప్రారంభం అయింది..ఇన్ని ఏర్పాట్లు..ఇంత ఉత్సవమూ..పండరిభజన..అగ్నిగుండం త్రొక్కడం..అన్నీ ఆగిపోతాయేమో ననే అభిప్రాయం ఏర్పడింది..


"ప్రకృతి కి మనం విరుద్ధంగా పోగలమా?.." 


" ఈసారి ఇలా సరి పెట్టుకోవాలి..ఎంత ప్రాప్తమో అంతే..విజయవాడ దుర్గ గుడి అధికారులు కూడా భారీ వర్షం కారణంగా అమ్మవారి తెప్పోత్సవం కూడా రద్దు చేసారు..మనమెంత?.." 


ఇలాటి వ్యాఖ్యలు వినబడుతున్నాయి..మా దంపతులము ఈ మాటలు వింటూ మౌనంగా ఉన్నాము..ఇంత ఉత్సవమూ ఇంత ఘనంగా జరగడానికి సూత్రధారిగా ఉన్న మా అర్చక స్వామి అశ్వనీ కుమార్ దుఃఖాన్ని ఆపుకోలేక..మా సిబ్బంది ముందు కన్నీళ్ల పర్యంతం అయ్యారు..


ఇక మాకు దిక్కు..ఆ అవధూత దత్తాత్రేయుడు..పూజలు అందుకున్న అమ్మవారు..వాళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా ప్రార్ధించుకున్నాము..ఈ సమయం లో శరణాగతి చెందడం మినహా మరే దారీ లేదు..నిర్ణయం ఆ తల్లీ బిడ్డలకు..(శ్రీ దత్తాత్రేయ స్వామివారు మాలకొండలో తపోసాధన చేసే సమయం లో తన ఆవాసంగా పార్వతీదేవి మఠాన్ని ఎంచుకొని..ఆ పార్వతీదేవి తనను తల్లిగా ఆదరిస్తోందని చెప్పుకునే వారు..) వదిలేసాము..


వచ్చిన భక్తులందరూ రాత్రి భోజనాలు చేశారు..సరిగ్గా ఆ సమయానికి వర్షం ఆగిపోయింది..మరో గంటకు స్వాములు పండరి భజన మొదలు పెట్టారు..అగ్నిగుండం ప్రజ్వరిల్లింది..భజన ఏ ఆటంకం లేకుండా పూర్తి అయింది..అందరు స్వాములు అగ్నిగుండాన్ని త్రొక్కారు.. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులూ అగ్ని గుండ ప్రవేశం చేశారు..ఇదంతా పూర్తయ్యే సరికి ఈ తెల్లవారుఝాము 5 గంటలు అయింది..


అంతవరకూ వర్షం లేదు..అగ్నిగుండాన్ని తెల్లటి వస్త్రం తో కప్పివేసి మట్టి తో పూడ్చి వేశారు..వర్షం లేదు..అందరు భక్తులూ శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లోకి వచ్చారు..అప్పుడు మళ్లీ వర్షం మొదలైంది..మబ్బులతో వాతావరణం చీకట్లు కమ్ముకొని ఉంది..(ఈ మాటలు రాసే సమయానికి ఇంకా వర్షం వీడలేదు..) 


ఇక మాకు భయం లేదు..కొండంత దత్తాత్రేయుడు అండగా వున్నాడు..అమ్మవారి దయ పరిపూర్ణంగా ఉంది..అంతకంటే ఏం కావాలి?...


సర్వం..

శ్రీ దత్త కృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..వయా కందుకూరు..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్ : 99089 73699 & 94402 66380.).

రామ - రావణుల

 ॐ        రామ - రావణుల మధ్య అంతరం 


    అరణ్యంలో రావణుడు వచ్చి, తన ఉద్దేశాన్ని ప్రకటించినపుడు, సీతాదేవి, 

    శ్రీరామునికీ - రావణాసురునికీ అంతరాన్ని తొమ్మిది జంట విషయాలతో పోల్చుతుంది. 


    అవి 


1. సింహం - నక్క 

   (a Lion and a jackal in a forest), 

2. సముద్రం - పిల్లకాలవ 

   (a Sea and a brook), 

3. అమృతం - బియ్యపుకడుగు నీరు 

    (Nector - the foremost of beverages and Sauveeraja - a sour and sabvoury drink prepared by dissolving powdered rye seeds into water and preserving it for a day or two), 

4. బంగారం - సీసం 

   (Gold and a base metal like lead), 

5. మంచిగంధం - బురద 

   (Sandal paste and mud), 

6. ఏనుగు - పిల్లి 

   (an Elephant and a cat in jungle), 

7. గరుత్మంతుడు - కాకి 

   (Garuda - son of Vinata and the king of birds and a crow), 

8. నెమలి - నీటికాకి 

   (a Peacock and a diver bird), 

9. హంస - గ్రద్ద 

   (a Swan - believed to feed on pearls and a vulture - feeds on the rotten flesh of carcasses). 


ఈ తొమ్మిదిటిలో, 


    సింహం, సముద్రం, అమృతం, బంగారం, గంధం, ఏనుగు, గరుత్మంతుడు, నెమలి, హంస అనేవి సత్పురుషుల లక్షణాలకి ఉపమానాలు. 


    నక్క, పిల్ల కాలువ, బియ్యంకడుగు నీళ్ళు, సీసం, బురద, అడివి పిల్లి, కాకి, నీటి కాకి, గ్రద్ద అనేవి దుర్జనుడి లక్షణాలకి ఉపమానాలు. 


     యదన్తరం సింహసృగాలయోర్వనే 

     యదన్తరం స్యన్దనికాసముద్రయోః I

     సురాగ్ర్య సౌవీరకయోర్యదన్తరం 

     తదన్తరం దాశరథేస్తవైవ చ ॥ 

     యదన్తరం కాఞ్చనసీసలోహయోః 

     యదన్తరం చన్దనవారిపఙ్కయోః I 

     యదన్తరం హస్తిబిడాలయోర్వనే 

     తదన్తరం దాశరథేస్తవైవ చ ॥ 

     యదన్తరం వాయసవైనతేయయోః 

     యదన్తరం మద్గుమయూరయోరపి I 

     యదన్తరం హంసకగృధ్రయోర్వనే 

     తదన్తరం దాశరథేస్తవైవ చ ॥ 

                - అరణ్య 47/45-47 


    The difference between you and Rama is the difference between

  - a jackal and a lion in the forest,   

  - a ditch and the sea, and 

  - sour gruel and the best of wines. 


    The difference between you and Rama is the difference between 

  - gold and lead, 

  - sandal and slime, 

  - an elephant and a cat of the forest.


    The difference between you and Dasaratha's son is the difference between 

  - a crow and Garuda, 

  - a water-crane and a peacock, 

  - a vulture and a swan in the forest. 


                    =x=x=x= 

             

  — రామాయణం శర్మ 

            భద్రాచలం 

     (అచ్చంపేట మకాం)

పండుగ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

రచయిత పేరు తెలియదు. చాలా బాగుంది. వారికి క్షమాపణలతో.👇

               *పండుగ*                         


పొద్దున్నే లేచేసాం... 

కాఫీలు తాగేసాం... 

ఎలక్ట్రానిక్ శుభాకాంక్షలు చూసేసాం... త్రోచేసాం 

వాహనాలూ , BODY లూ ... కడిగేసాం... తుడిచేసాం... 

గుడికెళ్ళేసామ్... మొక్కేసాం... అడిగేసాం ... 

ఇంటికొచ్చేసాం.. మెక్కేసాం...   

టీవీ ముందు తిష్టేసాం... 

రెండెక్కువ ఐటమ్స్ తో... లంచ్ లాగించేసాం.. 

అరగంటెక్కువ నిద్రేసాం... 

మళ్ళీ టీవీ ముందు కొచ్చేసాం... 

మినీ సెలెబ్రిటీల... అతి వీర, అతి రౌద్ర, అతి కరుణ, అతి భక్తి .... 

భావ ప్రదర్శనలను ... చెవులారా.. కనులారా కనేసాం... 

పండగ ను ... వైబ్రేన్ట్ గా సెలెబ్రేట్ చేసేశాం...


****


అయ్యో ... పండుగ డే ... అప్పుడే అయిపొయింది... 


భావి తరాలకు కావలసిన రావి, మర్రి, జమ్మి, రాతి ఉసిరి లాంటి  

ఓ మొక్క నాటేద్దాం అనుకున్నాం .... తర్వాత సూద్దాం 


ఓ కొత్త ఆలోచన చేద్దాం అనుకున్నాం ... తర్వాత సూద్దాం 


ఓ కొత్త విషయం తెలుసుకుందామనుకొన్నాం ... తర్వాత సూద్దాం 


ఇంటికొచ్చిన ఆవుకు... ఇంట్లో మాగిపోయిన అరటి పండు కాకుండా... 

చిట్టూ , తవుడూ కలిపి పెడదాం అనుకున్నాం.... తర్వాత సూద్దాం 

 

వీధి చివర గుడిసె లో పిల్లలకు... బిస్కట్ పాకెట్ లిద్దాం అనుకున్నాం 

ఇంటికి తెచ్చాం ... రేపు చూద్దాం 


మొత్తం మీద పండగ ను ఎంజాయ్ చేసేసాం గా ... 

చాలా అలసి పోయాం.... రేపు సూద్దాం 🙏

Bhargava SARMA pravachan


 



Devi stuti

Devi stuti  click