127. శ్రీకరీ : లక్ష్మీప్రదురాలు. శ్రీ అంటే శోభ, సంపద, శుభము అని అర్థాలు. తన భక్తులకు సకల సంపదలు ప్రసాదిస్తుంది కాబట్టి దేవిని శ్రీకరీ అనటం జరిగింది. శ్రీమహావిష్ణువు శ్రీకరుడు. విష్ణుసహస్రంలో 'శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః' అని చెప్పబడింది. శ్రీకరుడు విష్ణువు. ఆయన భార్య అయిన లక్ష్మీదేవి శ్రీకరి.దేవి యిక్కడ లక్ష్మీ స్వరూపముగా చెప్పబడుతోంది. లక్ష్మీ స్వరూపము అంటే కేవలం సంపదలిచ్చే లక్ష్మీదేవి మాత్రమే కాదు. అష్టలక్ష్మీ స్వరూపమైనది దేవి : 1.ఆదిలక్ష్మి 2.ధాన్యలక్ష్మి 3.ధైర్యలక్ష్మి 4.గజలక్ష్మి 5.సంతానలక్ష్మి 6.విజయలక్ష్మి 7.విద్యాలక్ష్మి 8.ధనలక్ష్మి. భక్తులకు వారివారి కర్మఫలాన్ననుసరించి అష్టైశ్వర్యముల నొసగునది శ్రీకరి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి